realter arrested
-
మాదాపూర్‌లో గన్‌తో హల్చల్పై కొనసాగుతున్న దర్యాప్తు
-
సురేష్ బాబుతో భూవివాదం.. గన్‌తో బెదిరిస్తూ రియల్టర్ హల్చల్
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్‌లో గురువారం రాత్రి కాల్పులు కలకలం రేపాయి. సంజీవ రెడ్డి అనే రియల్టర్ రాత్రి సమయంలో గన్‌తో హల్చల్ చేశారు. దీంతో, ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, దగ్గుపాటి సురేష్‌బాబుకు చెందిన స్థలంలో జరుగుతున్న నిర్మాణాల వద్ద ఘటన చోటుచేసుకుంది. అయితే, సురేష్ బాబు స్థలంలో కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్‌ను సంజీవ రెడ్డి తీసుకున్నారు. కాగా, కన్స్ట్రక్షన్ సందర్భంగా సురేష్ బాబు, రామకృష్ణారెడ్డికి మధ్య భూ వివాదం చోటుచేసుకుంది. తన స్థలంలోకి జరిగి నిర్మాణం చేస్తున్నారని రామకృష్ణ ఆరోపించారు. ఈ విషయంపై మాదాపూర్ పీఎస్‌లో సురేష్ బాబు సూపర్వైజర్ ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా.. గురువారం రామకృష్ణారెడ్డి మరోసారి కన్స్ట్రక్షన్ జరుగుతున్న చోటుకు వచ్చారు. ఈ సందర్భంగా రామకృష్ణ, సంజీవ రెడ్డి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో సంజీవ రెడ్డి తన గన్‌తో రామకృష్ణారెడ్డిని బెదిరించాడు. దీంతో, రామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కాంట్రాక్టర్ సంజీవరెడ్డిని అదుపులోకి తీసుకుని గన్ను సీజ్ చేశారు. దీనిపై విచారణ కొనసాగుతున్నట్టు వెల్లడించారు. -
సినిమాల్లో అవకాశాల పేరుతో మోసం
సినిమా అవకాశాలు కల్పిస్తానంటూ యువతుల నుంచి డబ్బు వసూలు చేయటంతోపాటు మోసాలకు పాల్పడుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి కోటేశ్వర్‌రావును జూబ్లీహిల్స్ పోలీసులు బుధవారం రిమాండ్‌కు తరలించారు. సినిమా అవకాశాల కోసం నగరానికి వచ్చిన ఓ యువతి నుంచి ఇతడు రూ. 3 లక్షలు తీసుకున్నాడు. అంతటితో ఆగకుండా అసభ్యంగా ప్రవర్తించడంతో బాధితురాలు ఇటీవల జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదుచేసింది. దీంతో నిందితుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కేవలం యువతులనే కాకుండా సినీ దర్శకులు నాగేశ్వర్‌రెడ్డి, సుబ్బారెడ్డి, చందు, ఎగ్జిక్యూటివ్ మేనేజర్ వల్లూరిపల్లి వెంకటేశ్వర్రావు, కిశోర్, సహదర్శకుడు రాంబాబు తదితరులకు స్థలాలు ఇప్పిస్తానంటూ మాయమాటలు చెప్పి రూ. 20 లక్షల వరకు వసూలు చేసినట్లు కూడా పోలీసుల విచారణలో వెల్లడైంది. గతంలోనే చందు, సుబ్బారెడ్డిలను రౌడీలతో కొట్టించిన ఘటనలో జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదులు అందాయి. యువతి ఇచ్చిన ఫిర్యాదుతో కోటేశ్వర రావు నేరాలచిట్టా బయటకు వచ్చింది. నిందితుడిని రిమాండ్‌కు తరలించిన జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేశారు.