సినిమా అవకాశాలు కల్పిస్తానంటూ యువతుల నుంచి డబ్బు వసూలు చేయటంతోపాటు మోసాలకు పాల్పడుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి కోటేశ్వర్‌రావును జూబ్లీహిల్స్ పోలీసులు బుధవారం రిమాండ్‌కు తరలించారు. సినిమా అవకాశాల కోసం నగరానికి వచ్చిన ఓ యువతి నుంచి ఇతడు రూ. 3 లక్షలు తీసుకున్నాడు. అంతటితో ఆగకుండా అసభ్యంగా ప్రవర్తించడంతో బాధితురాలు ఇటీవల జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదుచేసింది. దీంతో నిందితుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
కేవలం యువతులనే కాకుండా సినీ దర్శకులు నాగేశ్వర్‌రెడ్డి, సుబ్బారెడ్డి, చందు, ఎగ్జిక్యూటివ్ మేనేజర్ వల్లూరిపల్లి వెంకటేశ్వర్‌రావు, కిశోర్, సహదర్శకుడు రాంబాబు తదితరులకు స్థలాలు ఇప్పిస్తానంటూ మాయమాటలు చెప్పి రూ. 20 లక్షల వరకు వసూలు చేసినట్లు కూడా పోలీసుల విచారణలో వెల్లడైంది. గతంలోనే చందు, సుబ్బారెడ్డిలను రౌడీలతో కొట్టించిన ఘటనలో జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదులు అందాయి. యువతి ఇచ్చిన ఫిర్యాదుతో కోటేశ్వర రావు నేరాలచిట్టా బయటకు వచ్చింది. నిందితుడిని రిమాండ్‌కు తరలించిన జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేశారు.
సినిమాల్లో అవకాశాల పేరుతో మోసం
Published Wed, Nov 4 2015 7:35 PM | Last Updated on Thu, Aug 9 2018 7:30 PM
Advertisement