
సాక్షి, హైదరాబాద్: మానసిక రుగ్మతలను ముందే గుర్తించి చికిత్స అందిస్తే తీవ్ర పరిణామాలను నివారించగలమని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ తెలంగాణ విభాగం 7వ వార్షిక సదస్సును శనివారం ఆమె రాజ్‌భవన్ నుంచి వర్చువల్‌గా ప్రారం భించి మాట్లాడారు. దేశంలో ప్రతీ ఆరుగురిలో ఒకరు మానసిక సమస్యలతో బాధపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్–19 తర్వాత ఈ రుగ్మతలు ఎక్కువయ్యాయని తెలిపారు. మానసిక సమస్యల వల్ల దేశం 2012–30 మధ్య కాలం లో 1.3 ట్రిలియన్ డాలర్లను నష్టపోనుందని గవర్నర్ ఓ సర్వేను ఉటంకించారు. ప్రస్తుత పరిస్థితుల్లో మానసిక సమస్యల పట్ల అందరూ అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు. మానసిక రుగ్మతలతో బాధపడే వ్యక్తులను చిన్నచూపు చూడవద్దని, వారిపట్ల వివక్ష ప్రదర్శించవద్దని కోరారు. మానసిక సమస్యల గురించి కొందరు ప్రముఖులు బహిరంగంగా మాట్లాడి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారని గవర్నర్ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment