ఎన్‌ఐటీ(NIT) విద్యా సంస్థలో భవనంపై నుంచి దూకి ఓ విద్యార్థి మృతిచెందాడు.
నిట్ క్యాంపస్(కాజీపేట): వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట సమీపంలోని ఎన్‌ఐటీ(NIT) విద్యా సంస్థలో భవనంపై నుంచి దూకి ఓ విద్యార్థి మృతిచెందాడు. మహారాష్ట్రలోని లాతూర్‌కు చెందిన సాంకేత్‌కుమార్ సివిల్ ఇంజనీర్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. మధ్యాహ్నం కళాశాలకు చెందిన 1కే హాస్టల్ భవనం 6వ అంతస్తు నుంచి దూకడంతో తలకు బలమైన గాయం తగిలింది.
చికిత్స కోసం మాక్స్ కేర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. తీవ్ర జ్వరం ఉండడంతో ఒంటి గంట సమయంలో ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి వచ్చాడని, 2.30 గంటల సమయంలో హాస్టల్ భవనంపైనుంచి దూకాడని తోటి విద్యార్థులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.