hairstyle
-
ఇంట్లోనే ఈజీగా కర్లీ హెయిర్..!
కొందరికి గిరజాల జుట్టు అంటే ఇష్టంగా ఉంటుంది. నిజానికి వేసుకున్న డ్రెస్‌కు తగినట్లుగా హెయిర్ స్టైల్‌ని మార్చేవాళ్లకు చిత్రంలోని ఈ హెడ్ బ్యాండ్ భలే చక్కగా పని చేస్తుంది. అందుకే చాలామంది కేశాలంకరణ ప్రియులు, హెయిర్ స్ట్రెయిటనర్తో పాటు హెయిర్ కర్లర్ వాడుతూ ఉంటారు. ఈ కర్లర్ హీట్‌లెస్ బ్యాండ్‌ను వెంట ఉంచుకుంటే, ఎలక్ట్రిక్ కర్లర్‌తో పని ఉండదు. దాంతో జుట్టు పాడవదు. పైగా ఈ రోలర్ టూల్‌ను ఉపయోగిస్తే చక్కటి హెయిర్ స్టైల్‌తో అందంగా మెరిసిపోవచ్చు.ఈ బ్యాండ్స్ చాలా రకాలు, చాలా రంగుల్లో లభిస్తున్నాయి. ఆయా బ్యాండ్స్‌ని ఆయా పద్ధతుల్లోనే తలకు అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం జుట్టును కొన్ని చిన్నచిన్న పాయలుగా విడదీసుకుని, బ్యాండ్ కిందకు వేలాడుతున్న లేసులకు ఆ పాయలను బిగించి చుట్టి, 2 లేదా 3 గంటల పాటు అలా ఉంచుకోవాలి. అనంతరం లేసుల నుంచి జుట్టును పాయలు పాయలుగా విడదీసేస్తే, జుట్టు మొత్తం కర్లీగా మారిపోతుంది. ఈ టూల్‌ని చిత్రంలో చూపిన విధంగా తల వెంట్రుకలకు బిగించుకుని ఇంటిపనులు, వంటపనులు చేసుకోవచ్చు, లేదా చక్కగా నిద్రపోవచ్చు. ఈ ఉంగరాలు తిరిగిన జుట్టు ఎక్కువ సమయం ఉండాలన్నా, ఎక్కువ రింగులు తిరగాలన్నా రాత్రి పూట తలకు ఈ బ్యాండ్ పెట్టుకుని పడుకుంటే, ఉదయం లేచేసరికి అందమైన హెయిర్ స్టైల్ మీ సొంతమవుతుంది. ఈ ప్రీమియం కర్లింగ్ మెటీరియల్ 100% సహజమైన, నాణ్యత కలిగిన స్పాంజ్‌తో రూపొందింది. ఇది ఎలాంటి ప్లాస్టిక్ వాసన రాదు. హానికరం కాదు. పైగా ఇది వాడుకోడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ బ్యాండ్ కేవలం రూ.500 కంటే తక్కువ ధరలోనే ఆన్లైన్లో అందుబాటులో ఉంది. నచ్చినవాళ్లకు ఈ టూల్‌ని బహుమతిగా కూడా ఇవ్వవచ్చు. (చదవండి: నోటిలో నాటే ఇంప్లాంట్స్...) -
తమిళియన్ హెయిర్ స్టైలో ఇషా స్టన్నింగ్ లుక్..! (ఫొటోలు)
-
భ్రుకు టీ ముడిపడే సీన్!
శివుని జటాఝూటంలోని గంగ గురించి మనకు తెలుసు. అయితే ఇరానీ మోడల్ శిరోజాలలోని ‘టీపాట్’ వీడియో ఇప్పుడు వైరల్ అయింది. హెయిర్ స్టైల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. అయితే ‘టీ పాట్ హెయిర్‌స్టైల్’ గురించి మాత్రం ఎప్పుడూ విని ఉండం. ఇరాన్‌కు చెందిన హెయిర్ స్టైలిస్ట్ సైదెహ్ ‘టీపాట్ హెయిర్‌స్టైల్’ వీడియోను చూసి నెటిజనులు ‘ఆహో వోహో’ అంటున్నారు. ఈ వీడియో నాలుగు మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. హెయిర్ పిన్స్‌తో మోడల్ సబుర్ నగర్‌కు పోనీ టెయిల్ వేసింది. ఆ తరువాత మెటల్ వైర్లు, గ్లూ గన్‌తో టీపాట్ స్ట్రక్చర్స్‌ను సెట్ చేసింది. ఈ శిరో టీపాట్‌లో టీ ΄ోసి ఆ తరువాత కప్పులోకి ఒంపి తాగింది. ‘ఫ్యాషన్ స్టైల్ అనేది ఎన్నో వెరైటీలకు కేంద్రం. హెయిర్ స్టైల్‌కు సంబంధించి సహజంగా ఉండేలా ఏదైనా చేయాలనుకున్నాను. రెండు రోజుల కృషి ఫలితమే ఈ విజయం. ఇంత స్పందన వస్తుందని ఊహించలేదు’ అని తన ఇన్స్టాగ్రామ్ ΄ోస్ట్‌లో చెప్పింది సైదేహ్. -
ధోనీ... ఈసారి ఇలా కానియ్!
ఎం.ఎస్. ధోనీ కెప్టెన్షిప్ క్వాలిటీస్ మాత్రమే కాదు సరికొత్త హెయిర్ స్టైల్, సరికొత్త బైక్ కూడా నెటిజనులకు ఆసక్తికరమే. తాజాగా ధోని ‘డూడుల్ వీ3 ’ ఇ–బైక్ రైడింగ్ వీడియో వైరల్ అయింది. రోజుల వ్యవధిలోనే 1.3 మిలియన్ల వ్యూస్‌తో దూసుకు΄ోతుంది. ధోని రైడింగ్ వీడియోలు వైరల్ కావడం కొత్త కానప్పటికీ ఎకో–ఫ్రెండ్లీ మోడ్ ఆఫ్ ట్రాన్స్΄ోర్టేషన్ను ప్రమోట్ చేసే ఈ మేడ్–ఇన్–ఇండియా ఎలక్ట్రికల్ సైకిల్ వీడియో నెటిజనులలో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తించింది. -
Kohli And Dhoni New Photos: ధోని, కోహ్లి కొత్త హెయిర్‌స్టైల్ ఎలా ఉంది?.. ఫొటోలు
-
ఇంత పిచ్చా?....వధువు హెయిర్‌స్టైల్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మరపురాని వేడుక. అందుకే తమ పెళ్లి రోజును మరపురాని జ్ఞాపకంగా మిగుల్చుకోవాలని వధూవరులిద్దరూ ఎంతగానో కోరుకుంటారు. ఇటీవల పెళ్లిలో ఓ వధువు డిఫరెంట్ హెయిర్‌స్టైల్‌తో షాకిచ్చింది. పూలతో అయితే రొటీన్‌గా ఉంటుందని చాక్లెట్లతో జడ అల్లేసుకుంది. దీనికి సంబంధించిన ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. తమ పెళ్లిలో మరింత అందంగా కనిపించాలని ముచ్చటపడిపోతుంటారు. అందుకే బట్టల దగ్గర్నుంచి హెయిర్ స్టైల్ వరకు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారు. ఏం చేసినా కాసింత కళాపోషణ ఉండాలి అన్నట్లు సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూనే వినూత్నంగా కనిపించాలని భావిస్తుంటారు. సాధారణంగా పెళ్లిలో వధువుకి పూలజడ ప్రత్యేకం. ఈమధ్య అలా రకరకాల పూలజడలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే ఓ వధువు మాత్రం కాస్త డిఫరెంట్‌గా ఆలోచించి చాక్లెట్స్‌తో జడను అలంకరించుకుంది. ఇయర్ రింగ్స్,నెక్లెస్ వంటి ఆభరణాలు కూడా చాక్లెట్స్‌తో చేసినవే. జడకు కిట్‌క్యాట్, ఫైవ్‌స్టార్, ఫెరెరో, రోచర్, మిల్కీబార్ వంటి చాక్లెట్లతో అందంగా ముస్తాబైంది. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. పెళ్లికూతురి క్రియేటివిటీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. View this post on Instagram A post shared by chitrasmakeupartist (@_chitras_makeup_artist_28) -
పెళ్లికళకు పరిపూర్ణత.. ఆధునికపు హెయిర్ స్టైల్స్! ఇలా ముస్తాబైతే..
కలల రోజు కళ్ల ముందు నిలిచే సమయం అత్యంత వైభవంగా మారిపోవాలనుకుంటారు. అందుకు తగినట్టుగానే ప్రతి అలంకరణలోనూ ప్రత్యేకత చూపుతారు. ఆ పెళ్లి కళకు పరిపూర్ణత రావాలంటే మాత్రం కేశాలంకరణదే అత్యంత కీలకమైన పాత్ర. సాధారణ డిజైన్స్ నుంచి ఆధునికపు హెయిర్ స్టైల్స్ ఎలా రూపు మార్చుకున్నాయో తెలుసుకుంటే మీదైన ప్రత్యేకమైన రోజుకు మరింత అందంగా ముస్తాబు అవ్వచ్చు. పెళ్లికూతురు ఆకర్షణీయ రూపానికి జీవం పోసేది కేశాలంకరణే. పెళ్లి దుస్తులను ఎంత ప్రత్యేకంగా ఎంచుకుంటారో జడను కూడా అంతే స్పెషల్‌గా డిజైన్ చేయించుకుంటారు. సాధారణ పూల జడల నుంచి వజ్రాలతోనూ, బంగారంతోనూ మెరిసే అందమైన పొడవాటి జడలను నవ వధువుల ఎంపికలో ఉంటాయి. అలాగే, పెళ్లికూతురి దగ్గరి బంధువులు, స్నేహితులు కూడా వీటి ఎంపికలో పోటీ పడుతుంటారు. ఇందుకు ఇమిటేషన్ జ్యువెలరీతో పాటు ఇతర ఫ్యాన్సీ జడలు కూడా రకరకాల డిజైన్లలో అందుబాటులోకి వచ్చాయి. లక్షల రూపాయల నుంచి వందల రూపాయల వరకు ఉన్న ఈ డిజైన్స్‌లో ఇవి కొన్ని. సంప్రదాయ వేడుకలలో వేసే హెయిర్ స్టైల్స్ ఎప్పుడూ ఒకేలా ఉంటుంటాయి. ఈ బ్రైడల్ హెయిర్ స్టైల్స్‌లో మార్పులు చూస్తే ఇన్ని డిజైన్స్ ఉన్నాయా అనే ఆశ్చర్యం కలగక మానదు. ఇందుకోసం ఉపయోగిస్తున్న లాంగ్ రిబ్బన్, మిర్రర్, టాజిల్స్తోనూ జడలు ప్రధాన ఆకర్షణగా డిజైనర్ల చేతుల్లో రూపు దిద్దుకుంటున్నాయి. సొంతంగా తయారీ ఆసక్తి గల వారు పూసలు, ముత్యాలు, స్టోన్స్, రంగు దారాలను ఉపయోగించి మల్టీకలర్ లాంగ్ జడలను సొంతంగా తయారు చేసుకోవచ్చు. దారాలకు పూసలు గుచ్చి, గమ్‌తో స్టోన్స్ లేదా అద్దాలను అతికించి పొడవాటి దండలుగా (జడ అంత పొడవులో) తయారు చేసుకోవాలి. వాటిని డ్రెస్‌తో మ్యాచ్ చేసుకోవాలి. సందర్భాన్ని బట్టి ఎలాంటి అలంకరణ బాగుంటుందో చూసుకొని, ఆ జడను అలంకరించుకోవాలి. ఫ్యాన్సీ అలంకరణ సాధారణ కేశాలంకరణలో మల్లె, గులాబీ పూల జడలు పెళ్లికూతురు అలంకరణలో భాగంగా ఉంటాయి. కొందరు తమ చీర రంగుతో మ్యాచ్ అయ్యే పూల జడలను ఎంపిక చేసుకుంటారు. ఇవే కాకుండా స్వరోస్కి స్టోన్స్ ఉన్న పొడవాటి వరుసల క్లిప్స్‌ను పెట్టేసి కేశాలంకరణ పూర్తి చేసుకోవచ్చు. ఇవి, రిసెప్షన్ వంటి వేడుకల్లో అందంగా ఉంటాయి. పెళ్లికి ఎంచుకోగల ఆధునిక కేశాలంకరణలో ఇవి ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. డిజైన్ బట్టి ఈ జడల ధరలు అందుబాటులో ఉన్నాయి. మెరిసే.. మెరిసే కేశాలంకరణ ప్రత్యేక సందర్భాల్లోనే కాదు ప్రతిరోజూ స్పెషల్‌గా ఉండాలనుకుంటారు. ఇలాంటి వారికి డే హెయిర్ జ్యువెలరీ (హెయిర్ క్లిప్స్) అందుబాటులో ఉన్నాయి. వీటిని గెట్ టు గెదర్ వంటి పార్టీలకు వేసుకునే వెస్ట్రన్ డ్రెస్సులకూ అందంగా నప్పుతాయి. పెళ్లి కూతురి లేదా అతిథుల తమ కేశాలంకరణలో వివిధ స్టైల్స్‌ను అనుకరించాలంటే అందుకు తగిన ఆన్లైన్ ట్యుటోరియల్ వీడియోలు కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిని చూసి ఎలాంటి స్టైల్ బాగుంటుందో ఎంపిక చేసుకునే వీలుంటుంది. మీదైన గొప్ప రోజు కోసం మీ జుట్టును స్టైలింగ్ చేయడం వల్ల పెళ్లికి వచ్చే మొత్తం అందరినీ మంత్ర ముగ్ధులను చేస్తుంది. పెళ్లిరోజును మరింతగా వెలిగిపోయేలా మార్చేస్తుంది. చదవండి: Sreyashi Raka Das: శాంతి నికేతన్‌లో పెరిగిన శ్రేయసి.. అంచెలంచెలుగా ఎదిగి! సొంత లేబుల్‌తో.. -
Viral: చూస్తుండగానే తలపై క్రిస్మస్ చెట్టు రెడీ..! గిన్నిస్ రికార్డు హెయిర్ స్టైల్
వైరల్: పొడవైన జుట్టంటే ఇష్టపడని అమ్మాయిలే ఉండరనడంలో అతిశయోక్తే లేదు. రోజుకో కొత్త హెయిర్ స్టైల్ చేసుకోవడం అమ్మాయిలకు తెగ అలవాటు. తాజాగా ఓ ప్రఖ్యాత హెయిర్ స్టైలిస్ట్ సరికొత్త హెయిర్ స్టైల్ డిజైన్‌తో ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించారు. సిరియన్ హెయిర్ స్టైలిస్ట్ అయినటువంటి డానీ హిస్వానీ 2.90 మీటర్ల (9 అడుగుల 6.5 అంగుళాలు) ఎత్తులో క్రిస్మస్ చెట్టు ఆకారంలో ఓ మహిళ జుట్టును అందంగా అలంకరించి రికార్డ్ సృష్టించారు. సెప్టెంబర్ 16న దుబాయ్‌లో ప్రపంచలోనే పొడవైన హెయిర్ స్టైల్‌గా హిస్వాని ఈ ఘనత సాధించారు. కాగా హిస్వాని ప్రపంచ ఫ్యాషన్ మ్యగజైన్లు, పెనెలోప్ క్రజ్, దీపిక పదుకొనె, ప్యారిస్ హిల్టన్ వంటి గొప్ప సెలబ్రిటీలకు హెయిర్ స్టైలిస్ట్‌గా పనిచేశారు. ఈ కేశాలంకరణ చేసిన విధానాన్ని తెలుపుతూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ తన ఇన్స్టాగ్రామ్ పేజ్‌లో పోస్టు చేసింది. ఇందులో హిస్వాని ముందుగా మోడల్ తలకు సపోర్ట్‌గా ఓ హెల్మెట్‌ను పెట్టింది. దానిపై మూడు మెటల్ రాడ్లు అమర్చి జుట్టును క్రిస్మస్ చెట్టు ఆకారంలో వచ్చేందుకు విగ్‌లు, హెయిర్ ఎక్స్టన్షన్స్ను ఉపయోగించించారు. చివరికి హెయిర్ స్టైల్ అనుకున్న సైజ్‌లో వచ్చేందుకు పై అంతస్తుకు వెళ్లీ మరీ డిజైన్ చేశారు. ప్రస్తుతం ఈ డిఫరెంట్ హెయిర్ స్టైల్ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఇప్పటికే లక్షలాది మంది ఈ వీడియోను వీక్షించారు. చదవండి: యూనిఫామ్ ఉందని మరిచారా సార్! మహిళతో ఎస్సై డ్యాన్స్ వీడియో వైరల్ View this post on Instagram A post shared by Guinness World Records (@guinnessworldrecords) -
అదిరేటి హెయిర్‌స్టైల్.. గిన్నిస్ రికార్డు
-
బారెడు జట్టుతో అంపైర్, మీమ్స్ హోరు
దుబాయ్: సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసి ఉత్కంఠ రేకెత్తించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ జట్టు 163 పరుగులు చేయగా.. సన్‌రైజర్స్ కూడా 20 ఓవర్లలో 163 పరుగులే చేయగలిగింది. టై గా ముగిసిన మ్యాచ్‌లో కేకేఆర్ సూపర్ విజయం సాధించింది. ఆద్యంతం అభిమానులను అలరించిన ఈ మ్యాచ్‌లో అంపైర్ పశ్చిమ్ పాఠక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆట మొదలైనప్పటి నుంచి ఆయన అంపైరింగ్‌పై సోషల్ మీడియాలో మీమ్స్ వరద కొనసాగింది. పాఠక్ అంపైరింగ్ విధానం, హెయిర్ స్టైయిల్ దీనికి కారణం. ఆయన జుట్టు మహిళల మాదిరిగా బారెడు పొడుగు ఉండటంతో.. ‘మహిళా అంపైర్ ఎవరబ్బా?’అంటూ కొందరు అభిమానులు ప్రశ్నలు సంధించారు. (చదవండి: సూపర్: 3 బంతులు, 2 పరుగులు, 2 వికెట్లు) ‘ఐపీఎల్లో మొట్ట మొదటిసారి అంపైరింగ్ చేస్తున్న ఈ మహిళను చూడండి.. ఎంత అందంగా ఉందో’ అంటూ మీమ్స్ కూడా వేశారు కొందరు. బౌలర్ బంతిని విసిరే సమయంలో ఒకప్పటి అంపైర్ల మాదిరిగా ముందుకు వంగి ఉండటం పాఠక్ స్పెషాలిటీ. ఆయన అంపైరింగ్ స్టాండర్డ్స్ కూడా బాగుంటాయని పేరుంది. విజయ్ హజారే టోర్నీలో మొట్ట మొదటిసారిగా హెల్మెట్ ధరించి అంపైరింగ్ చేసింది కూడా పాఠకే. వికెట్ కీపర్ అంపైర్లాగా నిలబడితే.. అంపైర్ వికెట్ కీపర్ లా నిలుచున్నాడని కొందరు ట్రోల్ చేశారు. మరికొందరు మాత్రం పాఠక్ సంప్రదాయక పద్ధతిలో అంపైరింగ్ బాగుందంటూ.. ఆయన్ని రాక్‌స్టార్ అంటూ పొగిడేస్తున్నారు. కాగా, 2014లో తొలిసారి ఆయన ఐపీఎల్లో అంపైరింగ్ చేశాడు. మళ్లీ తాజా సీజన్లో ఫీల్డులోకి దిగాడు. (చదవండి: షమీ నిర్ణయంపై ఆశ్చర్యపోయాం: రాహుల్) -
ఎంఎస్ ధోని న్యూలుక్
ముంబై: ఇటీవల ఇంగ్లండ్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో తెల్లటి గడ్డంతో కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచిన టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని తాజాగా కొత్త హెయిర్ స్టైల్‌తో కనిపించాడు. ధోని ఎప్పుడూ కొత్త కొత్త స్టైల్స్‌తో అభిమానులను కనువిందు చేస్తూ ఫ్యాషన్ ఐకాన్‌గా నిలుస్తుంటాడు. ప్రస్తుతం ధోని చేయించుకున్న ఈ కొత్త హెయిర్ స్టైల్ పేరేంటంటే.. ‘వీ హాక్’. ఇంగ్లండ్ పర్యటన ముగించుకుని వచ్చిన ధోని.. ప్రస్తుతం ముంబయిలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ప్రముఖ హెయిర్‌స్టైలిస్ట్ వద్ద ఈ కొత్త హెయిర్ స్టైల్ చేయించుకున్నాడు. అనంతరం సెలూన్ నిర్వాహకులు ధోని ఫొటోలను సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. దీంతో ఈ ఫొటోలు కాస్త వైరల్‌గా మారాయి. ఈ కొత్త లుక్ అభిమానులకు తెగ నచ్చేసింది. దీంతో వారు ధోనీ కొత్త హెయిర్ స్టైల్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. చదవండి: ధోని క్లీన్ షేవ్.. ఫ్యాన్స్ రియాక్షన్..! ధోని బర్త్‌డే : పాండ్యా స్పెషల్ గిఫ్ట్ ! -
అరెరె.. ఇదెలా సాధ్యం?!
పుర్రెకోబుద్ధి.. జిహ్వకో రుచి అనే నానుడి సరిగ్గా ఇటువంటి వాళ్లకు సరిపోతుంది. ఇక్కడ ఫొటోలో మీరు చూస్తున్న ఈ హెయిర్ స్టయిల్‌కు ఓ చరిత్ర ఉందండోయ్. చిత్రంలోని అమ్మాయిది చైనా. అప్పుడెప్పుడో 2015లో హాలీవుడ్ హీరోయిన్ కెండాల్ జెన్నర్ హెయిర్ స్టైల్ కన్నా భిన్నంగా ఉండాలన్న లక్ష్యంతో ఇలా డిజైన్ చేయించుకుంది. ప్రస్తుతం ఈ హెయిర్ స్టైల్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అప్పట్లో కెండాల్ జెన్నర్ ఫొటోకు 3.6 మిలియన్ లైక్స్.. అద్భుతమైన కామెంట్స్ వచ్చాయి. ప్రస్తుతం చైనా భామ హెయిర్ స్టైల్ కు సోషల్ మీడియాలో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇంతటి క్లిష్లమైన డిజైన్‌ను ఎలా రూపొందించారు? సహజత్వానికి అత్యంత దగ్గరగా ఉండేలా హెయిర్ స్టైల్ ను డిజైన్ చేయడానికి ఎంత సమయం పట్టిందంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు గుప్పిస్తున్నారు. ఈ అమ్మాయి హెయిర్ స్టైల్ వీడియోను చైనా డెయిలీ బుధవారం పోస్ట్ చేసింది. ఇప్పటివరకూ ఈ వీడియోను 6.5 మిలియన్ల మంది చూశారని.. చైనా డెయిలీ చెబుతోంది. ❥ A post shared by Kendall (@kendalljenner) on May 25, 2015 at 3:51pm PDT -
క్యూట్ అప్‌డూ
సిగ సింగారం ఈ హెయిర్ స్టయిల్‌ను ‘క్యూట్ అప్‌డూ’ అంటారు. ఇది ఎలాంటి డ్రెస్సుల మీదికైనా నప్పుతుంది. అంతేకాదు ఎలాంటి పార్టీలకైనా ఈ స్టయిల్‌ను నిశ్చింతగా వేసుకోవచ్చు. దీన్ని వేసుకోవడానికి జుత్తు మరీ పొడవుగా ఉండాల్సిన పని లేదు. కాబట్టి అందరూ హాయిగా ఈజీగా వేసుకోవచ్చు. ఈ క్యూట్ అప్‌డూ మీకు మంచి రాయల్ లుక్‌ను అందిస్తుంది. ఈ సిగ సోయగం మీకూ కావాలంటే.. వెంటనే ట్రై చేయండి మరి. ముందుగా జుత్తునంతా చిక్కులు లేకుండా దువ్వుకోవాలి. తర్వాత ఫొటోలో కనిపిస్తున్న విధంగా ముందు భాగంలోని జుత్తు వెనక్కు రాకుండా ఏదైనా ప్లక్కర్ పెట్టేయాలి. ఆపైన వెనుక భాగం జుత్తుకు రబ్బర్ బ్యాండ్ పెట్టేయాలి. ఇప్పుడు పోనీని మెలితిప్పుకోవాలి (కొద్దికొద్దిగా జుత్తును తీసుకొని ట్విస్ట్ చేసుకోవాలి). జుత్తు ఎంత పఫ్ఫీగా ఉంటే కొప్పు అంత అందంగా కనిపిస్తుంది. నుదురు దగ్గర జుత్తును కాస్తంత పఫ్ఫీగా పెట్టుకుంటే.. ముందు నుంచి హెయిర్ స్టయిల్ అదిరిపోతుంది. ఆ పోనీని గుండ్రంగా చుడుతూ.. కొప్పులా చేసుకోవాలి. తర్వాత కొప్పులో నుంచి జుత్తు బయటికి రాకుండా స్లైడ్స్ పెట్టుకోవాలి. అలా అని కొప్పు మరీ టైట్గానూ ఉండకూడదు. ఇప్పుడు నుదురు దగ్గర జుత్తును మూడు పాయలుగా తీసుకొని అల్లాలి. ఆపైన ఒక్కో అల్లికకు ఇరువైపుల నుంచి ఒక్కో పాయను తీసుకొని, జడలో అల్లుకుంటూ పోవాలి. జడను కొప్పు వరకు అల్లి, చివరకు రబ్బర్ బ్యాండ్ పెట్టేయాలి. జడను అల్లుకునేటప్పుడు, కొప్పు ఏమాత్రం కదలకుండా, వదులు కాకుండా చూసుకోవాలి. తర్వాత ఆ జడ చివర్లలోని జుత్తును మెలితిప్పుకోవాలి. ఆ మెలితిప్పిన జుత్తును కొప్పు చుట్టూ చుట్టాలి. మధ్యమధ్యలో జుత్తు చిట్లిపోకుండా హెయిర్ స్ప్రే చేసుకుంటూ ఉండాలి. చివరగా కొప్పు వదులు కాకుండా స్లైడ్స్ పెట్టుకోవాలి. అవసరమనుకున్న ప్రతి చోటా స్లైడ్స్ పెట్టుకుంటే, కొప్పులో నుంచి వెంట్రుకలు బయటికి రావు. అలాగే, చివరికి మరోసారి హెయిర్ స్ప్రే చేసుకుంటే.. మీ హెయిర్ స్టయిల్ లుక్కే మారిపోతుంది. కావాలనుకుంటే హెయిర్ స్టయిల్ పూర్తిగా వేసుకున్నాక, ఏవైనా ఫ్లవర్ క్లిప్స్, స్టాన్ క్లిప్స్‌తో అలంకరించుకోవచ్చు. అప్పుడు కొప్పు మరింత అందంగా కనిపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, క్యూట్ అప్‌డూ హెయిర్ స్టయిల్‌నూ మీరు వేసుకొని మురిసిపోండి. -
రెట్రో అప్‌డూ ఫిష్‌టెయిల్
సిగ సింగారం ఇది రెట్రో అప్‌డూ ఫిష్‌టెయిల్. ఈ హెయిర్ స్టయిల్ ఇటు కొప్పుగానూ... అటు అల్లికలతో జడలా కూడా కనిపిస్తుంది. ఈ రెట్రో అప్‌డూ ఫిష్‌టెయిల్ సాధారణంగా అన్ని డ్రెస్సుల మీదకూ నప్పుతుంది. దీన్ని వేసుకోవడానికి జుత్తు మరీ పొడవుగా ఉండాల్సిన అవసరం లేదు. అంతేకాదు, ఈ హెయిర్ స్టయిల్‌ను చాలా సులువుగా వేసుకోవచ్చు. జుత్తు పొడవుగా లేనివారు ఈ హెయిర్ స్టయిల్ తమకు నప్పదనుకుంటారు. కానీ ఒకసారి ఈ స్టయిల్‌ను ట్రై చేసి చూడండి. మీకే నచ్చుతుంది. ఎలా అంటే... ఇదిగో ఇలా...! 1. ముందుగా జుత్తునంతా చిక్కులు లేకుండా దువ్వుకోవాలి. 2. ఇప్పుడు జుత్తునంతటికీ రబ్బర్ బ్యాండ్ పెట్టి పోనీ వేసుకోవాలి. 3. ఫొటోలో కనిపిస్తున్న విధంగా బ్యాండ్ పైన భాగంలో ఉన్న జుత్తును చేతివేళ్లతో కాస్తంత దూరం చేసుకోవాలి. ఇప్పుడు పోనీని అందులోంచి కిందకు తీయాలి. 4. పైన చెప్పిన విధంగా చేస్తే జుత్తు 4వ నంబర్ ఫొటోలో కనిపిస్తున్నట్టు వస్తుంది. 5. ఇప్పుడు పోనీని ఓసారి దువ్వుకొని, రెండు భాగాలుగా చేసుకోవాలి. 6. ఆ రెండు భాగాలను రెండు పాయలుగా చేసుకొని.. ఒక్కో అల్లికకు ఒక్కో పెద్దపాయల నుంచి సన్నని పాయను తీసి కలుపుతూ అల్లుకోవాలి. అంతే ‘ఫిష్‌టెయిల్’ రెడీ అయిపోతుంది. 7. అలా జుత్తునంతా అల్లి, చివరకు రబ్బర్బ్యాండు పెట్టేయాలి. 8. ఇప్పుడు ఫిష్టెయిల్లోని ఒక్కో పాయను కదిలిస్తూ... జడను వదులు చేసుకోవాలి. 9. తర్వాత ఆ ఫిష్టెయిల్ను ఫొటోలో కనిపిస్తున్న విధంగా... బ్యాండు పెట్టుకున్న చోట దూర్చి స్లైడ్స్ పెట్టేయాలి. 10. ఇప్పుడు కొప్పులోంచి జడ బయటకు రాకుండా, కావలసిన చోట స్లైడ్స్ పెట్టుకోవాలి. అంతే, ఎంతో అందమైన హెయిర్ స్టయిల్ రెడీ... -
కాంబో బ్రెయిడ్
సిగ సింగారం ఇది కాంబో బ్రెయిడ్. ఇందులో రెండు రకాల జడలు వేసుకోవాలి. ఒకటి ఫ్రెంచ్ బ్రెయిడ్.. రెండోది ఫిష్‌టెయిల్ (వాడుకలో నాలుగుపాయలు/ ఈత పాయల జడ అంటారు) బ్రెయిడ్. ఈ హెయిర్ స్టయిల్‌ను చూస్తే... వేసుకోవడం చాలా కష్టంగా అనిపించొచ్చు. కానీ దీన్ని చాలా సింపుల్‌గా వేసుకోవచ్చు. ఈ స్టయిల్‌ను ఒత్తు జుత్తు గల పిల్లలకు వేస్తే... భలేగా ఉంటుంది. యువత కూడా ఈ కాంబో బ్రెయిడ్ను పంజాబీ డ్రెస్, జీన్స్‌ల మీదకు వేసుకోవచ్చు. మరి ఇంకేం.. ఈ హెయిర్ స్టయిల్‌ను మీరూ ట్రై చేయండి. 1. ముందుగా జుత్తును చిక్కులు లేకుండా దువ్వుకోవాలి. తర్వాత ఫొటోలో కనిపిస్తున్న విధంగా జుత్తును రెండు భాగాలుగా చేసుకోవాలి. 2. నుదురు పై ఉన్న జుత్తు భాగానికి ఏదైనా బ్యాండ్ లేదా క్లిప్ పెట్టుకోవాలి. ఆ మిగిలిన భాగాన్ని మూడు భాగాలుగా చేసుకొని ఎడమ చెవి వైపు నుంచి కుడివైపుకు కొద్దిగా అల్లాలి. తర్వాత రెండువైపుల నుంచి ఒక్కో పాయను తీసుకొని జడలో అల్లుకుంటూ పోవాలి. 3. మొత్తం జుత్తును అల్లుకొని, చివర కాస్త వదిలేసి బ్యాండు పెట్టుకోవచ్చు. 4. ఇప్పుడు నుదురు పైన భాగంలో ఉన్న జుత్తును రెండు పాయలుగా చేసుకొని... ఒక్కో అల్లికకు ఒక్కో పెద్దపాయల నుంచి సన్నని పాయను తీసి కలుపుతూ అల్లుకోవాలి. ఈ జడను కుడిచెవివైపుకు అల్లి బ్యాండు పెట్టుకోవాలి. 5. ఆ అల్లిన జడను ఎడమవైపుకు తీసుకెళ్లి, ఫొటోలో కనిపిస్తున్న విధంగా ఫ్రెంచ్ బ్రెయిడ్లో పై నుంచి కిందివైపుకు తీయాలి. 6. తర్వాత బయటికి కనిపిస్తున్న చిన్న పోనీని, అందులోనే దూర్చి స్లైడ్ పెట్టేయాలి. 7. ఫొటోలో కనిపిస్తున్న విధంగా ఒక్కో పాయను కదిలిస్తూ రెండు జడలనూ వదులు చేసుకోవాలి. 8. చివరగా నుదురు భాగంలో, కొన్ని వెంట్రుకలను బయటికి తీయాలి. ఆ ముంగురులతో మీ సిగ సోయగం మరింత పెరుగుతుంది. -
స్విర్ల్ బ్రెయిడ్
సిగ సింగారం ఈ హెయిర్ స్లైయిల్ను స్విర్ల్ బ్రెయిడ్ అంటారు. విదేశీయులు ఈ హెయిర్ స్టైయిల్‌ను పెళ్లిళ్లకు, పుట్టినరోజు వేడుకలకు ఎక్కువగా వేసుకుంటారు. ఇది ఎలాంటి డ్రెస్సులకైనా నప్పుతుంది. దీన్ని వేసుకోవడానికి మరీ పొడవాటి జుత్తు ఉండాల్సిన అవసరం లేదు. కాస్త మెడ కింద వరకు ఉన్నా సరిపోతుంది. ఈ సిగ సోయగం మీకూ కావాలంటే.. ఓసారి ఈ స్విర్ల్ బ్రెయిడ్ను ట్రై చేయండి.. 1. ముందు జుత్తును చిక్కులు లేకుండా దువ్వుకోవాలి. ఆపైన జుత్తును ఫొటోలో కనిపిస్తున్నట్టు మూడు భాగాలుగా చేసుకోవాలి. 2. ఇప్పుడు మధ్యభాగంలోని జుత్తును నడినెత్తి నుంచి మూడు పాయలుగా తీసుకొని కొద్దిగా అల్లాలి. తర్వాత అదే మధ్యభాగంలోని జుత్తును రెండు పక్కల నుంచి సన్నని పాయలుగా తీసి ఈ జడలో కలుపుకుంటూ రివర్సులో అల్లుకు పోవాలి. చివర కాస్త మిగిలిన జుత్తుకు బ్యాండు పెట్టేయాలి. 3. పైన అల్లుకున్న జడను టైట్‌గా లేకుండా పాయల్ని కొద్దికొద్దిగా కదిలిస్తూ వదులు చేసుకోవాలి. 4. ఇప్పుడు చివర మిగిలిన పోనీని ఫొటోలో కనిపిస్తున్నట్టు మడిచేసి అదే బ్యాండులో పెట్టేయాలి. 5. ఆ మడిచిన పోనీని బయటికి కనిపించకుండా లోపలికి పెట్టి స్లైడ్స్ పెట్టేయాలి. 6. తర్వాత ఎడమ చెవి వైపు ఉన్న జుత్తును చిక్కులు లేకుండా నున్నగా దువ్వుకోవాలి. 7. ఆ దువ్విన జుత్తును మెలిక తిప్పి కుడివైపుకు తీసుకెళ్లి స్లైడ్స్ పెట్టేయాలి. 8. ఇప్పుడు కుడి చెవి వైపు ఉన్న జుత్తును చిక్కులు లేకుండా నున్నగా దువ్వుకోవాలి. 9. దాన్ని కూడా మెలిక తిప్పి ఎడమవైపుకు తీసుకెళ్లి స్లైడ్స్ పెట్టేయాలి. 10. చివరగా ఏవైనా పాయలు ఊడిపోయేలా ఉండే టైట్‌గా స్లైడ్స్ పెట్టేయాలి. (పెట్టిన స్లైడ్స్ ఊడిపోకుండానూ చూసుకోవాలి) -
ఎల్సా బ్రెయిడ్
ముడి బంగారం ఎల్సా బ్రెయిడ్ హెయిర్ స్టయిల్ అనగానే ఎల్సా ఏ హెయిర్ స్టైలిస్టో అయివుంటుంది, ఆవిడ కనిపెట్టిన హెయిర్ స్టయిల్‌కి ఆ పేరు వచ్చివుంటుంది అనుకుంటారు ఎవరైనా. కానీ నిజానికి ఎల్సా అనేది ఓ కార్టూన్ క్యారెక్టర్ పేరు. వాల్ట్ డిస్నీ యానిమేషన్ స్టూడియోస్ వాళ్లు తీసిన ‘ఫ్రోజెన్’ అనే యానిమేటెడ్ ఫిల్మ్‌లోని ప్రధాన పాత్ర ఎల్సా. ఆమెకు ఈ హెయిర్ స్టయిలే ఉంటుంది. అది చాలామందికి నచ్చేసింది. దాంతో ‘ఎల్సా హెయిర్ స్టయిల్’గా దీనికి పేరు వచ్చింది. ఈ జడ ఎలా వేసుకోవాలంటే... Steps 1 నుదురు దగ్గర్నుంచి ఓ పాయను తీసి స్లయిడ్ పెట్టాలి. 2 తర్వాత రెండోవైపు నుంచి కూడా ఓ పాయను తీసి స్లయిడ్ పెట్టాలి. 3 రెండు పాయలనూ కలిపి రబ్బర్‌బ్యాండ్ పెట్టేయాలి. 4 బ్యాండ్ పెట్టిన జుత్తును మూడు పాయలుగా చేయాలి. 5 మూడు పాయలనూ జడలా అల్లుకోవాలి. 6 జడను అల్లుతూ మళ్లీ రెండు పక్కల నుంచి రెండు పాయలను తీసి ఈ జడలో కలిపేయాలి. 7 కొంచెం అల్లిన తర్వాత మళ్లీ పక్కనుంచి రెండు పాయలు తీసుకుని కలపాలి. 8 ఇలా పాయలు పాయలుగా తీసుకుని జడలు అల్లుకుంటూ పోవాలి. అయితే మరీ టైట్‌గా లేకుండా లూజులూజుగా ఉంచుకోవాలి. 9 జడ మొత్తం అల్లిన తరువాత చివర కాస్త జుత్తును వదిలేసి రబ్బర్ బ్యాండ్ పెట్టేయాలి. ఈ హెయిర్ స్టయిల్ మిడ్డీస్ మీదికి, జీన్స్-టీషర్ట్స్ మీదికి చాలా బాగుంటుంది. -
జుట్టుతో కారు జట్టు..
ఇది జుట్టున్న కారు.. చూశారుగా.. దీనికెంత కేశ సంపద ఉందో.. ఈ ఫియట్ కారుపై మొత్తం 120 కిలోల శిరోజాలు ఉన్నాయి. ఇటలీకి చెందిన హెయిర్ స్టైలిస్ట్ మారియా మగ్నో తన కారును మొత్తం మానవ కేశాలతో అలంకరించారు. లోపలా బయటా అంతటా అవే. ఇందుకోసం మొత్తం 150 గంటలు శ్రమించారు. 2010లో దీనికి సంబంధించిన విభాగంలో(మానవ కేశాలతో అలంకరించిన కారు) గిన్నిస్ రికార్డును(100 కిలోల శిరోజాలు) సాధించిన మారియా ఇటీవల మరో 20 కిలోల కేశాలు దానికి జత చేసి.. తన రికార్డును తానే బద్దలు కొట్టారు. ఈ రికార్డులో మన పాత్ర కూడా ఉందండి. ఎందుకంటే.. ఇందులో ఎక్కువ భాగం శిరోజాలు మనవే. ఐరోపా దేశాల వారితో పోలిస్తే.. మనవాళ్ల శిరోజాలు బలంగా.. ఎక్కువ కాలం మన్నేలా ఉంటాయట. దీంతో మారియా మన దేశం నుంచి శిరోజాలను దిగుమతి చేసుకుని మరీ.. ఈ కారు అలంకరణలో వినియోగించారు. -
మళ్లీ హెయిర్ స్టయిల్ మార్చాడు!
-
కమల్ బాటలో హీరో ధనుష్
ప్రయోగాలు చేయడంలో కమల్ హాసన్ తరువాతనే ఏ నటుడయినా అన్నది ఎవరూ కాదనలేరు. అలాంటి పలు ప్రయోగాలతో అత్యధికంగా విజయం సాధించిన హీరో ఆయనే. తాజాగా నటిస్తున్న ఉత్తమ విలన్ చిత్రం కూడా ప్రయోగాత్మక చిత్రమే. 1980 కాల ఘట్టం, ప్రస్తుత కాలం అంటూ ఈ చిత్ర కథ నడుస్తుంది. యువ నటుడు ధనుష్ ఇప్పుడు కమల్ హాసన్‌ను అనుసరిస్తున్నారనిపిస్తోంది. ఈయన నటిస్తున్న తాజా చిత్రాల్లో అనేగన్ ఒకటి. ప్రముఖ చాయాగ్రహకుడు కె.వి.ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ధనుష్ వివిధ గెటప్‌లలో కనిపించనున్నారట. కమల్ హాసన్ గతంలో నటించిన టిక్ టిక్ టిక్ చిత్రం తరహాలో ఉండే ఈ చిత్రంలో ధనుష్ డిఫరెంట్ హెయిర్ స్టరుుల్తో కూడిన గెటప్‌లలో కనిపించనున్నారని దర్శకుడు కె.వి.ఆనంద్ వెల్లడించారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో ధనుష్ సరసన బాలీవుడ్ బ్యూటీ అమిరా నటిస్తున్నారు. డిఫరెంట్ లొకేషన్స్‌లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రానికి హారిష్ జయరాజ్ సంగీత బాణీలు కడుతున్నారు. ఏజీఎస్ ఎంటర్ టెయిన్మెంట్ సంస్థ అనేగన్ చిత్రాన్ని నిర్మిస్తోంది.