Realtor Warning With Gun In Suresh Babu Land Dispute - Sakshi
Sakshi News home page

దగ్గుపాటి సురేష్‌ బాబుతో భూవివాదం.. గన్‌తో బెదిరిస్తూ రియల్టర్‌ హల్‌చల్‌ 

Published Fri, Oct 21 2022 11:01 AM | Last Updated on Fri, Oct 21 2022 1:04 PM

Realtor Warning With Gun In Suresh Babu Land Dispute - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మాదాపూర్‌లో గురువారం రాత్రి కాల్పులు కలకలం రేపాయి. సంజీవ రెడ్డి అనే రియల్టర్ రాత్రి సమయంలో గన్‌తో హల్‌చల్ చేశారు. దీంతో, ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, దగ్గుపాటి సురేష్‌బాబుకు చెందిన స్థలంలో జరుగుతున్న నిర్మాణాల వద్ద ఘటన చోటుచేసుకుంది.

అయితే, సురేష్‌ బాబు స్థలంలో కన్‌స్ట్రక్షన్‌ కాంట్రాక్ట్‌ను సంజీవ రెడ్డి తీసుకున్నారు. కాగా, కన్‌స్ట్రక్షన్‌ సందర్భంగా సురేష్‌ బాబు, రామకృష్ణారెడ్డికి మధ్య భూ వివాదం చోటుచేసుకుంది. తన స్థలంలోకి జరిగి నిర్మాణం చేస్తున్నారని రామకృష్ణ ఆరోపించారు. ఈ విషయంపై మాదాపూర్‌ పీఎస్‌లో సురేష్‌ బాబు సూపర్‌వైజర్‌ ఫిర్యాదు చేశారు. 

ఇదిలా ఉండగా.. గురువారం రామకృష్ణారెడ్డి మరోసారి కన్‌స్ట్రక్షన్‌ జరుగుతున్న చోటుకు వచ్చారు. ఈ సందర్భంగా రామకృష్ణ, సంజీవ రెడ్డి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో సంజీవ రెడ్డి తన గన్‌తో రామకృష్ణారెడ్డిని బెదిరించాడు. దీంతో, రామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కాంట్రాక్టర్‌ సంజీవరెడ్డిని అదుపులోకి తీసుకుని గన్‌ను సీజ్‌ చేశారు. దీనిపై విచారణ కొనసాగుతున్నట్టు వెల్లడించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement