
నాసిక రంధ్రాల ద్వారా శ్వాసను లోపలికి తీసుకుంటూ, తిరిగి వదులుతూ చే సే ప్రాణామాయ పద్ధతులలో ముఖ్యమైనవి నాలుగు ఉన్నాయి. వాటిలో..
కపాలభాతి: ఈ ప్రాణాయామంలో వేగంగా ఊపిరి తీసుకోవడం, వదలడం ఉంటుంది. ఈ విధానం వల్ల జీర్ణక్రియ పనితీరు మెరుగుపడుతుంది. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. శ్వాసకోశ కండరాలు బలోపేతం అవుతాయి. ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. మెదడుకు ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది. దీని వల్ల చేసే పనిపైన శ్రద్ధ, సృజనాత్మకత పెరుగుతుంది. ఒక ప్రశాంతమైన స్థలంలో సుఖాసనంలో కూర్చొని, ముక్కు ద్వారా శ్వాస పీల్చుతూ, వదులుతూ ఉండాలి.
భస్త్రిక: ఈ ప్రాణాయామం ద్వారా శరీరంలో ఆక్సిజన్ స్థాయిని పెంచవచ్చు. నోటిద్వారా శ్వాసను తీసుకొని, నోటిద్వారా వదలాలి. ఈ ప్రక్రియను పది–పదిహేను సార్లు పదే పదే చేయాలి.
భ్రామరి: ఈ ప్రాణాయామం ద్వారా మనస్సు ప్రశాంతంగా మారుతుంది. నోటితో తేనెటీగలాగ హమ్ చేస్తూ .. నాసిక రంధ్రాల ద్వారా గాలి పీల్చుకొని, నెమ్మదిగా వదలాలి.
ఆరోగ్య సమస్యలు ఉన్న వారు వైద్యులను సంప్రదించి, నిపుణుల సలహాతో వీటిని సాధన చేయడం వల్ల మెరుగైన ఫలితాలను పొందదుతారు.