న్యూఢిల్లీ: వ్యాపార దిగ్గజం అదానీ గ్రూప్ .. మీడియా రంగంలో తన కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తోంది. తాజాగా న్యూస్ ఏజెన్సీ ఐఏఎన్‌ఎస్ ఇండియాలో 50.5 శాతం మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. అనుబంధ సంస్థ ఏఎంజీ మీడియా నెట్‌వర్క్స్ ద్వారా ఈ లావాదేవీ నిర్వహించింది. ఐఏఎన్‌ఎస్, అందులో వాటాదారు (ఎండీ, ఎడిటర్–ఇన్–చీఫ్) సందీప్ బమ్‌జాయ్‌తో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు అదానీ ఎంటర్‌ప్రైజెస్ తెలిపింది. అయితే, కొనుగోలు కోసం ఎంత వెచి్చంచినదీ మాత్రం వెల్లడించలేదు.
‘ఐఏఎన్‌ఎస్ నిర్వహణ నియంత్రణ అంతా ఏఎంఎన్‌ఎల్ చేతిలో ఉంటాయి. సంస్థలో డైరెక్టర్లను ఎంపిక చేసే అధికారాలు కూడా ఉంటాయి‘ అని స్టాక్ ఎక్సే్చంజీలకు ఇచ్చిన సమాచారంలో అదానీ ఎంటర్‌ప్రైజెస్ పేర్కొంది. కొనుగోలు అనంతరం ఐఏఎన్‌ఎస్ ఇకపై ఏఎంఎన్‌ఎల్‌కు అనుబంధ సంస్థగా వ్యవహరిస్తుందని వివరించింది. మరోవైపు, ఈ ఏడాది ఫిబ్రవరిలో తాను అనారోగ్యం బారిన పడినప్పుడు సంస్థ ఆర్థిక పరిస్థితులు మారాయని బమ్‌జాయ్ తెలిపారు.
ఈ నేపథ్యంలోనే అదానీ గ్రూప్‌నకు వాటాలు విక్రయించినట్లు పేర్కొన్నారు. కోవిడ్ కష్టకాలంలోనూ వెన్నంటి ఉన్న ఉద్యోగులకు భద్రత కలి్పంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. మెజారిటీ వాటాలు విక్రయించేసినందున ఇకపై సంస్థ రోజువారీ నిర్వహణలో పాల్గొనబోనని పేర్కొన్నారు. ఈ కొనుగోలుతో అదానీ గ్రూప్ ఖాతాలో మొత్తం మూడు మీడియా సంస్థలు (ఎన్‌డీటీవీ, క్వింటిలియన్, ఐఏఎన్‌ఎస్) చేరినట్లయింది.
ఐఏఎన్‌ఎస్ కథ ఇదీ..
ఐఏఎన్‌ఎస్ అనేది ఉత్తర అమెరికాలోని ప్రవాస భారతీయుల అవసరాల కోసం 1986లో ఇండో–ఏíÙయన్ న్యూస్ సర్వీస్‌గా ప్రారంభమైంది. అటు తర్వాత కొన్నాళ్లకు పూర్తిగా భారత్, దక్షిణాసియాపై ప్రధానంగా దృష్టి పెడుతూ పూర్తి స్థాయి వైర్ ఏజెన్సీగా మారింది. గత ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ. 12 కోట్లు, అంతకు ముందు రూ. 9 కోట్ల టర్నోవరు నమోదు చేసింది. సంస్థలో 200 మంది పైచిలుకు ఉద్యోగులు, ప్రపంచవ్యాప్తంగా (ఉత్తర అమెరికా, యూరప్ మొదలైన ప్రాంతాల్లో) 350కి పైగా సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారు. బీక్యూ ప్రైమ్ అనే ఫైనాన్షియల్ న్యూస్ డిజిటల్ ప్లాట్‌ఫాంను నిర్వహించే క్వింటిలియన్ బిజినెస్ మీడియాను కొనుగోలు చేయడం ద్వారా అదానీ గ్రూప్ గతేడాది మీడియా వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఎన్‌డీటీవీలో మెజారిటీ వాటాలు దక్కించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment