బెంగళూరు: మైసూరు అర్భన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) కుంభకోణం ప్రస్తుతం కర్ణాటకలో కలకలం రేపుతోంది. ఈ కేసులో ఏకంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను విచారించేందు రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ అనుమతి మంజూరు చేశారు. దీంతో సీఎంకు రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం సీఎం సిద్ధరామయ్య అత్యవసర కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘గవర్నర్ ప్రజాస్వామమ్యానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. విజయనగరలో అక్రమంగా భూములు కేటాయించలేదు. కేంద్రం చెప్పినట్లుగా గవర్నర్ నడుచుకుంటున్నారు. బీజేపీ ప్రతినిధిగా ఆయన వ్యవహరిస్తున్నారు. గవర్నర్ వ్యవహార శైలిని ఖండిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేంద్రంలోని బీజేపీ కుట్రలు చేస్తోంది. అందుకు గవర్నర్ థావర్‌ను పావుగా వాడుకుంటోంది. దీనిపై న్యాయ పోరాటం చేస్తాం’’ అని సిద్ధరామయ్య అన్నారు.
Bengaluru | On Karnataka Governor granting permission to prosecute him in the alleged MUDA scam, CM Siddaramaiah says, "We have called an urgent cabinet meeting today. I thank DK Shivakumar and all my ministers. Congress party also stands with me. Congress workers are also… pic.twitter.com/z4GIw7ZWSa
— ANI (@ANI) August 17, 2024
చదవండి: MUDA Scam: ‘కాంగ్రెస్ సర్కార్‌ను కూల్చే కుట్రే ఇది’
Comments
Please login to add a commentAdd a comment