governer
-
గవర్నర్‌తో సీతక్క భేటీ.. కీలక బిల్లులు ఆమోదించాలని విజ్ఞప్తి
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మతో ఇవాళ (మంగళవారం) తెలంగాణ మంత్రి సీతక్క రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఇరువురు చర్చించారు. గవర్నర్‌తో భేటీ అనంతరం మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడారు. ‘‘ 2022లో ములుగును మున్సిపాలిటీగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం బిల్లుకు ఆమోదం తెలిపి గవర్నర్‌కు పంపింది. రెండు సంవత్సరాలుగా పెండింగ్‌లోనే ములుగు మున్సిపాలిటి అంశం ఉంది. ములుగు మున్సిపాలిటీ బిల్లుతో పాటు మరో ఐదు బిల్లుకు ఆమోదం తెలుపాలని ఈ సందర్భంగా గవర్నర్‌కు విజ్ఞత్తి చేశాం. అదిలాబాద్ అంశాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళి విషయాన్ని తెలియజేసాం. అదిలాబాద్, నాగర్ కర్నూల్ చెంచు ప్రాంతాల్లో పర్యటించాలని గవర్నర్‌ను కొరాం. గవర్నర్ ములుగులో ఓ గ్రామాన్ని దత్తత తీసుకునే ఆలోచనలో ఉన్నారు. దత్తత గ్రామాల లిస్ట్ గవర్నర్‌కు పంపాం, అదిలాబాద్ జిల్లా పర్యటనకు గవర్నర్ సానుకూలంగా స్పందించారు. ములుగు మున్సిపాలిటీ బిల్లు ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద ఉందని తెలిసింది. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాము’’ అని సీతక్క పేర్కొన్నారు.Met Telangana Governor @JishnuDevVerma at Raj Bhavan, appealed him to approve the long-pending bill that grants municipal status to Mulugu. The bill, passed by the Assembly in 2022, has faced delays due to technical and legal issues. Despite being included in the Telangana… pic.twitter.com/MEYb5Jigtv— Danasari Seethakka (@meeseethakka) September 24, 2024చదవండి: బరాజ్‌ల వైఫల్యంలో 20 మంది ఇంజనీర్లు! -
గవర్నర్ పదవి రద్దు చేయాలి: అభిషేక్ సింఘ్వీ
ఢిల్లీ: పలు రాష్ట్రాల్లో అధికార ప్రభుత్వం, గవర్నర్ మధ్య విభేదాలు కొనసాగుతున్న క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాల్లో గవర్నర్ పదవిని పూర్తిగా రద్దు చేయాలని అన్నారు. అలా కానీ పక్షంలో ఎటువంటి రాజకీయలకు సంబంధం లేని ఉన్నతస్థాయి వ్యక్తులను మాత్రమే ఏకాభిప్రాయంతో నియమించాలని డిమాండ్ చేశారాయన. తాజాగా ఆయన పీటీఐ ఇంటర్వ్యూలో పాల్గొని మాట్లాడారు.‘‘ఈ ప్రభుత్వం అతిపెద్ద వైఫల్యం ఏమిటంటే.. ప్రతీ సంస్థను కించపర్చటం, దాని విలువ తగ్గించటం. కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్లు రెండో చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా వ్యవహరించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకే గవర్నర్ పదవిని పూర్తిగా రద్దు చేయాలి. లేదంటే రాజకీయలకు సంబంధంలేని వ్యక్తిని మాత్రమే నియమించాలి. ఒకవేళ రాష్ట్ర ముఖ్యమంత్రికి, గవర్నర్‌కు మధ్య విభేదాలు తలెత్తితే వెంటనే గవర్నర్‌ను తెలగించాలి. ఎందుకంటే ఎన్నికల ప్రకియలో ప్రజలు ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు కానీ గవర్నర్ కాదు. ప్రస్తుతం గవర్నర్ల తీరు వల్ల పరిపాలన కష్టంగా మారుతోంది. ప్రభుత్వం చేసని కొన్ని ముఖ్యమైన బిల్లులను గవర్నర్లు ఆమోదించకుండా జాప్యం చేస్తున్నారు’’ అని అన్నారు.తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రభుత్వానికి, గవర్నర్ మధ్య వివాదాలు చెలరేగుతున్న నేపథ్యంలో అభిషేక్ మను సింఘ్వీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయంశంగా మారాయి. మరోవైపు.. సింఘ్వీ ఇటీవల తెలంగాణ రాజ్యసభ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
కేంద్రం కుట్రపై న్యాయపోరాటం చేస్తాం: సిద్ధరామయ్య
బెంగళూరు: మైసూరు అర్భన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) కుంభకోణం ప్రస్తుతం కర్ణాటకలో కలకలం రేపుతోంది. ఈ కేసులో ఏకంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను విచారించేందు రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ అనుమతి మంజూరు చేశారు. దీంతో సీఎంకు రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం సీఎం సిద్ధరామయ్య అత్యవసర కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘గవర్నర్ ప్రజాస్వామమ్యానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. విజయనగరలో అక్రమంగా భూములు కేటాయించలేదు. కేంద్రం చెప్పినట్లుగా గవర్నర్ నడుచుకుంటున్నారు. బీజేపీ ప్రతినిధిగా ఆయన వ్యవహరిస్తున్నారు. గవర్నర్ వ్యవహార శైలిని ఖండిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేంద్రంలోని బీజేపీ కుట్రలు చేస్తోంది. అందుకు గవర్నర్ థావర్ను పావుగా వాడుకుంటోంది. దీనిపై న్యాయ పోరాటం చేస్తాం’’ అని సిద్ధరామయ్య అన్నారు.Bengaluru | On Karnataka Governor granting permission to prosecute him in the alleged MUDA scam, CM Siddaramaiah says, "We have called an urgent cabinet meeting today. I thank DK Shivakumar and all my ministers. Congress party also stands with me. Congress workers are also… pic.twitter.com/z4GIw7ZWSa— ANI (@ANI) August 17, 2024చదవండి: MUDA Scam: ‘కాంగ్రెస్ సర్కార్‌ను కూల్చే కుట్రే ఇది’ -
సీఎం మమత వ్యాఖ్యలపై గవర్నర్ అభ్యంతరం.. ‘నివేదిక ఇవ్వండి’
కోల్‌కతా: నిస్సహాయులైన బంగ్లాదేశ్ ప్రజలకు ఆశ్రయం కల్పిస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇటీవల వ్యాఖ్యానించారు. ఆమె చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ తీవ్రంగా ఖండించారు. అదేవిధంగా మమత చేసిన వ్యాఖ్యలపై వివరణతో కూడిన నివేదిక సమర్పించాలని కోరారు.‘విదేశి వ్యవహారాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఈ విషయాన్ని బెంగాల్ ప్రభుత్వానికి గుర్తుచేస్తున్నాం. విదేశాల నుంచి భారత్‌కు వచ్చేవారికి ఆశ్రయం కల్పించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారం. విదేశాల నుంచి వచ్చే ప్రజలకు ఆశ్రయం కల్పిస్తామని సీఎం బహిరంగంగా ప్రకటించటం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడటాన్ని సూచిస్తుంది. సీఎం మమత వ్యాఖ్యలపై రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద్ ఆర్టికల్ 167 ప్రకారం వివరణతో కూడిన నివేదిక సమర్పించాలని కోరారు.’అని రాజ్‌భవన్ మీడియా సెల్ ‘ఎక్స్’లో పేర్కొంది.HG has sought a report under Article 167 on the reported comment made by Chief Minister publicly on 21.07.2024:“…But I can tell you this, if helpless people come knocking on the doors of Bengal, we will surely provide them shelter.”Close on its heels came Government of India’s…— Raj Bhavan Media Cell (@BengalGovernor) July 22, 2024బంగ్లాదేశ్‌లో ప్రభుత్వం ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోటాను వ్యతిరేకిస్తూ.. విద్యార్థులు చేసిన నిరసన హింసాత్మకంగా మారింది. వారం రోజులు పాటు తీవ్రంగా జరిగిన విద్యార్థుల ఆందోళలో వందకుపైగా నిరసనకారులు మృతి చెందారు. ఇలాంటి సమయంలో సరిహద్దు రాష్ట్రం పశ్చిమబెంగాల్ సీఎం మమత చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. -
చంద్రబాబు ప్రోద్బలంతోనే దాడులు..
సాక్షి, అమరావతి: ఏపీలో పోలింగ్ రోజు, అనంతరం వైఎస్సార్సీపీ శ్రేణులపై టీడీపీ దాడులకు చంద్రబాబే కారణమని, ఆయన ప్రోద్బలంతోనే హింసాకాండ కొనసాగిందని మంత్రి బొత్స ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ ప్రతినిధి బృందం గురువారం రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు ఫిర్యాదు చేసింది. పల్నాడు, అనంతపురం తదితర జిల్లాల్లో పోలీసు అధికారుల వైఫల్యాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లింది. ఈసీ పలుచోట్ల పోలీసు అధికారులను మార్పులు చేసిన తర్వాత రాష్ట్రంలో హింసాత్మక çఘటనలు పెరిగాయని వివరించింది.పోలీసు అధికారులు తీసుకున్న చర్యల్లోని లోపాలనూ ఫిర్యాదులో ప్రస్తావించింది. నిష్పక్షపాతంగా ఎన్నికల ప్రక్రియ జరిగేలా పర్యవేక్షించేందుకు ఎన్నికల సంఘం నియమించిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, పోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రా పక్షపాతంతో వ్యవహరించారని తెలిపింది. మిశ్రా టీడీపీతో కుమ్మక్కయ్యారని, ఎన్నికల ప్రక్రియను దెబ్బ తీస్తూ తనకు అప్పగించిన బాధ్యతకు తూట్లు పొడిచారని చెప్పారు.హింస ఆందోళన కలిగిస్తోంది..చంద్రబాబుతో పాటు హింసకు కారణమైన వారందరిపై చర్యలు తీసుకోవాలని మంత్రి బొత్స డిమాండ్ చేశారు. గవర్నర్‌ను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలింగ్ తర్వాత జరుగుతున్న హింస ఆందోళన కలిగిస్తోందన్నారు. టీడీపీ ఫిర్యాదులపై విచారణ లేకుండా ఎన్నికల అబ్జర్వర్ దీపక్ మిశ్రా చర్యలు తీసుకోవడం ఆయన పక్షపాతంగా వ్యవహరించారనడానికి నిదర్శనమని, ఆయనపై న్యాయ విచారణ చేపట్టాలన్నారు. ఎన్నికల సంఘం నుంచి రిపోర్ట్ తెప్పించుకుని దీపక్ మిశ్రాను మార్చాలని గవర్నర్‌ను కోరినట్టు వివరించారు.రాష్ట్రంలో ఎన్నికలు జరగక ముందు, ఆ తర్వాత పరిణామాలను గవర్నర్‌కు వివరించామని మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. శంఖబ్రతబాగ్చీ, త్రిపాఠి, బిందు మాధవ్‌పై చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. మిశ్రాతో పాటు, వీరందరూ కౌంటింగ్‌పైనా ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. రాజ్యసభ సభ్యుడు మోపిదేవి మాట్లాడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా దీపక్ మిశ్రా వ్యవహరిస్తున్నారన్నారు.మాజీ మంత్రి పేర్నినాని మాట్లాడుతూ.. ఉద్దేశ పూర్వకంగా మిశ్రాను ఏపీలో ఎన్నికల కోసం బీజేపీ, టీడీపీలు తెచ్చాయని చెప్పారు. అతని కారణంగానే విధ్వంసం జరుగుతోందన్నారు. మిశ్రా విజయవాడకు వచ్చినప్పటి నుంచి టీడీపీ సానుభూతి పరులైన రిటైర్డు అధికారులను కలిశారన్నారు. గవర్నర్‌ను కలిసిన వారిలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి మనోహర్ నాయుడు ఉన్నారు. -
గవర్నర్ ఎదుట ఎస్ఎఫ్ఐ కార్యకర్తల నిరసన
కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఎదుట నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేసిన ఎస్ఎఫ్ఐ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే కేరళలోని మట్టన్నూరులో ఆదివారం సాయంత్రం కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్‌కు స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) కార్యకర్తలు నల్లజెండాలు చూపించారు. అడవి ఏనుగుల దాడిలో మృతి చెందిన ఆరీఫ్ మహ్మద్ అజీష్ కుటుంబాన్ని పరామర్శించేందుకు గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్.. కన్నూర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వాయనాడ్ వైపు వెళ్తుండగా ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు నిరసనలు వ్యక్తం చేశారు. ఈ నేపధ్యంలో ఎస్ఎఫ్ఐ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బాధిత కుటుంబాన్ని వెంటనే ఆదుకోవాలంటూ ఎస్ఎపఐ కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ నేపధ్యంలో కొందరు ఎస్ఎఫ్ఐ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇది అక్కడ ఉన్న ఇతర కార్యకర్తలను ఆగ్రహం తెప్పించింది. అదుపులోకి తీసుకున్న కార్యకర్తలను పోలీసులు కొట్టారని, వారి వాహనాలను అడ్డుకున్నారని వారు ఆరోపించారు. సోమవారం కూడా తమ నిరసన ప్రదర్శన కొనసాగుతుందని కార్యకర్తలు తెలిపారు. కేరళలోని మనంతవాడి సమీపంలోని నివాస ప్రాంతంలోకి చొరబడిన ఏనుగు ఆరీఫ్ మహ్మద్ అజీష్ అనే వ్యక్తిపై దాడి చేసి, చంపేసింది. ఈ నేపధ్యంలో కేరళ ప్రభుత్వం మృతుని కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం, కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ ఘటనపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి రాష్ట్ర ఉన్నతాధికారులను ఆదేశించారు. #WATCH | Kerala: SFI (Students Federation of India) workers showed black flags to Kerala Governor Arif Mohammed Khan in Mattannur. The workers were detained by police after they clashed with Police. (18.2) pic.twitter.com/KI09v1OoW9 — ANI (@ANI) February 18, 2024 -
కాటన్ క్యాండీలపై నిషేధం.. వీడియో విడుదల చేసిన తమిళిసై!
కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కాటన్ క్యాండీ (తీపి తినుబండారం) విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్లు లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సుందరరాజన్ ప్రకటించారు. విషపూరిత రసాయనాలను ఉపయోగించి కాటన్ క్యాండీలను తయారు చేస్తున్నారనే కారణంతోనే వీటిపై నిషేధం విధించారు. ఒక వీడియోలో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సుందరరాజన్ మాట్లాడుతూ కాటన్ క్యాండీలో విషపూరిత రోడోమైన్ బీ ఉన్నట్లు ఆహార అధికారులు కనుగొన్నారన్నారు. కాటన్ క్యాండీలలోని విష రసాయనాలు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయన్నారు. అందుకే పుదుచ్చేరిలో కాటన్ క్యాండీ విక్రయాలను నిషేధిస్తున్నట్లు లెఫ్టినెంట్ గవర్నర్ తెలిపారు. குழந்தைகளின் உடல்நலத்தை பாதிக்கும் ரசாயனம் கலந்த பஞ்சு மிட்டாயை குழந்தைகளுக்கு வாங்கி கொடுக்காதீர்கள்.#CottonCandy #PanchuMittai #Puducherry pic.twitter.com/VJR451Y403 — Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) February 8, 2024 లెఫ్టినెంట్ గవర్నర్ తన అధికారిక సోషల్ మీడియా పేజీలో దీనికి సంబంధించిన ఒక వీడియో క్లిప్ షేర్ చేశారు. పిల్లల కోసం కాటన్ క్యాండీలను కొనుగోలు చేయడం మానుకోవాలని, అందులోని రసాయనాలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని తెలిపారు. కాటన్ క్యాండీలు విక్రయించే అన్ని దుకాణాలలో తనిఖీ చేయాలని ప్రభుత్వ అధికారులను ఆదేశించినట్లు లెఫ్టినెంట్ గవర్నర్ ఆ వీడియోలో తెలిపారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ తెలిపిన వివరాల ప్రకారం, రోడోమైన్ బీ అనే రసాయనాన్ని ఆహార పదార్థాలకు రంగు వచ్చేందుకు ఉపయోగిస్తారు. ఇది శరీరంలోకి ప్రవేశించినప్పుడు కణాలలో ఆక్సీకరణ ఉద్రిక్తతకు కారణమవుతుంది. ఫలితంగా కాలేయ వైఫల్యం, క్యాన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదురయ్యేందుకు అవకాశం ఉంది. -
పంజాబ్ గవర్నర్ పదవికి బన్వరీలాల్ పురోహిత్ రాజీనామా
చంఢీఘర్: పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ తన పదవికి రాజీనామా చేశారు. పంజాబ్ గవర్నర్ పదవి, కేంద్ర పాలిత ప్రాంతం ఛండీఘర్ అడ్మినిస్ట్రేటర్ పదవికి వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముకు పంపిన రాజీనామా పత్రంలో.. తన రాజీనామాను దయచేసి అంగీకరించాలని కోరారు. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం పంపిన పలు బిల్లులను ఆమోదించటంలో జాప్యం చేస్తున్న నేపథ్యంలో బన్వరీలాల్ పురోహిత్ గవర్నర్ పదవి రాజీనామా చేశారు. నవంబర్ 10, 2023లో పంజాబ్ అసెంబ్లీ పంపిన ఐదు బిల్లులను బన్వరీలాల్ పురోహిత్ ఆమోదం తెలపకుండా జాప్యం చేశారు. దీంతో పంజాబ్ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు ప్రభుత్వం పంపిన బిల్లులను ఆమోదించకుండా జాప్యం చేయటాన్ని నిలదీసింది. అప్పటి నుంచి పంజాబ్ ప్రభుత్వానికి.. గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. బన్వరీలాల్ పురోహిత్ శుక్రవారం చంఢీఘర్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. ఇక.. అమిత్ షాను కలిసిన మరుసటి రోజు బన్వరీలాల్ పురోహిత్ గవర్నర్ పదవికి రాజీనామా చేయటంపై చర్చ జరుగుతోంది. Punjab Governor and Chandigarh Administrator Banwarilal Purohit resigns due to "personal reasons and certain other commitments." pic.twitter.com/0o05k6Hn6p — ANI (@ANI) February 3, 2024 -
కనీసం ఇప్పటికైనా...
దేన్నయినా పదే పదే చెప్పవలసిరావటం ఎవరికైనా ఇబ్బందే. అందునా రాజ్యాంగ పదవుల్లో వున్నవారికి పదే పదే రాజ్యాంగ నిబంధనలు గుర్తుచేయటం మరింత ఇబ్బందికరమైన వ్యవహారం. కానీ మన సర్వోన్నత న్యాయస్థానానికి ఇది తప్పడం లేదు. తమ శాసనసభ ఆమోదించిన బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర వేయకపోవటాన్ని సవాలు చేస్తూ పంజాబ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పునిస్తూ గవర్నర్ల అధికారాలకుండే పరిధులు, పరిమితుల గురించి సుప్రీంకోర్టు మరోసారి చెప్పక తప్పలేదు. తన ఆమోదముద్ర కోసం వచ్చిన బిల్లుపై ‘సాధ్యమైనంత త్వరగా’ గవర్నర్ నిర్ణయం తీసుకోవాలని, పునఃపరిశీలన అవసరమని భావిస్తే ఆ సంగతి తెలియజేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం స్పష్టం చేసింది. ఈనెల 10న వెలువడిన ఆ తీర్పు పూర్తి పాఠం గురువారం సుప్రీంకోర్టు వెబ్సైట్లో వెలువడింది. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లును నిలిపి వుంచేందుకు, వెనక్కి పంపేందుకు రాజ్యాంగంలోని 200వ అధికరణ గవర్నర్‌కు అధికారమిస్తోంది. బిల్లు సక్రమంగా లేదని, స్పష్టత కొరవడిందని లేదా రాజ్యాంగ నిబంధనలను అతిక్రమిస్తోందని గవర్నర్ భావించినప్పుడు దాన్ని తిప్పిపంపొచ్చు. అయితే ఆ సందర్భంగా గవర్నర్ ఏం చేయాల్సివుంటుందో కూడా అదే అధికరణ వివరిస్తోంది. గవర్నర్ ఇచ్చిన సలహాను అంగీకరించి బిల్లుకు సవరణలు చేయటమా లేక యధాతథంగా దాన్నే మరోసారి ఆమోదించి పంపటమా అనేది శాసనసభ ఇష్టమని కూడా అదే అధికరణ తేటతెల్లం చేస్తోంది. రెండోసారి వచ్చిన బిల్లును గవర్నర్ ఆమోదించి తీరాలని ఆ అధికరణ వివరిస్తోంది. నిబంధనలు ఇంత స్పష్టంగా వున్నప్పుడు రోజుల తరబడి, నెలల తరబడి నిర్ణయం చెప్పకుండా బిల్లుల్ని పెండింగ్‌లో వుంచటం అసమంజసం, రాజ్యాంగ విరుద్ధం. కానీ మన దేశంలో పదే పదే ఇలాగే జరుగుతోంది. ఇతరేతర వ్యవస్థలు కాలానుగుణంగా ఎంతోకొంత మార్పులు చెందుతూ వచ్చాయి. గవర్నర్ల వ్యవస్థ మాత్రం అన్నింటికీ అతీతంగా వుండిపోయింది. అంతక్రితం సర్కారియా కమిషనైనా, ఆ తర్వాత వీరప్ప మొయిలీ నేతృత్వంలోని పాలనా సంస్కరణల కమిషనైనా రాజకీయ నేతలకు ఆ పదవులు ఇవ్వొద్దని సూచించాయి. గవర్నర్ పదవిని రాజకీయ పునరావాసంగా మార్చొద్దని 1994లో ఎస్ఆర్ బొమ్మై కేసులో సుప్రీంకోర్టు కూడా హితవు చెప్పింది. రాజకీయాలకు అతీతంగా వుండే వ్యక్తులు లేదా ఏదో ఒక రంగంలో నిష్ణాతులైనవారు ఆ పదవిలో వుంటే మంచిదని సర్కారియా కమిషన్ సూచించింది. కానీ కేంద్రంలోని ఏ ప్రభుత్వమూ ఆ సూచన శిరోధార్యమని భావించలేదు. ఇటీవల గవర్నర్లకూ, రాష్ట్ర ప్రభుత్వాలకూ మధ్య తరచు వివాదాలు తలెత్తు తున్నాయి. పంజాబ్‌తోపాటు తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, పశ్చిమబెంగాల్, కేరళ రాష్ట్రాల్లో ప్రభుత్వా లకూ, గవర్నర్లకూ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. పంజాబ్‌లో మరీ విపరీతం. అక్కడ ఏకంగా 12 బిల్లుల విషయంలో గవర్నర్ ఎటూ తేల్చకుండా ఆపేశారు. గవర్నర్లు ఇలా వ్యవహరించటం వల్ల ప్రజల దృష్టిలో ప్రభుత్వాలు చులకనవుతాయి. సమస్య అపరిష్కృతంగా వుండిపోవటా నికి కారణం తెలియక అధికార పక్షంపై సామాన్యులు విరుచుకుపడతారు. బహుశా అలా జరగాలని గవర్నర్లు కోరుకుంటున్నారేమో తెలియదు. ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలపట్ల ఇలా చిన్నచూపుతో వ్యవహరించటం తమ పదవిని తామే చిన్నబుచ్చుకోవటమని గవర్నర్లు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. సమస్యేమంటే తమ ఏలుబడిలోని ప్రభుత్వాలకు గవర్నర్లు ఇబ్బందిగా మారినప్పుడు కొత్తగా మొదటిసారి ఇలా జరుగుతున్నట్టు మాట్లాడే పార్టీలు, గతంలో తాము అధికారంలో వుండగా వ్యవహరించిన తీరును పూర్తిగా మరిచిపోతాయి. దేశంలో ఏ మూలైనా గవర్నర్‌కూ, ఒక ప్రభు త్వానికీ మధ్య వివాదం తలెత్తినప్పుడల్లా కేంద్రంలోని జనతాపార్టీ ప్రభుత్వం గుర్తుకు రాకమానదు. 1977లో జనతాపార్టీ అధికారంలోకి రాగానే ఒకే వేటుతో పది రాష్ట్ర ప్రభుత్వాలను రాజ్యాంగంలోని 356వ అధికరణ కింద బర్తరఫ్ చేసింది. 1980లో కేంద్రంలో మళ్లీ అధికారం వచ్చాక కాంగ్రెస్ ఇదే పని చేసింది. ప్రజల ఆమోదంతో అధికారంలోకొచ్చిన ప్రభుత్వాలను ఇలా ఇష్టానుసారంగా, కక్ష పూరితంగా రద్దు చేయటం దారుణమని ఆ రెండు పార్టీల ప్రభుత్వాలూ అనుకోలేదు. ఆ తర్వాత కాలంలో కూడా ఇదే ధోరణి కొనసాగాక బొమ్మై కేసులో సుప్రీంకోర్టు విస్పష్టమైన తీర్పునిచ్చింది. అలాంటి చర్యకు పార్లమెంటు ఉభయసభల ఆమోదం వుండితీరాలన్న నిబంధన విధించింది. అటు తర్వాత ఈ నిరంకుశ విధానానికి ఏదోమేరకు బ్రేకు పడిందనే చెప్పాలి. ఇప్పుడు పంజాబ్ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల కేరళ, తమిళనాడు ప్రభుత్వాలకు కూడా ఊరట వచ్చినట్టే. ఇప్పటికే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు తమ బిల్లులు పెండింగ్‌లో వుంచటాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. ఫెడరల్ వ్యవస్థలో గవర్నర్ల పాత్రేమిటన్న అంశంలో మన రాజ్యాంగ నిర్మాతలకు తగిన అవగాహన లేకపోవచ్చు. కానీ ‘సాధ్యమైనంత త్వరగా’ బిల్లులపై నిర్ణయం తీసుకోవాలనటం ద్వారా గవర్నర్ల బాధ్యతేమిటో స్పష్టంగా చెప్పినట్టయింది. చట్టాల రూపకల్పనలో శాసనసభల పాత్ర వమ్ము అయ్యేలా అధికారాలను వినియోగించటం సరికాదని తాజా తీర్పులో సుప్రీంకోర్టు చెప్పటం హర్షించదగింది. మరోసారి ఇలా చెప్పించుకోవాల్సిన అవసరం రాకుంటే తమకే గౌరవప్రదమని గవర్నర్లు గుర్తించటం మంచిది. -
కొత్త జిల్లా ఎలా ఏర్పాటవుతుంది? గవర్నర్ పాత్ర ఏమిటి?
భారతదేశ పరిపాలనా వ్యవస్థలో పంచాయతీ, తహసీల్, జిల్లా, రాష్ట్రం, దేశం అనే విభాగాలు ఉన్నాయి. ఇందులో జిల్లాను అత్యంత కీలకంగా పరిగణిస్తారు. ప్రస్తుతం దేశంలో మొత్తం జిల్లాల సంఖ్య 800 దాటింది. తాజాగా మధ్యప్రదేశ్‌లోని శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం తమ రాష్ట్రంలో మరో రెండు కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త జిల్లాలను మైహార్, పంధుర్ణగా పిలవనున్నారు. అయితే ప్రభుత్వం కొత్త జిల్లాలను ఎలా ఏర్పాటు చేస్తుంది? ఎటువంటి విధానాన్ని అనుసరిస్తుందనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో కొత్త జిల్లా ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదన స్థానిక పరిపాలన, ఎన్నికైన ప్రతినిధులు, ఇతర సంస్థల నుంచి వస్తుంది. తరువాత దానిని రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనను నిశితంగా పరిశీలిస్తుంది. అనంతరం కొత్త జిల్లా ఆవశ్యకతపై సాధ్యాసాధ్యాలను అధికారులు అధ్యయనం చేస్తారు. ఈ దశలో ఆ ప్రాంత జనాభా, భౌగోళిక పరిసరాలు, పరిపాలనా సౌకర్యాలు, వనరుల లభ్యతతో పాటు, ఆ ప్రాంత సామాజిక పరిస్థితులు మొదలైనవాటిని పరిగణలోకి తీసుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదన సరైనదని భావించినప్పుడు, స్థానిక ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థల ప్రతినిధులతో చర్చిస్తుంది. ఈ సమయంలో అందరి అంగీకారం మేరకు కొత్త జిల్లాను రూపొందించడంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అనంతరం అధికారిక గెజిట్‌లో నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఇందులో కొత్త జిల్లా ఏర్పాటు ప్రకటనతో పాటు జిల్లా సరిహద్దులను తెలియజేస్తారు. జిల్లా సరిహద్దులను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఆ తర్వాత కొత్త జిల్లాకు గవర్నర్ ఆమోదం తెలిపిన అనంతరం కొత్త జిల్లాకు అధికారిక రూపం వస్తుంది. కొత్త జిల్లా ప్రకటన వెలువడిన తరువాత ప్రభుత్వం ముందుగా డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్(డీఎం) ఎస్పీలను నియమిస్తుంది. తరువాత క్రమంగా ఇతర అధికారులను నియమిస్తారు. జిల్లా ఏర్పాటు తర్వాత ప్రభుత్వం పరిపాలనా కార్యాలయాలు, పోలీసు స్టేషన్లు, ఆసుపత్రులు, పాఠశాలలు, ఇతర అవసరమైన సేవలు, ప్రజా సౌకర్యాలను ఏర్పాటు చేస్తుంది. దీనితో పాటు, పాత, కొత్త జిల్లాల మధ్య వనరులు, ఆస్తుల పంపిణీ జరుగుతుంది. ఇది కూడా చదవండి: క్షిపణి దాడుల మధ్య వార్ జోన్‌కు బైడెన్ ఎలా చేరారు? -
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గవర్నర్ సమీక్ష!
ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలో ఉధృతంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు తమిళసై సౌందర్‌రాజన్ జిల్లాలో వరదల పరిస్థితిని సమీక్షించారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్‌లో రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా ప్రతినిధి యాటకారి సాయన్న జిల్లా పరిస్థితిని గవర్నర్‌కు వివరించారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళసై జిల్లా ప్రస్తుత పరిస్థితులు, ఎదుర్కొంటున్న సమస్యలు, జరిగిన నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. కడెం మండలం పాండవాపూర్ తాండ నుంచి 50 ఇళుల్ల ఖాళీ చేసి సమీపంలోని తాత్కాలిక గృహాల్లో, నవాబ్‌పేట గ్రామపంచాయతీలో 100 నివాసగృహాలు ఖాళీ చేసి 350 మందిని సమీపంలోని రైతువేదికలో ఉంచారని వివరించారు. అంబర్‌పేటలో 50 గృహాలను ఖాళీ చేసి 200 మందిని నారాయణరెడ్డి షెడ్లో తాత్కాలిక శిబిరాలను ఏర్పాటు చేశారన్నారు. ఖానాపూర్‌లో 70 గృహాలను ఖాళీ చేయించి 150 మందిని సమీపంలోని ఎల్ఎంఆర్ డిగ్రీ కాలేజీలో ఉంచారు. దస్తురాబాద్ మండలం దేవునిగూడా గ్రామంలో 15 ఇళ్లు ఖాళీ చేసి 60 మందికి దేవుని గూడా గ్రామపంచాయతీలో, భుక్తాపూర్ గ్రామాలో 11 ఇండ్లు ఖాళీ చేసి 45 మందికి బుక్తాపూర్ పాఠశాలలో, మున్యాల్ గ్రామం 30 ఇళ్లు ఖాళీ చేసి 156 మందికి మున్యాల్ స్కూల్లో, గొడిసెర్యాల్ గ్రామంలో 12 ఇళ్లకు చెందిన 55 మందికి, గుడిసెల స్కూల్లో పునరావాసం ఏర్పాటు చేశారని వివరించారు. నిర్మల్ కేంద్రంలో జీఎన్ఆర్ కాలనీలోని 60 ఇళ్లను ఖాళీ చేయించి, 300 మందికి అల్ఫోర్స్ స్కూల్లో, సోఫి నగర్‌లోని పది ఇళ్లకు చెందిన 32 మందిని కమ్యూనిటీ హాల్లోని వసతికి తరలించారని తెలిపారు. భైంసా మండలం గుండెగాం లో 50 ఇళ్లకు చెందిన 200 మందిని భైంసాలోని డబుల్ బెడ్రూం ఇళ్లలో వసతి కల్పించినట్లు పేర్కొన్నారు. -
ముక్కలు చెక్కలై..
ఆ ఐదు పంచాయతీలను కలపాలి.. ప్రజాభీష్టం లేకుండా ఏకపక్షంగా ఏపీలో కలిపిన ఐదు పంచాయతీలను తిరిగి భద్రాచలం మండలంలో విలీనం చేయాలని ఆయా గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. భౌగోళికంగా భద్రాచలంతో ఆ ప్రాంతాలకు ఉన్న అనుబంధంతో తమను ఇక్కడే కొనసాగించాలని ఆయా గ్రామాల వారు పలుమార్లు బంద్‌లు, రాస్తారోకోలు చేశారు. వీరి ఉద్యమానికి బీఆర్ఎస్ మినహా స్థానిక రాజకీయ పార్టీలన్నీ మద్దతు తెలిపాయి. ఇటీవల భద్రాచలం వచ్చిన గవర్నర్ తమిళి సైకి సైతం ఆయా గ్రామాల వారు తమ సమస్యలు వివరిస్తూ వినతిపత్రం అందజేశారు. ఇక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దృష్టికి తమ సమస్యను తీసుకెళ్లేందుకు వారు సిద్ధమవుతున్నారు. భద్రాచలం: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఈ దశాబ్ద కాలంలో రాష్ట్రమంతా అభివృద్ధిలో పరుగులు పెడుతున్నా, భద్రాచలం ఏజెన్సీ మాత్రం దిశా నిర్దేశం, అభివృద్ధి లేక నిస్తేజంగా మారింది. రాష్ట్ర, జిల్లాల విభజనలో ముక్కలుగా చీలిపోయిన భద్రాచలం ఏకాకిగా మిగిలింది. పలు ముఖ్యమైన కార్యాలయాలు ఇతర ప్రాంతాలకు తరలివెళ్లడంతో దిక్కూ మొ క్కూ లేకుండా ఉండిపోయింది. భద్రాచలం అంటే శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికే పరిమితమైన ఖ్యాతిని కూడగట్టుకుంది. రాష్ట్రం మొత్తం దశాబ్ది ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్న తరుణంలో భద్రాచలానికి జరిగిన అన్యాయాన్ని గుర్తు చేసుకుంటూ స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ఇకనైనా పాలకులు స్పందించి పూర్వవైభవం తీసుకురావాలని కోరుతున్నారు. మండల పరిషత్ పోయె.. పాలక మండలి లేదాయె.. మండలాల్లో అభివృద్ధిని వేగవంతం చేసేందుకు కృషి చేసే మండల పరిషత్ సైతం భద్రాచలంలో లేకపోవడం శోచనీయం. ఈ మండలంలో గ్రామాలు లేకపోవడంతో మండల పరిషత్, జెడ్పీటీసీ హోదాలను రద్దు చేశారు. దీంతో ఇక్కడున్న మండల పరిషత్ కార్యాలయాన్ని నూతనంగా ఏర్పడిన ఆళ్లపల్లి మండలానికి తరలించారు. 80 వేలకు పైగా జనాభా ఉన్న భద్రాచలం మేజర్ గ్రామపంచాయతీలో పాలకవర్గం లేక ఐదేళ్లు కావస్తోంది. 2018 ఆగస్టులో గ్రామ పంచాయతీ పాలకవర్గం ముగిసినా, ఇప్పటి వరకు మళ్లీ ఎన్నికలు జరగలేదు. భద్రాచలం, సారపాకను మున్సిపాలిటీలుగా మారుస్తూ ప్రభుత్వం ప్రకటించడం, దీనిపై గిరిజన సంఘాలు హైకోర్టుకు వెళ్లడం, ఆ తర్వాత భద్రాచలంను మూడు, సారపాకను రెండు పంచాయతీలుగా విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ విడుదల చేయడమే కాక అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ ఆమోదానికి పంపారు. అయితే రాష్ట్ర, జిల్లా విభజనతో ఇప్పటికే భద్రాచలం నష్టపోయిందని, మళ్లీ పంచాయతీల విభజనతో మరింత నష్టపర్చవద్దని ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఆధ్వర్యంలో స్థానికులు గవర్నర్ తమిళి సైకి విన్నవించారు. దీంతో ఆ బిల్లును గవర్నర్ ఆమోదించకుండా తిప్పి పంపారు. ఇలా అనేక పరిణామాలతో భద్రాచలం గ్రామపంచాయతీ ఐదేళ్లుగా పాలకవర్గం లేకుండానే సాగుతోంది. ఇక గతంలో భద్రాచలం డివిజన్లో కొనసాగిన అనేక విద్యాలయాలు, కార్యాలయాలు ఇతర ప్రాంతాలకు తరలిపోవడంతో పట్టణం కళ తప్పింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా భద్రాచలానికి ఇస్తామన్న రూ.100 కోట్లలో ఒక్క పైసా విడుదల చేయకపోవడంతో ఈ దశాబ్దిలో ఏమాత్రం అభివృద్ధి చేయలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతిపెద్ద ఏజెన్సీ చిన్నబోయింది.. తెలంగాణ ఆవిర్భావంతో భద్రాచలం ఏజెన్సీ ప్రాభవానికి గండి పడింది. రాష్ట్ర విభజనతో భద్రాచలం డివిజన్లో ఉన్న కూనవరం, చింతూరు, వీఆర్‌పురం, భద్రాచలం పట్టణం మినహా ఇతర గ్రామాలు ఏపీలో విలీనం అయ్యాయి. దీంతో రాష్ట్రంలోనే అతి పెద్దదైన భద్రాచలం ఏజెన్సీ చిన్నదైంది. భద్రాచలం మండలంలోని యటపాక, పురుషోత్తపట్నం, గుండాల, కన్నాయిగూడెం, పిచుకలపాడు గ్రామపంచాయతీలను సైతం ఆంధ్రప్రదేశ్‌లో కలపడంతో పట్టణానికే పరిమితమై మండల పరిధి కుచించుకుపోయింది. ఇక జిల్లాల పునర్విభజనతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. భద్రాచలం నియోజకవర్గంలోని వెంకటాపురం, వాజేడు మండలాలను ములుగు జిల్లాలో కలిపారు. రాష్ట్ర విభజనకు ముందు ఎనిమిది మండలాలతో వర్థిల్లిన భద్రాచలం ప్రస్తుతం మూడు మండలాలకే పరిమితమైంది. -
జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు సీఎం జగన్ సాదర స్వాగతం
సాక్షి, అమరావతి/విమానాశ్రయం (గన్నవరం): రాష్ట్ర నూతన గవర్నర్‌గా నియమితులైన సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాదర స్వాగతం పలికారు. జస్టిస్ అబ్దుల్ నజీర్, ఆయన కుటుంబ సభ్యులు బుధవారం రాత్రి 8.15 గంటలకు ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను సీఎం జగన్ శాలువాతో సత్కరించారు. అనంతరం ఇంటర్నేషనల్ టెర్మినల్ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక వద్దకు జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం జగన్ చేరుకున్నారు. అక్కడ శాసన మండలి చైర్మన్ మోషెన్ రాజు, మంత్రి జోగి రమేశ్, ప్రభుత్వప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రేవు ముత్యాలరాజు, కృష్ణా జిల్లా కలెక్టర్ పి. రంజిత్‌బాషా, ఎస్పీ పి. జాషువా, విజయవాడ పోలీస్ కమిషనర్ టి.కె.రాణా, ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, పలువురు న్యాయమూర్తులు జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు స్వాగతం పలికారు. అనంతరం విజయవాడలోని రాజ్‌భవన్‌కు చేరుకున్న జస్టిస్ అబ్దుల్ నజీర్, ఆయన కుటుంబ సభ్యులకు గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, ఇతర అధికారులు స్వాగతం పలికారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
పంజాబ్ సీఎంకు బిగ్ రిలీఫ్.. అందుకు గవర్నర్ ఓకే!
చండీగఢ్: అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి బల నిరూపణ చేసుకోవాలని భావిస్తున్న పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్కు ఊరట లభించింది. అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి చివరి క్షణంలో నిరాకరించి ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్ ఇచ్చిన గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్.. ఎట్టకేలకు ఓకే చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు ఆప్ ఎమ్మెల్యే, అసెంబ్లీ స్పీకర్ కుల్తార్ సింగ్ సంధ్వాన్. ‘మా వినతికి గవర్నర్ ఆమోదం తెలిపారు. ఈనెల 27న మంగళవారం అసెంబ్లీ మూడో సెషన్స్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు.’అని పేర్కొన్నారు. అయితే.. ఈ ప్రత్యేక సమావేశాల్లో విశ్వాస పరీక్ష నిర్వహిస్తారా? లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియటం లేదని ఆప్ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు.. సెప్టెంబర్ 27న ప్రారంభం కానున్న ప్రత్యేక సమావేశాలను రాష్ట్రంలోని పంట వ్యర్థాల కాల్చివేత, విద్యుత్తు రంగం సమస్యలపై చర్చించేందుకు ఉపయోగించుకుంటామని ఆప్ ప్రభుత్వం చెబుతోంది. బీజేపీ ఆపరేషన్ లోటస్ పేరుతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తోందన్న ఆరోపణల మధ్య తమ బల నిరూపణ చేసుకునేందుకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ఆప్ ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెంబర్ 22న విశ్వాస పరీక్ష నిర్వహిస్తామని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రకటించారు. అయితే.. చివరి క్షణంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు నిరాకరించి.. ఆప్‌కు షాక్ ఇచ్చారు గవర్నర్ బన్వారి లాల్ పురోహిత్. దీంతో గవర్నర్‌పై తీవ్ర విమర్శలు చేశారు ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని దుయ్యబట్టారు. ఇదీ చదవండి: పంజాబ్ సీఎంకు షాక్.. ప్రత్యేక అసెంబ్లీ సెషన్‌కు గవర్నర్ నో.. -
‘నన్ను అవమానిస్తున్నారు’.. రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై ఫైర్
‘గవర్నర్ పరిధి దాటి పాలన విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారన్న ఆరోపణలు అసంబద్ధం. నేను ఎలాంటి జోక్యం చేసుకోవడం లేదు. నేను వివాదాస్పద వ్యక్తిని కాదు. సమస్యలతో ఎవరైనా వస్తే.. ఆ విషయాన్ని మానవతా దృక్పథంతో ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను.’ - గవర్నర్ తమిళిసై సందరరాజన్ సాక్షి, హైదరాబాద్: ‘‘రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కార్యాలయాన్ని గౌరవించడం లేదు. స్పందించడం లేదు. అన్నీ అవమానాలే. నేనెక్కడికి వెళ్లినా ప్రొటోకాల్ అమలు కావడం లేదు. జిల్లా కలెక్టర్ వచ్చి పలకరించడం లేదు. తేనీటి విందు (ఎట్ హోమ్)కు సీఎం రాకపోతే ఆ సమాచారం ఇవ్వడం లేదు. అత్యున్నత పదవిలో ఉండి కూడా ఎన్నో అడ్డంకులు, వివక్షను ఎదుర్కొంటున్నా. ఒక మహిళా గవర్నర్‌ను ఎలా వివక్షకు గురి చేశారన్నది గత మూడేళ్ల రాష్ట్ర చరిత్రలో నమోదైంది..’’ అని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా గురువారం ఆమె రాజ్‌భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ వైఖరి, పాలనా విధానాలపై ఆమె ఆరోపణలు చేశారు. తాను రాజకీయాల్లో ఉన్నప్పుడు, ఇప్పుడూ సోషల్ మీడియాలో టార్గెట్ చేశారని.. ఇవి తననేమీ చేయలేవని తమిళిసై స్పష్టం చేశారు. గౌరవించక పోయినంత మాత్రాన తక్కువైపోనని.. తాను చాలా శక్తివంతురాలినని పేర్కొన్నారు. మీడియా సమావేశంలో గవర్నర్ చెప్పిన అంశాలు, చేసిన వ్యాఖ్యలు ఆమె మాటల్లోనే.. రాజ్‌భవన్ అంటరాని ప్రాంతమా? ‘‘సమ్మక్క–సారలమ్మ జాతరకు వెళ్లడానికి హెలికాప్టర్ కావాలని అడిగితే చివరిక్షణం వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఇచ్చేదీ, లేనిదీ కనీసం సమాచారం ఇవ్వలేదు. రోడ్డు మార్గంలో 8 గంటలు ప్రయాణించి జాతరకు వెళ్లాను. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కోరలేదు. ఎక్కడికైనా కారు, రైలు ద్వారా వెళ్తున్నాను. అయినా అసెంబ్లీలో నా ప్రసంగాన్ని నిరాకరించారు. గణతంత్ర దినోత్సవం నాడు నేను జాతీయ జెండా ఎగురవేయకుండా నిరాకరించారు. ప్రసంగం కాపీ కోరితే ప్రభుత్వం పంపలేదు. నేను నోరు మూసుకుని ఉండాలా? సాధారణ పౌరురాలిగానే ఆ రోజు మాట్లాడాను. గణతంత్ర దినోత్సవానికి సీఎం, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎందుకు రాలేదు? ఇది అంటరాని ప్రాంతమా? వివక్ష చూపుతారా? గణతంత్ర వేడుకలను కేవలం రాజ్‌భవన్‌కు పరిమితం చేయాలని మంత్రివర్గం ఎందుకు తీర్మానం చేయాల్సి వచ్చింది? పరేడ్ ఎందుకు ఉండకూడదు? అన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం పరేడ్ నిర్వహించాయి. కోవిడ్ మహమ్మారి కేవలం తెలంగాణలోనే ఉందా? రాజకీయ సభలు జరగలేదా? హేతుబద్ధంగా వ్యవహరిస్తున్నా.. ప్రభుత్వ నిర్ణయాలన్నింటినీ ఉన్నది ఉన్నట్టు గవర్నర్ ఆమోదించాలని లేదు. నేనేమీ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి విషయాన్ని తిరస్కరించడం లేదు. హేతుబద్ధంగా వ్యవహరిస్తున్నాను. గవర్నర్ కోటాలోని సర్వీసు కేటగిరీలోకి రాడనే ఎమ్మెల్సీగా పాడి కౌశిక్‌రెడ్డి నియామకాన్ని అంగీకరించలేదు. గవర్నర్ పరిధి దాటి పాలన విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారన్న ఆరోపణలు అసంబద్ధం. నేను ఎలాంటి జోక్యం చేసుకోవడం లేదు. నేను వివాదాస్పద వ్యక్తిని కాదు. సమస్యలతో ఎవరైనా వస్తే.. ఆ విషయాన్ని మానవతా దృక్పథంతో ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. తాము ఎన్నుకున్నవారు అందుబాటులో లేకపోవడంతోనే ప్రజలు తమ సమస్యలతో నా దగ్గరికి వస్తున్నారు. మహిళా దర్బార్‌కు వచ్చిన అర్జీలు, బాసర ట్రిపుల్ ఐటీలో దయనీయ పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాసినా పట్టించుకోలేదు. గవర్నర్ రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్లి, ఎవరితోనైనా మాట్లాడవచ్చు. ఈ విషయంలో ఎలాంటి పరిమితులు లేవని గుర్తుంచుకోవాలి. విద్య, వైద్యం, మహిళా భద్రతే.. రాష్ట్రంలో విద్య, వైద్యం, మహిళల భద్రత అతిపెద్ద సమస్యలు. గతంలో నన్ను కలవడానికి సీఎం కేసీఆర్ వచ్చేవారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సదుపాయాలు కల్పించాలని చాలాసార్లు చెప్పా. కు.ని. శస్త్రచికిత్సలు విఫలమవడం వంటి ఘటనలు చూస్తున్నాం. నిమ్స్ డైరెక్టర్ వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి. రాజకీయ నేతలెవరూ ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లడం లేదు. వర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. హాస్టళ్లలో ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు నిత్యకృత్యంగా మారాయి. పిల్లలను పిల్లులు, ఎలుకలు కరుస్తున్నాయి. కేంద్రం కొత్తగా 8 వైద్య కళాశాలలను మంజూరు చేసినా మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం విఫల మవడంతో ఎంసీఐ అనుమతి ఇవ్వలేదు. గవర్నర్ పాత్ర అంతకే పరిమితం! రుణాలపై ఆంక్షలు, హామీల అమలు విషయంలో రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపుతోందన్న విమర్శలను మీడియా ప్రస్తావించగా.. ‘‘నేను కేవలం రాజ్యంగబద్ధ పదవిలో ఉన్నాను. పలు పరిమితులున్నాయి. ప్రతి రాష్ట్రానికి కేంద్ర సహాయం కచ్చితంగా లభిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాట్లాడుకోవడానికి వేదిక, వ్యవస్థలు ఉన్నాయి. గవర్నర్ పాత్ర ప్రేరణ కల్పించడానికే పరిమితం’’ అని తమిళిసై సమాధానమిచ్చారు. విమోచన దినమే కరెక్టు..! రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ కారణాలతోనే తెలంగాణ విమోచన దినం పేరును మార్చిందని. విమోచన దినమే సరైనదని తాను భావిస్తున్నానని గవర్నర్ తమిళిసై చెప్పారు. తెలంగాణ చరిత్రపై తాను అధ్యయనం చేశానని తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యల అంశాన్ని ప్రస్తావించగా.. ఈ విషయాన్ని పాలనా యంత్రాంగం చూసుకుంటుందని, రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఇదీ చదవండి: గవర్నర్ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రుల ఆగ్రహం.. -
రూ.1400 కోట్ల స్కాం: ఆప్ నేతలపై ఎల్జీ పరువునష్టం దావా!
సాక్షి, న్యూఢిల్లీ: రూ.1,400 కోట్లు అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపణలు చేసిన ఆమ్ ఆద్మీ నేతలపై చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యారు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా. తనపై తప్పుడు, గౌరవానికి భంగం కలిగించే విధంగా అవినీతి ఆరోపణలు చేసిన ఎమ్మెల్యేలు అతిష్, సౌరభ్ భరద్వాజ్‌లతో పాటు పలువురు ఆప్ నేతలపై పరువునష్టం దావా వేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన జారీ చేసింది ఎల్జీ కార్యాలయం. 2016 నోట్ల రద్దు సమయంలో ఎల్జీ సక్సెనా సుమారు రూ.1,400 కోట్లు రద్దు చేసిన నోట్లు మార్పిడి చేయించారని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ఖాదీ విభాగనికి ఛైర్మన్‌గా ఉండి ఆ కుంభకోణానికి పాల్పడ్డారని విమర్శించారు. అయితే, ఆ ఆరోపణలను తిప్పికొట్టారు సక్సేనా. ఎమ్మెల్యేలతో పాటు ఢిల్లీ డెవలప్మెంట్ కమిషన్ ఛైర్మన్ జాస్మిన్ షాపైనా చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. ‘ఒకరిపై ఆరోపణలు చేసేందుకు గంతులేస్తూ వచ్చే లక్షణం కేజ్రీవాల్ అండ్ కోది. ఆప్ నేతలు చేసిన తప్పుడు, పరువునష్టం కలిగించే ఆరోపణలపై ఎల్జీ ప్రత్యేక దృష్టి సారించారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఆప్ నేతలు తప్పించుకోలేరు.’ అని ఎల్జీ సక్సేనా కార్యాలయం పేర్కొంది. ఇదీ చదవండి: Delhi Liquor Policy: ఎల్జీ దెబ్బకు వెనక్కి తగ్గిన కేజ్రీవాల్.. మరో 6 నెలలు..! -
తైవాన్‌లో మరో కీలక నేత పర్యటన.. చైనాను అమెరికా రెచ్చగొడుతోందా?
తైపీ: అమెరికా సెనేట్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్‌లో పర్యటించటంపై ఇప్పటికే ఆగ్రహంతో ఉంది చైనా. పెలోసీ పర్యటన తర్వాత తైవాన్ను యుద్ధ విమానాలతో చుట్టుముట్టింది. అయినప్పటికీ కొద్ది రోజుల్లోనే అమెరికా చట్టసభ్యుల బృందం తైవాన్‌లో పర్యటించి మరింత ఆగ్రహం తెప్పించేలా చేసింది. చైనా సైనిక విన్యాసాలు చేపడుతూ తైవాన్ను బయపడుతున్న ఈ తరుణంలోనే అమెరికా గవర్నర్ తైపీలో పర్యటించారు. తైపీతో వాణిజ్య చర్చలు చేపడతామని అమెరికా ప్రకటించిన కొద్ది రోజుల్లోనే ఆయన పర్యటన చేపట్టటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆర్థిక అభివృద్ధి ట్రిప్‌లో భాగంగా ఆదివారం తైవాన్ చేరుకున్నారు అమెరికాలోని ఇండియాన రాష్ట్ర గవర్నర్ ఎరిక్ హోల్కోంబ్. తైవాన్ అధ్యక్షుడిని సోమవారం కలిశారు. కొద్ది రోజుల క్రితం స్పీకన్ నాన్సీ పెలోసీ తైవాన్‌లో పర్యటించటాన్ని వ్యతిరేకిస్తూ మిలిటరీ డ్రిల్స్ చేపట్టింది చైనా. దాంతో అమెరికా-చైనా మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. తైవాన్‌కు మద్దతుగా దౌత్యపరమైన చర్యలు చేపడితే ఊరుకునేది లేదని, తగిన విధంగా ప్రతిస్పందన ఉంటుందని చైనా హెచ్చరిస్తోంది. ఈ క్రమంలోనే అమెరికా గవర్నర్ హోల్కోంబ్తో భేటీ అయ్యారు తైవాన్ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్ వెన్. బీజింగ్ మిలిటరీ డ్రిల్స్‌పై మాట్లాడారు. తైవాన్‌కు మద్దతుగా నిలవాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. ‘ప్రస్తుతం మనం ప్రపంచ నిరంకుశత్వ నిరంతర విస్తరణవాదాన్ని ఎదుర్కొంటున్నాం. తైవాన్ జలసంధి ద్వారా చైనా నుంచి సైనిక బెదిరింపులను తైవాన్ ఎదుర్కొంటోంది. ఈ సమయంలో ప్రజాస్వామ్య మిత్రపక్షాలు ఒక్కతాటిపైకి వచ్చి అన్ని విధాల సహకారం అందించాలి.’ అని తైవాన్ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్ వెన్ పేర్కొన్నారు. తైవాన్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పరచుకునేందుకు తామెప్పుడూ సిద్ధమేనని స్పష్టం చేశారు అమెరికా గవర్నర్ హోల్కోంబ్. మరోవైపు.. బుధవారం దక్షిణ కొరియాకు వెళ్లేలోపు సెమీకండక్టర్ ఇండస్ట్రీకి చెందిన ప్రతినిధులతో హోల్కోంబ్ భేటీ అవుతారని అధికారవర్గాలు తెలిపాయి. ఇదీ చదవండి: భారత్‌లో ఆత్మాహుతి దాడులకు ప్లాన్.. సూసైడ్ బాంబర్ అరెస్ట్! -
రజనీకాంత్ పొలిటికల్ రీ ఎంట్రీ.. హాట్ టాపిక్‌గా వారి భేటీ!
సాక్షి, చెన్నై : సూపర్‌స్టార్ రజనీకాంత్ న్యూఢిల్లీ నుంచి వచ్చిన ఒక్క రోజు తర్వాత తమిళనాడు గవర్నర్ రవిని కలుసుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. సోమవారం రజనీకాంత్ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ రవితో దాదాపుగా 30 నిమిషాల సేపు మాట్లాడారు. ఇటీవల ఢిల్లీలో ప్రధానిని రజనీకాంత్ కలిశారని వార్తలొచ్చాయి. గవర్నర్ భేటీ అయిన తలైవా సమావేశానంతరం విలేకరులతో మాట్లాడారు. తాను రాజకీయాలపైనే గవర్నర్‌తో చర్చించానని చెప్పారు. అయితే తానేం మాట్లాడానో మీడియాకు వెల్లడించలేనన్నారు. తనకు భవిష్యత్‌లో కూడా రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని పునరుద్ఘాటించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పాలు, పెరుగు వంటి నిత్యావసరాలపై జీఎస్టీ వడ్డించడం గురించి విలేకరులు ప్రశ్నించగా నో కామెంట్ అంటూ వెళ్లిపోయారు. ఇది కూడా చదవండి: వెంకయ్య నాయుడికి తృణమూల్ ఎంపీ ‘చిక్కు’ ప్రశ్న -
గవర్నర్‌ను కలిసిన వైఎస్ షర్మిల.. కాళేశ్వరం అవకతవకలపై ఫిర్యాదు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిశారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. రాష్ట్రంలోని ప్రాజెక్టుల నిర్మాణంలో జరిగిన అవినీతిపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిపించాలని గవర్నర్‌ను కోరినట్లు చెప్పారు షర్మిల. ‘కాళేశ్వరం మూడేళ్లలో మునిగిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమైన మోసం, అబద్ధం. దేవాదుల చెక్కుచెదరలేదు.. కాళేశ్వరం మాత్రం మునిగిపోయింది. రూ. లక్ష కోట్లతో కట్టిన ప్రాజెక్టుతో ఏం సాధించారు. కాంక్రీటుతో కట్టాల్సిన ప్రాజెక్టులు బ్రిక్స్, మట్టితో కట్టారు’ అని ఆరోపించారు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఇదీ చదవండి: కొత్త ఉద్యోగాల భర్తీ అంకెల గారడీ : వైఎస్ షర్మిల -
గవర్నర్ పిలిస్తే సీఎస్, డీజీపీలే వెళ్లరు.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నిర్వహిస్తున్న మహిళాదర్బార్ బీజేపీ డైరెక్షన్లో ఉందని ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి ఆరో పించారు. రాజకీయంలో భాగంగా ఈ దర్బార్ ఏర్పాటు చేస్తున్నారే తప్ప దీంతో ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ సమ్మక్క, సారలమ్మ జాతరలో గవర్నర్‌కు సంబంధించిన ప్రొటోకాల్ పాటించకుండా అవమానపర్చిన అధికారులపై చర్యలు తీసుకోలేకపోయిన తమిళిసై ఇప్పుడు మహిళలకు, రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేయగలరని ప్రశ్నించారు. గవర్నర్ కు ఎలాంటి ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదని, గవర్నర్ పిలిస్తే సీఎస్, డీజీపీలు వెళ్లరని, అలాంటప్పుడు తమిళిసైకి ఫిర్యాదు చేస్తే ఏం ప్రయోజనమని అన్నారు. కాగా, టీఆర్ఎస్–బీజేపీల రాజకీయ సంబం ధం ఏమిటో రాష్ట్రపతి ఎన్నికతో తేలిపోతుందని, తటస్థంగా ఉంటామని ప్రకటిస్తే బీజేపీకి అనుకూలంగా ఉన్నట్లేనని అన్నారు. -
అంతర్జాతీయ యోగా ఉత్సవ్ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ తమిళిసై
-
త్రిపుర సీఎం బిప్లవ్‌దేవ్ రాజీనామా
అగర్తలా: ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో అనుహ్య పరిణామం నెలకొంది. బీజేపీ ముఖ్యమంత్రి బిప్లవ్‌దేవ్ శనివారం పదవికి రాజీనామా చేశారు. బీజేపీ హై కమాండ్ ఆదేశాలతో బిప్లవ్‌దేవ్ రాజీనామా చేశారు. ఈరోజు మధ్యాహ్నం బిప్లవ్‌దేవ్ గవర్నర్ సత్యదియో నారాయిన్ ఆర్యను కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు. కాగా, బిప్లవ్‌దేవ్ శుక్రవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలిసిన తర్వాత రోజే నేడు(శనివారం) రాజీనామా చేయడం విశేషం. ఇదిలా ఉండగా.. శనివారం సాయంత్రమే కొత్త సీఎంను అధిష్టానం నియమించనున్నట్టు సమాచారం. మరోవైపు.. వచ్చే ఏడాదే త్రిపురలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అనూహ్యంగా ఇలా సీఎం మార్పు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌కు బిగ్ షాక్ -
నీట్‌పై రగడ.. మరోసారి హీటెక్కిన తమిళ రాజకీయం
సాక్షి, న్యూఢిల్లీ: తమిళనాడులో నీట్(National Entrance-cum-Eligibility Test or NEET)పై రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా తమిళనాడులో నీట్ పరీక్షకు బదులుగా మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి సొంత ఎంట్రన్స్ నిర్వహించేందుకు వీలు కల్పించే బిల్లును ఎంకే స్టాలిన్ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదింపజేసింది. ఈ నేపథ్యంలో ఈ బిల్లును ఆమోదించాలని గురువారం తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం కోసం బిల్లును కేంద్ర హోం మంత్రిత్వశాఖకు పంపించారు. మరోవైపు.. ‘‘రాజ్యాంగ నిబంధనలకు లోబడి మాత్రమే నీట్ వ్యతిరేక బిల్లును గవర్నర్.. కేంద్ర హోంశాఖకు పంపారు. కానీ, రాష్ట్రపతి ఈ బిల్లును తిరస్కరిస్తారు’’ అని తమిళనాడు బీజేపీ చీఫ్ కె. అన్నామలై అన్నారు. కాగా, నీట్ పరీక్షకు కొన్ని గంటల ముందు సేలంలోని తన ఇంట్లో 19 ఏళ్ల వైద్య విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వం నీట్ వ్యతిరేక బిల్లును ప్రవేశపెట్టింది. ఇది కూడా చదవండి: రాజ్యాంగానికి విరుద్ధంగా జరుగుతుంటే కళ్లు మూసుకోం.. తమిళనాడు గవర్నర్ తీరు, కేంద్రంపై ఆగ్రహం -
వీసీల నియామకం రాష్ట్ర హక్కే: తమిళనాడు
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆది నుంచి గవర్నర్ తీరుపై గుర్రుగా ఉన్న డీఎంకే ప్రభుత్వం.. తమ తీరును మరోసారి అసెంబ్లీ సాక్షిగా చాటింది. సోమవారం కీలకమైన యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ల నియామకంలో అధికార మార్పిడికి కోసం.. సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది. తద్వారా ఇప్పటి వరకు గవర్నర్ పరిధిలో ఉన్న వీసీల నియామకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుంది. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ అసెంబ్లీ సమావేశంలో మాట్లాడుతూ, గుజరాత్ తరహాలోనే తమిళనాడులో సైతం వీసీల నియామకాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుందని అన్నారు. గవర్నర్ వద్ద ఈ అధికారులుంటే వివాదాలు తలెత్తుతాయని చెప్పారు. అందుకే తగిన మార్పులతో కొత్త సవరణ చట్టాన్ని తీసుకొచ్చామని వివరించారు. తమిళనాడు ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖ పరిధిలోని మొత్తం 13 వర్సిటీలు విద్యాబోధనలో చారిత్రాత్మకమైన విధానాలను అవలంభిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి వీసీల నియమించే అధికారం లేకపోవడం వల్ల వర్సిటీల పనితీరులో అవకతవకలతో ప్రశ్నార్థకంగా మార్చివేసిందని అన్నారు. ఈ ఏడాది జనవరిలోనే.. అంతకు ముందు ఉన్నత విద్యాశాఖమంత్రి పొన్ముడి తమిళనాడు యూనివర్సిటీల సవరణ చట్టం –2022 బిల్లును అసెంబ్లీలో సోమవారం ప్రవేశపెట్టగా ఆమోదించారు. బిల్లు ప్రవేశపెడుతున్న దశలోనే బీజేపీ సభ్యులు వాకౌట్ చేసి నిరసన తెలిపారు. అన్నాడీఎంకే అధికారంలో ఉన్నకాలంలో తమిళనాడు గవర్నర్ భన్వారీలాల్ పురోహిత్ రాష్ట్ర ఉన్నతవిద్యశాఖకు సంబంధించి బీజేపీకి అనుకూలంగానే వ్యవహరించారనే ఆరోపణలు వచ్చాయి. వర్సిటీలకు వైస్ చాన్స్లర్ల పేర్లను ప్రభుత్వం ప్రతిపాదించగా గవర్నర్ కేవలం ఆమోదముద్ర మాత్రమే వేయాల్సి ఉందని డీఎంకే ప్రభుత్వం అంటోంది. అయితే అన్నాడీఎంకే హయాంలో గవర్నర్ భన్వారీలాల్ వీసీల నియామకం పూర్తి చేయడం వల్లనే ప్రభుత్వానికి, రాజ్‌భవన్‌కు మధ్య విబేధాలు మొదలైనాయని డీఎంకే శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. ఇందువల్లే అన్నావర్సిటీ వీసీ సూరప్పపై గత అన్నాడీఎంకే ప్రభుత్వం అవినీతి ఆరోపణలు చేయడంతోపాటు విచారణకు ఆదేశించింది. ఈ వ్యవహారం ప్రస్తుతం మద్రాసు హైకోర్టులో విచారణ దశలో ఉంది. ఈ నేపథ్యంలో గవర్నర్ భన్వారీలాల్ పురోహిత్ బదిలీ కాగా ఆర్ఎన్ రవి ఆ తరువాత బాధ్యతలు చేపట్టారు. కొత్త గవర్నర్ సైతం భన్వారీలాల్ కంటే ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వం పట్ల ఘర్షణ వైఖరి అవలంభిస్తున్నట్లు డీఎంకే భావిస్తోంది. అంతేగాక ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులను తమిళనాడు వీసీలుగా నియమించడం చర్చకు దారితీసింది. ఇకపై వీసీలను రాష్ట్ర ప్రభుత్వమే నియమిస్తుందని, ఇందుకు సంబంధించిన బిల్లును రాబోయే బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెడుతామని జనవరిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం స్టాలిన్ ప్రకటించారు. అనేక రాష్ట్రాల్లో వీసీల నియామకం ప్రభుత్వమే చేస్తోందని, కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇదే విధానాన్ని అమలు చేస్తున్నారని ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడి అదే అసెంబ్లీ సమావేశంలో స్పష్టం చేశారు. కొసమెరుపు తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి అధ్యక్షతన తమిళనాడులోని అన్ని యూనివర్సిటీల వీసీలు, విభాగాధిపతుల మహానాడు నీలగిరి జిల్లా ఊటీలో ‘నవ ప్రపంచలో భారత్ భాగస్వామ్యం’ అనే అంశంపై సోమవారం జరిగింది. ఈ మహానాడు జరుగుతున్న సమయంలో గవర్నర్ అధికారాలను కత్తిరిస్తూ అసెంబ్లీలో ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టడం గమనార్హం. బీజేపీ వాకౌట్ వీసీల నియామకం వ్యవహారంపై బీజేపీ సభ్యులు వాకౌట్ చేయగా, అన్నాడీఎంకే సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసి, మరో అంశంపై వాకౌట్ చేశారు. -
TS: గవర్నర్‌పై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను ఉద్దేశించి ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సభ్యుడిని గవర్నర్ పీఆర్వోగా పెట్టుకోవడం చాలా అక్రమమని అన్నారు. ఈ వ్యవహారంతో.. తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ చేస్తున్న ఫిర్యాదులు చేయగా.. రాజకీయంగా చాలా అనుమానాలకు తావిస్తున్నాయని అన్నారు. అయితే ఇటీవల గవర్నర్ తమిళిసైకి తెలంగాణ ప్రభుత్వానికి మధ్య ప్రోటోకాల్‌కు సంబంధించిన వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇదే విషయంలో గవర్నర్ సైతం కేంద్రానికి పలు ఫిర్యాదులు కూడా చేశారు. ఇటీవల సీఎం కేసీఆర్‌తో కలిసి పనిచేయడం కష్టమంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. సీఎం కేసీఆర్ గవర్నర్‌తో వ్యహరిస్తున్న తీరును బీజేపీ తప్పుపడుతోంది. @DrTamilisaiGuv Excellency the Governor is a titular head and appointing a bjp party member as your Public relations officer is a case of impropriety ,it also raises doubts about your complaints with regards to @TelanganaCMO https://t.co/mihPZBXrcX — Asaduddin Owaisi (@asadowaisi) April 22, 2022 -
గవర్నర్ పీఏ హఠాన్మరణం
గాంధీఆస్పత్రి (హైదరాబాద్): గవర్నర్ తమిళిసైకి వ్యక్తిగత సహాయకుడు మొలుగురి రాజ్‌కుమార్ (47) గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. సికింద్రాబాద్ పద్మారావునగర్ స్కందగిరి ఆలయంలో నిర్వహించిన స్వర్ణబంధన మహా కుంభాభిషేకంలో గవర్నర్ తమిళిసై ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆమె వెంట వెళ్లిన రాజ్‌కుమార్.. ఆలయసిబ్బంది గవర్నర్‌కు బహూకరించిన జ్ఞాపికలు, శాలువాలను తీసుకుని ఎస్కార్ట్ వాహనం వద్దకు వచ్చారు. అక్కడ తోటి ఉద్యోగులతో మాట్లాడుతూ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. గవర్నర్ కాన్వాయ్వాహన సిబ్బంది వెంటనే ఆయనను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్య పరీక్షల అనంతరం డాక్టర్లు ధ్రువీకరించారు. ఆయన భార్య శ్రీలత ఆస్పత్రికి చేరుకుని ‘మధ్యాహ్నం భోజనానికి వస్తానని చెప్పి వెళ్లిన మనిషి తిరిగిరాని లోకానికి వెళ్లిపోయావా’ అంటూ భోరున విలపించింది. కాగా, రాజ్‌కుమార్‌కు కుమారుడు ఉదయ్, కుమార్తె కీర్తి ఉన్నారు. పూజా కార్యక్రమాలను ముగించుకుని గవర్నర్ తమిళిసై కాన్వాయ్ వద్దకు వచ్చిన అనంతరం.. రాజ్‌కుమార్ మృతి సమాచారాన్ని ఆమెకు సిబ్బంది తెలిపారు. చదవండి👉🏾 Warangal Premonmadi: వరంగల్‌లో ప్రేమోన్మాది ఘాతుకం.. చున్నీతో చేతులు కట్టేసి.. -
కేసీఆర్‌తో కలిసి పని చేయడం కష్టం..గవర్నర్ సంచలన వ్యాఖ్యలు
-
కేసీఆర్‌తో కలిసి పని చేయడం కష్టం: గవర్నర్ తమిళసై
సాక్షి, చెన్నై/ హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావుతో కలిసి పని చేయడం కష్టమని అన్నారు. చెన్నైలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తాను ఇద్దరు వేర్వేరు ముఖ్యమంత్రులతో పని చేస్తున్నానని తెలిపారు. రెండూ రాష్ట్రాల్లో విధులు చాలా భిన్నమైనవని అన్నారు. ఇప్పుడు తాను వారితో కలిసి పని చేశానని ఇక ఇతర ముఖ్యమంత్రులతో కూడా పని చేయగలనని తనకు తెలుసన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన కొందరు సీఎంలు (తెలంగాణ సీఎంను ఉద్దేశించి) నియంతృత్వంగా మారేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఇది మంచిది కాదని గవర్నర్ తమిళిసై హితవు పలికారు. తనను మరో రాష్ట్రానికి మారుస్తారన్నది నిజం కాదని స్పష్టం చేశారు. తాను రబ్బర్ స్టాంప్ కాదని తెలిపారు. ఎవరు గవర్నర్‌గా ఉన్నా.. ప్రోటోకాల్ పాటించాల్సిందేనని తెలిపారు. రాజ్‌భవన్ ఆహ్వానాలను రాజకీయంగా చూడకూడదని అన్నారు. ఏ విభేదాలు ఉన్నా, చర్చలతో పరిష్కరించుకుందామని గవర్నర్ తమిళిసై తెలిపారు. -
ఏపీ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారు
-
ఆక్సిజన్ ప్లాంట్‌ను ప్రారంభించిన గవర్నర్
సాక్షి,సిటీబ్యూరో: కోవిడ్ సమయంలో పేదలకు సేవ చేయడంలో దుర్గాబాయి దేశ్‌ముఖ్ హాస్పిటల్ చేసిన కృషి ఎనలేనిదని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రశంసించారు. డి.ఇ.షా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సేవా భారతి భాగస్వామ్యంతో ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్‌ను శుక్రవారం గవర్నర్ ప్రారంభించారు. కార్యక్రమంలో సేవా భారతి తెలంగాణ ప్రధాన కార్యదర్శి రామ్మూర్తి, దుర్గాబాయి దేశముఖ్ మహిళా అధ్యక్షురాలు ఉషారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గవర్నర్ వర్సెస్ తెలంగాణ ప్రభుత్వం? తమిళిసై ఏం చేయబోతున్నారు?
సాక్షి, హైదరాబాద్: కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పెరిగిన విభేదాల ప్రభావం.. రాష్ట్ర ప్రభు త్వం, గవర్నర్ మధ్య సంబంధాలపై పడిందా? రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ మధ్య అగాధం పెరిగిందా? ఈ ప్రశ్నలకు తాజా పరిణామాలు ఔననే సమాధానమిస్తున్నాయి. ఏటా పరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా నిర్వహించే రాష్ట్రస్థాయి గణతంత్ర వేడుకలను ఈ ఏడాది కోవిడ్‌ను కారణంగా చూపి రాజ్‌భవన్‌కు మార్చడం.. సీఎం కేసీఆర్ సహా మంత్రు లు ఈ వేడుకలకు దూరంగా ఉండటం.. పైగా గవర్నర్ తన ప్రసంగంలో కేంద్రం, ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించడం.. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ పథకాలనుగానీ, సీఎం కేసీఆర్‌ను గానీ ప్రస్తావించకపోవడంపై తీవ్ర చర్చ జరుగుతోంది. దీనికితోడు గవర్నర్ గురువారం బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు ఫోన్ చేసి నిజామాబాద్ జిల్లాలో ఆయనపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి ఘటన గురించి ఆరాతీయడం కూడా.. విభేదాలకు అద్దంపడుతోందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. పైకి ఏమీ లేదంటున్నా..! కోవిడ్ మూడో వేవ్ నేపథ్యంలో గణతంత్ర దినోత్సవాన్ని రాజ్‌భవన్‌కు మార్చి నిరాడంబరంగా నిర్వహించాలని.. సీఎం, మంత్రులు వేడుకలకు దూరంగా ఉండాలని కేబినెట్ నిర్ణయించిందని అధికారవర్గాలు చెప్తున్నాయి. కానీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల సీఎంలు తమ రాష్ట్రాల్లో జరిగిన గణతంత్ర వేడుకల్లో పాల్గొనగా.. ఇక్కడ దూరంగా ఉండటం వెనుక రాజకీయ కారణాలున్నట్టు చర్చ జరుగుతోంది. తెలంగాణ కన్నా ఎన్నోరెట్లు ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో సైతం గణతంత్ర వేడుకలను యధావిధిగా నిర్వహించడం, ఆయా రాష్ట్రాల సీఎంలు వేడుకల్లో పాల్గొనడం ఇందుకు నిదర్శనమని అంటున్నారు. ఇక గవర్నర్ తమిళిసై తన ప్రసంగంలో ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వ పథకాలను అభినందించారు. కానీ ఎక్కడా సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ప్రస్తావన తేలేదు. అంతేగాకుండా ఉస్మానియా సహా రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య సదుపాయాలు, సేవలు మెరుగుపర్చాల్సిన అవసరముందని వ్యాఖ్యానించారు. ఇక ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు ఫోన్ చేసి మాట్లాడిన గవర్నర్.. సదరు దాడి ఘటన గురించి కేంద్ర హోంశాఖకు నివేదిక సైతం పంపించనున్నట్టు తెలిసింది. కేంద్రంపై కయ్యానికి దిగడంతో.. ఇటీవల యాసంగిలో బాయిల్డ్ రైస్ కొనబోమని కేంద్రం తేల్చి చెప్పడం, కొనాల్సిందేనని సీఎం కేసీఆర్ పట్టుబట్టడంతో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం మొదలైంది. ఈ క్రమంలో ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు కూడా. ఇది గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వ సంబంధాలపైనా ప్రభావం చూపినట్టు రాజకీయవర్గాలు చెప్తున్నాయి. గవర్నర్ తమిళిసై గతనెలలో రాజ్‌భవన్ ప్రవేశద్వారం వద్ద గ్రీవెన్స్బాక్స్ను ఏర్పాటు చేసి.. ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తుండటం రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ఇబ్బందికరంగా మారిందని అంటున్నాయి. బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య విమర్శల పర్వం మొదలైన తర్వాతే.. గవర్నర్ తమిళిసై ఈ నిర్ణయం తీసుకున్నారని గుర్తుచేస్తున్నాయి. తమిళిసై రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు దాటిపోయినా.. రాష్ట్ర ప్రభుత్వంతో సఖ్యతతోనే వ్యవహరించారు. ఇటీవల కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం కయ్యానికి దిగడంతో.. గవర్నర్ తన అస్త్రాలను బయటకు తీసి, అమలుపరుస్తున్నట్టు చర్చ జరుగుతోంది. -
AP: నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు నివాళులర్పించిన గవర్నర్
సాక్షి, విజయవాడ: నేతాజీ సుభాష్ చంద్రబోస్ జాతికి అందించిన నిస్వార్థ సేవను దేశం ఎప్పటికీ మరువదని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. నిజమైన జాతీయవాదిగా భారతదేశం పట్ల ఆయనకున్న ప్రేమ, దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన విషయమని తెలిపారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతిని దేశవ్యాప్తంగా ‘పరాక్రమ్ దివస్’గా జరుపుకుంటున్న శుభతరుణంలో ఆదివారం విజయవాడ రాజ్‌భవన్ దర్బార్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. ఇప్పటికీ దేశంలోని అనేకమంది ప్రజల హృదయాల్లో నేతాజీ జీవించే ఉన్నారని తెలిపారు. బోసు జయంతి సందర్భంగా జరుపుకునే ‘పరాక్రమ్ దివస్’ దేశ ప్రజలకు, ముఖ్యంగా యువతకు కష్టనష్టాలను ఎదుర్కొనేందుకు అవసరమైన ధైర్యాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. నేతాజీ అడుగుజాడల్లో నడవడానికి ‘పరాక్రమ్ దివస్’ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని తెలిపారు. -
సీఎంకు వ్యతిరేకంగా గవర్నర్ మెసేజ్‌లు.. అనైతికమని ఎంపీ ఫైర్
కోల్‌కతా: తృణమూళ్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సౌగతా రాయ్ పశ్చిమబెంగాల్ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధంఖర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా గవర్నర్ తనకు మెసేజ్‌లు పంపుతున్నారని ఆరోపించారు. గవర్నర్ స్థాయి వ్యక్తి ఇలాంటి చర్యలకు పాల్పడటం అనైతికమని విమర్శిచారు. తాను తృణమూళ్ కాంగ్రెస్ ఎంపీనని, సీఎం మమతా బెనర్జీ తమ పార్టీ అధినేత్రి అని అన్నారు. గవర్నర్‌ను ఎవరో వెనక ఉండి నడిపిస్తూ.. ఈ చర్యలకు పాల్పడాలని ప్రభావితం చేస్తున్నారని అనుమానం వ్యక్తంచేశారు. ఇటీవల గవర్నర్ జగదీప్ ధంఖర్ బీజేపీ నేతలు కేంద్రమంత్రి అమిత్ షా, సువేందు అధికారిని కలిసిన తర్వాత నుంచి ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా మెసేజ్‌లు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం ఈ విషయం బెంగాల్ రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. -
పేదోడి ఇంట్లో గవర్నర్ భోజనం.. ఆపై రూ.14 వేలు బిల్లు చేతిలో పెట్టారు!
Madhya Pradesh Man Gets Rs 14 000 Bill : మధ్యప్రదేశ్‌లోన విదిషా జిల్లాలోని ఓ గ్రామంలో ఆదివాసీ బుధ్రామ్ ఓ గుడిసెలో నివసిస్తున్నాడు. అయితే అతనికి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద అధికారులు పక్కా ఇల్లు కట్టించారు. ఈ మేరకు గవర్నర్ మంగూభాయ్ సి పటేల్ గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వయంగా ఇంటి తాళం చెవిని అందజేశారు. అంతేకాదు బుధ్రామ్‌తో కలిసి భోంచేశారు. గవర్నర్ తన ఇంట్లో భోజనం చేయడంతో బుధ్రామ్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఇదంతా ఒకటైతే.. గవర్నర్ వెళ్లిపోయాక కొంతమంది అధికారులు సదరు ఆదివాసీ చేతిలో రూ. 14వేల బిల్లు చేతిలో పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. (చదవండి: పాములతో మ్యూజిక్ షూట్... షాకింగ్ వీడియో!) వివరాల్లోకి వెళితే.. గవర్నర్ ఆ ఇంటికి వస్తుండటంతో అధికారులు రంగంలోకి దిగారు. అతని నిరాడంబరమైన ఇంటికి కొత్త గేట్, ఫ్యాన్లను అమర్చారు. అయితే బుధ్రామ్ అవన్ని ఏర్పాటు చేసేంత సొమ్ము తన వద్ద లేదని ముందుగానే అధికారులకు చెప్పాడు. అయినప్పటికీ అధికారులు పర్వలేదంటూ అన్ని వారే ఏర్పాటు చేశారు. ఈ మేరకు గవర్నర్ రావడం బుధ్రామ్‌తో కలిసి ఇంట్లో భోజనం చేయడం, ఫోటోలు దిగడం అన్ని చకచక జరిగిపోయాయి. అయితే కాసేపటి తర్వాత పంచాయతీ సభ్యులు, పార్టీ అభిమానులను బుధ్రామ్ ఆదివాసి వద్దకు వచ్చి గేటుకు రూ 14,000 కట్టాలి డబ్బుల ఇవ్వమని అడిగారు. దీంతో బుధ్రామ్ ఒక్కసారిగా షాక్‌కి గురవుతాడు. ఇంత ఖర్చు అవుతుందని తెలిస్తే ఆ గేటును తాను పెట్టించుకునే వాడిని కాదన్నాడు. బుద్రామ్కు ఎదురైన సమస్యను రాష్ట్ర పట్టణ అభివృద్ధి మంత్రి భూపేంద్ర సింగ్ మాట్లాడారు. ఇలా జరిగి ఉండాల్సింది కాదని అన్నారు. చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇది గవర్నర్ ప్రతిష్టను దెబ్బతీసే అంశమని పేర్కొన్నారు. కాగా, ఈ ఘటనతో కాంగ్రెస్, బీజేపీల మధ్య రాజకీయ వార్ మొదలైంది. దీనిపై అర్బన్ డెవలప్మెంట్ మంత్రి భూపేంద్ర సింగ్ మాట్లాడుతూ.. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, సదరు ఆదివాసీ వద్దకు వెళ్లి డబ్బులు వసూలు చేయడానికి చూసిన అధికారులపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు. (చదవండి: సన్నీ లియోన్‌కి హోం మంత్రి వార్నింగ్!) -
ఏపీ గవర్నర్‌కు మరోసారి అస్వస్థత.. హైదరాబాద్‌కు తరలింపు
సాక్షి, అమరావతి: ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ మరోసారి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ఆదివారం రాత్రి హైదరాబాద్‌కు తరలించి అక్కడి ఏఐజీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. కొద్దిరోజుల క్రితం గవర్నర్ కరోనా బారినపడి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే. అప్పట్లో కరోనా రిపోర్టు నెగిటివ్ రావడంతో డిశ్చార్జి అయి విజయవాడకు చేరుకున్నారు. కానీ, ఆదివారం రాత్రి మరోసారి అస్వస్థతకు గురికావడంతో రాజ్‌భవన్ వర్గాలు తిరిగి డాక్టర్లను సంప్రదించగా, అదనపు చికిత్స అవసరమని వారు సూచించినట్లు తెలిసింది. -
ఏపీ గవర్నర్‌కు కరోనా
సాక్షి, అమరావతి: ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇటీవల ఢిల్లీ పర్యటన ముగించుకుని విజయవాడ వచ్చిన గవర్నర్.. రెండు రోజులుగా జలుబు, దగ్గుతో బాధపడుతున్నారు. దీంతో ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయగా కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో బుధవారం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తరలించి ఏఐజీ ఆస్పత్రిలో చేర్చారు. ప్రత్యేక వైద్య నిపుణుల బృందం ఆధ్వర్యంలో ఆయనకు సీటీ స్కాన్, ఇతర వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నారు. అయితే గవర్నర్‌కు కరోనా సోకినట్టు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆక్సిజన్ స్థాయి సాధారణంగానే ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఏఐజీ డైరెక్టర్‌తో ఫోన్లో మాట్లాడిన ఏపీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆరోగ్యంపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరా తీశారు. హైదరాబాద్‌లో గవర్నర్‌కు చికిత్స అందిస్తున్న ఏఐజీ చైర్మన్, సీనియర్ వైద్యుడు డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డితో సీఎం నేరుగా ఫోన్ చేసి మాట్లాడారు. గవర్నర్ ఆరోగ్య పరిస్థితి, అందిస్తున్న వైద్యంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
ఏపీ గవర్నర్ విశ్వభూషణ్‌కు అస్వస్థత.. హెల్త్ బులెటిన్ విడుదల
AP Governor Biswabhusan Harichandan is Unwell: సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆరోగ్యంపై ఏఐజీ హస్మిటల్స్ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. 88 ఏళ్ల గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ నవంబర్ 17న మధ్యాహ్నం 1 గంటకు గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్స్‌లో అడ్మిట్ అయ్యారని వైద్యులు పేర్కొన్నారు. అయితే గవర్నర్‌కు నవంబర్ 15న కోవిడ్ పాజిటివ్‌గా తేలిందని, ప్రస్తుతం ఆయనకు ఆక్సిజన్ అందిస్తున్నామని వైద్యులు వెల్లడించారు. కాగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ బుధవారం అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనను ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. వివరాలు తెలుసుకున్న సీఎం జగన్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆరోగ్యంపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరా తీశారు. ఏఐజీ చైర్మన్, సీనియర్ వైద్యుడు డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డితో సీఎం నేరుగా ఫోన్లో మాట్లాడారు. గవర్నర్ ఆరోగ్య పరిస్థితి, అందిస్తున్న వైద్యంపై వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. గవర్నర్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఈ సందర్భంగా డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. (చదవండి: మరోసారి మెరిసిన ఏపీ పోలీస్) -
కోటి దీపోత్సవానికి హాజరైన తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్
-
బ్లాక్‌క్యాట్ ర్యాలీని ప్రారంభించిన గవర్నర్ తమిళిసై
-
బతుకమ్మ వేడుకలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్, ఎమ్మెల్సీ కవిత
-
మానసిక రుగ్మతలను ముందే గుర్తించాలి
సాక్షి, హైదరాబాద్: మానసిక రుగ్మతలను ముందే గుర్తించి చికిత్స అందిస్తే తీవ్ర పరిణామాలను నివారించగలమని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ తెలంగాణ విభాగం 7వ వార్షిక సదస్సును శనివారం ఆమె రాజ్‌భవన్ నుంచి వర్చువల్‌గా ప్రారం భించి మాట్లాడారు. దేశంలో ప్రతీ ఆరుగురిలో ఒకరు మానసిక సమస్యలతో బాధపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్–19 తర్వాత ఈ రుగ్మతలు ఎక్కువయ్యాయని తెలిపారు. మానసిక సమస్యల వల్ల దేశం 2012–30 మధ్య కాలం లో 1.3 ట్రిలియన్ డాలర్లను నష్టపోనుందని గవర్నర్ ఓ సర్వేను ఉటంకించారు. ప్రస్తుత పరిస్థితుల్లో మానసిక సమస్యల పట్ల అందరూ అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు. మానసిక రుగ్మతలతో బాధపడే వ్యక్తులను చిన్నచూపు చూడవద్దని, వారిపట్ల వివక్ష ప్రదర్శించవద్దని కోరారు. మానసిక సమస్యల గురించి కొందరు ప్రముఖులు బహిరంగంగా మాట్లాడి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారని గవర్నర్ అభినందించారు. -
డిజిటల్ మొబైల్ వ్యాన్లను ప్రారంభించిన గవర్నర్ తమిళసై
-
వరకట్నానికి వ్యతిరేకంగా గవర్నర్ నిరాహార దీక్ష
తిరువనంతపురం: కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ పేరు ఈ రోజు ఉదయం నుంచి సోషల్ మీడియా, మీడియాలో తెగ వైరలవుతోంది. కారణం ఏంటంటే ఆయన వరకట్నాకి వ్యతిరేకంగా ఒక్క రోజు నిరాహార దీక్ష చేశారు. ఆరిఫ్ మహమ్మద్ ఖాన్.. తిరువనంతపరంలోని తన కార్యాలయంలో ఈ నిరసన దీక్షకు కూర్చున్నారు. ఇటీవల కేరళలో వెలుగు చూసిన వరకట్న వేధింపులు కేసుపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేరళలో పలు ప్రజా సంఘాలు వరకట్నానికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేపట్టాయి. గాంధీ భవన్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. వారికి సంఘీభావంగా గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ కూడా రాజ్‌భవన్‌లో దీక్షకు కూర్చున్నారు. వరకట్నం గురించి ప్రజల్లో అవగాహన తెచ్చేందుకే ఆయన దీక్ష చేస్తున్నట్లు రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా ఖాన్ మాట్లాడుతూ.. ‘‘అక్షరాస్యలో ముందున్న మన రాష్ట్రానికి ఇది ఎంతో సిగ్గుచేటు. వరకట్నం తీసుకోవడం, ఇవ్వడం నేరం. అలా చేస్తే ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. మన రాష్ట్రాభివృద్ధిలో మహిళలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాంటి మహిళల గౌరవానికి వరకట్నం భంగం కలిగిస్తుంది. ఏ యువకుడైనా తన పెళ్లికి కట్నం డిమాండ్ చేస్తే అతడు చదువును, దేశాన్ని అవమానించినట్లేనని గాంధీజీ చెప్పారు. ఎవరూ కట్నం తీసుకోబోమని యువత ప్రతిజ్ఞ చేయాలి. వరకట్న వేధింపులకు ముగింపు పలకాలి’’ అని మహమ్మద్ ఆరిఫ్ ఖాన్ పేర్కొన్నారు. వరకట్నానికి వ్యతిరేకంగా ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఖాన్ అభిప్రాయపడ్డారు. మహిళల గౌరవానికి సంబంధించి కేరళ ప్రభుత్వం చేపట్టిన స్త్రీపక్ష కేరళం కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలన్నారు. ఉదయం 8 గంటలకు దీక్ష ప్రారంభించిన ఆయన 6 గంటలకు విరమించారు. సాయంత్రం 5 గంటలలకు గాంధీ భవన్‌కు వెళ్లి.. వరకట్నానికి వ్యతిరేకంగా దీక్ష చేపట్టిన ప్రజా సంఘాలను మద్దతు తెలిపారు. గవర్నర్ ఇలా వరకట్నానికి వ్యతిరేకంగా దీక్ష చేయడం పట్ల జనాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
గవర్నర్ గా నియమించినందుకు ధన్యవాదాలు : హరిబాబు
-
కోవిడ్ మూడో దశను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి : గవర్నర్ తమిళసై
-
తెలంగాణ : గవర్నర్ తమిళసైతో కాంగ్రెస్ నేతల బృందం భేటీ
-
West Bengal: అంకుల్ జీ అంటూ గవర్నర్‌పై ఆరోపణలు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో గవర్నర్ జగ్దీప్ ధన్కర్, తృణమూల్ ఎంపీ మహువా మోయిత్రా మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఆదివారం నుంచీ ఈ ఇద్దరూ ఒకరిపై మరొకరు ట్వీట్ల ద్వారా విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. ముఖ్యంగా గవర్నర్‌ను అంకుల్ జీ అని సంబోధిస్తూ.. మహువా ట్వీట్లు చేస్తుండటం గమనార్హం. ఇక తాజాగా తన ‘‘కుటుంబ సభ్యులు, ఇతర పరిచయస్తులను రాజ్‌భవన్‌లో ఓఎస్డీలుగా నియమించారు’’ అంటూ మహువా మోయిత్రా చేసిన ఆరోపణలను గవర్నర్ జగదీప్ ధన్కర్ సోమవారం తోసిపుచ్చారు. రాష్ట్రంలో "భయంకరమైన శాంతిభద్రతల పరిస్థితి" నుంచి ప్రజల దృష్టిని మళ్ళించడానికే ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై జగదీప్ ధన్కర్ ‘‘ఓఎస్డీలుగా నియమించిన ఆరుగురు వ్యక్తులు నా కుటుంబ సభ్యులు అంటూ మీడియాలో ప్రచారం చేయడం నిజంగా తప్పు. వారు నాకు బంధువులు అనే మాట పూర్తిగా అవాస్తవం. ఈ ఓఎస్డీలు మూడు రాష్ట్రాలకు, నాలుగు వేర్వేరు కులాలకు చెందిన వారు. వీరిలో ఎవరూ మా కుటుంబంలో భాగం కాదు. వీరిలో కనీసం ఒక్కరు కూడా నా సొంత రాష్ట్రానికి, కులానికి చెందిన వారు ఒక్కరు కూడా లేరు’’ అంటూ ట్వీట్ చేశారు. Assertion @MahuaMoitra in tweet & Media that six coterminous appointee OSDs in personal staff are relatives is FACTUALLY WRONG. OSDs are from three states and belong to four different castes. None of them is part of close family. Four of them are not from my caste or state. — Governor West Bengal Jagdeep Dhankhar (@jdhankhar1) June 7, 2021 దీనిపై మహువా వెంటనే స్పందించారు. వాళ్ల చరిత్ర ఏంటో, వారిలో ఎవరు.. ఎలా రాజ్‌భవన్‌లోకి వచ్చారో వెంటనే చెప్పాలని డిమాండ్ చేస్తూ మరో ట్వీట్ చేశారు. బీజేపీ ఐటీ సెల్ వాళ్లు కూడా ఈ విషయంలో మీకు ఏ సాయం చేయలేరని మోయిత్రా ఎద్దేవా చేశారు. అంతేకాదు మీకు ఉపరాష్ట్రపతి పదవి కూడా దక్కుతుందని అనుకోవడం లేదంటూ ట్వీట్ చేశారు. చదవండి: బెంగాల్లో శాంతి భద్రతల పరిస్థితి... తీవ్ర ఆందోళనకరం -
మూడోసారి బెంగాల్ పీఠంపై దీదీ
కోల్‌కతా: హోరాహోరీ అసెంబ్లీ ఎన్నికల పోరులో విజయఢంకా మోగించిన తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ వరసగా మూడోసారి బెంగాల్ సీఎంగా ప్రమాణం చేశారు. బుధవారం కోల్‌కతాలోని రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జగ్దీప్ ధన్కర్ ఆమెతో సీఎంగా ప్రమాణంచేయించారు. మమత కేబినెట్లో కొత్త మంత్రులంతా 9వ తేదీన ప్రమాణం చేయను న్నారు. రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల తర్వాత హింస చెలరేగడానికి కారకులైన వారిని వదిలిపెట్టేదిలేదని ఈ సందర్భంగా ఆమె ప్రతిజ్ఞ చేశారు. బెంగాల్లో కోవిడ్ కట్టడే తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని మమత స్పష్టంచేశారు. కాగా, సీఎంగా ప్రమాణంచేసిన మమత దీదీకి అభినందనలు అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. దేశంలోని పౌరులందరికీ ఉచితంగా టీకా ఇవ్వాలని విజ్ఞప్తిచేస్తూ ప్రధాని మోదీకి మమత ఓ లేఖ రాశారు. అల్లర్లను చెల్లెలు మమత అదుపుచేయగలదు: గవర్నర్ ధన్కర్ ‘మూడోసారి సీఎం అయిన మమతకు ధన్య వాదాలు. అయితే, ప్రస్తుతం అల్లర్లు, హింసతో బెంగాల్ తీవ్ర సంక్షోభంలో ఉంది. ఈ హింసా త్మక ఘటనలకు నా సోదర సమానురాలైన మమతా బెనర్జీ అడ్డుకట్ట వేయగలదనే నమ్ముతున్నా. హింసకు గురౌతున్న మహిళలు, చిన్నారులను రక్షించి తక్షణమే శాంతిభద్రతలను ఆమె అదుపులోకి తెస్తారని భావిస్తున్నా’అని గవర్నర్ ధన్కర్ వ్యాఖ్యానించారు. -
సీపీ అంజనీకుమార్ కుమారుడి వివాహ ఫోటోలు
-
నిమ్మగడ్డ లేఖ.. లక్ష్మణ రేఖ దాటిందా
సాక్షి, అమరావతి: రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర అధిపతి హోదాలో ఉన్న గవర్నర్ విశ్వభూషణ్‌ను శాసించే రీతిలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ లేఖ రాయడంపై న్యాయ కోవిదులు, నిపుణులు, రాజకీయ పరిశీలకులు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గవర్నర్‌ను ఉద్దేశించి శుక్రవారం రాసిన లేఖలో నిమ్మగడ్డ ఉపయోగించిన భాష, తద్వారా ప్రస్ఫుటమైన భావం తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని, తద్వారా రేఖ దాటారని స్పష్టం చేస్తున్నారు. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తన పనితీరును విమర్శిస్తున్నారని నిమ్మగడ్డ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. అయితే ఆయన అంతటితో ఆగకుండా తన ఫిర్యాదుపై స్పందించి గవర్నర్ ఏం చేయాలో కూడా నిర్దేశించడం కచ్చితంగా పరిధి దాటటమేనని నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఆదేశించే అధికారం ఎక్కడిది? ‘ఈ వ్యవహారంపై రాష్ట్ర అడ్వొకేట్ జనరల్‌ను సంప్రదించవద్దు... కేంద్ర అటార్నీ జనరల్‌నే సంప్రదించండి’ అని హుకుం జారీ చేస్తున్నట్లుగా గవర్నర్‌కు చెప్పడమంటే.. తన దృష్టికి వచ్చిన ఓ అంశంపై ఎలా వ్యవహరించాలో గవర్నర్‌కు తెలియదన్నట్లుగా నిమ్మగడ్డ వ్యవహార శైలి ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ‘గవర్నర్ తన దృష్టికి వచ్చిన అంశాలపై ఉన్నతాధికారులు, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నవారు, నిపుణులను సంప్రదించి తగిన విధంగా స్పందిస్తారు. అది ఆయన విచక్షణాధికారాలకు సంబంధించిన విషయం. కానీ అందులో నిమ్మగడ్డ అనుచిత జోక్యం చేసుకోవడం ద్వారా తన పరిధిని పూర్తిగా అతిక్రమించారు’ అని రాజ్యాంగ నిపుణుడు ఒకరు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర అడ్వొకేట్ జనరల్‌ను సంప్రదించవద్దని, కేంద్ర అటార్నీ జనరల్‌నే సంప్రదించాలని గవర్నర్‌ను ఆదేశించే అధికారం ఎన్నికల కమిషనర్‌కు ఎక్కడిదని వ్యాఖ్యానించారు. ఆనవాయితీ ప్రకారం చూసినా.. ‘నిమ్మగడ్డకు విశ్వాసం లేకుంటే ఆయన సంప్రదించకూడదు. కానీ గవర్నర్ ఎందుకు సంప్రదించకూడదో అర్థం కావడం లేదు. అంటే తనకు విశ్వాసం లేదు కాబట్టి గవర్నర్ కూడా విశ్వసించరాదని ఆదేశించినట్లుగా ప్రవర్తించారు. అడ్వొకేట్ జనరల్‌పై గవర్నర్ తన పరిశీలనతో ఓ అంచనాకు వస్తారు. సంప్రదించాలో లేదో ఆయన నిర్ణయించుకుంటారు. అంతేగానీ తన ఆంతర్యాన్ని గవర్నర్‌పై రుద్దాలని ఎస్ఈసీ భావించడం సరికాదు’ అని ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. సాధారణంగా రాజ్యాంగపరమైన నిబంధనలు, ఇతర అంశాలపై గవర్నర్ తొలుత రాష్ట్ర అడ్వొకేట్ జనరల్‌నే పిలిపించి మాట్లాడటం సంప్రదాయమని గుర్తు చేశారు. చివరిసారిగా చెబుతున్నా.... నిమ్మగడ్డ హుకుం జారీ చేసినట్లుగా ఈ అంశంపై న్యాయస్థానంలో కేసు వేస్తానని గవర్నర్‌ను హెచ్చరించే ధోరణిలో లేఖ రాయడంపై సర్వత్రా విస్తుపోతున్నారు. ‘మీకు చివరిసారిగా చెబుతున్నా..’ అని గవర్నర్‌నుద్దేశించి లేఖలో పేర్కొనడం తీవ్ర అభ్యంతరకరమని రాజ్యాంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ‘మంత్రులకు సూచించండి... నిర్దేశించండి... వారి నుంచి హామీ తీసుకోండి’ అంటూ లేఖ రాయడం గవర్నర్‌ను ఆదేశిస్తున్నట్లుగా ఉందని తేల్చి చెబుతున్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మరో రాజ్యాంగబద్ధ పదవిలోనే ఉన్న అడ్వొకేట్ జనరల్‌ను తూలనాడుతూ, అవమానిస్తున్నట్లుగా లేఖలో సంబోధించడం.. చివరకు గవర్నర్‌ను సైతం ఆదేశించేలా లేఖ రాయడం కచ్చితంగా లక్ష్మణ రేఖను దాటటమేని పేర్కొంటున్నారు. -
ఏపీ ప్రజలకు గవర్నర్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
సాక్షి, రాజ్‌భవన్: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషన్ హరిచందన్ రాష్ట్ర ప్రజలకు 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వేచ్ఛా ఫలాలను మనకు అందించిన స్వాతంత్ర్య సమర యోధులను గుర్తు చేసుకోవాలని అన్నారు. వారి ఆశయాలకు అనుగుణంగా అందరూ శాంతి, అహింసలకు కట్టుబడి సోదర భావంతో మెలగాలని తెలిపారు. ప్రతి వ్యక్తీ దేశ నిర్మాణానికి కృషి చేయాలని గవర్నర్ పేర్కొన్నారు. చదవండి: ప్రజలకు సీఎం జగన్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు -
సీఎం మమతాపై గవర్నర్ అసంతృప్తి
కోల్‌కతా: స్వాతంత్ర్య వేడుకుల సందర్భంగా రాజ్‌భవన్‌లో గవర్నర్ జగదీప్ ధంఖర్ నిర్వహించిన తేనీటి విందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాజరుకాలేదు. కార్యక్రమానికి సంబంధించి ముందుగా సమాచారం అందిచినా సీఎం మమతా బెనర్జీ, ప్రభుత్వ అధికారులు గైర్హజరు కావటం తనకు ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. శనివారం ఉదయం కోల్‌కతాలోని రెడ్‌రోడ్‌లో జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం గవర్నర్ సీఎం మమతా బెనర్జీ, ప్రభుత్వ అధికారులను రాజ్‌భవన్‌లో జరిగే ‘ఎట్ హోం’ కార్యక్రమానికి ఆహ్వానించారు. అయితే ఈ కార్యక్రమానికి సీఎం మమతా హాజరు కాలేదు. దీంతో సీఎం లేకుండానే గవర్నర్ దంపతులు కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో గవర్నర్ పక్కన ఏర్పాటు చేసిన కుర్చి ఖాళీగా కనిపించింది. (ప్రజాస్వామ్యానికి పరీక్షా సమయం) ప్రస్తుతం గవర్నర్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో మమతా పాల్గొనకపోవటం చర్చనీయంశంగా మారింది. ‘రాజ్‌భవన్‌లో స్వాతంత్ర్య వేడుకుల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం మమతా బెనర్జీ హాజరు కాకపోవడం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. మనకు స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, భద్రత కల్పించిన స్వాతంత్ర్య సమరయోధులను గుర్తు చేసుకోవటంలో మనం మరింత ఎదగాలి’ అని ఆయన ట్విటర్లో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితి పశ్చిమ బెంగాల్‌కు ఉన్న గొప్ప సంస్కృతి, నీతిని పలుచన చేస్తుందన్నారు. ఇది ఒక అనాలోచితన ధోరణి అని ట్వీట్ చేశారు. ఇక కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలో గవర్నర్ నిర్వహించే ఎట్ హోం కార్యక్రమం సరికాదని ప్రభుత్వం భావించినట్లు తెలుస్తోంది. (రాష్ట్రపతి భవన్లో ఎట్ హోం కార్యక్రమం) -
31 నుంచి అసెంబ్లీ పెట్టండి
జైపూర్/న్యూఢిల్లీ: రాజస్తాన్ అసెంబ్లీ సమావేశాలను జూలై 31 నుంచి ప్రారంభించాల్సిందిగా కోరుతూ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ నేతృత్వంలోని కేబినెట్ గవర్నర్ కల్రాజ్ మిశ్రాకు తాజా ప్రతిపాదనను పంపించారు. ఆ లేఖ గవర్నర్ కల్రాజ్ మిశ్రాకు శనివారం రాత్రే చేరిందని రాజ్ భవన్ వర్గాలు ఆదివారం తెలిపాయి. కరోనా వ్యాప్తిపై చర్చ, రాష్ట్ర ఆర్థిక స్థితిపై చర్చ, అత్యవసరంగా చేపట్టాల్సిన బిల్లులు.. మొదలైన అంశాలను తాజా ప్రతిపాదనలో చేర్చారు. అయితే, గహ్లోత్ ప్రభుత్వ విశ్వాస పరీక్ష ఆ ప్రతిపాదిత ఎజెండాలో ఉన్నదీ, లేనిదీ తెలియరాలేదు. అసెంబ్లీ భేటీ కోరుతూ శుక్రవారం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేసిన ధర్నా అనంతరం, ఆరు అంశాల్లో ప్రభుత్వం నుంచి గవర్నర్ వివరణ కోరారు. పూర్తి వివరాలతో మళ్లీ ప్రతిపాదన పంపాలని కోరారు. మెజారిటీ ఉన్నప్పుడు మళ్లీ నిరూపించుకోవాల్సిన అవసరమేంటని ఆయన ప్రశ్నించారు. దాంతో శనివారం మళ్లీ సమావేశమైన కేబినెట్ తాజా ప్రతిపాదనను గవర్నర్‌కు పంపించింది. గవర్నర్‌పై కేంద్రం ఒత్తిడి కేంద్రం ఒత్తిడికారణంగానే గవర్నర్ అసెంబ్లీని సమావేశపర్చే నిర్ణయం తీసుకోవడం లేదని కాంగ్రెస్ ఆరోపించింది. అర్థం లేని కారణాలు చూపుతూ అసెంబ్లీని సమావేశపర్చడం లేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి అభి షేక్ సింఘ్వీ విమర్శించారు. అసెంబ్లీని సమావేశపర్చే విషయంలో కేబినెట్ సిఫారసుల ప్రకారం గవర్నర్ నడుచుకోవాల్సిందేనని సుప్రీంకోర్టు సైతం పలు సందర్భాల్లో స్పష్టం చేసిందన్నారు. మరోవైపు, కాంగ్రెస్‌లో విలీనమైన ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని తాను దాఖలు చేసిన పిటిషన్‌పై స్పీకర్ సీపీ జోషి ఎలాంటి నిర్ణయం తీసుకోవట్లేదని బీజేపీ ఎమ్మెల్యే మదన్ దిలావర్ విమర్శించారు. కరోనా వ్యాప్తిపై గవర్నర్ ఆందోళన రాజస్తాన్‌లో కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతమవుతోందని కల్రాజ్ మిశ్రా ఆందోళన వ్యక్తం చేశారు. జూలై 1 నుంచి యాక్టివ్ కేసుల సంఖ్య 3 రెట్లు పెరిగిందన్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అసెంబ్లీని సమావేశపర్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో ఘర్షణాత్మక వాతావరణం నెలకొన్న సమయంలో గవర్నర్ కరోనాపై ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. మరోవైపు, చీఫ్ సెక్రటరీ రాజీవ్ స్వరూప్, డీజీపీ భూపేంద్ర యాదవ్ ఆదివారం గవర్నర్ కల్రాజ్ మిశ్రాను కలిసి రాజ్‌భవన్ భద్రతకు సంబంధించి తీసుకున్న చర్యలను వివరించారు. రాజ్భవన్ల ముందు కాంగ్రెస్ నిరసనలు విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చేందుకు గవర్నర్లు అధికార దుర్వినియోగం చేస్తూ, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని దేశంలోని అన్ని రాజ్ భవన్ల ఎదుట సోమవారం ఉదయం నిరసన తెలపాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. దేశవ్యాప్తంగా రాజ్భవన్ల ముందు ‘సేవ్ డెమొక్రసీ – సేవ్ కాన్స్టిట్యూషన్’ పేరుతో నిరసనలు చేపట్టాలని నిర్ణయించినట్లు కాంగ్రెస్ సీనియర్ నేత రణ్‌దీప్ సూర్జెవాలా తెలిపారు. అయితే, ఆ కార్యక్రమాన్ని రాజస్తాన్‌లో మాత్రం నిర్వహించబోవడం లేదని ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ గోవింద్ సింగ్ తెలిపారు. గతంలో మధ్యప్రదేశ్‌లో, ఇప్పుడు రాజస్తాన్‌లో ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు బీజేపీ ఖూనీ చేసిందని సూర్జెవాలా విమర్శించారు. ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలను బీజేపీ కాలరాస్తోందని ఆరోపిస్తూ ‘స్పీక్ అప్ ఫర్ డెమొక్రసీ’ పేరుతో దేశవ్యాప్తంగా డిజిటల్ ప్రచారాన్ని కాంగ్రెస్ ఆదివారం ప్రారంభించింది. కాంగ్రెస్ విమర్శలపై.. ‘900 ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లిందట’ అంటూ బీజేపీ రాజస్తాన్ శాఖ అధ్యక్షుడు సతిష్ పూనియా స్పందించారు. మరోవైపు, సచిన్ పైలట్ సహా 19 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన పిటిషన్ సోమవారం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. -
శభాష్.. రాజేష్ కన్నా!
కేపీహెచ్‌బీకాలనీ: లాక్డౌన్ సందర్భంగా ‘కనెక్ట్– చాన్సలర్’’ పేరుతో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఆన్లైన్ పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటిన జేఎన్టీయూహెచ్ రిసెర్చ్ స్కాలర్ రాజేష్ కన్నాను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రశంస పత్రంతో అభినందించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రశంసపత్రాన్ని అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లోని విద్యార్థులకు కనెక్ట్– చాన్సలర్ పేరుతో పోటీలను నిర్వహించగా రాజేష్‌ఖన్నా కవితలు, వ్యాసరచన పోటీలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా జేఎన్టీయూహెచ్లో స్కాలర్‌గానే కాకుండా సామాజిక స్పృహ కలిగిన రచయితగా రాజేష్‌కన్నా ఇప్పటికే పలు పోటీల్లో ప్రతిభను ప్రదర్శించారు. తాజాగా గవర్నర్ నిర్వహించిన పోటీల్లోనూ ప్రశంస పొందటం పట్ల యూనివర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు. -
‘ముందు రాజ్యాంగం చదువుకోండి’
తిరువనంతపురం : వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం ఆమోదించే ముందు పినరయి విజయన్ సర్కార్ తనను సంప్రదించలేదన్న కేరళ గవర్నర్ అరిఫ్ మహ్మద్ ఖాన్ వ్యాఖ్యలను సీఎం తోసిపుచ్చారు. అసెంబ్లీ కంటే ఏ పౌరుడు ఎక్కువ కాదని స్పష్టం చేశారు. ఇప్పుడు మాట్లాడుతున్నవారంతా ప్రతి ఒక్క అంశాన్ని పొందుపరిచిన రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా చదివేందుకు సమయం వెచ్చిస్తే బాగుంటుందని కేరళ సీఎం పినరయి విజయన్ గవర్నర్ అభ్యంతరాలపై స్పందించారు. ఇది ప్రజాస్వామ్యం వర్ధిల్లే దేశమని, ఆయా ప్రాంతాల్లో పెత్తనం చెలాయించే రాజుల కాలం కాదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఏ ఒక్క పౌరుడూ రాజ్యాంగానికి అతీతం కాదని వ్యాఖ్యానించారు. కేరళలో తమ ప్రభుత్వం సీఏఏ, ఎన్ఆర్సీలను అమలు చేయబోదని విజయన్ పునరుద్ఘాటించారు. మరోవైపు సీఏఏను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడం, ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్ వేయడం వంటి అంశాల్లో కేరళ ప్రభుత్వం తనను సంప్రదించకుండా, నిబంధనలను ఉల్లంఘించిందని గవర్నర్ ఖాన్ ఆరోపించిన సంగతి తెలిసిందే. చదవండి : సీఏఏకు వ్యతిరేకంగా పంజాబ్ అసెంబ్లీ తీర్మానం -
కావాలని షూతో మెట్లు ఎక్కలేదు : విప్ సునీత
యాదగిరిగుట్ట (ఆలేరు) : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ సోమవారం సం దర్శించారు. ఉదయం 11గంటలకు యాదాద్రి కొండపైకి చేరుకున్న గవర్నర్ తమిళిసై దంపతులు 11.02 గంటలకు బాలాలయానికి చేరుకున్నారు. బాలాలయం ప్రధాన ద్వారం వద్ద ఆల య ఆచార్యులు పూర్ణకుంభంతో సంప్రదాయంగా వారికి స్వాగతం పలికారు. ప్రతిష్టామూర్తులకు గవర్నర్ తమిళిసై దంపతులు విశేషంగా పూజలు నిర్వహించారు. సుమారు 19నిమిషాల పాటు పూజలు చేశారు. అనంతరం మహా మండపంలో గవర్నర్ దంపతులకు ఆలయ ఆచార్యులు వేదమంత్రాలతో ఆశీర్వచనం చేశారు. అనంతరం మంత్రి గుం టకండ్ల జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, ఆలయ ఈఓ గీతారెడ్డి, అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి శ్రీస్వామి లడ్డూ ప్రసాదాన్ని గవర్నర్ దంపతులకు అందజేశారు. గవర్నర్‌కు ఘన స్వాగతం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శించుకోవడానికి వచ్చిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌కు విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, కలెక్టర్ అనితారాంచంద్రన్, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, భువనగిరి ఆర్డీఓ వెంకటేశ్వర్లు ఘన స్వాగతం ఫలికారు. మంత్రి జగదీశ్‌రెడ్డి పుష్పగుచ్ఛాన్ని ఇచ్చి స్వాగతం పలకగా.. కలెక్టర్ అనితరాంచంద్రన్ మొక్కను అందజేశారు. అంతకు ముందు గవర్నర్ తమిళిసై పర్యటనను కవరేజ్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులను ఆలయ అధికారులు ఆలయంలోకి అనుమతించలేదు. ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విప్ సునీత గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చిన సందర్భంగా ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అనుకున్న సమయానికి ఆలయానికి రాలేదు. గవర్నర్ దంపతులు క్షేత్రంలోకి వెళ్తున్న సమయంలో ఐదు నిమిషాలు ఆలస్యంగా విప్ సునిత వచ్చారు. గవర్నర్‌ను కలిసేందుకు వెళ్తున్న తొందరలో తన కాళ్లకు ధరించిన షూ ఆలయానికి వెళ్లే దారిలోని మెట్లపై వదిలి వెళ్లారు. వాటిపై భక్తుల్లో చర్చ జరిగింది. కావాలని షూతో మెట్లు ఎక్కలేదు శ్రీయాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ వచ్చిన హడావుడిలో అనుకోకుండా షూతో ఐదు మెట్లు ఎక్కానని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి వివరణ ఇచ్చారు. కావాలని షూతో మెట్లు ఎక్కలేదని తెలిపారు. -
వాటి మధ్య తేడా ఏంటని అడిగాను : ఏపీ గవర్నర్
సాక్షి, విజయవాడ : విపరీతమైన రసాయనాల వాడకం వల్ల మనం తినే ఆహారం విషతుల్యం అవుతోందనీ, అందుకే మనం మళ్లీ ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లుతున్నామని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వ్యాఖ్యానించారు. శనివారం స్థానిక సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన సేవాభారతి వారి సంగమం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. ఎలాంటి ప్రతిఫలం లేకుండా, చాలా మంది ప్రముఖులు కలిసి సేవాభారతిని నడిపిస్తున్నారని అభినందించారు. మానవసేవే మాధవ సేవ అంటూ సేవాభారతి ప్రజలకు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమైనవని వ్యాఖ్యానించారు. దేశంలో కాలుష్య ప్రమాదంపై ఆందోళన వ్యక్తం చేసిన గవర్నర్, మానవాళి మనుగడకు మొక్కలు నాటాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. ఇటీవల ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులతో రసాయన సాగుకు, ప్రకృతి సాగుకు గల తేడాను అడిగానని కేవలం 20 శాతం దిగుబడిలో తేడా ఉందని రైతులు చెప్పారన్నారు. అయినా ఆరోగ్యవంతమైన ఉత్పత్తులు అందిస్తున్నామని సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. అనంతరం ప్రకృతి వ్యవసాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నొక్కి వక్కాణించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ శ్రీ పీఠాధిపతి శ్రీ పరిపూర్ణానంద స్వామి, తదితరులు హాజరయ్యారు. -
ఆరంభం అదిరింది..
సైన్స్ సంబరం అంబరాన్నంటింది.. వైజ్ఞానిక వెలుగులను విరజిమ్మింది.. లబ్ధప్రతిష్టులైన ఎందరో శాస్త్రవేత్తలు హాజరైన ఏపీ సైన్స్ కాంగ్రెస్ సాంకేతిక సౌరభంతో పరిమళించింది. జీవన సాఫల్య పురస్కారాలను అందుకున్న ప్రముఖులను, అవార్డులు వరించిన జూనియర్ సైంటిస్టులను చూసి విద్యార్థులు పులకించిపోయారు. వారి ప్రసంగాలతో స్ఫూర్తి పొందారు. బాలల సైన్స్ కాంగ్రెస్‌లో ముద్దులొలికే రేపటి శాస్త్రవేత్తలు తమ ప్రతిభతో ఆకట్టుకున్నారు. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ వారి ప్రదర్శనలను తిలకించి మంత్రముగ్ధులయ్యారు. ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం, ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ సైన్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఐదో ఏపీ సైన్స్ కాంగ్రెస్–2019 ఘనంగా ప్రారంభమైంది. జిల్లాలో రాష్ట్ర స్థాయి సైన్స్ కాంగ్రెస్ జరగడం ఇదే తొలిసారి. అంబేడ్కర్ వర్సిటీలో మూడు రోజుల వేడుకలకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ గురువారం శ్రీకారం చుట్టారు. ఎచ్చెర్లలోని ఆర్మ్డ్ రిజర్వు పోలీసు గ్రౌండ్స్‌లోని హెలిప్యాడ్ వద్దకు హెలికాప్టర్లో వచ్చిన గవర్నర్ సభా వేదిక వద్దకు మధ్యాహ్నం 12 గంటలకు చేరుకున్నారు. గవర్నర్‌కు స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు ఆదిమూలపు సురేష్, ధర్మాన కృష్ణదాస్, వైస్ చాన్సలర్ కూన రామ్‌జీ, జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఘనంగా స్వాగతం పలికారు. తొలుత వర్సిటీ ఆవరణలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి గవర్నర్ పూలమాలతో నివాళులర్పించారు. అనంతరం ఇండోర్ స్పోర్ట్సు స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వర్సిటీ ఆవరణలో మొక్కలు నాటారు. బాలల సైన్స్ కాంగ్రెస్‌కు వచ్చి వారి ప్రాజెక్టులు పరిశీలించారు. నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, న్యూఢిల్లీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ప్రారంభించారు. అనంతరం రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని రెడ్ క్రాస్ చైర్మన్ హోదాలో ప్రారంభించారు. విద్యార్థులు ఈ సందర్భంగా రక్తదానం చేశారు. అనంతరం గవర్నర్ లైఫ్‌టైం అచీవ్మెంట్, ఫెలోషిప్, యువ శాస్త్రవేత్తలకు అవార్డులు అందజేశారు. ప్రారంభ ప్లీనరీలో సైన్స్ కాంగ్రెస్ ప్రాధాన్యతను ఏపీ అకాడమీ ఆఫ్ సైన్స్ అధ్యక్షుడు డాక్టర్ రఘునాధరావు వివరించారు. ప్రారంభ ప్లీనరీలో నలుగురు శాస్త్రవేత్తలు సాంకేతిక ప్రగతిపై మాట్లాడారు. రెండో పూట ప్లీనరీ అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. బాలల కాంగ్రెస్ ప్రాజెక్టులు, ఉత్తరాంధ్ర రాష్ట్ర స్థాయి ఉత్పత్తుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ స్టాళ్లు ప్రదర్శించారు. సైన్స్ కాంగ్రెస్‌లో సావనీర్, వర్సిటీ బులెటిన్లను గవర్నర్ ఆవిష్కరించారు. గవర్నర్ రాకతో విశాఖ రేంజ్ డీఐజీ కాళిదాస్, ఎస్పీ అమ్మిరెడ్డి ఆధ్వర్యంలో శాంతి భద్రతలను పర్యవేక్షించారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా వర్సిటీ అధికాలు ఏర్పాట్లు చేశారు. -
ప్రత్యక్షంగా చూడాలని వచ్చాను : గవర్నర్ బిశ్వభూషణ్
సాక్షి, కృష్ణా జిల్లా : ఒకప్పుడు ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్లమని, కానీ వాణిజ్య కారణాల వల్ల రైతులు ఎరువుల ఉపయోగం వైపు మళ్లారని ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ వ్యాఖ్యానించారు. ఆదివారం కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రంగన్నగూడెంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయ రైతులు, స్వయం సహాయక బృంద మహిళలతో గవర్నర్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. రసాయనాల వల్ల భూసారం తగ్గిపోయి కొన్నాళ్లకు భూమి వ్యవసాయానికి పనికిరాకుండా పోతుందని తెలిపారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చానని వెల్లడించారు. పంట మొత్తం విషపూరితమవుతోన్న ఈ రోజుల్లో ఇలాంటి పద్దతులు సమాజానికి చాలా అవసరమని అభిప్రాయపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేలా చర్యలు తీసుకోమని కోరతానని తెలిపారు. కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ.. అంతర పంటల ద్వారా రైతులు అదనపు ఆదాయాన్ని పొందవచ్చని సూచించారు. జిల్లాలో రోజురోజుకీ ప్రకృతి వ్యవసాయం పెరుగుతున్న నేపథ్యంలో రైతులు ఆవులు కొనుగోలు చేయడానికి కావలసిన ఆర్ధిక సహాయం అందిస్తామని వెల్లడించారు. జిల్లాలో 18 వేల మంది ప్రకృతి రైతులున్నారని, ఇటీవల ఢిల్లీలో ఈ విభాగంలో పురస్కారం కూడా అందుకున్నామని తెలిపారు. గవర్నర్ స్వయంగా ప్రకృతి వ్యవసాయాన్ని పరిశీలించడం శుభపరిణామమని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, నూజివీడు సబ్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. -
గిరిపుత్రుల చెంతకు గవర్నర్
సాక్షి విజయనగరం : రాష్ట్ర ప్రధమ పౌరుడు, గవర్నర్ బిశ్వభూషన్ హరి చందన్ తొలిసారి జిల్లా పర్యటనకు వస్తున్నారు. గురువారం ఆయన సాలూరు నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే ఖరారు కావడంతో అధికారులు పక్కా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ ముఖ్యంగా గిరిజనులతో సమావేశమవుతారు. ప్రభుత్వ పరంగా వారికి అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి చర్చిస్తారు. అధికారులు గిరిజన సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాల గురించి ఆయనకు వివరించేందుకు సిద్ధమయ్యారు. గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఒక్కరోజు పర్యటన నిమిత్తం గురువారం జిల్లాకు వస్తున్నారు. విశాఖపట్నం నుంచి నేరుగా సాలూరుకు హెలీక్యాఫ్టర్‌లో వస్తున్న ఆయన అక్కడ గర్భిణుల కోసం ఏర్పాటు చేసిన వసతిగృహానికి వెళ్లి వారితో మాట్లాడుతారు. అక్కడి నుంచి అమ్మవలస వెళ్లి గిరిజనులు సాగు చేస్తున్న పంటల గురించి తెలుసుకుని అక్కడి వారితో ముఖాముఖి అవుతారు. అనంతరం పి.కోనవలస ఆశ్రమ పాఠశాలలో జూనియర్ కాలేజీ విద్యార్థులతో మాట్లాడుతారు. అనంతరం ఆయన విశాఖపట్నం వెళతారు. ఈ పర్యటనలో ఆయన పూర్తిగా గిరిజనులకు ప్రాధాన్యం ఇవ్వడం విశేషం. గవర్నర్ పర్యటనకు సంబంధించి అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఆయన పర్యటనలో భాగంగా హెలీప్యాడ్ మొదలుకుని ఆయన పర్యటించే ప్రాంతాల్లో పక్కాగా అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా గిరిజనులతో మాటాడేందుకు ఏర్పాటు చేయడమే గాకుండా... గిరిజనులను కూడా ఇందుకోసం సిద్ధం చేశారు. ప్రభుత్వపరంగా అమలవుతున్న కార్యక్రమాలు వివరించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. దేశంలో మరెక్కడా లేని విధంగా సాలూరులో ఏర్పాటైన గర్భిణుల వసతి గృహాన్ని మొదటి గా గవర్నర్ సందర్శించనున్నారు. ప్రత్యేకించి గర్భిణుల కోసం ఇక్కడ గతేడాది అప్పటి ఐటీడీఏ పీఓ లక్ష్మీశ ఈ వసతి గృహాన్ని ఏర్పాటు చేశారు. కొండప్రాంతాల్లో ఉన్న గిరిజనులకు సరైన పోషకాహారం అందకపోవడం, వైద్య సదుపాయాలు లేకపోవడం వంటి సమస్యలున్నాయి. ఈ అంశాలపై అప్పట్లో ‘సాక్షి’ దినపత్రిక కథనాలు ప్రచురించింది. ఈ నేపథ్యంలో పీఓ వసతిగృహాన్ని ఏర్పాటు చేసి గర్భిణులకు సౌకర్యం కల్పించారు. ఇప్పటివరకు ఇక్కడ సుమారు 300మంది గర్భిణులు ఇక్కడ ఆశ్రయం పొందారు. ప్రస్తుతం 28మంది గిరిజన మహిళలు ఇక్కడ ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వారికి అందుతున్న సదుపాయాలు, ప్రభుత్వ లక్ష్యం తదితర విషయాల గురించి గవర్నర్ తెలుసుకోనున్నారు. అమ్మవలసలో గిరిజన రైతులతో ముఖాముఖి :ఇదిలాఉండగా తదుపరి పర్యటనలో ఆయన అమ్మవలస గ్రామంలో గిరిజనులు పంటలు పండించే విధానం గురించి తెలుసుకుంటారు. అక్కడి గిరిజనులు పత్తి పంట ద్వారా లాభాలు పొందుతున్నారు. పత్తితోపాటు అంతర్పంటలు సాగు చేస్తున్నారు. ఈ విషయాల గురించి తెలుసుకుని తర్వాత గిరిజనులతో పంటలతోపాటు ఇతర అంశాలపై మాట్లాడుతారు. అనంతరం గవర్నర్ పి.కోనవలస గిరిజన సంక్షేమ జూనియర్ కళాశాలలో విద్యార్థులతో పలు అంశాలపై చర్చిస్తారు. ఈ నేపథ్యంలో పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. ఆయన వచ్చి వెళ్లేందుకు, గిరిజనులతో మాట్లేందుకు, పంటలు పరిశీలించేందుకు ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ ఎం. హరి జవహర్లాల్, ఐటీడీఏ పీఓ బి.ఆర్.అంబేడ్కర్ బుధవారం మరోసారి పరిశీలించారు. ఎక్కడా ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకున్నారు. గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
త్వరలో గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తా
సోమాజిగూడ: మరో 25 రోజుల్లో గిరిజన నివాసుల ప్రాంతాల్లో పర్యటించి వారి జీవన విధానంపై అధ్యయనం చేస్తానని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ వెల్లడించారు. దీపావళి సందర్భంగా ఆదివారం రాజ్‌భవన్‌లో ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. రాజ్‌భవన్‌లో ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించామని తెలిపారు. రాజ్‌భవన్‌కు వచ్చే వారు ప్లాస్టిక్ పూలు, బొకేలు తీసుకురావద్దని సూచించారు. ప్రధాని మోదీ ఇచ్చిన ‘ఫిట్ ఇండియా’పిలుపు మేరకు నెలరోజుల పాటు రాజ్‌భవన్‌లో యోగా కార్యక్రమాలు నిర్వహించామని, ఇందులో ఉద్యోగులు భారీ సంఖ్యలో పాల్గొన్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం తనకు సొంతిల్లు లాంటిదని.. ఇక్కడి ప్రజలు గవర్నర్ అక్కా అని పిలవడంతో తాను పులకరించానని తెలిపారు. ఆర్టీసీ సమ్మెపై స్పందించాలని కోరగా సమ్మె విషయం ప్రభుత్వం పరిశీలిస్తోందని, దీనిపై ఇరు వర్గాల నుంచి తనకు వినతిపత్రాలు అందాయని పేర్కొన్నారు. గవర్నర్‌కు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన వారిలో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు, సభ్యుడు డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ తదితరులు ఉన్నారు. -
శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్ తమిళిసై
సాక్షి, తిరుమల: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆమెకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో టీటీడీ అడిషనల్ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలంగాణ గవర్నర్‌కు శ్రీవారి లడ్డూ ప్రసాదాలు, చిత్రపటం అందించి, ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా తమిళిసై మాట్లాడుతూ గవర్నర్ హోదాలో తొలిసారి తిరుమలేశుని ఆశీస్సులు పొందడం చాలా ఆనందంగా ఉందన్నారు. శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తుల కోసం టీటీడీ చేస్తున్న ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. -
పాక్‌కు కశ్మీర్ గవర్నర్ హెచ్చరిక
శ్రీనగర్ : ఉగ్రవాదులను భారత్‌లోకి పంపేందుకు ప్రయత్నిస్తోన్న పాకిస్తాన్‌కు కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ హెచ్చరించారు. తీరు మార్చుకోకపోతే ఆదివారం జరిగిన దాడుల వంటివి పునరావృతమవుతాయని స్పష్టం చేశారు. సోమవారం మీడియాతో ఆయన మాట్లాడారు. కశ్మీర్లో ఇంటర్నెట్ సేవల పునరుద్ధరణ గురించి అడుగగా.. ఇంటర్నెట్ సేవలను ప్రారంభిస్తే ఆ సౌలభ్యాన్ని ఉగ్రవాదులే ఎక్కువగా ఉపయోగించే అవకాశముందని వెల్లడించారు. నవంబర్ 1 నుంచి కశ్మీర్లో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని వెల్లడించారు. ‘ఇక్కడ ఉన్న యువకులను అడుగుతున్నా. ఇన్నాళ్లు మీరేం సాధించారు? మీ ఆశయాలు నెరవేరడానికి ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను వినియోగించుకొని రాష్ట్రాభివృద్ధికి కలిసి రావాల’ని కోరారు. కాగా, ఆదివారం సాయంత్రం భారత ఆర్మీ పాక్ ఆక్రమిత కశ్మీర్లో చేసిన దాడుల్లో ఉగ్రవాదులతో పాటు పాక్ సైనికులు మృతి చెందిన సంగతి తెలిసిందే. -
వీర పోరాటాల గడ్డ తెలంగాణ
సాక్షి, సప్తగిరికాలనీ(కరీంనగర్): ‘తెలంగాణ చరిత్ర ఐదు వేల సంవత్సరాలది. నాలుగు వేల సంవత్సరాల కింద ఇనుప పనిముట్లు, కత్తులు తదితర వస్తువుల తయారీ ఇక్కడే జరిగింది.. పురావస్తు శాఖ తవ్వకాల్లో మనకు ఆధారాలు దొరికాయి.. ఎందరో త్యాగాల ఫలితం.. వీర పోరాటాల గడ్డే మనం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం..’ అని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ప్రజ్ఞా భారతి, ఇతిహాస సంకలన సమితి ఆధ్వర్యంలో మూడు రోజులుగా కరీంనగర్లో నిర్వహిస్తున్న తెలంగాణ వైభవం కార్యక్రమం ఆదివారం ముగిసింది. ముగింపు కార్యక్రమానికి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌తో కలిసి ఆయన హాజరై ప్రసంగించారు. సంసృతి లేకపోతే మనం లేమని, విలువలు క్షీణిస్తున్న ఈ రోజుల్లో పిల్లలు, యువతరానికి నిజమైన తెలంగాణ గొప్పతనం తెలియ చేయడం చాలా మెచ్చుకోదగ్గ విషయమని, రాబోయే రోజుల్లో ప్రాచీన తెలంగాణ వైభవాన్ని అన్ని జిల్లాల్లో ఇటువంటి సదస్సులు, సమావేశాల ద్వారా విసృతం చేయాలని తెలిపారు. అస్థిత్వాన్ని నిలబెట్టుకోవాలంటే చరిత్రను మరువద్దుని సూచించారు. సర్ధార్ పటేల్ ఆపరేషన్ పోలో ద్వారా నిజాం రజాకార్ల రాక్షసత్వాన్ని అణచివేసి మనకు నిజమైన స్వాతంత్య్రాన్ని 1948 సెప్టెంబర్ 17న తెచ్చిపెట్టారని గుర్తు చేశారు. పటేల్‌కు తెలంగాణ ఎప్పుడూ రుణపడే ఉంటుందన్నారు. తెలంగాణ వైభవాన్ని అందరికీ తెలిసేలా చేసిన నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్‌కుమార్ మాట్లాడుతూ కొందరు తెలంగాణ చరిత్రను తిరగేస్తున్నారని, వారి చరిత్రే రాబోయే తరాల కు అందించాలని వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ఉద్యమాలు చేస్తుంటే అవి పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. బతుకమ్మ అంటే మనకు గౌరమ్మ అని, గౌరమ్మను దేవతగా పూజిస్తుంటే ఆ బతుకమ్మను డిస్కో ఆటగా మారుస్తున్నారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా పటేల్ గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. నాడు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పటేల్ ఫొటో పెట్టుకొని దేని కోసం ఉద్యమాలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వచ్చాక సెప్టెంబర్ 17న గొప్పగా చేసుకొందామన్న వారు ఇప్పుడు మరువడం విడ్డూరమన్నారు. పటేల్, కుమురంభీం, చాకలి అయిలమ్మ, రాణి రుద్రమాదేవి వంటి వాళ్లను మరిచి నేడు నిజాం సమాధి వద్ద మోకారిళ్లుతున్నారని విమర్శించారు. ప్రజ్ఞాభారతి రాష్ట్ర, జిల్లా అధ్యక్షుడు ఎల్.రాజభాస్కర్ రెడ్డి, డి.నిరంజనాచారి మాట్లాడుతూ మూడు రోజుల్లో 2600 సంవత్సరాల చరిత్ర ఉన్న తెలంగాణ వైభవాన్ని చూపించామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ, ప్రజ్ఞాభారతి, ఇతిహాస సంకలన సమితి రాష్ట్ర, జిల్లా బాధ్యులు బూర్ల దక్షిణమూర్తి, రాజేందర్ చడ్డా, దత్తాత్రేయ శాస్త్రీ, గిరిధర్, రఘు, గాజుల రవీందర్, నంది శ్రీనివాస్, మురళీ మనోహరచారి, విద్యాసంస్థల భాద్యులు అనంతరెడ్డి, రమణారావు, శ్రీనివాస్‌రావు, రాజేశ్, వేద సం హిత, సత్యగిరి, విజయభారతి పాల్గొన్నారు. ప్రదర్శనలను తిలకించిన గవర్నర్.. తెలంగాణ వైభవం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనలను ఆదివారం రాత్రి హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎంపీ బండి సంజయ్‌కుమార్ తిలకించారు. పురాతన కాలం నాటి నాణేలు, తెలంగాణ సంసృతిని చూపెట్టిన సమ్మక్క సారలమ్మ, ఎలగందుల ఖిల్ల, గోల్కొండ ఫోర్టు, బతుకమ్మ తదితర ప్రదర్శనలను తిలకించారు. అనంతరం పలువురు విద్యాసంస్థలకు బాధ్యులకు గవర్నర్ జ్ఞాపికలను బహూకరించారు. కాగా గవర్నర్‌ను ప్రజ్ఞా భారతి, ఇతిహాస సంకలన సమితి బాధ్యులు ఘనంగా సన్మానించారు. -
గవర్నర్ తమిళిసైను కలిసిన కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య శనివారం కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో త్వరలో నియమించబోయే తొమ్మిది యూనివర్సిటీల వైస్ చాన్సిలర్ పోస్టుల్లో జనాభా ప్రకారం బీసీలకు 50 శాతం పోస్టులను కేటాయించాలని గవర్నర్‌ను కోరారు. యూనివర్సిటీ చాన్సిలర్ నియమాకంలో జోక్యం చేసుకొని జీసీలకు కోటా కల్పించాలని వినతిపత్రం అందజేశారు. ఐఏఎస్, ఐపీఎస్ పోస్టుల్లో కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతుందని.. సమర్ధులైన అధికారులకు ప్రాధాన్యం లేని పోస్టులు ఇచ్చి అన్యాయం చేస్తున్నారని తెలిపారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మూడుసార్లు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఒకసారి అసెంబ్లీ తీర్మానాలు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపామని గుర్తు చేశారు. అయినప్పటికీ రిజర్వేషన్ల అమలులో జాప్యం జరుగుతోందని.. బీసీల ఆందోళన గురించి కేంద్ర ప్రభుత్వనికి సిఫార్సు చేయాలని కోరారు. ప్రభుత్వ పంచాయతీరాజ్ సంస్థలో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 22 శాతానికి తగ్గించారని, జనాభా ప్రకారం పంచాయతీరాజ్ సంస్థల రిజర్వేషన్లను 34 శాతం నుంచి 56 శాతం పెంచాలని బీసీలు కోరుకుంటే.. 22 శాతానికి తగ్గించడం ఎంతవరకు న్యాయమని ఆర్ కృష్ణయ్య ఈ సందర్భంగా గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయంలో కూడా జోక్యం చేసుకొని బీసీల హక్కులకు భంగం కలుగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల జరిగిన మెడికల్ కౌన్సిలింగ్లో ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్ల అమలు విషయంలో అక్రమాలు జరిగాయని.. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ప్రభుత్వం జీవో నెం. 550కి వ్యతిరేకంగా.. రిజర్వేషన్ల అమలు జరగకుండా అన్యాయం చేశారని దీనిపై విచారణకు ఆదేశించాలని గవర్నర్‌ను కోరారు. -
ఈ తెలుగు – ఆ తమిళం
తమిళనాడులో స్థిరపడిన తెలుగు ప్రొఫెసర్... డాక్టర్ ప్రభు కుమారి వనమా. తెలంగాణ సంస్కృతి మీద ఆమె అధ్యయనం చేశారు.తమిళ జానపద నృత్యాలు,తెలంగాణ సాంస్కృతిక కళల మధ్య భావసారూప్యతలపై విస్తృతమైన పరిశీలన జరిపారు.తమిళ మహిళ ‘తమిళిసై’ తెలుగు రాష్ట్రానికి గవర్నర్‌గా వచ్చిన సందర్భంలో... ఈ రెండు ప్రాంతాల సాంప్రదాయిక బాంధవ్యం గురించి సాక్షితో ముచ్చటించారు. డాక్టర్ ప్రభుకుమారి పుట్టింది విజయవాడలో, బాల్యం హైదరాబాద్‌లో గడిచింది. తర్వాత తమిళనాడు బాట పట్టింది వాళ్ల కుటుంబం. సంగీతం, నాట్యం ఆమెకు రెండు కళ్లు. తనకు ఇష్టమైన కళలను కొనసాగించడం కోసమే ఆమె చరిత్ర, పర్యాటక రంగాల్లో అధ్యాపక వృత్తిని ఎన్నుకున్నారు. సరిగమల గురువు అమ్మ ‘‘మా అమ్మ జ్ఞాన ప్రసూన గాయని, కర్ణాటక, హిందూస్తానీ సంగీతంలో నిష్ణాతురాలు. సినిమాల్లో నేపథ్య గాయని. నాన్న పుల్లారావు ఫార్మాసుటికల్ కంపెనీ నిర్వహించేవారు. నన్ను కళారంగంలో అత్యున్నత స్థాయిలో చూడాలనేది మా అమ్మ కోరిక. అందుకోసమే మా కుటుంబం చెన్నైకి మారింది. అమ్మ స్వయంగా నాకు కర్నాటక, హిందూస్తానీ సంగీతంలో సరిగమలు నేర్పించారు. హైదరాబాద్‌లో ఉన్న కాలంలో భరతనాట్యం, కూచిపూడి కథక్‌తోపాటు జానపద నృత్యాలు నేర్చుకున్నాను. జానపద నృత్యంలో... నేను సంగీతానికి అనుగుణంగా అడుగులు వేయడం వరకే పరిమితమైపోయి ఉంటే నా ప్రయాణం ఒక ‘కళాకారిణి’ అనే మైలురాయి దగ్గరే ఆగిపోయేది. జానపద నృత్యాలకు ఆధారమైన సాహిత్యం మీద నాకు కలిగిన మమకారమే నన్ను అధ్యయనకారిణి చేసింది. వీటితోపాటు తబలా, హార్మోనియం, తంబూరా, మృదంగం నేర్చుకోవడం మీద ఆసక్తి కలిగింది. నేను ఎప్పుడు దేని మీద ఇష్టాన్ని కనబరిస్తే వెంటనే అందులో శిక్షణ ఇప్పించేది మా అమ్మ. ప్రతి రంగంలో మేటి అయిన గురువుల దగ్గర శిక్షణ ఇప్పించింది. కూచిపూడి, భరతనాట్యం సుమతీ కౌశల్ గారి దగ్గర నేర్చుకున్నాను. అంజుబాబు గారి శిక్షణలో కథక్, ఫోక్ డాన్సులు నేర్చుకున్నాను. ఆ తర్వాత బెనాసర్లో విజయశంకర్ గారి దగ్గర కథక్‌లో ప్రావీణ్యం సాధించగలిగాను. ప్రతి కళనూ దాని మూలాల వరకు వెళ్లి అధ్యయనం చేయాలనే కోరిక... ఈ రోజు నన్ను ప్రపంచదేశాలకు పరిచయం చేసింది. జనాన్ని కలిపేది జానపదాలే జానపద గేయాలు సాధారణంగా బృందగానాలే అయి ఉంటాయి. జానపద నృత్యాలను కూడా సామూహికంగానే చేస్తారు. జన సామాన్యాన్ని ఒక త్రాటి మీదకు తీసుకువచ్చే మాధ్యమాలివి. ముఖ్యంగా తమిళనాడు – తెలంగాణ రాష్ట్రాల మధ్య సాంస్కృతిక బంధం చాలా బలమైనదనే చెప్పాలి. భావసారూప్యాల విశ్లేషణ చేస్తే... రెండు సంప్రదాయాలు కూడా ప్రకృతి మీద ఆధారపడి మనిషి జీవికను నిర్మించుకున్నవే అని తెలుస్తుంది. తెలంగాణలో బోనాలు అని చేస్తారు. ఈ వేడుకలో భక్తులు అమ్మవారికి పసుపు నీటిని చల్లుతూ భోజనాన్ని సమర్పిస్తారు. తమిళనాడులో చేసే ‘కరగాట్టం’ వేడుకలో కూడా కుండ తల మీద పెట్టుకుని నృత్యం చేస్తూ దేవుడికి ఆహారం, నీటిని సమర్పిస్తారు. రెండు వేడుకల్లోనూ ఘటాన్ని తల మీద పెట్టుకుని లయబద్ధంగా డాన్స్ చేయడమే ప్రధానంగా కనిపిస్తుంది. ఇక్కడ కోలాటం– అక్కడ కోలాఠం తెలుగు రాష్ట్రాల్లో కోలాటం బాగా ప్రసిద్ధి. ఇదే ఆట తమిళనాడులోనూ ఉంది. అయితే అక్కడ ‘కోలాఠం’ అని ఠని ఒత్తి పలుకుతారు. ఆటంతా దాదాపుగా ఒకటే. ప్రత్యేకంగా ఆడపిల్లలకు నేర్పిస్తారు. తమిళనాడులో కోలాఠం ఆడడానికి ప్రత్యేకంగా పండుగలేవీ అక్కర్లేదు. ఆడవాళ్లు పనులు లేని సమయంలో ఆటవిడుపుగా కోలాఠం ఆడుకుంటారు. ఇక తెలంగాణలో మహిళలు ప్రధానంగా జరుపుకునే బతుకమ్మ వేడుకలాంటిదే తమిళనాడులో ‘కుమ్మి’. ఆంధ్రప్రదేశ్‌లో గొబ్బెమ్మ ఆడినట్లన్న మాట. బతుకమ్మ అమరికలో పూలే ప్రధానంగా ఉంటాయి. గొబ్బెమ్మ ఆటలో, కుమ్మి ఆటలో ముగ్గు వేసి మధ్యలో పూలను అమర్చి చుట్టూ తిరుగుతూ ఆడుతారు. బతుకమ్మ అయినా, గొబ్బెమ్మ అయినా, కుమ్మి అయినా... అలంకరించే పూలలోనే ఉంది అసలు రహస్యం. బతుకమ్మను అలంకరించే పూలు కానీ, కుమ్మి ఆట కోసం ముగ్గు మధ్య అమర్చే పూలు... ఆడవాళ్లు జడలో పెట్టుకోని పూలే. ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఒకటుంది. మనదేశంలో పూచే ప్రతి పువ్వూ ఔషధగుచ్ఛమే. ఈ వేడుకలు జడలో పెట్టుకోని పూలలో ఉన్న ఔషధగుణాలను దగ్గర చేస్తాయి. గొప్ప బంధం సాంస్కృతికంగా తమిళనాడుకి తెలుగు రాష్ట్రాలకు విశ్వాసాల పరంగా కూడా చాలా అవినాభావ సంబంధం ఉంది. మహాభారతం, రామాయణం వంటి పౌరాణిక ఇతిహాసాల ఇతివృత్తాలతో మనం వీధి భాగవతాలు చెప్పుకుంటాం. వాటిని తమిళనాడులో తేరుకూట్ అంటారు. తమిళనాడు, తెలంగాణలు కల్చర్‌ను చాలా బాగా కాపాడుకుంటున్నాయి. ఏపీలో గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు పోవడం, ఆధునికత వైపు పరుగుల మధ్య సంస్కృతి పరిరక్షణ కుంటుపడుతోంది. సంప్రదాయం– సాధికారత మనదేశం గత కొన్ని దశాబ్దాలుగా మహిళ సాధికారత కోసం ఎన్నో ఉపాధి మార్గాలను చూపిస్తోంది, శిక్షణనిస్తోంది. అన్నింటికంటే పెద్ద ఉపాధి మార్గం మన సంప్రదాయ జానపద నృత్యంలోనే ఉంది. కల్చరల్ టూరిజం ద్వారా ప్రధానంగా మూడు అంశాలు అభివృద్ధి చెందుతాయి. స్థానిక సంప్రదాయాన్ని అంతరించి పోకుండా కాపాడుకోగలగడం సాధ్యమవుతుంది. కళారీతులను మెరుగుపరుచుకోవడంలో సృజనాత్మకత మెరుగుపడుతుంది. మూడవది టూరిజానికి నిరంతరతను సాధించడం. టూరిజానికి నిరంతరత అని ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే... ఎంత గొప్ప టూరిస్ట్ స్పాట్ అయినా సరే... ఒక ప్రదేశానికి ఒకసారి వెళ్లిన వాళ్లు సాధారణంగా మళ్లీ వెళ్లరు. కల్చరల్ టూరిజమ్ అలా కాదు. స్థానిక సంప్రదాయాలకు అనుగుణంగా వేడుకలు జరుగుతుంటాయి. ఒక్కో వేడుకలో ఒక్కో రకమైన సాంస్కృతిక కళల ప్రదర్శన జరుగుతుంటుంది. దాంతో ఒక టూరిస్టు... ఒక ప్రదేశానికి మళ్లీ మళ్లీ రావడానికి అవకాశాలు పెరుగుతాయి. ఒక టూరిస్ట్ రావడం వల్ల ఆదాయం వచ్చేది ఆ కళా ప్రదర్శనకు మాత్రమే కాదు. ఆ టూరిస్ట్ బస, భోజనాల కోసం హోటల్, రెస్టారెంట్ వ్యాపారాలు పెరుగుతాయి. అక్కడి ప్రత్యేకమైన వస్తువులను కొంటారు కాబట్టి హస్తకళాకృతుల అమ్మకాలు పెరుగుతాయి. అందుకే మహిళల ఆర్థిక స్వావలంబనకు మన సంప్రదాయ కళలను మించిన మార్గాలు మరేవీ ఉండవనే చెప్తాను. మన ఆట, పాట, హస్తకళ... ప్రతిదీ మనకు అన్నం పెట్టే వనరే. ఆర్థిక స్వావలంబనకు పెద్ద ఆలంబన మన ఫోక్ ఆర్ట్స్. వృత్తి– ప్రవృత్తి నేను చదివిన కోర్సు ఎంపిక నా అభిరుచికి అనుగుణంగా జరిగింది. అందుకే వృత్తి ప్రవృత్తి ఒకటిమిళితమై పోయాయి. ఒక తబలా వాదన, ఒక కథక్ ప్రదర్శన, శాస్త్రీయ– జానపద సంప్రదాయ కళలను పాఠంగా చెప్పడం... ప్రతిదీ సంతోషాన్నిచ్చే అంశాలే అయ్యాయి. ఇవన్నీ నన్ను విదేశాల్లో మన సాంస్కృతిక ప్రదర్శనల వైపు, పుస్తక రచన వైపు నడిపించాయి. ఇక నేను ఎడిటర్‌గా మరో అవతారం ఎత్తడానికి కారణం కూడా భారతీయ సంప్రదాయం, సంస్కృతి, సాంస్కృతి కళల ప్రచురణ కోసమే. మెడికల్, హోటల్, సినిమా ఇండస్ట్రీ తమ రంగాల కోసం జర్నల్స్ నడుపుతున్నాయి. భారతీయ కళలు, సంస్కృతి, సంప్రదాయం, పర్యాటకం కోసం ఒక పత్రిక రూపకల్పన చేశాను. మనదేశం గురించి తెలుసుకోవాలనుకునే విదేశీయులకు ఇది బాగా ఉపయోగపడుతోంది’’ అని చెప్పారు ప్రభుకుమారి. తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్యకు అమ్మానాన్నలతో కలిసి సాంస్కృతిక పత్రిక కాపీని అందచేస్తున్న ప్రభుకుమారి సమాజమే పెద్ద పాఠశాల ప్రభుకుమారి వనమా చెన్నైలోని భారతి ఉమెన్స్ కాలేజ్‌లో డిపార్ట్మెంట్ ఆఫ్ హిస్టారికల్ స్టడీస్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్. ఆమె ఎంఏ, ఎమ్టిటిఎమ్, ఎమ్‌ఫిల్, డబుల్ పీహెచ్డీ. తమిళ్ లిటరేచర్‌లో డిప్లమో, సిటిజెన్స్ లీగల్ రైట్స్‌లో డిప్లమో, డీలిట్ చేశారు. ప్రస్తుతం జానపద కళల మీద విస్తృతంగా పరిశోధన చేస్తున్నారు. భారతీయ సంప్రదాయ కళల పరిరక్షణ కోసం చెన్నైలో ‘వనమా ఆర్ట్, ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ ట్రస్ట్’ను నిర్వహిస్తున్నారు. భారతీయ సంస్కృతి, చరిత్ర పరిశోధనాంశాల మీద రీసెర్చ్ చేసే పరిశోధక విద్యార్థుల కోసం ‘బై యాన్యువల్ జర్నల్ ఆఫ్ ఇండియన్ ఆర్ట్, కల్చర్, హెరిటేజ్ అండ్ టూరిజమ్’ (జెఐఏసిహెచ్టి) పేరుతో జర్నల్ను నడుపుతున్నారు. పరిశోధనలు, జానపద కళల కోసం ఆమె చేస్తున్న కృషికి గుర్తింపుగా ‘ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య గారి చేతుల మీదుగా ‘కంట్రీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ పురస్కారాన్ని అందుకున్నారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ నుంచి ‘బాల సహ్యోగ్ అవార్డ్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఇన్ ఎడ్యుకేషన్’ పురస్కారం అందుకున్నారు. చంఢీఘర్‌లో హిస్టరీ అండ్ టూరిజమ్ నిర్వహించిన సదస్సులో బెస్ట్ అకడమీషియన్ అవార్డు అందుకున్నారు. ‘ఉమెన్ స్టడీస్ అండ్ సోషల్ సైన్సెస్’ అంశం మీద ఆమె ప్రసంగించారు. ఆమె సూచించిన అనేక అంశాలను ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలుగా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటోంది. ‘‘మనం అక్షరాలు నేర్చుకుని, పుస్తకాలతో చదవడం ద్వారా విజ్ఞానాన్ని సొంతం చేసుకోగలుగుతున్నాం... అని అనుకుంటాం. కానీ అక్షరాలు, పుస్తకాలు కేవలం మనకు విజ్ఞానాన్ని అందించే మాధ్యమాలు మాత్రమే. మనం నిజంగా నేర్చుకునేది సమాజం నుంచే’’ అంటారు ప్రభుకుమారి. ‘‘ప్రపంచం గ్లోబల్ విలేజ్‌గా మారిన నేపథ్యంలో జ్ఞానం... ఏదో ఒక మారుమూల అలా ఉండిపోవడం లేదు. ఒక మూల నుంచి మరో మూలకు సులువుగా చేరుతోంది. ఒకరి కల్చర్ మీద మరొకరికి ఆసక్తి పెరుగుతోంది. ఇలాంటి తరుణంలో మన కల్చర్ మనకు అన్నం పెట్టే మాధ్యమం అవుతోందని మాత్రం మర్చిపోవద్దు’’ అన్నారు ప్రభుకుమారి.– వాకా మంజులారెడ్డి -
హిందీ నేర్పలేక టీచర్లు పారిపోయారు..
తమిళనాట సూర్యుడు ఉదయిస్తాడో లేదోగానీ.. తామర వికసిస్తుంది’. ఇది ఆమె ఎప్పుడూ భావోద్వేగంగా చెప్పే మాట. ఆ మాట ఆమెను గేలిచేసేలా, హేళనకు గురయ్యేలా చేసింది. ఇక ఆమె చింపిరి తలకట్టుపై ఒక కామెంట్ కాదు. సామాజికమాధ్యమాలలో ఎన్నో అవమానాలు, ఛీత్కారాలు! అయినా తాను నమ్మిన సిద్దాంతం.. పార్టీ ఆమెను గుర్తించేలా చేసింది. ఆమెను ఎవరూ ఊహించనిఅందలానికి ఎక్కించింది. తమిళ నాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా ఉండి.. ప్రస్తుతం తెలంగాణ గవర్నర్‌గా నియమితురాలైన ఆమే.. తమిళిసై సౌందర్‌రాజన్. వైద్యురాలిగా.. సాహితీవేత్తగా.. రాజకీయనేతగా తమిళిసైది వెన్నుచూపని మార్గం. తమిళ రాజకీయాల్లో తలపండిన వారుఎందరు ఉన్నా.. ఆమెలోని సంకల్పబలమే ఆమెను ఈ స్థాయికి చేర్చింది. వద్దన్నా పాలిటిక్స్‌లోకి! తమిళిసై తండ్రి కుమరి అనంతన్ గాంధేయవాది. జాతీయ కాంగ్రెస్‌లో సీనియర్ నేత. తమిళనాట కాంగ్రెస్‌కు డెబ్భైలలో ప్రచార ఫిరంగిగా ఆయనకు పేరుంది. అదే తమిళిసైకి రాజకీయ వారసత్వంగా వచ్చింది. అయితే అనంతన్‌కు వారసత్వ రాజకీయాలు నచ్చవు. అందుకే తన కుటుంబం రాజకీయాల్లో రాదని కరాకండిగా తేల్చేశాడు. కూతురు రాజకీయాల్లోకి వస్తానంటే అదేమాట చెప్పేశాడు. అయినా తన రాజకీయ సభలకు, చట్టసభలకు కావాల్సిన కొన్ని నోట్స్ తమిళిసైతోనే రాయించుకునేవాడు. అదే ఆమెకు రాజకీయాల్లోకి రావటానికి పునాది వేసింది. తండ్రిలోని వాక్పటిమ, నాయకుడిగా ప్రజల్లో మమేకమయ్యే తీరు ఆమెను రాజకీయాల్లోకి వచ్చేలా చేసింది. భర్తతో తమిళిసై ‘పెద్దల్ని’ కలిపిన పెళ్లి తమిళిసై కన్యాకుమారి జిల్లా నాగర్ కోయిల్‌లో పుట్టింది. ఆమెను డాక్టర్‌ను చేయాలన్నది తల్లిదండ్రుల కోరిక. వారి కోరిక మేరకే మద్రాసు మెడికల్ కాలేజిలో ఆమె వైద్య విద్య అభ్యసించారు. వైద్య విద్య రెండవ ఏడాదిలో ఆమెకు అక్కడే వైద్యుడిగా ఉన్న డాక్టర్ సౌందర్రాజన్తో వివాహం జరిగింది. ఆమె వివాహం తమిళనాట ఓ సంచలనం. కారణం.. ఆమె తండ్రి అనంతన్పై ఉన్న గౌరవంతో అప్పటి ముఖ్యమంత్రి ఎంజీఆర్ తోపాటు ప్రతిపక్ష నేత కరుణానిధి, మాజీ ముఖ్యమంత్రి భక్తవత్సలం వంటి హేమాహేమీలు హాజరయ్యారు. ఇందులో మరొక విశేషం ఉంది. రాజకీయంగా విరోధులుగా మారిన ఎంజీఆర్, కరుణానిధిలు పదేళ్ల తర్వాత తొలిసారిగా ఈ వివాహంలో కలుసుకోవటమే కాకుండా కరుణానిధి నేరుగా ఎంజీఆర్ పక్కనే కూర్చుని స్నేహితుడి యోగక్షేమాలు తెలుసుకున్నారు! పెళ్లిలో ముందుగా మాట్లాడిన కరుణానిధి ‘తమిళనాట తమిళ శబ్ధం వినపడుతుందా అని ఎదురు చూస్తున్న రోజుల్లో కుమరి అనంతన్ తన కుమార్తెకు తమిళ్ ఇసై.. అంటే తమిళ సంగీతం అంటూ పేరు పెట్టడం ఆమె గురించి రాష్ట్రవ్యాప్తంగా తెలిసేలా చేసింది’ అన్నారు. ఎంజీఆర్ మాట్లాడుతూ.. తమిళిసైను చూస్తుంటే చిన్న పిల్లలా కనిపిస్తున్నా ఏదో రోజు దేశంలోనే పెద్ద పేరు తెచ్చుకుంటుందని ఆకాంక్షించారు. తొలి అడుగు కన్యాకుమారి 1996లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు తమిళిసై రాజకీయ ప్రవేశానికి దారి తీశాయనే చెప్పాలి. ఆమె తన తండ్రి కోసం కన్యాకుమారిలో ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు అక్కడి నుండి బీజేపీ తరపున పోటీ చేస్తున్న పొన్.రాధాకృష్ణన్ ప్రచారాన్ని ఆమె చూడటం జరిగింది. ఆయన కోసం బీజేపీ నేతలు, ఆర్ఎస్ఎస్ వర్గాలు కన్యాకుమారిలో ప్రచారం చేయటం, వారి ప్రచార సరళి ఆమెను ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత తమిళిసై తంజావూరులో హౌస్ సర్జన్ చేస్తుండటం, అక్కడి హాస్పిటల్ లోని వార్డుబాయ్, ఆర్ఎస్ఎస్ కార్యకర్త వాజ్‌పేయి గురించి చెప్పటం ఆమెను బీజేపీ వైపు మొగ్గుచూపేలా చేశాయి. వాజ్‌పేయి ప్రసంగాలూ ఆమెపై ప్రభావం చూపాయి. ప్రధానంగా ఆయన ప్రసంగంలోని ‘మతం కన్నా మానవత్వం మిన్న’ అనే నినాదం ఆమెను పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వచ్చేలా చేసింది. అప్పుడే వాజ్‌పేయి ప్రధాని కావటం, కేవలం పదమూడు రోజులే ఆయన పదవిలో ఉండటం, ప్రభుత్వం కూలిపోవడం వంటి సంఘటనలు ఆమెను బీజేపీలో కార్యకర్తగా చేరేలా చేశాయి. అలా రాజకీయంగా ఆమె ఒక్కో మెట్టూ ఎక్కారు. నేనా.. పాడనా పాటా..! తమిళిసైకి కర్నాటక సంగీతం ఇష్టం. వీణ వాయిస్తారు. నిశ్చితార్థం తర్వాత కాలేజ్‌లో జరిగిన కార్యక్రమంలో తమిళిసై పాడిన ఓ పాటంటే సౌందర్‌రాజన్‌కు చాలా ఇష్టం. ఇప్పటికీ అడిగి మరీ ఆ పాటను పాడించుకుంటారు. తమిళిసైకి వంటరాదు. కనీసం టీ కూడా చేయలేదు! పెళ్లయిన కొత్తలో పుస్తకాలు చూసి వంటచేయటం భరించలేక ఆమెతో వంట మాన్పించారని ఆమె భర్త నవ్వుతూ చెబుతారు. ‘‘అదొక్కటే కాదు.. తమిళిసైకి హిందీ నేర్పలేక ఆరుగురు టీచర్లు పారిపోయారు’ అని సౌందర్‌రాజన్ సరదాగా అన్నారు. తమిళిసై ఎంత ఎత్తుకు ఎదిగినా రోజుకు కనీసం ఓ గంటైనా వైద్య సేవలు అందించాలన్నది సౌందర్‌రాజన్ కోరిక. ఇక ఆమె డ్రెస్, హెయిర్ స్టైల్ అంతా కుమార్తె సూచనలే. ఆరంభంలో దూరదర్శన్, రాజ్ టీవీలో డిబేట్స్ నిర్వహించిన తమిళిసై అనర్గళంగా మాట్లాడగలరు. పదవులు ఉన్నా, లేకపోయినా తనపై విమర్శలు వచ్చినా వివాదాస్పద విషయాలైనా నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా మీడియా ముందు మాట్లాడేయడం ఆమె ప్రత్యేకత. కనిమొళిపైనే పోటీ! తమిళిసై చట్టసభల్లో గెలుపెరగని నేత. అయినా నిరాశ చెందని ఉక్కు మహిళగా పేరొందారు. తమిళ శాసనసభకు మూడుసార్లు, లోక్‌సభకు రెండుసార్లు పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో తూత్తుకుడి నుండి డిఎంకె సీనియర్ నేత కనిమొళిపై పోటీ చేయటం, ఓటమిపాలైనా రెండవస్థానంలో నిలవటం తమిళిసై సత్తాను చాటేలా చేసింది. పేదల డాక్టర్ ఒకే కాలేజ్‌లో పరిచయం అయినా తమిళిసైది పెద్దలు కుదిర్చిన వివాహమే. భర్త, ఇద్దరు పిల్లలు. కుమారుడు సుగంధన్, కుమార్తె పూవినీ.. ఇదీ తమిళిసై కుటుంబం. ఇంట్లో ఐదుగురు వైద్యులున్నారు. కొడుకు, కోడలు, కూతురు కూడా వైద్యులే. తమిళిసై వైద్యురాలిగా ఐదేళ్ల పాటు చెన్నైలోని ఎస్ఆర్ఎంసీలో సేవలు అందించిన అనంతరం పలు కళాశాలలకు ప్రొఫెసర్‌గా పనిచేశారు. తమిళిసై అల్ట్రాసౌండ్ స్కాన్ లో నిష్ణాతురాలు. తన నివాసంలోనే డయాలసిస్ విభాగాన్ని ఏర్పాటు చేసి కొందరికి ఉచితంగా, మరికొందరికీ కేవలం రెండు వందల రూపాయలకే డయాలసిస్ సేవలు అందించి స్థానికంగా పేదల డాక్టర్ అనే పేరు తెచ్చుకున్నారు. మిస్డ్ కాల్ ఐడియా తనదే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పార్టీని బలోపేతం చేసే క్రమంలో తమిళిసై చేసిన కోటి మంది సభ్యత్వ నమోదు కార్యక్రమం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపింది. ఒక్క మిస్డ్ కాల్ తో పార్టీ సభ్యత్వం అంటూ ఆమె ప్రవేశపెట్టిన కొత్త మార్గం రాష్ట్రంలోని యువతను ఆకట్టుకునేలా చేసింది. అప్పుడే.. ‘సూర్యుడు ఉదయిస్తాడో లేదో కాని తమిళనాట తామర వికసిస్తుంది’ అంటూ ఆమె చేసే ప్రసంగాలపై, ఆమె జుట్టుపై సామాజిక మాధ్యమాలలో ఆమెపై హేళనగా సెటైర్లు పడ్డాయి. అయితే అవి ఆమె ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేకపోయాయి. ఈ క్రమంలో గత ఏడాది సరిగ్గా ఇదే నెలలో తూత్తుకుడి నుండి చెన్నై వస్తున్న విమానంలో జరిగిన ఓ సంఘటన తమిళిసై వైపు రాష్ట్రం తిరిగి చూసేలా చేసింది. ఆమె ప్రయాణిస్తున్న విమానంలోనే ఉన్న సోఫియా అనే యువతి తమిళిసైను చూడగానే ఫాసిస్ట్ బీజేపీ నశించాలంటూ నినదించింది. ఆ ఘటనతో మొదటిసారిగా తమిళనాడు ఆమెలోని ఆగ్రహాన్ని తలెత్తి చూసింది. విమానం చెన్నై ఎయిర్ పోర్ట్‌లో దిగగానే సోఫియాను పోలీసులు అరెస్టు చేయటం తమిళిసై సోఫియాపై కేసు నమోదు చేయటం ఒక్కసారిగా బీజేపీలో రాజకీయాల్ని వేడెక్కేలా చేశాయి. అదొక్కటే కాదు, గడిచిన నాలుగేళ్లుగా రాష్ట్రంలో బీజేపీని పటిష్టం చేయటంతోపాటు రజనీకాంత్, కమల్ హాసన్, సత్యరాజ్, సుబ్రమణ్యస్వామి, హెచ్.రాజా వంటి వారు కేంద్రప్రభుత్వంపై, బీజేపీపై చేసిన విమర్శలను ఆమె సమర్థంగా తిప్పికొడుతూ వచ్చారు.– సంజయ్ గుండ్ల, ప్రత్యేక ప్రతినిధిసాక్షి టీవీ, చెన్నై బ్యూరో -
గౌలిగూడ టు సిమ్లా
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయను గవర్నర్ పదవి వరించింది. ఈ మేరకు కేంద్రం ఆయన్ను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమించడంతో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి.నగరంలోని గౌలిగూడలో పుట్టిపెరిగిన దత్తన్న మరోసారి ఉన్నత పదవి చేపడుతుండడం గర్వకారణమనిపలువురు ఆయన్ని అభినందనలతో ముంచెత్తారు. ముషీరాబాద్: గౌలిగూడ బస్తీలో పుట్టి పెరిగి రాంనగర్ కేంద్రంగా రాజకీయాలు ప్రారంభించిన బండారు దత్తాత్రేయను హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా నియమించడంతో బీజేపీ శ్రేణులు, అభిమానుల్లో ఒక్కసారిగా ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నుంచి తన ప్రస్థానాన్ని ప్రారంభించిన దత్తన్న నగరం కేంద్రంగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైనా సికింద్రాబాద్ లోక్‌సభ నుంచి అత్యధిక సార్లు విజయం సాధించటంతో పాటు రెండుమార్లు కేంద్రమంత్రి పదవిని చేపట్టారు. తాజాగా మరో మెట్టు ఎదిగి గవర్నర్ కావడంతో నగర బీజేపీ శ్రేణులు ఆదివారం ఆయనను అభినందనలతో ముంచెత్తాయి. సింపుల్ మ్యాన్... గౌలిగూడలో ఓ సాదాసీదా ఇంటిలో నివాసం ఉన్న దత్తాత్రేయ మొదటిసారిగా 1991లో సికింద్రాబాద్ పార్లమెంటు నుంచి ఎన్నికయ్యారు. సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో 1998లో రాంనగర్‌కు మకాం మార్చారు. అదే సమయంలో వాజ్‌పేయి ప్రభుత్వంలో గ్రామీణాభివద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటికీ.. రాంనగర్‌లోనే నివసిస్తూ ఒక కిరాయి ఇంట్లో సుమారు రెండేళ్లు ఉండి అదే ప్రాంతంలో ఇల్లు నిర్మించుకున్నారు. ఇప్పటికీ అదే ఇంట్లో ఉంటూ దాదాపు 22 ఏళ్లుగా రాంనగర్‌తో అవినాభావ సంబంధం ఏర్పర్చుకున్నారు. ఎంపీ అయినా, కాకపోయినా అందరితో కలిసిపోవడం, ఎలాంటి ఆర్భాటాలకు పోక పోవడం ఆయన నైజం. ఎప్పుడు చూసినా సౌమ్యంగా కనబడడం, ముఖ్యంగా మధ్యతరగతి, పేదలకు అందుబాటులో ఉండ డం అతని సహజ లక్షణం. అం దుకే మినిస్టర్ కాగానే ఎంతో మం ది సన్నిహితులు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లకు వెళ్దామని ఒత్తిడి తెచ్చినా లొంగకుండా పేదలకు అందుబాటులో ఉండాలనే ఒకే ఒక్క కారణంతో రాంనగర్ను విడిచి వెళ్లలేదు. కూతురు వివాహ రిసెప్షన్లో ప్రధాని మోదీతో దత్తాత్రేయ ఆలస్యంగా వివాహం... ఆర్ఎస్ఎస్లో, సేవా కార్యక్రమాల్లో మునిగితేలిన దత్తాత్రేయ వివాహం చేసుకోవాలనే ఆసక్తి కనపర్చలేదు. వివాహం తన పార్టీ కార్యక్రమాలకు విఘాతం కల్గిస్తుందని భావించారు. అప్పటి ప్రధాని వాజ్‌పేయి సూచన మేరకు ఆర్ఎస్ఎస్ నుంచి 1980లో బీజేపీలో చేరారు. బీజేపీలో కూడా చురుకైన పాత్ర పోషించి 1981–89 వరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఈ సమయంలో పార్టీ పెద్దలు, సహచరులు వివాహం చేసుకోవాలని ఒకవైపు ఒత్తిడి చేస్తుండగా.. మరోవైపు సమీప బంధువైన వసంత దత్తాత్రేయనే చేసుకుంటానని, లేకపోతే పెళ్లి చేసుకోనని చెప్పడంతో చివరికి తన 42వ ఏటా పెండ్లి చేసుకున్నారు. ఆయన కూతురిని బీజేపీ ముఖ్యనాయకుడు బి.జనార్ధన్‌రెడ్ది తనయుడు డాక్టర్ జిగ్నేష్రెడ్డికి ఇచ్చి వివాహం చేశారు. కుమారుడు సంవత్సరం క్రితం గుండెపోటుతో మరణించడంతో దత్తాత్రేయ మానసికంగా కుంగిపోయారు. అయినా తేరుకుని పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న సమయంలో హిమచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా నియమించడం పట్ల ఆయన కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. అభినందనల వెల్లువ బీజేపీ అగ్రనేత బండారు దత్తాత్రేయను హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా నియమిస్తున్నట్లు ఆదివారం ఉదయం వార్త వెలువడగానే ఆయన నివాసం అభిమానులతో నిండిపోయింది. అధికారిక ప్రకటన వచ్చే సమయానికి దత్తాత్రేయ నాంపల్లిలో గణేష్ ఉత్సవ సమితి సమావేశంలో ఉన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఉత్సవ సమితి సభ్యులు ఆయనను అభినందనలతో ముంచెత్తారు. కొత్త బాధ్యతల్లోకి వెళుతున్న దత్తాత్రేయను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్లు నరసింహన్, విశ్వభూషణ్ హరిచందన్, విద్యాసాగర్‌రావు, కల్రాజ్ మిశ్రా, ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కె.కేశవరావు, రామ్మోహన్రావు,సుజనాచౌదరి, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, కేంద్ర మంత్రులు జవదేకర్, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ వినోద్‌కుమార్, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, మాజీ ఎంఎల్సీ చుక్కా రామయ్య, మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు అభినందించారు. అమ్మవారికి బోనం చాంద్రాయణగుట్ట: హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమితులైన బీజేపీ సీనియర్‌నేత బండారు దత్తాత్రేయకు పాతబస్తీ ఆషాఢ మాసం బోనాలతో విడదీయరాని అనుబంధం ఉంది. ఏటా ఉత్సవాలకు హాజరై లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పిస్తారు. కేంద్ర మంత్రిగా ఉన్న సమయంతో పాటు ఈ ఏడాది కూడా అమ్మవారి ఆలయానికి కుటుంబ సమేతంగా విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఓయూలో మార్నింగ్ వాక్ ఉస్మానియా యూనివర్సిటీ: బండారు దత్తాత్రేయ నియామకం పట్ల ఓయూలో పలువురు విద్యార్థులు, అధ్యాపకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఓయూ క్యాంపస్‌కు ప్రతి రోజు మార్నింగ్ వాకింగ్‌కు వచ్చి అనేక మంది ప్రొఫెసర్లు, అధ్యాపకులు, విద్యార్థులతో వివిధ అంశాలపై చర్చించేవారు. కేంద్ర మంత్రిగా ఓయూలో ఉద్యోగ, ఉపాధి శిక్షణ కేంద్రాన్ని ఎంప్లాయిమెంట్ బ్యూరో కార్యాలయాన్ని ప్రారంభించారు. లేడీస్ హాస్టల్లో ప్రతి ఏటా విద్యార్థినులు జరుపుకును బతుకమ్మ పండుగలో పాల్గొనేవారు. ఏబీవీపీ నాయకులను పేరుపెట్టి పిలిచేంత చనువుగా ఉండేవారు. సికింద్రాబాద్ ఎంపీగా, మంత్రిగా దత్తాత్రేయ ఓయూలో అనేక కార్యక్రమాల్లో పాల్గొని ప్రసంగించారు. కళా పురస్కారాల ప్రదానం వివేక్‌నగర్:మోహన్ ట్రస్ట్, కీర్తన ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఆదివారం త్యాగరాయ గానసభలో 12గంటల పాటు తెలుగు కళా సంరంభం, సంగీత నృత్య సమ్మేళనం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన తమిళనాడు మాజీ గవర్నర్ డా.కె.రోశయ్య వివిధ రంగాల ప్రముఖుల్ని కళా పురస్కారాలతో సత్కరించారు. ఆయన మాట్లాడుతూ.. సాంçస్కృతిక సంస్థలు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. బీసీ కమిçషన్ సభ్యుడు డా.వకుళాభరణం కృష్ణమోహనరావు, దైవజ్ఞశర్మ, కొత్త కృష్ణవేణి, మహ్మద్ రఫీ, వై.రాజేంద్రప్రసాద్, మోహన్ గాంధీ, శ్రీనివాసగుప్తా, శశిబాల తదితరులు పాల్గొన్నారు. కుమ్మేసింది వర్షం కుమ్మేసింది. ఆదివారం సాయంత్రం నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. రహదారులపై వరద పోటెత్తింది. ఫలితంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హుస్సేన్‌సాగర్ (ట్యాంక్‌బండ్) నీటి మట్టం ఆదివారం సాయంత్రానికి +513.410 అడుగులకు చేరింది. ట్యాంక్‌బండ్ సామర్థ్యం +514.910 అడుగులు కావడంతో భయపడాల్సిన అవసరం లేదని జీహెచ్ఎంసీ వర్గాలు పేర్కొన్నాయి. -
నరసింహన్‌పై కేటీఆర్ భావోద్వేగ ట్వీట్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణకు కొత్త గవర్నర్ నియమితులైన నేపథ్యంలో ప్రస్తుత గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌తో ఉన్న అనుభూతులను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పంచుకున్నారు. గత 10 ఏళ్లుగా నరసింహన్ రాష్ట్రానికి చాలా విషయాల్లో మార్గనిర్దేశం చేశారని పేర్కొన్నారు. ఈమేరకు ఆయన ట్విటర్ వేదికగా నరసింహన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇక ముందూ కూడా ఆయన ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉండాలని ఆకాంక్షించారు. ‘అనేక సందర్భాల్లో ఎన్నో అంశాలపై నరసింహన్ గారితో సంభాషించే అవకాశం కలిగింది’ అంటూ గతంలో నరసింహన్‌తో కలిసి దిగిన ఫోటోలను కేటీఆర్ ట్విట్టర్లో షేర్ చేశారు. అలానే హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమితులైన బీజేపీ నేత బండారు దత్తత్రేయకు కేటీఆర్ అభినందనలు తెలిపారు. (చదవండి : తెలంగాణ నూతన గవర్నర్‌గా సౌందర్‌రాజన్) కాగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి నూతన గవర్నర్ నియమించిన విషయం తెలిసిందే. ప్రస్తుత గవర్నర్ నరసింహన్ స్థానంలో తమిళనాడుకు చెందిన తమిళిసై సౌందర రాజన్‌ను ప్రకటించింది. (చదవండి : తెలంగాణ తొలి గవర్నర్‌గా నరసింహన్ విశిష్ట సేవలు) Had the good fortune of interacting numerous times in various capacities with Hon’ble Governor Sri ESL Narasimhan Garu Wholeheartedly thank sir for his sagacious guidance & for being a father figure for the state throughout last 10 years. Wishing you good health & peace sir 💐 pic.twitter.com/pRvh70dnZz — KTR (@KTRTRS) September 1, 2019 -
తెలంగాణ తొలి గవర్నర్‌గా నరసింహన్ విశిష్ట సేవలు
గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ గడిచిన తొమ్మిదిన్నర ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల్లోని అనేక రాజకీయ పరిణామాలకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.. అదేవిధంగా రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు కూడా గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. రెండు రాష్ట్రాలకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మధ్య స్నేహపూరిత వాతావరణం నెలకొల్పడంలో వారధిగా ఉన్నారు. విభజన అనంతరం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు తొలి గవర్నర్‌గా పని చేసిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఆయన వ్యక్తిగత, వృత్తిగత వివరాలు.. నరసింహన్ 1945లో తమిళనాడు రాష్ట్రంలో జన్మించారు. ఆయన పూర్తి పేరు ఎక్కాడు శ్రీనివాసన్ లక్ష్మీనరసింహన్. హైదరాబాద్‌లోని లిటిల్‌ఫ్లవర్ హైస్కూల్లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసి ఉన్నత విద్య కోసం సొంత రాష్ట్రానికి వెళ్లారు. అక్కడ మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాల నుంచి పొలిటికల్ సైన్స్‌లో గోల్డ్‌మెడల్ సాధించారు. మద్రాసు లా కళాశాలలో న్యాయవిద్య పూర్తి చేశారు. 1968లో సివిల్ సర్వీసెస్‌లో ఐపీఎస్‌గా ఎంపికై ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు కేటాయించబడ్డారు. 1972లో ఇంటెలిజెన్స్ బ్యూరోకు తన సేవలు అందించారు. కాగా 2006 డిసెంబర్లో రిటైర్ అయ్యేవరకు అందులోనే పని చేశారు. ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. అదే విధంగా రెండుదఫాలుగా విదేశీ వ్యవహారాల శాఖలో పనిచేశారు.1981-84 మధ్య మాస్కోలోని భారత రాయబార కార్యాలయంలో ఫస్ట్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు. 1996 నుంచి 1999 వరకు విదేశాల్లోని రాయబార కార్యాలయాల భద్రతా వ్యవహారాలు చూశారు. 2006 డిసెంబర్లో నరసింహన్ రిటైర్ అయిన తర్వాత ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. అక్కడ మావోయిస్టుల ప్రాబల్యాన్ని తగ్గించడానికి నరసింహన్ విశేష కృషి చేశారు. 2010 జనవరిలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా నరసింహన్ బాధ్యతలు స్వీకరించారు. 2012 మేలో మరో ఐదు ఏళ్ల పదవీకాలాన్ని కేంద్రం ప్రభుత్వం పొడిగించింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆయన 2 జూన్ 2014 నుంచి రెండు తెలుగు రాష్ర్టాలకు గవర్నర్‌గా కొనసాగారు. కొద్ది రోజుల క్రితమే కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన గవర్నర్‌ను నియమించగా.. అప్పటినుంచి నరసింహన్ కేవలం తెలంగాణ గవర్నర్‌గా కొనసాగుతున్నారు. నేషనల్ డిఫెన్స్ కాలేజీ పూర్వ విద్యార్థి అయిన నరసింహన్‌కు సంగీతం అంటే ఇష్టం. కర్ణాటక, హిందుస్థానీ సంగీతాన్ని ఇష్టపడతారు. నరసింహన్ సతీమణి విమలా నరసింహన్. వారికి ఇద్దరు కొడుకులు. -
గవర్నర్‌ను కలిసిన పర్యావరణ బాబా
సాక్షి, ఢిల్లీ : ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్‌ను రుషికేశ్ అవధూత అరుణ గురూజీ మహారాజ్ కలిశారు. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా 5 కోట్ల మొక్కలు నాటుతున్నామని ఈ పర్యావరణ బాబా వివరించారు. అందులో భాగంగా ఏపీలో కూడా మొక్కలు నాటుతామని చెప్పారు. ఈ విషయాన్ని స్వాగతించిన గవర్నర్ సానుకూలంగా స్పందించారు. -
వైవీయూ నిర్లక్ష్యం..!
ఆధునిక సాంకేతికత కొంత్తపుంతలు తొక్కుతున్న తరుణంలో.. అందుకు అనుగుణంగా పనిచేయాల్సిన విశ్వవిద్యాలయం పాత చింతకాయపచ్చడిలా..పాత సమాచారాన్నే కొనసాగిస్తూ.. నెటిజన్లను గందరగోళానికి గురిచేస్తోంది. సాక్షాత్తు విశ్వవిద్యాలయం చాన్స్‌లర్, రాష్ట్ర గవర్నర్ మారినా ఇంకా అధికారులకు మాత్రం తెలియనట్లుంది. వైవీయూ పాలకమండలిని రద్దు చేసి నెలరోజులవుతున్నా ఇంకా వారిపే ర్లనే కొనసాగిస్తూ తరిస్తున్నారు. ఇటువంటి చిత్ర విచిత్రాల సమాచారం కనిపించే వైవీయూ వెబ్సైట్ నిర్వహణపై ప్రత్యేక కథనం.. సాక్షి, వైవీయూ: ప్రస్తుత డిజిటల్ యుగంలో ఏదైనా సమాచారం అవసరమైతే ఎక్కువగా ఇంటర్నెట్ మీద ఆధారపడుతున్నారు. పొరుగు జిల్లాలు, రాష్ట్రాల విద్యార్థులు ఏదైనా సమాచారం కోసం వైవీయూ వెబ్‌సైట్‌ను సందర్శిస్తే కొన్ని అంశాలు మినహా మిగతా సమాచారం అంతా పాతదే కనిపిస్తోంది. దీనికి తోడు జూలై 17న విశ్వవిద్యాలయాలు తప్పని సరిగా వెబ్సైట్లో సమాచారాన్ని వెబ్సైట్లో నమోదు చేయాలని యూజీసీ సూచిస్తూ రిజిస్ట్రార్‌కు లేఖ రాసింది. వెబ్సైట్లో నమోదు చేసే అంశాలకు సంబంధించి డాక్యుమెంట్స్, ఫొటోగ్రాఫ్స్, వీడియో తదితర అంశాలను తాజా సమాచారంతో పొందుపరచాలని సర్కులర్ సైతం జారీ అయింది. అప్డేట్ కాని సమాచారం.. ►ఈనెల 24వ తేదీన రాష్ట్ర గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ బాధ్యతలు స్వీకరించారు. గవర్నర్ ఎవరైతే ఉంటారో వారే విశ్వవిద్యాలయాలకు చాన్సలర్‌గా ఉంటారు. అయితే వైవీయూ వెబ్సైట్లో మాత్రం ఇప్పటికీ చాన్సలర్‌గా పూర్వపు గవర్నర్ నరసింహన్ చిత్రమే కనిపించడంతో పాటు పేరు కూడా మార్చలేదు. ►జూన్ 28వ తేదీన వైవీయూ పాలకమండలిని రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇప్పటికీ పాలకమండలి సభ్యులుగా టీడీపీ నాయకులు గోవర్ధన్‌రెడ్డి, విజయజ్యోతి, సానుభూతి పరులు పెంచలయ్య, రామచంద్రయ్య పేర్లను వెబ్సైట్లో కొనసాగిస్తున్నారు. ఇదే వరుసలో ఉన్న ప్రిన్సిపల్, రిజిస్ట్రార్, రెక్టార్ల పేర్లను, సమాచారం మాత్రం అప్డేట్ చేసిన వీరికి పైనే మారిన పాలకమండలి సభ్యుల పేర్లు కనిపించకపోవడం గమనార్హం. ►వెబ్సైట్లో ప్రిన్సిపల్‌గా ఆచార్య జి.సాంబశివారెడ్డి పేరు, ఫొటో కరెక్ట్‌గా చూపుతున్న వెబ్సైట్, వైస్ ప్రిన్సిపల్‌గా ఆచార్య కె. కృష్ణారెడ్డి నియమితులైనా ఆయన ఫొటో, పేరు లేకుండా మళ్లీ ఆచార్య జి.సాంబశివారెడ్డి చిత్రమే కనిపిస్తోంది. ►పరీక్షల విభాగంలో అదనపు పరీక్షల నియంత్రణాధికారిగా పనిచేసిన డా. వి. వెంకట్రామ్ రెండు నెలల క్రితమే మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్సిటీకి అనుబంధ నూజివీడు పీజీ కళాశాలలో ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు. అయినప్పటికీ ఆయన చిత్రం, పేరు, సమాచారమే ఇప్పటికీ దర్శనమిస్తోంది. ఈయన వైవీయూ రిసెర్చ్ సెల్ కోఆర్డినేటర్‌గా కూడా కొనసాగుతున్నట్లు పాతసమాచారమే దర్శనమిస్తోంది. ►వెబ్సైట్లో ప్రవేశాల గురించి తెలుసుకుందామని అడ్మిషన్స్‌పై క్లిక్ చేస్తే అండర్ కన్స్ట్రక్షన్స్ అని చూపుతోంది. ►వీటితో పాటు వైవీయూలోని కోర్సులకు సంబంధించిన పూర్తి సమాచారం లేదు. గత రెండు సంవత్సరాలకు పైగా ఉర్దూ కోర్సు నడుస్తున్నప్పటికీ ఇది ఉన్నట్లు కూడా చూపడం లేదు. ఇటీవల ప్రవేశపెట్టిన ఎంఏ రూరల్ డెవలప్మెంట్ ఎంఎస్సీ ఫుడ్‌టెక్నాలజీ, ఎంఎస్సీ కంప్యూటేషనల్ డాటా సైన్స్ కోర్సుల ఊసు వెబ్సైట్లో లేదు. ►వీటితో పాటు ఐక్యూఏసీ (ఇంటర్ క్వాలిటీ అసెస్‌మెంట్‌సెల్) విభాగం క్లిక్ చేస్తే చివరిసారిగా 2015 డిసెంబర్ 1లో అప్డేట్ చేసినట్లు చూపుతోంది. ►ఇటీవల కాలంలో విశ్వవిద్యాలయానికి పలు పురస్కారాలు వచ్చాయి. వీటికి సంబంధించిన సమాచారం కూడా నమోదు చేయలేదు. రూ.17 కోట్లు వెచ్చించి నిర్మించిన ఆర్ట్స్బ్లాక్కు సంబంధించిన చిత్రం ఒక్కటి కూడా వైవీయూ ఫొటోగ్యాలరీలో కనిపించకపోవడం గమనార్హం. ►అబౌట్ వైవీయూలోకి వెళ్లి అడ్మినిష్ట్రేషన్ వింగ్‌ను క్లిక్ చేస్తే కేవలం చిత్రాలు ఉంటాయే తప్ప అక్కడ ఎవరి పేర్లు, సమాచారం కనిపించవు. వివరాలు లేకుండా ఫొటోలు ఎందుకు ఉంచారో ఎవరికీ తెలియదు. ►వైవీయూ పీహెచ్డీ థీసిస్ అన్న అంశాన్ని ఓపెన్‌చేస్తే 2017 జూలై 21వ తేదీ వరకు వచ్చినవి మాత్రమే కనిపిస్తాయి. తర్వాత నుంచి సమర్పించిన పీహెచ్‌డీల సమాచారం లేదు. ►2019 పరీక్షలు ముగిసి ఫలితాలు వచ్చినా ఇంకా 2018 ఇన్స్టంట్ పరీక్షలకు సంబంధించిన ఫలితాల సమాచారమే కనిపిస్తోంది. ►సమాచారహక్కు చట్టంలో నేటికీ నాలుగు సంవత్సరాల క్రితం ప్రిన్సిపల్‌గా పదవీ విరమణ చేసిన ఆచార్య జయపాల్‌గౌడ్ పేరే ఉండటం గమనార్హం. పైన కనిపిస్తున్నవన్నీ కొన్ని ఉదాహరణలు మాత్రమే. అందరికీ ఆదర్శంగా నిలుస్తూ అప్డేట్ సమాచారాన్ని అందించాల్సిన విశ్వవిద్యాలయ పాలకులు ఇంకా పాత సమాచారాన్నే కలిగి ఉండటం నెటిజన్లకు ఇబ్బందికరంగా తయారైంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి తాజా సమాచారంతో పాటు విభాగాలకు సంబంధించిన పూర్తి సమాచారం విశ్వవిద్యాలయ వెబ్సైట్లో ఉంచాలని విద్యార్థులు, మేధావులు కోరుతున్నారు. వైవీయూ వెబ్సైట్లో దర్శనమిస్తున్న పూర్వపు చాన్సలర్ చిత్రం -
రేపు జిల్లాకు కొత్త గవర్నర్ రాక
సాక్షి, చిత్తూరు కలెక్టరేట్ : రాష్ట్ర కొత్త గవర్నర్‌గా నియమితులైన విశ్వభూషణ్ హరిచందన్ ఈ నెల 23వ తేదీన జిల్లా పర్యటనకు రానున్నారు. మొదటిసారిగా తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ మేరకు గవర్నర్ షెడ్యూల్ ఆదివారం కలెక్టరేట్‌కు అందింది. గవర్నర్ పర్యటనకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ నారాయణ భరత్‌గుప్త ఆయా శాఖల ప్రొటోకాల్ అధికారులను ఆదేశించారు. షెడ్యూల్ ఇలా.. గవర్నర్ హరిచందన్ ఈ నెల 23వ తేదీన ఉదయం 10 గంటలకు ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో తిరుమలకు చేరుకుని, శ్రీవారిని దర్శించుకుంటారు. తిరుమల నుంచి బయలుదేరి సాయంత్రం 3 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు వెళతారు. -
గవర్నర్ వర్సెస్ ముఖ్యమంత్రి
సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ/ముంబై: కర్ణాటకలో గవర్నర్, ముఖ్యమంత్రి మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. రెండు వారాలుగా నెలకొన్న రాజకీయ సంక్షోభం శుక్రవారం కొత్త మలుపు తీసుకుంది. అసెంబ్లీలో మెజారిటీని నిరూపించుకోవాలని గవర్నర్ వజూభాయ్‌వాలా రెండుసార్లు ఆదేశించినప్పటికీ కుమారస్వామి ప్రభుత్వం బేఖాతరు చేసింది. ఎమ్మెల్యేలు ప్రలోభాలకు గురవుతున్నట్లు గవర్నర్‌కు ఇప్పుడే జ్ఞానోదయమైందని కుమారస్వామి ఘాటుగా విమర్శలు గుప్పించారు. అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ఇప్పటికే ప్రవేశపెట్టినందున వజూభాయ్‌వాలా జోక్యం చేసుకోలేరని కుండబద్దలు కొట్టారు. ప్రభుత్వాన్ని ఆదేశించేందుకు ఆయనేమీ శాసనవ్యవస్థకు అంబుడ్స్‌మన్ కాదని చురకలు అంటించారు. బల నిరూపణపై గవర్నర్ రాసిన రెండు లేఖలను ‘లవ్ లెటర్స్’గా సీఎం అభివర్ణించారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో అధికార కాంగ్రెస్–జేడీఎస్, ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు వాగ్వాదానికి దిగడంతో సభ కొద్దిసేపు వాయిదాపడింది. జూలై 22న విశ్వాసపరీక్షపై తప్పనిసరిగా ఓటింగ్ నిర్వహిస్తామనీ, ఇక ఆలస్యం చేయబోమని చెబుతూ స్పీకర్ రమేశ్ కుమార్ సభను సోమవారానికి వాయిదా వేశారు. బీజేపీపై కుమారస్వామి ఆగ్రహం.. విధానసౌధ సమావేశాలు శుక్రవారం ప్రారంభంకాగానే ప్రతిపక్ష నేత బీఎస్ యడ్యూరప్ప మాట్లాడుతూ.. కుమారస్వామి ప్రభుత్వం ఇప్పటికే మెజారిటీ కోల్పోయిందని తెలిపారు. కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే విశ్వాసపరీక్షపై ఓటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. అనంతరం సీఎం కుమారస్వామి మాట్లాడుతూ..‘కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకుంటే రూ.40 నుంచి 50 కోట్లు ఇస్తామని బీజేపీ మా ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టింది. ఈ సొమ్మంతా ఎక్కడిది? కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచే ఈ అస్థిరపరిచే ప్రక్రియ సాగుతోంది. 14 నెలల తర్వాత ఇప్పుడది చివరిదశకు చేరుకుంది. ఈ ప్రభుత్వం ఎక్కువకాలం కొనసాగదని నాకు ముందే తెలుసు.కాబట్టి విశ్వాసపరీక్ష విషయంలో మనం నిదానంగా చర్చిద్దాం. సోమవారం లేదా మంగళవారం కూడా విశ్వాసపరీక్షను చేపట్టవచ్చు. మీరు(బీజేపీ) ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు ఇబ్బందేమీ లేదు. మీకిప్పుడు మద్దతు తెలిపిన రెబెల్స్ అండతో మీ ప్రభుత్వం ఎంత స్థిరంగా ఉంటుందో, ఎంతకాలం అధికారంలో ఉంటుందో నేనూ చూస్తా’ అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సమయం మధ్యాహ్నం 1.30 గంటలు కావడంతో గవర్నర్ ఆదేశాల మేరకు విశ్వాసపరీక్ష డివిజన్ నిర్వహించాలని ప్రతిపక్ష నేత బీఎస్ యడ్యూరప్ప డిమాండ్ చేశారు. అయితే నిబంధనల మేరకు విశ్వాసతీర్మానంపై చర్చ పూర్తయ్యాకే ఓటింగ్ జరగాలని స్పీకర్ రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. దీంతో బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగగా, పోటీగా కాంగ్రెస్ సభ్యులు బీజేపీకి, గవర్నర్‌కు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. సభ్యులు శాంతించకపోవడంతో స్పీకర్ రమేశ్ అసెంబ్లీని మధ్యాహ్నం 3 గంటలకు వాయిదావేశారు. నిమ్మకాయ ఉంటే చేతబడేనా? ఈ సందర్భంగా సీఎం కుమారస్వామి సోదరుడు రేవణ్ణ చేతిలో నిమ్మకాయతో సభలోకి రావడంతో రగడ మొదలైంది. ప్రభుత్వ మనుగడ కోసమే ఆయన చేతబడి చేయించిన నిమ్మకాయతో వచ్చారని కొందరు బీజేపీ సభ్యులు ఆరోపించారు. దీనిపై కుమారస్వామి వెంటనే స్పందిస్తూ..‘నిమ్మకాయను తెచ్చుకున్నందుకు మీరంతా రేవణ్ణను నిందిస్తున్నారు. మీరు హిందూ సంస్కృతిని గౌరవిస్తామంటూనే, ఆయన్ను అవమానిస్తున్నారు. రేవణ్ణ ఆలయాలకు వెళతారు. వెంట నిమ్మకాయను ఉంచుకుంటారు. కానీ మీరుమాత్రం ఆయన చేతబడి చేశారని ఆరోపిస్తున్నారు. చేతబడులతో అసలు ఎక్కడైనా ప్రభుత్వాలు నిలుస్తాయా?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అన్ని జిల్లాలకు నిధులు కేటాయించినా, బీజేపీ మాత్రం తనను 2–3 జిల్లాల ముఖ్యమంత్రిగా అభివర్ణిస్తోందని మండిపడ్డారు. గవర్నర్ ఇచ్చిన రెండో గడువు దాటిపోతున్న సమయంలో బీజేపీ నేత సురేష్ కుమార్ విశ్వాసపరీక్ష ఓటింగ్ చేపట్టాలని కోరారు. తాను చెప్పాల్సింది చెప్పేశాననీ, ఇంకేమైనా ఉంటే సోమవారం చూసుకుందామని కుమారస్వామి అన్నారు. దీంతో సభను సోమవారానికి వాయిదావేస్తున్నట్లు స్పీకర్ రమేశ్ కుమార్ ప్రకటించారు. రెబెల్స్‌ను హోటల్లో బంధించారు: శివకుమార్ కాంగ్రెస్–జేడీఎస్ పార్టీలకు చెందిన 15 మంది రెబెల్ ఎమ్మెల్యేలను ముంబైలోని రినైసెన్స్ హోటల్లో బంధించారని మంత్రి డి.కె.శివకుమార్ అసెంబ్లీలో ఆరోపించారు. ‘మమ్మల్ని బంధించారు.. కాపాడండి అని రెబెల్ ఎమ్మెల్యేల నుంచి సీఎం కుమారస్వామికి ఫోన్ వచ్చింది. అందుకే మేం ముంబై వెళ్లాం. తొలుత కుమారస్వామి స్వయంగా అక్కడకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కానీ సీఎం అలా వెళ్లాల్సిన అవసరం లేదని అధికారులు వారించారు. ఈ నేపథ్యంలో మేం సదరు హోటల్లో గదిని బుక్ చేశాం’ అని తెలిపారు. దీంతో ఎమ్మెల్యేలు, వారి కుటుం సభ్యులెవరూ సాయం కోసం తనను సంప్రదించలేదని స్పీకర్ రమేశ్‌కుమార్ స్పష్టం చేశారు. మరోవైపు ఛాతినొప్పితో ముంబైలోని సెయింట్ జార్జ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీమంత్ పాటిల్‌కు మహారాష్ట్ర పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. రెండో ‘లవ్ లెటర్’ వచ్చింది.. అసెంబ్లీ వాయిదా పడగానే రాజకీయ పరిణామాలు చకచకా మారిపోయాయి. ముఖ్యమంత్రి కుమారస్వామికి గవర్నర్ వజూభాయ్‌వాలా రెండో లేఖను రాశారు. ‘కర్ణాటకలో ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టే చర్యలు జరుగుతున్నట్లు నా దృష్టికి వచ్చింది. ఇలాంటి చర్యల్ని అరికట్టాలంటే వీలైనంత త్వరగా విశ్వాసపరీక్షను పూర్తిచేయండి. శుక్రవారం సాయంత్రం 6 గంటల్లోపు మీ మెజారిటీని నిరూపించుకోండి’ అని లేఖరాశారు. దీన్ని అసెంబ్లీలో చదివిన కుమారస్వామి..‘‘గవర్నర్ వజూభాయ్‌వాలా అంటే నాకు గౌరవముంది. కానీ ఆయన్నుంచి వచ్చిన రెండో ప్రేమలేఖ మాత్రం నన్ను బాధపెట్టింది. వజూభాయ్‌వాలాకు ఇప్పుడే జ్ఞానోదయం అయినట్లుంది. ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని గవర్నర్ లేఖలో చెప్పారు. అంటే ఇన్నిరోజులు రాష్ట్రంలో జరుగుతున్న తతంగమంతా ఆయనకు కన్పించలేదా? మా ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తుంటే ప్రలోభాలపర్వం ఆయనకు కనిపించలేదా? ఆరోజే గవర్నర్ చర్య తీసుకునిఉంటే ఈ ప్రత్యేక విమానాలు అసలు గాల్లోకి లేచేవా? రెబెల్ ఎమ్మెల్యేలకు పోలీస్‌భద్రత కల్పించిన గవర్నర్ వారు ముంబైకి వెళ్లేలా చేశారు. ఇక విశ్వాసపరీక్షకు సంబంధించిన అంశాన్ని నేను మీకే(స్పీకర్‌కే) వదిలిపెడుతున్నాను. ఇలాంటి ఆదేశాలు ఢిల్లీ(కేంద్రం) సూచనలతో రాకూడదు. గవర్నర్ రాసిన లేఖ నుంచి నన్ను రక్షించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను’ అని కోరారు. స్పీకర్ విధుల్లో గవర్నర్ జోక్యం తగదు అరుణాచల్‌ప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు న్యూఢిల్లీ: కర్ణాటకలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం ఆ రాష్ట్ర గవర్నర్ వజూభాయ్‌వాలా వైపు మళ్లింది. శాసన సభలో కుమారస్వామి సర్కారు బల పరీక్షకు గడువులు విధిస్తూ గవర్నర్ వజూభాయ్ వాలా ముఖ్యమంత్రికి లేఖలు రాయడం వివాదాస్పదమయింది. ఈ నేపథ్యంలో శాసనసభ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారం గవర్నర్‌కు లేదని గతంలో అరుణాచల్‌ప్రదేశ్ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రాధాన్యతను సంతరించుకుంది. అరుణాచల్ అసెంబ్లీ కేసు.. 2016లో అరుణాచల్‌ప్రదేశ్‌లో మెజారిటీ లేదన్న కారణంగా అప్పటి గవర్నర్ రాజ్కోవా నబం తుకి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రద్దు చేశారు.దాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఆ కేసులో తీర్పు ఇస్తూ స్పీకర్ విధుల్లో జోక్యం చేసుకునే అధికారం గవర్నర్‌కు లేదని స్పష్టం చేసింది. రద్దయిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పునరుద్ధరించింది. ‘గవర్నర్ స్పీకర్‌కు గురువుగానీ మార్గదర్శిగానీ కాదు. కాబట్టి స్పీకర్ విధుల్లో జోక్యం చేసుకునే అధికారం ఆయనకు లేదు. స్పీకర్‌ను తొలగించే హక్కు గవర్నర్‌కు లేదు. స్పీకర్, గవర్నర్లు ఇద్దరూ వేర్వేరు రాజ్యాంగ సంస్థలకు అధిపతులు’అని ఆనాటి తీర్పులో సుప్రీం కోర్టు వివరించింది. రాజకీయ పార్టీలో చెలరేగే సంక్షోభం లేదా కల్లోలానికి గవర్నర్‌కు ఎలాంటి సంబంధం లేదని, ఈ విషయాలకు ఆయన దూరంగా ఉండాలని కోర్టు స్పష్టం చేసింది. గవర్నర్ లేఖపై భిన్నాభిప్రాయాలు స్పీకర్‌కు గవర్నర్ లేఖ రాయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రికి గవర్నర్ ఇలా లేఖలు పంపడం సమర్థనీయమేనని లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కాశ్యప్ అన్నారు. రాజ్యాంగంలోని 175వ అధికరణ కింద శాసన సభకు ఆదేశం పంపే అధికారం గవర్నర్‌కు ఉందని, దానిపై వీలయినంత త్వరగా చర్య తీసుకోవలసిన బాధ్యత సభపై ఉందని ఆయన అన్నారు. గవర్నర్ శాసన సభలో భాగమేనని రాజ్యాంగంలోని 168వ అధికరణ స్పష్టంగా చెపుతోందన్నారు. అయితే, కర్ణాటక గవర్నర్ రాజ్యాంగానికి విరుద్దంగా వ్యవహరించారని లోక్‌సభ మరో మాజీ సెక్రటరీ జనరల్ పీడీటీ ఆచార్య అభిప్రాయపడ్డారు.శాసన సభ లేదా శాసన మండలిలో ఏదైనా బిల్లు పెండింగులో ఉన్నప్పుడు దానిపై నిర్ణయం తీసుకోవాలని గవర్నర్ సభకు సూచించవచ్చని రాజ్యాంగంలోని 175వ అధికరణ చెబుతోందని అన్నారు. రాజ్యాంగం ప్రకారం పెండింగు బిల్లులకు సంబంధించి మాత్రమే గవర్నర్ శాసన సభకు ఆదేశాలివ్వవచ్చు. అంతేకాని సభ ఎలా జరగాలో చెప్పే అధికారం ఆయనకు లేదు. ఏమైనా కర్ణాటక గవర్నర్ అసాధారణ చర్య తీసుకున్నారు’అని ఆచార్య తెలిపారు. గవర్నర్ చర్య సరైనదా కాదా అన్నది న్యాయస్థానం తేల్చుతుందన్నారు. శాసన సభకు సంబంధించినంత వరకు స్పీకరే సర్వాధికారి అని, సభ కార్యకలాపాల నిర్వహణలో స్పీకర్‌ను అజమాయిషీ చేసే అధికారం ఎవరికీ లేదని ఆయన స్పష్టం చేశారు. గురువారం రాత్రి విధానసౌధలో నిద్రిస్తున్న బీఎస్ యడ్యూరప్ప -
గవర్నర్ కీలుబొమ్మా?
పట్నా: బిహార్‌లో ఆదివారం సివిల్ సర్వీసెస్ పరీక్షలు జరిగాయి. జనరల్ నాలెడ్జ్ పరీక్ష రాస్తున్న అభ్యర్థులు ప్రశ్నపత్రంలోని ఒక ప్రశ్నను చూసి ఆశ్చర్యపోయారు. ‘ఇండియాలో, ప్రత్యేకించి బిహార్ రాజకీయాల్లో గవర్నర్ పాత్రను విశ్లేషించండి. గవర్నర్ కీలుబొమ్మా(కఠ్పుత్లీ)?’అన్నది ఆ ప్రశ్న. గవర్నర్ కేంద్రం చేతిలో కీలుబొమ్మ అంటూ విపక్షాలు విమర్శించడం జరిగేదే. అయితే, ఏకంగా ప్రభుత్వ పరీక్షలో, అందులోనూ సివిల్ సర్వీసెస్ పరీక్షలో రావడంతో విద్యార్థులు విస్తుపోయారు. బిహార్ సర్వీస్ కమిషన్ అధికారులు ఈ తప్పును ప్రశ్నపత్రాన్ని రూపొందించిన అధ్యాపకుడిపైకి నెట్టేశారు. ‘ప్రశ్నలో తప్పేమీ లేదు.అయితే, కఠ్పుత్లీ పదాన్ని తీసేసి ఉంటే బాగుండేది’అని నసిగారు. గతంలో 8వతరగతి పరీక్షలో కశ్మీర్‌ను ఓ దేశంగా పేర్కొంటూ.. ‘చైనా, ఇండియా, నేపాల్, ఇంగ్లాండ్, కశ్మీర్ దేశాల ప్రజలను ఏమని పిలుస్తారు?’ అన్న ప్రశ్న వచ్చింది. 2016లో ఇంటర్మీడియెట్‌లో ర్యాంకు సాధించిన రూబీరాయ్ పొలిటికల్ సైన్స్‌లో ‘వంట చేయడం’ ఉంటుందని చెప్పి షాక్ ఇచ్చింది. 2015లో పరీక్షరాసే విద్యార్థులకు కాపీలు అందించడం కోసం వారి బంధువులు పరీక్ష గది గోడలు ఎక్కడం తెల్సిందే. -
రాష్ట్రపతి పాలనా? బలపరీక్ష?
సాక్షి, బెంగళూరు: తీవ్ర రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయిన కన్నడనాట రాష్ట్రపతి పాలన తప్పదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సుమారు 14 మంది కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్, గవర్నర్ తీసుకునే నిర్ణయంపైనే ప్రభుత్వ భవితవ్యం ఆధారపడి ఉంది. ఏ పార్టీకి స్పష్టమైన మద్దతు లేక పరిస్థితులు ఇలాగే కొనసాగితే రాష్ట్రపతి పాలనకు గవర్నర్ సిఫారసులు చేసే అవకాశం ఉందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్– జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం మనుగడ గాల్లో దీపంలా మారిపోయింది. ఎప్పుడు ఏ ఎమ్మెల్యే రాజీనామా చేస్తారో తెలియని గందరగోళం నెలకొంది. మంగళవారం శివాజీనగర కాంగ్రెస్ ఎమ్మెల్యే రోషన్‌బేగ్ కూడా రాజీనామా చేశారు. గవర్నర్ ఏమంటారు? అసంతృప్త ఎమ్మెల్యేల రాజీనామాలను ఉపసంహరించుకునేలా కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపులకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అలాగే రాజీనామాలతో తమకు ఎలాంటి సంబంధం లేదంటూనే బీజేపీ లోలోపల తన కార్యాచరణను అమలు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు, జేడీఎస్‌కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రుల రాజీనామాలు చేయడంతో సంకీర్ణం మైనారిటీలో జారిపోయింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో గవర్నర్ వజుభాయి వాలా కుమారస్వామి ప్రభుత్వాన్ని అసెంబ్లీలో బలపరీక్షకు ఆహ్వానిస్తారా లేక రాష్ట్రపతి పాలనకే సిఫార్సు చేస్తారా అనేది సస్పెన్స్‌గా మిగిలింది. మైనారిటీలో కుమార సర్కారు 224 మంది సభ్యులున్న అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 78, జేడీఎస్‌కు 37 మంది, బీజేపీకి 105 మంది, బీఎస్పీ నుంచి ఒకరు, ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు. సంకీర్ణ ప్రభుత్వంలో అధికారపక్షానికి మొత్తం 119 ఎమ్మెల్యేల బలం ఉంది. ప్రస్తుతం 14 మంది ఎమ్మెల్యేల రాజీనామాలు, ఇద్దరు స్వతంత్రుల మద్దతు ఉపసంహరణతో ఆబలం 103కు క్షీణించింది. సర్కారు ఏర్పాటుకు 113 మంది శాసనసభ్యుల బలముండాలి. గ తంలో పలు కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ముందుగా బలపరీక్షకు అధికార పక్షాల్ని గవర్నర్ ఆహ్వానించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గవర్నర్ నిర్ణయమే కీలకంగా మారింది. బలపరీక్షకే సీఎం మొగ్గు బలపరీక్షకు సిద్ధంగా ఉండాలని సీఎం కుమారస్వామి యోచిస్తున్నట్లు సమాచారం. ఈ నెల 12న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. బలం చాటుకోవడానికి విశ్వాస పరీక్షను ఎదుర్కొవడమే ఉత్తమమని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది. విశ్వాస పరీక్ష సందర్భంగా రాజీనామా చేసిన ఎమ్మెల్యేలకు కూడా విప్ జారీ చేయవచ్చని, విప్‌కు భయపడి ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్దతు పలుకుతారని భావిస్తున్నారు. ఒకవేళ విప్‌ను ధిక్కరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా విశ్వాస పరీక్షలో ఓటు వేస్తే సంబంధిత ఎమ్మెల్యేను అనర్హుడిగా ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. సంకీర్ణానికే మహేశ్ మద్దతు నానాటికీ బలం కోల్పోతున్న సంకీర్ణ ప్రభుత్వానికి బీఎస్పీ ఎమ్మెల్యే ఎన్.మహేశ్ మద్దతు ప్రకటించారు. మంగళవారం విధానసౌధ కార్యదర్శితో భేటీ అయి సర్కారుకు తన మద్దతు ఉంటుందని ప్రకటించి వెళ్లిపోయారు. నేడు ముంబైకి డీకేశి ముంబైలో మకాం వేసిన అసంతృప్త కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు రాష్ట్ర మంత్రి డీకే శివకుమార్ అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. బుధవారం డీకే శివకుమార్ బృందం అసంతృప్త ఎమ్మెల్యేల వద్దకు వెళ్లనుంది. వారు రెబెల్స్‌ను కలిసే అవకాశం లభిస్తుందా? అన్నది అనుమానమేనని తెలుస్తోంది. -
శాంతిభద్రతలు రాష్ట్రం పరిధిలోని అంశం
కోల్‌కతా: శాంతి భద్రతలు రాష్ట్రం పరిధిలోని అంశమని, దానితో గవర్నర్‌కు సంబంధం లేదని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై చర్చించేందుకంటూ గవర్నర్ కేసరీనాథ్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడంపై మమత గురువారం కోల్‌కతాలో మాట్లాడారు. ‘గవర్నర్ ప్రయత్నం వెనుక బీజేపీ ప్రోద్బలం ఉందని మమత ఆరోపించారు. శాంతి భద్రతలు రాష్ట్రానికి సంబంధించిన అంశం అయినందునే ఆ సమావేశానికి హాజరు కాలేదని తెలిపారు. రాజ్‌భవన్‌లో జరిగిన సమావేశానికి టీఎంసీ ప్రధాన కార్యదర్శి, మంత్రి పార్థ చటర్జీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్, కాంగ్రెస్, సీపీఎం రాష్ట్ర నేతలు సోమేన్ మిత్రా, సూర్య కాంత మిశ్రా హాజరయ్యారు. అయితే, రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడటంలో సీఎం మమత పూర్తిగా విఫలమయ్యారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జయ్ మజుందార్ అన్నారు. జూ.డా.ల సమ్మె వెనుక బీజేపీ, సీపీఎం రాష్ట్రంలోని ప్రభుత్వం ఆస్పత్రుల్లో జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగడం వెనుక రాజకీయ ప్రత్యర్థులైన సీపీఎం, బీజేపీల హస్తం ఉందని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. సీపీఎం సాయంతో వైద్యుల సమ్మెకు మతం రంగు పులిమేందుకు బీజేపీ కుట్ర పన్నిందన్నారు. -
గవర్నర్ల పంచాయతీ
మన దేశంలో గవర్నర్ల వ్యవస్థ తీరుతెన్నులెలా ఉన్నాయో చెప్పడానికి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు–ఢిల్లీ, పుదుచ్చేరిలను ఎప్పుడైనా ఉదాహరించవచ్చు. ఆ రెండుచోట్లా ముఖ్యమంత్రు లకూ, లెఫ్టినెంట్ గవర్నర్లకూ మధ్య సయోధ్య వాతావరణం కనబడటం చాలా అరుదు. ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వంతో అక్కడున్న లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్‌కు ఎప్పుడూ పొసగదు. పుదుచ్చేరిలో కాంగ్రెస్ నేతృత్వంలోని నారాయణ స్వామి ప్రభుత్వానికీ, అక్కడి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీకీ మధ్య కూడా ఇదే తీరు ఉంటుంది. సివిల్ సర్వీస్ అధికారులపై ఎవరికి నియంత్రణ ఉండాలన్న వివాదంలో ఇద్దరు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో ఢిల్లీ వివాదం మొదటికొచ్చింది. తమకు కనీసం బంట్రోతును నియమించుకునే అధికారం సైతం లేదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సారాంశమని, ఇది అత్యంత అప్రజాస్వామికమని కేజ్రీవాల్ అంటున్నారు. యధాప్రకారం ఈ తీర్పు బీజేపీకి, అనిల్ బైజాల్‌కు నచ్చింది. అటు పుదుచ్చేరిలో ఆరు రోజులుగా లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం ఎదుట ముఖ్యమంత్రి నారాయణస్వామి సాగిస్తున్న ధర్నా సోమవారం అర్థరాత్రి చర్చల పర్యవసానంగా రాజీ కుదరడంతో ముగిసింది. తమ ప్రభుత్వం ప్రారంభించతలపెట్టిన అనేక సంక్షేమ పథకాల ప్రతిపాదనలను కిరణ్ బేడీ బుట్టదాఖలా చేస్తున్నారని ఆరోపిస్తూ మొన్న 13న ఆయన ఈ ధర్నా ప్రారంభించారు. స్వయంగా సుప్రీంకోర్టే చెప్పినా, సర్కారియా కమిషన్ వంటివి మొత్తుకున్నా కాస్తయినా మారకుండా కొనసాగుతున్నది గవర్నర్ల వ్యవస్థే. మిగిలిన వ్యవస్థలు కాలానుగుణంగా ఏదోమేరకు మార్పు చెందుతూ వచ్చాయి. గవర్నర్ పదవి రాజ్యాంగపరమైనది. ఆ పదవిలో రాజకీయ నాయ కులుంటే సమస్యలెదురవుతున్నాయని భావించి, వాటికి అతీతంగా ఉండేవారిని గవర్నర్లుగా ఎంపిక చేయడం ఉత్తమమని సుప్రీంకోర్టు గతంలో సూచించింది. ఆ పదవికుండే ఔన్నత్యం నిల బడాలంటే భిన్న రంగాల్లో నిష్ణాతులైనవారిని ఎంచుకోవాలని, వారు తటస్థులైతే మంచిదని సర్కా రియా కమిషన్ అభిప్రాయపడింది. అటు తర్వాత కొన్ని రాష్ట్రాలకు అలాంటివారిని ఎంపిక చేసిన మాట వాస్తవమే. కానీ వారిలో చాలామంది తాము రాజకీయ నాయకులకు ఏమాత్రం తీసిపోబో మని నిరూపించుకున్నారు. ఇప్పుడు ఢిల్లీలో అనిల్ బైజాల్, పుదుచ్చేరిలో కిరణ్‌బేడీలు ఆ కోవలోని వారే. సాధారణంగా ప్రభుత్వాలు రిటైరైన ఐఏఎస్, ఐపీఎస్‌లను ‘భిన్నరంగాల్లో నిష్ణాతులు’గా భావిస్తాయి. సాధారణంగా కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఒకే పార్టీ అధికారంలో ఉన్నచోట గవర్న ర్లకూ, ముఖ్యమంత్రులకూ మధ్య విభేదాలు తలెత్తవు. ఉన్నా అవి తెరవెనకే సమసిపోతాయి. కానీ అక్కడా, ఇక్కడా వేర్వేరు ప్రభుత్వాలున్నప్పుడు... వాటి మధ్య రాజకీయంగా తీవ్ర స్థాయిలో విభే దాలున్నప్పుడు గవర్నర్ల పనితీరు ప్రశ్నార్థకమవుతోంది. గతంలో కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పటి గవర్నర్ హెచ్ఆర్ భరద్వాజ్ దాన్ని ముప్పుతిప్పలు పెట్టారు. కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నా, అటుపై బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు వచ్చినా ఢిల్లీలో సీఎం–లెఫ్టినెంట్ గవర్నర్ల మధ్య లడాయి కొనసాగుతూనే ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రజలెన్నుకునే ప్రభుత్వాలకు అధికారాలుండి తీరాలి. ఆ విషయంలో రెండో మాట ఉండకూడదు. కానీ ఢిల్లీలో నెలకొన్న ‘ప్రత్యేక పరిస్థితుల’వల్ల అక్కడ ఎన్నికైన ప్రభు త్వానికి సంపూర్ణ అధికారాలీయడం సాధ్యం కాదని నిబంధనలు చెబుతున్నాయి. వాటినే సుప్రీం కోర్టు ధ్రువీకరించింది. అయితే ఉన్నంతలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వ అభిప్రాయాలకు విలువీయా లని, దాని సూచనలు పాటించాలని నిరుడు జూలైలో ఇచ్చిన తీర్పులో సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. లెఫ్టినెంట్ గవర్నర్ స్వతంత్రంగా వ్యవహరించడానికి వీల్లేదన్నది ఆ తీర్పు సారాంశం. కానీ అందులో ఓ మెలిక ఉంది. కేబినెట్ తీసుకునే ఏ నిర్ణయాన్నయినా ఆయన తన కున్న రాజ్యాంగదత్తమైన అధికారాలతో వ్యతిరేకించడానికి, తుది నిర్ణయం కోసం రాష్ట్రపతికి నివే దించడానికి వీలుంటుందని స్పష్టం చేసింది. లెఫ్టినెంట్ గవర్నర్ ఆ అధికారాన్ని యాంత్రికంగా వినియోగించరాదని హితవు చెప్పింది కూడా. కానీ ఏది యాంత్రికమో, ఏది కాదో చెప్పేదెవరు? దాని సంగతలా ఉంచి గత జూలైలో ఇచ్చిన తీర్పు వల్ల ఢిల్లీ ప్రభుత్వంలో ఏర్పడ్డ ఉత్సాహం కాస్తా తాజా తీర్పుతో ఆవిరైంది. అవినీతి నిరోధక విభాగంపైనా, విచారణ కమిషన్ల ఏర్పాటుపైనా, ఉన్నతాధికార వర్గం బదిలీలు, నియామకాలైనా కేంద్రం పరిధిలోనే ఉంటాయని ఇద్దరు న్యాయ మూర్తులూ తేల్చారు. అయితే జాయింట్ సెక్రటరీకన్నా కిందిస్థాయి సిబ్బంది ఎవరి నియంత్రణలో ఉండాలన్న అంశంలో ఇద్దరు న్యాయమూర్తుల మధ్యా ఏకాభిప్రాయం లేకపోవడం వల్ల విషయం విస్తృత ధర్మాసనానికి వెళ్లింది. రాష్ట్రాల్లో అధికారంలో ఉండేవారు పరిధులు అతిక్రమించే పరిస్థితులు ఉత్పన్నమైతే తప్ప వారి అధికారాలకు పరిమితులు విధించడం సరికాదు. ఢిల్లీ ఒక కేంద్ర పాలిత ప్రాంతమే అయినా దేశ రాజధానిగా దానికి ప్రత్యేకత ఉన్నదని భావించి అక్కడి భూముల వ్యవహారం, పోలీస్ శాఖ, శాంతిభద్రతల పరిరక్షణ కేంద్రం పరిధికింద ఉంచారు. అలాగని ఢిల్లీ ప్రభుత్వాన్ని మున్సిపాలిటీ స్థాయికి దిగజార్చడం ప్రజల తీర్పును అవమానించడమే. ఆచరణలో నిబంధనలు ప్రతిబంధ కంగా మారితే వాటిని మార్చుకోవాలి. అంతేతప్ప వాటిని సాకుగా చూపి ఆధిపత్య ధోరణులు ప్రదర్శించకూడదు. వికేంద్రీకరణకు ప్రాధాన్యమిచ్చి ప్రజలకు మెరుగైన పాలన అందించాల్సిన కాలంలో అధికారాలను తమ గుప్పెట్లో ఉంచుకోవాలని ఎవరికి వారు తహతహలాడటం అనా రోగ్యకరమైన ధోరణి. ఢిల్లీ, పుదుచ్చేరివంటి కేంద్ర పాలిత ప్రాంతాల్లోనైనా, రాష్ట్రాల్లోనైనా పాలన సజావుగా, మెరుగ్గా సాగాలంటే ఘర్షణ వైఖరికి స్వస్తిచెప్పాలి. -
రిటైర్మెంట్ తర్వాత టీఆర్ఎస్లోకి గవర్నర్
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగబద్ద హోదాలో ఉన్న రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఆ విషయం మరిచి టీఆర్ఎస్ నాయకుడిగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో విమర్శించారు. గణతంత్ర దినోత్సవ వేళ ఆయన చేసిన ప్రసంగం గవర్నర్‌గా రిటైర్మెంట్ అయ్యా క టీఆర్ఎస్లో చేరేలా ఉందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసే మంచి పనులను గవర్నర్ ప్రశంసించవచ్చు, కానీ నరసింహన్ మాత్రం కేసీఆర్, ఆయ న పార్టీని పొగిడేందుకే ఎక్కువ ఉత్సా హం చూపారన్నారు. గవర్నర్ ప్రసంగం పరమ చెత్తగా ఉందన్నారు. ఈ ఏడాది జూన్‌లో గవర్నర్‌గా పదవీ కాలం ముగియనుండటంతో అది పొడిగించుకునేందుకే ఆయన వ్యవహరిస్తున్నట్లు కనబడుతుందన్నారు. తాను ప్రాతినిథ్యం వహించేది రాజ్‌భవన్‌కు అని, టీఆర్ఎస్కు కాదని గవర్నర్ గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. -
గవర్నర్‌కు అవమానం
సాక్షి, అమరావతి: రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న గవర్నర్‌ను అగౌరవపరిచే రీతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరించారు. సంప్రదాయబద్ధంగా మంత్రివర్గ విస్తరణ చేయాలనుకున్నప్పుడు సీఎం స్వయంగా గవర్నర్ వద్దకు వెళ్లి ఆ విషయాన్ని చెప్పి చర్చించడం ఆనవాయితీ. స్థానికంగా ఉన్న ముఖ్యమంత్రి అమరావతికి వచ్చిన గవర్నర్‌ను స్వయంగా ఆహ్వానించాల్సివుంది. కానీ ఈ రెండు ఆనవాయితీలకు చంద్రబాబు తిలోదకాలిచ్చారు. ఉద్దేశపూర్వకంగానే గవర్నర్‌ను తక్కువ చేసి చూపే ప్రయత్నం చేయడం చర్చనీయాంశంగా మారింది. మంత్రివర్గ విస్తరణ చేపడుతున్న విషయంపై చంద్రబాబు నేరుగా వెళ్లి గవర్నర్‌తో చర్చించకుండా ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) నుండి అధికారుల ద్వారా రాజ్‌భవన్‌కు లేఖద్వారా సమాచారం ఇచ్చారు. ఆ సమాచారం మేరకు కొత్తగా ఇద్దరు మంత్రులతో ప్రమాణం స్వీకారం చేయించేందుకు గవర్నర్ ఆదివారం ఉదయం విజయవాడ నగరానికి వచ్చారు. ఆయన బస చేసిన చోటుకు ముఖ్యమంత్రి వచ్చి ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగే ఉండవల్లికి స్వయంగా తీసుకెళ్లాల్సివుంది. కానీ చంద్రబాబు మంత్రి పుల్లారావును గవర్నర్ వద్దకు పంపి అవమానకరంగా వ్యవహరించారని రాజకీయ పరిశీలకులు ఆరోపిస్తున్నారు. ఇటీవల ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగినప్పుడు గవర్నర్ డీజీపీకి ఫోన్ చేసి నివేదిక కోరడాన్ని తప్పుపట్టిన టీడీపీ, ఆయనపై నేరుగా విమర్శలు గుప్పించింది. గవర్నర్‌ను బీజేపీ ఏజెంటుగా మంత్రులు, టీడీపీ నాయకులు ఆరోపించగా, చంద్రబాబు సైతం ఆయనపై విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో జరిగిన మంత్రివర్గ విస్తరణ గురించి ఆయనకు సీఎం నేరుగా చెప్పలేదు. ఇలా చేయడం ద్వారా చంద్రబాబు గవర్నర్‌పై తన అసంతృప్తిని, నిరసనను తెలిపినట్లు అనుకూల మీడియా రోజంతా ఊదరగొట్టింది. గతంలో గవర్నర్ పలుసార్లు అమరావతికి వచ్చినప్పుడు చంద్రబాబు స్వయంగా ఆయన బస చేసిన చోటుకు వెళ్లి ఆహ్వానం పలికి తీసుకెళ్లారు. ఇపుడు గవర్నర్‌కు ఆహ్వానం పలకడానికి రాకపోవడం ఆనవాయితీకి తిలోదకాలివ్వడమేనని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. ప్రజాస్వామ్య రక్షణకని పలు రాష్ట్రాలు తిరుగుతున్న చంద్రబాబు రాష్ట్రానికి వచ్చిన గవర్నర్‌ను మాత్రం అవమానించడాన్ని విశ్లేషకులు తప్పుబడుతున్నారు. గవర్నర్‌ను అవమానించడం ద్వారా రాజ్యాంగాన్ని అవమానించినట్లేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు మంత్రుల ప్రమాణస్వీకారం పూర్తయిన తర్వాత చంద్రబాబు గవర్నర్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై హత్యాయత్నం, తదనంతర పరిణామాలతోపాటు తిత్లీ తుపాను, రాష్ట్రంలో తాజాగా నెలకొన్న పరిస్థితులపై చర్చించినట్లు తెలిసింది. -
కాలుష్యరహితం మెట్రో ప్రయాణం
సాక్షి, హైదరాబాద్: పెరుగుతున్న ఇంధన ధరలు.. కాలుష్యం నుంచి విముక్తి పొందేందుకు మెట్రో రైలులో ప్రయాణించాలని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ నగరవాసులకు సూచించారు. సోమవారం మధ్యాహ్నం 12.20 గంటలకు అమీర్‌పేట్–ఎల్బీనగర్ మెట్రో మార్గాన్ని అమీర్‌పేట్ స్టేషన్లో జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మంత్రులు కేటీఆర్, నాయిని, తలసాని, పద్మారావు, ఎంపీలు దత్తాత్రేయ, మల్లారెడ్డి తదితరులతో కలసి మెట్రో రైలులో ఎల్బీనగర్ వరకు ప్రయాణించారు. మధ్యలో ఎంజీబీఎస్ స్టేషన్లో దిగి అక్కడి వసతులను పరిశీలించారు. ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ వద్ద మీడియాతో గవర్నర్ మాట్లాడారు. అందరూ మెట్రో రైలులో ప్రయాణిస్తే రహదారులపై ట్రాఫిక్ రద్దీ ఉండదని, అంబులెన్స్‌లు ఫ్రీగా వెళ్లే వీలుంటుందని తెలిపారు. వచ్చే డిసెంబర్ 15 నాటికి అమీర్‌పేట్–హైటెక్ సిటీ మెట్రో మార్గాన్ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను కోరారు. ప్రతి మెట్రో స్టేషన్‌ను అద్భుతంగా తీర్చిదిద్దారని.. ప్రయాణం సౌకర్యవంతంగా ఉందన్నారు. మెట్రో, ఎంఎంటీఎస్, బస్సు ప్రయాణం సహా షాపింగ్‌కు వీలుగా బహుళ ప్రయోజన సింగిల్ కార్డును త్వరలో వినియోగంలోకి తీసుకురావాలని మెట్రో అధికారులకు సూచించారు. ఉరుకుల పరుగుల జీవితం గడిపే నగరవాసులకు మెట్రో ప్రయాణంతోపాటు నిత్యావసరాలు, ఆహార పదార్థాలను సైతం స్టేషన్లో కొనుగోలు చేసుకునేలా అవకాశం కల్పించడం విశేషమన్నారు. దేశంలోనే నంబర్ 2... దేశంలో రెండో అతిపెద్ద మెట్రో ప్రాజెక్టు మనదే అని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద పీపీపీ ప్రాజెక్టు కూడా ఇదేనని తెలిపారు. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నగర మెట్రో ప్రాజెక్టు విశిష్టతలను తెలియజేశారు. ప్రపంచస్థాయిలో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు, సౌకర్యాలు కల్పించామన్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ప్రీకాస్ట్ సెగ్మెంట్లతో వయాడక్ట్, స్టేషన్లను నిర్మించామని తెలిపారు. మెట్రో ప్రాజెక్టు నిర్మాణ సమయంలోనే గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ సహా పలు అంతర్జాతీయ సంస్థల నుంచి అవార్డులు అందుకున్న విషయాన్ని గుర్తుచేశారు. లాస్ట్‌మైల్, ఫస్ట్‌మైల్ కనెక్టివిటీ కోసం అధునాతన సైకిళ్లు, స్మార్ట్‌బైక్‌లు, జూమ్కార్లు, ఎలక్ట్రిక్ బైక్‌లను పలు స్టేషన్ల వద్ద అందుబాటులో ఉంచామన్నారు. మియాపూర్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో స్టేషన్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామన్నారు. ఎల్బీనగర్–మియాపూర్ మార్గంలో నిత్యం లక్ష మంది ప్రయాణిస్తారని అంచనా వేస్తున్నామన్నారు. మెట్రో నిర్మాణం కోసం తొలగించిన చెట్లను ట్రాన్స్‌లొకేషన్ విధానంలో వేరొక చోట నాటామన్నారు. అనంతరం నగర మెట్రో ప్రాజెక్టును పీపీపీ విధానంలో చేపట్టేందుకు, ఎల్అండ్టీ సంస్థ అత్యధిక పెట్టుబడులు పెట్టేందుకు సహకరించిన ఆ సంస్థ ఆర్థిక సలహాదారు శంకరన్‌ను గవర్నర్ నరసింహన్ ఘనంగా సన్మానించారు. అనంతరం స్టేషన్లో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు, శ్రీనివాస్‌యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, మేయర్ బొంతు రాంమోహన్, డిప్యూటీ మేయర్ బాబాఫసీయుద్దీన్, ఎంపీలు బండారు దత్తాత్రేయ, మల్లారెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ కమి షనర్ దానకిశోర్, హెచ్ఎండీఏ కమిషనర్ జనార్ధన్ రెడ్డి, మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ తదితరులు పాల్గొన్నారు. కాగా మెట్రో ప్రారంభోత్సవంలో ఎక్కడా ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో లేకపోవడంతో అలకబూనిన దత్తాత్రేయ ఎంజీబీఎస్ స్టేషన్ వద్ద మెట్రో దిగి వెళ్లిపోవడం చర్చనీయాంశంగా మారింది. గవర్నర్, కేటీఆర్ స్మార్ట్‌బైక్ రైడ్... మెట్రో ప్రయాణం అనంతరం ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన స్మార్ట్‌బైక్‌ను గవర్నర్ రైడ్ చేస్తూ రాజ్‌భవన్‌కు వెళ్లారు. మంత్రి కేటీఆర్, ఎస్.కె.జోషి, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్, దానకిశోర్‌లు ఆయ న వెంట స్మార్ట్‌బైక్‌లను తొక్కుకుంటూ వెళ్లారు. ఈ స్మార్ట్‌బైక్‌లు ప్రయాణికులకు ఉపయుక్తంగా ఉంటాయని గవర్నర్ వివరించారు. స్మార్ట్ బైక్ సైకిల్‌పై రాజ్‌భవన్‌కు వెళుతున్న గవర్నర్ నరసింహన్, కేటీఆర్ -
ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వండి
పణజి: గోవా రాజకీయం మరో మలుపు తిరిగింది. ప్రభుత్వం ఏర్పాటుకు తాము సిద్ధమంటూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ముఖ్యమంత్రి మనోహర్ పారికర్(62) దీర్ఘకాల అనారోగ్యం, ఆస్పత్రిలో చేరిక.. అనంతర పరిస్థితులను అంచనా వేసేందుకు వచ్చిన ముగ్గురు సభ్యుల బీజేపీ కేంద్ర బృందం ప్రస్తుతం రాష్ట్ర నేతలతో చర్చలు జరుపుతోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావడం గమనార్హం. మొత్తం 16 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో పార్టీ నేత చంద్రకాంత్ కవ్లేకర్ నేతృత్వంలో సోమవారం రాజ్‌భవన్‌కు వెళ్లారు. అయితే, గవర్నర్ మృదులా సిన్హా లేకపోవడంతో అధికారులకు వినతిపత్రం అందజేశారు. అనంతరం కవ్లేకర్ విలేకరులతో మాట్లాడారు. ‘బీజేపీ నాయకత్వం తమాషాలు చేస్తోంది. ఏడాదిన్నరలోనే మరోసారి ఎన్నికలు జరపడం అంటే రాష్ట్ర ఖజానాపై భారం వేయడమే. అందుకే అసెంబ్లీని రద్దు చేయడానికి బదులు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ను కోరాం. మాకు అవకాశమిస్తే అసెంబ్లీలో బల నిరూపణ చేసుకుంటామని తెలిపాం’ అని ఆయన అన్నారు. కాగా, సంకీర్ణంలోనే ఉంటామని, సమస్య పరిష్కారం కోసం బీజేపీ తీసుకునే ఎలాంటి నిర్ణయమైనా తమకుఆమోదయోగ్యమేనంటూ భాగస్వామ్య పక్షాలు ప్రకటించాయి. అసెంబ్లీలోని 40 సీట్లకు గాను కాంగ్రెస్‌కు 16 మంది సభ్యులుండగా ప్రభుత్వం ఏర్పాటుకు మరో ఐదుగురు సభ్యుల మద్దతుంటే సరిపోతుంది. ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వానికి బీజేపీ (14), మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (3), గోవా ఫార్వర్డ్ పార్టీ (3), ఎన్సీపీ (1), స్వతంత్రులు(3) కలుపుకుని 21 మంది సభ్యుల మద్దతుంది. -
హక్కులను కాలరాస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: శాంతియుతంగా ధర్మాగ్రహ యాత్ర నిర్వహించాలని సిద్ధపడ్డ పరిపూర్ణానంద స్వామిని బహిష్కరించడం ద్వారా రాజ్యాంగం కల్పించిన ప్రాథమికహక్కును రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తోందని బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ అంశంపై గవర్నర్ నరసింహన్‌ను రాజ్‌భవన్‌లో బీజేపీ నేతలు బుధవారం కలసి ఫిర్యాదు చేశారు. కేంద్ర మాజీమంత్రి, ఎంపీ బండారు దత్తాత్రేయ, బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ప్రభాకర్, ఎమ్మెల్సీ ఎన్.రామచందర్ రావు, నేతలు ప్రేమేందర్‌రెడ్డి, చింతా సాంబమూర్తి, దాసరి మల్లేశం తదితరులు గవర్నర్‌ను కలిశారు. మత విద్వేషాలను రెచ్చగొట్టాలని నోటికొచ్చినట్లు మాట్లాడిన ఎంఐఎం నేతలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా, హిందూ ప్రజల మనోభావాల గురించి ప్రశ్నిస్తున్న వారిపైనే చర్యలు తీసుకోవడం శోచనీయమన్నారు. రాష్ట్రప్రభుత్వం పక్షపాత ధోరణి ప్రదర్శిస్తోందని గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. వాస్తవ పరిస్థితులపై అధ్యయనం చేసి, రాజ్యాంగాన్ని పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం దత్తాత్రేయ మాట్లాడుతూ పరిపూర్ణానందను అకారణంగా బహిష్కరించారని మండిపడ్డారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరించిందని దుయ్యబట్టారు. లక్షలాదిమంది హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, దీన్ని ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. అధికార దుర్వినియోగం చేస్తూ పరిపూర్ణానందను గృహ నిర్బంధం చేశారని.. ఆయనను ఎందుకలా గృహ నిర్బంధం చేయాల్సి వచ్చిందో చెప్పాలని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. నగర బహిష్కరణ అని, రాష్ట్రం నుంచి ఎలా బహిష్కరిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదేమైనా నిజాం పాలనా అని ప్రశ్నించారు. విభజన చట్టానికి విరుద్ధంగా రాష్ట్ర పోలీసులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి హిందువులపై అనుచితంగా, మనోభావాలను కించపరుస్తూ మాట్లాడుతున్నా ఎందుకు చర్యలను తీసుకోవట్లేదని ప్రశ్నించారు. టీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్న ఎంఐఎం నేతలపై ఎందుకు చర్యలను తీసుకోవట్లేదని ప్రశ్నించారు. బహిష్కరణ దారుణం: లక్ష్మణ్ స్వామి పరిపూర్ణానందపై బహిష్కరణ నిర్ణయం అప్రజాస్వామికం, దారుణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. దేవుడిని దూషించి, మెజారిటీ ప్రజల మనోభావాలను గాయపర్చిన వారిపై కఠినంగా వ్యవహరించకుండా పరిపూర్ణానంద పై బహిష్కరణ వేటు వేయడం ప్రభుత్వ దుర్మార్గ చర్యలకు పరాకాష్ట అని విమర్శించారు. పరిపూర్ణానంద స్వామిని నిర్బంధించడం, నగర బహిష్కరణ చేయడం ఏమిటని ప్రశ్నించారు. పరిపూర్ణానంద బహిష్కరణ అంశంపై ప్రభుత్వం, పోలీసులు పునరాలోచించాలని కోరారు. మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఎంఐఎం నేతలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పరిపూర్ణానంద స్వామిపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. -
కశ్మీర్లో సంబరాలు
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ ప్రభుత్వం నుంచి బీజేపీ బయటకు రావడంతో స్థానిక ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. పీడీపీ నుంచి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు మంగళవారం బీజేపీ ప్రకటించగా, మెహబూబా ముఫ్తీ వెంటనే సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీనిపై కశ్మీర్ ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. శ్రీనగర్, కుప్వారా, పహల్గాం జిల్లాలో ప్రజలు రోడ్డ మీదకు వచ్చి టపాసులు పేల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ‘పీడీపీ-బీజేపీ కూటమి అపవిత్రమైనది. పీడీపీ బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం మాకు ఇష్టంలేదు. ఇప్పటికైన వారి కూటమి విడిపోయినందుకు చాలా సంతోషంగా ఉంది’ అని స్థానికులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కశ్మీర్ ప్రముఖ వ్యాపారవేత్త నసీర్ మాట్లాడుతూ.. ‘పీడీపీ-బీజేపీ కూటమి ఉత్తర, దక్షిణ ధ్రువాలు వంటి పార్టీలు. రెండు పార్టీల సిద్ధాంతాలు పూర్తిగా వ్యతిరేకమైనవి. బీజేపీకి కశ్మీర్ ప్రజల పట్ల ప్రేమ లేదు. వారి కూటమి వల్ల కశ్మీర్ చాలా నష్టపోయింద’ని అన్నారు. కొంత మంది ప్రజలు మాత్రం గవర్నర్ పాలనలో అవినీతి విపరీతంగా ఉంటుందని, రాష్ట్రంలో పరిస్థితి మరింతగా క్షీణిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
వివాదంగా మారిన యోగా డే లేఖ
కోల్‌కతా : బెంగాల్ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠి రాష్ట్రంలోని యూనివర్సిటీలకు రాసిన లేఖ అధికార పార్టీ, గవర్నర్ మధ్య వివాదానికి దారి తీసింది. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలు ఈ నెల 21న అంతర్జాతీయ యోగా డేను జరుపుకోవడానికి సన్నాహకాలు ముమ్మరం చేయాలని, ఈ ఏడాది యోగా డేను విజయవంతంగా జరపాలని గవర్నర్ త్రిపాఠి యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్లకు లేఖ రాశారు. గవర్నర్ తీరును అధికార తృణమూల్ తప్పుబట్టింది. దీనిపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పార్థ ఛటర్జీ మాట్లాడుతూ..‘ యూనివర్సిటీలకు కేంద్ర మానవవనరుల మంత్రిత్వశాఖ నుంచి ఆదేశాలను రావాలి. లేఖలు రాసే అధికారం వారికే ఉంటుంది. రాష్ట్ర పరిధిలోని యూనివర్సిటీలపై గవర్నర్ జోక్యం తగదు. అలా చేయడం అధికార దుర్వినియోగానికి పాల్పడట్లే. యోగా డేను నిర్వహించాడానికి సీఎం మమత బెనర్జీ అన్ని ఏర్పాట్లు చేశారు’ అని అన్నారు. గవర్నర్ అధికార పరిధిని దాటి వ్యవహరిస్తున్నాని టీఎంసీ ఆరోపిస్తోంది. కాగా యోగా డే నిర్వహణపై గతంలోనే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) దేశంలోని అన్ని యూనివర్సిటీలకు ఆదేశాలు జారీ చేసింది. -
గవర్నర్ ఇఫ్తార్ విందు
హైదరాబాద్: గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ రంజాన్‌ను పురస్కరించుకొని ముస్లిం సోదరులకు ఆదివారం రాజ్‌భవన్‌లో ఇఫ్తార్ విందు ఇచ్చారు. పలువురు ప్రముఖులు ఈ విందుకు హాజరయ్యారు. సందడిగా సాగిన ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, శాసనమండలి చైర్మన్ కె.స్వామిగౌడ్, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, డీజీపీ మహేందర్‌రెడ్డి, పలువురు ఎంపీలు, ఇతర ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. -
రేపు రాజ్‌భవన్‌లో ఇఫ్తార్ విందు
సాక్షి, హైదరాబాద్: పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆదివారం రాజ్‌భవన్‌లో ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ఆది వారం సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంట ల వరకు రాజ్‌భవన్ రోడ్డులో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండనున్న దృష్ట్యా వాహనదారులు ప్రత్యా మ్నాయ మార్గాలు ఎంచుకోవాలని ట్రాఫి క్ చీఫ్ అనిల్‌కుమార్ సూచించారు. ఇఫ్తార్ విందు కు హాజరయ్యే వారి వాహనాలకు రాజ్‌భవన్, ఎంఎంటీఎస్ స్టేషన్, మెట్రో రెసిడెన్సీ–నాసర్ స్కూల్ మధ్య, లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ఎదురుగా పార్కింగ్ ప్రాంతాలు కేటాయించామన్నారు. -
కాలిఫోర్నియా గవర్నర్ రేసులో 22 ఏళ్ల టెక్కీ
కాలిఫోర్నియా : కాలిఫోర్నియా గవర్నర్ రేసులో ఉన్న అభ్యర్థుల్లో, ఇప్పుడు అందరి దృష్టి భారతసంతతికి చెందిన అమెరికన్ టెక్కీ శుభమ్ గోయల్(22)పైనే ఉంది. గవర్నర్ అభ్యర్థుల్లోనే అతిపిన్న వయస్సున్న శుభమ్ కొత్త టెక్నాలజీలనువాడుతూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన అతని తల్లిదండ్రులు కొన్నేళ్ల కిందటే అమెరికాలో స్థిరపడ్డారు. మీరట్‌కు చెందిన అతని తల్లి కరుణ గోయల్, లక్నోకు చెందిన తండ్రి విపుల్ గోయల్ సాఫ్ట్వేర్ రంగంలోనే పనిచేస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో శుభమ్ విద్యను అభ్యసించారు. 2017లో చదువు పూర్తైన అనంతరం, వర్చువల్ రియాలిటీ కంపెనీలో మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తూ కాలిఫోర్నియాలోని డాన్విల్లెలో నివాసం ఉంటున్నారు. 'కాలిఫోర్నియాలోనే పుట్టి పెరిగాను. టెక్నాలజీలో వస్తున్న నూతన ఆవిష్కరణలను ప్రజల సమస్యల పరిష్కారంలో వాడొచ్చు. నాకు తెలిసి ఎన్నికల ప్రచారంలో వర్చువల్ రియాలిటీని వాడుతున్న మొదటి వ్యక్తిని నేనే అనుకుంటా. బాహ్య ప్రపంచం రోజు రోజుకూ కొత్త ఆవిష్కరణలతో దూసుకుపోతూంటే, రాజకీయాల్లో మాత్రం అవేవి కనిపించటంలేదు' అని శుభమ్ గోయల్ పేర్కొన్నారు. సామాజికమాధ్యమాల సహాయంతోనే కాకుండా, నగరంలోని వీధుల్లోనూ అతను మైక్ పట్టుకుని తనను గెలిపించాలంటూ ప్రచారం చేస్తున్నారు. వర్చువల్ రియాలిటీ టెక్నాలజీతో కాలిఫోర్నియాలోని విద్యావ్యవస్థలోని అనేక సమస్యలను పరిష్కరించవచ్చని శుభమ్ అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో డబ్బు ప్రభావాన్ని సమూలంగా నిర్మూలించి, టెక్నాలజీని ఎక్కువగా వాడాలసిన సమయం ఆసన్నమైందన్నారు. రాజకీయాల్లో స్వతంత్రంగా, స్వేచ్ఛగా మాట్లాడేవారి అవసరం ఉందన్నారు. టెక్నాలజీతో పాలనలో పారదర్శకత ఉండేలా చూడొచ్చని అన్నారు. నాలుగేళ్లకోసారి కాలిఫోర్నియా గవర్నర్ ఎన్నికలు జరుగుతాయి. 2014లో జరిగిన ఎన్నికల్లో జెర్రీ బ్రౌన్, భారత అమెరికన్ అయిన నీల్ కష్కరీపై గెలుపొందారు. ఈసారి జరిగే ఎన్నికల్లో 27 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. రాజకీయాలతో ఏమాత్రం సంబంధంలేని కుటుంబం నుంచి వచ్చి, ఏ రాజకీయ పార్టీతో సంబంధంలేకుండా స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచిన శుభంకు టెక్నాలజీ స్లోగన్ ఏమేర సహాయ పడుతుందో వేచిచూడాలి. -
కాలిఫోర్నియా గవర్నర్ రేసులో భారతసంతతి టెక్కీ
-
ఆంగ్లో–ఇండియన్ ఎమ్మెల్యే నియామకాన్ని అడ్డుకోండి
యశవంతపుర: కర్ణాటక విధానసభకు ఆంగ్లో ఇండియన్ వినీషా నీరోను నామినేట్ చేస్తూ గవర్నర్ వజుభాయ్ వాలా తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్–జేడీఎస్‌లు గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. యడ్యూరప్ప అసెంబ్లీలో బలపరీక్ష నిరూపించుకునే వరకూ గవర్నర్ నిర్ణయాన్ని అడ్డుకోవాలని తమ పిటిషన్లో పేర్కొన్నాయి. యడ్యూరప్ప ప్రమాణస్వీకారంపై దాఖలైన పిటిషన్‌తోపాటుగా నేడు ఈ పిటిషన్ సుప్రీంలో విచారణకు రానుంది. గురువారం యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ఆంగ్లో–ఇండియన్‌ను గవర్నర్ నామినేట్ చేశారు. గవర్నర్ నిర్ణయంపై సుప్రీంకు జెఠ్మలానీ యడ్యూరప్పను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించడాన్ని తప్పుపడుతూ సీనియర్ న్యాయవాది రాం జెఠ్మలానీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే ఇదే తరహా పిటిషన్‌ను విచారిస్తున్న ధర్మాసనం ముందు వాదనలు వినిపించాలని సీజేఐ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ ఆయనకు సూచించింది. -
1996లో అలా.. 2018లో ఇలా!
ఇప్పుడు కర్ణాటకలో తమను కాదని గవర్నర్ వజూభాయ్ వాలా బీజేపీ నేత యడ్యూరప్పను ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ ఆహ్వానించడాన్ని కాంగ్రెస్, దేవెగౌడ పార్టీ జేడీఎస్ అన్యాయం, అక్రమమని గొంతు చించుకుంటున్నాయి. అయితే, ఒకప్పుడు గుజరాత్లో పూర్తి మెజారిటీ ఉన్న బీజేపీ సర్కారును అక్రమంగా గద్దెదించడంలో కాంగ్రెస్ పార్టీ, దేవెగౌడ తమ పాత్రలను మరచిపోయినట్లు కనిపిస్తోంది. గవర్నర్ సిఫార్సుతో మెహతా బర్తరఫ్! అది 1996 సెప్టెంబర్. గుజరాత్లో సురేశ్ మెహతా నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై సీనియర్ నేత శంకర్‌సింహ్ వాఘేలా వర్గీయులు తిరుగుబాటు చేశారు. మెహతా ప్రభుత్వానికి అసెంబ్లీలో 121 మంది బీజేపీ శాసనసభ్యుల మద్దతు ఉండగా, వారిలో 40 మంది తనను సమర్థిస్తున్నారని వాఘేలా ప్రకటించి, ప్రతిపక్షమైన కాంగ్రెస్‌తో చేతులు కలిపారు. వాఘేలా, కాంగ్రెస్‌కు చెందిన పారిఖ్ కలిసి సురేశ్మెహతా సర్కారుపై అవిశ్వాసం ప్రకటించి, తిరుగుబాటు చేయడంతో బీజేపీ ప్రభుత్వానికి అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీజేపీకి చెందిన స్పీకర్ హెచ్ఎల్ పటేల్ అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్న సమయంలో సభను నడిపిన కాంగ్రెస్‌కు చెందిన ఉపసభాపతి చందూభాయ్ ధాబీ వాఘేలా–పారిఖ్ వర్గానికి గుర్తింపు ఇచ్చారు. మళ్లీ కోలుకుని అసెంబ్లీకి వచ్చిన స్పీకర్ పటేల్ డెప్యూటీ స్పీకర్ ఉత్తర్వును రద్దు చేయడం గందరగోళం, కొట్లాటలకు దారితీసింది. అసెంబ్లీలో రభస జరగడంతో బలపరీక్షకు ఓటింగ్ నిర్వహించడం కుదరలేదు. వాఘేలా వర్గం, కాంగ్రెస్ నేతలు గవర్నర్ కృష్ణపాల్ సింగ్‌ను కలసి మెహతా సర్కారును బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ సర్కారు రద్దుకు గవర్నర్ సిఫార్సు దాంతో మెహతా ప్రభుత్వాన్ని రద్దు చేయాలంటూ గవర్నర్ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశా>రు. ఆ సమయంలో దేవెగౌడ ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆయన నేతృత్వంలోని ప్రభుత్వానికి కాంగ్రెస్ బయటినుంచి మద్దతిస్తోంది. దేవెగౌడ ప్రభుత్వం గుజరాత్ నుంచి గవర్నర్ నివేదిక అందిన వెంటనే సురేశ్ మెహతా ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసింది. ఇప్పటి కర్ణాటక గవర్నర్ వజూభాయ్ వాలా అప్పుడు గుజరాత్ బీజేపీ అధ్యక్షుని హోదాలో తమ పార్టీ సర్కారుకు జరిగిన ‘అన్యాయాన్ని’ కళ్లారా చూశారు.. అర్థం చేసుకున్నారు. ఇప్పుడు అదే దేవెగౌడ కొడుకు కుమారస్వామికి మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ ప్రభుత్వం ఏర్పాటుకు ఆయనను ఆహ్వానించాలని కాంగ్రెస్, జేడీఎస్ నేతలు కోరినా వజూభాయ్ పట్టించుకోలేదు. వాజ్‌పేయి ఔట్.. దేవెగౌడ ఇన్ 1996లోనే సభలో మెజారిటీ నిరూపించుకోలేక ప్రధాని పదవికి వాజ్‌పేయి రాజీనామా చేసిన సందర్భాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. 1996 లోక్‌సభ ఎన్నికల తర్వాత 161 సీట్లతో అతి పెద్ద పార్టీగా నిలిచిన బీజేపీ తరఫున ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా అటల్ బిహారీ వాజ్‌పేయిని అప్పటి రాష్ట్రపతి శంకర్‌దయాళ్ శర్మ ఆహ్వానించారు. బలపరీక్ష నాటికి అవసరమైన మద్దతు కూడగట్టుకోలేకపోవడంతో.. ఓటింగ్‌కు ముందే వాజ్‌పేయి రాజీనామా చేశారు. అయితే, విశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా వాజ్‌పేయి చేసిన ఆవేశపూరిత ప్రసంగాన్ని నేటికీ గుర్తు చేసుకుంటారు. అనంతరం, కాంగ్రెస్ నాయకత్వాన ఏర్పడే సంకీర్ణ సర్కారుకు మద్దతివ్వడానికి కాంగ్రెసేతర జాతీయ. ప్రాంతీయపార్టీలు అంగీకరించకపోవడంతో.. కాంగ్రెస్ మద్దతుతో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం కొలువుతీరింది. ఆ ప్రభుత్వానికి దేవెగౌడ నేతృత్వం వహించడం కొసమెరుపు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
నేడు సీఎంగా యడ్యూరప్ప ప్రమాణం
-
గవర్నర్‌కు కుమారస్వామి లేఖ
-
గవర్నర్ వ్యవస్థను రద్దు చేయండి
-
గవర్నర్ రాజకీయాలు
-
అర్ధాంతరంగా గవర్నర్ ఢిల్లీ పర్యటన రద్దు
-
నిర్మలా దేవి ఇంట్లో సోదాలు.. డైరీలో గుట్టు
విద్యార్థినులకు లైంగిక వేధింపుల ప్రేరణ వ్యవహారం ఉచ్చులో తమిళనాడు రాష్ట్ర గవర్నర్‌ను ఇరికించేందుకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయని తెలిసింది ఆయన మీద అనుమానాలు వ్యక్తంచేస్తూ, రీకాల్‌కు పట్టుబడుతున్నాయి. ఈగవర్నర్ను వెనక్కు తీసుకోండనే నినాదం ఆదివారం సీపీఎం నేతృత్వంలో తెరమీదకు వచ్చింది. రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి ఆ పార్టీ లేఖాస్త్రం సంధించింది. ఇదిలా ఉండగా ప్రొఫెసర్ నిర్మలా దేవి ఇంట్లో సాగిన తనిఖీల్లో లభించిన డైరీలో పలువురు పెద్దల గుట్టు ఉన్నట్టు సమాచారం. ఇందుకు బలం చేకూర్చే రీతిలో సీబీసీఐడీ పలువురిని విచారణ వలయంలోకి తీసుకు రావడం గమనార్హం. సాక్షి, చెన్నై : విద్యార్థినులకు లైంగిక ప్రేరణలో చిక్కిన ప్రొఫెసర్ నిర్మలా దేవిని సీబీసీఐడీ తీవ్రంగానే విచారిస్తోంది. ఆమె గుట్టును రట్టు చేసిన విద్యార్థినులను సైతం సీబీసీఐడీ ప్రత్యేక బృందం రహస్య విచారణ చేపట్టింది. వారి నుంచి సేకరించిన సమాచారంతో నిర్మలా దేవి సోదరుడు రవిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. అతడితో కలిసి ఈ ప్రత్యేక బృందం శనివారం రాత్రంతా పుదుకోట్టైలోని నిర్మలా దేవి నివాసంలో సోదాలు చేసింది. కంప్యూటర్ హార్డ్ డిస్క్, ల్యాప్ టాప్‌లతో పాటు బ్యాంక్ ఖాతాలు, కొన్ని డైరీలను సీబీసీఐడీ స్వాధీనం చేసుకుంది. ఆదివారం ఉదయాన్నే ఆ ఇంటిని అధికారులు సీజ్ చేశారు. డైరీలో లభించిన సమాచారం మేరకు నిర్మలా దేవి భర్త శరవణతో పాటు నలుగురు కాంట్రాక్టర్లను విచారించేందుకు నిర్ణయించారు. అదే సమయంలో మదురై కామరాజర్ వర్సిటీకి చెందిన ఓ డైరెక్టర్‌ను గురిపెట్టి, ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు సాగాయి. నిర్మలా దేవి డైరీలోని గుట్టు మేరకు ఈ సోదాలు సాగుతుండడంతో, మరెందరు ఈ విచారణ వలయంలోకి వస్తారోఅనే చర్చ బయలు దేరింది. కాగా, సీబీసీఐడీ విచారణ వేగవంతం చేసిన నేపథ్యంలో గవర్నర్ బన్వరిలాల్ నేతృత్వంలో రంగంలోకి దిగిన ఐఏఎస్ సంతానం కమి టీ ఇరకాటంలో పడింది. నిర్మలాదేవి వద్ద విచారణ సా గించడం ఆ కమిటీకి కష్టతరంగా మారినట్టు తెలు స్తోం ది. ఆమె వద్ద విచారణ లక్ష్యంగా సోమవారం ఆ కమిటీ కోర్టును ఆశ్రయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గవర్నర్ రీకాల్‌కు పట్టు నిర్మలా దేవి బండారం, తెర వెనుక ఉన్న శక్తుల్ని తెర మీదకు తెచ్చే దిశలో విచారణ వేగం ఓ వైపు జోరందుకుంది. మరోవైపు ఈ ఉచ్చులో గవర్నర్ బన్వరిలాల్‌ను సైతం ఇరికించే రీతిలో ప్రతిపక్షాలు ప్రయత్నాల్లో ఉన్నట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే గవర్నర్ తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ప్రతిపక్షాలు, తాజా పరిస్థితుల్ని అస్త్రంగా చేసుకుని ఆయన రీకాల్‌కు పట్టుబట్టే పనిలో పడ్డాయి. ఆదివారం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణన్ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీలకు లేఖాస్త్రం సంధించారు. అందులో విద్యార్థినులకు లైంగిక ప్రేరణ, నిర్మలా దేవి వ్యవహారాన్ని గుర్తుచేస్తూ, ఇందులో గవర్నర్ వ్యవహరిస్తున్న తీరు అనుమానాలకు దారితీస్తోందని ఆరోపించారు. ఈ వ్యవహారంలో గవర్నర్ దూకుడుగా ముందుకు సాగడం అనుమానాలకు బలాన్ని ఇస్తున్నట్టు పేర్కొన్నారు. విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసే అధికారం ఆయనకు లేదని వివరిస్తూ, ఆగమేఘాలపై గవర్నర్ స్పందించిన విచారణ కమిషన్ ఏర్పాటు చేయడం వెనుక కారణాలు ఏమిటో సమగ్రంగా విచారించాల్సిన అవసరం ఉందని తెలిపారు. గవర్నర్ మీద సైతం ఆరోపణలు ఉన్నాయని, అలాంటప్పుడు ఆయన నియమించిన కమిటీ ఎలా విచారణను న్యాయబద్ధంగా నిర్వహించగలదని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై హైకోర్టు పర్యవేక్షణలో ఉన్నత స్థాయి కమిటీ విచారించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. ఈ దృష్ట్యా, గవర్నర్‌ను వెనక్కు పిలిపించుకోవాలని, ఆయన మీద విచారణకు ఆదేశించాలని పట్టుబట్టారు. లేని పక్షంలో తమిళనాట ఆందోళనలు మరింతగా భగ్గుమంటాయని పేర్కొనడం గమనార్హం. -
గవర్నర్ వర్సెస్ కాంగ్రెస్
-
తమిళం నేర్చుకుంటున్న గవర్నర్
సాక్షి, చెన్నై: తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ తమిళ పాఠాలు నేర్చుకుంటున్నారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన పురోహిత్ ఇంగ్లిష్, హిందీ, మరాఠీ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు. పురోహిత్ తమిళనాడు గవర్నర్‌గా అక్టోబర్‌లో పదవీ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర ప్రజలతో మమేకం కావడానికి గవర్నర్ తమిళ ఉపాధ్యాయుడి సాయంతో పాఠాలు నేర్చుకుంటున్నారని గవర్నర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. కాగా 1977లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పురోహిత్.. మూడు సార్లు లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు. రెండు సార్లు కాంగ్రెస్ తరపున .. ఒకసారి బీజేపీ తరపున పోటీచేసి లోక్‌సభలో అడుగుపెట్టారు. అంతేకాకుండా, స్వాతంత్య్ర సమరయోధుడు గోపాలకృష్ణ గోఖలే నాగ్‌పూర్ నుంచి స్థాపించిన ‘ది హితవాద’ పత్రికను బన్వరిలాల్ పురోహిత్ విజయవంతంగా నడిపిస్తున్నారు. -
‘రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తా’
సాక్షి, చెన్నై: గవర్నర్‌గా రాజకీయాలకు అతీతంగా రాజ్యాంగ పరిరక్షణకు కృషిచేస్తానని భన్వరీలాల్ పురోహిత్ తెలిపారు. తమిళనాడు నూతన గవర్నర్‌గా పురోహిత్ శుక్రవారం చెన్నైలో ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆయనతో ప్రమాణం చేయించారు. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి కార్యక్రమానికి హాజరై నూతన గవర్నర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కొణిజేటి రోశయ్య పదవీకాలం పూర్తయ్యాక తమిళ రాష్ట్రానికి పూర్తిస్థాయి గవర్నర్ నియామకం జరగలేదు. మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగరరావు ఇన్నాళ్లూ ఇంఛార్జ్ గవర్నర్‌గా వ్యవహరించారు. తాజాగా పురోహిత్‌ను తమిళనాడుకు పూర్తిస్థాయి గవర్నర్‌గా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నియమించారు. పురోహిత్ గతంలో అసోం గవర్నర్‌గా పనిచేశారు. అభివృద్ధి పనుల్లో తమిళనాడు సర్కార్‌కు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని భన్వరీలాల్ పురోహిత్ తెలిపారు. -
గాంధీలో గవర్నర్‌కు శస్త్రచికిత్స
సికింద్రాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ చికిత్స కోసం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చేరారు. కాలికి ఆనె(కార్న్)తో రావడంతో వారం రోజుల క్రితం ఆయన సాధారణ రోగిలా వచ్చి గాంధీలో వైద్యులను సంప్రదించారు. వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహించి చిన్నపాటి శస్త్రచికిత్స చేసి ఆనెను తొలగించాలని సూచించారు. దీంతో ఆయన సోమవారం గాంధీకి వచ్చి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. గవర్నర్‌ను సాయంత్రం డిశ్చార్జ్ చేస్తామని గాంధీ వైద్యులు తెలిపారు. -
రెండోరోజూ ‘గాంధీ’కి గవర్నర్
- వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు - రక్త నమూనాలు సేకరణ హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ వరుసగా రెండో రోజూ సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి వచ్చారు. కుడికాలి మడమకు ఆనె(కార్న్)తో బాధపడుతున్న ఆయన బుధవారం సాధారణ రోగిలో గాంధీ ఆస్పత్రికి వచ్చిన విషయం తెలిసిందే. వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహించి చిన్నపాటి శస్త్రచికిత్స చేసి ఆనెను తొలగించాలని సూచించారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు గాంధీ ఆస్పత్రికి వచ్చిన గవర్నర్‌ను ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రవణ్‌కుమార్, వైద్యనిపుణులు సాదరంగా ఆహ్వానించి ప్రధాన భవనం నాల్గవ అంతస్థులోని సెంట్రల్ లెబోరేటరీకి తీసుకువెళ్లారు. శస్త్రచికిత్సకు ముందు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించారు. రక్త నమూనాలు సేకరించారు. ఈసీజీ, 2డీ ఎకో తదితర వైద్యపరీక్షలు చేశారు. అర్ధగంట తర్వాత గవర్నర్ నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లిపోయారు. అనంతరం డాక్టర్ శ్రవణ్‌కుమార్, డిప్యూటీ నర్సింహారావు నేత, ఆర్ఎంవో 1 జయకృష్ణ మీడియాతో మాట్లాడుతూ గవర్నర్ కాలి మడమ ఆనె (కార్న్)ను తొలగించేందుకు శస్త్రచికిత్స అవసరమని, ఆపరేషన్‌కు ముందు ఫిట్నెస్ కోసం చేయాల్సిన వివిధ రకాల వైద్యపరీక్షలు నిర్వహించామని చెప్పారు. శాంపిల్స్ సేకరించి లెబోరేటరీలో నిర్ధారణ పరీక్షలు చేస్తున్నామని అన్నారు. నిర్ధారణ పరీక్షల నివేదికలు అందిన తర్వాత గవర్నర్‌తో చర్చించి ఎప్పుడు శస్త్రచికిత్స చేయాలనేది నిర్ణయిస్తామని తెలిపారు. నేను ఫిట్‌గానే ఉన్నా.... అన్నిరకాల వైద్యపరీక్షల అనంతరం మీరు ఫిట్‌గానే ఉన్నారు, ఎటువంటి ఆరోగ్యపరమైన సమస్యలు లేవని వైద్యులు తెలిపారు. ‘నేను ఫిట్‌గానే ఉన్నానని నాకు తెలుసు, మీ పరికరాలు, యంత్రాలు ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకునేందుకే వచ్చా’అంటూ గవర్నర్ చమత్కరించారు. -
గాంధీ ఆస్పత్రిలో గవర్నర్‌కు చికిత్స!
హైదరాబాద్: ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ బుధవారం సాధారణ పౌరుడిలా గాంధీ ఆస్పత్రిని సందర్శించి చికిత్స చేయించుకున్నారు. తన కుడి పాదంపై అయిన కాయను గురించి గాంధీ వైద్యుల సలహా తీసుకున్నారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ శ్రావణ్‌కుమార్, డిప్యూటీ సూపరింటెండెంట్ నరసింహారావు నేత, చీఫ్ అడ్మినిస్ట్రేటర్ జయకృష్ణ తదితరులు గవర్నర్ వెంట ఉన్నారు. గవర్నర్ పాదాన్ని పరిశీలించిన ప్లాస్టిక్ సర్జరీ హెచ్‌వోడీ సుభోద్, జనరల్ సర్జన్ వీఎన్ రెడ్డి.. గాంధీ ఆస్పత్రిలో చిన్నపాటి శస్త్రచికిత్స చేయించుకోవాలని సలహా ఇచ్చారు. ఈ సందర్భంగా గాంధీ ఆస్పత్రిలోని పరిశుభ్రతపై గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో పారిశుద్ధ్యాన్ని మరింత మెరుగుపర్చాలని, రోగులకు మరింతగా వైద్యం అందించేలా మెరుగుపడాలని సూచించారు. ఈ సందర్భంగా రోగుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆస్పత్రిలో మరో ఎమ్మారై యూనిట్‌ను ఏర్పాటుచేయాల్సిన అవసరముందని గాంధీ వైద్యులు కోరగా.. ఈ విషయమై తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి సలహా ఇస్తానని గవర్నర్ హామీ ఇచ్చారు. -
అర్ధరాత్రి వేడెక్కిన బిహార్ రాజకీయాలు
-
అర్ధరాత్రి వేడెక్కిన బిహార్ రాజకీయాలు
పట్నా : బిహార్‌లో బుధవారం అర్ధ రాత్రి(గురువారం తెల్లవారుజామున) రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఆర్జేడీతో తెగతెంపులు చేసుకున్న జేడీయూకు బీజేపీ మద్దతు పలికడం, నితీశ్‌కు తిరిగి సీఎం పదవి ఖాయం కావడం వెనువెంటనే జరిగాయి. అయితే ముందుగా గురువారం సాయంత్ర 5 గంటల ప్రాంతంలో నితీశ్ ప్రమాణ స్వీకారం ఉంటుందని వార్తలు వచ్చాయి. తర్వాత తిరిగి ఉదయం 10 గంటలకే ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉంటుందని రాజ్‌భవన్ కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. ఈ హఠాత్పరిణామం ఆర్జేడీ నేతలకు మింగుడుపడలేదు. వెంటనే ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వి యాదవ్ ఆధ్వర్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలతో రాజ్‌భవన్‌కు పయనమయ్యారు. గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠి ప్రభుత్వ ఏర్పాటుకు మెజారిటీ సీట్లున్న ఆర్జేడీని పక్కన పెట్టి తక్కువ సీట్లున్న జేడీయూను పిలవడమేంటని మండిపడ్డారు. బీహార్‌లో ప్రజాస్వామ్యం కూనీ అయిందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తమకు గురువారం ఉదయం 12 గంటలకు గవర్నర్‌తో అపాయింట్మెంట్ ఇచ్చి, ఆ తర్వాత వెంటనే ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని ఉదయం 10 గంటలకే ఎలా మారుస్తారని తేజస్వీ యాదవ్ నిప్పులు చెరిగారు. ప్రభుత్వ ఏర్పాటు చేయడానికి కావాల్సిన ఎమ్మెల్యేలు తమవైపే ఉన్నారని తేజస్వీ స్పష్టం చేశారు. బిహార్ గవర్నర్ భవన్ ఎదుట గురువారం తెల్లవారుజామున ఆర్జేడీ ఎమ్మెల్యేలు ఆందోళన నిర్వహించారు. ఐదుగురు ఎమ్మెల్యేలతో కలిసి తేజస్వీ యాదవ్ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠిని కలిశారు. అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవడానికి తమకే అవకాశం ఇవ్వాలని కోరారు. బిహార్ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు ఆర్జేడీ పిలుపునిచ్చింది. -
సీబీఐతో సమగ్ర విచారణ జరిపించండి
-
స్పెషల్ ఫోర్త్ ఎస్టేట్ విత్ గవర్నర్
-
గవర్నర్ పదవీ కాలం పొడిగింపు
-
గవర్నర్ పదవీ కాలం పొడిగింపు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ పదవీకాలాన్ని కేంద్రం తాత్కాలికంగా పొడిగించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకూ గవర్నర్‌గా కొనసాగాలని కేంద్ర హోంశాఖ మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. మంగళవారంతో ఆయన మూడో విడత పదవీకాలం ముగుస్తుండటంతో కేంద్రం ఆయన పదవీ కాలాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. నరసింహన్ 2009 డిసెంబర్ 27న ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు గవర్నర్గాపని చేస్తున్న ఎన్.డీ. తివారీ సెక్స్ కుంభకోణంలో ఆరోపణలు రావటంతో తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం నరసింహన్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. -
టీడీపీ ఆశావాహుల్లో టెన్షన్..టెన్షన్..
-
వ్యూహం మార్చిన ఓపీఎస్.. చలో రిసార్ట్!
చెన్నై: తమిళనాట రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యమంత్రి పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న వీకే శశికళ, పన్నీర్ సెల్వం మధ్య క్షణక్షణానికి బలాబాలాలు మారిపోతున్నాయి. వ్యూహాలు, ప్రతి వ్యూహాలు తెరపైకి వస్తున్నాయి. సాయంత్రం వరకు ఎదురుచూసి.. అప్పటికి కూడా గవర్నర్ విద్యాసాగర్‌రావు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే.. ఇక ఢిల్లీ బాట పట్టాలని చిన్నమ్మ శశికళ భావిస్తుండగా.. ఆమెకు మరో షాక్ ఇచ్చేందుకు పన్నీర్ సెల్వం సిద్ధమవుతున్నారు. ఇప్పటికే శశికళ నేతలను తనవైపు తిప్పుకోవడంలో బాగానే విజయవంతమవుతున్న సెల్వం తన రాజకీయ చదరంగానికి రిసార్ట్‌ను వేదికగా చేసుకోబోతున్నారు. గోల్డెన్ బే రిసార్ట్‌లో బస చేసిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను కలువాలని ఓపీఎస్ నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఆయన మరికాసేపట్లో రిసార్ట్‌కు రానున్నారని సమాచారం. ఎమ్మెల్యేలను నేరుగా కలిసి.. తనకు మద్దతునివ్వాల్సిందిగా వారిని కోరాలని ఆయన నిర్ణయించినట్టు తెలుస్తోంది. గోల్డెన్ బే రిసార్ట్‌లో సుమారు 120 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టు సమాచారం. ఇందులో దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు శశికళపై అసంతృప్తితో ఉన్నారని, వారు ఓపీఎస్‌కు మద్దతునిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో నేరుగా ఎమ్మెల్యేలను కలిసి.. తనకు అండగా ఉన్నవారిని.. తన వెంట తెచ్చుకోవాలని ఓపీఎస్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఓపీఎస్‌కు మద్దతు పెరుగుతూనే ఉంది. ఆదివారం మరో ఐదుగురు ఎంపీలు సెల్వం గూటికి చేశారు. దీంతో ఓపీఎస్‌కు అండగా నిలిచిన ఎంపీల సంఖ్య 8కి చేరింది. మరింతమంది ఎంపీలు కూడా ఆయనకు మద్దతునిచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. అన్నాడీఎంకే ఎంపీ ఆర్ లక్ష్మణన్ సెల్వానికి జైకొట్టబోతున్నారని వార్తలు రావడంతో ఆయనపై చిన్నమ్మ వేటు వేసింది. అన్నాడీఎంకే పదవుల నుంచి ఆయనను తొలగిస్తున్నట్టు ప్రకటన విడుదల చేసింది. లక్ష్మణన్ అధికారికంగా పన్నీర్ గూటికి చేరకముందే ఆయనపై వేటు పడటం గమనార్హం. తమిళనాట సంక్షోభం.. ప్రధాన కథనాలు డీఎంకే భవిష్యత్ కార్యాచరణ.. సర్వత్రా ఉత్కంఠ! శశి నుంచి మా మంత్రిని కాపాడండి! అక్రమాస్తుల కేసు.. శశికి మరో ట్విస్టు! నేడు శశికళ భారీ స్కెచ్? శశి భేటీ .. ఐదుగురు మంత్రులు జంప్! చెన్నైలో హై టెన్షన్ పన్నీర్ మైండ్ గేమ్ షురూ.. దీపం చుట్టూ కమ్ముకుంటున్న చీకటి -
వ్యూహం మార్చిన ఓపీఎస్.. చలో రిసార్ట్!
-
డీఎంకే భవిష్యత్ కార్యాచరణ.. సర్వత్రా ఉత్కంఠ!
-
డీఎంకే భవిష్యత్ కార్యాచరణ.. సర్వత్రా ఉత్కంఠ!
చెన్నై: అధికార అన్నాడీఎంకే పార్టీలో సంక్షోభం తారస్థాయికి చేరుకున్న నేపథ్యంలో ప్రతిపక్ష డీఎంకే వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ముఖ్యమంత్రి పదవి కోసం శశికళ, పన్నీర్ సెల్వం హోరాహోరీగా తలపడుతున్న నేపథ్యంలో ఎలా ముందుకెళ్లాలి అనే దానిపై సమాలోచనలు జరుపుతోంది. ఇందులో భాగంగా సోమవారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ అధ్యక్షతన డీఎంకే ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. స్టాలిన్ వ్యూహాత్మకంగా పన్నీర్ సెల్వానికి మద్దతునిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే డీఎంకే అధికారికంగా సెల్వానికి అవసరమైతే మద్దతునిస్తామని ప్రకటించింది. రేపు ఒకవేళ అసెంబ్లీలో పన్నీర్ సెల్వానికి బలపరీక్ష ఎదురైతే.. ఎలాంటి వ్యూహం అనుసరించాలి? చిన్నమ్మ ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకునేందుకు ఎలాంటి ఎత్తుగడలు వేయాలి? అన్నదానిపై ఈ భేటీలో చర్చించనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే త్వరలోనే తమిళనాడులో అధికారంలోకి వస్తామంటూ ప్రకటించి స్టాలిన్ సంచలనానికి తెరతీసిన సంగతి తెలిసిందే. స్టాలిన్- ఓపీఎస్ మధ్య అంతర్గత స్నేహబంధాలు ఉన్నాయని అంటున్నారు. చిన్నమ్మను అడ్డుకొని సెల్వాన్ని సీఎం చేయడం ద్వారా తన రాజకీయ ప్రయోజనాలు కూడా నెరవేర్చుకోవాలని స్టాలిన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం డీఎంకేకు మిత్రపక్షాల మద్దతుతో కలిపి 90కిపైగా ఎమ్మెల్యేలు ఉన్నారు. ఓపీఎస్‌కు 30 వరకు ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సెల్వం-స్టాలిన్ చేయి కలిపితే.. ప్రభుత్వ ఏర్పాటు పెద్ద కష్టం కాబోదు అన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. కొంతకాలం సెల్వానికి మద్దతునిచ్చే.. ఆ తర్వాత మధ్యంతర ఎన్నికలకు వెళ్లి.. అందులో ఘనవిజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నది స్టాలిన్ ఆలోచనగా కనిపిస్తున్నదని అంటున్నారు. అలా కానీ పక్షంలో మొదటి రెండేళ్లు ఓపీఎస్ ముఖ్యమంత్రిగా కొనసాగితే.. ఆ తర్వాత స్టాలిన్ సీఎం పీఠం చేపట్టవచ్చునని, ఈ మేరకు అధికారాన్ని పంచుకునే అవకాశముందని కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో డీఎంకే ఉన్నతస్థాయి సమావేశం మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
శశి నుంచి మా మంత్రిని కాపాడండి!
చెన్నై: తమిళనాడులోని తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో పోలీసు స్టేషన్‌కు ఓ అనూహ్య ఫిర్యాదు వచ్చింది. తమ నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఆర్ దురైకన్ను కనిపించడం లేదని ఓ విశ్రాంత ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. శశికళ, ఆమె కుటుంబ కబంధ హస్తాల నుంచి తమ ఎమ్మెల్యేను కాపాడాలని ఆయన ఫిర్యాదులో కోరారు. 67 ఏళ్ల బీహెచ్ఈఎల్ విశ్రాంత ఉద్యోగి అయిన కే మహాలింగం ఈమేరకు పాపనాశనం పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించారు. మహాలింగం అన్నాడీఎంకేలో చురుకైన కార్యకర్త. శశికళపై పన్నీర్ సెల్వం తిరుగుబాటు చేసిననాటి నుంచి ఎమ్మెల్యే దురైకన్ను కనిపించడం లేదని, ఆయనను శశికళ, ఆమె కుటుంబసభ్యులు బలవంతంగా నిర్బంధించారని తన ఫిర్యాదులో ఆరోపించారు. ఆయన ఫిర్యాదును స్వీకరించిన స్పెషల్ ఎస్సై ముగుగేషన్ స్వయంగా.. పిటిషన్‌ను ధ్రువీకరిస్తూ రిసిప్ట్ కూడా ఇవ్వడం గమనార్హం. -
నేడు శశికళ భారీ స్కెచ్?
చెన్నై: ఒకవైపు పన్నీర్ సెల్వానికి పెరుగుతున్న మద్దతు.. మరోవైపు జారుకుంటున్న ఎమ్మెల్యేలు, మంత్రులు.. ఈక్రమంలో అన్నాడీఎంకే అధినేత్రి వీకే శశికళ తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఇన్నాళ్లు కేంద్రంపై ఆచితూచి మాట్లాడిన చిన్నమ్మ.. తాజాగా స్వరం పెంచిన సంగతి తెలిసిందే. అన్నాడీఎంకేను చీల్చేందుకే.. ముఖ్యమంత్రిగా తన ప్రమాణస్వీకారాన్ని గవర్నర్ వ్యూహాత్మకంగా వాయిదా వేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఇప్పటికే గవర్నర్ విద్యాసాగర్‌రావుకు హెచ్చరికతో కూడిన లేఖను పంపిన శశికళ.. ఆదివారం భారీ వ్యూహానికి తెరలేపనున్నారని తెలుస్తోంది. శశికళ ఆదివారం మరోసారి గవర్నర్ విద్యాసాగర్‌రావు అపాయింట్మెంట్ను కోరారు. శనివారం ఆమె అపాయింట్మెంట్ కోరినా.. గవర్నర్ నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాలేదన్న సంగతి తెలిసిందే. ఈ రోజు కూడా గవర్నర్ అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ప్రత్యక్ష ఆందోళనకు దిగాలని శశికళ భావిస్తున్నారు. రిసార్ట్‌లో బస చేసిన తన వర్గం ఎమ్మెల్యేలను తీసుకొని.. నేరుగా ఢిల్లీకి వెళ్లాలని ఆమె భావిస్తున్నారు. గవర్నర్ కావాలనే తమకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదనే విషయాన్ని ఢిల్లీ స్థాయికి తీసుకెళ్లాలన్నది శశికళ వ్యూహంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో శశికళకు అపాయింట్మెంట్, గవర్నర్ తదుపరి చర్య ఏమిటన్నది సర్వత్రా ఉత్కంఠ రేపుతున్నది. మరికాసేపట్లో రాజ్‌భవన్ నుంచి కీలక ప్రకటన వెలువడవచ్చునన్న లీకులు వస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో తమిళనాడులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చెన్నైలో హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. అసాంఘిక శక్తలు దాడులు, విధ్వంసాలకు దిగకుండా అడుగడుగునా పోలీసులను మోహరించారు. కేంద్ర బలగాలు కూడా రంగంలోకి దిగొచ్చునని తెలుస్తోంది. -
శశి భేటీ .. ఐదుగురు మంత్రులు జంప్!
-
శశి భేటీ .. ఐదుగురు మంత్రులు జంప్!
రోజురోజుకు చిన్నమ్మ బలం తగ్గిపోతోంది. శశికళ వర్గంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు మెల్లమెల్లగా జారుకుంటున్నారు. తమిళనాడు ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వం గూటికి చేరుతున్నారు. తాజాగా మరో ఐదుగురు అన్నాడీఎంకే మంత్రులు శశికళ శిబిరం నుంచి జంప్ అయినట్టు సమాచారం. ఇప్పటికే ఇద్దరు మంత్రులు (విద్యాశాఖ మంత్రి పాండ్యరాజన్, మత్య్సశాఖ మంత్రి జయకుమార్) ఓపీఎస్‌కు జై కొట్టగా.. మరో ఐదుగురు కూడా సెల్వం వైపు చేరేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. శశితో సమావేశం ముగియగానే జంప్! గోల్డెన్ బే రిసార్ట్‌లో క్యాంపుగా ఉన్న ఎమ్మెల్యేలతో శశికళ శనివారం సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశం ముగియగానే ఐదుగురు మంత్రులు, ఓ ఎమ్మెల్యే జారుకున్నట్టు తెలియడం చిన్నమ్మ వర్గానికి షాక్ ఇచ్చింది. శశితో భేటీ ముగిసిన వెంటనే శిబిరం నుంచి ఇద్దరు మంత్రులు, ఓ ఎమ్మెల్యే జారుకున్నట్టు తేలింది. అలాగే, శిబిరం వద్ద ఉండాల్సిన మరో ముగ్గురు మంత్రుల జాడ కానరాలేదు. ఇందులో అటవీ శాఖ మంత్రి దిండుగల్ శ్రీనివాసన్, పాడి, డెయిరీ శాఖ మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ, విద్యుత్‌శాఖ మంత్రి తంగమణి, పురపాలక శాఖ మంత్రి ఎపీ వేలుమణి, గ్రామీణ పరిశ్రమల శాఖ మంత్రి బెంజిమిన్, మాజీ మంత్రి, కరూర్ ఎమ్మెల్యే సెంథిల్ బాలాజీ ఉన్నట్టు ప్రచారం ఊపందుకుంది. వీరంతా ఆదివారం పన్నీరు శిబిరంలో ప్రత్యక్షమవుతారేమో అన్న ఆందోళన శశికళ వర్గంలో నెలకొంది. పన్నీర్‌సెల్వం దూకుడు పెంచడంతో శశికళ తన శిబిరంలోని సుమారు 30 మంది ఎమ్మెల్యేలను ఆంధ్రప్రదేశ్‌కు తరలించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. సెల్వం శిబిరంలోకి చేరికలు! శనివారం నలుగురు టీఆర్ సుందరం, అశోక్‌కుమార్, సత్యభామ, వనరోజా.. పన్నీర్ సెల్వం గూటికి చేశారు. అదేవిధంగా శశికళకు నమ్మకస్తుడైన నేతగా భావిస్తున్న దిండిగల్ శ్రీనివాస్ కూడా సెల్వం జైకొట్టాలని భావిస్తున్నట్టు సమాచారం. తనపై తిరుగుబాటు చేయడంతో పన్నీర్ సెల్వాన్ని శశికళ పార్టీ కోశాధికారి పదవి నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. ఆ పదవిని దిండిగల్ శ్రీనివాసన్‌కు అప్పగించారు. ఇప్పుడు ఆయనే పన్నీర్ సెల్వం గూటికి చేరుతుండటం తమిళనాట మారుతున్న రాజకీయ పరిస్థితులను ప్రతిబింబిస్తున్నది. అంతేకాకుండా అన్నాడీఎంకేకు మీడియా గొంతుగా ఉన్న ఆ పార్టీ అధికారి ప్రతినిధి సీ పొన్నియన్ కూడా చిన్నమ్మకు ఝలక్ ఇచ్చారు. ఆయన తాజాగా పన్నీర్ సెల్వానికి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. -
క్షణక్షణం ట్విస్టులు.. పోయెస్ గార్డెన్‌కు శశి!
చెన్నై: తమిళనాట ఏర్పడిన రాజకీయ సునామీ ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. ముఖ్యమంత్రి పదవి కోసం వీకే శశికళ, పన్నీర్ సెల్వం మధ్య హోరాహోరీ ఎత్తులు-పైఎత్తులతో క్షణక్షణం రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఎడతెరిపిలెకుండా సాగుతున్న ఈ పరిణామాల నేపథ్యంలో గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు తీరు కూడా ఆసక్తిరేపుతోంది. ఆయనను కలిసేందుకు అన్నాడీఎంకే అధినేత్రి వీకే శశికళ ఒంటరిగానే రాజ్‌భవన్‌కు బయలుదేరారని కథనాలు వచ్చాయి. అయితే, గోల్డెన్ బే రిసార్ట్‌లో ఎమ్మెల్యేలను కలిసిన అనంతరం ఆమె నేరుగా పోయెస్‌గార్డెన్‌కు వెళ్లిపోయారని అన్నాడీఎంకే వర్గాలు ధ్రువీకరించాయి. రోజంతా ట్విస్టుల మీద ట్విస్టుల ఇస్తూ వాడీవేడిగా సాగిన రాజకీయా పరిణామాలలో ఈ రోజు పన్నీర్ సెల్వం కాస్తా పైచేయి సాధించినట్టు కనబడింది. ముగ్గురు మంత్రులు, ముగ్గురు ఎంపీలు, పలువురు ఎమ్మెల్యేలు ఆయన గూటికి చేరడం.. ఆ వర్గానికి కాస్తంత ఊరటనిచ్చే అంశం. అయితే, ఇప్పటికీ కూడా ఎక్కువమంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు శశికళ వెంట ఉన్నట్టే తెలుస్తోంది. గోల్డెన్ బే రిసార్ట్‌లో క్యాంపుగా ఉన్న అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను కలిసిన అనంతరం గవర్నర్‌ను కలువాలని శశికళ భావించినట్టు తెలిసింది. ఇందుకోసం గవర్నర్ అపాయింట్మెంట్ కూడా కోరినట్టు సమాచారం. అయితే, గవర్నర్ నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాలేదని తెలుస్తోంది. ఎక్కవకాలం జాప్యం చేయకుండా అమీ-తుమీ తేల్చుకోవాలని శశికళ వర్గం భావిస్తున్నప్పటికీ, గవర్నర్‌తో ఘర్షణ పెట్టుకోకుండా జాగ్రత్తగా వ్యవహారం నడుపాలని కోరుకుంటున్నట్టు తెలుస్తోంది. రాజ్‌భవన్ ముందు పరేడ్ తన వర్గం ఎమ్మెల్యేలతో పరేడ్ నిర్వహించాలనేది శశికళ వర్గం వ్యూహంగా ఉన్నప్పటికీ అది వాయిదా పడినట్టు సమాచారం. మరోవైపు నాటకీయ పరిణామాల నేపథ్యంలో రాజ్‌భవన్ ముందు భారీస్థాయిలో పోలీసులను మోహరించారు. మరోవైపు గవర్నర్ విద్యాసాగర్ రావుతో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సమావేశమయ్యారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై ఆయన చర్చించారు. ఒకప్పుడు శశికళను వ్యతిరేకించిన సుబ్రహ్మణ్యస్వామే.. ఇప్పుడు ఆమెతో గవర్నర్ ప్రమాణం చేయించాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఓపీఎస్ దూకుడు! మరోవైపు పన్నీర్ సెల్వం దూకుడుగా ముందుకెళుతూ.. శశికళ వర్గాన్ని వ్యూహాత్మకంగా దెబ్బ కొడుతూనే ఉన్నారు. ఊహించనిరీతిలో ఆయనకు మద్దతు వెల్లువెత్తోంది. ఇప్పటికే ముగ్గురు మంత్రులు సహా ముగ్గురు ఎంపీలు, పలువురు ఎమ్మెల్యేలు ఆయన గూటికి చేరారు. అదేవిధంగా శశికళకు నమ్మకస్తుడైన నేతగా భావిస్తున్న దిండిగల్ శ్రీనివాస్ కూడా సెల్వం జైకొట్టాలని భావిస్తున్నట్టు సమాచారం. అంతేకాకుండా అన్నాడీఎంకేకు మీడియా గొంతుగా ఉన్న ఆ పార్టీ అధికారి ప్రతినిధి సీ పొన్నియన్ కూడా చిన్నమ్మకు ఝలక్ ఇచ్చారు. ఆయన తాజాగా పన్నీర్ సెల్వానికి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. అన్నాడీఎంకేను విచ్ఛిన్నం కాకుండా కాపాడే శక్తి పన్నీర్ సెల్వానికి ఉందని ప్రకటించారు. పొన్నియన్ రాకతో సెల్వం వర్గం మరింత పుంజుకుంది. ఎట్టిపరిస్థితుల్లో అధికారం తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నది. -
మరో మంత్రి జంప్.. అగ్రనటుడి మద్దతు!
ముఖ్యమంత్రి పీఠం లక్ష్యంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వానికి క్రమంగా మద్దతు పెరుగుతోంది. మొదట ఇద్దరు ఎమ్మెల్యేలు, నేతలతో రాజకీయ చదరంగాన్ని ప్రారంభించిన పన్నీర్ గూటికి వరుసగా నేతలు వలస కడుతున్న పరిస్తితి కనిపిస్తోంది. ఇప్పటికే ఇద్దరు మంత్రులు ఓపీఎస్‌కు జై కొట్టగా.. తాజాగా మరో మంత్రి అదే బాటలో నడిచారు. తమిళనాడు గ్రామీణ పరిశ్రమలశాఖ మంత్రి పీ బెంజమిన్ తాజాగా ఓపీఎస్ గూటికి చేరారు. ఇప్పటికే విద్యాశాఖ మంత్రి పాండ్యరాజన్, మత్య్సశాఖ మంత్రి జయకుమార్ ఓపీఎస్‌కు అండగా ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు మాజీ మంత్రి, అన్నాడీఎంకే సీనియర్ నేత రాజేంద్ర ప్రసాద్ కూడా సెల్వానికి జైకొట్టారు. దీంతో సెల్వం వర్గంలో చేరుతున్న అన్నాడీఎంకే నేతల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కోలివుడ్ మద్దతు సెల్వానికే! ఇప్పటికే పలువురు కోలివుడ్ ప్రముఖులు ఓపీఎస్‌కు మద్దతు పలికిన సంగతి తెలిసిందే. కమల్ హసన్, ఆర్య, ఖుష్బూ, గౌతమి తదితరులు సెల్వానికి సీఎం పదవి అప్పగించాలని కోరగా.. తాజాగా మరో అగ్రనటుడు అదే బాటలో సాగారు. సీనియర్ నటుడు, రాజకీయ నాయకుడు శరత్‌కుమార్ ఓపీఎస్‌కు మద్దతు పలికారు. జయలలిత ఉన్నప్పుడు అన్నాడీఎంకేకు మిత్రపక్షంగా కొనసాగిన ఆయన ఇప్పుడు పన్నీర్ సెల్వం వెంట నడుస్తానంటూ ప్రకటించారు. ఈరోజు చేరికలు! ఈరోజు (శనివారం) ఇద్దరు ఎంపీలు అశోక్‌కుమార్, పీఆర్ సుందరం పన్నీర్ సెల్వం గూటికి చేశారు. అదేవిధంగా శశికళకు నమ్మకస్తుడైన నేతగా భావిస్తున్న దిండిగల్ శ్రీనివాస్ కూడా సెల్వం జైకొట్టాలని భావిస్తున్నట్టు సమాచారం. తనపై తిరుగుబాటు చేయడంతో పన్నీర్ సెల్వాన్ని శశికళ పార్టీ కోశాధికారి పదవి నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. ఆ పదవిని దిండిగల్ శ్రీనివాసన్‌కు అప్పగించారు. ఇప్పుడు ఆయనే పన్నీర్ సెల్వం గూటికి చేరుతుండటం తమిళనాట మారుతున్న రాజకీయ పరిస్థితులను ప్రతిబింబిస్తున్నది. అంతేకాకుండా అన్నాడీఎంకేకు మీడియా గొంతుగా ఉన్న ఆ పార్టీ అధికారి ప్రతినిధి సీ పొన్నియన్ కూడా చిన్నమ్మకు ఝలక్ ఇచ్చారు. ఆయన తాజాగా పన్నీర్ సెల్వానికి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. -
సీటు ముడి
-
గవర్నర్‌తో శశికళ భేటీ!
-
క్షణక్షణం.. గవర్నర్‌తో శశికళ భేటీ!
చెన్నై: ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు పావులు కదుపుతున్న అన్నాడీఎంకే అధినేత్రి వీకే శశికళ గురువారం రాత్రి గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావుతో సమావేశమయ్యారు. 120కిపైగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేల మద్దతు తనకుందని, మెజారిటీ (117) మద్దతు తనకు ఉన్న కారణంగా ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని ఆమె గవర్నర్‌ను కోరినట్టు సమాచారం. ముఖ్యమంత్రిగా తనకు అవకాశం ఇవ్వాలని, అవసరమైతే.. అసెంబ్లీలో బలనిరూపణ పరీక్షకు కూడా సిద్ధమని ఆమె తెలిపినట్టు తెలుస్తోంది. తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేల లేఖలను ఆమె ఈ సందర్భంగా గవర్నర్‌కు సమర్పించారు. ఆమె వెంట పదిమంది మంత్రులు ఉన్నారు. అయితే, ఎమ్మెల్యేలు ఎవరూ ఆమె వెంట రాకపోవడం గమనార్హం. గవర్నర్‌తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడకుండానే ఆమె వెళ్లిపోయారు. ఎమ్మెల్యేలంతా శశికళ ఏర్పాటుచేసిన క్యాంపులోనే ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో శశికళ అభ్యర్థనపై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. పోయెస్ గార్డెన్ నుంచి నేరుగా మేరినా బీచ్ చేరుకున్న ఆమె.. అక్కడ దివంగత జయలలిత సమాధి వద్ద నివాళులర్పించారు. తన చేతిలోని ఎమ్మెల్యేల సంతకాలున్న పత్రాలను సమాధి వద్ద ఉంచారు. ఈ సందర్భంగా ఒకింత భావోద్వేగంతో కనిపించారు. జయలలిత తరహాలో ఆకుపచ్చని చీర కట్టుకున్న శశికళ ఒకింత కన్నీటి పర్యంతమవుతూ అమ్మ సమాధి వద్దనుంచి రాజ్‌భవన్‌కు కదిలారు. -
శుభవార్త చెప్తా.. కళకళలాడిన పన్నీర్!
చెన్నై: గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌తో భేటీ అయిన అనంతరం తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ. పన్నీర్ సెల్వం మీడియాతో మాట్లాడారు. నవ్వుతూ కనిపించిన ఆయన ధర్మమే గెలుస్తుందని వ్యాఖ్యానించారు. బలనిరూపణకు తనకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ను కోరినట్టు తెలిపారు. మెజారిటీ ఎమ్మెల్యేలు తమ వెంటే ఉన్నారని మరోసారి చెప్పారు. తనతో బలవంతంగా రాజీనామా చేయించారని, శశికళ ఒత్తిడి చేయడం వల్లే పదవికి రాజీనామా చేశానని ఆయన మీడియాకు చెప్పారు. తనకు అండగా నిలబడిన ఎమ్మెల్యేలకు పన్నీర్ సెల్వం కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే శుభవార్త చెప్తానంటూ ఆయన విలేకరుల సమావేశాన్ని ముగించారు. మద్దతుదారులైన నేతలు, కార్యకర్తల మధ్య పన్నీర్ ఈ సందర్భంగా నవ్వుతూ కనిపించారు. ఆయన నవ్వుతూ కళకళలాడటంతో అభిమానులు రెట్టించిన ఉత్సాహంతో ఆయనకు మద్దతుగా నినాదాలు చేశారు. అయితే, పన్నీర్‌కు ఎంతమంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది? ఆయనకు గవర్నర్ మరో అవకాశం ఇస్తారా? లేదా? అన్నది ఇంకా తేలాల్సి ఉంది. -
గవర్నర్‌తో ఓపీఎస్ భేటీ.. ఏం కోరారు?
చెన్నై: తమిళనాట రాజకీయ సంక్షోభం తారాస్థాయికి చేరిన నేపథ్యంలో ఆ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ. పన్నీర్ సెలం (ఓపీఎస్) గురువారం గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావును కలిశారు. రాజ్‌భవన్‌కు వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. వీరి భేటీ 20నిమిషాల్లోనే ముగియడం గమనార్హం. ముఖ్యమంత్రి పదవి కోసం శశికళ, సెల్వం నువ్వా-నేనా అన్నరీతిలో తలపడుతున్న నేపథ్యంలో గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. అందరి దృష్టి గవర్నర్‌పై నెలకొన్న నేపథ్యంలో జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితిపై వీరు ప్రధానంగా చర్చించినట్టు సమాచారం. మొత్తం తనకు మద్దతుగా ఉన్న ఆరుగురు ఎమ్మెల్యేలతో ఓపీఎస్ గవర్నర్‌ను కలిశారు. అసెంబ్లీలో బలనిరూపణ చేసుకునేందుకు తనకు అవకాశం ఇప్పించాలని ఈ సందర్భంగా ఆయన గవర్నర్‌ను కోరినట్టు సమాచారం. శశికళ ఒత్తిడి చేయడం వల్లే రాజీనామా చేశానని, వీలుంటే తన రాజీనామాను వెనుకకు తీసుకుంటానని కూడా ఓపీఎస్ చెప్పినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి పదవి విషయంలో తనకు మరో అవకాశం ఎందుకు కల్పించాలో ప్రధానంగా సెల్వం.. గవర్నర్‌కు వివరించినట్టు చెప్తున్నారు. తమిళనాడు రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరిచేందుకు ప్రస్తుతం గవర్నర్ ముందు నాలుగు ఆప్షన్స్ ఉన్నాయని, ఈ నాలుగు ఆప్షన్లలో (శశికళను వేచి ఉండమని చెప్పడం, ఆమెను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం, పన్నీర్ సెల్వానికి మరో అవకాశం ఇవ్వడం, రాష్ట్రపతి పాలన విధించడం) ఆయన దేనిని ఎంచుకుంటారన్నది రాజకీయ వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి. -
శశి ప్రమాణం వాయిదా వేయనున్న గవర్నర్?
ఆ విచక్షణాధికారం ఉందంటున్న కాంగ్రెస్ సీనియర్ నేత తమిళనాట అధికార అన్నాడీఎంకేలో సంక్షోభం తారస్థాయిలో చేరిన నేపథ్యంలో గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది సర్వత్రా ఉత్కంఠ రేపుతున్నది. శశికళను ఇప్పటికే అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. తమకు 130 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఆమె వర్గం చెబుతున్నది. తనకు కూడా మెజారిటీ ఉందని, అసెంబ్లీలో బలనిరూపణకు అవకాశమిస్తే.. తన బలమేమిటో నిరూపించుకుంటానని పన్నీర్ సెల్వం చెప్తున్నారు. క్షేత్రస్థాయి వాస్తవాలను చూస్తే ప్రస్తుతం పన్నీర్ సెల్వం వద్దు ఆరుగురు ఎమ్మెల్యేలకు మించి బలం లేదని చెప్తున్నది. దీంతో అంకెల సమీకరణాలు ఇప్పుడు తమిళనాట ప్రాధాన్యం సంతరించుకున్నాయి. శశికళ, పన్నీర్ సెల్వంలలో ఎవరి ముఖ్యమంత్రి కావాలన్న మ్యాజిక్ ఫిగర్ 117 ఉండాల్సిందే. దీంతో మెజారిటీ మద్దతు ఉన్న శశికళను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయాలని గవర్నర్ ఆహ్వానించకతప్పదా? అన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్రమాజీ మంత్రి చిదంబరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఎన్నికైన అధికార పార్టీ నేత ప్రమాణ స్వీకారాన్ని వాయిదా వేయించే విచక్షణాధికారం గవర్నర్‌కు ఉంటుందని ఆయన తెలిపారు. తన పుస్తకం 'ఫియర్లెస్ ఇన్ అపోజిషన్' విడుదల సందర్భంగా ఆయన 'ది హిందూ'తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 'మెజారిటీ సంఖ్యాబలమున్న పార్టీ నాయకుడితో ప్రమాణం చేయించాల్సిన రాజ్యాంగపరమైన బాధ్యత గవర్నర్‌కు ఉంటుంది. ప్రస్తుతమున్న ఆయా కారణాల వల్ల ప్రమాణాన్ని కొద్దిరోజులు వాయిదా వేస్తున్నానని చెప్పే విచక్షణాధికారం కూడా గవర్నర్‌కు ఉంటుంది. ఇది చిన్నపాటి అవకాశం. రాజ్యాంగబద్ధత దీనికి ఉందా? లేదా? అన్నది చూడలేదు కానీ, ఈ అవకాశం గవర్నర్‌కు ఉంటుందని నేను భావిస్తున్నా' అని ఆయన చెప్పారు. ప్రస్తుతం గవర్నర్ ముందు నాలుగు ఆప్షన్స్ ఉన్నాయని, ఈ నాలుగు ఆప్షన్లలో (శశికళను వేచి ఉండమని చెప్పడం, ఆమెను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం, పన్నీర్ సెల్వానికి మరో అవకాశం ఇవ్వడం, రాష్ట్రపతి పాలన విధించడం) ఆయన దేనిని ఎంచుకుంటారన్నది రాజకీయ వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాయిదా ఆప్షన్ కూడా ఆయన ఎంచుకుంటారా? అన్నది చూడాలి అని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. -
విద్యాసాగర్‌కు ఎదురేగిన పన్నీర్ సెల్వం!
చెన్నై: తమిళనాట రాజకీయాలు రాజకీయాలు క్షణక్షణం ఉత్కంఠరేపుతున్న తరుణంలో ఇన్చార్జి గవర్నర్ విద్యాసాగర్‌రావు చెన్నైలో అడుగుపెట్టారు. ఆపద్ధర్మ సీఎం హోదాలో పన్నీర్ సెల్వం ఎదురెళ్లి మరీ విద్యాసాగర్‌కు సాదర స్వాగతం తెలిపారు. ఆయన నేరుగా రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం శశికళ-పన్నీర్ సెల్వాం నువ్వా-నేనా అన్న స్థాయిలో హోరాహోరీగా తలపడుతుండటంతో ఈ సంక్షోభంలో గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. గవర్నర్ నిర్ణయం ఏమిటా.. అని తమిళనాడే కాదు యావత్ దేశం ఎదురుచూస్తున్నది. ఇలాంటి తరుణంలో రాజ్‌భవన్‌లో అడుగుపెట్టిన గవర్నర్ మరికాసేపట్లో డీజీపీ, సీఎస్‌లను కలువబోతున్నారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై ఆయన సమీక్షిస్తారు. ఇప్పటికే మొదట ఓపీఎస్‌కు, ఆ తర్వాత శశికళకు గవర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తరుణంలో గవర్నర్ ముందు నాలుగు ఆప్షన్స్ ఉన్నాయని, ఈ నాలుగు ఆప్షన్లలో (శశికళను వేచి ఉండమని చెప్పడం, ఆమెను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం, పన్నీర్ సెల్వానికి మరో అవకాశం ఇవ్వడం, రాష్ట్రపతి పాలన విధించడం) గవర్నర్ దేనిని ఎంచుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. -
మానవ సేవే ధ్యేయంగా పని చేయాలి
రక్తనిధుల ఏర్పాటులో రెడ్‌క్రాస్‌తో భాగస్వామ్యం వహించాలి ‘వేడుక’ కార్యక్రమంలో రోటరీ ఫౌండేష¯ŒS ప్రతినిధులకు గవర్నర్ సూచన టీసీఎస్ మాజీ సీఈవోకు రోటరీ ఒకేషనల్ ఎక్స్‌లెన్స్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రదానం నడకుదురు (కరప) : దేశంలో పోలియో వ్యాధి నిర్మూలనలో రోటరీ సంస్థ చేసిన సేవలు ప్రశంసనీయమైనవని ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. రక్తనిధుల ఏర్పాటులో ఇండియ¯ŒS రెడ్‌క్రాస్ సంస్థకు సహకరించాలని రోటరీ సంస్థకు ఆయన సూచించారు. కరప మండలం నడకుదురులోని కుసుమ సత్య కన్వెన్స¯ŒS హాలులో శనివారం రోటరీ డిస్ట్రిక్ట్ (3020) ఆధ్వర్యంలో నిర్వహించిన రోటరీ ఫౌండేష¯ŒS సెంటినరీ కాన్పరె¯Œ్స–వేడుకలో గవర్నర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. టీసీఎస్ సంస్థ మాజీ సీఈఓ, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేష¯ŒS పూర్వచైర్మ¯ŒS పద్మశ్రీ ఎస్.రామ్దొరైకు రోటరీసంస్థ ఒకేషనల్ ఎక్స్లె¯Œ్స లైఫ్‌టైమ్ అఛీవ్ మెంట్ అవార్డును గవర్నర్ నరసింహ¯ŒS అందజేశారు. పరిశ్రమ, సేవారంగాల అవసరాలకు అనుగుణంగా విద్యాలయాలు సిలబస్‌ను రూపొందించుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అవార్డు గ్రహీత పద్మశ్రీ రామ్‌దొరై మాట్లాడుతూ నిరంతరం కొత్తనైపుణ్యాలు పెంపొందించుకుంటూ, ఎంచుకున్న రంగంలో అంకితభావంతో పనిచేస్తే విజయాలను, ఉన్నతశిఖరాలను అందుకోవచ్చని యువతకు సందేశాన్నిచ్చారు. తనను సత్కరించిన రోటరీసంస్ధకు రామ్‌దొరై కృతజ్ఞతలు తెలిపారు. రోటరీ ఇంటర్నేషనల్ ప్రతినిధిగా హాజరైన డాక్టర్ వెంకటేష్ మేట¯ŒS మాట్లాడుతూ సంస్థ ప్రెసిడెంట్ జా¯ŒSఅండ్జూడీ సందేశాన్ని, శుభాకాంక్షలను రోటరీ డిస్ట్రిక్ట్ 3020 సభ్యులకు తెలియజేశారు. అట్లాంటాలో జరిగే సంస్థ 2017 వేడుకలకు సభ్యులను ఆహ్వానించారు. రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎస్వీఎస్ రావు తమసంస్థ చేపట్టిన, చేపట్టనున్న సేవా కార్యక్రమాలను వివరించారు. ముందుగా గవర్నర్ నరసింహ¯ŒSకు రోటరీసంస్థ ప్రతినిధులు స్వాగతం పలకగా, గవర్నర్ జ్వోతిప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. కలెక్టర్ అరుణ్‌కుమార్, ఎస్పీ ఎం.రవిప్రకాష్, కేంద్ర మాజీమంత్రి ఎంఎం పళ్లంరాజు, కాకినాడరూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పంతం నానాజీ, నులికుర్తి వెంకటేశ్వరరావు, రోటరీ సభ్యులు ఎస్‌సీహెచ్ రామకృష్ణ, జీకే శ్రీనివాస్, కళ్యాణచక్రవర్తి, ఎల్.సత్యనారాయణ, కేవీఎస్ ఆంజనేయమూర్తి, సీఆర్ మోహ¯ŒS తదితరులు పాల్గొన్నారు. -
నేడు గవర్నర్ రాక
బాలాజీచెరువు (కాకినాడ): ఆంధ్ర , తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహ¯ŒS శనివారం జిల్లాకు రానున్నారు. హైదరాబాద్ నుంచి ఉదయం 8.40 గంటలకు రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టుకు చేరు కుంటారు. అక్కడ నుంచి బయలుదేరి 9.40 గంటలకు కాకినాడ్ ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. అక్కడ పది నిమిషాల విరామం అనంతరం బయలు దేరి కరప మండలం నడకుదురులో కుసుమ సత్య కన్వెష్ష¯ŒS హల్లో జరిగే రోటరీ క్లబ్ ఫౌండేష¯ŒS సెంటీనియల్ సమావేశంలో పాల్గొంటారు. తిరిగి కాకినాడ చేరుకుని గెస్ట్‌హౌస్‌లో విశ్రాం తి తీసుకున్న అనంతరం కాకినాడ నుంచి ఉదయం 11.20 గంటలకు బయలుదేరి మధురపూడి ఎయిర్ పోర్టుకు చేరుకుని హైదరాబాద్ పయనమవుతారు. -
స్వచ్ఛ యానాం అందరి బాధ్యత
ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో మెలగాలి డిజిటల్ ఇండియాకు సహకరించాలి పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీ పిలుపు తాళ్లరేవు : పౌరులు క్రమశిక్షణ అలవర్చుకోవడం ద్వారా బాధ్యతాయుత సమాజం ఏర్పడుతుందని, ఆ దిశగా ప్రతి ఒక్కరూ ఆలోచించాలని, స్వచ్ఛ యానాం కోసం కృషి చేయాలని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీ అన్నారు. మూడు రోజులుగా జరుగుతున్న యానాం 15వ ప్రజా ఉత్సవాలు, 18వ ఫల, పుష్ప ప్రదర్శనలు ఆదివారం ముగిశాయి. ముగింపు వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న కిరణ్‌బేడీ మాట్లాడుతూ, స్వచ్ఛ యానాం కేవలం పారిశుద్ధ్య కార్మికులతోనే సాధ్యం కాదన్నారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటిస్తేనే ఇది సాధ్యమన్నారు. ప్రతి ఒక్కరూ డస్ట్‌బి¯ŒSలు వాడడం నేర్చుకోవాలని, అవి లభ్యం కాకపోతే సీఎస్ఆర్, స్వచ్ఛంద సంస్థల నుంచి సేకరించుకోవాలని సూచించారు. పుదుచ్చేరికంటే యానాంలో ప్రస్తుతం మెరుగైన పరిస్థితి ఉన్నప్పటికీ స్వచ్ఛ యానాం సంకల్పంతో ముందుకెళ్తే మరిన్ని మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. స్వచ్ఛ యానాం ఏర్పడిన తరువాత తాను ఏప్రిల్, మే నెలల్లో మరోమారు వస్తానన్నారు. లక్ష్య సాధనకు కృషి చేసినవారిని స్వయంగా సత్కరిస్తానన్నారు. పుదుచ్చేరిని పరిశుభ్రంగా ఉంచడానికి ఏడు నెలలుగా ఎంతో ప్రయత్నిస్తున్నా, ఇంతవరకూ సాధ్యపడలేదని అన్నారు. డిజిటల్ ఇండియా కార్యక్రమం ఏదో ఒక పార్టీకి సంబంధించింది కాదని, జాతీయ విధానమని అన్నారు. అందరూ నగదు రహిత సమాజానికి కృషి చేయాలన్నారు. పాండిచ్చేరిలో ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉందని, తెచ్చిన అప్పులకు వడ్డీ చెల్లించడానికి మళ్లీ అప్పు తేవాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. అవసరానికి మించి ఉద్యోగ నియామకాలు చేపట్టడం, సంక్షేమ పథకాలను దుర్వినియోగం చేయడమే ఇందుకు ప్రధాన కారణమన్నారు. ఖర్చు తగ్గించుకోవాల్సిన విషయాన్ని సీఎం నారాయణసామి, మంత్రులు పరిగణనలోకి తీసుకోవాలన్నారు. యానాంలో మత్స్యకారులు అధికంగా ఉన్నందున మత్స్య కళాశాల ప్రారంభానికి చర్యలు తీసుకుంటానన్నారు. రూ.97 కోట్లతో టూరిజం ప్రాజెక్టులు : మంత్రి మల్లాడి రానున్న రోజుల్లో యానాంను పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి సుమారు రూ.97 కోట్లతో వివిధ ప్రాజెక్టులు సిద్ధం చేసినట్లు ఆరోగ్య మంత్రి మల్లాడి కృష్ణారావు చెప్పారు. ట్రిపుల్ ఐటీ స్థాపనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం యానాంలోని సుమారు 15 పరిశ్రమలు వేరే ప్రాంతానికి తరలిపోవడంతో ఉపాధి దెబ్బతిందన్నారు. దీనిపై ఇక్కడి ప్రజల తరఫున ప్రధానికి వినతిపత్రం అందజేశామన్నారు. యానాంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ స్థాపించి, 300 మందికి ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి డ్వాక్రా సంఘాలకు పావలా వడ్డీకే రుణాలు మొదలుపెట్టారని, ఆయన స్ఫూర్తితో 2010లో యానాంలో కూడా దీనిని ఆరంభించామన్నారు. జీఎస్పీసీ నుంచి రూ.12 కోట్లు రావాల్సి ఉండగా, రూ.10 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. మిగతా సొమ్ము ఇప్పించేలా కృషి చేయాలన్నారు. యానాం మున్సిపాలిటీ తీవ్ర లోటు బడ్జెట్‌తో ఉందని, రిటైరైన 15 మందికి బెనిఫిట్స్ అందించలేని పరిస్థితి నెలకొందని చెప్పారు. పోలీసు అధికారికి తొలి అవకాశం ప్రజా ఉత్సవాల ముగింపు వేడుకల్లో తొలిగా ప్రసంగించే అవకాశాన్ని పోలీసు శాఖకు ఇవ్వాలని కిరణ్‌బేడీ కోరడంతో యానాం ఎస్పీ నితి¯ŒS గోహల్ మొదట ప్రసంగించారు. యానాంలో 4 అంచెల బీట్ సిస్టమ్ సత్ఫలితాలు ఇస్తోందన్నారు. అనంతరం కిరణ్‌బేడీని మంత్రి మల్లాడి ఘనంగా సత్కరించి, జ్ఞాపిక అందజేసారు. తొలుత సత్కారానికి నిరాకరించిన ఆమె చివరికి అందరి కోరిక మేరకు అంగీకరించారు. అంతకుముందు ఆమె బాలయోగి స్టేడియంలో ఏర్పాటు చేసిన ఫల, పుష్ప ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. సెంటర్ ఆఫ్ అట్రాక్ష¯ŒSగా ఉన్న పుష్పక విమానాన్ని పరిశీలించి ఆనందం వ్యక్తం చేశారు. పలు అంశాలను ఆమె తన సెల్ఫో¯ŒSలో బంధించారు. ముగింపు వేడుకల్లో సినీ నేపథ్య గాయకులు గీతామాధురి తదితరులు ఆలపించిన పాటలతో యువతీ యువకులు ఉత్సాహంతో కేరింతలు కొట్టారు. కాగా, వైఎస్సార్ బొటానికల్ గార్డె¯ŒSలో రూ.82 లక్షలతో 16 అడుగుల ఎత్తు, 8.50 టన్నుల బరువుతో రూపొందించిన మహాత్మాగాంధీ కాంస్య విగ్రహాన్ని కిరణ్‌బేడి, మంత్రి మల్లాడి ఆవిష్కరించారు. యానాంలోని పలు ప్రాంతాల్లో ఆమె పర్యటించి, అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. -
రేపు గవర్నర్ నరసింహన్ పుట్టపర్తి రాక
పుట్టపర్తి టౌన్ : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ శనివారం పుట్టపర్తికి రానున్నట్లు రెవెన్యూ అధికారులు గురువారం తెలిపారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన ప్రత్యేక కాన్వాయ్‌లో శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ఆయన పుట్టపర్తికి చేరుకుంటారన్నారు. మూడు గంటల పాటు పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో గడిపి సత్యసాయి మహాసమాధిని దర్శించుకుంటారన్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఇక్కడి నుంచి ఆయన బయలు దేరుతాయని వారు తెలిపారు. -
ఢిల్లీ కొత్త గవర్నర్ నియామకం!
-
ఢిల్లీ కొత్త గవర్నర్ నియామకం!
న్యూఢిల్లీ: ఢిల్లీ రాష్ట్ర కొత్త లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ)గా అనిల్ బైజల్ నియామకం కానున్నట్లు సమాచారం అందింది. లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు నజీబ్ జంగ్ ఈ నెల 22న పేర్కొన్న విషయం తెలిసిందే. కాగా, బుధవారం జంగ్ రాజీనామాను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. జంగ్ స్ధానంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ లేదా జమ్మూ కశ్మీర్ గవర్నర్ పదవికి బైజల్ పేరును పరిశీలిస్తున్నట్లు తెలిసింది. వాజ్ పేయి ప్రభుత్వ హయాంలో బైజల్ కేంద్ర హోం శాఖ కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. గతంలోనే రెండుసార్లు పదవికి రాజీనామా చేయగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనను పదవిలో కొనసాగాలని కోరారని జంగ్ చెప్పిన విషయం తెలిసిందే. సొంత కారణాలతోనే పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
ఏపీ ఆఫీసులు ఖాళీ చేయాలి
-
ఏపీ ఆఫీసులు ఖాళీ చేయాలి
► గవర్నర్ దృష్టికి తీసుకెళ్లిన సీఎం కేసీఆర్ ► కొత్త సచివాలయ నిర్మాణం దృష్ట్యా తరలింపు ► పత్యామ్నాయ ఆవాసం కల్పిస్తామంటూ సీఎస్ లేఖ ► తాత్కాలిక సచివాలయంగా బూర్గుల భవన్? ► శాఖల తరలింపునకు మరిన్ని భవనాల పరిశీలన సాక్షి, హైదరాబాద్: కొత్త సచివాలయం నిర్మాణంపై గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌తో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చర్చించారు. కొత్త సచివాలయాన్ని ప్రస్తుతమున్న చోటే నిర్మించే ఆలోచనను ఆయనతో పంచుకున్నారు. సోమవారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో ఆయన దాదాపు అరగంటసేపు సమావేశమయ్యారు. సచివాలయ నిర్మాణంతో పాటు భూ సేకరణ చట్టానికి సంబంధించిన ఆర్డినెన్స్‌పైనా ఈ సందర్భంగా చర్చ జరిగినట్టు తెలిసింది. కొత్త జిల్లాల ఏర్పాటు, పాలన సౌలభ్యానికి వీలుగా ప్రభుత్వం చేపట్టిన పునర్వ్యవస్థీకరణకు ప్రజల నుంచి వచ్చిన స్పందన తదితరాలపైనా చర్చ జరిగింది. కొత్త సచివాలయ నిర్మాణానికి నవంబర్‌లో పునాది రాయి వేయాలని సీఎం భావిస్తున్నారు. దాంతో సచివాలయంలోని కార్యాలయాలన్నిటినీ తాత్కాలికంగా మరో చోటికి తరలించటం అనివార్యమైంది. ఇదే ప్రాంగణంలో ఏపీకి చెందిన కార్యాలయాలు కూడా ఉన్నాయి. కొత్త నిర్మాణానికి వీలుగా వాటిని సైతం ఖాళీ చేయించాలని, వాటికి తాత్కాలికంగా మరో చోట వసతి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాకపోతే ఇది విభజనతో ముడిపడి ఉన్న సున్నితమైన అంశం కావటంతో ముందస్తుగా విషయాన్ని గవర్నర్‌కు సీఎం నివేదించినట్లు తెలుస్తోంది. సచివాలయంలో ఉన్న భవనాలను ఖాళీ చేయాలని, ప్రత్యామ్నాయ భవనాలను సమకూరుస్తామని ప్రతిపాదిస్తూతెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఏపీ సీఎస్‌కు లేఖ రాసింది. దీంతోపాటు భూ సేకరణకు సంబంధించి ప్రస్తుతమున్న జీవోలకు బదులు చట్టం తేవాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రివర్గం ఆమోదంతో ఆర్డినెన్స్ రూపంలో ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. గవర్నర్‌తో భేటీలో ఈ అంశమూ చర్చకు వచ్చినట్టు తెలిసింది. ప్రత్యామ్నాయ భవనాల పరిశీలన సచివాలయంలోని కార్యాలయాలను తాత్కాలికంగా తరలించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ రాజీవ్‌శర్మ సోమవారం సచివాలయానికి దగ్గరగా ఉన్న బూర్గుల రామకృష్ణారావు భవన్‌ను పరిశీలించారు. సీఎం కార్యాలయంతో పాటు కీలక విభాగాలను ఇందులోకి మార్చే అవకాశాలను సమీక్షించారు. దీంతోపాటు అరణ్య భవన్, ఎర్రమంజిల్‌లోని ఆర్ అండ్ బీ కార్యాలయం, జలసౌధ, హిమాయత్‌నగర్‌లోని గృహ నిర్మాణ శాఖ భవన్‌లోకి సంబంధిత శాఖలను తరలించాలని నిర్ణయించారు. మిగతా శాఖల కార్యాలయాలను బీఆర్కే భవన్‌లోని ఏయే బ్లాక్‌లకు తరలించాలనే ప్రణాళికను రూపొందిస్తున్నారు. -
బాంబు పేల్చిన జయ సన్నిహితురాలు
-
విద్యార్థులకు న్యాయం చేయండి
-
విద్యార్థులకు న్యాయం చేయండి: రఘువీరా
హైదరాబాద్: మెడికల్ కౌన్సిలింగ్ లో ఏపీ ప్రభుత్వం అనుసరించిన అసంబద్ధ విధానాల మూలంగా రిజర్వేషన్ ఉన్న విద్యార్ధులు తీవ్రంగా నష్ట పోయారని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎన్. రఘువీరా రెడ్డి ఆరోపించారు. వారికి న్యాయం చేయాలని ఆయన గవర్నర్ నరసింహన్ కు లేఖ రాశారు. తెలంగాణ మెడికల్ కౌన్సిలింగ్ పూర్తి కాకుండానే ఏపీలో సీట్లు భర్తీ చేశారని దీంతో 550 సీట్లు బ్లాక్ చేయబడ్డాయని, పద్మావతీ కళాశాలలో సీట్లు విడిగా భర్తీ చేయడం, 127 సీట్లు బ్లాక్ చేశారని ఆరోపించారు. నిత్యం బడుగుల పక్షపాత ప్రభుత్వం అని చెప్పుకునే ప్రభుత్వం ఇందుకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మొదటి విడత కౌన్సిలింగ్లో ఓపెన్ కేటగిరీలో కటాఫ్ ర్యాంకు 2283 అయితే నాల్గవ కౌన్సిలింగ్ కి వచ్చే సరికి ఆ ర్యాంకు 3354 కు పెరిగిందని పేర్కొన్నారు. దీంతో 2283 ర్యాంకు తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, విద్యార్థులు తీవ్రంగా నష్ట పోయారని వారందరికీ న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన గవర్నర్ కు రఘువీరా విజ్ఞప్తి చేశారు. -
అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ తొలగింపు
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ జేపీ రాజ్కోవాను పదవి నుంచి తొలగిస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నిర్ణయం తీసుకున్నారు. మేఘాలయ గవర్నర్ షన్ముగనాథన్కు అదనంగా అరుణాచల్ ప్రదేశ్ బాధ్యతలను అప్పగించారు. ఆరోగ్య కారణాల రిత్యా రాజ్కోవాను రాజీనామా చేయాల్సిందిగా కేంద్రం ఇటీవల కోరిన విషయం తెలిసిందే. అయితే రాజ్కోవా మాత్రం తాను ఆరోగ్యంగానే ఉన్నానని, విధులను సక్రమంగానే నిర్వర్తిస్తున్నానని రాజీనామా చేయడానికి నిరాకరించారు. అవసరమైతే రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా తొలగించాలని, అప్పటివరకు రాజీనామా చేసే ప్రసక్తే లేదని రాజ్కోవా ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే అతడిని తప్పిస్తూ సోమవారం ప్రణబ్ ముఖర్జీ ఉత్తర్వులు జారీ చేశారు. -
నేడు గవర్నర్‌తో టీటీడీపీ నేతల భేటీ
రాయికల్ : భూసేకరణ చట్టం 2013 అమలు చేయాలని, ఎంసెట్ లీకేజీ కారకులైన మంత్రులను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం టీటీడీపీ ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు గవర్నర్‌తో భేటి కానున్నట్లు ఆ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ తెలిపారు. కరీంనగర్ జిల్లా రాయికల్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మారి తన కుటుంబ ప్రయోజనాల కోసం గత ప్రాజెక్టులు పూర్తి చేయకుండా కొత్త ప్రాజెక్టులు కడుతున్నారని ఆరోపించారు. ఇప్పటివరకు పదహారుసార్లు హైకోర్టు ప్రభుత్వానికి పలు జీవోలపై మొట్టికాయ వేసిందని గుర్తుచేశారు. ఎంసెట్ లీకేజీ నైతిక బాధ్యత వహిస్తూ విద్య, వైద్యశాఖ మంత్రులను వెంటనే బర్తరఫ్ చేయాలన్నారు. ఈ మేరకు పార్టీ నాయకులతో గవర్నర్‌తో కలిసివినతిపత్రం సమర్పించనున్నట్లు తెలిపారు. -
త్రిపుర గవర్నర్‌కు అరుణాచల్ ప్రదేశ్ బాధ్యతలు
న్యూఢిల్లీ: త్రిపుర గవర్నర్ తథగట రాయ్‌కు అదనంగా అరుణాచల్ ప్రదేశ్ బాధ్యతలు అప్పగిస్తూ బుధవారం రాష్ట్రపతి భవన్ నిర్ణయం తీసుకుంది. అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ జేపీ రాజ్కోవా అనారోగ్యంతో సెలవుపై ఉన్న కారణంగా తథగట రాయ్‌కు రాష్ట్రపతి అదనపు బాధ్యతలు అప్పగించినట్లు రాష్ట్రపతి భవన్ పత్రికా ప్రకటనలో వెల్లడించింది. అయితే రాజ్కోవా సెలవు కాలాన్ని మాత్రం రాష్ట్రపతి భవన్ తెలుపలేదు. రాజ్కోవా(72) అనారోగ్యంతో మంగళవారం కోయంబత్తూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. -
తెలంగాణ జడ్జీల మూకుమ్మడి రాజీనామా
హైదరాబాద్: ఆప్షన్ విధానాన్ని నిరసిస్తూ తెలంగాణ జడ్జీలు మూకుమ్మడిగా రాజీనామాకు సిద్ధపడ్డారు. తెలంగాణ జడ్జీల రాజీనామా లేఖలను జడ్జెస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్‌కు ఇచ్చారు. అనంతరం గన్‌పార్క్ నుంచి రాజ్‌భవన్ వరకు న్యాయాధికారులు గవర్నర్‌ను కలిసి రాజీనామా పత్రాలు ఇవ్వడానికి ర్యాలీగా బయలుదేరారు. గవర్నర్ అపాయింట్మెంట్ లేకపోవడంతో జడ్జీలను అడ్డుకునేందుకు రాజ్‌భవన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. -
అస్సాం సీఎం రాజీనామా
గువాహటి: అస్సాం సీఎం తరుణ్ గొగొయ్ గవర్నర్ పద్మనాభ బాలకృష్ణ ఆచార్యను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు. గొగొయ్ రాష్ట్రానికి మూడు సార్లు వరుసగా ముఖ్యమంత్రి గా సేవలందించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 26 స్థానాలను గెలుపొందిన విషయం తెలిసిందే. అస్సాం శాసనసభలో మొత్తం 126 స్థానాలున్నాయి. -
ఢిల్లీ చేరుకున్న గవర్నర్ నరసింహన్
ఢిల్లీ: తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఢిల్లీకి చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీలను సోమవారం ఆయన కలువనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులను ఈ పర్యటనలో ఆయన కేంద్రానికి వివరించనున్నారు. విభజన చట్టంలోని పెండింగ్ అంశాలు సైతం ఈ పర్యటనలో చర్చకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. -
ఎవరింట్లో పెళ్లనుకుంటున్నారు?
► యాదాద్రి లక్ష్మీనరసింహుడి కల్యాణం ఆలస్యంపై గవర్నర్ నరసింహన్ ఫైర్ ► సమయం ఎందుకు పాటించడం లేదంటూ ఆలయ ఈవోపై మండిపాటు ► సమయం ప్రకారం జరపరా అంటూ ఆగ్రహం ► మాంగళ్య ధారణ పూర్తవకముందే అర్ధంతరంగా హైదరాబాద్‌కు తిరుగుపయనం సాక్షి ప్రతినిధి, నల్లగొండ: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణ మహోత్సవానికి హాజరైన రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ఆయన సతీమణి విమలా నరసింహన్ అర్ధంతరంగా వెళ్లిపోయారు. ఎప్పుడూ భక్తిశ్రద్ధలతో, దైవ కార్యక్రమాలను తు.చ. తప్పకుండా పాటించే గవర్నర్.. సతీసమేతంగా లక్ష్మీనరసింహుడి కల్యాణ వేడుక నుంచి మధ్యలోనే వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. యాదగిరీశుడి కల్యాణం ముహూర్త సమయాని కన్నా ఆలస్యంగా జరుగుతుందన్న కారణంతో ఆలయ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారని, కొంతసేపు కూర్చుని ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయారని తెలుస్తోంది! అసలేమైందంటే..? గవర్నర్ నరసింహన్ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవంలో పాల్గొనేందుకు గురువారం రాత్రి 8:30 గంటలకు సతీసమేతంగా యాదాద్రికి వచ్చారు. కల్యాణం జరిగే మండపంలో ఆశీనులై పెళ్లి తంతును తిలకించారు. అయితే, ముహూర్తం ప్రకారం స్వామి వారి ఉరేగింపు 9:45 గంటలకు కల్యాణ మండపానికి రావాల్సి ఉంది. కానీ 18 నిమిషాలు ఆలస్యంగా 10:03 నిమిషాలకు వచ్చింది. దీంతో గవర్నర్ నరసింహన్ ఆలయ ఈవో గీతారెడ్డిని ఆలస్యం ఎందుకు అయిందని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. మరికొందరు ప్రజాప్రతినిధులు రావాల్సి ఉందని, అందుకే పావుగంట ఆలస్యంగా కల్యాణం నిర్వహిస్తున్నామని ఈవో బదులిచ్చినట్టు సమాచారం. దీంతో గవర్నర్ నరసింహన్ ఆలయ ఈవోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఇష్ట ప్రకారం చేయడానికి ఎవరింట్లో పెళ్లనుకుంటున్నారు? అన్నీ సమయం ప్రకారం ఎందుకు జరపడం లేదు? అని ప్రశ్నించినట్టు సమాచారం. దీంతో ఈవో గీత వెంటనే పూజాది కార్యక్రమాలను ప్రారంభించాలని అర్చకులకు సూచించారని తెలుస్తోంది. ఎవరో రావాలన్న ఆలోచనతో స్వామివారి కల్యాణాన్ని ఆలస్యంగా చేస్తున్నారనే కారణంతో నరసింహన్ తన సతీమణితో కలిసి 10:45 గంటల సమయంలో కల్యాణ వేడుక నుంచి అర్ధంతరంగా లేచి వెళ్లిపోయారు. గవర్నర్ వెళ్లే సమయానికి మాంగళ్య ధారణ కార్యక్రమం కూడా పూర్తి కాకపోవడం, పెళ్లికి వచ్చిన దుస్తులతోనే ఆయన వాహనంలో ఎక్కి వెళ్లిపోయారు. గవర్నర్ వెళ్లిన తర్వాత 40 నిమిషాలకు అంటే 11: 25 నిమిషాలకు స్వామి వారి కల్యాణ ఘట్టం ముగియడం గమనార్హం. రాయగిరి కట్ట మీద ఉన్న మైసమ్మ దేవాలయం వద్ద తన వాహనశ్రేణిని ఆపిన గవర్నర్ అక్కడ దుస్తులు మార్చుకుని హైదరాబాద్ వెళ్లినట్టు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. -
మార్చి బడ్జెట్ మార్చ్!
అక్షర తూణీరం నెలకి ఇరవై వేలు వచ్చే వేతన జీవి ఉంటాడు. ఆ జీవికి నెల నెలా ఇంటద్దె, ఇతర బిల్లులు, పాలు, సరుకులు, పిల్లల ఫీజులు వగైరా అన్నీ పోను వెయ్యో అరవెయ్యో మిగుల్తుంది. నెలవారీ బిల్లులే గాక అనేక బిల్లులుంటాయి. తప్పనిసరి ప్రయాణాలు, పండుగలూ పబ్బాలు, చుట్టాలు పక్కాలు, బైకు రిపేర్లు తగుల్తాయి. వాటిని తట్టుకోవాలి. ఆ ఉద్యోగి అన్నీ పోను మిగిలిన నాలుగు డబ్బులే తనవిగా భావిస్తాడు. రాష్ట్ర బడ్జెట్ లక్షా ముప్పై అయిదు కోట్లని ఘనంగా మొదలు పెట్టక్కరలేదు. జీతాలు నాతాలు, తరుగులు, ఆమాంబాపతులన్నీ పోను ప్రజోపయోగానికి ఎన్ని రూపాయలు ఖర్చు చేస్తామన్నదే పాయింటు. దాన్ని మూడుముక్కల్లో ఆర్థిక మంత్రి చెబితే చాలు. దానికి అన్ని పేజీల, అన్ని గంటల సుదీర్ఘ సుత్తి చాలా అనవసరం. ఏటేటా రూపాయి బరువు తగ్గి పోతుండటం వల్ల రాశి పెరిగిపోతుంటే, దాన్ని అభివృద్ధిగా సూచించబోవడం మోసం. ప్రతి మార్చిలోనూ బడ్జెట్ మార్చ్ ఒక పెద్ద ఫార్స్. ఈ విన్యాసంలో రాష్ట్ర గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడం ముఖ్య తంతు. ప్రభుత్వం తలపెట్టిన పథకాలను, ఆశలను, ఆశయాలను, ఆకాంక్షలనూ కుండబద్దలు కొట్టినట్లు నిర్భయంగా గవర్నర్ ప్రసంగపాఠాన్ని వల్లిస్తారు. ఈ వ్యవహారంలోని కర్త కర్మ క్రియలలో ఆయనకు ప్రమేయం ఉండదు. పాపం పుణ్యం శ్లేషార్థాలు ఆయనకు తెలియవు. ఒక రోజు ముందు ప్రసంగ పూర్తి పాఠాన్ని విడివిడిగా టైపు చేసి గవర్నర్ సారుకి స్వయంగా అధికారపక్షం అంది స్తుంది. పోర్షన్ ముందుగా అనుకున్న ఉత్తమ నటుడిలాగా ఆయన వాకింగ్‌కి ముందూ, సాయంత్రం స్నాక్ తర్వాత దాన్ని చదువుకుంటారు. ప్రాజెక్టుల పేర్లూ, విరామ చిహ్నాలు ఒకటికి రెండు సార్లు చూసుకుంటారు. కాన్ఫిడెన్స్‌ని, కాగితాలను చుట్టపెట్టుకుని సభ పోడి యం ముందుకు వస్తారు. ఉభయ సభ లను అడ్రస్ చేసి, ఆనక భావయుక్తంగా ప్రసంగం చదివే ప్రయత్నం చేస్తారు. కొన్ని వాక్యాలు వచ్చినపుడు అధికార సభ్యులు చప్పట్లతో, బల్ల చరుపులతో హర్షామోదాలు తెల్పుతూ ఉంటారు. అప్పుడప్పుడు అమాత్యుల ప్రతిధ్వనులు క్లోజప్‌లో కనిపిస్తాయి. ముఖ్యమంత్రి గంభీరముద్రతో గర్వాన్ని దిగమింగుతూ ఉంటారు. స్క్రిప్టుని రచించింది, నగిషీలు చెక్కిందీ వారే! అయినా ఏమీ ఎరగనట్టు అప్పుడే విని తెలుసుకుంటున్నట్టు హావభావాలను సభ్యులు ప్రదర్శిస్తారు. మొత్తం మీద ఈ నాటకాన్ని టీమ్ స్పిరిట్‌తో రక్తి కట్టిస్తారు. సభల ద్వారా రాష్ట్ర ప్రజలకు దిశానిర్దేశం చేసిన గవర్నర్ గారికి అధికార లాంఛనాలతో రాజ్‌భవన్‌లో దిష్టి తీస్తారు! మర్నాడు మరో అంతర్నాటకానికి తెర లేస్తుంది. గవర్నర్‌కి సభ్యులంతా ధన్యవాదాలు చెప్పడం. ఇదొక ప్రహసనం. విపక్షం ససేమిరా అంటుంది. ప్రసంగం ఓపిగ్గా విన్నందుకు మాకే థాంక్స్ చెప్పాలని పట్టుబడతారు. హిజ్ మాస్టర్ వాయిస్‌గా మాట్లాడిన గవర్నర్ ప్రసంగంలో పస లేదంటారు. సరిగ్గా ఇలాంటి చోద్యమే ఢిల్లీ పార్లమెంట్ హాల్లోనూ జరుగుతుంది. పాపం అకారణంగా దేశ ప్రథమపౌరులను ఏటా ఒకసారి న్యూనత పరచడం ఏమాత్రం భావ్యం కాదు. పెద్దలు ఆలోచించాలి. ధన్యవాదాలు వద్దు, దాష్టీకాలు వద్దు. (వ్యాసకర్త ప్రముఖ కథకుడు, శ్రీరమణ) -
నేడు విశాఖ రానున్న రాష్ట్రపతి, ప్రధాని
విశాఖపట్నం: ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ వేడుకలు శుక్రవారం ఐఎన్ఎస్ శాతవాహన కమాండ్ స్టేడియంలో జరగనున్నాయి. ఈ వేడుకలకు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ హాజరుకానున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోదీ నేడు రాత్రి విశాఖ చేరుకోనున్నారు. ఈ వేడుకలకు దేశవిదేశాల నుంచి 11 వేల నేవీ ప్రతినిధులు హాజరుకానున్నారు. శనివారం జరిగే తూర్పు నౌకాదళ సమీక్షలో రాష్ట్రపతి పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి ప్రధాని గౌరవ అతిథిగా హాజరుకానున్నారు. ఫ్లీట్ రివ్యూ బ్రాండ్ అంబాసిడర్లుగా బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, కంగనా రనౌత్ వ్యవహరిస్తున్నారు. వీఐపీల రాక సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సింథియా నుంచి కాన్వెంట్ జంక్షన్ వరకు వాహనాలను నిషేధించారు. ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు, శనివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు ఆంక్షలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. -
గవర్నర్‌ను కలిసిన తెలంగాణ బీజేపీ నేతలు
-
గవర్నర్‌ను కలిసిన తెలంగాణ బీజేపీ నేతలు
హైదరాబాద్: అధికార టీఆర్ఎస్ జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రక్రియను కుదించేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపిస్తూ తెలంగాణ బీజేపీ నేతలు శుక్రవారం ఉదయం గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రిజర్వేషన్ వ్యవహారంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా భాజపా ఎమ్మెల్యే లక్ష్మణ్ మాట్లాడుతూ.. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా కేటాయించిన రిజర్వేషన్లను ఇతర పార్టీలకు తెలియకుండా అధికార పార్టీ గోప్యంగా ఉంచిందని అన్నారు. టీఆర్ఎస్ అక్రమాలను అరికట్టాలని గవర్నర్‌ను కోరినట్లు తెలిపారు. -
'ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించాలి'
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నేతలు శుక్రవారం ఉదయం గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. గ్రేటర్ ఎన్నికలను ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, శాసనసభా పక్షనేత జానారెడ్డితో పాటు పలువురు సీనియర్ నేతలు గవర్నర్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రేటర్ లో గెలుపుకోసం టీఆర్ఎస్ అక్రమాలకు పాల్పడుతోందని విమర్శించారు. డివిజన్ ల విభజనలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపించారు. రిజర్వేషన్ ల కెటాయింపుల్లోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరిగినట్లు తెలిపారు. కోర్టు తీర్పు ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల షెడ్యూల్ కుదిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై గురువారం హై కోర్టు స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.