Vandalise
-
తలుపు తెరవడం లేదని.. రాళ్లతో బోగీ ధ్వంసం
లక్నో : టికెట్లు కొనుగోలు చేద్దామంటే సమయం లేదు. కూర్చుందామంటే సీటు దొరకడం లేదు. దీంతో కోపోద్రికులైన ప్రయాణికులు రిజర్వేషన్ రైలు బోగీని రాళ్లతో ధ్వంసం చేశారు. అద్దాలను పగుల గొట్టి దౌర్జన్యంగా బోగీలోకి ప్రవేశించారు. ఆ ఘటన సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ట్రైన్ నెంబర్ 15101 అంత్యోదయ ఎక్స్‌ప్రెస్ రైలు బీహార్ రాష్ట్రం సారణ్ జిల్లా ఛప్రా అనే ప్రాంతం నుంచి ముంబైకి వెళ్తుంది. ఆట్రైన్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మంకాపూర్ రైల్వే స్టేషన్‌కు వచ్చింది. ఆ సమయంలో టికెట్ కౌంటర్ వద్ద ఉన్న పలువురు ప్రయాణికులు ఆ ట్రైన్‌ను ఎక్కేందుకు ప్రయత్నించారు. చేతిలో టికెట్ లేదు. ఎక్కేందుకు బోగీ తలుపు తెరుచుకోవడం లేదుదీంతో ట్రైన్‌లోకి దౌర్జన్యంగా వెళ్లేందుకు ప్రయత్నించారు. ముందుగా రిజర్వేషన్ బోగీ మెయిన్ డోర్ అద్దాలు పగుల గొట్టి లోపలికి వెళ్లేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో అదే బోగి కిటికీలను ధ్వంసం చేశారు. పెద్ద పెద్ద బండరాలతో కిటికీ అద్దాలు,కిటికీ ఇనుప కడ్డీ గ్రిల్స్‌ను తొలగించారు. అనంతరం, లోపలికి వెళ్లారు. Angry passengers pelted stones at the coach due to non-opening of the gate of 15101 Antyodaya Express at Mankapur railway station, which broke the glass and caused a stampede in the train, the train was going from Chhapra to Mumbai:pic.twitter.com/Y0N5va5ImS— Ghar Ke Kalesh (@gharkekalesh) December 19, 2024ఈ ఘటన వీడియోలు నెట్టింట్లో చక్కెర్లు కొడుతుండగా.. పలువురు నెటిజన్లు రైల్వే ప్రయాణంలో తమకు ఎదురైన ఇబ్బందుల గురించి ప్రస్తావిస్తున్నారు. మరికొందరు మాత్రం నార్త్ ఇండియాలో ప్రయాణం నరకంతో సమానం. నేను ప్రతి సారి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నా. ఈ ప్రాంతం వైపు చట్టానికి లోబడి ప్రయాణించాలంటే మరో 50 ఏళ్లు పడుతుంది. మరికొందరు బీహార్- జార్ఖండ్ మీదుగా ఏ రైళ్ల రాకపోకల్ని నిలిపివేయాలి. ఎందుకంటే అక్కడి ప్రయాణికులు రైలులో గందరగోళం సృష్టిస్తారు. టికెట్లు కొనుగోలు చేయకుండా ట్రైన్ ఎక్కుతారు. అలాంటి వారి వల్ల తోటి ప్రయాణికుల ఇబ్బంది పడుతుంటారు’ అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
కెనడాలో ఆలయంపై దాడి.. భారత్ తీవ్ర ఆందోళన
ఢిల్లీ: కెనడాలో ఆలయంపై దాడి జరిగిన నేపథ్యంలో అక్కడి భారతీయుల భద్రత గురించి కేంద్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కెనడాలో భారతీయుల భద్రతపై తీవ్ర ఆందోళన చెందుతున్నామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. కెనడాలోని అంటారియో ప్రావిన్స్‌లోని బ్రాంప్టన్‌లోని ఒక హిందూ దేవాలయంలో జరిగిన సంఘటనపై విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు.‘‘ఉగ్రవాదులు, వేర్పాటువాదులు చేస్తున్న హింసాత్మక చర్యలను ఖండిస్తున్నాం. అన్ని ప్రార్థనా స్థలాలకు తగినంత రక్షణ ఉండేలా చూడాలని కెనడాకు పిలుపునిచ్చింది. హింసకు పాల్పడే వారిపై విచారణ జరుగుతుందని కూడా మేం భావిస్తున్నాం. భారత ప్రభుత్వం.. కెనడా దేశంలో భారత పౌరుల భద్రత, భద్రత గురించి తీవ్ర ఆందోళనగా ఉంది. భారతీయ, కెనడియన్ పౌరులకు కాన్సులర్ సేవలను అందించే చర్యలు కొనసాగుతున్నాయి. ఆలయం లోపల సహాయక చర్యలకు శిబిరం నిర్వహించాం’’అని తెలిపారు.చదవండి: హిందూ ఆలయంపై ఖలిస్తానీ మద్దతుదారుల దాడి -
Bangladesh: పత్రికా కార్యాలయం ధ్వంసం.. మహిళా జర్నలిస్టుపై దాడి
బంగ్లాదేశ్‌లోని పరిస్థితులు ఇప్పట్లో సాధారణ స్థితికి వచ్చేలా కనిపించడం లేదు. తాజాగా రాజధాని ఢాకాలోని ఓ మీడియా సంస్థ కార్యాలయంపై గుర్తు తెలియని దుండగులు హాకీ స్టిక్స్, కర్రలతో దాడి చేశారు. అలాగే అక్కడున్న ఓ మహిళా జర్నలిస్టుపై దాడికి పాల్పడ్డారు.మీడియాకు అందిన సమాచారం ప్రకారం గుంపుగా వచ్చిన దాదాపు 70 మంది బషుంధరా గ్రూప్‌నకు చెందిన ‘ఈస్ట్ వెస్ట్ మీడియా గ్రూప్’ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. అంతటితో ఆగక ఒక మహిళా జర్నలిస్ట్‌పైనా దాడి చేశారు. ఈ ఘటనలో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి.కాగా ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్ (ఇస్కాన్) బంగ్లాదేశ్ అధికార ప్రతినిధి బృందాన్ని కలిసిన సందర్భంగా బ్రిగేడియర్ జనరల్ (రిటైర్డ్) ఎం సఖావత్ హుస్సేన్ హిందువులకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారని ఢాకా ట్రిబ్యూన్ వార్తాపత్రిక పేర్కొంది. బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వం పడిపోయిన తర్వాత అక్కడి హిందువులు, వారి సంస్థలపై వరుస దాడులు జరుగుతున్నాయి. -
రోడ్డుపై రెచ్చిపోయిన మాజీ ఐఏఎస్ కూతురు.. క్రికెట్ బ్యాట్‌తో దుకాణాలపై దాడి
-
రెచ్చిపోయిన మాజీ ఐఏఎస్ కూతురు.. రోడ్డుపై క్రికెట్ బ్యాట్‌తో రచ్చ..
లక్నో: నడిరోడ్డుపై ఓ యువతి రెచ్చిపోయి ప్రవర్తించింది. ఇంటి ముందు ఉన్న దుకాణాలపై దాడి చేసింది. పెద్ద కర్రతో అక్కడి వస్తువులను ధ్వంసం చేసింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లక్నోలోని గోమతి నగర్ ప్రాంతంలో స్థానిక వ్యాపారులు దీపావళి సందర్భంగా ఓ కాలనీలోని రోడ్డు మీద పండగ సామాగ్రి అమ్ముకుంటున్నారు. అయితే తన ఇంటి ముందు దుకాణాలు పెట్టుకున్నారని ఓ యువతి ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యాపారులు అక్కడ షాప్‌లు పెట్టవద్దని, వెంటనే తొలగించాలని వారితో వాగ్వాదానికి దిగింది. పండగ వేళ దుకాణాలు పెట్టవద్దని చెప్పినా కూడా వినిపించుకోకుండా షాప్‌లు పెట్టి వస్తువులు అమ్ముకుంటున్నారని వారిపై చిర్రుబుర్రులాడింది. అంతటితో ఆగకుండా పట్టరాని కోపంతో క్రికెట్ బ్యాట్ తీసుకొచ్చి దుకాణాలపై తీవ్రంగా దాడి చేసింది. అమ్మకానికి సిద్ధంగా ఉన్న మట్టి దీపాలు, కుండీలు, ఇతర వస్తువులను కర్రతో పగలకొట్టింది. చదవండి: కొరడాతో కొట్టించుకున్న చత్తీస్‌గఢ్ సీఎం.. ఎందుకంటే? కాగా దాడికి పాల్పడిన యువతి మాజీ ఐఏఎస్ కూతురుగా గుర్తించారు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారడంతో యువతిపై పోలీసులు చర్యలు చేపట్టారు. దుకాణాలు ధ్వంసం చేసినందుకు ఉత్తర ప్రదేశ్ పోలీసులు ఆమెపై 427, 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఒక మాజీ ఐఏఎస్ కూతురు అయి ఉండి ఇలా వీధి వ్యాపారులపై దాడి చేయడం చాలా సిగ్గుచేటు అని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Uttar Pradesh | Police registered a Non-Cognizable Offence against a woman after a video of her went viral on social media in which she can be seen destroying the shops of roadside Diya sellers in Gomti Nagar's Patrakarpuram yesterday. (Screengrabs from viral video) pic.twitter.com/nwuMQ4Vq42 — ANI UP/Uttarakhand (@ANINewsUP) October 25, 2022 అయితే ప్రతి ఏటా ఇక్కడే మార్కెట్ జరుగుతుందని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. దీనిపై దుకాణాదారుడు మాట్లాడుతూ.. ‘మేడమ్ ఉదయం వచ్చి మా దుకాణాలను తొలగించమని అడిగారు. మాకు కొంత సమయం ఇవ్వమని చెప్పాము. వస్తువులను వాహనంలో ఎక్కించుకొని మరో చోటుకు వెళ్తామని చెప్పాము. అయినా ఆమె వినలేదు. దీపాలంకరణ, ఇతర వస్తువలపై నీరు పోశారు. అంతటితో ఆగకుండా బ్యాట్ తీసుకొచ్చి స్టాళ్లను ధ్వంసం చేశారు. అంతా పాడైపోయాయి. ఎవరూ ఆమెకు వ్యతిరేకంగా ఒక్కమాట కూడా మాట్లాడలేదు. ’అని పేర్కొన్నారు. -
ఢిల్లీలో ఒవైసీ ఇంటిపై దాడి
న్యూఢిల్లీ: ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అధికారిక నివాసంపై దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురు హిందూ సేన సభ్యులను మంగళవారం అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు చెప్పారు. ఢిల్లీలోని అశోక రోడ్డులో ఒవైసీ నివాసం ఉంది. ఈ దాడి గురించి సాయంత్రం 5 గంటలకు తమకు సమాచారం అందిందని, వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నామని పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేశామన్నారు. ఈ దాడిలో ఎవరికీ గాయాలు కాలేదని, ఆస్తి నష్టం వాటిల్లలేదని పేర్కొన్నారు. -
ప్రముఖ టీవీ ఛానల్లో ఆయుధాలతో వ్యక్తి హల్చల్
చెన్నె: ప్రముఖ టీవీ ఛానల్ కార్యాలయంలోకి దూరి ఓ వ్యక్తి ఆయుధాలతో హల్చల్ చేశాడు. కత్తి డాలు పట్టుకుని నానా హంగామా సృష్టించాడు. కార్యాలయంలో అద్దాలు, ఫోన్లు, కంప్యూటర్లు ధ్వంసం చేశాడు. దీంతోపాటు సిబ్బందిని పచ్చిబూతులు తిడుతూ బీభత్సం చేశాడు. ఈ సంఘటన తమిళనాడులోని చెన్నెలో చోటుచేసుకుంది. తమిళనాడులో ప్రముఖ ఛానల్ సత్యం టీవీ. రోయపురం కామరాజరర్ రోడ్డులో ఉన్న కార్యాలయంలోకి మంగళవారం సాయంత్రం 6-7 గంటల సమయాన అకస్మాత్తుగా ఓ దుండగుడు వచ్చాడు. కత్తి, డాలు చేతపట్టి కార్యాలయంలోని రిసెప్షన్లో కనిపించిన వాటినన్నింటిని ధ్వంసం చేశాడు. ఫోన్లు, అద్దాలు, కంప్యూటర్లు పగులగొట్టాడు. ఒకటో అంతస్తులోని అకౌంట్స్ డిపార్ట్మెంట్లో హల్చల్ చేశాడు. ఆ దుండగుడు కోయంబత్తూరుకు చెందిన డి.శివకుమార్‌గా గుర్తించారు. దుండగుడి దాడిలో ధ్వంసమైన కార్యాలయంలో సామగ్రి అర్ధగంటపాటు బీభత్సం సృష్టించడంతో ఉద్యోగులంతా భయాందోళనకు గురయ్యారు. అతడిని అతికష్టంగా సెక్యూరిటీ బంధించింది. సమాచారం అందుకున్న రోయపురం పోలీసులు కార్యాలయానికి చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనతో ఆ కార్యాలయం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ దాడిపై సత్యం టీవీ ఎండీ ఇసాక్ లివింగ్స్టన్ స్పందించారు. ‘అతడు ఎవరో తెలియదు. ఎందుకు దాడి చేశాడో కూడా లేదు. మేం ఎవరికీ వ్యక్తిగతంగా విరుద్ధ ప్రసారాలు చేయలేదు.’ అని తెలిపారు. ఈ దాడికి సంబంధించిన సీసీ ఫుటేజీని ఆ ఛానల్ విడుదల చేసింది. శివ కుమార్ కోయంబత్తూర్ నుంచి గుజరాత్‌కు వెళ్లాడు. నిందితుడు గుజరాత్ నంబర్ ప్లేటు ఉన్న కారుతోనే వచ్చాడు. ప్రస్తుతం అతడిని పోలీసులు విచారణ చేపట్టారు. కార్యాలయంపై దాడిని జర్నలిస్ట్ సంఘాలు ఖండించాయి. జర్నలిస్టులు, మీడియా కార్యాలయాలకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా చెన్నె ప్రెస్ క్లబ్ సంయుక్త కార్యదర్శి భారతి తమిళన్ డిమాండ్ చేశారు. -
విధ్వంసం సృష్టించిన సేన సైనికులు, కారణం?
ముంబాయి: శివసేన కార్యకర్తలు బుధవారం మహారాష్ట్రలోని యవత్మల్ జిల్లాలోని ఒక ఎలక్ట్రిక్ షాపులో విధ్వంసం సృష్టించారు. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ఠాక్రేను, నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఛీఫ్ శరద్ పవార్‌ను, కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీని విమర్శించినందుకు శివసేన కార్యకర్తలు షాపును నాశనం చేశారు. సోమవారం సోషల్‌మీడియాలో శివసేనకు వ్యతిరేకంగా పోస్ట్‌లు పెట్టడంతో శివసేన సైనికులు షాపు యజమానిపై ఫిర్యాదు చేశారు. ఇక్కడితో ఆగకుండా బుధవారం అతని షాపును నాశనం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో కొంత మంది పోలీసులు సమక్షంలోనే షాపులోకి ప్రవేశించి అక్కడ ఉన్న వస్తువులను నాశనం చేశారు. (కేరళను ‘సూపర్ స్ప్రెడర్’ గా మారుస్తారా?) బీజేపీకి చెందిన రాజ్యసభ ఎంపీ నారాయణ్ రాణే సోమవారం గవర్నర్‌ను కలిసి రాష్ట్ర ప్రభుత్వానికి కరోనాని కట్టడి చేసే సామర్థ్యం లేదని, ప్రభుత్వ వైఫల్యం వల్లే కరోనా కేసులు రాష్ట్రంలో పెరిగాయని ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో పరిస్థితులు అదుపులోకి రావాలంటే రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్‌ను కోరారు. ఇక మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రాహుల్ గాంధీ మహారాష్ట్రలో కాంగ్రెస్ పోటీలో లేదని చెప్పడంతో ప్రభుత్వ వైఫల్యల నుంచి కాంగ్రెస్ తప్పించుకొని నింద మొత్తం శివసేన మీద వేయడానికి చూస్తోందని ఆరోపించారు. ఇలా పరస్పర ఆరోపణల క్రమంలో మహారాష్ట్ర రాజకీయాలు వేడెక్కెయ్యాయి. సోషల్ మీడియా వేదికగా కూడా ఈ యుద్దం ముదిరి అభిమానులు మహావికాస్‌అఘాడిపై ఆరోపణలు చేస్తూ పోస్ట్ చేశారు. దీంతో శివసేన సైనికులు సదరు వ్యక్తి షాపును ధ్వంసం చేశారు. (లాక్డౌన్ 5.0 : ఆ నగరాలపై ఫోకస్) -
'ఢిల్లీలో రక్తంతో హోలీ ఆడుతున్నారు'
న్యూఢిల్లీ: లోక్‌సభలో ప్రతిపక్షనేత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అధీర్ రంజన్ చౌదరి ఈశాన్య ఢిల్లీలో జరుగుతున్న అల్లర్లపై సభలో చర్చించాలని డిమాండ్ చేశారు. కాగా.. ఈశాన్య ఢిల్లీ అల్లర్లలో ఇప్పటివరకు 47 మంది ప్రాణాలు కోల్పోయారని దీనిపై పార్లమెంటులో వెంటనే చర్చించాలన్నారు. దీనిపై స్పందించిన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ.. హోలీ పండగ తరువాత సభలో చర్చ జరుగుతుందని అన్నారు. కాగా అధీర్ రంజన్ చౌదరి స్పందిస్తూ.. ఇది చాలా తీవ్రమైన విషయమని, చర్చకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా చర్చ నుంచి ప్రభుత్వం పారిపోతోందని, అంతలా ఎందుకు భయపడుతున్నారని అన్నారు. కాగా హోలీ గురించి మీరా మాట్లాడేది.. ఢిల్లీలో రక్తంతో హోలీ ఆడుతున్నారని అధీర్ రంజన్ చౌదరి ఘాటైన విమర్శలు చేశారు. ‘ట్రంప్‌ను సంతోషపెట్టేందుకు నానా తిప్పలు’ కాగా మంగళవారం సాయంత్రం అధీర్ రంజన్ చౌదరి కార్యాలయంపై దాడి జరిగింది. నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు సాయంత్రం 5.30 గంటల సమయంలో ఢిల్లీలోని ఆయన ఇంటి పక్కనే ఉన్న కార్యాలయంలోకి చేరుకొని అక్కడి సిబ్బందిని దూషించారు. అనంతరం తీవ్ర పదజాలంతో దూషిస్తూ.. ఎంపీ చౌదరితో ఫోన్లో మాట్లాడాలని, అయన కాంటాక్ట్ వివరాలు ఇవ్వాలంటూ ఆఫీసు సిబ్బందిని అడిగారు. దీనికి వారు నిరాకరించడంతో కార్యాలయాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ సంఘటనపై అధీర్ రంజన్ చౌదరి ప్రైవేట్ కార్యదర్శి ప్రదీప్టో రాజ్‌పండిట్ ఫిర్యాదు చేయగా, దుండగులను గుర్తించడానికి దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు. అక్కడున్న సీసీటీవీ ఫుటేజీలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. -
ఆ రైళ్లలో ఎల్సీడీ స్ర్కీన్లకు టాటా!
రైల్వే ప్రయాణీకులకు కొత్త అనుభూతిని కలిగించడానికి తేజస్, శతాబ్ది రైళ్లలో ఏర్పాటు చేసిన ఎల్సీడీ స్ర్కీన్లతో రైల్వేశాఖకు కొత్త సమస్య వచ్చిపడింది. ఈ రైళ్లలో ప్రతి ప్రయాణికుడి సీటు ముందు ఏర్పాటు చేసిన ఎల్సీడీ స్ర్కీన్లను ప్రయాణీకులు ధ్వంసం చేయడం, కొంతమంది వాటి హెడ్సెట్లను తీసుకెళ్తున్నారనీ, ఇంకొంతమందైతే ఆ ఎల్సీడీ స్క్రీన్లనే తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారనీ రైల్వే వ్యవస్థ వాపోతోంది. పగిలిన స్ర్కీన్లను మళ్లీ అమర్చాలన్నా, కొత్తవాటిని తీసుకురావాలన్నా వాటికి ఖర్చు ఎక్కువ అవుతోందని అసలు ఎల్సీడీ స్ర్కీన్‌లనే రైల్లోంచి తీసేయాలని రైల్వే యంత్రాంగం ఆలోచిస్తుంది. బొంబాయి నుంచి గోవాకు వెళ్లే ఈ రైళ్లను నడపాలంటే రైల్వేవ్యవస్థ వ్యయప్రయాసలకు గురవుతోందట. -
అర్ధనగ్న పెయింటింగ్స్.. రచ్చరచ్చ
-
అర్ధనగ్న పెయింటింగ్స్.. రచ్చరచ్చ
జైపూర్: రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఏర్పాటుచేసిన చిత్ర ప్రదర్శన రసాభాసగా మారింది. అర్థనగ్న చిత్రాలను ప్రదర్శిస్తున్నారని కొంతమంది వ్యక్తులు దాడికి దిగి రచ్చరచ్చ చేశారు. ఆ పేయింటింగ్స్ వేసిన కళాకారుల్లో ఒకరిపై చేయి కూడా చేసుకున్నారు. కొన్ని చిత్రాలను ఎత్తి కిందపడేసి ధ్వంసం చేశారు. మరో పెయింటింగ్‌ను ఎత్తుకెళ్లారు. గురువారం జైపూర్‌లో కళలపై సదస్సును ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా కొన్ని అర్ధనగ్న చిత్రాలను ప్రదర్శనకు ఉంచారు. దీంతో సభ్యసమాజం సిగ్గుపడేలా అర్థనగ్న చిత్రాలు ప్రదర్శిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాష్ట్రీయ హిందూ ఏక్ తాకు చెందిన కొందరు, లాల్ సేన అనే సంస్థకు చెందిన అధ్యక్షురాలు హేమలత శర్మ ఇంకొందరు దాడికి దిగారు. ఇలాంటివాటికి ఒప్పుకోబోమంటూ ఆందోళన చేశారు. హేమలత చాలా సీరియస్‌గా పెయింటిగ్స్ వేసిన వ్యక్తికి వార్నింగ్ ఇచ్చింది. ఆమె మీడియాతో మాట్లాడుతూ పేయింటింగ్స్ పేరిట, స్వేచ్ఛ పేరిట మహిళల మనోభావాలను దెబ్బ తీస్తున్నారని, బొమ్మలు గీసుకోవాలనుకుంటే ప్రకృతిలో వేరే ఏ అంశాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఇలాంటి వారిని క్షమించరాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాహకులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, పోలీసులు విచారణ ప్రారంభించారు. -
టోల్ ప్లాజా వద్ద రెచ్చిపోయారు..
-
టోల్ ప్లాజా వద్ద రెచ్చిపోయారు..
నోయిడా: ఉత్తరప్రదేశ్ నోయిడాలో దుండగులు రెచ్చిపోయారు. ఓ టోల్ ప్లాజాపై దాడి చేసి బీభత్సం సృష్టించారు. టోల్ గేట్ ట్యాక్స్ చెల్లించమని అడిగినందుకుకొందరు యువకులు టోల్ ప్లాజాలోకి దూసుకొచ్చి అక్కడి కార్యాలయంపై దాడి చేశారు. టోల్ ప్లాజా కార్యాలయ ఉద్యోగులపై దాడి చేసి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ఇదంతా అక్కడి నిఘా కెమెరాలో రికార్డు అయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం వేట ముమ్మరం చేశారు. -
ఫేస్బుక్ కార్యాలయంపై దాడి
లండన్: జర్మనీలో ఫేస్బుక్ కార్యాలయంపై గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. హాంబర్గ్‌లోని ఫేస్బుక్ కార్యాలయంపై దాదాపు 20 మంది దాడి చేసి అద్దాలు పగలగొట్టి, పెయింట్ చల్లారు. కార్యాలయం ప్రవేశద్వారం వద్ద 'ఫేస్బుక్ డిజ్లైక్' అని రాసినట్టు జర్మన్ మీడియా వెల్లడించింది. దాడి చేసిన దుండగులు నల్లటి దుస్తులు, ముసుగులు ధరించినట్టు హాంబర్గ్ పోలీసులు చెప్పారు. ఫేస్బుక్లో పోస్ట్ చేస్తున్న జాతి వివక్ష వ్యాఖ్యల వల్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయని జర్మనీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఫేస్బుక్లో పోస్ట్ చేసిన జాతిని రెచ్చగొట్టే ప్రసంగాలను తొలగించడంలో విఫలమైనందుకు ఫేస్బుక్ యూరప్ విభాగం చీఫ్ జర్మనీలో విచారణ ఎదుర్కొంటున్నారు. కాగా జర్మనీ చట్టాలను తాము ఉల్లంఘించలేదని ఫేస్బుక్ ప్రతినిధి చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ చేస్తున్నారు. -
'క్షమాపణ ఎందుకు? చెప్పనుగాక చెప్పను'
-
'క్షమాపణ ఎందుకు? చెప్పనుగాక చెప్పను'
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని ఓ టోల్ ప్లాజా వద్ద నానా భీభత్సం చేసిన బీజేపీ ఎమ్మెల్యే ఆ ఘటనకు సంబంధించి క్షమాపణ చెప్పనుగాక చెప్పను అని చెప్పారు. పైగా ఆయన దాడి చేసిన వ్యక్తులపైనే తిరిగి కేసు పెట్టారు. సోమవారం సాయంత్రం బీజేపీ ఎమ్మెల్యే కాలు సింగ్ ఠాకూర్‌ను భోపాల్‌లోని ఓ టోల్ ప్లాజా వద్ద టోల్ నిర్వహకులు ఆపారు. టోల్ చెల్లించాలని అడిగారు. దీంతో ఆగ్రహానికి లోనైన ఎమ్మెల్యే, ఆయన అనుచరులు కలిసి టోల్ ప్లాజా సిబ్బందిపై దాడికి దిగారు. స్వయంగా ఎమ్మెల్యే ఒక రాయి తీసుకొని విసిరేసి అనంతరం కర్రతో కొట్టాడు. ఇదంతా కూడా అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. ఈ ఘటనపై ఆయన క్షమాపణ చెప్పేందుకు నిరాకరించాడు. తాను ఎమ్మెల్యేనైనందున టోల్ కట్టాల్సిన పనిలేదని, కొట్టినందుకు క్షమాపణ చెప్పనవసరం లేదని అన్నారు. దాడి చేసిన వ్యక్తులపైనే కేసు పెట్టడంతో పోలీసులు ఆ ఫిర్యాదును స్వీకరించారు.