
సాక్షి, వరంగల్ : చదువుల ఒడిలో మరోసారి మత్తు పొగలు చూరింది. విద్యాబుద్ధులు నేర్వాల్సిన పిల్లల్ని మైకంలో పడేసింది. దీంతో వరంగల్ నిట్‌లో గంజాయి సేవించినట్టు తేలిన 11 మంది ఇంజనీరింగ్ విద్యార్థులపై యూనివర్సిటీ యాజమాన్యం సస్పెన్షన్ వేటువేసింది. వారం క్రితం నిట్ క్యాంపస్‌లో గంజాయి సేవిస్తూ 11 మంది విద్యార్థులు సెక్యూరిటీ సిబ్బందికి పట్టుబడ్డారు. డీన్ నేతృత్వంలో నిట్ అధికారులు కమిటీ వేశారు. విచారణ చేపట్టిన క్రమశిక్షణ కమిటీ విద్యార్థులు గంజాయి తాగినట్టు తేలడంతో నిట్ నుంచి సస్పెండ్ చేసింది.
(చదవండి : వరంగల్ నిట్‌లో గంజాయి.. అసలు నిజం!)
Comments
Please login to add a commentAdd a comment