kiranbedi
-
కిరణ్‌బేడీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన డీఎంకే నేత
సాక్షి ప్రతినిధి, చెన్నై: లోక్‌సభ ఎన్నికల సందర్భంగా డీఎంకే ప్రచారార్భాటాలు ఎలా ఉన్నా మహిళలపై ఆ పార్టీ నేతల వ్యంగ్యపూర్తి వ్యాఖ్యలు వివాదాలకు దారితీస్తున్నాయి. తాజాగా డీఎంకే అధికార ప్రతినిధి నాంజిల్ సంపత్ గురువారం పుదుచ్చేరీ గవర్నర్ కిరణ్‌బేడీపై వ్యంగ్యాస్త్రాలు సంధించి వివాదానికి తెరదీశారు. ఇటీవల డీఎంకే, డీఎండీకే వర్గాల ఘర్షణ నేపథ్యంలో డీఎంకే కోశాధికారి దురైమురుగన్ డీఎండీకే కోశాధికారి ప్రేమలతపై పరుషమైన వ్యాఖ్యలు చేయడం, ఆ విషయాన్ని మీడియా సమావేశంలో ప్రస్తావించిన మీడియా ప్రతినిధులపై ప్రేమలత ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఆ తరువాత డీఎంకే నేత, నటుడు రాధారవి నటి నయనతారను కించపరుస్తూ వ్యాఖ్యానాలు చేసి అప్రతిష్టపాలయ్యారు. రాధారవి మాటలు పార్టీకి నష్టదాయకమని భావించిన డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. నయనతార వివాదం పూర్తిగా సద్దుమణిగేలోపు డీఎంకే సీనియర్ నేత నాంజిల్ సంపత్ పుదుచ్చేరి గవర్నర్ కిరణ్‌బేడీపై మరో వివాదాస్పద బాంబు పేల్చారు. డీఎంకే, అన్నాడీఎంకే, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం పార్టీలను మార్చి ఇక రాజకీయాలు వద్దుబాబోయ్ అంటూ ప్రకటించారు. అయితే ఎన్నికల తరుణంలో మరలా మనసు మార్చుకుని డీఎంకే కోసం వేదికలు ఎక్కుతా అంటూ పార్టీ ఫ్రీలాన్స్ అధికార ప్రతినిధిగా రంగంలోకి దిగారు. ఇదిలా ఉండగా, గురువారం పుదుచ్చేరీలో ఎన్నికల ప్రచారం చేస్తూ, దేశంలో 22 రాష్ట్రాలకు బీజేపీ గవర్నర్లు ఉన్నారు, ఇక్కడ (పుదుచ్చేరీ) కూడా ఒక అమ్మ కిరణ్‌బేడీ గవర్నర్‌గా ఉన్నారు. అయితే కిరణ్‌బేడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగక ‘మీరు ప్రజల చేత ఎన్నుకోబడ్డారా అంటూ ప్రశ్నించి కలకలం రేపారు. డీఎంకే నేతలు మహిళలపై ఇలా వరుస వ్యాఖ్యానాలకు తావివ్వడం ఆ పార్టీ అధ్యక్షుడు స్టాలిన్‌కు తలనొప్పిగా మారిందనడంలోనూ, సహించరనడంలోనూ సందేహం లేదు. రాధారవిని వెంటనే సస్పెండ్ చేసిన స్టాలిన్ తాజా పరిణామాల నేపథ్యంలో నాంజిల్ సంపత్‌పై ఎలాంటి క్రమశిక్షణ తీసుకుంటారోనని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. -
స్త్రీలోక సంచారం
ఫిఫా వరల్డ్ కప్‌లో ఫ్రాన్స్ గెలుపుపై ఆనందం వ్యక్తం చేస్తూ పుదుచ్చేరి గవర్నర్ కిరణ్ బేడీ ‘వియ్ వన్’ అని ట్వీట్ చెయ్యడంతో సోషల్ మీడియాలో పెద్ద దుమారం చెలరేగుతోంది. ‘పుదుచ్చేరి సోదరసోదరీమణులకు అభినందనలు. మనం గెలిచాం. గ్రామాల మధ్య, పట్టణాల మధ్య, నగరాల మధ్య ఫుట్‌బాల్ టోర్నమెంట్లను నిర్వహించడం ద్వారా మన కేంద్రపాలిత ప్రాంతంలో ఫుట్‌బాల్ స్పిరిట్‌ను నింపవచ్చు. సమైక్యంగా ఉండడానికి ఒక్క బంతి చాలు’ అని మొదట ట్వీట్ చేసిన బేడీ, తర్వాతి ట్వీట్లో.. ‘మన పుదుచ్చేరీలం (ఒకప్పటి ఫ్రెంచి భూభాగం) ప్రపంచ కప్పును గెలిచాం’ అని పోస్ట్ చెయ్యడంతో దానినొక వేళాకోళంగా భావించిన వారు ఆమెపై నెట్లో నిరవధికంగా విమర్శలు గుప్పిస్తున్నారు. హరియాణాలో మున్సిపల్ సమావేశాలకు మహిళా కౌన్సెలర్లు తరచు గైర్హాజరవుతూ, తమ ప్రతినిధులుగా భర్తలను, బంధువులను పంపడంపై రాష్ట్ర స్థానిక సంస్థల మంత్రి కవితాజైన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయాలలో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచడం ద్వారా ప్రజలకు మెరుగైన పాలన అందివ్వాలని కేంద్ర ప్రభుత్వం ఒక వైపున ప్రయత్నిస్తుంటే, ఎన్నికైన మహిళా ప్రతినిధులు కనీసం సమావేశాలకు హాజరుకాకపోవడం విచారకరమని అంటూ, ఇక మీదట మహిళా కౌన్సెలర్లు వరుసగా మూడు సమావేశాలకు గైర్హాజరైతే వారిని తొలగించడం జరుగుతుందని ఆమె తెలిపారు ::: మహిళా సంక్షేమాన్ని, సాధికారతను సాధించకుండా సామాజిక అభివృద్ధిని కనీసం ఊహించను కూడా ఊహించలేమని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ అన్నారు. మహిళా చట్టాలపై రాష్ట్ర మహిళా కమిషన్ ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి అవగాహన కార్యక్రమానికి హాజరైన జైరామ్.. మహిళలపై జరుగుతున్న నేరాలకు అడ్డుకట్టు వేసేందుకు ఎన్ని చట్టాలను తెస్తున్నా జరగవలసింది ఇంకా ఎంతో ఉందనీ, మొదటైతే మహిళలు తమకున్న హక్కులు, చట్టాల గురించి తెలుసుకుని ఉండాలని అన్నారు ‘మీరింకా సినిమాల్లోకి రాకముందు, అంత చిన్న వయసులోనే తొందరపడి మీరు గౌరీని ఎందుకు పెళ్లి చేసుకున్నారని సోషల్ మీడియాలో ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది! ‘భాయ్.. ప్రేమ, అదృష్టం ఎప్పుడైనా రావచ్చు. కానీ గౌరీతో పాటు ఆ రెండూ ఒకేసారి నా జీవితంలోకి వచ్చేశాయి’ అని షారుక్ జవాబు చెప్పారు ::: బాలీవుడ్ తారలు దీపికా పదుకోన్, కత్రీనా కైఫ్‌ల మధ్య.. దీపిక పూర్వపు బాయ్‌ఫ్రెండ్ రణబీర్ కపూర్ విషయంలో ‘ఇంకా కొనసాగుతూనే ఉంది’ అనుకుంటున్న ఏళ్లనాటి శత్రుత్వం.. (జూలై 16న కత్రీనా బర్త్‌డే ఇన్స్టాగ్రామ్ ఫొటోకు దీపిక పెట్టిన ‘ఫీల్‌గుడ్’ కామెంట్‌తో) సమసిపోయిందని ఇద్దరి అభిమానులు ఆనందిస్తున్నారు. ఆ ఇన్స్టాగ్రామ్ ఫొటోలో కత్రీనా తన 21 ఏళ్ల వయసు నాటి ఫొటోను పెట్టి, ట్వంటీ వన్ ప్లస్ మరికొన్ని సంవత్సరాలు.. క్రెడిట్ మై మామ్’ అని పెట్టిన పోస్టుకు స్పందనగా.. ‘హ్యాపీ బర్త్‌డే! విషింగ్ యు గుడ్ హెల్త్ అండ్ హ్యాపీనెస్ ఆల్వేస్..’ అని కామెంట్ పెట్టడంతో పాటు ఒక హార్ట్ సింబల్‌ను కూడా దీపిక ఇన్సర్ట్ చేశారు. -
ఒకే వేదికపై ఆ ఇద్దరు
సాక్షి, చెన్నై : ఆరు నెలల అనంతరం లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి, పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి ఒకే వేదిక మీదకు వచ్చారు. ఇకనైనా వివాదాల్ని వీడి పుదుచ్చేరి ప్రగతికి ఈ ఇద్దరు సమిష్టిగా పనిచేస్తారన్న ఎదురుచూపులు పెరిగాయి. పుదుచ్చేరిలో నారాయణస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి పక్కలో బల్లెంగా లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి మారిన విషయం తెలిసిందే. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే రీతిలో కిరణ్, ఆమె ప్రయత్నాల్ని తిప్పికొట్టే విధంగా సీఎం ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ కాలం నెట్టుకు వచ్చారు. తమ పథకాల్ని అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ, ప్రజల్ని పాలకులు రెచ్చగొట్టిన సందర్భాలు అనేకం. కిరణ్ అడ్డుకునే విధంగా ఆమె పర్యటనల్లో ప్రజల్లో వ్యతిరేకత సాగడం ఇందుకు నిదర్శనం. ఆరు నెలలుగా ఈ ఇద్దరి మధ్య సాగుతూ వచ్చిన సమరం, తాజాగా సమసినట్టేనా అన్న ప్రశ్న బయలు దేరింది. ఆరు నెలలుగా సీఎం నిర్ణయాల్ని గవర్నర్, గవర్నర్ నిర్ణయాల్ని సీఎంవ్యతిరేకించడం, అడ్డు పడడం వంటి చర్యలు సాగాయి. అలాగే, ప్రభుత్వ వేడుకల్లో ఈ ఇద్దరు ఒకే వేదిక మీదకు సైతం రాలేదు. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగిన మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలో, బుధవారం జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలోనూ ఈ ఇద్దరు ఒకే వేదిక మీద ప్రత్యక్షం కావడం విశేషం. ఈ ఇద్దరి మధ్య విభేదాలు ఇకనైనా సమసినట్టేనా అన్న ప్రశ్న బయలు దేరింది. వేదిక మీద ఈ ఇద్దరు అందర్నీ ఆకర్షించే రీతిలో కనిపించడంతో, ఇక సమష్టిగా పుదుచ్చేరి ప్రగతికి శ్రమిస్తారా లేదా, విభేదాలతో కాలం మరింతగా నెట్టుకు వస్తారా అన్నది వేచి చూడాల్సిందే. -
స్వచ్ఛ యానాం అందరి బాధ్యత
ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో మెలగాలి డిజిటల్ ఇండియాకు సహకరించాలి పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీ పిలుపు తాళ్లరేవు : పౌరులు క్రమశిక్షణ అలవర్చుకోవడం ద్వారా బాధ్యతాయుత సమాజం ఏర్పడుతుందని, ఆ దిశగా ప్రతి ఒక్కరూ ఆలోచించాలని, స్వచ్ఛ యానాం కోసం కృషి చేయాలని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీ అన్నారు. మూడు రోజులుగా జరుగుతున్న యానాం 15వ ప్రజా ఉత్సవాలు, 18వ ఫల, పుష్ప ప్రదర్శనలు ఆదివారం ముగిశాయి. ముగింపు వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న కిరణ్‌బేడీ మాట్లాడుతూ, స్వచ్ఛ యానాం కేవలం పారిశుద్ధ్య కార్మికులతోనే సాధ్యం కాదన్నారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటిస్తేనే ఇది సాధ్యమన్నారు. ప్రతి ఒక్కరూ డస్ట్‌బి¯ŒSలు వాడడం నేర్చుకోవాలని, అవి లభ్యం కాకపోతే సీఎస్ఆర్, స్వచ్ఛంద సంస్థల నుంచి సేకరించుకోవాలని సూచించారు. పుదుచ్చేరికంటే యానాంలో ప్రస్తుతం మెరుగైన పరిస్థితి ఉన్నప్పటికీ స్వచ్ఛ యానాం సంకల్పంతో ముందుకెళ్తే మరిన్ని మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. స్వచ్ఛ యానాం ఏర్పడిన తరువాత తాను ఏప్రిల్, మే నెలల్లో మరోమారు వస్తానన్నారు. లక్ష్య సాధనకు కృషి చేసినవారిని స్వయంగా సత్కరిస్తానన్నారు. పుదుచ్చేరిని పరిశుభ్రంగా ఉంచడానికి ఏడు నెలలుగా ఎంతో ప్రయత్నిస్తున్నా, ఇంతవరకూ సాధ్యపడలేదని అన్నారు. డిజిటల్ ఇండియా కార్యక్రమం ఏదో ఒక పార్టీకి సంబంధించింది కాదని, జాతీయ విధానమని అన్నారు. అందరూ నగదు రహిత సమాజానికి కృషి చేయాలన్నారు. పాండిచ్చేరిలో ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉందని, తెచ్చిన అప్పులకు వడ్డీ చెల్లించడానికి మళ్లీ అప్పు తేవాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. అవసరానికి మించి ఉద్యోగ నియామకాలు చేపట్టడం, సంక్షేమ పథకాలను దుర్వినియోగం చేయడమే ఇందుకు ప్రధాన కారణమన్నారు. ఖర్చు తగ్గించుకోవాల్సిన విషయాన్ని సీఎం నారాయణసామి, మంత్రులు పరిగణనలోకి తీసుకోవాలన్నారు. యానాంలో మత్స్యకారులు అధికంగా ఉన్నందున మత్స్య కళాశాల ప్రారంభానికి చర్యలు తీసుకుంటానన్నారు. రూ.97 కోట్లతో టూరిజం ప్రాజెక్టులు : మంత్రి మల్లాడి రానున్న రోజుల్లో యానాంను పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి సుమారు రూ.97 కోట్లతో వివిధ ప్రాజెక్టులు సిద్ధం చేసినట్లు ఆరోగ్య మంత్రి మల్లాడి కృష్ణారావు చెప్పారు. ట్రిపుల్ ఐటీ స్థాపనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం యానాంలోని సుమారు 15 పరిశ్రమలు వేరే ప్రాంతానికి తరలిపోవడంతో ఉపాధి దెబ్బతిందన్నారు. దీనిపై ఇక్కడి ప్రజల తరఫున ప్రధానికి వినతిపత్రం అందజేశామన్నారు. యానాంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ స్థాపించి, 300 మందికి ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి డ్వాక్రా సంఘాలకు పావలా వడ్డీకే రుణాలు మొదలుపెట్టారని, ఆయన స్ఫూర్తితో 2010లో యానాంలో కూడా దీనిని ఆరంభించామన్నారు. జీఎస్పీసీ నుంచి రూ.12 కోట్లు రావాల్సి ఉండగా, రూ.10 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. మిగతా సొమ్ము ఇప్పించేలా కృషి చేయాలన్నారు. యానాం మున్సిపాలిటీ తీవ్ర లోటు బడ్జెట్‌తో ఉందని, రిటైరైన 15 మందికి బెనిఫిట్స్ అందించలేని పరిస్థితి నెలకొందని చెప్పారు. పోలీసు అధికారికి తొలి అవకాశం ప్రజా ఉత్సవాల ముగింపు వేడుకల్లో తొలిగా ప్రసంగించే అవకాశాన్ని పోలీసు శాఖకు ఇవ్వాలని కిరణ్‌బేడీ కోరడంతో యానాం ఎస్పీ నితి¯ŒS గోహల్ మొదట ప్రసంగించారు. యానాంలో 4 అంచెల బీట్ సిస్టమ్ సత్ఫలితాలు ఇస్తోందన్నారు. అనంతరం కిరణ్‌బేడీని మంత్రి మల్లాడి ఘనంగా సత్కరించి, జ్ఞాపిక అందజేసారు. తొలుత సత్కారానికి నిరాకరించిన ఆమె చివరికి అందరి కోరిక మేరకు అంగీకరించారు. అంతకుముందు ఆమె బాలయోగి స్టేడియంలో ఏర్పాటు చేసిన ఫల, పుష్ప ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. సెంటర్ ఆఫ్ అట్రాక్ష¯ŒSగా ఉన్న పుష్పక విమానాన్ని పరిశీలించి ఆనందం వ్యక్తం చేశారు. పలు అంశాలను ఆమె తన సెల్ఫో¯ŒSలో బంధించారు. ముగింపు వేడుకల్లో సినీ నేపథ్య గాయకులు గీతామాధురి తదితరులు ఆలపించిన పాటలతో యువతీ యువకులు ఉత్సాహంతో కేరింతలు కొట్టారు. కాగా, వైఎస్సార్ బొటానికల్ గార్డె¯ŒSలో రూ.82 లక్షలతో 16 అడుగుల ఎత్తు, 8.50 టన్నుల బరువుతో రూపొందించిన మహాత్మాగాంధీ కాంస్య విగ్రహాన్ని కిరణ్‌బేడి, మంత్రి మల్లాడి ఆవిష్కరించారు. యానాంలోని పలు ప్రాంతాల్లో ఆమె పర్యటించి, అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. -
''అభిమన్యుడు కాదు అర్జునుడైయాడు''
-
బీజేపీకి కిరణ్ బేడీ క్షమాపణలు
న్యూఢిల్లీ: బీజేపీ ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు క్షమాపణలు చెప్పారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి తానే పూర్తి బాధ్యత వహిస్తున్నట్లు తెలిపారు. పార్టీ నాయకత్వం నాపై నమ్మకముంచినందుకు కృతజ్ణతలని ఆమె ఉద్వేగంగా పేర్కొన్నారు. బీజేపీ కంచుకోటైన కృష్ణా నగర్ నియోజకవర్గంలో ఆమె ఆప్ అభ్యర్థి చేతిలో ఘోరపరాజయాన్ని చవిచూశారు. -
హస్తినలో పాగాకు బీజేపీ గట్టి ప్లానే వేసింది..
న్యూఢిల్లీ : క్లీన్ ఇమేజ్‌తో మరోసారి ఢిల్లీ పీఠం ఎక్కాలనుకుంటున్న కేజ్రీవాల్‌ను ఎదుర్కోడానికి బీజేపీ గట్టిప్లానే వేసింది. సామాన్యుడిగా రాజకీయాల్లో సంచలనం సృష్టించిన అరవింద్ కేజ్రీవాల్‌కు పోటీగా కమలనాధులు... కిరణ్‌బేడీని సిద్ధం చేశారు. గురువారం పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా ఆధ్వర్యంలో కాషాయతీర్థం పుచ్చుకున్న ఈ ఐపిఎస్ అధికారి ఇప్పుడు... ఢిల్లీలో బీజేపీ ఇమేజ్ను పూర్తిగా మార్చేసే అవకాశాలున్నాయి. ప్రధానంగా రాజకీయాల్లో క్లీన్ ఇమేజ్ అంటే తమదే అనే ఆమ్ ఆద్మీ పార్టీకి... ఇప్పుడు కిరణ్‌బేడీ గట్టిపోటి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. నలభై ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉన్న కిరణ్‌బేడీకి... నిజాయితీ పరురాలు అనే ఇమేజ్ ఉంది. దాదాపు 35 ఏళ్లపాటు ఐపీఎస్ ఆఫీసర్‌గా ఉన్న బేడీని... బీజేపీ ఢిల్లీ ఎన్నికల్లో విస్తృతంగా వినియోగించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
బీజేపీలో చేరిన కిరణ్ బేడీ
న్యూఢిల్లీ : మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ చేరికతో బీజేపీకి మరింత బలం పెరిగిందని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా వెల్లడించారు. న్యూఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. ఢిల్లీ సీఎం ఎవరనేది పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుందని తెలిపారు. గురువారం న్యూఢిల్లీలో అమిత్ షా సమక్షంలో కిరణ్ బేడీ కాషాయం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కిరణ్ బేడీ మాట్లాడుతూ... మోదీ పాలన తనలో స్పూర్తి నింపిదని ఆమె తెలిపారు. తానేప్పుడు పదవుల కోసం పని చేయడం లేదని ... తన జీవితం దేశానికే అంకితమని ఆమె స్పష్టం చేశారు. పోలీసు శాఖలో ఉన్నతాధికారిగా తన 40 ఏళ్ల అనుభవాన్ని ఢిల్లీ ప్రజలకు అర్పించేందుకే వచ్చానని కిరణ్‌బేడీ ఈ సందర్భంగా వెల్లడించారు.