హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నేతలు శుక్రవారం ఉదయం గవర్నర్ నరసింహన్ను కలిశారు. గ్రేటర్ ఎన్నికలను ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి, శాసనసభా పక్షనేత జానారెడ్డితో పాటు పలువురు సీనియర్ నేతలు గవర్నర్ను కలిసి వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఉత్తమ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రేటర్ లో గెలుపుకోసం టీఆర్ఎస్ అక్రమాలకు పాల్పడుతోందని విమర్శించారు. డివిజన్ ల విభజనలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపించారు. రిజర్వేషన్ ల కెటాయింపుల్లోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరిగినట్లు తెలిపారు. కోర్టు తీర్పు ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల షెడ్యూల్ కుదిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై గురువారం హై కోర్టు స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.