సాక్షి, ఢిల్లీ: కొద్ది రోజులుగా తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా రాష్ట్రంలో తీవ్ర నష్టం ఏర్పడింది. పలుచోట్ల ఇళ్లు కూలిపోయి, ఇంట్లోకి నీరు చేరడంతో బాధితులకు తీవ్ర నష్టం జరిగింది. ఇక, రాష్ట్రవ్యాప్తంగా పంటలకు నీట మునిగాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో వరద నష్టం వివరాలు రాష్ట్రం పంపించక పోవడంపై కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసింది.
తాజాగా, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. ఈ సందర్భంగా తెలంగాణ వరద నష్టం వివరాలు కేంద్రానికి పంపక పోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలో వరద నష్టం వివరాలు నిర్ణీత ఫార్మాట్‌లో తక్షణమే పంపాలని హోం శాఖ సూచించింది. రూ.1,345 కోట్లు ఎస్‌డీఆర్‌ఎఫ్ నిధులు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. అలాగే, వరదల సందర్భంగా సాయం కోసం ఇప్పటికే 12 ఎన్‌డీఆర్‌ఎఫ్ దళాలు, రెండు హెలికాప్టర్లు పంపించినట్లు లేఖలో పేర్కొంది.
ఇక, ఎస్‌డీఆర్‌ఎఫ్ నిధికి కేంద్రం వాటా నిధుల విడుదల కోసం తక్షణమే వివరాలు పంపాలని ఆదేశించింది. ఇదే సమయంలో జూన్‌లో రూ.208కోట్ల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి వినతి రాలేదని కేంద్రం స్పష్టం చేసింది. ఇది వరకు ఖర్చు చేసిన వాటి యుటీలైజేషన్ సర్టిఫిటెక్స్, వరద నష్టం వివరాలు పంపాలని కోరింది. వరద నష్టం వివరాలను ఎప్పటికప్పుడు రోజువారీగా పంపించాలని లేఖలో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment