Certificatates Verification
-
పోలీస్ రిక్రూట్మెంట్: అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయినట్లు చైర్మన్ వి.వి. శ్రీనివాస్‌రావు ప్రకటించారు. కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ వరకు వివిధ స్థాయిల్లో నిర్వహించిన పరీక్షలకు సంబంధించి తుది రాతపరీక్షల్లో ఉత్తీర్ణులైన వారి సరిఫికెట్ల పరిశీలన పూర్తయి, క్రోడీకరణ ప్రక్రియ కొనసాగుతున్నట్లు ఆయన శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రాథమిక రాత పరీక్ష, ఆ తరువాత దేహదారుఢ్య పరీక్ష, తుది రాత పరీక్ష తరువాత మొత్తం 1.2 లక్షల మందికి చెందిన దరఖాస్తులు పూర్తి పారదర్శకంగా వెరిఫికేషన్ జరిగినట్లు వివరించారు. ఉద్యోగుల ఎంపిక తుది దశకు చేరుకుంటున్న తరుణంలో బ్రోకర్లు, మధ్యవర్తులు రంగప్రవేశం చేస్తారని, డబ్బులు ఇస్తే ఉద్యోగం ఇప్పిస్తామని హామీలు ఇస్తారని, అలాంటి వారి పట్ల అభ్యర్థులు జాగ్రత్తగా ఉండాలని శ్రీనివాసరావు హెచ్చరించారు. ఇలాంటి మధ్య దళారులకు సంబంధించిన సమాచారం అందిస్తే రూ. 3 లక్షల రివార్డు ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. ఉద్యోగాలు మెరిట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరుగుతుందన్నారు. మధ్యదళారీలు ప్రలోభాలకు గురి చేస్తున్నట్లు మీ దృష్టికి వస్తే 93937 11110 లేదా 93910 05006కు ఫోన్ చేసి చెప్పవచ్చని బోర్డు చైర్మన్ తెలిపారు. చదవండి: కెపాసిటీ లేనపుడు ఎందుకు ముగ్గురు? ట్రిపుల్.. ట్రబుల్ అవసరమా? -
పరస్పరం గుర్తించాలి: వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లపై ప్రధాని మోదీ
వాషింగ్టన్: కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లను పరస్పరం గుర్తించడం ద్వారా అంతర్జాతీయ ప్రయాణాలను సులభతరం చేయొచ్చని ప్రధాని మోదీ బుధవారం సూచించారు. ఒక దేశంలో జారీ చేసిన వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌ను మరో దేశం గుర్తించే విధానం ఉండాలన్నారు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు విదేశీయులను తమ భూభాగంలోకి అనుమతించే విషయంలో వేర్వేరు నిబంధనలను అమలు చేస్తున్నాయి. ఈ నిబంధనల్లో ఏకరూపత రావాలని మోదీ చెప్పారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఏర్పాటు చేసిన గ్లోబల్ కోవిడ్ శిఖరాగ్ర సదస్సులో మోదీ వీడియో సందేశం ద్వారా పాలుపంచుకున్నారు. భారత్‌లో కరోనా వ్యాక్సిన్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని భారీగా పెంచినట్లు గుర్తుచేశారు. వ్యాక్సిన్ల తయారీకి అవసరమైన ముడి సరుకుల సరఫరా వ్యవస్థను సరళతరం చేయాలని, దీనివల్ల ఇతర దేశాలకు సైతం వ్యాక్సిన్లను ఎగుమతి చేసేందుకు వీలుకలుగుతుందని చెప్పారు. కరోనా మహమ్మారి విసిరిన సవాళ్లతో దేశాల ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని గుర్తుచేశారు. ఈ సమస్య పరిష్కారంపై ప్రపంచ దేశాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. అందులో భాగంగానే అంతర్జాతీయ ప్రయాణాలను సులభతరం చేయాలని తెలిపారు. వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ల పరస్పర గుర్తింపుతో ఇది సాధ్యమవుతుందని ఉద్ఘాటించారు. భారతీయులు స్వదేశంలో టీకా రెండు డోసులు తీసుకున్నప్పటికీ యూకేకు వచ్చిన తర్వాత 10 రోజులు క్వారంటైన్లో ఉండాలని యూకే అంటోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లను పరస్పర గుర్తించాలని కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్‌లో 100 కోట్ల డోసుల ఉత్పత్తి: బైడెన్ కోవాక్స్ నిమిత్తం 2022 చివరికల్లా భారత్‌లో కనీసం 100 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను ఉత్పత్తి చేసే దిశగా క్వాడ్ సాగుతోందని అమెరికా అధ్యక్షుడు బైడెన్ అన్నారు. కోవిడ్–19ను జయించడానికి సమష్టిగా కృషి చేయడం కంటే అత్యవసరమైనది మరేదీ లేదన్నారు. వివిధ దేశాల్లో వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచడానికి అమెరికా సాంకేతిక, ఆర్థిక సహాయం చేస్తోందన్నారు. -
9నుంచి కానిస్టేబుల్ అభ్యర్థుల ఫారాల స్వీకరణ
సాక్షి, ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి దరఖాస్తు చేసుకొని రాష్ట్ర పోలీస్ శాఖలోని వివిధ విభాగాల్లో కానిస్టేబుల్‌గా ఎంపికైన అభ్యర్థులకు సంబంధించిన అటెస్టేషన్ ఫారాలను పూరించి ఈ నెల 9,10,11,12వ తేదీలో ఖమ్మం పోలీస్ కమిషనరేట్ కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లో అందజేయాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ కార్యాలయం నుంచి ఒక ప్రకటనలో తెలిపారు. గెజిటెడ్ అధికారితో అటెస్టేషన్ చేయించిన ఫారాలతో పాటు విద్యార్హతల ధ్రువీకరణ ఫారాలను అందజేయాలని కోరారు. అటెస్టేషన్ పారాల పంపకం, స్వీకరణకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని, ఆయా తేదీలలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫారాలను స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. అభ్యర్థులు నాలుగు పాస్ఫోటోలను వెంట తీసుకరావాలని సూచించారు. -
అభ్యర్థుల్లో కొలువుల ఆనందం
సుపరిపాలన దిశగా కొత్త ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. సంక్షేమ ఫలాలను నేరుగా ప్రజల ముంగిట ఉంచే దిశగా చర్యలు చేపట్టింది. గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థకు రూపకల్పన చేసింది. ఇప్పటికే పరీక్షలు నిర్వహించి రికార్డు స్థాయిలో ఫలితాలను ప్రకటించింది. నియామక ప్రక్రియను వేగవంతం చేసింది. అభ్యర్థులు కొత్త కొలువుల్లో చేరి సేవకు సిద్ధం అంటున్నారు. మంగళవారం నుంచి ప్రారంభమైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన కార్యక్రమం తొలిరోజు ప్రశాంతంగా ముగిసింది. ధ్రువపత్రాల పరిశీలనకు 532 మంది హాజరయ్యారు. నెల్లూరు(అర్బన్): గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగాల కోసం నిర్వహించిన పరీక్షల్లో ఎంపికైన వారికి మంగళవారం నెల్లూరు సెయింట్ జోసెఫ్ పాఠశాలలో, సర్వోదయ కళాశాలలో ఏర్పాటు చేసిన సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఉద్యోగాలు సాధించిన 843 మంది అభ్యర్థుల కోసం 17 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఇందులో 532 మంది ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యారు. మిగతా 86 మంది గైర్హాజరయ్యారు. కలెక్టర్ శేషగిరిబాబు ఆదేశాలతో జెడ్పీ సీఈఓ బాపిరెడ్డి ఆధ్వర్యంలో రోస్టర్, రిజర్వేషన్లు తయారు చేసుకుని ఎలాంటి లోపాలు లేకుండా అభ్యర్థుల అర్హతల పత్రాలను పరిశీలించారు. రద్దీ లేకుండా 50 మందికి ఒక టేబుల్‌ను ఏర్పాటు చేసి అందుకు తగిన సిబ్బందిని నియమించారు. సందేహాలు నివృత్తి చేసేందుకు ఆయా శాఖల హెచ్ఓడీలను అందుబాటులో ఉంచారు. తొలిరోజు విలేజ్ సెరీకల్చర్ అసిస్టెంట్, విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్, వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రోసెసింగ్ సెక్రటరీ, వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీలకు సంబంధించి సెయింట్ జోసెఫ్ పాఠశాలలో అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను తనిఖీ చేశారు. అలాగే వార్డు ప్లానింగ్ రెగ్యులేషన్ సెక్రటరీ, వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ పోస్టులకు సంబంధించి సర్వోదయ కళాశాలలో ధ్రువపత్రాలను పరిశీలించారు. సర్వోదయ కళాశాలలో నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ పీవీవీఎస్ మూర్తి అక్కడే ఉండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. అలాగే సెయింట్ జోసెఫ్ పాఠశాలలో జెడ్పీ సీఈఓ బాపిరెడ్డి, పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ సుశీల పర్యవేక్షిస్తూ అధికారులకు తగు సూచనలు ఇచ్చారు. నిరుద్యోగుల సందేహాలను తీర్చేందుకు హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశారు. జెడ్పీ కార్యాలయం వద్ద సైతం మరో మెరిట్ లిస్టును, కటాఫ్ మార్కుల వివరాలను ఏర్పాటు చేశారు. అక్కడ కూడా హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేసి జెడ్పీ సిబ్బంది అభ్యర్థులకు ఎలాంటి సందేహాలు వచ్చినా నివృత్తి చేశారు. జెడ్పీ సీఈఓ బాపిరెడ్డి మాట్లాడుతూ గైర్హాజరైన అభ్యర్థులకు ఈ నెల 28న, 30న మరో అవకాశం ఇస్తామని తెలిపారు. అప్పటికీ ఉద్యోగాలకు రాకపోతే ప్రభుత్వ నిబంధనల ప్రకారం తరువాత వారికి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. అపోహలు వద్దు గ్రామ/వార్డు సచివాలయ పోస్టులకు సంబంధించి ఎలాంటి లోపాలు లేకుండా ఒకటికి రెండుసార్లు చెక్ చేసి పారదర్శకంగా పోస్టులు భర్తీ చేస్తున్నామని, ఇందులో ఎలాంటి సందేహాలు అవసరం లేదని జెడ్పీ సీఈఓ బాపిరెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎంత చిన్న సందేహాన్నయినా తీర్చేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. రోస్టర్, మహిళా రిజర్వేషన్లు, దివ్యాంగుల రిజర్వేషన్లు, కటాఫ్ మార్కులు.. ఇవన్నీ అతి తక్కువ సమయంలో తయారు చేయడం అసాధ్యమన్నారు. ఇంత పెద్ద బాధ్యతలో ఏ ఒక్క చిన్న తప్పు జరగకుండా చూస్తున్నామన్నారు. వదంతులు నమ్మవద్దు కొంతమంది అవగాహన లేనివారు వాట్సాప్‌ల్లో వచ్చే వదంతులు వ్యాపింపజేయడం సరికాదని పంచాయతీరాజ్ రాష్ట్ర డిప్యూటీ కమిషనర్ సుశీల పేర్కొన్నారు. ఎస్టీ కేటగిరిలో వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి 43.75 మార్కులు వచ్చినా ఉద్యోగం ఇచ్చారని వాట్సాప్‌లో పెట్టారన్నారు. ఆ అభ్యర్థి చేస్తున్న ఉద్యోగం కారణంగా ప్రభుత్వం 9 మార్కులు వెయిటేజీ ఇచ్చిందని తెలిపారు. దీంతో ఆ వ్యక్తికి ఈ మార్కులు కలిపి మొత్తం 52.75 మార్కులు వచ్చాయన్నారు. ఎస్టీ కాబట్టి రిజర్వేషన్ వల్ల ఆ వ్యక్తికి ఉద్యోగం లభించిందని తెలిపారు. అలాగే ముజాహిద్ అలీ అనే వ్యక్తికి 45.25 మార్కులు వచ్చినా ఉద్యోగం ఎలా ఇచ్చారంటూ ప్రచారం చేయడం కూడా దారుణమన్నారు. ఆ వ్యక్తి దివ్యాంగుడని తెలిపారు. దివ్యాంగుల కోటాలో ఉద్యోగం వచ్చిందని పేర్కొన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని అభ్యర్థులు నమ్మవద్దని తెలిపారు. సమావేశంలో నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ పీవీవీఎస్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
నేడు శానిటేషన్ కార్యదర్శుల సర్టిఫికెట్ల పరిశీలన
సాక్షి, అనంతపురం : సచివాలయ ఉద్యోగుల భర్తీలో భాగంగా జిల్లాలోని నగరపాలక సంస్థ, 11 మునిసిపాలిటీలకు సంబంధించి శానిటేషన్ ఎన్విరాన్మెంట్ కార్యదర్శుల సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమం బుధవారం నిర్వహిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ పి.ప్రశాంతి తెలిపారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌భవన్‌లో ఉదయం 10 గంటలకు అభ్యర్థులు హాజరు కావాలన్నారు. 297 శానిటేషన్ ఎన్విరాన్మెంట్ కార్యదర్శుల పోస్టులకు గానూ 134 మందికి కలెక్టర్ సత్యనారాయణ అనుమతులిచ్చారన్నారు. ఫైనల్ మెరిట్‌లిస్టు అభ్యర్థులు వెరిఫికేషన్ కోసం మూడు కౌంటర్లను ఏర్పాటు చేశామన్నారు. ఒక్కో కౌంటర్లో 45 మంది సర్టిఫికెట్లు పరిశీలించేలా చర్యలు తీసుకున్నామన్నారు. -
కొలువుల కల.. నెరవేరిన వేళ
నిరుద్యోగుల్లో ఉద్యోగాల ఆనంద కేళి. సర్కార్ కొలువుల కోసం ఏళ్లతరబడి నిరీక్షించిన నిరుద్యోగుల కల.. నెరవేరిన వేళ. టీడీపీ హయాంలో ఐదేళ్ల పాటు ఎలాంటి ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిరుద్యోగులను దారుణంగా మోసం చేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడగానే నవరత్నాల అమలులో భాగంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టారు. ప్రతిష్టాత్మకంగా గ్రామ/వార్డు సచివాలయ పోస్టుల నియామక ప్రక్రియను చేపట్టారు. సాక్షి, నెల్లూరు : గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగాల ఎంపిక తుది ఘట్టానికి చేరింది. నోటిఫికేషన్ ప్రక్రియ నుంచి నియామక పత్రాల వరకు అంతా పారదర్శకంగా జరుగుతోంది. ఫలితాలు విడుదలైన తర్వాత అర్హత జాబితా వరకూ అంతా పక్కాగా సిద్ధం చేశారు. అభ్యర్థులకు ఎలాంటి నష్టం కలుగకుండా ఉండేందుకు అధికారులు రోస్టర్, రిజర్వేషన్లను ఒకటికి రెండు సార్లు పరిశీలిస్తున్నారు. 19 శాఖలకు చెందిన అధికారులు తమ, తమ శాఖల పరిధిలో ఉద్యోగాలు పొందిన వారి వివరాలను తనిఖీ చేసుకుని జాబితాను సిద్ధం చేసుకున్నారు. కలెక్టర్ శేషగిరిబాబు, జెడ్పీ సీఈఓ బాపిరెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మంగళవారం నుంచి మూడు రోజుల పాటు ధ్రువపత్రాల పరిశీలన జరుగుతోంది. తొలి రోజు నగరంలోని రెండు కేంద్రాలు ఏర్పాటు చేశారు. అర్హులైన అభ్యర్థులకు ఎస్ఎంఎస్, మెయిల్ ద్వారా సమాచారాన్ని పంపించారు. మొత్తం 7,814 గ్రామ సచివాలయ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. తొలి రోజు 1,400 పోస్టులకు సంబంధించి సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ చేయనున్నారు. 1.1 నిష్పత్తిలో సర్టిఫికెట్ల పరిశీలనకు కాల్‌లెటర్లు పంపించారు. జిల్లాలో 665 గ్రామ సచివాలయాలకు 7,814 పోస్టులకు గాను 1,17,138 మంది రాత పరీక్షలకు హాజరయ్యారు. ఈ నెల 19వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. విజయం సాధించిన అభ్యర్థులకు ప్రతిభ ఆధారంగా ఎంపిక చేయనున్నారు. నియామక ప్రక్రియ అంతా జిల్లా పరిషత్ కార్యాలయం కేంద్రంగా జరుగుతోంది. మంగళవారం నుంచి మూడు రోజులు (24, 25, 26 తేదీలు) పాటు ధ్రువ పత్రాల పరిశీలన ఉంటుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. కలెక్టర్ శేషగిరిబాబు ఆదేశాల మేరకు మేరకు జెడ్పీ సీఈఓ బాపిరెడ్డి అన్ని శాఖల అధికారులతో సోమవారం తన కార్యాలయంలో సమావేశమయ్యారు. అభ్యర్థులకు ఎలాంటి నష్టం జరగకుండా ఉండేందుకు రోస్టర్, రిజర్వేషన్ల ప్రక్రియను ఒకటికి, రెండు సార్లు తనిఖీ చేసుకుని జాబితాను సిద్ధం చేసుకుని ధ్రువపత్రాల తనిఖీ సెంటర్లకు వెళ్లాలని సూచించారు. రోస్టర్‌తో మెరిట్ జాబితాను సిద్ధం చేసేందుకు జిల్లా యంత్రాంగం నాలుగు రోజుల నుంచి కసరత్తు చేస్తోంది. హెల్ప్ డెస్క్ ఏర్పాటు జెడ్పీ కార్యాలయంలో అభ్యర్థుల సందేహాలు నివృత్తి చేసేందుకు హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశారు. ఇద్దరు సిబ్బందిని నియమించారు. గ్రామాల నుంచి వచ్చే వారి సందేహాలను ఆ సిబ్బంది తీరుస్తూ ధ్రువపత్రాల పరిశీలినకు వెళ్లాల్సిన సెంటర్, అడ్రసు, తీసుకెళ్లాల్సిన సర్టిఫికెట్లను వివరిస్తున్నారు. రెండు కేంద్రాల్లో తొలి రోజు మంగళవారం 6 రకాల పోస్టులకు సంబంధించి అభ్యర్థుల ్ర«ధువ పత్రాలను అధికారులు పరిశీలించనున్నారు. రెండు పూటలా ఈ పరిశీలన జరుగుతోంది. నెల్లూరు నగరం దర్గామిట్టలోని సెయింట్ జోసెఫ్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలను , ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న సర్వోదయ కళాశాలలో పరిశీల కేంద్రాలు ఏర్పాటు చేశారు. తొలి రోజు ఆరు శాఖలకు.. తొలి రోజు విలేజ్ సెరికల్చరల్ అసిస్టెంట్, గ్రామ మత్స్య సహాయకులు, వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రొసెసింగ్ సెక్రటరీ, వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ గ్రేడ్–2 పోస్టులకు దర్గామిట్టలోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో ధ్రువపత్రాల పరిశీలిన జరుగుతుంది. వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ గ్రేడ్–2, వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ గ్రేడ్–2 పోస్టులకు సంబంధించి సర్వోదయ కళాశాలలో పరిశీలన జరుగుతోంది. ఇదిలా ఉండగా సెరికల్చర్ శాఖలో కేవలం ఇద్దరికే పోస్టులు దక్కనున్నాయి. వీరి హాల్ టికెట్ నంబర్లు 190916000058, 190516000111. గ్రామ మత్స్య శాఖ సహాయకులకు సంబంధించి 68 మందిని, వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ విభాగంలో 165 మందికి, వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ గ్రేడ్–2 పోస్టులకు సంబంధించి 82 మందికి ధ్రువపత్రాలను పరిశీలిస్తారు. వీరందరికీ దర్గామిట్టలోని సెయింట్ జోసెఫ్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో అర్హతల పత్రాలు పరిశీలిస్తారు. సర్వోదయ కళాశాలలో వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ పోస్టుల్లో 147 మందికి, వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ పోస్టుల్లో 154 మందికి ఆర్టీసీ బస్టాండ్ పక్కనే ఉన్న సర్వోదయ కళాశాలలో అభ్యర్థుల ధ్రువ పత్రాలను పరిశీలిస్తారు. ఉదయం 10 గంటల నుంచే ఈ ప్రక్రియ జరుగుతోంది. ⇒ శనివారం రాత్రి అభ్యర్థుల మెరిట్ లిస్ట్‌ను ఆన్లైన్లో ఉంచారు. సోమవారం ఆన్లైన్లో ఉంచిన మెరిట్ లిస్ట్‌ను జెడ్పీ, హాజరు కావాల్సిన కేంద్రాల వద్ద నోటిస్‌బోర్డులో పెట్టారు. ఆదివారం నుంచే ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాలని అభ్యర్థులకు సెల్‌ఫోన్ ద్వారా మెసేజ్‌ను పంపారు. ఈ మెయిల్ ఉన్న వారికి మెయిల్లో సైతం సమాచారం పంపారు. ⇒ ఈ పరిశీలనకు సకాలంలో ఎవరైనా హాజరు కాలేకపోతే ఇంకొక అవకాశం కల్పిస్తారు. ⇒ అభ్యర్థులు కులధ్రువీకరణ పత్రాలు రెవెన్యూ అధికారుల నుంచి పొందడంలో ఆలస్యమైతే అలాంటి వారు ఈ రెండో చాన్స్‌ను ఉపయోగించుకోవచ్చు. ⇒ హాజరయ్యే అభ్యర్థులకు తాగునీరు, మరుగుదొడ్లు, నీడ కోసం షామియానాలు తదితర కనీస వసతులు కేంద్రాల వద్ద కల్పించారు. 25వ తేదీన.. నెల్లూరు(పొగతోట): 25వ తేదీన విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ల (గ్రేడ్–2) ఉద్యోగాల భర్తీకి సంబంధించి అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఈ నెల 26న కాకుండా 25వ తేదీన జరుగుతుందని వ్యవసాయ శాఖ జేడీ ఆనందకుమారి సోమవారం తెలిపారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించి 25న ఉదయం 9.00 గంటలకు పీఎన్ఎం హైస్కూల్ జెండావీధిలో పరిశీలనకు హాజరుకావాలని తెలిపారు.అలాగే విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్లకు ఈ నెల 25వ తేదీ ఉదయం 10.00 గంటలకు సెయింట్ జోసఫ్ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందని హర్టికల్చర్ ఏడి కే ప్రదీప్‌కుమార్ తెలిపారు. 26న ఎడ్యుకేషన్, వెల్ఫేర్ పోస్టులకు నెల్లూరు(వేదాయపాళెం): సచివాలయ పోస్టుల నోటిఫికేషన్ పరీక్షల్లో ఎడ్యుకేషన్, వెల్ఫేర్ పోస్టులకు అర్హత సాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన సర్వోదయ కళాశాలలో ఈనెల 26వ తేదీన నిర్వహిస్తున్నట్లు జిల్లా సాంఘిక శాఖ ఉప సంచాలకులు బి.జీవపుత్రకుమార్ తెలిపారు. కొండాయపాళెం గేటు సెంటర్లోని డీడీ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల అధికారులతో సోమవారం సర్టిఫికెట్ల పరిశీలనపై అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీడీ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు ఆదేశాల మేరకు సర్టిఫికెట్లను పరిశీలన కార్యక్రమాన్ని నిష్పక్షపాతంగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమాధికారిణి కె.రాజేశ్వరి, జిల్లా గిరిజన సంక్షేమాధికారిణి విద్యారాణి, సహాయ సంక్షేమాధికారులు నరసారెడ్డి, లక్ష్మీ ప్రసూన, తేజోవతి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. నిబంధనల మేరకే.. నెల్లూరు(పొగతోట) : గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ప్రభుత్వ నిబంధనల మేరకు రోస్టర్‌తో మెరిట్ జాబితాను సిద్ధం చేశామని కలెక్టర్ శేషగిరిబాబు తెలిపారు. తన క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ సోమవారం విలేకరులతో మాట్లాడారు. మంగళవారం నుంచి గురువారం వరకు సర్టిఫికెట్ల పరిశీలన జరగనుందని వివరించారు. ప్రస్తుతానికి మొదటి రోజు హాజరుకావాల్సిన వారి మెరిట్ జాబితాలను సిద్ధం చేశామని, అభ్యర్థులకు ఎస్సెమ్మెస్ ద్వారా సమాచారమిచ్చామని వెల్లడించారు. ఇప్పటి వరకు 8 శాఖల మెరిట్ జాబితాలు సిద్ధమయ్యాయని వివరించారు. బుధవారం పరిశీలనకు హాజరుకావాల్సిన అభ్యర్థులకు మంగళవారం ఉదయం ఎస్సెమ్మెస్ ద్వారా సమాచారం అందజేస్తామని తెలిపారు. శాఖల వారీగా రోస్టర్‌తో మెరిట్ జాబితాను సిద్ధం చేశామని, ఎలాంటి పొరపాట్లు జరగకుండా అన్ని విషయాలను పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నామన్నారు. జెడ్పీ కార్యాలయ కేంద్రంగా కసరత్తు జరుగుతోందన్నారు. తొలుత జెడ్పీ కార్యాలయంలో రోస్టర్ ప్రక్రియను పరిశీలించారు. అభ్యర్థులు వారి సర్టిఫికెట్లను ఆన్లైన్లో అప్లోడ్ చేసి, అనంతరం ప్రింట్ తీసుకొని ఒరిజినల్ సర్టిఫికెట్లతో పరిశీలనకు హాజరుకావాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కుల ధ్రువీకరణ సర్టిఫికెట్లు సకాలంలో అందజేసేలా కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. దీనికి సంబంధించి తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేశారు. అభ్యర్థుల మెరిట్ జాబితాను జెడ్పీ కార్యాలయంలో అందుబాటులో ఉంచారు. -
ఎంపికైన వారందరు శాశ్వత ఉద్యోగులే...
సాక్షి, విజయవాడ : ప్రభుత్వ సేవలను పారదర్శకంగా ప్రజల గుమ్మం ముందుకు చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చిందని కృష్ణాజిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ అన్నారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 11,025 పోస్టులు ఉన్నాయని, వీటికి 2లక్షల 625 మందికి పైగా అభ్యర్థులు పరీక్ష రాయగా, 69,216 మంది అర్హత సాధించినట్లు తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయంలో మొత్తం 14 శాఖలకు సంబంధించిన పోస్టులు ఉన్నాయని, అలాగే ఎంపికైన అభ్యర్థులను అర్హతను బట్టి ఆయా శాఖలకు ఎంపిక చేస్తామని అన్నారు. ఎంపికైన వారందరు శాశ్వత ఉద్యోగులుగా ఉంటారని పేర్కొన్నారు. అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను సంబంధిత శాఖల అధికారులకు పంపించామని, రేపు లేక ఎల్లుండి కాల్ లెటర్లు పంపించనున్నట్లు తెలిపారు. అలాగే ఈ నెల 24, 25 తేదీల్లో ధ్రువ పత్రాల పరిశీలన ఉంటుందని, రోస్టర్ పాయింట్ విధానంలో నియామకం జరుగుతుందని చెప్పారు. ఎంపికైన అభ్యర్థులకు 30, 1 తేదీల్లో శిక్షణ ఇచ్చి అక్టోబర్ 2వ తేదీ నుంచి విధుల్లోకి పంపనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. చదవండి: ‘సచివాలయ’ ఫలితాలు విడుదల సచివాలయ ఫలితాలు: కేటగిరీ వారీ ఉత్తీర్ణుల జాబితా ‘సచివాలయ’ టాపర్స్ వీరే -
22 నుంచి వైవీయూ సెట్ కౌన్సెలింగ్
సాక్షి, వైవీయూ : యోగివేమన విశ్వవిద్యాలయం పీజీ కళాశాల, అనుబంధ కళాశాలల్లోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన వైవీయూ సెట్–2018 ప్రవేశాల ప్రక్రియ ఈ నెల 22 నుంచి నిర్వహించనున్నట్లు వైవీయూ ప్రవేశాల సంచాలకుడు ఆచార్య టి.శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 22 నుంచి 24 వరకు మొదటి దశ సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులు తమ అర్హతకు సంబంధించిన అన్ని ధ్రువపత్రాలు, హాల్‌టికెట్, ర్యాంకుకార్డు, ఒరిజినల్స్, రెండు సెట్ల జిరాక్స్ కాపీలను తీసుకుని రావాలని సూచించారు. మరిన్ని వివరాలకు నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. జూన్ 22న ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, అడ్వాన్స్డ్ లైఫ్‌సైన్సెస్, తెలుగు, ఉర్దూ కోర్సులకు సంబంధించిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన చేయనున్నట్లు తెలిపారు. అదే రోజు మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు కంప్యూటర్‌సైన్స్, ఆంగ్లం, జియాలజీ, పీజీ డిప్లొమో ఇన్ థియేటర్ ఆర్ట్స్, ఫైన్ఆర్ట్స్, ఫుడ్ టెక్నాలజీ, కంప్యూటేషనల్ డేటా సైన్స్‌కు సంబంధించిన అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించనున్నట్లు పేర్కొన్నారు. 23న ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు కామర్స్ కోర్సులకు సంబంధించి 1 నుంచి 450వ ర్యాంకు వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు 450పైన ర్యాంకులు సాధించిన అభ్యర్థులకు, భౌతికశాస్త్రం, మెటీరియల్‌సైన్స్ నానోటెక్నాలజీ, 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు, ఎడ్యుకేషన్ కోర్సుకు సంబంధించిన అన్ని ర్యాంకులు సాధించిన అభ్యర్థులకు సర్టిఫికెట్ల పరిశీలన చేయనున్నట్లు వివరించారు. 24న ఉదయం 9 నుంచి 1 గంట వరకు గణితం, స్టాటిస్టిక్స్, జనరల్ టెస్ట్‌లో ర్యాంకు సాధించిన అభ్యర్థులకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు రసాయనశాస్త్రం, పర్యావరణశాస్త్రం, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఎకనామిక్స్ కోర్సుల్లో ర్యాంకులు సాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందని తెలిపారు. -
రేపటి నుంచి ఐసెట్ సర్టిఫికెట్ల పరిశీలన
పోచమ్మమైదాన్ :ఐసెట్‌లో అర్హత సాధించిన వారు ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 26 నుంచి 30 వరకు సర్టిఫికెట్ల పరిశీలన జరుగనుంది. జిల్లాలో రెండు హెల్ప్‌లైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. వరంగల్‌లో ప్రభుత్వ పాలిటెక్నిక్, హన్మకొండలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో హెల్ప్‌లైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. పీహెచ్సీ, స్పోర్ట్స్, ఎన్సీసీ, అంగ్లో ఇండియన్ విద్యార్థులు హైదారాబాద్‌లోని మాసబ్ ట్యాంక్ సమీపంలో గల సాంకేతిక విద్యా భవన్లో హాజరుకావాలి. అలాగే జిల్లాలకు చెందిన ఎస్టీ అభ్యర్థులు వరంగల్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకావాలి. విద్యార్థులు ఇవి తీసుకురావాలి... ఐసెట్ హాల్ టికెట్, ఒరిజినల్ ర్యాంక్ కార్డ్ ఎస్సెస్సీ, ఇంటర్, డిగ్రీ ఒరిజినల్ మెమోలు స్టడీ, కుల, ఆదాయ సర్టిఫికెట్లు, టీసీ ఓసీ, బీసీలు రూ1000, ఎస్సీ, ఎస్టీలు రూ.500 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. పాలిటెక్నిక్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల 26న ఉదయం 1 నుంచి–3వేలు 3001 నుంచి 6వేల వరకు మధ్యాహ్నం 6001 నుంచి 9 వేలు 9001 నుంచి 12 వేలు 27న ఉదయం 12001 నుంచి 15వేలు 15001 నుంచి 18 వేలు మధ్యాహ్నం 18001 నుంచి 21వేలు 21001 నుంచి 24 వేలు 28న ఉదయం 24001 నుంచి 27000 27001 నుంచి 30వేలు మధ్యాహ్నం 30001 నుంచి 33వేలు 33001 నుంచి 36 వేలు 29న ఉదయం 36001 నుంచి 39500 39501 నుంచి 43 వేలు మధ్యాహ్నం 43001 నుంచి 46500 46501 నుంచి 50 వేలు 30న ఉదయం 50001 నుంచి 53500 53501 నుంచి 57వేలు మధ్యాహ్నం 57001 నుంచి 60500 60501 నుంచి చివరి ర్యాంక్ -
నిట్‌లో అడ్మిషన్లు ప్రారంభం
26వ తేదీ వరకు ప్రవేశాలు కాజీపేట రూరల్ : వరంగల్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో బీటెక్ ప్రథమ సంవత్సరంలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. నిట్ ఆడిటోరియంలో శనివారం జరిగిన డాక్యుమెంట్స్ వెరిఫికేషన్‌లో 800 అడ్మిషన్లకు 400 అడ్మిషన్లు జరిగాయి. శుక్రవారం 244 మంది విద్యార్దులు అడ్మిషన్లు తీసుకున్నట్లు నిట్ అధికారులు తెలిపారు. అడ్మిషన్ల ప్రక్రియ 26వ తేదీ వరకు కొనసాగుతుందని, నిట్‌లో 2016–17వ సంవత్సరంలో అడ్మిషన్లు తీసుకున్న విద్యార్థులకు 28వ తేదీన అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 29వ తేదీ నుంచి ప్రథమ సంవత్సరం తరగతులు ప్రారంభం అవుతాయని వెల్లడించారు. -
నిట్‌లో అడ్మిషన్లు ప్రారంభం
26వ తేదీ వరకు ప్రవేశాలు కాజీపేట రూరల్ : వరంగల్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో బీటెక్ ప్రథమ సంవత్సరంలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. నిట్ ఆడిటోరియంలో శనివారం జరిగిన డాక్యుమెంట్స్ వెరిఫికేషన్‌లో 800 అడ్మిషన్లకు 400 అడ్మిషన్లు జరిగాయి. శుక్రవారం 244 మంది విద్యార్దులు అడ్మిషన్లు తీసుకున్నట్లు నిట్ అధికారులు తెలిపారు. అడ్మిషన్ల ప్రక్రియ 26వ తేదీ వరకు కొనసాగుతుందని, నిట్‌లో 2016–17వ సంవత్సరంలో అడ్మిషన్లు తీసుకున్న విద్యార్థులకు 28వ తేదీన అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 29వ తేదీ నుంచి ప్రథమ సంవత్సరం తరగతులు ప్రారంభం అవుతాయని వెల్లడించారు. -
ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ జారీ
* ఈనెల 19 నుంచి 30 వరకు ధ్రువపత్రాల పరిశీలన * 22 నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు.. * సెప్టెంబర్ 2, 3 తేదీల్లో ఆప్షన్ల సవరణకు అవకాశం సాక్షి, హైదరాబాద్: ఎంసెట్(ఎంపీసీ విభాగం) విద్యార్థులకు ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి ఈనెల 19 నుంచి 30వ తేదీ వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నట్టు అడ్మిషన్ల కన్వీనర్ అజయ్‌జైన్ తెలిపారు. ఈనెల 22 నుంచి సెప్టెంబర్ 1వ తేదీ వరకు ఆప్షన్ల నమోదు జరుగుతుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. విద్యార్థులు ర్యాంకును అనుసరించి హెల్ప్‌లైన్ సెంటర్ల లో విధిగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కావాలని, అధికారులు అందజేసే స్క్రాచ్ కార్డును భద్రపరుచుకుని వెబ్ ఆప్షన్ల నమోదుకు వినియోగించుకోవాలని సూచించారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం ఉదయం 9 గంటలకే హెల్ప్‌లైన్ సెంటర్‌కు చేరుకోవాలి. స్పెషల్ కేటగిరీ కింద వికలాంగ, సైనికుల పిల్లలు, ఎన్సీసీ, స్పోర్ట్స్, మైనారిటీ విద్యార్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ హైదరాబాద్ మాసబ్‌ట్యాంకులోని సాంకేతిక విద్యాభవన్‌లో ఉంటుంది. సంబంధిత షెడ్యూలును https://apeamcet.nic.in వెబ్సైట్లో చూడవచ్చు. కళాశాలల వారీగా ఫీజుల వివరాలను సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నాటికి ఈ వెబ్సైట్లో పొందుపరుస్తారు. కళాశాలలో ఫీజు, చెల్లించగలిగే స్తోమత, ఫీజు రీయింబర్స్మెంట్ లభించే అవకాశం తదితర అంశాలను పరిశీలించి మెరుగైన కళాశాలను ఎంచుకోవాలి. యాజమాన్య కోటా భర్తీకి మార్గదర్శకాలు సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో బీ-కేటగిరీ(యాజమాన్య కోటా) సీట్ల భర్తీకి ఉన్నత విద్యామండలి మార్గదర్శకాలను జారీ చేసింది. హైకోర్టు మధ్యంతర ఆదేశాల ప్రకారం యాజమాన్యాలు బీ-కేటగిరీ దరఖాస్తులను కళాశాల నోటీసు బోర్డులో, వెబ్సైట్లో ఉంచాలని, తమకు, సంబంధిత వర్సిటీకి దరఖాస్తు ఫారం నమూనాను ఈ-మెయిల్ ద్వారా పంపించాలని పేర్కొంది. విద్యార్థులు పూర్తిచేసిన దరఖాస్తును రిజిస్టర్డ్ పోస్టులో పంపించాలని సూచించింది. కళాశాలలు దరఖాస్తులను ఆన్‌లైన్‌లోనూ స్వీకరించవచ్చని, వాటి వివరాలు వెబ్సైట్లో ఉంచాలని ఆదేశించింది. కాగా, ప్రతిభాక్రమంలో ఎంపిక చేసిన విద్యార్థుల జాబితాను ఎంసెట్ అడ్మిషన్ల కన్వీనర్‌కు పంపించాల్సి ఉంటుంది. జాబితాను రెండు వారాల పాటు వెబ్సైట్లో ఉంచాలి.