సాక్షి, హైదరాబాద్ : సైబరాబాద్ అడిషనల్ డీసీపీ గంగిరెడ్డి తీరు వివాదాస్పదంగా మారింది. షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ యోగిని కాలుతో తన్నటం మీడియాలో హల్ చల్ చేస్తోంది.
తన పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించాడంటూ షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ హారిక హైదరాబాద్, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తనను శారీరకంగా లొంగదీసుకునేందుకు యోగి యత్నించాడని, రెమ్యునరేషన్ కూడా ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసిన పోలీసులు, యోగిని పిలిపించి గంటన్నర సేపు విచారించారు.
అయితే, ఈ క్రమంలో యోగిని గంగిరెడ్డి బూటుతో తన్నారు. కౌన్సిలింగ్ పేరుతో పీఎస్‌కు పిలిచి మరీ చితకబాదారు. అయితే స్టేషన్ లో కూడా హారిక పట్ల యోగి దురుసుగా ప్రవర్తించినట్టు అధికారి చెబుతున్నప్పటికీ... యోగి మాత్రం వాటిని ఖండించాడు. పారితోషకం ఎప్పుడో ఇచ్చేశానని.. తాను చెప్పేది వినకుండా అధికారి తనపై చెయ్యి చేసుకున్నారని యోగి చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment