
వ్యాయామం చేస్తూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి
వ్యాయమం చేస్తూ ఓ సాప్ట్‌వేర్ ఉద్యోగి అకస్మాత్తుగా మృతిచెందాడు. ఈ సంఘటన నగరంలోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
హైదరాబాద్: వ్యాయమం చేస్తూ ఓ సాప్ట్‌వేర్ ఉద్యోగి అకస్మాత్తుగా మృతిచెందాడు. ఈ సంఘటన నగరంలోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మాదాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరుణ్‌కుమార్ (22) నగరంలోని మియాపూర్ మాతృశ్రీనగర్‌లో గత కొన్నిరోజులుగా నివాసం ఉంటున్నాడు. వరుణ్‌కుమార్ మాదాపూర్‌లోని డెల్ సాప్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు.
ఈ క్రమంలో బుధవారం అతను కంపెనీ జిమ్‌లో వ్యాయమం చేస్తూ ఒత్తిడికి గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన కంపెనీ సిబ్బంది ఉద్యోగి వరుణ్‌కుమార్‌ను చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గంమధ్యలోనే అతడు మృతిచెందాడని వైద్యులు నిర్ధారించారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.