lady cheated
-
దొంగ బాబా: భూత వైద్యం పేరుతో మహిళను లొంగదీసుకొని.. ఆ తర్వాత..
దేశంలో ఏదో ఒక చోట మహిళలు వేధింపులకు, అత్యాచారాలకు గురవుతూనే ఉన్నారు. తాజాగా దెయ్యాలు, భూతాల పేరుతో ఓ దొంగ బాబా.. 19ఏళ్లుగా మహిళపై లైంగిక దాడులకు పాల్పడుతున్నాడు. ఈ షాకింగ్ ఘటన ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. బాధితురాలు కరన్పుర్లో నివాసం ఉండేది. కాగా, ఆమె 14 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు అనారోగ్యానికి గురికావడంతో అదే ప్రాంతంలో ఉండే పరమానంద పురి అలియాస్ ప్రవీణ్ గుజ్రాల్ అనే బాబా వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో ఆమెను ఆత్మల పేరుతో భయపెట్టి ఆరోగ్యం బాగుచేస్తానని నమ్మించాడు. అనంతరం కూల్‌డ్రింక్‌లో మత్తు మందులు కలిపి ఆమెపై అత్యాచారం చేశాడు. అయితే, 2006లో సదరు దొంగ బాబా ఆ ప్రాంతం వదిలి డెహ్రాడూన్‌కు వెళ్లిపోయాడు. అనంతరం 2012లో ఆమెకు ఓ మానసిక రోగితో వివాహం జరిపించాడు. కానీ, ఆమెతో మాత్రం సంబంధం కొనసాగించాడు. తాజాగా ఆమె కుతూళ్లపై దొంగ బాబా కన్నేయడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ.. దీవెనెల పేరుతో ప్రవీణ్ గుజ్రాల్ తనను అనుచితంగా తాకేవాడని తెలిపింది. బాబా ఇచ్చే ఔషధాల వల్ల తనకు చాలా సార్లు అబార్షన్ అయిందని వాపోయింది. 2021 మే నెలలో తన కూతుళ్లతో బాబా కన్నేసి లైంగికంగా వేధింపులకు గురిచేశాడని ఆరోపించింది. తన వద్ద నుంచి బాబా రూ.40 లక్షలు తీసుకున్నాడని చెప్పుకొచ్చింది. ఆమె ఆరోపణలపై గుజ్రాల్ స్పందిస్తూ.. మహిళ తనను బ్లాక్మెయిల్ చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. బాధితురాలి ఆరోపణలను కొట్టిపారేశాడు. ఇదిలా ఉండగా గతంలోనూ బాబాపై మహిళ ఇలాగే ఆరోపణలు చేసినట్లు సమాచారం. కాగా, ఆమె ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టినట్టు తెలిపారు ఇది కూడా చదవండి: కట్నం కోసం బంధువులతో అత్యాచారం.. వీడియో యూట్యూబ్‌లో అప్లోడ్ చేసి.. -
మత ప్రచారకుడికి వల
మొయినాబాద్ (చేవెళ్ల): హోటల్ వ్యాపారంలో నష్టపోయిన దంపతులు డబ్బుకోసం ఓ మత ప్రచారకుడికి వలవేశారు. అతడిని నమ్మించి డబ్బులు తీసుకున్నారు. భోజనం కోసం అంటూ పిలిచి జూస్‌లో మత్తుమందు కలిపారు. అనంతరం అసభ్యకరంగా ఉన్న ఫొటోలు తీసి రూ.కోటి ఇవ్వాలంటూ బ్లాక్మెయిల్ చేసి చివరకు పోలీసులకు చిక్కారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మొయినాబాద్‌లోని ఓ మత ప్రచారకుడి వద్దకు గత ఆగస్టు 11న ఓ మహిళ(23) వచ్చింది. తన ఆరోగ్యం బాగలేదని తనకోసం ప్రార్థనలు చేయాలని అతడిని కోరింది. అలా పరిచయం ఏర్పరచుకుని తాను ఓ అనాథాశ్రమం నడుపుతున్నట్లు చెప్పింది. ఆయన ఫోన్‌నంబర్ తీసుకుని వాట్సప్ చాటింగ్ చేసేది. కొన్నాళ్ల తర్వాత శంషాబాద్‌లో ఓ రెస్టారెంట్‌కు, మరోసారి వండర్లాకు పిలిచి అతనితో సెల్ఫీలు దిగింది. తన భర్త విజయవాడలో ఓ హోటల్ ఏర్పాటు చేస్తున్నారని, పెట్టుబడిగా సాయం కావాలని రూ.10 లక్షలు తీసుకుంది. వ్యాపారం పేరుతో బాధితుడిని పిలిచి తమ పథకం అమలుచేసి అతడిని బ్లాక్మెయిల్ చేసి రూ.కోటికి ఒప్పందం రాయించుకొని రూ.10 లక్షలు గుంజారు. వేధింపులు పెరగడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గతంలో ఆమె ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేసిందని, ఆమె భర్త హైదరాబాద్‌లో హోటల్ వ్యాపారం నడిపి నష్టపోయారని పోలీసులు గుర్తించారు. వారిని సోమవారం రిమాండ్‌కు తరలించనున్నారు. -
సినిమాల్లో అవకాశాల పేరుతో మోసం
సినిమా అవకాశాలు కల్పిస్తానంటూ యువతుల నుంచి డబ్బు వసూలు చేయటంతోపాటు మోసాలకు పాల్పడుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి కోటేశ్వర్‌రావును జూబ్లీహిల్స్ పోలీసులు బుధవారం రిమాండ్‌కు తరలించారు. సినిమా అవకాశాల కోసం నగరానికి వచ్చిన ఓ యువతి నుంచి ఇతడు రూ. 3 లక్షలు తీసుకున్నాడు. అంతటితో ఆగకుండా అసభ్యంగా ప్రవర్తించడంతో బాధితురాలు ఇటీవల జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదుచేసింది. దీంతో నిందితుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కేవలం యువతులనే కాకుండా సినీ దర్శకులు నాగేశ్వర్‌రెడ్డి, సుబ్బారెడ్డి, చందు, ఎగ్జిక్యూటివ్ మేనేజర్ వల్లూరిపల్లి వెంకటేశ్వర్రావు, కిశోర్, సహదర్శకుడు రాంబాబు తదితరులకు స్థలాలు ఇప్పిస్తానంటూ మాయమాటలు చెప్పి రూ. 20 లక్షల వరకు వసూలు చేసినట్లు కూడా పోలీసుల విచారణలో వెల్లడైంది. గతంలోనే చందు, సుబ్బారెడ్డిలను రౌడీలతో కొట్టించిన ఘటనలో జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదులు అందాయి. యువతి ఇచ్చిన ఫిర్యాదుతో కోటేశ్వర రావు నేరాలచిట్టా బయటకు వచ్చింది. నిందితుడిని రిమాండ్‌కు తరలించిన జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేశారు.