తండ్రి కొడుకులిద్దరూ ఒకే ఉద్యోగాలు చేయ్యొచ్చు. లేదా ఇద్దరూ ఒకే డిపార్ట్‌మెంట్‌లో పనిచెయ్యొచ్చు. ఇంకాస్త ముందుకెళ్తే తండ్రికి పై అధికారిగా కొడుకులు ఉన్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఇలా తండ్రి రిటైర్మెంట్ ఆర్డర్‌పై కొడుకు సంతకం చేసే అవకాశం ఎవ్వరికో గానీ దక్కదు. ఇది అలాంటి ఇలాంటి గౌరవం కాదు. ఎంత పుణ్యం చేసుకుంటే ఇలాంటి అదృష్టం దక్కుతుందో అనిపిస్తుంది. ఈ అరుదైన ఘటన రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లాలో చోటు చేసుకుంది.
బాంద్రాలోని నోఖా, బికనేర్‌లోని ప్రభుత్వ హయ్యర్ సెకండరీ పాఠశాల ఉపాధ్యాయుడు పనిచేస్తునన్న జోగరామ్ జాట్‌కి ఆ అరుదైన అదృష్టం, గౌరవం లభించాయి. అతడు పనిచేస్తున్న ప్రభత్వ హయ్యర్ సెకండరీ పాఠశాలలోనే కొడుకు శ్యామ్‌సుందర్ చౌదరి ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఈ తండ్రి కొడుకులిద్దరూ ఈ ప్రభుత్వ స్కూల్‌కి 2016లో ట్రాన్స్‌ఫర్ అయ్యారు. వీరిద్దరూ ఒకే పాఠశాలలో పిల్లలకు పాఠాలు చెబుతున్నారు. జోగారామ్ 39 ఏళ్ల 2 నెలల 20 రోజులు ఉపాధ్యాయుడిగా పనిచేసి మంగళవారమే పదవీ విరమణ చేశారు.
ఆ రిటైర్మ్ంట్ ఆర్డర్‌పై తన కొడుకే సంతకం చేయడంతో ఈ పదవీవిరమణ మర్చిపోలేని మధురాతి ఘట్టం ఆ తండ్రికి. జోగారామ్ కూడా ఇలాంటి అదృష్టం ఎవరికీ దక్కుతుందంటూ కళ్లు చెమర్చాడు. ఈ సమయంలో తనకు ఇంతకు మించి గౌరవడం ఇంకేముంటుందని భావోద్వేగం చెందాడు. ఈ మేరకు జోగరామ్ జాట్ మాట్లాడుతూ..తాను 1985ల ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం వచ్చిందని, అక్టోబర్ 12న విధుల్లో జాయిన్ అయినట్లు చెప్పుకొచ్చారు.
ఈ రోజు తన కొడుకు చేతుల మీదుగా పదవీవిరమణ చేయడం ఎంతో సంతోషంగా ఉందని, ఎన్నటికీ మర్చిపోలేని సంతోషకరమైన సందర్భం అని అన్నారు. అలాగే కొడుకు శ్యామ్ సుందర్ కూడా తన తండ్రి పదవీవిరమణ ఆర్డర్‌పై తానే సంతకం చేయడం అనేది మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉందన్నారు. ఇక శ్యామ్ సుందర్ 2011 అక్టోబరు 13న తనకు టీచర్‌న ఉద్యోగం వచ్చిందని చెప్పారు.
ఆ తర్వాత జూలై20, 2015న కెమిస్ట్రీ స్కూల్ టీచర్ కెరీర్ ప్రారభించారు. అలా ఫిబ్రవరి 28, 2023న వైస్ ప్రిన్సిపాల్ అయ్యారు. ఆ తరువాత, అతను అక్టోబర్ 01, 2023 నుంచి తాత్కాలిక ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నాట్లు సమాచారం. అంతేగాదు శ్యామ్ సుందర్ చౌదరి పాఠశాలలో చేసిన కృషికి 2022లో రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయ గౌరవాన్ని కూడా పొందారు.
కాగా, మరో గొప్ప విషయం ఏంటంటే.. పదవీ విరమణ తర్వాత, జోగారం జాట్ ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్ బాంద్రాకు రూ. 31000, ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్ కెడ్లికి రూ. 11000, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల కెడ్లికి రూ. 5100 విరాళం అందించి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఇలాంటి అరుదైన గౌరవం, అదృష్టం నూటికి ఒక్క తండ్రికి దక్కుతుందేమో కదూ..!.
(చదవండి: ఐఐటీ నిరాకరిస్తే..ఏకంగా ఎంఐటీ ఆహ్వానించింది..!)
Comments
Please login to add a commentAdd a comment