short film director
-
చిన్న సినిమాలతో సత్తా చాటుతున్న కరీంనగర్ డైరెక్టర్
సాక్షి, విద్యానగర్(కరీంనగర్): పాటమ్మతోట ప్రాణం నాకు చదువులమ్మరా.. అన్నాడో కవి.. పాటల రచన, గానంపై తనకు ఉన్న ఆసక్తిని, ఇష్టాన్ని, ప్రేమని పాట రూపంలోనే చెప్పాడు. అచ్చం ఇలాగే తనకు సినిమాతోపాటు రచన, నటన, షూటింగ్, దర్శకత్వం, స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్‌పై ఉన్న ఇష్టాన్ని షార్ట్ ఫిల్మ్ ల ద్వారా చాటుకుంటున్నాడు కరీంనగర్‌కు చెందిన రామ్ మోగిలోజి. తొమ్మిదేళ్ల లఘుచిత్రాల ప్రయాణంలో ఆయన ఆనేక మైలురాళ్లు అధిగవిుంచారు. వెయ్యికిపైగా షార్ట్ ఫిల్మ్‌లు తీసి తన ప్రత్యేకతను చాటుకున్నారు. యూట్యూబ్ చానల్ ద్వారా అభిమానులను ఆకట్టుకుంటున్నారు. క్రియేటివిటీకి కేరాఫ్‌గా మారారు. యూట్యూబ్ వీక్షకుల నాడిని పట్టుకున్న ఆయన తొమ్మిదేళ్లలో ఒకటా రెండా ఏకంగా వేయి లఘుచిత్రాలకు దర్శకత్వం వహించాడు, 1,500 చిత్రాలకు ఎడిటింగ్ చేశాడు. 2,500 ఆడ్ ఫిల్మ్స్, 150 జానపద పాటలు, 30 డాక్యూమెంటరీలు, వివిధ సామాజిక రుగ్ముత పై ప్రేక్షకులకు అవగాహన కల్పిస్తూ వందకుపైగా తక్కువ నిడివితో లఘుచిత్రాలు తీయడమే కాకుండా 500 షార్ట్ ఫిల్మ్‌లలో నటించడం విశేషం. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కాసారం గ్రామానికి చెందిన రామ్ మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. ఆర్థికంగా అంతంతమాత్రంగా ఉన్న వాటిని అధికమించి ఎంఏ పూర్తి చేసి మ ల్టీమీడియా, ఎడిటింగ్, అనీమినేషన్లో కోర్స్ పూర్తి చేశారు. నాలుగేళ్లపాటు మల్టీమీడియా ఫ్యాకల్టీగా పని చేసి ఎంతో మందికి మల్టీమీడియాలో శిక్షణ ఇ చ్చారు. వారిలో చాలా మంది వీడియో మిక్సింగ్ యూనిట్స్, ఫొటో స్టూడియోలు ఏర్పాటు చేసుకుని స్వయం ఉపాధి పొందుతున్నారు. వైజయంతి మూవీస్ వారి లోకల్ టీవీ చానల్లో వీడియో ఎ డిటర్గా సంవత్సరం పనిచేశారు. సినిమాల మీద మంచి పరిజ్ఞానం ఉండటంతో 2014లో కరీంనగర్లో షార్ట్ఫిల్మీస్ ఎడిటింగ్ స్టూడియో ఏర్పాటు చేసి ఎన్నో చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేశారు. తొలిసారిగా షార్ట్ ఫిల్మీస్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆర్ఎస్ నందతో ‘గుట్టల్లో గుసగుస’ మంచి ఆదరణ పొందింది. విరాట్ క్రియేషన్స్.. షార్ట్ ఫిల్మీస్ ఎడిటింగ్‌లో రాణిస్తూనే విరాట్ క్రియేషన్స్ పేరున ఫిల్మీ ఏజెన్సీ ఏర్పాటు చేసి యాడ్ ఫిల్మీస్ రూపొందించడం ప్రారంభించారు. వాటి ద్వారా తన ప్రత్యేకతను చాటుకుని మంచి గుర్తింపు పొందారు. మిత్రులతో కలిసి ఆర్ క్రియేషన్ బ్యానర్‌పై చల్లా బాలయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తెలుగు భాషకు ప్రాచీన హోదా దక్కడానికి కీలకమైన గంగాధర మండలం కురిక్యాలలోని బొమ్మలమ్మ గుట్టపై నిర్మించిన డాక్యుమెంటరీ నిర్మించారు. న్యూజిలాండ్ తెలంగాణ తెలుగు భాష అసోసియేషన్ నిర్వహించిన తెలంగాణ భాష మహాసభలో, 2017లో హైదరాబాద్‌లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభ యువ చిత్రోత్సవంలో ప్రదర్శించగా ప్రముఖల ప్రశంసలు అందుకుంది. విరాట్ క్రియేషన్స్ బ్యానర్‌పై దర్శక నిర్మాతగా లఘు చిత్రాలు నిర్మిస్తూ, ఇతరులు నిర్మించే చిత్రాలకు దర్శకత్వం వహిస్తూ ప్రతినెలా దాదాపు 20 వరకు నిర్మాణం జరుపుకునే వాటిలో కొత్తవారికి అవకాశం ఇస్తూ.. పలువురికి ఉపాధి కల్పిస్తున్నారు. అషాఢం అల్లుడు అత్త లొల్లి, ఇరికిల్లు ఇద్దరు పెళ్లాలు, ప్రేమించే పెనివిుటి, వార్డుమెంబర్ శినన్న, పొత్తుల సంసారం తదితర చిత్రాలకు 54 లక్షల వ్యూస్ దాటాయి. తెలంగాణ ఫిల్మ్, టీవీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కుర్మాచలం అనిల్ చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న రామ్ (ఫైల్) అందుకున్న అవార్డులు, పురస్కారాలు, సత్కారాలు.. హైదరాబాద్‌కు చెందిన విశ్వభారతి సంస్థ నుంచి ఉగాది పురస్కారం అమ్మాయి అంటే భారం కాదు ఆస్తి పేరుతో నిర్మించిన చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా కరీంనగర్ సీపీ కమలాసన్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఓ నరుడా చిత్రానికి ఉత్తమ ఎడిటర్‌గా ఎమ్మెల్సీ నారదాసు చేతుల మీదుగా అవార్డు జగిత్యాలకు చెందిన కళశ్రీ ఆర్ట్ థియేటర్ వారిచే రెండుసార్లు కీర్తి సేవా పురస్కారం. ఎన్నికలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రూపొందించిన పోస్టర్‌కు ఉత్తమ పోస్టర్ డిజైనర్‌గా నగదు బహుమతి. సినీవారం సంస్థ, బాబా అసోసియేషన్ వా రితో వేర్వేరుగా ఉత్తమ దర్శకుడిగా అవార్డు. గొరెంటి వెంకన్న చేతుల మీదుగా గిడుగు రామ్మూర్తి కీర్తి పురస్కారం. కాళోజీ జయంతి సందర్భంగా ఉత్తమ డైరెక్టర్‌గా జెనీ ఇంటర్నేషనల్ అధినేత జైనీ ప్రభాకర్ చేతుల మీదుగా అవార్డు. ఉత్తమ దర్శకుడిగా ఎంఎస్ ఎక్స్‌లెన్స్ అవార్డు ఫ్రెండ్స్ కల్చరల్ అకాడమి ద్వారా ఉత్తమ డైరెక్టర్ అవార్డు. ఉమ్మడి రాష్ట్రాల్లోనే ప్రప్రథమంగా దర్శకుడిగా 1000 లఘు చిత్రాలు పూర్తి చేసిన సందర్భంగా తెలంగాణ ఫిల్మీ, టీవీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఉత్తమ డైరెక్టర్ అవార్డు ఆర్టీసీ సేవలపై రూపొందించిన లఘు చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా అవార్డు. బొమ్మలమ్మగుట్ట ప్రాముఖ్యతపై తీసిన డా క్యుమెంటరీకి ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డు. ఆర్ఎస్ నంద పరిచయంతోనే.. యూట్యూబ్ స్టార్ ఆర్ఎస్ నంద పరిచయం వల్లనే నా దారి లఘు చిత్రాల వైపు మళ్లింది. పల్లె వాతావరణ, కుటుంబ విషయాలు, రోజువారి జీవితంలో ఎదురయ్యే సంఘటనల ఆధారంగా కథలు రాసుకుని ఒకటి రెండు రోజుల్లో చిత్రాన్ని పూర్తి చేసి యూట్యూబ్‌లో ఆప్‌లోడు చేస్తా. వీక్షకుల నుంచి మంచి స్పందన ఉంటుంది. యూట్యూబ్ వీక్షకులు ఇస్తున్న ప్రోత్సాహంతోనే నెలకు 20 వరకు లఘు చిత్రాలు నిర్మిస్తూ తాను ఉపాధి పొందుతూ మరో 50 మందికి ఉపాధి కల్పిస్తున్న. – రామ్ మోగిలోజి, లఘు చిత్రాల దర్శక నిర్మాత, విరాట్ క్రియేషన్స్ -
వందకు పైగా షార్ట్ ఫిల్మ్స్... నెక్స్ట్ టార్గెట్ సినిమానే
కొంత మంది కుర్రాళ్లకు మంచి సృజనాత్మకత ఉన్నా ఆర్థిక స్థిరత్వం, ప్రోత్సహించే వారు లేక కోరుకున్న రంగంలో వెనుకంజ వేస్తుంటారు. కానీ కొందరు ఎన్ని అడ్డంకులు ఎదురైనా తాము ఎంచుకున్న మార్గంలో పయనిస్తూ తమ ప్రతిభను చాటుతూ ఉంటారు. అలాంటి వారిలో ఒకరు రామ్‌కిరణ్. వందకు పైగా షార్ట్ ఫిల్మ్‌లను తీసి, ఓటీటీ, సినిమా వైపుగా అడుగులు వేస్తూ స్వయంకృషితో ఎదుగుతున్న రామ్‌కిరణ్ హైదరాబాద్ వాసి. చదువుకుంటూనే లఘుచిత్రాలను రూపొందించి పలువురి ప్రముఖుల ప్రశంసలు పొందిన రామ్ కిరణ్ నాలుగేళ్ల క్రితం ‘ఫస్ట్ లుక్ ఫిల్మ్ మీడియా ఫ్యాక్టరీ’ పేరుతో సొంతంగా స్టూడియో ఏర్పాటు చేసుకున్నాడు. తన కలను సాకారం చేసుకు నేందుకు సినిమాలకు సంబంధించిన ఎడిటింగ్, డబ్బింగ్, కెమెరా వర్క్.. పూర్తి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ని ఈ స్టూడియో నుంచి చేస్తుంటాడు. కాలేజీ దశ నుంచే లఘుచిత్రాలను రూపొందిస్తూ, అవార్డులు పొందుతూ, పలువురి ప్రశంసలు అందుకుంటున్న రామ్‌కిరణ్ తన డ్రీమ్ జర్నీని వివరించారు. 100 ప్లస్ షార్ట్ ఫిల్మ్స్ ‘‘సినిమాటోగ్రాఫర్‌గా 90కి పైగా, డైరెక్టర్‌గా, ఎడిటర్‌గా మరో పది షార్ట్ ఫిల్మ్‌లకు వర్క్ చేశాను. 2017లో హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో ‘ఫస్ట్ లుక్ ఫిల్మ్ మీడియా ఫ్యాక్టరీ’ని రెండుగదుల్లో ఏర్పాటు చేశాను. ఈ స్టూడియో నుంచి మూడు రకాల వర్క్స్ జరుగుతాయి. ఫిల్మ్ మేకింగ్, డబ్బింగ్, ఫొటోగ్రఫీ ప్రధానంగా ఉంటాయి. ఓటీటీ వైపు ఏ సినిమా అయినా హై కంటెంట్, లో బడ్జెట్ ఎంచుకుంటాను. 15 లక్షల లోపు బడ్జెట్ వేసుకొని చేసిన ఓటీటీ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. విశ్వనాథ సత్యనారాయణ గారి బయోగ్రఫీని క్లుప్తంగా 1 గంట 20 నిమిషాలు వచ్చేలా ‘కవి సామ్రాట్’ సినిమా తీశాం. ఇది విడుదలకు సిద్ధంగా ఉంది. నటులు ఎల్.బిశ్రీరామ్, అనంత్‌గారు ఇందులో ప్రధాన పాత్రధారులుగా నటించారు. కళాతపస్వి విశ్వనాథ్ మా టీమ్ అందరినీ తమ ఇంటికి పిలిచి, ప్రశంస లు అందించారు. తనికెళ్ల భరణి ‘తపస్వి’కి సినిమాటోగ్రాఫర్‌గా చేశాను. ‘విరాటపర్వం’ సినిమాలో ‘కోల్ కోల్ ..’ పాటకు వర్క్ చేశాను. రచయిత సుభాష్ చంద్రబోస్ ఈ పాట దృశ్యకావ్యంలా ఉందని నా వర్క్‌ని ప్రశంసించారు. ఒక్క కెమెరాతో మొదలు.. పుట్టి పెరిగింది చౌటుప్పల్ మండలం దేవనమ్మ నాగారం గ్రామంలో. నాన్న బూడిద గోపాల్‌రెడ్డి. నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించారు. అమ్మ అంతకుముందే కన్నుమూశారు. ఎలాంటి ఆర్థిక సాయం లేదు. సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ చేతిలో ఉంది. ఆర్థికంగా కోలుకోవడానికి రెండేళ్లు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసి, ఒక్క కెమెరాతో నా కల తీర్చుకోవడానికి ఈ దిశగా అడుగులు వేశాను. ఇప్పుడు నాలుగు కెమెరాలు ఏర్పాటు చేసుకున్నాను. ఐదుగురు ఉద్యోగులను నియమించుకున్నాను. పురస్కారాలు.. ప్రశంసలు కాలేజీ రోజుల్లోనే నా మొదటి షార్ట్ ఫిల్మ్ ‘ఐ యామ్ నాట్ డంబ్’కి అవార్డు వచ్చింది. ఇప్పటి వరకు నా సినిమాటోగ్రఫీ వర్క్‌కు ఎనిమిది అవార్డులు వచ్చాయి. ‘పాస్‌పోర్ట్’ కామెడీ షార్ట్ ఫిల్మ్‌కి, ‘ఇండియన్ లేడీ’ కీ అవార్డులు వచ్చాయి. తెలంగాణ గవర్నమెంట్ నుంచి బెస్ట్ సినిమాటోగ్రాఫర్ అవార్డు ‘కలెక్టర్–పాప’ షార్ట్ ఫిల్మ్‌కు వచ్చింది. 48 గంటల్లోపు షార్ట్ ఫిల్మ్ తీయాలన్నది ఛాలెంజ్. ఆ కొద్ది టైమ్‌లోనే ఫిల్మ్ తీసి సబ్మిట్ చేశాను. సజ్జనార్గారి చేతుల మీదుగా ‘పెడెస్టల్ సేఫ్టీ’ మీద బెస్ట్ షార్ట్ ఫిల్మ్ అవార్డ్ కిందటేడాది తీసుకున్నాను. కరోనా మీద ‘ది పిజియన్’ అనే పేరుతో తీసిన షార్ట్ ఫిల్మ్‌కు ‘గోవా ఆన్లైన్ ఫిల్మ్ ఫెస్టివల్’ అవార్డు తో పాటు ప్రముఖుల ప్రశంసలూ లభించాయి. పెళ్లిళ్లకు ఫొటోగ్రఫీ కలను తీర్చుకోవాలంటే కడుపు కూడా నిండాలి. అందుకే, ఒకటికి మూడు పనులు ఎంచుకున్నాను. వాటిలో‘శుభప్రద’ ఫొటోగ్రఫీ ఒకటి. పుట్టిన రోజు, వివాహాది వేడుకలకు థీమ్ బేస్ట్‌గా ఫొటోలు తీస్తుంటాను. దీనికి ఒక టీమ్ వర్క్ చేస్తుంటారు. అలాగే, పిల్లల ఫొటోగ్రఫీ మీదా సృజనాత్మక ఆలోచనలతో వర్క్ చేస్తున్నాను. కంటెంట్ ఉంటే... కటౌట్ రెడీ! ‘తక్కువ బడ్జెట్లో షార్ట్ ఫిల్మ్ రూపొందించాలని ఎవరైనా అడిగినప్పుడు కెమెరామెన్ గా, ఎడిటర్‌గా, డైరెక్టర్‌గా.. ఎలా కావాలనుకున్నా వారికి తగిన సేవలు నా స్టూడియో నుంచి అందిస్తుంటాను. సరైన కంటెంట్‌తో వస్తే షార్ట్ ఫిల్మ్‌కు సంబంధించిన వర్క్ మొత్తం చేసి, ఇస్తాను. అలా నెలకు ఇప్పుడు మూడు షార్ట్ ఫిల్మ్‌ల వరకు తీస్తున్నాను. అందుకు వనరులతో పాటు, తగిన టీమ్‌ను కూడా ఏర్పాటు చేసుకున్నాను. లఘుచిత్రాల నుంచి పెద్ద చిత్రాల వరకు ఎదగాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాను’ అని వివరించారు రామ్ కిరణ్. – నిర్మలారెడ్డి -
ప్రముఖ సింగర్‌కు వేధింపులు.. షార్ట్‌ఫిల్మ్ డైరెక్టర్ అరెస్ట్
సాక్షి, నాగోలు: నగరానికి చెందిన మెడికాయల నవీన్‌కుమార్ (34) షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్‌తో నవీక్కుమార్ గతంలో ఇంటర్వ్యూ చేశాడు. ఆమె ఫొటోను లోగోగా ఉంచి ఆమె పేరు మీద ఒక యూట్యాబ్ చానెల్ ప్రారంభించాడు. తరువాత బాధితురాలి పేరు మీద ఒక చిత్రనిర్మాణ సంస్థను ప్రారంభించాడు. అతను తన వెబ్ సిరీస్ వీడియోలు, ఆల్బమ్ సాంగ్స్, షార్ట్ ఫిల్మ్స్ వీడియోలు అప్లోడ్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న సింగర్ ఇలాంటి కార్యకాపాలను ఆపమని అతడిని కోరింది. అయినా నిందితుడు ఆమె మాటలు పట్టించుకోలేదు. సింగర్ వ్యక్తిగత జీవితానికి సంబంధిన వీడియాలు అప్లోడ్ చేస్తూ ఆమెను మానసికంగా వేధించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని శుక్రవారం నవీన్‌కుమార్ అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. -
సైమా అవార్డ్స్‌కు నామినేట్ అయిన ‘వాట్ ఏ అమ్మాయి’
టాలీవుడ్లో లీడింగ్ పీఆర్వోగా కొనసాగుతున్న ఏలూరు శ్రీను దర్శకుడిగా మారి లఘు చిత్రాలను రూపొందిస్తున్నారు. మా కాలని ఫిగర్, వాట్ ఏ అమ్మాయి అనే టైటిల్స్‌తో రూపొందిన లఘు చిత్రాలు మంచి విజయం సాధించటమే కాదు అవార్డులు రివార్డులను కూడా తెచ్చిపెట్టాయి. తొలి షార్ట్ ఫిలింకు ఓ ప్రముఖ చానల్ నిర్వహించిన కాంపిటీషన్లో ఉత్తమ నటి అవార్డు దక్కగా, తాజాగా వాట్ ఏ అమ్మాయి ఏకంగా సైమా అవార్డ్స్ బరిలో నిలిచింది. ఈ షార్ట్ ఫిలింకు సంగీతం అందించిన నరేష్ పెంట ఉత్తమ సంగీత దర్శకుడు కేటగిరిలో నామినేట్ అయ్యాడు. మెగా అభిమానిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఏలూరు శ్రీను తరువాత పీఆర్వోగా కొనసాగుతూనే బస్టాప్, లవర్స్, రోజులు మారాయి, ఒక్క క్షణం, కొత్త జంట, చిత్రం భళారే విచిత్రం, కొబ్బరి మట్ట చిత్రాల్లో నటించాడు. దర్శకత్వంపై మక్కువతో లఘు చిత్రాలను రూపొందిస్తున్నాడు. ప్రస్తుతం ఏలూరు శ్రీను పలువురు స్టార్ హీరోలతో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థల ప్రమోషన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. -
లఘుచిత్ర ‘చందనం’
సాక్షి, నల్లగొండ టౌన్ : ఎటువంటి శిక్షణ లేకుండానే షార్ట్‌ఫిల్మ్‌ల నిర్మాణంతో పాటు దర్శకత్వం వహిస్తూ లఘుచిత్ర రంగంలో రాణిస్తున్నారు చందన. నల్లగొండ మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన పనస శంకరయ్య, లింగమ్మ చివరి సంతానం చందన. ఎంసీఏని హైదరాబాద్‌లో పూర్తి చేశారు. భర్త సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడంతో ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. తన తండ్రి రిటైర్డ్ రెవెన్యూ అధికారి శంకరయ్య 2016లో మరణించారు. ఆయన ప్రథమ వర్ధంతి సందర్భంగా తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని తెలియజేసే ఇతివృత్తంతో నేను–నాన్న అనే లఘుచిత్రాన్ని స్వీయదర్శకత్వంలో నిర్మించారు. ఆ లఘుచిత్రం అత్యంత ప్రజాదరణ పొందింది. అదే స్ఫూర్తితో తర్వాత భ్రూణహత్య(సేవ్‌గర్ల్) లఘుచిత్రాన్ని నిర్మించారు. ఆ లఘుచిత్రానికి అవణి క్రియేషన్స్ సంస్థ ఉత్తమ మహిళా దర్శకురాలు అవా ర్డుతో రవీంద్రభారతిలో సత్కరించారు. తర్వాత బంగారుతల్లి, గత సంవత్సరం బతుకమ్మ అనే లఘుచిత్రాలను స్వీయదర్శకత్వంలో నిర్మించారు. కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తూనే మరో పక్క లఘుచిత్రాలను నిర్మిస్తూ అందరి మన్ననలు పొం దుతున్నారు. సినిమాలపై ఉన్న ఆసక్తితో చిన్నప్పటి నుంచి సినిమాలపై ఉన్న ఆసక్తితో లఘుచిత్రాల నిర్మాణం, దర్శకత్వ రంగంపై మక్కువ పెంచుకున్నాను. నేను–నాన్న లఘుచిత్రానికి విశేష ఆదరణ లభించింది. రానున్న రోజుల్లో యువతకు సందేశాలను ఇచ్చే ఇతివృత్తాలతో లఘుచిత్రాలను నిర్మిస్తా. – చందన -
లఘు చిత్ర దర్శకుడికి నాటా ఆహ్వానం
లఘు చిత్రాలను రూపొందించి ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్న దర్శకుడు ఆనంద్ కుమార్‌కు మరో గౌరవం దక్కింది. ఈ ఏడాది జూలైలో జరగబోయే నాటా (నార్త్ అమెరికా తెలుగు అసోషియేషన్) మెగా కన్వెన్షన్‌లో దర్శకుడు ఆనంద్ కుమార్ పాల్గొననున్నారు. డాక్టర్ అయిన ఆనంద్ సినీరంగం మీద ప్రేమతో దర్శకుడిగా మారారు. హార్మోన్స్ సినిమాతో దర్శకుడి పరిచయం అయిన ఆనంద్, తరువాత లఘు చిత్రాలతో ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు. సామాజిక సమస్యల నేపథ్యంలో ఆనంద్ రూపొందించిన ప్రజా హక్కు, అన్ టచ్ ఎబిలిటీ లాంటి షార్ట్ ఫిలింస్‌కు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన 9 ఏళ్ల అమ్మాయి చిరు తేజ్ సింగ్ కథతో తెరకెక్కించిన షార్ట్ ఫిలిం ఆనంద్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చింది. జాతీయ స్థాయిలో పలు అవార్డులు సాధించటంతో పాటు పలు అవార్డు కమిటీల జ్యూరీలలో మెంబర్‌గా ఉన్న ఆనంద్‌కు నాటా ఫిలడెల్ఫియాలో నిర్వహించబోయే మెగా కన్వెన్షన్‌కు ఆహ్వానం అందింది. జూలై 6 నుంచి 8 వరకు జరగబోయే ఈ కన్వెన్షన్‌లో ప్రపంచం నలు మూలల నుంచి ప్రముఖులు హాజరుకానున్నారు. -
కొత్త తారలతో ‘సంతోషత్తిల్ కలవరం’
తమిళసినిమా: నూతన తారలతో తెరకెక్కుతున్న చిత్రం సంతోషత్తిల్ కలవరం. ఈ చిత్రం ద్వారా క్రాంతి ప్రసాద్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన ఇంతకు ముందు పలు లఘు చిత్రాలను రూపొందించి అవార్డులను అందుకున్నారు. ఫిలిం ఇన్స్టిట్యూట్ విద్యార్థి క్రాంతి ప్రసాద్ కొందరు తెలుగు దర్శకుల వద్ద పని చేశారు. ఈ సంతోషత్తిల్ కలవరం చిత్రాన్ని శ్రీ గురు సినిమాస్ పతాకంపై వీసీ.తిమ్మారెడ్డి నిర్మిస్తున్నారు. చిత్రం వివరాలను దర్శకుడు తెలుపుతూ ఒక సంతోషకరమైన సమయంలో ఆందోళన జరిగితే ఆ పరిణామాలు ఏటు దారి తీస్తాయన్నదే ఈ చిత్ర ప్రధాన ఇతి వృత్తం అన్నారు. సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశంతో కూడిన ఈ చిత్రం లో ప్రేమ, స్నేహం, హాస్యం, ఆధ్యాత్మికం అంటూ జనరంజకమైన అంశాలన్నీ ఉంటాయన్నారు. ఇందులో నిరంత్, రుద్రాఆరా, ఆర్యన్, జై జగన్నాథ్, రాహుల్.సి కల్యాణ్, గౌతమి, సౌజన్య, ఆపేక్ష నూతన నటీనటులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారని తెలిపారు. దీనికి శివనాగ్ సంగీతాన్ని అందిస్తుండగా పౌవులియస్ ఛాయాగ్రహణం నెరపుతున్నారని చెప్పారు. చిత్ర షూటింగ్ పూర్తి అయ్యిందని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నట్లు వెల్లడించారు. -
శశాంక్.. సందేశాల చిత్రం
పొట్టి చిత్రాలు తీయడంలో మన సిటీ కుర్రాళ్లు దిట్టలు. సృజనాత్మకతకు పెట్టింది పేరు మనవాళ్లు. ఎంతగా అంటే.. సమాజాన్ని మొత్తం చుట్టేసి పది నిమిషాల నిడివిలో బంధించగలరు. అందులో ఎంతో విషయం ఉంటుంది. ఎందరినో మేల్కొలిపే జ్ఞానం ఉంటుంది. చాలామంది స్నేహం, ప్రేమ, బంధాలు.. కాలేజీ లైఫ్.. ఇలా యువతను ఆకట్టుకునే లఘు చిత్రాలను తీస్తుంటే కొందరు మాత్రం అందుకు భిన్నం అంటున్నారు. అలాంటివారిలో ‘శశాంక్ రామానుజపురం’ ఒకడు. ఇతడు మాత్రం సమాజంలో మార్పు తీసుకొచ్చే కథాంశాలతో పొట్టి చిత్రాలను రూపొందించి అందరిచేతా ఔరా అనిపించుకుంటున్నాడు. సాక్షి, సిటీబ్యూరో: దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్వహించిన షార్ట్‌ఫిల్మ్ పోటీల్లో పాల్గొనేందుకు బాలకార్మికుల కష్టాలను కళ్లకు కట్టినట్టు చూపిస్తూ ‘చైల్డ్ లేబర్’ ఫిలిం తీశాడు శశాంక్. లంచగొండితనంపై తీసిన ‘మార్పు’ చిత్రాన్ని చూసిన దర్శకుడు రాజమౌళి సైతం ఫిదా అయ్యారు. అంతేకాదు.. ఆ చిత్రానికి ‘బెస్ట్ షార్ట్‌ఫిల్మ్’ అవార్డును అందించారు. గోమాతను పూజించాలన్న థీమ్‌తో తీసిన ‘గోపురం’ షార్ట్‌ఫిల్మ్‌కు చిన్నజీయర్ స్వామి నుంచి కూడా అవార్డు అందుకున్నాడు. ఇలా ఇప్పటి వరకు శశాంక్ 24 షార్ట్ఫిలిమ్స్ తీశాడు. అవన్నీ సందేశాత్మక చిత్రాలే కావడం విశేషం. ‘బ్యూటీఫుల్ లైఫ్’గా సాగాలి.. మనది అందమైన జీవితం. అది ఎంతో విలువైంది. కళాశాల చదువుల్లో వేసే తప్పటడుగుల వల్ల ఎంతో మంది యువత రోడ్డు ప్రమాదాల్లో అసువులు బాస్తున్నారు. మద్యం తాగి వాహనం నడుపుతూ మరణాన్ని కొనితెచ్చుకుంటున్నారు. కన్నవారికి శోకం మిగిలిస్తున్నారు. ఇటీవల మాదక ద్రవ్యాలకు కూడా బానిసై యువత భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారు. దీనిపై యువతలో మార్పు తెచ్చేందుకు శశాంక్ ‘బ్యూటీఫుల్ లైఫ్’ షార్ట్‌ఫిలిం తీశాడు. దానికి రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ మద్ధతు పలికారు. మద్యం తాగడం వల్ల కలిగే అనర్థాలు.. తల్లిదండ్రులకు మిగులుస్తున్న శోకం గురించి షార్ట్‌ఫిల్మ్ ద్వారా అందరికీ కన్నీళ్లు తెప్పించిన ఈ కుర్రాడు ఏకంగా ఉత్తమ సందేశాత్మక ఓరియంటెడ్ షార్ట్ఫిల్మ్గా జాతీయస్థాయి అవార్డును దక్కించుకున్నాడు. అంతేకాదు.. ఈ చిత్రాన్ని సినిమా థియేటర్లలో ప్రచారం చిత్రంగా ప్రదర్శిస్తున్నారు. డ్రగ్స్‌పై జాగృతి కల్పించేలా.. సాధారణంగా డ్రగ్స్‌కు నగర యువతే ఎక్కువగా అలవాటు పడతారని చాలామంది అపోహ. ఈ ప్రభావం పల్లెలపై ఎలా పడుతుందో చూపిస్తూ రాచకొండ పోలీసుల సహాకారంతో ‘మరో లోకం’ తీశాడు శశాంక్. సినీనటులు సన, సమీర్ ఈ చిత్రంలో నటించి యువతకు విలువైన సందేశం ఇచ్చే పాత్రలను పోషించారు. జనవరి నెలాఖరు నాటికి ఈ షార్ట్‌ఫిల్మ్‌ని రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ చేతుల మీదుగా విడదల చేసేందుకు సన్నాహలు చేస్తున్నారు. మార్పు తేవాలన్నదే తపన.. నేను పుట్టింది వరంగల్‌లో. చదువు అంతా హైదరాబాద్‌లోనే సాగింది. బీకామ్ కంప్యూటర్స్ చేశా. చిన్నప్పటి నుంచి సమాజంలో జరిగే ప్రతి అంశాన్ని క్షుణ్నంగా పరిశీలించేవాణ్ని. నాన్న వ్యాస్ ఇచ్చిన ప్రోత్సాహంతో ‘మిస్టర్ మేధావి, డార్లింగ్’ చిత్రాల్లో నటించా. అదే సమయంలో నాలో ఉన్న సామాజిక అంశాలను షార్ట్‌ఫిల్మ్ ద్వారా ప్రజలకు చేరువ చేయాలన్న ఆలోచనతో ‘చైల్డ్ లేబర్స్’ తొలి షార్ట్‌ఫిల్మ్ తీశా. ఆ తర్వాత సమాజంలో వేళ్లూనుకున్న లంచగొండితనం ఆపడం కుటుంబం నుంచే మొదలుకావాలన్న అంశంతో ‘మార్పు’ తీశా. రక్తదానంపై అవగాహన కలిగించేందుకు ‘రీ బర్త్’ లఘుచిత్రానికి ఇంటర్నేషనల్ ఫెస్టివల్లో వరల్డ్ వైడ్లో టాప్ 100లో చోటు దక్కించుకుంది. డ్రంకన్ డ్రైవ్‌పై అవగాహన కలిగించేలా తీసిన ‘బ్యూటీఫుల్ లైఫ్’ నాకు ఎంతో పేరు తెచ్చింది. ఇప్పుడు కూడా రాచకొండ పోలీసుల సహాకారంతో ‘మరో లోకం’ తీశా. యువత మాదకద్రవ్యాలకు బానిసవుతున్న ఇందులో చూపించా. -
షార్ట్ ఫిలిం డైరెక్టర్ యోగేష్ అరెస్ట్
గచ్చిబౌలి: లఘుచిత్రాల్లో నటించే మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్‌కు అసభ్యకరమైన మేసేజ్‌లు పంపి వేధిస్తున్న కేసులో తప్పించుకు తిరుగుతున్న షార్ట్ ఫిలిం డైరెక్టర్ యోగేష్ కుమార్‌ను గచ్చిబౌలి పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఎస్ఐ రాజేందర్ తెలిపిన వివరాల మేరకు... బీహెచ్ఈఎల్ ఎంఐజీలో నివాసం ఉండే ముత్యాల యోగేష్ కుమార్(35)కు ఏడాది క్రితం గచ్చిబౌలిలో నివాసముండే హారికతో ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. అయితే ఈ పరిచయంతో హారిక వాట్సాప్ నంబర్‌కే కాకుండా, ఆమె భర్త ఫోన్‌కు కూడా అసభ్యకర సందేశాలు పంపిస్తూ వేధిస్తున్నాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు యోగి సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా బుధవారం పోలీసులు అతన్ని పట్టుకున్నారు. అతడి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కూకట్పల్లి 25ఎంఎం కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్ వరూధిని బెయిల్ మంజూరు చేశారు. సమయానికి పూచీకత్తు చెల్లించకపోవడంతో యోగేష్‌ను చర్లపల్లి జైలుకు తరలించారు. త్వరలో కస్టడీలోకి తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు. -
‘విదేశాల్లో ఎంజాయ్ చేయాలని ఉంది’
సాక్షి, హైదరాబాద్: షార్ట్ ఫిలిం దర్శకుడు ముత్యాల యోగికుమార్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ హారిక కేసు మరో మలుపు తిరిగింది. తాను ఏ తప్పు చేయలేదంటూ నిందితుడు యోగి.. పోలీసులు కొన్ని మొబైల్ స్క్రీన్ షాట్లు పంపించాడు. హారిక తనకు పంపిన మెసేజ్‌లను స్క్రీన్ షాట్లు తీశాడు. ‘నేను వ్యక్తిగతంగా ఆనందంగా లేను. జీవితంపై నాకు విసుగొచ్చింది. విదేశాల్లో ఎంజాయ్ చేయాలని ఉంది. సంతోషంగా లేనప్పుడు విలువలు ఎందుకు పాటించాల’ని ఈ మెసేజుల్లో ఉంది. షీటీమ్స్ ఇంచార్జీ, మాదాపూర్ అడిషనల్ డీసీపీ గంగిరెడ్డి తనను కాలితో తన్నిన వీడియో తీసింది కూడా ఆమేనని యోగి వెల్లడించాడు. కాగా, అసభ్య మెసేజ్‌లు పంపి తనను యోగి వేధిస్తున్నాడని హారిక ఈ నెల 20న గచ్చిబౌలి ఉమెన్ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. విచారణ సమయంలో యోగిని అడిషనల్ డీసీపీ గంగిరెడ్డి బూటుకాలితో తన్నిన దృశ్యాలు టీవీ చానళ్లలో రావడంతో ఆయనపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. మరోవైపు హారిక ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిజానిజాలు తెలుసుకునేందుకు అన్నికోణాల్లోనూ విచారణ చేస్తున్నారు. -
మాదాపూర్ అడిషినల్ డీసీపీపై బదిలీ వేటు
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ అడిషనల్ డీసీపీ గంగిరెడ్డి తీరు వివాదాస్పదంగా మారింది. ముత్యాల యోగి కుమార్ అనే వ్యక్తిని బూటు కాలితో తన్నిన షీటీమ్స్ ఇన్చార్జి, మాదాపూర్ అడిషనల్ డీసీపీ గంగిరెడ్డిని సిటీ ఆర్మ్డ్ రిజర్వు(సీఎఆర్) హెడ్ క్వార్టర్స్‌కు బదిలీ చేశారు. షార్టు ఫిలింలో నటించే సాఫ్ట్వేర్ ఇంజనీర్ హారిక ఫిర్యాదు మేరకు యోగిని విచారణకు పిలిచి ఏడీసీపీ గంగిరెడ్డి బూటు కాలితో తన్నినట్లు ఉన్న వీడియో టీవీ చానళ్లలో, సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అందులో వాస్తవం ఎంత ఉందో విచారణ చేపట్టాలని డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశించారు. ఈమేరకు డీసీపీ విశ్వప్రసాద్‌ను విచారణ అధికారిగా నియమించిన విషయం విదితమే. ఈ క్రమంలో గంగిరెడ్డిని బదిలీ చేస్తూ సైబరాబాద్ కమిషనర్ సందీప్ శాండిల్య ఉత్తర్వులు జారీ చేశారు. తన పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించాడంటూ షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ హారిక హైదరాబాద్, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. యోగి ఈ వివాదంపై ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో స్పందించిన తాను ఆమెను వేదించలేదని.. కేవలం పది వేల రూపాయల విషయంలో జరిగిన వివాదమే ఇందుకు కారణమని తెలిపాడు. అదే సమయంలో డీసీపీ గంగిరెడ్డి తనపై దాడి చేస్తున్న వీడియోను తాను రిలీజ్ చేయలేదని ఆ వీడియో కూడా హారికనే షూట్ చేసిన తన మిత్రులకు షేర్ చేసిందని చెప్పారు. -
యువతికి దర్శకుడి వేధింపులు
సాక్షి, హైదరాబాద్: యోగి అనే దర్శకుడు ఓ మహిళకు అసభ్య మెసేజ్‌లు పంపి వేధిస్తున్నాడని, బాధితురాలి ఫిర్యాదు మేరకు అతనిని అరెస్టు చేస్తామని మాదాపూర్ డీసీపీ పి.విశ్వప్రసాద్ తెలిపారు. గచ్చిబౌలిలోని మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. షార్ట్‌ఫిల్మ్‌లో నటించే సాఫ్ట్వేర్ ఇంజనీర్ హారిక ఈ నెల 20న గచ్చిబౌలి ఉమెన్ పీఎస్‌లో బీహెచ్ఈఎల్లో ఉండే ముత్యాల యోగి కుమార్ వేధిస్తున్నారని ఫిర్యాదు చేసిందని తెలిపారు. షీటీమ్స్ ఇంచార్జీ, మాదాపూర్ అడిషనల్ డీసీపీ గంగిరెడ్డి విచారణ చేపట్టగా అసభ్య మెజేస్‌లు హారికతో పాటు ఆమె భర్తకు పంపినట్లు వెల్లడైందన్నారు. యోగి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పారు. విచారణ సమయంలో అడిషనల్ డీసీపీ యోగిని బూటుకాలితో తన్నినట్లు టీవీ చానళ్లలో వచ్చిందన్నారు. ఆ వీడియోలో వాస్తవం ఎంతుందో విచారణ చేపటాలని డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశించారు. డీసీపీ విశ్వప్రసాద్‌ను విచారణ అధికారిగా నియమించారు. ఇదిలా ఉండగా యోగిపై గతంలో జూబ్లిహిల్స్ పీఎస్‌లో కేసు నమోదైంది. ఈ విషయంపై బాధితురాలు శనివారం మీడియాతో మాట్లాడుతూ.. యోగి తనకు సంవత్సరం క్రితం ఫేస్బుక్లో పరిచయమని పేర్కొంది. అతనికి అనేకసార్లు ఆర్థికసాయం చేశానన్నారు. స్నేహితునిగా నటిస్తూనే నన్ను లొంగదీసుకోవాలనే ఆలోచన ఉన్నట్లు స్నేహితుల ద్వారా తెలుసుకుని కొద్ది రోజలుగా దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. వేధింపులు భరించలేక పోలీసులను ఆశ్రయించానన్నారు. -
‘జేడీ చక్రవర్తి భార్యను కూడా వేధించాడు’
యోగితో వివాదంపై షార్ట్ ఫిలిం హీరోయిన్ హారిక స్పందించారు. పది వేల రూపాయల కోసమే ఇంత రాద్ధాంతం చేస్తున్నానని యోగి చెప్పడం అవాస్తవమని ఆమె అన్నారు. తనను యోగి వేధించిందనందుకే పోలీసులను ఆశ్రయించానని తెలిపారు. తనతో పాటు తన భర్తకు కూడా అసభ్యకర పదాలతో మెసేజ్ లు చేశాడని, సాక్ష్యాలను పోలీసులకు అందించానని తెలిపారు. పది రోజుల క్రితం వరకు బాగానే ఉన్న యోగి కొద్ది రోజులుగానే ఇలా ప్రవర్తిస్తున్నాడని హారిక తెలిపారు. యోగి గతంలో కూడా కొంత మంది అమ్మాయిలను ఇలాగే వేధించాడని.. గతంలో జేడీ చక్రవర్తి భార్య అనుకృతి కూడా ‘పాప’ అనే షార్ట్ ఫిలిం సమయంలో యోగిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు హారిక తెలిపారు. అతడు బయటకు కనిపించేంత మంచి వాడు కాదని, అందరి ముందు ఎంతో మర్యాదగా నటించే యోగి గతంలో చాలా మంది అమ్మాయిలను ఇబ్బంది పెట్టాడని ఆరోపించారు. యోగి గురించి బయట చెడుగా ప్రచారం జరుగుతున్న విషయాన్ని ప్రస్తుతం అతనితో రిలేషన్ లో ఉన్న అమ్మాయికి చెప్పానని, దీంతో తన మీద పగ పెంచుకున్నట్లు హారిక తెలిపారు. తనపై వేధింపులకు దిగటంతో గతంలో ఇచ్చిన డబ్బు వెనక్కి ఇచ్చేయమన్నానని.. అప్పటి నుంచి వేధింపులు మరింత ఎక్కువయ్యాయని ఆమె పేర్కొన్నారు. ఇదే విషయంపై ఫిర్యాదు చేశానని, అయితే పోలీసుల ఎదుట కూడా యోగి అసభ్యకర భాష వాడటం వల్లే...అడిషనల్ డీసీపీ యోగిని కొట్టినట్లు చెప్పారు. మరోవైపు సైబరాబాద్ అడిషనల్ డీసీపీ గంగిరెడ్డి యోగీని కాలుతో కొట్టన వ్యవహారంపై మాదాపూర్ డీసీపీ విశ్వప్రసాద్ స్పందించారు. మూడు రోజుల క్రితం షీ టీంకి డైరెక్టర్ యోగిపై ఫిర్యాదు చేసిన హారిక.. తరువాత తనే ఫిర్యాదు వద్దు యోగీకి కౌన్సెలింగ్ చేయమని కోరిందని తెలిపారు. అడిషనల్ డీసీపీ గంగిరెడ్డి ఆధ్వర్యంలో విచారణ జరిగిందన్నారరు. ఆ సమయంలో డైరెక్టర్ యోగి అసభ్యంగా మాట్లాడటంతో డీసీపీ గంగారెడ్డి.. యోగిని బూటు కాలుతో తన్నినట్లు వీడియో బయటకు వచ్చిందని తెలిపారు. వీడియో ఎలా బయటకు వచ్చిందో తెలియదన్న విశ్వప్రసాద్.. డీసీపీ గంగిరెడ్డి అలా చేయటం మాత్రం కరెక్ట్ కాదన్నారు. ఈ విషయాన్ని కమిషనర్ సందీప్ శాండిల్యా దృష్టికి తీసుకెళ్లామని ఆయన చర్యలు తీసుకుంటారని తెలిపారు. -
‘హీరోయిన్ హారికకు అసభ్యంగా మెసేజ్ చేశా’
తన పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించాడంటూ షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ హారిక హైదరాబాద్, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ వివాదంపై ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో స్పందించిన యోగి తాను ఆమెను వేదించలేదని.. కేవలం పది వేల రూపాయల విషయంలో జరిగిన వివాదమే ఇందుకు కారణమని తెలిపాడు. అదే సమయంలో డీసీపీ గంగిరెడ్డి తనపై దాడి చేస్తున్న వీడియోను తాను రిలీజ్ చేయలేదని ఆ వీడియో కూడా హారికనే షూట్ చేసిన తన మిత్రులకు షేర్ చేసిందని తెలిపారు. తాను హారికను ఏ రోజు వేధింంచలేదని తెలిపారు ‘గతంలో తన వ్యక్తిగత విషయాలు హారిక నాతో షేర్ చేసుకునేది. ఆ విషయాలు మరో వ్యక్తి కారణంగా బయటకు వచ్చాయి. కానీ నేనే ఆ విషయాలను బయటపెట్టానని నా మీద కోపం పెంచుకుంది. నువ్వు నా పరువు తీశావు.. నేను కూడా నీ సంగతి చూస్తానంటూ నా మీద ఆరోపణలు చేసింది. అంతే కాదు ఇండస్ట్రీలో నాకు తెలిసిన వ్యక్తులకు ఫోన్ చేసి నా గురించి తప్పుగా చెప్పేది’ అన్నారు. తన మీద తప్పుడు ప్రచారం చేయటం ఆపేస్తేనే హారిక దగ్గర తీసుకున్న పదివేల రూపాయలు తిరిగిస్తానని చెప్పానన్నారు. హారికతో తానెప్పుడు కలిసి పని చేయలేదన్న యోగి.. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా ఆమె పరిచయం అయ్యిందని తెలిపారు. తాను హారికకు అసభ్యంగా మెసేజ్ చేసిన మాట వాస్తవమేనని, అయితే ఆమె రెచ్చగొట్టడం వల్లే అలా చేశానన్నారు. -
హీరోయిన్ ముందు పోలీస్ హీరోయిజం
-
హీరోయిన్ ముందు పోలీసాఫీసర్ హీరోయిజం
సాక్షి, హైదరాబాద్ : సైబరాబాద్ అడిషనల్ డీసీపీ గంగిరెడ్డి తీరు వివాదాస్పదంగా మారింది. షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ యోగిని కాలుతో తన్నటం మీడియాలో హల్ చల్ చేస్తోంది. తన పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించాడంటూ షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ హారిక హైదరాబాద్, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తనను శారీరకంగా లొంగదీసుకునేందుకు యోగి యత్నించాడని, రెమ్యునరేషన్ కూడా ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసిన పోలీసులు, యోగిని పిలిపించి గంటన్నర సేపు విచారించారు. అయితే, ఈ క్రమంలో యోగిని గంగిరెడ్డి బూటుతో తన్నారు. కౌన్సిలింగ్ పేరుతో పీఎస్‌కు పిలిచి మరీ చితకబాదారు. అయితే స్టేషన్ లో కూడా హారిక పట్ల యోగి దురుసుగా ప్రవర్తించినట్టు అధికారి చెబుతున్నప్పటికీ... యోగి మాత్రం వాటిని ఖండించాడు. పారితోషకం ఎప్పుడో ఇచ్చేశానని.. తాను చెప్పేది వినకుండా అధికారి తనపై చెయ్యి చేసుకున్నారని యోగి చెబుతున్నారు. -
మహిళా డైరెక్టర్‌కు హత్యా బెదిరింపులు
పెరంబూరు: భారతీయ జనతా పార్టీ, పుదియతమిళగం పార్టీలకు చెందిన కొంతమంది తనను చంపుతామని బెదిరిస్తున్నారని లఘు చిత్ర దర్శకురాలు దివ్యభారతి ఆరోపించారు. మధురై, ఆణైయూర్‌కు చెందిన ఈమె లెనినిస్ట్ సంఘంలో పనిచేస్తున్నారు. 2009లో లా కాలేజీ విద్యార్థి సురేశ్ పాము కాటుకు గురై మృతి చెందాడు. అతనికి నష్టపరిహారం ఇవ్వాలని దివ్యభారతి మధురై ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట పోరాటం చేసిన కేసులో గతవారం అరెస్టు అయ్యి అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో ఆమె సోమవారం ఉదయం మాట్లాడుతూ కొన్ని రోజులుగా తనకు హత్యాబెదిరింపు కాల్స్ వస్తున్నాయన్నారు. విదేశాల నుంచి కూడా ఈ బెదిరింపు కాల్స్ వస్తున్నాయన్నారు. తాను నిర్మించిన కక్కూస్ లఘు చిత్రాన్ని తప్పుగా అర్ధం చేసుకుని ఇలాంటి హత్యా బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. అయితే, వారు ఎవరనే విషయాన్ని ఆరా తీయగా బీజేపీ, పుదియ తమిళం పార్టీ నేత కృష్ణస్వామికి చెందిన వాళ్లమని చెబుతున్నారన్నారు. ఈ విషయాన్ని పోలీసులు తేల్చాలని కోరారు. అలాంటి వారికి కృష్ణస్వామి బుద్ది చెప్పాలన్నారు. కక్కూస్ చిత్రంపై కృష్ణస్వామి కోర్టులో పిటిషన్ వేయడానికి సిద్ధం అవుతున్నట్లు తెలిసిందని, ఆయన ఈ ప్రయత్నాన్ని విరమించుకోవాలని సూచించారు. పశుమాంసం ఇతి వృత్తంగా లఘు చిత్రాన్ని రూపొందింస్తున్నందుకే తనకు ఈ బెదిరింపులు వస్తున్నట్లు భావిస్తున్నానని చెప్పారు. -
దర్శకుడికి బెదిరింపులు.. పోలీసులకు ఫిర్యాదు
హైదరాబాద్: సీత ఐయామ్ నాట్ వర్జిన్ షార్ట్ ఫిలిం దర్శకుడు కౌశిక్ బాబు.. తనకు బెదిరింపులు వస్తున్నాయంటూ సీసీఎస్ పోలీసులను ఆశ్రయించాడు. సోషల్ మీడియాలో తనపై అభ్యంతరక పోస్టులు పెడుతున్నారని, బెదిరిస్తున్నారని సీసీఎస్ డీసీపీ మహంతికి ఫిర్యాదు చేశాడు. తనకు రక్షణ కల్పించాల్సిందిగా కోరాడు. సీత ఐయామ్ నాట్ వర్జిన్ టైటిల్ విషయంలో వివాదం ఏర్పడింది. హిందువులకు పూజనీయురాలైన సీతాదేవి పట్ల తప్పుడు అభిప్రాయం వచ్చేలా, టైటిల్ పెట్టారని మేడ్చల్ జిల్లా బీజేపీ లీగల్ సెల్ కన్వీనర్ వి.ప్రసన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిర్మాత నీరజ్నాయుడు, దర్శకుడు కైశిక్ బాబులతో పాటు నటీనటులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
మధుప్రియ పెళ్లైపోయింది
-
షార్ట్ ఫిలింలలో అవకాశం ఇచ్చి..
గాయని మధుప్రియ ప్రేమించిన శ్రీకాంత్ గురించి భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అతడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడని కొందరు, రియల్ ఎస్టేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడని మరికొందరు చెబుతున్నారు. అయితే ఇంకొందరు మాత్రం షార్ట్ ఫిలింలు డైరెక్ట్ చేస్తాడని అంటున్నారు. ఇలా షార్ట్ ఫిలింలు తీసే క్రమంలోనే అతడు రెండు మూడు షార్ట్ ఫిలింలలో మధుప్రియకు అవకాశం ఇచ్చాడని, వాటి షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని చెబుతున్నారు. హైదరాబాద్ నల్లకుంట ప్రాంతంలో మధుప్రియ కుటుంబం నివాసం ఉంటుంది. ఆ సమీపంలోనే శ్రీకాంత్ కూడా ఉండేవాడని, అప్పుడే ఇద్దరికీ పరిచయం ఉందని తెలుస్తోంది. రెండేళ్లుగా వీళ్ల మధ్య ప్రేమ వ్యవహారం ఉన్నా.. నెల రోజుల క్రితమే ఆమె మేజర్ కావడంతో, ఆ తర్వాతి నుంచి ఇరువైపుల పెద్దలను తమ పెళ్లి గురించి వీళ్లు అడుగుతున్నారు. శ్రీకాంత్ తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించినా.. మధుప్రియ తరఫు వాళ్లు మాత్రం ససేమిరా అంటున్నారు. ఇప్పటికీ ఎలాగోలా పెళ్లిని ఆపేందుకు వాళ్లవైపు నుంచి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.