
సాక్షి, ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి దరఖాస్తు చేసుకొని రాష్ట్ర పోలీస్ శాఖలోని వివిధ విభాగాల్లో కానిస్టేబుల్‌గా ఎంపికైన అభ్యర్థులకు సంబంధించిన అటెస్టేషన్ ఫారాలను పూరించి ఈ నెల 9,10,11,12వ తేదీలో ఖమ్మం పోలీస్ కమిషనరేట్ కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్‌లో అందజేయాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ కార్యాలయం నుంచి ఒక ప్రకటనలో తెలిపారు. గెజిటెడ్ అధికారితో అటెస్టేషన్ చేయించిన ఫారాలతో పాటు విద్యార్హతల ధ్రువీకరణ ఫారాలను అందజేయాలని కోరారు. అటెస్టేషన్ పారాల పంపకం, స్వీకరణకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని, ఆయా తేదీలలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫారాలను స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. అభ్యర్థులు నాలుగు పాస్‌ఫోటోలను వెంట తీసుకరావాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment