మహమ్మారి కరోనా వైరస్‌కు సంబంధించి మరో నమ్మలేని నిజం వెలుగుచూసింది. కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఈ వైరస్ గురించి ప్రజల్లో ఇప్పటికీ చాలా అనుమానేలే ఉన్నాయి. కరోనా బారిన పడిన వ్యక్తి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వచ్చే తుంపర్లతో కరోనా వ్యాప్తి చెందుతుందనే అక్షర సత్యం. అందుకే ప్రజలు మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని నిపుణులు, ప్రభుత్వాలు పదేపదే చెబుతున్నాయి. అయితే ఈ వైరస్ గాలి ద్వారా కూడా సోకుతుందని వార్తలు వచ్చినా తగిన ఆధారాలు లేవు. అయితే తాజాగా శృంగారం ద్వారా కూడా కరోనా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతోంది చైనాకు చెందిన ఓ అధ్యయన బృందం.
షాంగిక్యూ మున్సిపల్ ఆస్పత్రిలో కరోనా నుంచి కోలుకుంటున్న 38 మంది కరోనా బాధితులపై పరిశోధకులు అధ్యయనం చేశారు. వీరిలో ఆరుగురి వీర్యంలో కరోనా వైరస్ ఉన్నట్లు గుర్తించారు. అయితే మహమ్మారి కరోనా వైరస్ వీర్యంలో ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేకపోయారు. ఈ ఆరుగురిలో ఇద్దరు కోలుకోగా.. నలుగురు పరిస్థితి విషమంగా ఉంది. అయితే శృంగారం ద్వారా వ్యాప్తి చెందుతుందా అనేదానిపై పరిశోధకులు ఏ నిర్ణయానికి రాలేకపోతున్నారు.
‘వీర్యంలో కరోనా ఉన్నంత మాత్రానా శృంగారం ద్వారా మరొకరికి వస్తుందని చెప్పలేం. ఒకవేళ అదే రుజువైతే శృంగారానికి దూరంగా ఉండటమో, కండోమ్ వాడటమో చేయాలి. కరోనా లక్షణాలు కనిపిస్తే శృంగారానికి దూరంగా ఉంటేనే మంచిది’ అని చైనా పరిశోధకులు పేర్కొంటున్నారు. ఆ అంశంపై అధ్యయంన చేసి రూపొందించిన నివేదికను జామా నెట్‌వర్క్ వెల్లడించింది. ఇక ఎబోలా, జికా వంటి వైరస్‌లు శృంగారాం ద్వారా కూడా వ్యాపిస్తాయన్న విషయం తెలిసిందే.
చదవండి:
కరోనా వస్తే.. కనిపెట్టేస్తుంది
మాస్క్ లేకుంటే బుక్కయినట్టే..!
Comments
Please login to add a commentAdd a comment