
బీజేపీకి కిరణ్ బేడీ క్షమాపణలు
బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ బీజేపీ అధినాయకత్వానికి క్షమాపణ చెప్పారు.
న్యూఢిల్లీ: బీజేపీ ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు క్షమాపణలు చెప్పారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి తానే పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు తెలిపారు. పార్టీ నాయకత్వం నాపై నమ్మకముంచినందుకు కృతజ్ణతలని ఆమె ఉద్వేగంగా పేర్కొన్నారు. బీజేపీ కంచుకోటైన కృష్ణా నగర్ నియోజకవర్గంలో ఆమె ఆప్ అభ్యర్థి చేతిలో ఘోరపరాజయాన్ని చవిచూశారు.