అద్భుతాలు ఆకాశం నుంచి ఊడిపడవు. ఆలోచనల్లో నుంచి పుడతాయి. దిల్లీకి చెందిన ఆర్యన్ చౌహాన్ చిన్న వయసులోనే ఎంటర్‌ప్రెన్యూర్‌గా పెద్ద విజయం సాధించడానికి ఆ ఆలోచనలే కారణం. కొత్తదనాన్ని ఆవిష్కరించే ఆలోచనలు అవి. కొత్త తరం ఆలోచనలు అవి...
ఇరవై రెండు సంవత్సరాల ఆర్యన్ చౌహాన్ ట్రాక్ రికార్డ్ ‘ఆహా’ అనేలా ఉంటుంది. పద్నాలుగు సంవత్సరాల వయసులోనే స్టార్టప్‌లకు సహాయపడే స్టార్టప్‌ను మొదలుపెట్టాడు. యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో ప్రసిద్ధ జెరోమ్ ఫిషర్‌ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ అండ్ టెక్నాలజీకి ఎంపికైన తక్కువ మందిలో ఆర్యన్ ఒకడు.
కోవిడ్ సమయంలో స్వదేశానికి తిరిగివచ్చాడు ఆర్యన్. ఆ సమయంలో అతడి మనసు నిండా కొత్త స్టార్టప్ ఆలోచనలు నిండి ఉన్నాయి. అయితే ఏమీ చేయలేని అనిశ్చితి బయట నెలకొని ఉంది. ఇండియన్ స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను లోతుగా అర్థం చేసుకోవడానికి ఈ సమయాన్ని ఉపయోగించుకున్నాడు ఆర్యన్. 2021లో ‘జీవోవ్’పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాడు.
తన తల్లితో కలిసి గురుగ్రామ్ కేంద్రంగా ‘జీవోవ్’ పేరుతో రెండో కంపెనీ స్టార్ట్ చేశాడు. టెక్–ఫస్ట్ అ్ర΄ోచ్‌తో డయాబెటిస్ సమస్యను అదుపులో ఉంచే కంపెనీ ఇది. పర్సనలైజ్ రెమిషన్ ΄్లాన్స్ నుంచి నిరంతర గ్లూకోజ్ మానిటరింగ్ (సీజీఎం) పరికరాల వరకు కంపెనీలో ఎన్నో ఉంటాయి. ఇంతకీ ఆర్యన్‌కు ‘జీవోవ్’ ఆలోచన ఎలా వచ్చింది?
‘డయాబెటిస్ బాధితులను దగ్గరి నుంచి చూశాను. మా తాతయ్యలు ఇద్దరూ డయాబెటిస్‌తో బాధలు పడ్డారు. ఆ సమయంలోనే ఏదైనా పరిష్కార మార్గం ఆలోచించాలనుకున్నాను’ అంటాడు ఆర్యన్. క్రానిక్ కేర్ బిజినెస్‌గా ్ర΄ారంభమైన ‘జీవోవ్’ కంపెనీ న్యూట్రిషనిస్ట్, ఫిట్‌నెస్ ట్రైనర్స్, సైకాలజిస్ట్‌లను పేషెంట్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది. తక్కువ సమయంలోనే కంపెనీ 70,000లకు పైగా వినియోగదారులతో విజయపథంలోకి వచ్చింది.
ప్రొడక్ట్‌ను క్రియేట్ చేయడం నుంచి మార్కెట్‌లో విజయవంతం చేయడం వరకు ఆర్యన్‌లో అద్భుత సామర్థ్యం ఉంది. వేగంగా నేర్చుకునే తత్వం, నిర్మాణాత్మక పనివిధానం అతడి సొంతం. ఏ ్ర΄ాజెక్ట్ చేపట్టినా విజయవంతం చేయాలనే పట్టుదలతో పనిచేస్తాడు. నెవర్–సే–డై స్పిరిట్ ఆర్యన్‌ను క్వాలిటీ ఫౌండర్‌ని చేసింది’ అంటాడు ‘స్నాప్‌డీల్ అండ్ టైటాన్ క్యాపిటల్’ ఫౌండర్ కునాల్ బహల్. కునాల్ బహల్ జెరోమ్ ఫిషర్ ప్రోగ్రామ్ పూర్వ విద్యార్థి.
‘జీవోవ్’కు ముందు కునాల్‌తో కలిసి పనిచేశాడు ఆర్యన్. ‘స్నాప్‌డీల్ అండ్ టైటాన్ క్యాపిటల్’లో ఫిన్‌టెక్, హెల్త్‌టెక్, డీ2సీ సెగ్మెంట్‌లను లీడ్ చేశాడు. ‘ఇది చాలు’ అనుకోవడం లేదు ఆర్యన్ చౌహాన్. ‘జాయిన్ ది రెవల్యూషన్’ నినాదంతో నెక్ట్స్ గ్రోత్ పేస్‌పై దృష్టి పెట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment