బంగ్లాదేశ్‌లోని పరిస్థితులు ఇప్పట్లో సాధారణ స్థితికి వచ్చేలా కనిపించడం లేదు. తాజాగా రాజధాని ఢాకాలోని ఓ మీడియా సంస్థ కార్యాలయంపై గుర్తు తెలియని దుండగులు హాకీ స్టిక్స్, కర్రలతో దాడి చేశారు. అలాగే అక్కడున్న ఓ మహిళా జర్నలిస్టుపై దాడికి పాల్పడ్డారు.
మీడియాకు అందిన సమాచారం ప్రకారం గుంపుగా వచ్చిన దాదాపు 70 మంది బషుంధరా గ్రూప్‌నకు చెందిన ‘ఈస్ట్ వెస్ట్ మీడియా గ్రూప్’ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. అంతటితో ఆగక ఒక మహిళా జర్నలిస్ట్‌పైనా దాడి చేశారు. ఈ ఘటనలో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి.
కాగా ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ కృష్ణ కాన్షియస్‌నెస్ (ఇస్కాన్) బంగ్లాదేశ్ అధికార ప్రతినిధి బృందాన్ని కలిసిన సందర్భంగా బ్రిగేడియర్ జనరల్ (రిటైర్డ్) ఎం సఖావత్ హుస్సేన్ హిందువులకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారని ఢాకా ట్రిబ్యూన్ వార్తాపత్రిక పేర్కొంది. బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వం పడిపోయిన తర్వాత అక్కడి హిందువులు, వారి సంస్థలపై వరుస దాడులు జరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment