
ధ్రువపత్రాల పరిశీలనకు అంబేడ్కర్ భవన్‌లో ఏర్పాట్లు
సాక్షి, అనంతపురం : సచివాలయ ఉద్యోగుల భర్తీలో భాగంగా జిల్లాలోని నగరపాలక సంస్థ, 11 మునిసిపాలిటీలకు సంబంధించి శానిటేషన్ ఎన్విరాన్‌మెంట్ కార్యదర్శుల సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమం బుధవారం నిర్వహిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ పి.ప్రశాంతి తెలిపారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌భవన్‌లో ఉదయం 10 గంటలకు అభ్యర్థులు హాజరు కావాలన్నారు. 297 శానిటేషన్ ఎన్విరాన్‌మెంట్ కార్యదర్శుల పోస్టులకు గానూ 134 మందికి కలెక్టర్ సత్యనారాయణ అనుమతులిచ్చారన్నారు. ఫైనల్ మెరిట్‌లిస్టు అభ్యర్థులు వెరిఫికేషన్ కోసం మూడు కౌంటర్లను ఏర్పాటు చేశామన్నారు. ఒక్కో కౌంటర్‌లో 45 మంది సర్టిఫికెట్లు పరిశీలించేలా చర్యలు తీసుకున్నామన్నారు.