సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫార్ములా ఈ-కారు రేసు కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. నేడు ఈడీ విచారణకు హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డి హాజరు కావాల్సి ఉండగా.. ఆయన వెళ్లలేదు. విచారణకు మరింత సమయం కావాలని ఈడీ అధికారులను కోరారు.
ఫార్ములా ఈ-కారు రేసు కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డిని ఈడీ అధికారులు నేడు విచారించాల్సి ఉండగా.. ఆయన విచారణకు హాజరు కాలేదు. విచారణకు రావడానికి మరింత సమయం కావాలని బీఎల్ఎన్ రెడ్డి కోరారు. ఈ మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్న అధికారికి ఆయన మెయిల్ పంపారు. దీంతో, బీఎల్‌ఎన్ రెడ్డి మెయిల్‌కు ఈడీ సమాధానం ఇచ్చింది. ఈ సందర్భంగా తిరిగి ఎప్పుడు విచారణకు రావాలో చెబుతామని అధికారులు చెప్పారు.
ఇదిలా ఉండగా.. తెలంగాణలో ఫార్ములా ఈ-కారు రేసు కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసు విచారణలో ఈడీ అధికారులు స్పీడ్ పెంచారు. రేపు ఈడీ విచారణకు ఐఏఎస్ అరవింద్ కుమార్ విచారణకు హాజరవనున్నారు. ఈనెల ఏడో తేదీన కేటీఆర్.. ఈడీ ఎదుట హాజరు కానున్నారు. ఈ కేసులో కేటీఆర్‌ను ఈడీ అధికారులు విచారించనున్నారు. ఇక, ఫార్ములా ఈ-కారు రేసు కేసులో కేటీఆర్-ఏ1, ఐఏఎస్ అరవింద్ కుమార్-ఏ2, బీఎల్‌ఎన్ రెడ్డి-ఏ3గా ఉన్నారు. అయితే, కారు కేసులో ఫెమా నిబంధనలు ఉల్లఘించినట్టు ఈడీ పేర్కొంది. ఇందులో భాగంగానే ఈడీ.. ఈసీఐఆర్ నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు. రూ.55కోట్ల విదేశీ కంపెనీ ఎఫ్‌ఈవోకు సంబంధించిన బదిలీలపై నేడు ఈడీ విచారించనుంది.
Comments
Please login to add a commentAdd a comment