
'క్షమాపణ ఎందుకు? చెప్పనుగాక చెప్పను'
భోపాల్: మధ్యప్రదేశ్లోని ఓ టోల్ ప్లాజా వద్ద నానా భీభత్సం చేసిన బీజేపీ ఎమ్మెల్యే ఆ ఘటనకు సంబంధించి క్షమాపణ చెప్పనుగాక చెప్పను అని చెప్పారు. పైగా ఆయన దాడి చేసిన వ్యక్తులపైనే తిరిగి కేసు పెట్టారు. సోమవారం సాయంత్రం బీజేపీ ఎమ్మెల్యే కాలు సింగ్ ఠాకూర్ను భోపాల్లోని ఓ టోల్ ప్లాజా వద్ద టోల్ నిర్వహకులు ఆపారు. టోల్ చెల్లించాలని అడిగారు.
దీంతో ఆగ్రహానికి లోనైన ఎమ్మెల్యే, ఆయన అనుచరులు కలిసి టోల్ ప్లాజా సిబ్బందిపై దాడికి దిగారు. స్వయంగా ఎమ్మెల్యే ఒక రాయి తీసుకొని విసిరేసి అనంతరం కర్రతో కొట్టాడు. ఇదంతా కూడా అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. ఈ ఘటనపై ఆయన క్షమాపణ చెప్పేందుకు నిరాకరించాడు. తాను ఎమ్మెల్యేనైనందున టోల్ కట్టాల్సిన పనిలేదని, కొట్టినందుకు క్షమాపణ చెప్పనవసరం లేదని అన్నారు. దాడి చేసిన వ్యక్తులపైనే కేసు పెట్టడంతో పోలీసులు ఆ ఫిర్యాదును స్వీకరించారు.