gauthami
-
రిలేషన్షిప్లో అది దాటొద్దు.. నేను నేర్చుకున్న గుణపాఠమిదే: గౌతమి
హీరోయిన్‌గానే కాకుండా కాస్ట్యూమ్ డిజైనర్‌గానూ చిత్రపరిశ్రమలో పని చేసింది గౌతమి. కానీ తన జీవితాన్ని మాత్రం సరిగ్గా డిజైన్ చేసుకోలేకపోయింది. తెలుగు, తమిళంలో స్టార్స్‌తో కలిసి నటించిన ఈమె వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. మొదట్లో బిజినెస్మెన్ సందీప్ భాటియాను పెళ్లాడిన ఈమెకు కూతురు సుబ్బలక్ష్మి జన్మించింది. పాప పుట్టిన ఏడాదే అతడికి విడాకులిచ్చేసింది. 13 ఏళ్ల ప్రేమతర్వాతి కాలంటో కమల్ హాసన్‌తో ప్రేమలో పడింది. వీరిద్దరూ సహజీవనం చేశారు. కాలం కన్ను కుట్టిందో ఏమో కానీ 2016లో విడిపోయారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రిలేషన్‌షిప్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'నీ బలం నువ్వే.. బాధేసినప్పుడు నచ్చిన వ్యక్తి వీడియోలు చూడటమో లేదా నీలో ధైర్యాన్ని నింపే వ్యక్తి మాటలు వినడమో చేస్తుంటాం. ఒక్కొక్కరు ఒక్కో దారి అనుసరిస్తుంటారు. అలా ప్రతి ఒక్కరినీ ఏదో ఒక అంశం ఇన్స్పైర్ చేస్తూ ఉంటుంది. దానికి అట్రాక్ట్ అవుతారు.ఆ పాయింట్ దాటొద్దుకానీ నిజమైన బలం వేరెవరూ కాదు.. నాకు నేను, నీకు నువ్వే అసలైన బలం. ఒక రిలేషన్షిప్ వర్కవుట్ కాలేదంటే దానికి పూర్తి బాధ్యత నీదేనని నీ నెత్తిన వేసుకోవాల్సిన అవసరం లేదు. అది ఏ రిలేషన్ అయినా సరే.. ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఒక కేంద్ర బిందువు ఉంటుంది. ఇద్దరు సమానంగా అక్కడికి చేరుకోవాలి. కొన్ని కారణాల వల్ల కొందరు ఆ బిందువుకు దూరంగా ఉంటారు. పైగా మనకోసం చాలాదూరం వచ్చినట్లు ఫీలవుతారు. ఇలా ఒక్కసారి మోసం చేశారంటే మళ్లీ మళ్లీ మోసగిస్తూనే ఉంటారు. వారికి అదొక అలవాటుగా మారిపోతుంది.లైఫ్ లెస్సన్అప్పుడు నేనెందుకు నీకోసం అంత దూరం రావాలని మనల్నే తిరిగి ప్రశ్నిస్తారు. కావాలంటే నువ్వే వచ్చేయ్ అంటారు. ఇది నేను జీవితంలో నేర్చుకున్న ఓ గుణపాఠం. మనమెప్పుడూ ఆ బిందువును దాటి ముందుకు వెళ్లకూడదు. లవ్, కమిట్మెంట్ అనేది రెండువైపులా సమానంగా ఉండాలి. అప్పుడే ఆ బంధం ఎక్కువకాలం నిలుస్తుంది' అని గౌతమి చెప్పుకొచ్చింది. కాగా ఈమె కమల్‌తో కలిసి అపూర్వసహోదరగళ్, దేవర్ మగన్, పాపనాశం వంటి చిత్రాల్లో నటించింది.చదవండి: స్టార్ హీరో కొడుకు సెకండ్ హ్యాండ్ బట్టలు వాడతాడు! -
బీజేపీకి గౌతమి గుడ్‌బై
సాక్షి, చైన్నె : సినీ నటి గౌతమి బీజేపీకి గుడ్ బై చెప్పేశారు. పార్టీ నుంచి వైదొలగుతున్నట్లు ఆమె మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పార్టీలోని నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తనను మోసం చేసిన మోసగాడికి అండగా బీజేపీ నాయకులు ఉన్నారని తెలిసి తీవ్ర మనో వేదనకు గురైనట్టు పేర్కొన్నారు. గౌతమి విడుదల చేసిన ప్రకటనలోని వివరాలు.. ‘బరువెక్కిన హృదయంతో , తీవ్ర అసంతృప్తితో బీజేపీ నుంచి వైదొలగేందుకు నిర్ణయించాను. గత 25 సంవత్సరాలుగా పార్టీకి సేవలు అందిస్తూ వస్తున్నాను , ఈ పయనంలో ఎన్నో సవాళ్లు, ఒడి దొడుగులు ఎదుర్కొన్నాను. అయినా, తన పని తాను సక్రమంగా చేస్తూ ముందుకు సాగినట్టు పేర్కొన్నారు. పార్టీ నుంచి, నాయకుల నుంచి తనకు ఎలాంటి మద్దతు, సహకారం లేక పోవడమే కాకుండా నన్ను మోసం చేసిన అలగప్పన్‌కు అండగా తమ పార్టీ వాళ్లే ఉన్నట్టుగా వచ్చిన సమాచారం తీవ్రంగా కలచి వేసింది. 37 సంవత్సరాలు సినిమా, టీవీ, రేడియో, డిజిటల్ మీడియాలో కష్టపడి సంపాదించిన సొమ్ముతో కుమార్తెతో తన జీవితం ఉజ్వలమయంగా ఉండాల్సిందన్నారు. అయితే అలగప్పన్ తనను ఆర్థికంగా మోసం చేశాడని, నగదు, ఆస్తులను అపహరించాడని ఇటీవలే తన దృష్టి వచ్చిందన్నారు. ఈ విషయంగా పోలీసులను ఆశ్రయించానని గుర్తుచేశారు. అయితే ఆ మోసగాడికి బీజేపీలోని కొందరు నేతలు అండగా ఉండడం తనను కలిచి వేసిందని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, పోలీసులు, న్యాయం వ్యవస్థ మీద నమ్మకంతో తాను చేసిన ఫిర్యాదుపై న్యాయం దక్కుతుందనే ఎదురు చూపులో ఉన్నాను. 2021 ఎన్నికల్లో రాజపాళయం సీటు తనకే అని చెప్పడంతో పార్టీ బలోపేతానికి తీవ్ర కృషి చేశానని, చివరి క్షణంలో సీటు దక్కకుండా చేశారని గుర్తుచేస్తూ, ఎలాంటి మద్దతు , సహకారం, ఆదరణ లేని పార్టీలో కొనసాగలేను. నన్ను మోసం చేసిన వ్యక్తి 40 రోజులుగా బీజేపీ సీనియర్ల సహకారంతో అజ్ఞాతంలో ఉన్నట్టు వచ్చిన సమాచారం తనను మరింతగా కుంగదీసింది. అందుకే పార్టీ నుంచి బయటకు వెళ్తున్నాను’ అని ప్రకటించారు. ఇదిలా ఉండగా, గౌతమి నిర్ణయంపై బీజేపీ మహిళానేత,నటి కుష్భు విచారం వ్యక్తం చేశారు. అదే సమయంలో ఇటీవల బీజేపీ నుంచి బయటకు వచ్చిన నటి గాయత్రి రఘురాం మరో మారు తెర మీదకు వచ్చి, బీజేపీలో మహిళలకు గుర్తింపు లేదని, న్యాయం దక్కదని ఆవేదన వ్యక్తం చేశారు. -
నా కెరీర్లో స్పెషల్ ఫిల్మ్ ఇది
రాజేంద్ర ప్రసాద్, గౌతమి ప్రధాన పాత్రధారులుగా రాజ్ మదిరాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘#కృష్ణారామా’. వెంకట కిరణ్, కుమార్ కళ్లకూరి, హేమ మాధురి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా టీజర్ రిలీజ్ వేడుకలో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ– ‘‘సోషల్ మీడియా నేపథ్యంలో ఓ రిటైర్డ్ ఓల్డ్ పెయిర్ కోణంలో సాగే చిత్రం ఇది. అన్ని తరాల ప్రేక్షకులకు తగ్గట్లుగా నటించే అవకాశాలు నాకు వస్తుండటం నా అదృష్టం. ఈ తరానికి చెందిన కథ ఇది. నా కెరీర్లో స్పెషల్ ఫిల్మ్’’ అన్నారు. ‘‘మోడ్రన్ సబ్జెక్ట్‌తో రూపొందిన చిత్రం ఇది’’ అన్నారు గౌతమి. ‘ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుంది’’ అన్నారు రాజ్ మదిరాజు. -
చంపేస్తామంటూ బెదిరింపులు.. పోలీసులను ఆశ్రయించిన నటి
చెన్నై: సీనియర్ నటి గౌతమి పోలీసులను ఆశ్రయించింది. రూ.25 కోట్ల విలువైన స్థలం కబ్జా చేశారని.. అదేంటని ప్రశ్నించినందుకు తనను, తన కూతురిని చంపుతామని బెదిరిస్తున్నారంటూ చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే.. గౌతమికి శ్రీపెరుంబూర్ సహా తమిళనాడులోని పలు ప్రాంతాల్లో రూ.46 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. తన అనారోగ్యం కారణంగా కొన్ని ఆస్తులు అమ్మేయాలనుకుంది. ఈ పనిని అలగప్పన్ అనే ఏజెంట్‌కు అప్పజెప్పింది. కానీ ఆ ఆస్తిపై కన్నేసిన అలగప్పన్ ఫోర్జరీ సంతకాలు, నకిలీ పత్రాల సాయంతో దాన్ని తన సొంతం చేసుకున్నాడు. ఇదేంటని గౌతమి ప్రశ్నించగా.. రాజకీయ అండతో నటిని, ఆమె కూతురిని చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ సమస్యల వల్ల తన కూతురి చదువు కూడా డిస్టర్బ్ అవుతోందని ఫిర్యాదులో పేర్కొంది గౌతమంది. తన నుంచి కొట్టేసిన రూ.25 కోట్ల విలువైన స్థలాన్ని తిరిగి తనకు అప్పజెప్పాలని అభ్యర్థించింది. తనపై బెదిరింపులకు పాల్పడుతున్న అళగప్పన్‌పై చర్యలు చేపట్టాలని కోరింది. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా గౌతమి ప్రముఖ వ్యాపారవేత్త సందీప్ భాటియాను పెళ్లి చేసుకుంది. వీరికి సుబ్బలక్ష్మి అనే కూతురు పుట్టింది. కొంతకాలానికే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో భర్తకు విడాకులు ఇచ్చేసింది. అప్పటినుంచి సుబ్బలక్ష్మి.. గౌతమి వద్దే ఉంటోంది. కాగా కొన్నేళ్లపాటు కమల్ హాసన్‌తోనూ కలిసి ఉన్న ఆమె 2016లో అతడితో విడిపోయింది. చదవండి: ప్రియురాలిని పెళ్లాడిన యంగ్ హీరో.. ఫోటోలు వైరల్ -
నటి గౌతమి కూతుర్ని చూశారా? వైరల్ అవుతున్న ఫోటోలు
సీనియర్ నటి గౌతమి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగు, తమిళం తదితర దక్షిణాది భాషల్లో నటించి మెప్పించిన ఆమె అగ్రహీరోలతో జతకట్టింది. స్టార్ హీరోయిన్గా వెలుగొందుతున్న సమయంలోనే ఓ ప్రముఖ వ్యాపార వేత్త సందీప్ భాటియాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే వీరి పెళ్లి కథ ఏడాదికే ముగిసిపోయింది. మనస్పర్థల కారణంగా భర్త నుంచి విడిపోయి విడాకులు తీసుకున్నారు. అప్పటికే వీరికి సుబ్బలక్ష్మి అనే కూతురు పుట్టింది. అప్పట్నుంచి ఆమె తల్లి గౌతమి వద్దే ఉంటోంది. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సుబ్బలక్ష్మీ తనకు సంబంధించిన పలు విషయాలను షేర్ చేస్తుంటుంది. తాజాగా ఆమె లేటెస్ట్ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. హీరోయిన్‌కు ఏమాత్రం తగ్గని అందంతో సుబ్బలక్ష్మీ మెస్మరైజ్ చేస్తుంది. మరి త్వరలోనే ఈమె కూడా తల్లి గౌతమి లాగే సినిమాల్లోకి వస్తుందా అన్నది చూడాల్సి ఉంది. View this post on Instagram A post shared by subbu tadimalla (@maybesubbu) -
వెబ్ సిరీస్‌కు సెన్సార్ అవసరం: నటి గౌతమి ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రస్తుతం వెబ్‌సిరీస్‌ల హవా నడుస్తోంది. సినిమాలకు మాదిరిగా వెబ్‌సిరీస్‌కు సెన్సార్ నిబంధనలు లేకపోవడంతో వాటిలో హింసాత్మక సంఘటనలు, అశ్లీల సన్నివేశాలు హద్దు మీరుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఇదే విషయాన్ని నటి, కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యురాలు గౌతమి వద్ద ప్రస్తావించగా వెబ్ సిరీస్‌కు సెన్సార్ అవసరమని పేర్కొన్నారు. అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని తెలిపారు. గౌతమి తాజాగా స్టోరీ ఆఫ్ థింగ్స్ అనే వెబ్ సిరీస్‌లో ముఖ్యపాత్రను పోషించారు. ఈమెతో పాటు నటుడు భరత్, శాంతను భాగ్యరాజ్, రాజు, వినోద్ కిషన్, నటి అథితి బాలన్, రితికా సింగ్ నటించారు. చుట్పా ఫిలింస్ పతాకంపై రూపొందిన ఈ వెబ్ సిరీస్‌కు జార్జ్ దర్శకత్వం వహించారు. ఐదు స్టోరీస్‌తో రూపొందించారు. శుక్రవారం నుంచి సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‌ఫాంలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ గురించి మాట్లాడుతూ.. ఫాంటసీ నేపథ్యంలో సాగే ఎమోషనల్ సన్నివేశాలతో రూపొందించిన వెబ్ సిరీస్ ఇదన్నారు. వేయింగ్ స్కేల్, మిర్రర్, కార్, కంప్రెషర్, సెల్యులార్ మొదలగు ఐదు కథలతో కూడిన వెబ్ సిరీస్ అన్నారు. దీన్ని తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ, బెంగాలీ భాషల్లో స్ట్రీమింగ్ చేస్తున్నట్లు చెప్పారు. ఈ వెబ్ సిరీస్‌లో దెయ్యం లేకపోయినా అలాంటి థ్రిల్లింగ్ సన్నివేశాలు ఉంటాయని చెప్పారు. దర్శకుడు చెప్పిన కథ ఆకట్టుకోవడంతో తాను నటించినట్లు గౌతమి తెలిపారు. ఇందులో ఒక్కో స్టోరీ ఒక్కో జానర్లో ఉంటూ వీక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుందని ఆమె పేర్కొన్నారు. తనకు కనెక్ట్ అయ్యే సన్నివేశాలు చాలా ఉన్నాయని, అందుకే నటించడానికి అంగీకరించినట్లు నటుడు భరత్ చెప్పారు. గౌతమితో కలిసి నటించడం మంచి అనుభవంగా నటి అథితి బాలన్ పేర్కొన్నారు. -
కొత్త తారలతో ‘సంతోషత్తిల్ కలవరం’
తమిళసినిమా: నూతన తారలతో తెరకెక్కుతున్న చిత్రం సంతోషత్తిల్ కలవరం. ఈ చిత్రం ద్వారా క్రాంతి ప్రసాద్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన ఇంతకు ముందు పలు లఘు చిత్రాలను రూపొందించి అవార్డులను అందుకున్నారు. ఫిలిం ఇన్స్టిట్యూట్ విద్యార్థి క్రాంతి ప్రసాద్ కొందరు తెలుగు దర్శకుల వద్ద పని చేశారు. ఈ సంతోషత్తిల్ కలవరం చిత్రాన్ని శ్రీ గురు సినిమాస్ పతాకంపై వీసీ.తిమ్మారెడ్డి నిర్మిస్తున్నారు. చిత్రం వివరాలను దర్శకుడు తెలుపుతూ ఒక సంతోషకరమైన సమయంలో ఆందోళన జరిగితే ఆ పరిణామాలు ఏటు దారి తీస్తాయన్నదే ఈ చిత్ర ప్రధాన ఇతి వృత్తం అన్నారు. సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశంతో కూడిన ఈ చిత్రం లో ప్రేమ, స్నేహం, హాస్యం, ఆధ్యాత్మికం అంటూ జనరంజకమైన అంశాలన్నీ ఉంటాయన్నారు. ఇందులో నిరంత్, రుద్రాఆరా, ఆర్యన్, జై జగన్నాథ్, రాహుల్.సి కల్యాణ్, గౌతమి, సౌజన్య, ఆపేక్ష నూతన నటీనటులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారని తెలిపారు. దీనికి శివనాగ్ సంగీతాన్ని అందిస్తుండగా పౌవులియస్ ఛాయాగ్రహణం నెరపుతున్నారని చెప్పారు. చిత్ర షూటింగ్ పూర్తి అయ్యిందని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నట్లు వెల్లడించారు. -
ఐఏఎస్ కావాల్సిన యువతి...
ఆమె ఉన్నత విద్యావంతురాలు. ఇప్పటికే ఎంబీఏ పూర్తిచేసి, ఐఏఎస్ కావాలనే లక్ష్యంతో సివిల్స్‌కు ప్రత్యేకంగా కోచింగ్ తీసుకుంటోంది. సంక్రాంతి సెలవుల కోసం ఇంటికి వచ్చిన ఆమె.. అంతలోనే తాగుబోతుల కారణంగా రోడ్డు ప్రమాదంలో మరణించింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమె చెల్లెలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు - నరసాపురం రోడ్డులో దిగమర్రు వద్ద ఈ ప్రమాదం జరిగింది. పాలకొల్లు నుంచి నరసాపురం వెళ్తున్న సఫారీ కారు అదే రోడ్డులో వెళ్తున్న హోండా యాక్టివా స్కూటర్‌ను ఢీకొంది. ఆ స్కూటర్‌పై అక్కాచెల్లెళ్లు దంగేటి గౌతమి, దంగేటి పావని వెళ్తున్నారు. ఆ కారు గౌతమిని సుమారు 200 మీటర్ల దూరం ఈడ్చుకుపోయి, నరసాపురం పెదకాలువలోకి దూసుకుపోయింది. స్కూటర్ దిగమర్రు పంటకాలువలో పడిపోయింది. అక్కాచెల్లెళ్లు తీవ్రంగా గాయపడటంతో వారిని స్థానికులు నరసాపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. గౌతమికి రెండు కాళ్లు విరిగిపోయి తీవ్రంగా గాయపడింది. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మరణించింది. పావని చికిత్స పొందుతోంది. కాగా, గౌతమి తండ్రి ఏడాది క్రితమే చనిపోయారు. ఆ దుఃఖం నుంచి కుటుంబం కోలుకోకముందే గౌతమి మరణించడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మద్యం మత్తు వల్లే ప్రమాదం టాటా సఫారీలో వెళుతున్న యువకులు మద్యం సేవించి ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కారుకు సమీపంలో మద్యం బాటిల్ కవరు రోడ్డుకి అతుక్కుపోయి ఉంది. బాటిల్ నుజ్జునుజ్జు అయ్యింది. మద్యం మత్తులో మోటారు సైకిల్‌ను ఢీకొట్టారని అంటున్నారు. ప్రమాదానికి కారకులైన నిందితులు పారిపోయారు. -
సుబ్బలక్ష్మి హీరోయినా..? ఛాన్సే లేదు! - గౌతమి
లోక నాయకుడు కమల్ హాసన్‌తో పదమూడేళ్ల సహ జీవనానికి నటి గౌతమి ఎందుకు కటీఫ్ చెప్పారు? చెన్నై కోడంబాక్కమ్‌లో సినీ జనాలు చెప్పే కబుర్లు వింటే ‘అబ్బో.. అవునా? నిజమేనా?’ అనకుండా ఎవరూ ఉండలేరు. ‘శ్రుతీ హాసన్‌తో గౌతమి గొడవ పడ్డారట!’ దగ్గర్నుంచి కుప్పలు తెప్పలుగా పలు వార్త లొచ్చాయి. ఏవేవో విశ్లేషణలు చేశారు. తాజాగా వినిపిస్తోన్న పుకారు ఏంటంటే.. గౌతమి కుమార్తె సుబ్బలక్ష్మి త్వరలో హీరోయిన్ కానున్నారు. కుమార్తెను హీరోయిన్గా పరిచయం చేయమని ధనుష్‌తో పాటు పలువురు యంగ్ హీరోలతో గౌతమి సంప్రతింపులు జరిపారట! ఈ వార్తలను గౌతమి ఖండించారు. ‘‘నా బేబీ (సుబ్బలక్ష్మి) పరిచయ చిత్రం గురించి శుభాకాంక్షలు తెలి పిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. కానీ, అది తప్పుడు వార్తే. ప్రస్తుతం తన దృష్టి చదువు మీదే. యాక్టింగ్ ప్లాన్స్ లేవు’’ అని గౌతమి ట్వీట్ చేశారు. కమల్‌తో కటీఫ్ చెప్పడానికి కారణం గురించి ఎవరెన్నిసార్లు ప్రశ్నిం చినా మౌనంగానే ఉన్న గౌతమి, కూతురిపై వార్తలకు స్పష్టత ఇవ్వడంలో మాత్రం అలసత్వం ప్రదర్శించలేదు! ఎంతైనా పేగు బంధం కదా! -
ఇప్పుడు నేనేమీ చెప్పాలనుకోవడం లేదు!
నటుడు కమల్‌హాసన్‌తో పదమూడేళ్ల సహజీవనాన్ని ముగిస్తూ మంగళవారం గౌతమి ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ‘‘ఇద్దరు వ్యక్తులు కలసి జీవించడానికి పెళ్లే చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇద్దరి మధ్యా మంచి అవగాహన ఉంటే చాలు’’ అని పలు సందర్భాల్లో కమల్, గౌతమి పేర్కొన్నారు. మరి ఇప్పుడు వాళ్ల మధ్య ఏ విషయంలో అవగాహన కొరవడి ఉంటుందన్నది చర్చనీయాంశమైంది. ఈ చర్చల్లో కీలకంగా శ్రుతీహాసన్ పేరు వినిపిస్తోంది. ఒకరి నిర్ణయాలతో నాకు సంబంధం లేదు: శ్రుతి పెద్ద కూతురు శ్రుతీహాసన్‌తో కమల్ నటిస్తున్న తాజా చిత్రం ‘శభాష్ నాయుడు’ షూటింగ్లో గౌతమి, శ్రుతీ మధ్య కాస్ట్యూమ్స్ పరంగా జరిగిన వాదన, ఆ తర్వాత నెలకొన్న పరిణామాలే తాజా పరిణామానికి కారణం అయ్యుంటాయన్నది కొందరి ఊహ. కానీ, గౌతమికీ, తనకూ మధ్య పొరపొచ్ఛాలు లేవని ఆ సమయంలో శ్రుతి వివరణ కూడా ఇచ్చారు. ఇప్పుడు తండ్రి నుంచి గౌతమి విడిపోవడానికి తాను కారణం అనే వార్త ప్రచారంలోకి వచ్చిన నేపథ్యంలో.. ఎవరి వ్యక్తిగత విషయాల గురించి, నిర్ణయాల గురించి తనకు సంబంధం లేదని శ్రుతి పేర్కొన్నారు. కుటుంబ సభ్యులపైన గౌరవం ఉందన్నారు. తాను ప్రేమించేది వారినేనన్నారు. శ్రుతి హాసన్ పేరిట ఆమె మీడియా పర్సన్ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ వివరణ తెలిపారు. ఆ సంగతలా ఉంచితే... కమల్ పేరిట వార్తల వివాదం కమల్, తానూ విడిపోతున్న విషయాన్ని గౌతమి ప్రకటించిన నేపథ్యంలో కమల్ మానసిక పరిస్థితి ఎలా ఉందన్నది తాజా చర్చ. ఈ విషయమై ఓ ఆంగ్ల పత్రిక విలేఖరి కమల్ని సంప్రదించగా, కొన్ని క్షణాలు మౌనంగా ఉండి ఆ తర్వాత కమల్ పెదవి విప్పినట్లు కొన్ని పత్రికల్లో, సైట్స్‌లో వచ్చింది. ‘‘ఇప్పుడు నా ఫీలింగ్స్‌కి ప్రాధాన్యం లేదు. గౌతమి, సుబ్బు సౌకర్యవంతంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నా. వాళ్లకు మంచి జరగాలని ఆశిస్తున్నా. ఎప్పుడు కావాలన్నా వాళ్ల కోసం నేనున్నానన్నది వాళ్లు తెలుసుకోవాలి. శ్రుతి, అక్షర, సుబ్బలక్ష్మి (గౌతమి కూతురు)- ముగ్గురు కూతుళ్ల తండ్రిగా ఈ ప్రపంచంలో నేను లక్కీయస్ట్ ఫాదర్ అనుకుంటున్నా’’ అని కమల్ వ్యాఖ్యానించినట్లు ఆ వార్తలు పేర్కొన్నాయి. అలా చేయడం అనాగరికం అంటున్న కమల్ అయితే, బుధవారం సాయంత్రం కమల్ తాను ఎవరితోనూ ఏమీ మాట్లాడలేదన్నట్లు ట్విట్టర్లో ఓ ప్రకటన చేశారు. ‘‘ఇలాంటి సమయంలో నా పేరు మీద ఎవరో ఏదో ప్రకటిస్తున్నారు. అలా ఆడుకోవడం వివేక వంతం కాదు. దాన్ని అనాగరికం అంటారు. ఇప్పుడు నేనేదీ ప్రకటించాలనుకోవడం లేదు’’ అని ఆ ప్రకటనలో పేర్కొ న్నారు. అలా పత్రికల్లో తన పేర వస్తున్న వార్తలు తప్పని ఆయన చెప్పకనే చెప్పారు. ఆ తరువాత కాసేపటికి ఆయన పక్షాన మీడియా పర్సన్ మరింత వివరంగా ప్రకటన చేశారు. గౌతమి తన నుంచి విడిపోవాలన్న నిర్ణయం ఆమె వ్యక్తిగత విషయమనీ, తనెక్కడ ఉన్నా బాగుండాలని కోరు కుంటున్నాననీ, గౌతమి ఎప్పుడైనా సాయం కోరుకుంటే అది అందించడానికి సిద్ధమనీ తాను అన్నట్లుగా మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని కమల్ ఖండించారు. అసత్య ప్రచారం మంచిది కాదన్నారు. గౌతమి గురించి తానెలాంటి భావాన్ని వ్యక్తం చేయలేదని ఆయన స్పష్టం చేశారు. మొత్తానికి, గౌతమి ప్రకటన, దానిపై వార్తలు, శ్రుతి, కమల్ల ప్రకటనలతో ఈ వ్యక్తిగత వ్యవహారం ఇప్పుడు నలుగురి నోళ్ళలో నానుతోంది. -
తారా తీరం
-
'మనమంతా' మూవీ రివ్యూ
టైటిల్ : మనమంతా జానర్ : ఫ్యామిలీ డ్రామా తారాగణం : మోహన్ లాల్, గౌతమి, విశ్వాంత్, రైనారావు, గొల్లపూడి మారుతీరావు... సంగీతం : మహేష్ శంకర్ దర్శకత్వం : చంద్రశేఖర్ ఏలేటి నిర్మాత : సాయి కొర్రపాటి ఐతే, అనుకోకుండా ఒకరోజు, సాహసం లాంటి సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కిన థ్రిల్లింగ్ ఫ్యామిలీ డ్రామా మనమంతా. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తొలిసారిగా ఓ తెలుగు సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్ చేయడంతో పాటు, ఒకప్పటి స్టార్ హీరోయిన్ గౌతమీ ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వడం కూడా సినిమా మీద భారీ హైప్ క్రియేట్ చేసింది. మరి ఆ అంచనాలను మనమంతా అందుకుందా...?తెలుగులో మోహన్ లాల్ ప్రయత్నం ఎంత వరకు వర్క్ అవుట్ అయ్యింది..? మనమంతా చంద్రశేఖర్ ఏలేటికి కమర్షియల్ హిట్ ఇచ్చిందా..? కథ : సాయిరామ్ (మోహన్ లాల్), గాయత్రి(గౌతమి), అభిరామ్( విశ్వాంత్), మహిత(రైనారావు).. ఈ నలుగురి జీవితాల్లో జరిగిన సంఘటనల నేపథ్యంలో సాగే కథ మనమంతా.. సాయిరామ్ ఓ సూపర్ మార్కెట్లో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేసే మధ్యతరగతి వ్యక్తి. కుటుంబ పోషణకు తన జీతం సరిపోక అప్పులు చేస్తూ బండి లాగిస్తుంటాడు. అదే సమయంలో తన స్టోర్ మేనేజర్ రిటైర్ అవ్వటంతో ఆ మేనేజర్ పోస్ట్ తనకు వస్తుందని ఆశపడతాడు. కానీ విశ్వనాధ్ అనే మరో అసిస్టెంట్ మేనేజర్ వల్ల తనకు ఆ పోస్ట్ రాదేమో అనుమానంతో విశ్వనాధ్‌ను అడ్డు తప్పించడానికి ప్లాన్ చేస్తాడు.. కానీ ఆ ప్లాన్ మూలంగా తానే చిక్కుల్లో పడతాడు. గాయ్రతి ఓ మధ్యతరగతి గృహిణి, ఉన్నత చదువులు చదివినా.. అవన్ని పక్కన పెట్టేసి ఇంటి పనులుకే పరిమితమవుతుంది. మిడిల్ క్లాస్ మనుషులకు ఎదురయ్యే అవమానాలకు కన్నీళ్లు పెట్టడం తప్ప ఏం చేయలేని నిస్సహాయురాలు. అలాంటి గాయత్రికి తన చిన్నతనంలో తన వల్ల సాయం పొందిన ఓ పెద్దమనిషి సింగపూర్‌లో ఉద్యోగం ఇప్పిస్తానంటాడు. అప్పటి వరకు ఇల్లు తప్ప మరో ప్రపంచం తెలియని గాయత్రి, కుటుంబం కోసం సింగపూర్ వెళ్లడానికి సిద్ధమవుతుంది. విశ్వాంత్ చదువు తప్ప మరో ఆలోచనలేని ఇంజనీరింగ్ స్టూడెంట్. అనుకోకుండా తన జీవితంలోకి వచ్చిన ఐరా(అనీషా ఆంబ్రోస్) అనే అమ్మాయి వల్ల విశ్వాంత్ ఆలోచనలు మారిపోతాయి.. ఐరానే తన ప్రపంచం అనుకుంటాడు. కానీ ఐరా, విశ్వాంత్‌ను ఒక ఫ్రెండ్ గానే భావిస్తుంది. మహిత తన చుట్టూ ఉన్న వాళ్లందరిని ఆనందంగా చూడలనుకునే చిన్నపాప. గుడిసెలో ఉండే ఓ చిన్నబాబుతో స్నేహం చేసి.. ఆ అబ్బాయికి తను చదివే స్కూల్లో అడ్మిషన్ ఇప్పిస్తుంది. కానీ ఆ అబ్బాయి తప్పిపోవటంతో తనే వెతికే బాధ్యతను తీసుకుంటుంది. ఇలా నాలుగు రకాల సమస్యలతో బాధపడుతున్న ఈ నలుగురికి సంబంధం ఏంటి..? సాయిరామ్ మేనేజర్ పోస్ట్ కోసం కొని తెచ్చుకున్న సమస్య నుంచి బయట పడ్డాడా..? గాయత్రి కుటుంబాన్ని వదిలి సింగపూర్ వెళ్లిందా..? విశ్వాంత్.. ఐరా కాదన్న తరువాత ఏమైయ్యాడు..? మహిత తన ఫ్రెండ్‌ను కనుక్కోగలింగిందా..? అన్నదే మిగతా కథ. నటీనటులు : ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన తెలుగు సినిమా కోసం మోహన్ లాల్ లాంటి సూపర్ స్టార్‌ని ఒప్పించిన చంద్రశేఖర్ ఏలేటి అప్పుడే తొలి విజయం సాధించాడు. మధ్యతరగతి సమస్యలతో సతమతమయ్యే ఉద్యోగిగా మోహన్ లాల్ నటన అద్భుతమనే చెప్పాలి. తొలి సినిమాలోనే సొంతం గొంతుతో డబ్బింగ్ చెప్పిన మోహన్ లాల్, మొదట్లో కాస్త తడబడినట్టు అనిపించినా.. తరువాత బాగానే ఆకట్టుకున్నాడు. గాయత్రిగా గౌతమి నటన బాగుంది. మిడిల్ క్లాస్ మహిళగా పర్ఫెక్ట్ గా సూట్ అయ్యింది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో ఆమె సీనియారిటీ సినిమాకు ప్లస్ అయ్యింది. విశ్వాంత్, రైనారావులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఇక ఇతర పాత్రల్లో గొల్లపూడి మారుతిరావు, వెన్నెలకిశోర్, హర్షవర్ధన్, నాజర్‌లు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. సాంకేతిక నిపుణులు : తన కెరీర్లో ప్రతీ సినిమా ఓ ప్రయోగంగా నిలిచిపోయేలా చేసే చంద్రశేఖర్ ఏలేటి మనమంతా సినిమాతో మరోసారి స్టైల్‌ను కంటిన్యూ చేశాడు. ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లేతో మధ్యతరగతి జీవితాలను వారి సమస్యలను అద్భుతంగా వెండితెర మీద ఆవిష్కరించాడు. నాలుగు కథలు ఒకేసారి నడుస్తున్నా.. ఎక్కడ ఆడియన్స్ కన్య్ఫూజ్ కాకుండా సినిమాను ముందుకు నడిపించాడు. నటీనటుల ఎంపిక నుంచి ప్రతీ విషయంలోనూ చంద్రశేఖర్ ఏలేటి మార్క్ సినిమాలో స్పష్టంగా కనిపించింది. మహేష్ శంకర్ అందించిన పాటలు విజువల్‌గా చాలా బాగున్నాయి. నేపథ్యం సంగీతం సినిమా స్థాయిని మరో మెట్టు పైకి తీసుకెళ్లింది. రాహుల్ శ్రీవాస్తవ్ సినిమాటోగ్రఫి, జివి చంద్రశేఖర్ ఎడిటింగ్ ఆకట్టుకుంటాయి. ప్లస్ పాయింట్స్ : ప్రధాన పాత్రల నటన స్క్రీన్ ప్లే క్లైమాక్స్ మైనస్ పాయింట్స్ : కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవటం ఓవరాల్‌గా మనమంతా అద్భుతమైన నటన, ఆసక్తికరమైన కథా కథనాలతో థ్రిల్ కు గురిచేసే ఫ్యామిలీ డ్రామా - సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్ -
'మనమంతా'కు క్లీన్ యు సర్టిఫికేట్
విలక్షణ దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ మనమంతా. మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. నాలుగు విభిన్న వ్యక్తిత్వాలు ఉన్న మనుషులు వాళ్ల కథల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మోహన్ లాల్ తో పాటు సీనియర్ హీరోయిన్ గౌతమి, కేరింత ఫేం విశ్వాంత్, బేబి రైనాలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఆగస్టు 5న రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. రెగ్యులర్ కమర్షియల్ జానర్ కు భిన్నంగా మూస మాస్ మసాలా అంశాలేవి లేకుండా తెరకెక్కిన ఈ సినిమాకు క్లీన్ యు సర్టిఫికేట్ ను అందించారు. మోహన్ లాల్ హీరోగా నటించిన తొలి సినిమానే అయినా తన పాత్రకు పూర్తి న్యాయం చేయటం కోసం తెలుగు నేర్చుకొని మరి ఆయనే స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నారు. -
ఒకే ప్రపంచం..నాలుగు కథలు.. మనమంతా
మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా తెరకెక్కుతున్న తొలి తెలుగు సినిమా మనమంతా. విభిన్న చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అభిరుచి గల నిర్మాత సాయి కొర్రపాటి వారాహి చలనచిత్ర బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్ టీజర్ రిలీజ్ అయ్యింది. తొలి టీజర్లో పాత్రల పరిచయంతో పాటు సినిమాలో ఆ పాత్రలు ప్రవర్తించే తీరును కూడా చూపించాడు దర్శకుడు. ఒకే ప్రపంచం.. నాలుగు కథలు అన్న ట్యాగ్ లైన్లోనే ఈ సినిమాలో నాలుగు కీలక పాత్రలు ఉంటాయన్న హింట్ ఇచ్చిన దర్శకుడు ఆ పాత్రలను తొలి టీజర్లోనే పరిచయం చేసేశాడు. మహిత్, స్కూలుకు వెళ్లే 12 ఏళ్ల అమ్మాయి. అభిరామ్ ఇంజనీరింగ్ స్టూడెంట్. గాయత్రి హౌస్ వైఫ్, సాయిరాం సూపర్ మార్కెట్లో అసిస్టెంట్ మేనేజర్. ఇలా సినిమాలో నాలుగు కీలక పాత్రలను టీజర్లో పరిచయం చేశాడు దర్శకుడు. చాలాకాలం తరువాత గౌతమి టాలీవుడ్ స్క్రీన్ మీద రీ ఎంట్రీ ఇస్తుండగా, కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ తొలిసారిగా తెలుగు సినిమాలో నటిస్తున్నాడు. అంతేకాదు తన తొలి సినిమాలోనే ఓన్‌గా డబ్బింగ్ చెప్పుకొని అందరికీ షాక్ ఇచ్చాడు. ఇలాంటి క్రేజీ కాంబినేషన్‌ను సెట్ చేసి, రిలీజ్‌కు ముందే మంచి హైప్ క్రియేట్ చేసిన నిర్మాత సాయి కొర్రపాటి, క్వాలిటీ పరంగా కూడా అదే స్థాయిని చూపిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటున్న ఈ సినిమాను తెలుగుతో పాటు మళయాళంలోనూ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. -
మోహన్‌లాల్ తెలుగు సినిమా షూటింగ్ పూర్తి
ఐతే, ఒక్కడున్నాడు, సాహసం లాంటి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి. కమర్షియల్ ఫార్మాట్‌కు భిన్నంగా ప్రయోగాత్మక చిత్రాలను తెరకెక్కించే ఈ క్రియేటివ్ డైరెక్టర్ ప్రస్తుతం మళయాల సూపర్ స్టార్‌తో ఫ్యామిలీ డ్రామాను తెరకెక్కిస్తున్నాడు. నలుగురు వ్యక్తుల జీవితాల్లో జరిగిన సంఘటనల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు మళయాల భాషల్లో ఒకేసారి రూపొందిస్తున్నాడు. వారాహి చలన చిత్ర బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఒకప్పటిస్టార్ హీరోయిన్ గౌతమీతో పాటు కేరింత ఫేం విశ్వంత్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. -
షూటింగ్ పూర్తి చేసుకున్న మనమంతా
ఐతే, ఒక్కడున్నాడు, సాహసం లాంటి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి. కమర్షియల్ ఫార్మాట్‌కు భిన్నంగా ప్రయోగాత్మక చిత్రాలను తెరకెక్కించే ఈ క్రియేటివ్ డైరెక్టర్ ప్రస్తుతం మళయాల సూపర్ స్టార్‌తో ఫ్యామిలీ డ్రామాను తెరకెక్కిస్తున్నాడు. నలుగురు వ్యక్తుల జీవితాల్లో జరిగిన సంఘటనల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు మళయాల భాషల్లో ఒకేసారి రూపొందిస్తున్నాడు. వారాహి చలన చిత్ర బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఒకప్పటిస్టార్ హీరోయిన్ గౌతమీతో పాటు కేరింత ఫేం విశ్వంత్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. -
నలుగురు వ్యక్తుల చుట్టూ మనమంతా
మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, గౌతమి చాలా విరామం తర్వాత మళ్లీ తెలుగు తెరపై కనిపించ నున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరూ ముఖ్య పాత్రల్లో నటించనున్న చిత్రం ‘మనమంతా’. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో వారాహి చలన చిత్ర పతాకంపై సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్రం ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశాన్ని దేవుని పటాలపై చిత్రీకరించారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘మధ్యతరగతి కుటుంబాలకు చెందిన నలుగురు వ్యక్తుల చుట్టూ ఈ సినిమా సాగుతుంది. సోమవారం చిత్రీకరణ మొదలవుతుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రాహుల్, సంగీతం: మహేశ్ శంకర్, నిర్మాత: రజనీ కొర్రపాటి. -
కమల్‌తో మరోసారి గౌతమి
కమలహాసన్‌తో గౌతమి మరోసారి వెండితెరపై కనిపించనున్నారా? అనే ప్రశ్నకు కోలీవుడ్‌లో ఔననే సమాధానం వస్తోంది. మలయాళంలో మంచి విజయాన్ని సాధించి న దృశ్యం చిత్రం తమిళంలో రీమేక్ కానుంది. పద్మశ్రీ కమలహాసన్ హీరో గా నటించనున్న ఈ చిత్రంలో ఆయన సరసన నటించే హీరోయిన్ ఎవరన్న విషయంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతునే ఉం ది. ఈ చిత్రం మలయూళంలో మీనా నటిం చారు. తెలుగు రీమేక్‌లోను ఆమె నటిస్తున్నారు. తమిళంలో ఈ పాత్రను గౌతమి నటించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆమె కూడా ఈ పాత్రపై ఆసక్తి చూపడం విశేషం. ఈ విషయమై గౌతమి కమలహాసన్‌తో చర్చిస్తున్నట్లు సమాచారం. ఈమె చివరిగా 2006లో శాసనం అనే చిత్రంలో నటించారు. ప్రస్తుతం కమలహాసన్ సహజీవనం గడుపుతున్న గౌతమి ఆయన సరసన అపూర్వ సహోదరగళ్, దేవర్‌మగన్, నమ్మవర్, కురుదిపునల్ చిత్రాల్లో నటించారు. దృశ్యం చిత్రంలో నటించడం ఖాయమైతే కమలహాసన్‌తో ఆమె నటించే ఐదో చిత్రం అవుతుంది. దృశ్యం చిత్రంలో గౌతమి నటించే విషయమై చర్చలు జరుగుతున్నట్లు చిత్ర దర్శకుడు జియా జోసఫ్ తెలిపారు. ఈ చిత్రం జూలై 15న సెట్‌పైకి వెళ్లనున్నట్లు ఆయన వెల్లడిం చారు. చిత్రం తిరునెల్వేలి బ్యాక్ డ్రాప్లో రూపొందనున్నట్లు చెప్పారు. యువ సంగీత దర్శకుడు జిబ్బాన్ సంగీత బాణీలు కడుతున్న ఈ చిత్రానికి మలయాళ చిత్రానికి పని చేసిన సుజిత్ వాసుదేవన్నే ఛాయాగ్రహణం అందిస్తారు. -
ఆండ్రియాకు కాస్ట్యూమ్ డిజైనింగ్
కథానాయికలు ముదిరితే కాస్ట్యూమ్ డిజైనర్లు అవుతారనేది సినీ పరిశ్రమ తాజా నానుడి. ఈ జాబితాలో ఒకప్పటి కథానాయిక గౌతమికి ఎప్పటినుంచో స్థానం ఉంది. కమల్‌హాసన్ నటించే సినిమాల్లో ఆయనకు కాస్ట్యూమ్స్ డిజైన్ చేసేది గౌతమి అన్న విషయం పరిశ్రమలో అందరికీ తెలుసు. తాజాగా ఆమె ఒక అడుగు ముందుకు వేసి, కథానాయిక ఆండ్రియాకు కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తున్నారు. త్వరలో మొదలు కానున్న ‘ఉత్తమ విలన్’ చిత్రంలో కమల్ సరసన ఆండ్రియా ఒక నాయికగా చేస్తున్నారు. భవిష్యత్తులో మరికొంతమంది కథానాయికలకు గౌతమి కాస్ట్యూమ్స్ డిజైన్ చేసే ఉద్దేశంలో ఉన్నారట.