కొత్త తారలతో ‘సంతోషత్తిల్‌ కలవరం’ | New Actors Team Up For Santhoshathil Kalavaram | Sakshi
Sakshi News home page

Published Sat, Apr 21 2018 8:28 AM | Last Updated on Sat, Apr 21 2018 8:28 AM

New Actors Team Up For Santhoshathil Kalavaram - Sakshi

తమిళసినిమా: నూతన తారలతో తెరకెక్కుతున్న చిత్రం సంతోషత్తిల్‌ కలవరం. ఈ చిత్రం ద్వారా క్రాంతి ప్రసాద్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన ఇంతకు ముందు పలు లఘు చిత్రాలను రూపొందించి అవార్డులను అందుకున్నారు. ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌ విద్యార్థి క్రాంతి ప్రసాద్‌ కొందరు తెలుగు దర్శకుల వద్ద పని చేశారు. ఈ సంతోషత్తిల్‌ కలవరం చిత్రాన్ని శ్రీ గురు సినిమాస్‌ పతాకంపై వీసీ.తిమ్మారెడ్డి నిర్మిస్తున్నారు. చిత్రం వివరాలను దర్శకుడు తెలుపుతూ ఒక సంతోషకరమైన సమయంలో ఆందోళన జరిగితే ఆ పరిణామాలు ఏటు దారి తీస్తాయన్నదే ఈ చిత్ర ప్రధాన ఇతి వృత్తం అన్నారు.

సస్పెన్స్, థ్రిల్లర్‌ కథాంశంతో కూడిన ఈ చిత్రం లో ప్రేమ, స్నేహం, హాస్యం, ఆధ్యాత్మికం అంటూ జనరంజకమైన అంశాలన్నీ ఉంటాయన్నారు. ఇందులో నిరంత్, రుద్రాఆరా, ఆర్యన్, జై జగన్నాథ్, రాహుల్‌.సి కల్యాణ్, గౌతమి, సౌజన్య, ఆపేక్ష నూతన నటీనటులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారని తెలిపారు. దీనికి శివనాగ్‌ సంగీతాన్ని అందిస్తుండగా పౌవులియస్‌ ఛాయాగ్రహణం నెరపుతున్నారని చెప్పారు. చిత్ర షూటింగ్‌ పూర్తి అయ్యిందని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నట్లు వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement