మహారాష్ట్ర: సంజయ్‌ రౌత్‌పై కార్యకర్తల దాడి? | Shivsena UBT Supporters Clash with Sanjay Raut | Sakshi
Sakshi News home page

మహారాష్ట్ర: సంజయ్‌ రౌత్‌పై కార్యకర్తల దాడి?

Published Wed, Jan 1 2025 12:28 PM | Last Updated on Wed, Jan 1 2025 12:28 PM

Shivsena UBT Supporters Clash with Sanjay Raut

ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం చోటుచేసుకుంది. శివసేన యూబీటీ నేత సంజయ్‌ రౌత్‌పై కార్యకర్తలు దాడి చేసినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మాజీ సీఎం ఉద్ధవ్‌ థాక్రే నివాసంలోనే ఆయనపై దాడి జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై సోషల్‌ మీడియా కథనాలు చర్చనీయాంశంగా మారాయి.

ముంబైలోని బాంద్రాలో ఉన్న మాతోశ్రీలో ఉద్దవ్‌ థాక్రేతో సంజయ్‌ రౌత్‌ సమావేశమాయ్యారు. ఈ సమావేశం సందర్భంగా కొంత మంది పార్టీ కార్యకర్తలు సంజయ్‌తో వాగ్వాదానికి దిగినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో రౌత్‌.. వైఖరి, ఆయన వ్యాఖ్యల వల్లే పార్టీ తీవ్రంగా నష్టపోయినట్టు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఓటమి చెందినట్టు కార్యకర్తలు చెప్పారు. దీంతో, వాగ్వాదం తలెత్తింది. ఇందులో భాగంగానే సంజయ్‌ రౌత్‌పై థాక్రే మద్దతుదారులు దాడి చేసినట్టు సమాచారం. అంతేకాకుండా, సంజయ్‌ రౌత్‌ను కొన్ని గంటల పాటు ఓ గదిలో ఉంచి తాళం వేసినట్టు తెలుస్తోంది.

ఇక, సంజయ్‌ రౌత్‌పై దాడికి సంబంధించిన వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే, దాడి ఘటన వార్తలపై ఉద్దవ్‌ థాక్రే కానీ, సంజయ్‌ రౌత్‌ గానీ ఇప్పటి వరకు స్పందించలేదు. దీంతో, ఈ ఘటనపై మహారాష్ట్రలో మరింత చర్చ జరుగుతోంది.

ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో జరగబోయే బీఎంసీ ఎన్నికలపై ఉద్దవ్‌ థాక్రే కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. బీఎంసీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు పార్టీ నేత ఆనంద్‌ దూబే చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌, శరద్‌ పవార్‌ ఎన్సీపీతో పొత్తు ఉండదని స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement