స్వచ్ఛ యానాం అందరి బాధ్యత | swatcha yanam | Sakshi
Sakshi News home page

స్వచ్ఛ యానాం అందరి బాధ్యత

Published Sun, Jan 8 2017 11:47 PM | Last Updated on Tue, Sep 5 2017 12:45 AM

స్వచ్ఛ యానాం అందరి బాధ్యత

స్వచ్ఛ యానాం అందరి బాధ్యత

  • ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో మెలగాలి
  • డిజిటల్‌ ఇండియాకు సహకరించాలి
  • పుదుచ్చేరి లెఫ్టినెంట్‌
  • గవర్నర్‌ కిరణ్‌బేడీ పిలుపు
  • తాళ్లరేవు :
    పౌరులు క్రమశిక్షణ అలవర్చుకోవడం ద్వారా బాధ్యతాయుత సమాజం ఏర్పడుతుందని, ఆ దిశగా ప్రతి ఒక్కరూ ఆలోచించాలని, స్వచ్ఛ యానాం కోసం కృషి చేయాలని పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌బేడీ అన్నారు. మూడు రోజులుగా జరుగుతున్న యానాం 15వ ప్రజా ఉత్సవాలు, 18వ ఫల, పుష్ప ప్రదర్శనలు ఆదివారం ముగిశాయి. ముగింపు వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న కిరణ్‌బేడీ మాట్లాడుతూ, స్వచ్ఛ యానాం కేవలం పారిశుద్ధ్య కార్మికులతోనే సాధ్యం కాదన్నారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటిస్తేనే ఇది సాధ్యమన్నారు. ప్రతి ఒక్కరూ డస్ట్‌బి¯ŒSలు వాడడం నేర్చుకోవాలని, అవి లభ్యం కాకపోతే సీఎస్‌ఆర్, స్వచ్ఛంద సంస్థల నుంచి సేకరించుకోవాలని సూచించారు. పుదుచ్చేరికంటే యానాంలో ప్రస్తుతం మెరుగైన పరిస్థితి ఉన్నప్పటికీ స్వచ్ఛ యానాం సంకల్పంతో ముందుకెళ్తే మరిన్ని మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. స్వచ్ఛ యానాం ఏర్పడిన తరువాత తాను ఏప్రిల్, మే నెలల్లో మరోమారు వస్తానన్నారు. లక్ష్య సాధనకు కృషి చేసినవారిని స్వయంగా సత్కరిస్తానన్నారు. పుదుచ్చేరిని పరిశుభ్రంగా ఉంచడానికి ఏడు నెలలుగా ఎంతో ప్రయత్నిస్తున్నా, ఇంతవరకూ సాధ్యపడలేదని అన్నారు. డిజిటల్‌ ఇండియా కార్యక్రమం ఏదో ఒక పార్టీకి సంబంధించింది కాదని, జాతీయ విధానమని అన్నారు. అందరూ నగదు రహిత సమాజానికి కృషి చేయాలన్నారు. పాండిచ్చేరిలో ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉందని, తెచ్చిన అప్పులకు వడ్డీ చెల్లించడానికి మళ్లీ అప్పు తేవాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. అవసరానికి మించి ఉద్యోగ నియామకాలు చేపట్టడం, సంక్షేమ పథకాలను దుర్వినియోగం చేయడమే ఇందుకు ప్రధాన కారణమన్నారు. ఖర్చు తగ్గించుకోవాల్సిన విషయాన్ని సీఎం నారాయణసామి, మంత్రులు పరిగణనలోకి తీసుకోవాలన్నారు. యానాంలో మత్స్యకారులు అధికంగా ఉన్నందున మత్స్య కళాశాల ప్రారంభానికి చర్యలు తీసుకుంటానన్నారు.
     
    రూ.97 కోట్లతో టూరిజం ప్రాజెక్టులు : మంత్రి మల్లాడి
    రానున్న రోజుల్లో యానాంను పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి సుమారు రూ.97 కోట్లతో వివిధ ప్రాజెక్టులు సిద్ధం చేసినట్లు ఆరోగ్య మంత్రి మల్లాడి కృష్ణారావు చెప్పారు. ట్రిపుల్‌ ఐటీ స్థాపనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన అనంతరం యానాంలోని సుమారు 15 పరిశ్రమలు వేరే ప్రాంతానికి తరలిపోవడంతో ఉపాధి దెబ్బతిందన్నారు. దీనిపై ఇక్కడి ప్రజల తరఫున ప్రధానికి వినతిపత్రం అందజేశామన్నారు. యానాంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమ స్థాపించి, 300 మందికి ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి డ్వాక్రా సంఘాలకు పావలా వడ్డీకే రుణాలు మొదలుపెట్టారని, ఆయన స్ఫూర్తితో 2010లో యానాంలో కూడా దీనిని ఆరంభించామన్నారు. జీఎస్‌పీసీ నుంచి రూ.12 కోట్లు రావాల్సి ఉండగా, రూ.10 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. మిగతా సొమ్ము ఇప్పించేలా కృషి చేయాలన్నారు. యానాం మున్సిపాలిటీ తీవ్ర లోటు బడ్జెట్‌తో ఉందని, రిటైరైన 15 మందికి బెనిఫిట్స్‌ అందించలేని పరిస్థితి నెలకొందని చెప్పారు.
    పోలీసు అధికారికి తొలి అవకాశం
    ప్రజా ఉత్సవాల ముగింపు వేడుకల్లో తొలిగా ప్రసంగించే అవకాశాన్ని పోలీసు శాఖకు ఇవ్వాలని కిరణ్‌బేడీ కోరడంతో యానాం ఎస్పీ నితి¯ŒS గోహల్‌ మొదట ప్రసంగించారు. యానాంలో 4 అంచెల బీట్‌ సిస్టమ్‌ సత్ఫలితాలు ఇస్తోందన్నారు. అనంతరం కిరణ్‌బేడీని మంత్రి మల్లాడి ఘనంగా సత్కరించి, జ్ఞాపిక అందజేసారు. తొలుత సత్కారానికి నిరాకరించిన ఆమె చివరికి అందరి కోరిక మేరకు అంగీకరించారు. అంతకుముందు ఆమె బాలయోగి స్టేడియంలో ఏర్పాటు చేసిన ఫల, పుష్ప ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్ష¯ŒSగా ఉన్న పుష్పక విమానాన్ని పరిశీలించి ఆనందం వ్యక్తం చేశారు. పలు అంశాలను ఆమె తన సెల్‌ఫో¯ŒSలో బంధించారు. ముగింపు వేడుకల్లో సినీ నేపథ్య గాయకులు గీతామాధురి తదితరులు ఆలపించిన పాటలతో యువతీ యువకులు ఉత్సాహంతో కేరింతలు కొట్టారు. కాగా, వైఎస్సార్‌ బొటానికల్‌ గార్డె¯ŒSలో రూ.82 లక్షలతో 16 అడుగుల ఎత్తు, 8.50 టన్నుల బరువుతో రూపొందించిన మహాత్మాగాంధీ కాంస్య విగ్రహాన్ని కిరణ్‌బేడి, మంత్రి మల్లాడి ఆవిష్కరించారు. యానాంలోని పలు ప్రాంతాల్లో ఆమె పర్యటించి, అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. 
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement