
సాక్షి, తిరుమల: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆమెకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో టీటీడీ అడిషనల్ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలంగాణ గవర్నర్‌కు శ్రీవారి లడ్డూ ప్రసాదాలు, చిత్రపటం అందించి, ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా తమిళిసై మాట్లాడుతూ గవర్నర్ హోదాలో తొలిసారి తిరుమలేశుని ఆశీస్సులు పొందడం చాలా ఆనందంగా ఉందన్నారు. శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తుల కోసం టీటీడీ చేస్తున్న ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment