సుబ్బలక్ష్మి హీరోయినా..? ఛాన్సే లేదు! - గౌతమి | Subbulakshmi heroin ..? No chance! -gowthami | Sakshi
Sakshi News home page

సుబ్బలక్ష్మి హీరోయినా..? ఛాన్సే లేదు! - గౌతమి

Published Sat, Nov 19 2016 10:52 PM | Last Updated on Mon, Sep 4 2017 8:33 PM

సుబ్బలక్ష్మి హీరోయినా..? ఛాన్సే లేదు! - గౌతమి

సుబ్బలక్ష్మి హీరోయినా..? ఛాన్సే లేదు! - గౌతమి

లోక నాయకుడు కమల్ హాసన్‌తో పదమూడేళ్ల సహ జీవనానికి నటి గౌతమి ఎందుకు కటీఫ్ చెప్పారు? చెన్నై కోడంబాక్కమ్‌లో సినీ జనాలు చెప్పే కబుర్లు వింటే ‘అబ్బో.. అవునా? నిజమేనా?’ అనకుండా ఎవరూ ఉండలేరు. ‘శ్రుతీ హాసన్‌తో గౌతమి గొడవ పడ్డారట!’ దగ్గర్నుంచి కుప్పలు తెప్పలుగా పలు వార్త లొచ్చాయి. ఏవేవో విశ్లేషణలు చేశారు. తాజాగా వినిపిస్తోన్న పుకారు ఏంటంటే.. గౌతమి కుమార్తె సుబ్బలక్ష్మి త్వరలో హీరోయిన్ కానున్నారు.

కుమార్తెను హీరోయిన్‌గా పరిచయం చేయమని ధనుష్‌తో పాటు పలువురు యంగ్ హీరోలతో గౌతమి సంప్రతింపులు జరిపారట! ఈ వార్తలను గౌతమి ఖండించారు. ‘‘నా బేబీ (సుబ్బలక్ష్మి) పరిచయ చిత్రం గురించి శుభాకాంక్షలు తెలి పిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. కానీ, అది తప్పుడు వార్తే. ప్రస్తుతం తన దృష్టి చదువు మీదే. యాక్టింగ్ ప్లాన్స్ లేవు’’ అని గౌతమి ట్వీట్ చేశారు. కమల్‌తో కటీఫ్ చెప్పడానికి కారణం గురించి ఎవరెన్నిసార్లు ప్రశ్నిం చినా మౌనంగానే ఉన్న గౌతమి, కూతురిపై వార్తలకు స్పష్టత ఇవ్వడంలో మాత్రం అలసత్వం ప్రదర్శించలేదు! ఎంతైనా పేగు బంధం కదా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement