కమల్ బాటలో హీరో ధనుష్ | Dhanush's hairstyle for Anegan inspired from Kamal Haasan | Sakshi
Sakshi News home page

కమల్ బాటలో హీరో ధనుష్

Published Tue, Jul 1 2014 11:37 PM | Last Updated on Sat, Sep 2 2017 9:39 AM

కమల్ బాటలో హీరో ధనుష్

కమల్ బాటలో హీరో ధనుష్

ప్రయోగాలు చేయడంలో కమల్ హాసన్ తరువాతనే ఏ నటుడయినా అన్నది ఎవరూ కాదనలేరు. అలాంటి పలు ప్రయోగాలతో అత్యధికంగా విజయం సాధించిన హీరో ఆయనే. తాజాగా నటిస్తున్న ఉత్తమ విలన్ చిత్రం కూడా ప్రయోగాత్మక చిత్రమే. 1980 కాల ఘట్టం, ప్రస్తుత కాలం అంటూ ఈ చిత్ర కథ నడుస్తుంది. యువ నటుడు ధనుష్ ఇప్పుడు కమల్ హాసన్‌ను అనుసరిస్తున్నారనిపిస్తోంది. ఈయన నటిస్తున్న తాజా చిత్రాల్లో అనేగన్ ఒకటి. ప్రముఖ చాయాగ్రహకుడు కె.వి.ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ధనుష్ వివిధ గెటప్‌లలో కనిపించనున్నారట.
 
 కమల్ హాసన్ గతంలో నటించిన టిక్ టిక్ టిక్ చిత్రం తరహాలో ఉండే ఈ చిత్రంలో ధనుష్ డిఫరెంట్ హెయిర్ స్టరుుల్‌తో కూడిన గెటప్‌లలో కనిపించనున్నారని దర్శకుడు కె.వి.ఆనంద్ వెల్లడించారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో ధనుష్ సరసన బాలీవుడ్ బ్యూటీ అమిరా నటిస్తున్నారు. డిఫరెంట్ లొకేషన్స్‌లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రానికి హారిష్ జయరాజ్ సంగీత బాణీలు కడుతున్నారు. ఏజీఎస్ ఎంటర్ టెయిన్‌మెంట్ సంస్థ అనేగన్ చిత్రాన్ని నిర్మిస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement