సినీనటికి అసభ్య ఎస్ఎంఎస్ లు పంపిన వ్యక్తి అరెస్ట్ | One person held for sending abusive messages to film actress Hema | Sakshi
Sakshi News home page

సినీనటికి అసభ్య ఎస్ఎంఎస్ లు పంపిన వ్యక్తి అరెస్ట్

Published Thu, Nov 28 2013 12:38 PM | Last Updated on Thu, Jul 25 2019 5:25 PM

సినీనటికి అసభ్య ఎస్ఎంఎస్ లు పంపిన వ్యక్తి అరెస్ట్ - Sakshi

సినీనటికి అసభ్య ఎస్ఎంఎస్ లు పంపిన వ్యక్తి అరెస్ట్

సినీనటికి హేమకు అసభ్యకర ఎస్ఎంఎస్ లు పంపిన వ్యక్తిని మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొద్దికాలంగా ఓ వ్యక్తి అసభ్యకరంగా సెల్ ఫోన్ మెసేజ్ లు పంపుతున్నట్టు  హేమ మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నవంబర్ 25 తేదిన హేమ చేసిన ఫిర్యాదు మేరకు.. మెసేజ్ లు వస్తున్న ఫోన్ నెంబర్ పై మాదాపూర్ పోలీసులు నిఘా పెట్టారు. 
 
ఫోన్ నెంబర్ ఆధారంగా నల్గొండ జిల్లా సూర్యాపేటకు చెందిన మధుగా పోలీసులు గుర్తించారు. ఫిర్యాదు చేసిందనే సమచారం తెలుసుకున్న నిందితుడు కొద్ది రోజల నుంచి ఫోన్ స్విచాఫ్ చేసినట్టు పోలీసులు తెలిపారు. నిందితుడు ఫోన్ నెంబర్ ఆధారంగా చేసుకుని కాల్ డేటాను సేకరించి.. మధును పట్టుకున్నామని మదాపూర్ ఇన్స్ పెక్టర్ తెలిపారు.
 
పదవ తరగతి ఫెయిల్ అయిన మధుపై గతంలో ఇలాంటి కేసులు నమోదయ్యాయని తెలిసింది. నిందితుడిని పూర్తిగా విచారించిన తర్వాత సైబర్ క్రిమినల్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయనున్నట్టు తెలిసింది. నిందితుడి వివరాలు తెలియాల్సి ఉంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement