నిట్‌లో అడ్మిషన్లు ప్రారంభం
26వ తేదీ వరకు ప్రవేశాలు
కాజీపేట రూరల్ : వరంగల్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో బీటెక్ ప్రథమ సంవత్సరంలో అడ్మిషన్‌లు ప్రారంభమయ్యాయి. నిట్ ఆడిటోరియంలో శనివారం జరిగిన డాక్యుమెంట్స్ వెరిఫికేషన్‌లో 800 అడ్మిషన్లకు 400 అడ్మిషన్లు జరిగాయి. శుక్రవారం 244 మంది విద్యార్దులు అడ్మిషన్లు తీసుకున్నట్లు నిట్ అధికారులు తెలిపారు. అడ్మిషన్ల ప్రక్రియ 26వ తేదీ వరకు కొనసాగుతుందని, నిట్‌లో 2016–17వ సంవత్సరంలో అడ్మిషన్లు తీసుకున్న విద్యార్థులకు 28వ తేదీన అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 29వ తేదీ నుంచి ప్రథమ సంవత్సరం తరగతులు ప్రారంభం అవుతాయని వెల్లడించారు.