గవర్నర్ పదవీ కాలం పొడిగింపు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ పదవీకాలాన్ని కేంద్రం తాత్కాలికంగా పొడిగించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకూ గవర్నర్‌గా కొనసాగాలని కేంద్ర హోంశాఖ మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. మంగళవారంతో ఆయన మూడో విడత పదవీకాలం ముగుస్తుండటంతో కేంద్రం ఆయన పదవీ కాలాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
నరసింహన్ 2009 డిసెంబర్ 27న ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు గవర్నర్‌గాపని చేస్తున్న ఎన్.డీ. తివారీ సెక్స్ కుంభకోణంలో ఆరోపణలు రావటంతో తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం నరసింహన్ పదవీ బాధ్యతలు స్వీకరించారు.