Technology courses
-
ప్రతిష్టాత్మక వరంగల్ నిట్ లో పండుగకు వేళాయే
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్‌లో ప్రతి ఏడాది విద్యార్థులచే నిర్వాహకులుగా మూడు రోజుల వసంతోత్సవ సంబురం, సంస్కృతి సంప్రదాయాలను పంచుకునే వేదికగా నిలుస్తున్న స్ప్రింగ్ స్ప్రీ–23 ఏప్రిల్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్నారు. నిత్యం విద్యతో కుస్తీ పడుతూ ప్రపంచస్థాయిలో తమ ప్రతిభను చాటుకుంటున్న నిట్ విద్యార్థులు తోటి విద్యార్థులతో పాటు దేశవ్యాప్త ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులతో ఆ ప్రాంత సంస్కృతి సంప్రదాయాలను, మన సంస్కృతి సంప్రదాయాలను పరస్పరం పంచుకుంటూ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్‌గా ఏర్పాటు చేసుకుని మూడు రోజుల వేడుకకు శ్రీకారం చుట్టారు. దేశ వ్యాప్తంగా వివిధ కళాశాలల నుంచి 20వేల మంది విద్యార్థులు ఈ ఏడాది స్ప్రింగ్‌స్ప్రీ వేడుకల్లో పాల్గొననున్నారు. ఇది దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద కల్చ రల్ ఫెస్ట్గా నిట్ వరంగల్ స్ప్రింగ్‌స్ప్రీ నిలుస్తుంది. ప్రతి ఏడాది ప్రత్యేక థీంతో.. నిట్ వరంగల్ ప్రతి ఏడాది నిర్వహిస్తున్న స్ప్రింగ్‌స్ప్రీ వసంతోత్సవ వేడుకలకు ప్రత్యేక థీంను రూపొందిస్తారు. ఈ ఏడాది స్ప్రింగ్‌స్ప్రీ–23కి కళాధ్వనిగా నామకరణం చేశారు. 2019లో కళాక్షేత్ర, 2020లో మితియాస్, 2022లో సృష్టి, 2023లో కళాధ్వనిగా నామకరణం చేశారు. 55కు పైగా ఈవెంట్స్.. ఏప్రిల్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించే స్ప్రింగ్‌స్ప్రీ–23 కళాధ్వనీలో 55కు పైగా ఈవెంట్స్‌తో అలరించనుంది. తొలిరోజు 7న టాలీవుడ్ నైట్ పేరిట టాలీవుడ్ సింగర్స్ నిట్ మైదానంలో అలరించనున్నారు. రెండో రోజు 8న డీజే నైట్, సన్‌బర్న్ పేరిట డీజేలు వివిధ రకాల పాటలతో అలరించనున్నారు, మూడో రోజు 9న బాలీవుడ్ నైట్ పేరిట బాలీవుడ్ సింగర్స్ ఉర్రూతలూగించనున్నారు. వీటితో పాటు మూడురోజుల పాటు ప్రొ షోలు, స్పాట్ లైట్స్, స్యాండ్ ఆర్ట్, సైలెంట్ డీజేస్, మాస్టర్ చెఫ్, జుంబాడ్యాన్స్, కొరియో నైట్, వార్ ఆఫ్ డీజెస్, ఐడల్, అల్యూర్లతో వసంతోత్సవం కలర్ ఫుల్‌గా సాగనుంది. ప్రతిష్టాత్మకంగా స్ప్రింగ్‌స్ప్రీ–23 కళాధ్వని నిట్ వరంగల్‌లో నిర్వహించనున్న మూడు రోజుల స్ప్రింగ్‌స్ప్రీ–23 కళాధ్వనిని ఏప్రిల్ 7, 8, 9 తేదీల్లో వేడుకలను ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్నామని నిట్ డైరెక్టర్ ఎన్వీ.రమణారావు తెలిపారు. బుధవారం నిట్‌లోని సుభాష్‌చంద్రబోస్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను అలవర్చేందుకు, సంస్కృతి సంప్రదాయాలను పరస్పరం పంచుకునేందుకు స్ప్రింగ్‌స్ప్రీ వేడుకలు విద్యార్థులే నిర్వాహకులుగా నిర్వహిస్తున్నారు. రెండు నెలల పాటు 200 మంది విద్యార్థులు నిట్‌లోని వివిధ క్లబ్స్‌తో మమేకమై కోర్టీంలుగా ఏర్పడి ఈ వేడుకలను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ పులి రవికుమార్, ఫ్యాకల్టీ అడ్వైజర్ హీరాలాల్, కోర్ టీం వంశీ కిషార్, అజయ్‌కుమార్, పీయూష్‌కుమార్, సాయిగురునాథ్ పాల్గొన్నారు. నిట్ వరంగల్ స్ప్రింగ్‌స్ప్రీ–23 కళాధ్వనీ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా సినీ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఏప్రిల్ 6న ముఖ్యఅతిథిగా పాల్గొని స్ప్రింగ్‌స్ప్రీ–23 వేడుకలను నిట్ మైదానంలో ప్రారంభించనున్నారు. పవన్ కల్యాణ్‌ను చూసేందుకు నిట్ వరంగల్ విద్యార్థులతో పాటు ఓరుగల్లు వాసులు ఎదురు చూస్తున్నారు. నిర్వాహకులు ఏర్పాటు చేసిన ఎంట్రీ పాసుల కోసం ఇప్పటికే క్రేజ్ మొదలైంది. స్ప్రింగ్‌స్ప్రీ–23 వేడుకల్లో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్లను నిట్ ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో QR కోడ్లతో అందజేస్తున్నారు. -
ఈ కొత్త టెక్నాలజీ కోర్సులకు భారీ డిమాండ్!! నేర్చుకునేందుకు క్యూ కడుతున్న అభ్యర్ధులు!
ముంబై: ఉద్యోగుల్లో 79 శాతం మంది తమ నైపుణ్యాలను మెరుగు పరుచుకునేందుకు ఆసక్తిగా ఉన్నట్టు ఎడ్టెక్ కంపెనీ గ్రేట్ లెర్నింగ్ తెలిపింది. కరోనా మహమ్మారి రాకతో కొత్త అవకాశాలు ఏర్పడడం తెలిసిందే. వీటికి ఆధునిక నైపుణ్యాలు కీలకంగా మారాయి. దీంతో తమ నైపుణ్యాలను ఆధునీకరించుకునేందుకు మెజారిటీ ఉద్యోగులు సుముఖంగా ఉన్నట్టు గ్రేట్ లెర్నింగ్ తెలిపింది. ‘అప్‌స్కిల్లింగ్ అవుట్‌లుక్ ఇన్ ఇండియా 2022’ పేరుతో నివేదిక విడుదల చేసింది. వెబ్3.0, మెటావర్స్, ఎన్ఎఫ్టీ తదితర నూతన డొమైన్ల విస్తరణతో 2022లోనూ నైపుణ్యాల పెంపు పట్ల అధిక సానుకూలత కనిపిస్తున్నట్టు తెలిపింది. గ్రేట్ లెర్నింగ్ తన డేటాబేస్‌లోని సమాచారం ఆధారంగా ఈ నివేదిక రూపొందించగా, మరోవైపు పిక్సిస్ సంస్థ.. హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబై, పుణె తదితర పట్టణాలకు చెందిన 1,000 మంది ఉద్యోగుల అభిప్రాయాలను సర్వేలో భాగంగా తెలుసుకుంది. ఈ వివరాలను కూడా తన నివేదికకు జతపరిచింది. నివేదికలోని అంశాలు.. ► 79 శాతం మంది 2022లో నైపుణ్యాలను పెంచుకోవాలని అనుకుంటున్నట్టు చెప్పారు. ఈ విషయంలో స్త్రీ, పురుషులు సమానంగా ఉన్నారు. ► ఐటీ, బ్యాంకింగ్, ఎడ్యుకేషన్, ట్రెయినింగ్, హెల్త్‌కేర్, కన్సల్టింగ్ సేవల్లోని వారు ఈ ఏడాది నైపుణ్యాల పెంచుకోవడం పట్ల ఆసక్తిగా ఉన్నారు. ► డిజిటల్‌కు డిమాండ్ పెరగడంతో ఐటీ, బీఎఫ్ఎస్ఐ, కన్సల్టింగ్ రంగాల్లో నైపుణ్యాల పెంపు పట్ల సహజంగానే ఎక్కువ అనుకూలత వ్యక్తమైంది. ► కరోనా మహమ్మారి వల్ల వైద్య సేవలకు డిమాండ్ పెరగడంతో, డేటా, కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీ నైపుణ్యాల పట్ల నిపుణులు ఆసక్తిగా ఉన్నారు. ► డేటా సైన్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, మెషిన్ లెర్నింగ్, అనలైటిక్స్ విభాగాల్లో నైపుణ్యాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ► ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ నగరాల్లో ఎక్కువ మంది నిపుణులు 2022లో నైపుణ్యాలు పెంచుకోవాలని అనుకుంటున్నారు. ► హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో టెక్నాలజీ, డేటా డొమైన్ నైపుణ్యాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ► మారుమూల ప్రాంతాల నుంచి పనిచేసే విధానం, ఆన్లైన్ నియామకాలు పెరుగుతున్న క్రమంలో నాగ్‌పూర్, ఎర్నాకులం, మైసూర్, జైపూర్, ఇండోర్ పట్టణాలు ఎక్కువ వృద్ధిని నమోదు చేస్తున్నాయి. -
నెక్ట్స్ ఏంటి... ప్రశ్నకు జవాబిది!
జీరోకాస్ట్ హైరింగ్.కామ్ ‘‘శిక్షణా సంస్థలకు వెళ్లి టెక్నాలజీ కోర్సులు నేర్చుకుంటే చాలు ఉద్యోగం వచ్చేస్తుందనుకుంటారు. కానీ, అది తప్పు. సాంకేతిక నైపుణ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే జాబ్ రాదు. అందుకే నేటికీ చాలా మంది రోడ్డు మీద డిగ్రీ పట్టా పట్టుకొని తిరుగుతున్నారు. ఇలాంటి వారికి మరింత శిక్షణ ఇచ్చి.. లైఫ్ టైం ప్రాజెక్ట్‌లు చేయిస్తే స్కిల్స్‌తో పాటూ అనుభవమూ వస్తుంది. దీంతో ఆయా కంపెనీలో ఉద్యోగ అవకాశాలొస్తాయి’’ ఇదీ వెబ్ డిజైన్ కంపెనీ 9 ఆర్ట్స్ మీడియా ఫౌండర్ రాము లంకా మాట. ఇందుకోసం ఏకంగా జీరోకాస్ట్ హైరింగ్.కామ్ అనే సంస్థను ప్రారంభించాడు. వివరాలు ఆయన మాటల్లోనే... ⇔ వెబ్ డిజైన్, డెవలప్మెంట్, జావా, పీహెచ్‌పీ, డిజిటల్ మార్కెటింగ్, బిగ్ డాటా, సీఎంఎస్, గ్రాఫిక్ డిజైన్, ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్స్, కంటెంట్ రైటింగ్ వంటి టెక్నాలజీల్లో ఉచితంగా ఇంటర్న్‌షిప్ గైడెన్స్ ఇస్తాం. 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అర్హులు. ⇔ 45 రోజుల పాటు శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో ఇంటర్న్‌షిప్‌తో పాటూ బృంద చర్చలు, కమ్యూనికేషన్ స్కిల్స్, మాక్ ఇంటర్వూ్యలు నిర్వహిస్తాం. ⇔ ప్రస్తుతం క్యాప్‌జెమినీ, ప్రొవెబ్, విప్రో, కార్వి, ఇన్ఫోసిస్, గూగుల్, హెచ్‌సీఎల్ వంటి 180 కంపెనీలతో; 99 కళాశాలలు, 50 శిక్షణా సం స్థలతో ఒప్పందం చేసుకున్నాం. ఇంటర్న్‌షిప్ తర్వాత ఆయా కంపెనీల ఇంటర్వూ్యలకు పంపిస్తాం. 362 మంది విద్యార్థులు పేర్లను నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం 40 మందికి ఉద్యోగాలొచ్చాయి. అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి...