Technology campus
-
ప్రతిష్టాత్మక వరంగల్ నిట్ లో పండుగకు వేళాయే
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్‌లో ప్రతి ఏడాది విద్యార్థులచే నిర్వాహకులుగా మూడు రోజుల వసంతోత్సవ సంబురం, సంస్కృతి సంప్రదాయాలను పంచుకునే వేదికగా నిలుస్తున్న స్ప్రింగ్ స్ప్రీ–23 ఏప్రిల్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్నారు. నిత్యం విద్యతో కుస్తీ పడుతూ ప్రపంచస్థాయిలో తమ ప్రతిభను చాటుకుంటున్న నిట్ విద్యార్థులు తోటి విద్యార్థులతో పాటు దేశవ్యాప్త ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులతో ఆ ప్రాంత సంస్కృతి సంప్రదాయాలను, మన సంస్కృతి సంప్రదాయాలను పరస్పరం పంచుకుంటూ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్‌గా ఏర్పాటు చేసుకుని మూడు రోజుల వేడుకకు శ్రీకారం చుట్టారు. దేశ వ్యాప్తంగా వివిధ కళాశాలల నుంచి 20వేల మంది విద్యార్థులు ఈ ఏడాది స్ప్రింగ్‌స్ప్రీ వేడుకల్లో పాల్గొననున్నారు. ఇది దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద కల్చ రల్ ఫెస్ట్గా నిట్ వరంగల్ స్ప్రింగ్‌స్ప్రీ నిలుస్తుంది. ప్రతి ఏడాది ప్రత్యేక థీంతో.. నిట్ వరంగల్ ప్రతి ఏడాది నిర్వహిస్తున్న స్ప్రింగ్‌స్ప్రీ వసంతోత్సవ వేడుకలకు ప్రత్యేక థీంను రూపొందిస్తారు. ఈ ఏడాది స్ప్రింగ్‌స్ప్రీ–23కి కళాధ్వనిగా నామకరణం చేశారు. 2019లో కళాక్షేత్ర, 2020లో మితియాస్, 2022లో సృష్టి, 2023లో కళాధ్వనిగా నామకరణం చేశారు. 55కు పైగా ఈవెంట్స్.. ఏప్రిల్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించే స్ప్రింగ్‌స్ప్రీ–23 కళాధ్వనీలో 55కు పైగా ఈవెంట్స్‌తో అలరించనుంది. తొలిరోజు 7న టాలీవుడ్ నైట్ పేరిట టాలీవుడ్ సింగర్స్ నిట్ మైదానంలో అలరించనున్నారు. రెండో రోజు 8న డీజే నైట్, సన్‌బర్న్ పేరిట డీజేలు వివిధ రకాల పాటలతో అలరించనున్నారు, మూడో రోజు 9న బాలీవుడ్ నైట్ పేరిట బాలీవుడ్ సింగర్స్ ఉర్రూతలూగించనున్నారు. వీటితో పాటు మూడురోజుల పాటు ప్రొ షోలు, స్పాట్ లైట్స్, స్యాండ్ ఆర్ట్, సైలెంట్ డీజేస్, మాస్టర్ చెఫ్, జుంబాడ్యాన్స్, కొరియో నైట్, వార్ ఆఫ్ డీజెస్, ఐడల్, అల్యూర్లతో వసంతోత్సవం కలర్ ఫుల్‌గా సాగనుంది. ప్రతిష్టాత్మకంగా స్ప్రింగ్‌స్ప్రీ–23 కళాధ్వని నిట్ వరంగల్‌లో నిర్వహించనున్న మూడు రోజుల స్ప్రింగ్‌స్ప్రీ–23 కళాధ్వనిని ఏప్రిల్ 7, 8, 9 తేదీల్లో వేడుకలను ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్నామని నిట్ డైరెక్టర్ ఎన్వీ.రమణారావు తెలిపారు. బుధవారం నిట్‌లోని సుభాష్‌చంద్రబోస్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను అలవర్చేందుకు, సంస్కృతి సంప్రదాయాలను పరస్పరం పంచుకునేందుకు స్ప్రింగ్‌స్ప్రీ వేడుకలు విద్యార్థులే నిర్వాహకులుగా నిర్వహిస్తున్నారు. రెండు నెలల పాటు 200 మంది విద్యార్థులు నిట్‌లోని వివిధ క్లబ్స్‌తో మమేకమై కోర్టీంలుగా ఏర్పడి ఈ వేడుకలను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ పులి రవికుమార్, ఫ్యాకల్టీ అడ్వైజర్ హీరాలాల్, కోర్ టీం వంశీ కిషార్, అజయ్‌కుమార్, పీయూష్‌కుమార్, సాయిగురునాథ్ పాల్గొన్నారు. నిట్ వరంగల్ స్ప్రింగ్‌స్ప్రీ–23 కళాధ్వనీ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా సినీ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఏప్రిల్ 6న ముఖ్యఅతిథిగా పాల్గొని స్ప్రింగ్‌స్ప్రీ–23 వేడుకలను నిట్ మైదానంలో ప్రారంభించనున్నారు. పవన్ కల్యాణ్‌ను చూసేందుకు నిట్ వరంగల్ విద్యార్థులతో పాటు ఓరుగల్లు వాసులు ఎదురు చూస్తున్నారు. నిర్వాహకులు ఏర్పాటు చేసిన ఎంట్రీ పాసుల కోసం ఇప్పటికే క్రేజ్ మొదలైంది. స్ప్రింగ్‌స్ప్రీ–23 వేడుకల్లో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్లను నిట్ ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో QR కోడ్లతో అందజేస్తున్నారు. -
జూమ్ కొత్త టెక్ సెంటర్, కొత్త ఉద్యోగాలు
సాక్షి, బెంగళూరు : కరోనా సంక్షోభం, లాక్డౌన్ కాలంలో ఏర్పడిన భారీ డిమాండ్‌తో దూసుకుపోయిన అమెరికాకు చెందిన యాప్ జూమ్ మరింత విస్తరించేందుకు అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో బెంగళూరులో కొత్త టెక్నాలజీ సెంటర్‌ను ప్రారంభించనున్నామని మంగళవారం ప్రకటించింది. అంతేకాదు త్వరలోనే దీనికి సంబంధించిన నియామకాలను కూడా ప్రారంభిస్తామని వెల్లడించింది. జూమ్‌కు ఇప్పటికే ముంబైలో ఒక కార్యాలయం, డేటా సెంటర్ ఉంది. తాజాగా బెంగళూరులో రెండవ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. ఇది తమ ప్లాట్‌ఫాంను మరింత మెరుగుపరిచేందుకు ఇన్నోవేషన్ హబ్‌గా ఉంటుందని, రాబోయే కొన్నేళ్లలో ఇక్కడ అత్యంత ప్రతిభావంతులైన నిపుణులను నియమించుకోవడానికి కూడా కట్టుబడి ఉన్నామని ప్రొడక్షన్ అండ్ ఇంజనీరింగ్ ప్రెసిడెంట్ వెల్చమీ శంకర్ లింగ్ వెల్లడించారు. ఈ వ్యూహాత్మక పెట్టుబడులు తమ నిబద్దతకు సూచికని చెప్పారు. దేశంలో నిరంతర వృద్ధి, పెట్టుబడులపై ఆశావహంగా ఉన్నామని, కరోనా మహమ్మారి సమయంలో భారతదేశంలో 2,300కి పైగా విద్యాసంస్థలకు తమ సేవలను ఉచితంగా అందించడం గర్వకారణమని జూమ్ సీఈఓ ఎరిక్ఎస్ యువాన్ వ్యాఖ్యానించారు. భారత ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ఎదురు చూస్తున్నామని పేర్కొన్నారు. కోవిడ్-19, లాక్డౌన్ నిబంధనల కారణంగా చాలా విద్యా ,ఇతర సంస్థలు వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫాం జూమ్‌ను ఆశ్రయించడంతో, 2020 జనవరి-ఏప్రిల్ మధ్య 67శాతం వృద్ధిని సాధించింది. సిస్కో సిస్టమ్స్ వెబెక్స్, మైక్రోసాఫ్ట్ టీమ్స్, గూగుల్ మీట్ లాంటి వీడియో కాన్ఫరెన్స్ ప్లాట్‌ఫామ్‌లతో పోటీ పడుతోంది. తాజాగా రిలయన్స్ జియోమీట్, అమెరికా టెలికాం సర్వీసెస్ ప్రొవైడర్ వెరిజోన్‌తో కలిసి ఎయిర్టెల్ తీసుకొచ్చిన బ్లూజీన్స్ కూడా ఈ వరుసలో చేరాయి. ఈ నేపథ్యంలోనే జూమ్ విభిన్న వ్యూహాలతో మార్కెట్లో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తోంది. కాగా జూమ్ "సురక్షితమైన వేదిక కాదు" అని కేంద్రం గతంలో చెప్పింది. సెక్యూరిటీ రీత్యా అంత మంచిది కాదని సూచించిన ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాల అధికారిక సమావేశాలకు ఈ యాప్‌ను వినియోగించ వద్దని హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
హైదరాబాద్‌లో మైక్రాన్ డెవలప్మెంట్ సెంటర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమెరికాకు చెందిన సెమీకండక్టర్ల తయారీ సంస్థ మైక్రాన్ టెక్నాలజీ తాజాగా హైదరాబాద్‌లో గ్లోబల్ డెవలప్మెంట్ సెంటర్ (జీడీసీ)ని ఆవిష్కరించింది. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ శుక్రవారమిక్కడ దీన్ని ప్రారంభించారు. మైక్రాన్ వంటి దిగ్గజ సంస్థ హైదరాబాద్‌లో తమ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయడం రాష్ట్రానికి గర్వకారణమని ఈ సందర్భంగా కేటీఆర్ చెప్పారు. ఇప్పటికే హైదరాబాద్‌లో రెండు ఎలక్ట్రానిక్స్ క్లస్టర్స్ ఉన్నాయని, ఈ విభాగంలో పెట్టుబడులకు గణనీయంగా అవకాశాలు ఉన్నాయన్నారు. సెమీకండక్టర్స్ తయారీ యూనిట్‌ను కూడా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. మరోవైపు, సుమారు 3,50,000 చ.అ. విస్తీర్ణంలో ఈ సెంటర్ ఏర్పాటు చేసినట్లు సంస్థ సీఈవో సంజయ్ మెహ్రోత్రా విలేకరుల సమావేశంలో తెలిపారు. ఇటీవలే ప్రారంభించిన బెంగళూరు కార్యాలయంతో పాటు హైదరాబాద్ జీడీసీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య సుమారు 700 దాకా ఉంటుందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో దీన్ని 2,000 దాకా పెంచుకోనున్నట్లు, ఇందులో ఎక్కువగా నియామకాలు హైదరాబాద్ కేంద్రంలోనే ఉండనున్నట్లు మెహ్రోత్రా వివరించారు. ప్రస్తుతం తమకు జపాన్, చైనా సహా ఆరు దేశాల్లో తయారీ కార్యకలాపాలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. డేటా విప్లవంతో ఈ రంగంలో అనేక అవకాశాలు అందుబాటులోకి వస్తాయని అమితాబ్ కాంత్ చెప్పారు. -
నేటి నుంచి టెక్నోజియాన్-14
నిట్ క్యాంపస్ : నిట్ టెక్నోజియాన్‌ను ఈ నెల 17 నుంచి 19వ వరకు నిర్వహించనున్నామని, ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశామని నిట్ వరంగల్ ఇన్చార్జ్ డెరైక్టర్ ఎస్.శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు బుధవారం నిట్‌లోని ఎంబీఏ సెమినార్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన టెక్నోజియన్ వివరాలు వెల్లడించారు. గురువారం సాయంత్రం 5.30 గంటలకు నిట్ ఇన్స్టిట్యూట్ ఆడిటోరియంలో టెక్నోజియాన్ వేడుకలను ఎల్అండ్టీ, మెట్రోరైల్ మేనేజింగ్ డెరైక్టర్ గాడ్గిల్ లాంఛనంగా ప్రారంభిస్తారన్నారు. ఈ టెక్నోజియాన్‌కు దేశం నలుమూలల నుంచి మొత్తం 15,000 మంది విద్యార్థు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. ఈ నెల 18న టెక్నోజియాన్‌లో భాగం గా యూఎస్ నుంచి లైవ్ వీడియో కాన్ఫరెన్స్ నిట్ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పా రు. మ్యూజికల్ నైట్ షో, డీజే షోతోపాటు పలు సామాజిక అంశాలపై ఈవెంట్లు ఉంటాయన్నారు. సమావేశంలో నిట్ టెక్నోజియాన్ ఫ్యాకల్టీ అడ్వయిజర్ ప్రొఫెసర్ వెంకటరత్నం, నిట్ స్టూడెంట్స్ వెల్ఫేర్ అసోసియేట్ డీన్ సెల్వరాజ్, నిట్ టెక్నోజియాన్ కోఆర్డినేటర్ వె భవ్, డిప్యూటీ కోఆర్డినేటర్ నమ్రత, టెక్నోజియాన్ ఈవెంట్ కోఆర్డినేటర్ సాయి కల్యాణ్ మాట్లాడారు. -
సవాళ్లు అధిగమించాలి
సరికొత్త పరిశోధనలు చేయాలి 800 ఏళ్ల క్రితమే సాంకేతికతను ప్రవేశపెట్టిన కాకతీయులు రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు పద్మశ్రీ అవినాశ్ చందర్ కనుల పండువగా నిట్ స్నాతకోత్సవం1427 మందికి పట్టాలు ప్రదానం నిట్ క్యాంపస్: దేశాభివృద్ధిలో తమ వంతు పాత్రను పోషించేందుకు యువ ఇంజనీర్లు సరికొత్త ఆలోచనలు, ఆవిష్కరణలతో ముందుకు రావాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి శాస్త్రీయ సలహాదారు పద్మశ్రీ అవినాశ్ చందర్ అన్నారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్, వరంగల్) 12వ స్నాతకోత్సవం నిట్ ఆడిటోరియంలో శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన అవినాశ్ చందర్ మాట్లాడుతూ ప్రకృతి విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కోవడం, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడం వంటి రంగాల్లో మరిన్ని పరిశోధనలు జరగాలని సూచించారు. 21వ శతాబ్దంలో వచ్చే సవాళ్లను అధిగమించేలా కొత్త ఆవిష్కరణలు చేయాలని ఆయన నేటితరం ఇంజనీర్లను కోరారు. ఎనిమిది వందల ఏళ్లక్రితమే నిర్మాణం, సాగు నీటి రంగాల్లో సాంకేతికను ప్రవేశపెట్టిన కాకతీయుల గడ్డపై తాను ప్రసంగిస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన నిట్ బోర్డుఆఫ్ గవర్నర్స్ చైర్మన్ కృష్ణ ఎం ఎల్లా మాట్లాడుతూ ఒక విజయం కోసం కల కనాలని, దాన్ని సాధించడానికి అహర్నిశలు కృషి చేయాలని, అప్పుడే విజయం వరిస్తుందన్నారు. నిట్‌లో ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులు ఎందరో సొంతంగా పరిశ్రమలు ఏర్పాటు చేసి విజయం సాధించారని చెప్పారు. ఆర్ఈసీ మొదటి బ్యాచ్ విద్యార్థి ఆంజనేయ శాస్త్రీ పరిశ్రమ స్థాపించి విజయం సాధించారని, అంతేగాక నిట్ ఇనిస్టిట్యూట్ ఇంకుబేషన్ సెంటర్‌కు కోటి రుపాయలు ఇచ్చారన్నారు. అభివృద్ధికి పరిమితులు ఉండవని, యువ ఇంజనీర్లు దేశ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని ఆయన కోరారు. పరిశోధన రంగాన్ని అభివృద్ధి చేయడానికి కృషి నిట్ డెరైక్టర్ ప్రొఫెసర్ టి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రపంచ బ్యాంకు నిధులతో టెక్నికల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం కింద నిట్‌లో పరిశోధనరంగం ద్వారా నూతన ఆవిష్కరణలకు కృషి చేస్తున్నామని చెప్పారు. నిట్‌లో 40మంది ప్యాకల్టీ మెంబర్లు, ఆరుగురు పీహెచ్డీ స్కాలర్లు అంతర్జాతీయ ప్రమాణాలకనుగుణంగా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి విదేశాల్లో శిక్షణ ఇప్పించామన్నారు. ఈ సారి 1427మందికి స్నాతకోత్సవంలో పట్టాలు ఇస్తున్నామని అందులో బిటెక్ గ్రాడ్యుయేట్లు 720 మంది, పోస్ట్ గ్రాడ్యుయేట్లు 668 మంది, పీహెచ్డీ స్కాలర్లు 39మంది ఉన్నారన్నారు. కంప్యూటర్‌సైన్స్ ఇంజనీరింగ్ విద్యార్థి కార్తీకేయన్ మిశ్రా ఫేస్బుక్లో ఉద్యోగం సంపాదించి వార్షిక వేతనంగా రూ.70లక్షలు పొందుతున్నాడని తెలిపారు. నిట్ అసోసియేట్ ప్రొఫెసర్ రతీష్‌కుమార్ ఫ్యాకల్టీ నుంచి ఆప్తాబ్ముప్తీ మెడల్‌ను సాధించాడన్నారు. ఇంజనీరింగ్‌తోపాటు ఇతర రంగాల్లోనూ విద్యార్థులను ప్రోత్సహించడానికి స్ప్రింగ్ స్త్రీ, టెక్నోజియూన్ ప్రతి ఏడాది నిట్‌లో నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. క్రీడాకారుల కోసం ఆల్ ఇండియా ఇంటర్ నిట్ స్పోర్ట్స్‌ను నిర్వహించామని ఆయన వివరించారు. నిట్ అకడమిక్ డీన్ డీవీఎల్‌ఎన్ సోమయాజులు ఇంజనీరింగ్ పట్టభద్రులను వేదికపైకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలోఇంచార్జీ రిజిస్ట్రార్ ఎఆర్సిరెడ్డి, ప్యాకల్టీ వెల్పేర్ డీన్ ఎం.సైదులు, స్టూడెంట్స్ వెల్పేర్ డీన్ ఎస్ శ్రీనివాసరావు, ప్లానింగ్ డెవలప్మెంట్ డీన్ ఆర్ఎల్ఎన్ సాయి ప్రసాద్, రీసెర్చ్కన్సల్టెన్సీ డీన్ జీవీఎస్ నాగేశ్వర్రావు, ప్రొఫెసర్లు సీబీ కామేశ్వర్రావు, కెవీ జయకుమార్, సీఎస్‌ఆర్‌కె ప్రసాద్, దేవ ప్రతాప్, ఎన్.సుబ్రమణ్యం, సి.గురుజారావు, జి.అంబప్రసాద్రావు, పులి రవికుమార్, కెఎస్ఆర్ కృష్ణానంద్, ఎన్వీఎస్ఎన్ శర్మ, జీవీఎస్ నాగేశ్వర్రావు, ఎన్.నర్సయ్య, ఎ.శరత్‌బాబు, పైడిశెట్టి, టి.రమేష్, బిబి.అంబర్కర్, కె.రమేష్, పి.నాగేశ్వర్రావు, జి.రాధాకృష్ణమాచార్య, వైఎన్ రెడ్డి, కెఎన్‌ఎస్ విశ్వనాథం, జెవి రమణమూర్తి, దత్తా, కె.శ్రీమన్నారాయణ, ఎ.రాంచంద్రారెడ్డి, ఎం.సాయిశంకర్, ఆర్ఎల్ఎన్.సాయిప్రసాద్, బివి.అప్పారావు, అజిత్‌కుమార్‌రెడ్డి, పి.నాగేశ్వర్రావు, వి.రాజేశ్వర్‌రావు, డీఎస్. కేశవరావు, పద్మ, నిట్ పీడీ రవికుమార్, పీఆర్వో ప్రాన్సిస్ సుధాకర్ పాల్గొన్నారు. ఐదుగురికి గోల్డ్‌మెడల్ ప్రదానం నిట్ బోర్డు ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ కృష్ణ ఎం ఎల్ల, నిట్ డైరక్టర్ ప్రొపెసర్ టి.శ్రీనివాసరావు చేతుల మీదుగా ఐదుగురు గోల్డ్‌మెడల్ అందుకున్నారు. ఇసీఇ టాపర్‌గా నిలిచిన జి.విశాల్ లక్ష్మణ్‌రావుకు నిట్ ఇనిస్టిట్యూట్ గోల్డ్‌మెడల్‌ను, సివిల్ ఇంజనీరింగ్‌లో వి.శ్రీహిత, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్(ఇఇఇ) లో సాయితేజ, కెమికల్ ఇంజనీరింగ్‌లో శ్రీదిత్యకు, కంప్యూటర్‌సైన్స్ ఇంజనీరింగ్‌లో సిహెచ్.అశ్వినికి గోల్డ్‌మెడల్‌ను అందజేశారు.