Madhapur police
-
హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జిపై హిట్ అండ్ రన్
సాక్షి, హైదరాబాద్: నగరం నడిబొడ్డున మరో హిట్ అండ్ రన్ కేసు నమోదు అయ్యింది. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ఫొటోలు దిగుతుండగా ఓ కారు ఇద్దరు యువకుల్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. శుక్రవారం అర్ధరాత్రి దాటాక కేబుల్ బ్రిడ్జిపై ఫొటోలు దిగుతున్నారు ఇద్దరు. ఆ సమయంలో ఓ కారు వేగంగా వచ్చి వీళ్లను ఢీ కొట్టి వెళ్లిపోయింది. ప్రమాదంలో అక్కడికక్కడే చనిపోయిన వ్యక్తిని అనిల్‌గా గుర్తించారు. తీవ్ర గాయాలపాలైన అజయ్.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ప్రమాదానికి కారణమైన కారును గుర్తించినట్లు తెలుస్తోంది. -
మాదాపూర్‌లో గన్‌తో హల్చల్పై కొనసాగుతున్న దర్యాప్తు
-
సురేష్ బాబుతో భూవివాదం.. గన్‌తో బెదిరిస్తూ రియల్టర్ హల్చల్
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్‌లో గురువారం రాత్రి కాల్పులు కలకలం రేపాయి. సంజీవ రెడ్డి అనే రియల్టర్ రాత్రి సమయంలో గన్‌తో హల్చల్ చేశారు. దీంతో, ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, దగ్గుపాటి సురేష్‌బాబుకు చెందిన స్థలంలో జరుగుతున్న నిర్మాణాల వద్ద ఘటన చోటుచేసుకుంది. అయితే, సురేష్ బాబు స్థలంలో కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్‌ను సంజీవ రెడ్డి తీసుకున్నారు. కాగా, కన్స్ట్రక్షన్ సందర్భంగా సురేష్ బాబు, రామకృష్ణారెడ్డికి మధ్య భూ వివాదం చోటుచేసుకుంది. తన స్థలంలోకి జరిగి నిర్మాణం చేస్తున్నారని రామకృష్ణ ఆరోపించారు. ఈ విషయంపై మాదాపూర్ పీఎస్‌లో సురేష్ బాబు సూపర్వైజర్ ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా.. గురువారం రామకృష్ణారెడ్డి మరోసారి కన్స్ట్రక్షన్ జరుగుతున్న చోటుకు వచ్చారు. ఈ సందర్భంగా రామకృష్ణ, సంజీవ రెడ్డి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో సంజీవ రెడ్డి తన గన్‌తో రామకృష్ణారెడ్డిని బెదిరించాడు. దీంతో, రామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కాంట్రాక్టర్ సంజీవరెడ్డిని అదుపులోకి తీసుకుని గన్ను సీజ్ చేశారు. దీనిపై విచారణ కొనసాగుతున్నట్టు వెల్లడించారు. -
తాగి నడిపితే.. వాహనం తిరిగి ఇవ్వరా?
సాక్షి, హైదరాబాద్: ఒక రోజు తాగి వాహనం నడిపారన్న కారణంతో వాహనాన్ని పోలీసులు తమ స్వాధీనంలోనే ఉంచేసుకోవడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఒక రోజు తాగి వాహనం నడిపితే, ఆ రోజున తప్ప, మిగిలిన అన్ని రోజుల్లో కూడా పోలీసులు ఆ వాహనాన్ని తమ స్వాధీనంలోనే ఉంచుకోవడం చెల్లదంది. జూబ్లీహిల్స్‌కు చెందిన కోమటిరెడ్డి రిషికేష్ రెడ్డి నుంచి స్వాధీనం చేసుకున్న వాహనాన్ని తిరిగి అతనికి అప్పగించాలని మాదాపూర్ పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు ఇటీవల తీర్పు వెలువరించారు. జూబ్లీహిల్స్‌కు చెందిన రిషికేష్‌రెడ్డి కారు డ్రైవర్ గతేడాది డిసెంబర్ 8న మాదాపూర్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికాడు. కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిని సవాలు చేస్తూ రిషికేష్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తన వాహనాన్ని పోలీసులు స్వాధీనంలోనే ఉంచుకోవడం వల్ల ఇబ్బంది పడుతున్నానని, తాను పడుతున్న కష్టానికి రూ.లక్ష అదనపు ఖర్చు కింద చెల్లించేలా తెలంగాణ ప్రభుత్వాన్ని, పోలీసులను ఆదేశించాలని కోరారు. తన వాహనాన్ని విడుదల చేసేలా మాదాపూర్ పోలీసులను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు విచారణ జరిపారు. ఈ వాహనాన్ని పోలీసులు తమ స్వాధీనంలోనే ఉంచేసుకోవడం కాదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఆర్సీ బుక్, గుర్తింపు కార్డులతో మాదాపూర్ పోలీసుల వద్దకు వెళ్లాలని రిషికేష్రెడ్డిని ఆదేశించారు. అన్ని వివరాలను పరిశీలించిన తర్వాత రిషికేష్‌రెడ్డి వాహనాన్ని వెంటనే అతనికి ఇచ్చేయాలని తీర్పు ఇచ్చారు. -
హీరోయిన్ ముందు పోలీస్ హీరోయిజం
-
హీరోయిన్ ముందు పోలీసాఫీసర్ హీరోయిజం
సాక్షి, హైదరాబాద్ : సైబరాబాద్ అడిషనల్ డీసీపీ గంగిరెడ్డి తీరు వివాదాస్పదంగా మారింది. షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ యోగిని కాలుతో తన్నటం మీడియాలో హల్ చల్ చేస్తోంది. తన పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించాడంటూ షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ హారిక హైదరాబాద్, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తనను శారీరకంగా లొంగదీసుకునేందుకు యోగి యత్నించాడని, రెమ్యునరేషన్ కూడా ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసిన పోలీసులు, యోగిని పిలిపించి గంటన్నర సేపు విచారించారు. అయితే, ఈ క్రమంలో యోగిని గంగిరెడ్డి బూటుతో తన్నారు. కౌన్సిలింగ్ పేరుతో పీఎస్‌కు పిలిచి మరీ చితకబాదారు. అయితే స్టేషన్ లో కూడా హారిక పట్ల యోగి దురుసుగా ప్రవర్తించినట్టు అధికారి చెబుతున్నప్పటికీ... యోగి మాత్రం వాటిని ఖండించాడు. పారితోషకం ఎప్పుడో ఇచ్చేశానని.. తాను చెప్పేది వినకుండా అధికారి తనపై చెయ్యి చేసుకున్నారని యోగి చెబుతున్నారు. -
వ్యాయామం చేస్తూ సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి
హైదరాబాద్: వ్యాయమం చేస్తూ ఓ సాప్ట్వేర్ ఉద్యోగి అకస్మాత్తుగా మృతిచెందాడు. ఈ సంఘటన నగరంలోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మాదాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరుణ్‌కుమార్ (22) నగరంలోని మియాపూర్ మాతృశ్రీనగర్‌లో గత కొన్నిరోజులుగా నివాసం ఉంటున్నాడు. వరుణ్‌కుమార్ మాదాపూర్‌లోని డెల్ సాప్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం అతను కంపెనీ జిమ్‌లో వ్యాయమం చేస్తూ ఒత్తిడికి గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన కంపెనీ సిబ్బంది ఉద్యోగి వరుణ్‌కుమార్‌ను చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గంమధ్యలోనే అతడు మృతిచెందాడని వైద్యులు నిర్ధారించారు. సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
టెలీకాలర్ ఆత్మహత్య కేసులో నిందితుడికి రిమాండ్
-
టెలీకాలర్ ఆత్మహత్య కేసులో నిందితుడికి రిమాండ్
మాదాపూర్: ప్రేమ పేరుతో మోసం చేసి టెలీకాలర్ సునీత ఆత్మహత్యకు కారకుడైన కేసులో నిందితుడిని శనివారం మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఏసీపీ రమణకుమార్, డీఐ శశాంక్‌రెడ్డి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన శ్రవణ్‌కుమార్ శ్రీ చైతన్య ఇన్ఫోసిస్ సిస్టమ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేసేవాడు. కంపెనీ మూసివేయడంతో పంజగుట్టలోని జస్ట్ డయల్‌లో కొద్దికాలం పనిచేశాడు. ఆ తరువాత అతను గచ్చిబౌలి డీఎల్ఎఫ్లో ప్రాసెసర్ డెవలఫర్‌గా పని చేస్తున్నాడు. జస్ట్ డయల్‌లో పనిచేస్తున్న సమయంలో టెలీకాలర్‌గా పని చేస్తున్న సునీతతో అతడికి పరిచయం ఏర్పడింది. ప్రేమపేరుతో ఆమెను నమ్మించి మోసం చేశాడు. పెళ్లి చేసుకోవాలని సునీత ఒత్తిడి చేయడంతో ఆమె వద్ద రూ. 1 లక్ష తీసుకొని ఇంకా డబ్బులు ఇస్తేనే పెళ్లి చేసుకుంటానని బెదిరించాడు. ఆమెతో పాటు మరికొందరు అమ్మాయిలతో స్నేహం చేసి మోసం చేసినట్లుగా నిందితుడు అంగీకరించాడు. సునీతను ఎలాగైనా వదిలించుకోవాలని నిర్ణయించుకున్న అతను ఆమెను బెదిరిస్తూ మెసేజ్‌లు పంపాడు. ఈ నెల 14న పెళ్లి విషయం తేల్చాలని సునీత మెసేజ్‌లు ఇచ్చినా శ్రవణ్‌కుమార్ పట్టించుకోలేదు. ‘నీవు రాకపోతే చనిపోతానని’ మెసేజ్ పంపించింది. అయినా అతను స్పందించకపోవడంతో ఈ నెల 15న భాగ్యనగర్ కో–ఆపరేటివ్ సొసైటీ ఖాళీ స్థలంలో కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇందుకు కారణమైన శ్రవణ్‌కుమార్ అరెస్టు చేసి అతని నుండి బైక్, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. -
ముంబయి మోడల్స్‌తోపాటు యువకులు అరెస్ట్
హైదరాబాద్ : నగరంలోని మాదాపూర్ పీఎస్ పరిధిలోని ఖానామెట్‌లో ముజ్రాపార్టీపై ఎస్వోటీ పోలీసులు శనివారం దాడి చేశారు. ఈ సందర్భంగా అశ్లీల నృత్యాలు చేస్తున్న యువతి, యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే వారి వద్ద నుంచి మద్యం, నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కి తరలించారు. పట్టుబడిన వారిలో ముంబయికి చెందిన నలుగురు మోడల్స్‌తోపాటు 17 మంది యువకులు ఉన్నారని... వారిలో పలువురు ప్రభుత్వ అధికారులు కూడా ఉన్నారని పోలీసులు చెప్పారు. వారందరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
ఉద్యోగాల పేరిట మోసం చేసిన వ్యక్తి అరెస్ట్
మాదాపూర్: ప్రముఖ ఐటీ కంపనీలలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగులను మోసం చేస్తున్న ఓ యువకుడిని మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్ఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్ నగర్ ప్రాంతానికి చెందిన హర్షత్ నవీన్ (28) ఎంబీఏ పూర్తి చేసి ఓ ప్రై వేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. వ్యసనాలకు బానిసగా మారి సులువుగా డబ్బు సంపాదించాలనే ఆశతో నిరుద్యోగులను మోసం చేయడం ప్రారంభించాడు. ఇందులో భాగంగానే నౌకరి, మాన్స్టర్ జాబ్ పోర్టల్ నుంచి నిరుద్యోగుల వివరాలు సేకరించి వారికి నకిలి ఈ-మెయిళ్లు పంపించాడు. సుమారు 8 మంది నిరుద్యోగుల దగ్గర నుంచి రూ. 8 లక్షల వసూలు చేసి పారిపోయాడు. ఎటువంటి అనుమానం రాకుండా ఐల్యాబ్స్, రహేజా మాక్స్ మాస్ లలో దొంగ ఇంటర్వ్యూలు సైతం చేయించాడు. వేణుగోపాల్ అనే వ్యక్తి సహకరించాడు. ప్రస్తుతం వేణుగోపాల్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. హర్షత్ నవీన్‌ను రిమాండ్‌కు పంపారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
సారా బట్టీల స్థావరాలపై పోలీసుల కార్డన్ సెర్చ్
-
సారా బట్టీల స్థావరాలపై పోలీసుల కార్డన్ సెర్చ్
హైదరాబాద్: నగరంలోని శివారుప్రాంతంలో సారా బట్టీల సరఫరా యథేచ్చగా కొనసాగుతోంది. గతకొంతకాలంగా నానక్‌రామ్‌గూడలో సారా బట్టీల స్థావరాల నుంచి గుడుంబాను భారీగా సరఫరా చేస్తున్నారు. అందిన ప్రాథమిక సమాచారం మేరకు మాదాపూర్ పోలీసులు రంగంలోకి దిగి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీసీపీ కార్తికేయ ఆధ్వర్యంలో 400మంది పోలీసులతో సోమవారం ఉదయం నుంచి నగరంలోని నానక్‌రామ్‌గూడలో గుడంబా, సారా బట్టీల స్థావరాలపై దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో భారీగా సారా బట్టీలను పోలీసులు ధ్వంసం చేశారు. పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ప్రకాశ్ రాజ్ కారును ఢికొట్టిన బస్సు డ్రైవర్ అరెస్ట్!
హైదరాబాద్: సినీ నటుడు ప్రకాశ్ రాజ్ కారును ఢికొట్టిన కేసులో బస్సు డ్రైవర్ మల్లారెడ్డిని బుధవారం అరెస్ట్ చేశామని మాదాపూర్ పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ కే. నర్సింహులు తెలిపారు. నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన ఫిర్యాదు మేరకు ఈ కేసును విచారణ చేపట్టామని పోలీసులు తెలిపారు. బస్సు డ్రైవర్ మల్లారెడ్డిని విచారించినట్టు ఆయన తెలిపారు. మంగళవారం రాత్రి హైటెక్ సిటీ సమీపంలోని మాదాపూర్ ఫ్లైఓవర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రకాశ్ రాజ్ కు స్వల్ప గాయాలు కాగా, కారు పాక్షికంగా ధ్వంసమైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఓ కుటుంబానికి కూడా గాయాలయ్యాయి. ఈ ఘటనలో అక్షర అనే చిన్నారి గాయపడింది. -
సినీనటికి అసభ్య ఎస్ఎంఎస్ లు పంపిన వ్యక్తి అరెస్ట్
సినీనటికి హేమకు అసభ్యకర ఎస్ఎంఎస్ లు పంపిన వ్యక్తిని మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొద్దికాలంగా ఓ వ్యక్తి అసభ్యకరంగా సెల్ ఫోన్ మెసేజ్ లు పంపుతున్నట్టు హేమ మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నవంబర్ 25 తేదిన హేమ చేసిన ఫిర్యాదు మేరకు.. మెసేజ్ లు వస్తున్న ఫోన్ నెంబర్ పై మాదాపూర్ పోలీసులు నిఘా పెట్టారు. ఫోన్ నెంబర్ ఆధారంగా నల్గొండ జిల్లా సూర్యాపేటకు చెందిన మధుగా పోలీసులు గుర్తించారు. ఫిర్యాదు చేసిందనే సమచారం తెలుసుకున్న నిందితుడు కొద్ది రోజల నుంచి ఫోన్ స్విచాఫ్ చేసినట్టు పోలీసులు తెలిపారు. నిందితుడు ఫోన్ నెంబర్ ఆధారంగా చేసుకుని కాల్ డేటాను సేకరించి.. మధును పట్టుకున్నామని మదాపూర్ ఇన్స్ పెక్టర్ తెలిపారు. పదవ తరగతి ఫెయిల్ అయిన మధుపై గతంలో ఇలాంటి కేసులు నమోదయ్యాయని తెలిసింది. నిందితుడిని పూర్తిగా విచారించిన తర్వాత సైబర్ క్రిమినల్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయనున్నట్టు తెలిసింది. నిందితుడి వివరాలు తెలియాల్సి ఉంది.