నెక్ట్స్ ఏంటి... ప్రశ్నకు జవాబిది!
జీరోకాస్ట్ హైరింగ్.కామ్
‘‘శిక్షణా సంస్థలకు వెళ్లి టెక్నాలజీ కోర్సులు నేర్చుకుంటే చాలు ఉద్యోగం వచ్చేస్తుందనుకుంటారు. కానీ, అది తప్పు. సాంకేతిక నైపుణ్యం, కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే జాబ్ రాదు. అందుకే నేటికీ చాలా మంది రోడ్డు మీద డిగ్రీ పట్టా పట్టుకొని తిరుగుతున్నారు. ఇలాంటి వారికి మరింత శిక్షణ ఇచ్చి.. లైఫ్ టైం ప్రాజెక్ట్‌లు చేయిస్తే స్కిల్స్‌తో పాటూ అనుభవమూ వస్తుంది. దీంతో ఆయా కంపెనీలో ఉద్యోగ అవకాశాలొస్తాయి’’ ఇదీ వెబ్ డిజైన్ కంపెనీ 9 ఆర్ట్స్ మీడియా ఫౌండర్ రాము లంకా మాట. ఇందుకోసం ఏకంగా జీరోకాస్ట్ హైరింగ్.కామ్ అనే సంస్థను ప్రారంభించాడు.
వివరాలు ఆయన మాటల్లోనే...
⇔ వెబ్ డిజైన్, డెవలప్‌మెంట్, జావా, పీహెచ్‌పీ, డిజిటల్ మార్కెటింగ్, బిగ్ డాటా, సీఎంఎస్, గ్రాఫిక్ డిజైన్, ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్స్, కంటెంట్ రైటింగ్ వంటి టెక్నాలజీల్లో ఉచితంగా ఇంటర్న్‌షిప్ గైడెన్స్ ఇస్తాం. 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అర్హులు.
⇔ 45 రోజుల పాటు శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో ఇంటర్న్‌షిప్‌తో పాటూ బృంద చర్చలు, కమ్యూనికేషన్ స్కిల్స్, మాక్ ఇంటర్వూ్యలు నిర్వహిస్తాం.
⇔ ప్రస్తుతం క్యాప్‌జెమినీ, ప్రొవెబ్, విప్రో, కార్వి, ఇన్ఫోసిస్, గూగుల్, హెచ్‌సీఎల్ వంటి 180 కంపెనీలతో; 99 కళాశాలలు, 50 శిక్షణా సం స్థలతో ఒప్పందం చేసుకున్నాం. ఇంటర్న్‌షిప్ తర్వాత ఆయా కంపెనీల ఇంటర్వూ్యలకు పంపిస్తాం. 362 మంది విద్యార్థులు పేర్లను నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం 40 మందికి ఉద్యోగాలొచ్చాయి.
అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి...