
ఫ్యాషన్ అంటే కేవలం మనుషుల మాత్రమేనా మేము కూడా తీసికిపోం అంటున్నాయి జంతువులు. ట్రెండీ ఫ్యాషన్‌ని మనుషులే కాదు జంతువుల కూడా ఫాలోఅవుతాయని ఈ వైరల్ వీడియోని చూశాక ఒప్పుకుంటారు. ఆ వీడియోలోని ఏనుగు స్టైల్ చూస్తే..వేరేలేవెల్ అని అంగీకరిస్తారు. మరీ ఇంతకీ ఇదంతా ఎక్కడ జరిగిందంటే..
తమిళనాడులో మన్నార్గుడిలోని రాజగోపాలస్వామి ఆలయంలో ఏనుగు విలక్షణమైన హెయిర్‌స్టైల్‌తో చూడముచ్చటగా ఉంటుంది. ఆ ఏనుగు పేరు సెంగమాలం. ఆ ఏనుగుకి సంబంధించిన వీడియోని ఇండియా కల్చరల్ హబ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్‌గా మారింది.
ఆ వీడియోలో సెంగమాలం ఏనుగు మనుషుల జుట్టు మాదిరిగా 'బాబ్‌కట్ హెయిర్ స్టైల్'లో ఉంటుంది. చూస్తే మనుషుల హెయిర్‌స్టైల్ మాదిరిగానే ఉంటుంది ఆ ఏనుగు హెయిర్. అంతేగాదండోయ్ ఆ ఆలయానికి వచ్చే భక్తులకు ఈ ఏనుగే ప్రధాన ఆకర్షణగా ఉంటుందట. అయితే ఇంతలా ఏనుగు జుట్టు పట్ల కేర్ తీసుకుంటున్న దాని సంరక్షకుడిని మెచ్చుకోవాల్సిందే.
ఈ మేరకు ఆ ఏనుగు సంరక్షకుడు ఎస్ రాజగోపాల్ మాట్లాడుతూ..ఈ సెంగమాలం జుట్టుని వేసవికాలంలో రోజుకి మూడుసార్లు, ఇతర సీజన్లలో కనీసం రోజుకి ఒకసారైనా.. కడుగుతామని చెబుతున్నారు. 2003లో ఆ ఏనుగుని కేరళ నుంచి తీసుకవచ్చారట.
అప్పటి నుంచి ఈ ఆలయంలోనే నివాసిస్తోందట. దేవుని కైంకర్యాలకు ఈ ఏనుగుని వినియోగిస్తామని చెబుతున్నారు ఆలయ నిర్వాహకులు. మే నెలలో ఈ ఏనుగుకి చల్లదనం కల్పించడం కోసం ప్రత్యేకంగా దాదాపు రూ. 45 వేలు ఖరీదు చేసే షవర్‌ని కూడా ఏర్పాటు చేశామని చెబుతున్నారు ఆలయ నిర్వాహకులు.
(చదవండి: జ్ఞాపకంగా మిగిలిన ఆ కుక్క కోసం .. ఏకంగా రూ. 19 లక్షలా..!)
Comments
Please login to add a commentAdd a comment