శశి నుంచి మా మంత్రిని కాపాడండి! | MLA goes missing, complaint filed | Sakshi
Sakshi News home page

శశి నుంచి మా మంత్రిని కాపాడండి!

Published Sun, Feb 12 2017 11:54 AM | Last Updated on Tue, Sep 5 2017 3:33 AM

శశి నుంచి మా మంత్రిని కాపాడండి!

శశి నుంచి మా మంత్రిని కాపాడండి!

చెన్నై: తమిళనాడులోని తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో పోలీసు స్టేషన్‌కు ఓ అనూహ్య ఫిర్యాదు వచ్చింది. తమ నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఆర్‌ దురైకన్ను కనిపించడం లేదని ఓ విశ్రాంత ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. శశికళ, ఆమె కుటుంబ కబంధ హస్తాల నుంచి తమ ఎమ్మెల్యేను కాపాడాలని ఆయన ఫిర్యాదులో కోరారు.

67 ఏళ్ల బీహెచ్‌ఈఎల్‌ విశ్రాంత ఉద్యోగి అయిన కే మహాలింగం ఈమేరకు పాపనాశనం పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించారు. మహాలింగం అన్నాడీఎంకేలో చురుకైన కార్యకర్త. శశికళపై పన్నీర్‌ సెల్వం తిరుగుబాటు చేసిననాటి నుంచి ఎమ్మెల్యే దురైకన్ను కనిపించడం లేదని, ఆయనను శశికళ, ఆమె కుటుంబసభ్యులు బలవంతంగా నిర్బంధించారని తన ఫిర్యాదులో ఆరోపించారు. ఆయన ఫిర్యాదును స్వీకరించిన స్పెషల్‌ ఎస్సై ముగుగేషన్‌ స్వయంగా.. పిటిషన్‌ను ధ్రువీకరిస్తూ రిసిప్ట్‌ కూడా ఇవ్వడం గమనార్హం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement