గవర్నర్‌తో సీతక్క భేటీ.. కీలక బిల్లులు ఆమోదించాలని విజ్ఞప్తి | Minister Seethakka Meets Telangana Governor In Raj Bhavan Hyderabad, Watch Video Inside | Sakshi
Sakshi News home page

గవర్నర్‌తో సీతక్క భేటీ.. కీలక బిల్లులు ఆమోదించాలని విజ్ఞప్తి

Published Tue, Sep 24 2024 11:36 AM | Last Updated on Tue, Sep 24 2024 3:15 PM

minister seethakka meets telangana governor in raj bhavan hyderabad

హైదరాబాద్‌, సాక్షి: తెలంగాణ గవర్నర్‌ జిష్ణు దేవ్‌ వర్మతో ఇవాళ (మంగళవారం) తెలంగాణ మంత్రి సీతక్క రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఇరువురు చర్చించారు. గవర్నర్‌తో భేటీ అనంతరం మంత్రి సీతక్క​ మీడియాతో మాట్లాడారు. 

‘‘ 2022లో ములుగును మున్సిపాలిటీగా గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బిల్లుకు ఆమోదం తెలిపి గవర్నర్‌కు పంపింది. రెండు సంవ‌త్స‌రాలుగా పెండింగ్‌లోనే ములుగు మున్సిపాలిటి అంశం ఉంది. ములుగు మున్సిపాలిటీ బిల్లుతో పాటు మరో ఐదు బిల్లుకు ఆమోదం తెలుపాలని ఈ సందర్భంగా గవర్నర్‌కు విజ్ఞత్తి చేశాం. అదిలాబాద్ అంశాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళి విషయాన్ని తెలియజేసాం. 

అదిలాబాద్, నాగర్ కర్నూల్ చెంచు ప్రాంతాల్లో పర్యటించాలని గవర్నర్‌ను కొరాం. గవర్నర్‌ ములుగులో ఓ గ్రామాన్ని దత్తత తీసుకునే ఆలోచనలో ఉన్నారు. దత్తత గ్రామాల లిస్ట్ గవర్నర్‌కు పంపాం, అదిలాబాద్ జిల్లా పర్యటనకు గవర్నర్ సానుకూలంగా స్పందించారు. ములుగు మున్సిపాలిటీ బిల్లు ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద ఉందని తెలిసింది. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాము’’ అని సీతక్క పేర్కొన్నారు.

గవర్నర్ తో సీతక్క భేటీ

చదవండి: బరాజ్‌ల వైఫల్యంలో 20 మంది ఇంజనీర్లు!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement