Breathing
-
గాల్లోనే ఊపిరి పోశారు!
న్యూఢిల్లీ: అది శనివారం ఉదయం వేళ. రాంచీ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానం. బయల్దేరి అప్పటికి 20 నిమిషాలైంది. ఇంకో గంట ప్రయాణం ఉంది. ప్రయాణికుల్లో పుట్టుకతోనే తీవ్ర హృద్రోగ సమస్యతో బాధ పడుతున్న ఒక ఆర్నెల్ల చిన్నారి. తల్లిదండ్రులు తనను చికిత్స కోసం ఢిల్లీ ఎయిమ్స్ తీసుకెళ్తున్నారు. ఉన్నట్టుండి ఊపిరాడక పాప అల్లాడింది. దాంతో తల్లి పెద్దపెట్టున రోదించింది. సాయం కోసం అర్థించింది. విషయం అర్థమై ప్రయాణికుల్లో ఉన్న ఇద్దరు డాక్టర్లు హుటాహుటిన రంగంలో దిగారు. తనకు తక్షణం సాయం అందించారు. విమానంలో పెద్దలకు ఉద్దేశించి అందుబాటులో ఉండే ఆక్సిజన్ కిట్ నుంచే పాపకు శ్వాస అందించారు. ఎయిర్ హోస్టెస్ వద్ద అందుబాటులో ఉన్న ఎమర్జెన్సీ కిట్ నుంచే మందులను వాడారు. అలా ఏకంగా గంట పాటు తన ప్రాణం నిలబెట్టారు. అంతసేపూ ప్రయాణికులతో పాటు సిబ్బంది కూడా ఊపిరి బిగబట్టి దీన్నంతా ఉత్కంఠతో చూస్తూ గడిపారు. విమానం ఢిల్లీలో దిగుతూనే అక్కడ అప్పటికే అందుబాటులో ఉన్న ఎమర్జెన్సీ వైద్య బృందం చిన్నారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించింది. దాంతో ప్రయాణికులతో పాటు అందరూ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు. ఆ 15 నిమిషాలు... ఇలా చిన్నారి ప్రాణాలను నిలబెట్టిన వైద్యుల్లో ఒకరు ఐఏఎస్ అధికారి కావడం విశేషం! ఆయన పేరు డాక్టర్ నితిన్ కులకరి్ణ. జార్ఖండ్ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. మరొకరు డాక్టర్ మొజమ్మిల్ ఫిరోజ్. రాంచీలోని సదర్ ఆస్పత్రిలో పని చేస్తున్నారు. చిన్నారి పుట్టుకతోనే పేటెంట్ డక్టస్ అర్టరియోసిస్ అనే హృద్రోగంతో బాధ పడుతోందని వారు చెప్పారు. ‘మేం వెంటనే రంగంలో దిగి పాపకు ఆక్సిజన్ అందివ్వడంతో పాటు థియోఫైలిన్ ఇంజక్షన్ ఇచ్చాం. అలాగే తల్లిదండ్రులు తమ వెంట తెచి్చన డెక్సోనా ఇంజక్షన్ కూడా బాగా పని చేసింది. హార్ట్ బీట్ ను స్టెతస్కోప్ తో చెక్ చేస్తూ వచ్చాం. తొలి 15 నుంచి 20 నిమిషాలు చాలా భారంగా గడిచింది. పెద్ధగా ఏమీ పాలుపోలేదు. కాసేపటికి పాప స్థితి క్రమ క్రమంగా మెరుగైంది‘ అని వారు తమ అనుభవాన్ని వివరించారు. సహా ప్రయాణికుల్లో పలువురు వారి అమూల్య సేవను మెచ్చుకుంటూ ఎక్స్‌లో మేసేజ్‌లు చేశారు. -
ఆ రోబోకి మనిషిలా శ్వాస తీసుకోవడం, చెమటలు పట్టడం జరుగుతాయట!
రోబో అనేది ఒక స్వయం చాలక యంత్రం. మానవుని జోక్యం లేకుండా వేగవంతంగా, కచ్చితత్వంగా పనిచేయడానికి రోబోలను ఉపయోగిస్తారు. ప్రస్తుత ప్రపంచంలో వాటిని చాలా విరివిగా ఉపయోగిస్తున్నారు. అయితే మనం ప్రోగామింగ్ చేసిన మనిషి(రోబో) కాబట్టి మనం ఇచ్చే పనులను మాత్రమే చేయగలదు. అందుకు విభన్నంగా ఏవైనా ఇస్తే అది తొందరగా స్పందించలేదు. మనిషి మాదిరిగా ఉండి పనుల్లో మనకు ఉపకరిస్తుందే తప్ప మనిషిలా వ్యక్తీకరించ లేదు. మనిషిలా శ్వాసించడం, చెమటలు పట్టడం వంటివి ఉండవు. కానీ యూఎస్ అరిజోనా స్టే యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మనిషికి ఉండే మాదిరిగా శరీర లక్షణాలు ఆ రోబోకి ఉండేలా రూపొందించారు. ఆ రోబో పేరు ఆండీ. అది ఒక దర్మల్ బొమ్మ. ఇది మనిషిలా వణకటం, వేడికి చెమటలు పట్టడం, శ్వాసించటం, నడవటం వంటివి అన్ని చేయగలదంటున్నారు శాస్త్రవేత్తలు. దీన్ని మానవ శరీరంపై వేడి ప్రభావాలను అధ్యయనం చేసేందుకు రూపొందించినట్లు అరిజోనా స్టేట్ యూనివర్సిటీ ప్రోఫెసర్ కొన్రాడ్ రికాజెవ్స్కీ చెప్పారు. ఇది వాస్తవ పరిస్థితులను అనుకరించగలదు. వాతావరణంలో విపరీతమైన వేడి ఉంటే మానవ శరీరం ఎలా ప్రభావితమవుతుంది అనే దానిపై పరిశోధించడం కోసం దీన్ని రూపొందించినట్లు తెలిపారు. ఈ ఆండీ రోబో ఆరుబయట ఉపయోగించగల ప్రపంచంలోని ఏకైక థర్మల్ బొమ్మ అని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. వ్యాలీల్లో నివశించే ప్రజలు అధిక ఉష్ణోగ్రతల సమయంలో అకస్మాత్తుగా చనిపోవడం జరుగుతుంది. అలా ఎందుకు జరుగుతుందని అధ్యయనం చేయడానికి ఈ రోబో ఉపకరిస్తుందని ప్రోఫెసర్ జెన్నీ వానోస్ చెప్పారు. ఈ ఆండి రోబోని వేడి ప్రాంతాల్లో చోటు చేసుకునే మార్పలను పరీక్షించాలని భావిస్తున్నారు. విభిన్న వయసును బట్టి శరీర ఉష్ణోగ్రత లక్షణాలు అంచనా వేసి తగిన వైద్యం అందించడం సాధ్యమవుతుందని చెబుతున్నారు. ఆరోగ్యకరమైన వ్యక్తి నుంచి డయాబెటిస్ రోగి వరకు విభిన్న ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, వాటిని మనం ఈ రోబో సాయంతో లెక్కించడం సాధ్యపడుతుందంటున్నారు శాస్త్రవేత్తలు. (చదవండి: యూఎస్‌కి 17 ఏళ్ల పాటు చుక్కలు చూపించిన గణిత మేధావి మృతి) -
అంత్యక్రియల సమయంలో ఊపిరి పీల్చుకున్న మహిళ ..ఆ తర్వాత..
అంతక్రియలు నిర్వహిస్తున్న సమయంలో అకస్మాత్తుగా ఊపిరి పీల్చుకోవడం ప్రారంభించింది ఓ వృద్ధ మహిళ. ఈ హఠాత్పరిణామానికి ఒక్కసారిగా కంగుతిన్న అంత్యక్రియ నిర్వాహకులు హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. ఐతే ఆ మహిళ ఆస్పత్రికి తరలించిన ఐదు రోజుల తర్వాత అనుహ్యంగా మరణించింది. వివరాల్లోకెళ్తే..అమెరికాలో అయోవా రాష్ట్రంలో 66 ఏళ్ల మహిళను గ్లెన్ ఓక్స్ అల్జీమర్స్ స్పెషల్ కేర్‌లో చనిపోయినట్లు ధృవీకరించింది. దీంతో ఆమెను మృతదేహాలు ఉంచే బ్యాగ్‌లో ప్యాక్ చేసి శ్మశానానికి తరలించారు. అక్కడ అంత్యక్రియలు నిర్వహిస్తుండగా..అకస్మాత్తుగా ఊపిరి పీల్చుకోవడం ప్రారంభించింది సదరు వృద్ధ మహిళ. దీంతో కంగారు పడిన కార్మికులు వెంటనే ఆమెను హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె సజీవంగా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో ఆ కేర్ హోమ్ సెంటర్‌కు దాదాపు రూ. 8 లక్షలు జరిమానా విధించారు అధికారులు. అయితే విచారణలో..ఆస్పత్రి సిబ్బంది ఆమె జనవరి 3 నుంచి మహిళ శ్వాస తీసుకోవడం లేదని, పల్స్ నమోదు కాలేదని చెప్పారు. ఆ రోజు రాత్రంత సదరు మహిళను నర్సు పర్యవేక్షణలో ఉంచారు. ఐతే వృద్ధురాలి పల్స్ రికార్డు కాకపోవడం, శ్వాస తీసుకోకపోవడతోనే ఆమె చనిపోయినట్లు ధృవీకరించినట్లు దర్యాప్తులో తేలింది. అది కూడా ఆమె హెల్త్ రిపోర్టు వచ్చిన 90 నిమిషాల తర్వాత మరణించినట్లు ఆస్పత్రి ప్రకటించింది. కానీ చనిపోయిందని ప్రకటించడానికి చేయాల్సిన తగిన సంరక్షణ సేవలను అందించడంలో సిబ్బంది విఫలమైనట్లు అధికారులు గుర్తించారు. ఆమె డిసెంబర్ 28 నుంచి ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఐతే ఆమె శ్మాశన వాటికి నుంచి తీసుకువచ్చిన రెండు రోజుల అనంతరం జనవరి 5న ఆమె చికిత్స పొందుతూ మరణించింది. కానీ ఆ కేర్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ డ్రైరెక్టర్ లిసా ఈస్టమన్ తమ పేషెంట్లను బహు జాగ్రత్తగా పర్యవేక్షిస్తామని వాళ్ల ప్రాణ సంరక్షణకు కావల్సిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిచడానికే తమ సిబ్బంది కట్టుబడి ఉంటారని చెప్పడం గమనార్హం. (చదవండి: దొంగతనానికి వచ్చి బాత్‌టబ్‌లో ఎంజాయ్!..యజమాని సడెన్ ఎంట్రీతో..) -
CPR-Viral Video: నోటితో ఊపిరి అందించి భర్త ప్రాణాలు కాపాడిన భార్య
లక్నో: గుండెపోటుతో ఆచేతన స్థితిలోకి వెళ్లిన భర్తకు నోటితో ఊపిరి ఊది ప్రాణం పోసింది ఓ భార్య. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథురా నగరంలో జరిగింది. రైలులో ప్రయాణం చేస్తుండగా ఓ వ్యక్తికి గుండపోటు వచ్చింది. మథురా స్టేషన్‌కు ట్రైన్ వచ్చి ఆగిన వెంటనే బాధితుడిని ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకొచ్చారు. అయితే, అప్పటికే బాధితుడు ఊపిరి తీసుకునేందుకు ఇబ్బంది పడుతున్నాడు. సమాచారం అందుకున్న ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అశోక్ కుమార్ హుటాహుటిన అక్కడికి చేరుకున్నాడు. బాధితుడి పరిస్థితిని గమనించి.. నోటితో ఊపిరి అందించటం (సీపీఆర్) చేయాలని అతడి భార్యకు సూచించారు. సుమారు 33 సెకన్ల పాటు భార్య ఊపిరి అందించటంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు ఆమె భర్త. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మథురా రైల్వే స్టేషన్లో బాధితుడు కేశవన్‌తో అతడి భార్య దయా, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ నిజామొద్దిన్ నుంచి కోజికోడ్ వెళ్తుండగా.. కేరళలోని కాసరగోడ్‌కు చెందిన బాధితుడు కేశవన్(67) తన భార్య దయాతో కలిసి రెండు వారాల క్రితం ఉత్తరాఖండ్‌లోని చార్ ధామ్ యాత్రకు వెళ్లారు. వారితో మొత్తం 80 మంది బృందం వెళ్లింది. తిరుగు ప్రయాణంలో.. కోయంబత్తూర్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్లో ఢిల్లీ నుంచి కోజికోడ్ వెళ్తున్నారు భార్యాభర్తలు. బీ4 కోచ్ 67-68 సీట్లలో ప్రయాణం చేస్తున్న కేశవన్.. కొద్ది దూరం వెళ్లగానే అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో మథురా స్టేషన్లో దించి ఆర్పీఎఫ్ సిబ్బందికి సమాచారం అందించారు. బాధితుడు కేశవన్ ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నిస్తున్న కానిస్టేబుల్ ఆసుపత్రికి తరలింపు.. ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అశోక్ కుమార్, నీరంజన్ సింగ్‌లు కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించి అంబులెన్స్‌ను పంపాలను సూచించారు. సీపీఆర్ చేసిన తర్వాత అంబులెన్స్‌లో రైల్వే ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రైవేటు ఆసుపత్రికి తరలించాలని అక్కడి వైద్యులు తెలిపారు. గుండె, ఊపరితిత్తులకు సంబంధించిన చికిత్స పొందుతున్నట్లు డాక్టర్ దిలీప్ కుమార్ కౌశిక్ తెలిపారు. సీపీఆర్ చేసేలా ప్రోత్సహించిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌కు కృతజ్ఞతలు తెలిపారు కేశవన్ భార్య దయా. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు కేశవన్ ఇదీ చదవండి: వైరల్ వీడియో: చలనం లేని బిడ్డకు ఊపిరి ఊది ప్రాణం పోసిన డాక్టరమ్మ 30 सेकेंड में पत्नी ने मौत के मुंह से खीच लाई जान, CPR देकर पति को बचाया, मौत भी इस महिला के सामने हार गई #CPR #Health #ViralVideo pic.twitter.com/rzqwsZCqCr — Zee News (@ZeeNews) October 2, 2022 -
వైరల్: ఊపిరి ఊది ప్రాణం పోసిన డాక్టరమ్మ
వైరల్: రాత రాసేది బ్రహ్మ.. ప్రాణం మోసేది అమ్మ.. మరి ఆ ప్రాణం నిలిపేది?.. ఇంకెవరు దైవంతో సమానమైన వైద్యులు. ఇక్కడో డాక్టరమ్మ అప్పుడే పుట్టిన ఓ బిడ్డకు ప్రాణదానం చేసింది. ఒక తల్లికి గుండెకోతను తప్పించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. నార్మల్ డెలివరీ ద్వారా పుట్టిన ఓ ఆడబిడ్డ.. చలనం లేకుండా ఉంది. ఆ బిడ్డకు శ్వాస తీసుకోవడం ఇబ్బందికరంగా మారిందని వైద్యులు గుర్తించారు. దీంతో.. ఆక్సిజన్ సపోర్ట్ ద్వారా బిడ్డకు ఊపిరి అందించే యత్నం చేశారు వైద్యులు. అయితే.. నవజాత శిశువు కావడంతో ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఈ క్రమంలో.. నోటి ద్వారా శ్వాసను అందించడానికి సిద్ధమైంది అక్కడే ఉన్న ఓ డాక్టరమ్మ. అలా ఏడు నిమిషాలపాటు శ్వాస అందించింది. వేర్వేరు ప్రయత్నాలు చేసింది. చివరకు బిడ్డ ఊపిరి పీల్చుకుంది. కళ్లు తెరిచిన ఆ బిడ్డను చూసి ఆ వైద్యురాలు ఎంతగానో మురిసిపోయింది. వెల కట్టలేని క్షణం అది!. ఆగ్రా ఎట్మాదపూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో మార్చి నెలలోనే ఈ ఘటన జరిగింది. ఆ వైద్యురాలి పేరు డాక్టర్ సులేఖ చౌదరి. సచిన్ కౌశిక్ అనే యూపీ అధికారి తాజాగా ఈ వీడియోను వైరల్ చేయడంతో.. ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. डॉक्टर सुलेखा चौधरी, पीडियाट्रीसियन, CHC, आगरा। बच्ची का जन्म हुआ लेकिन शरीर में कोई हलचल नहीं थी। बच्ची को पहले ऑक्सिजन सपोर्ट दिया, लेकिन जब उससे भी लाभ नहीं हुआ तो लगभग 7 मिनट तक ‘माउथ टू माउथ रेस्पिरेशन’ दिया, बच्ची में साँस आ गई।👏🏼❤️#Salute #Doctor #respect pic.twitter.com/1PQK8aiJXQ — SACHIN KAUSHIK (@upcopsachin) September 21, 2022 ఇదీ చూడండి: అన్యోన్యం.. ఆ అవ్వ ప్రేమకు అంతా ఫిదా -
వింత చెట్టు: చెట్టు గాలి పీల్చుకోవడం చూశారా? వీడియో వైరల్
చెట్లు గాలి పీల్చుకుంటాయని అవి కార్బన్డయాక్సైడ్ని పీల్చుకుని ఆక్సిజన్ వదలుతాయని విన్నాం. ఔనా! కానీ చెట్టు గాలి పీల్చుకుంటాయనే తెలుసు తప్ప కళ్లతో చూడలేం కదా. వృక్షశాస్త్ర పితామహుడు జగదీష్ చంద్రబోస్ లాంటి శాస్త్రవేత్తలు వివిధ ప్రయోగాల ద్వారా చెట్టు గాలి పీల్చుకుంటాయని పరిశోధనల్లో వెల్లడించారని మనం చిన్నానాటి పుస్తకాల్లో చదివిన జ్ఞాపకమే తప్ప. వాస్తవంగా కుదరదు. ఒకవేళ ఏమైన శాస్త్రవేత్తల సమక్షంలో ప్రత్యేకమైన పరికరాల సాయంతో చూడవచ్చునేమో మరీ. కానీ ఇక్కడొక చెట్టు మాత్రం మనుషులు గాలి పీల్చుకుంటున్నట్లు ఎలా తెలుస్తోందో అలా ఈ చెట్టును చూస్తే నేరుగా తెలిసిపోతుంది. వివరాల్లోకెళ్తే...కెనడాలో కాల్గరీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇటీవల కాల్గరీలో గంటకు 70 కిమీ వేగంతో బలమైన గాలులతో కూడిన వర్షాలు వచ్చాయి. ఆ విపత్తు అనంతరం ఒక వ్యక్తి ఏదైనా చెట్టు పడిపోయే స్థితిలో ప్రమాదకరంగా ఉన్నాయా? అని చెక్ చేయడానికి అడవిలోకి వచ్చినప్పుడూ ఈ వింత చూసినట్లు పేర్కొన్నాడు. ఆ చెట్టు పెద్దగా పగ్గుళ్లు వచ్చి గాలి వీచినప్పుడల్లా గాలి పీల్చుకుంటున్నట్లు ఉందని వివరించాడు. అంతేకాదు ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. పైగా ఈ వీడియోకి ఐదు మిలియన్ల వ్యూస్, నాలుగు వేల లైక్‌లు వచ్చాయి. మీరుకూడా ఓ లుక్కేయండి. (చదవండి: ముగ్గురు దొంగల చిలిపి పని... భయపడి చస్తున్న నివాసితులు!) -
వ్యాయామం చేయడం బద్దకంగా ఉందా.. జస్ట్ ఇలా చేయండి..
రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మంచిదని కొత్తగా ఎవరూ చెప్పాల్సిన అవసరమేమీ లేదు. కానీ, ఆచరణకు వచ్చేసరికి అనేక సమస్యలు మొదలవుతాయి. అలాంటి వారికి యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో శాస్త్రవేత్తలు ఓ శుభవార్త తీసుకొచ్చారు. ఇంట్లోనే కాదు.. మనకు నచ్చిన చోట కూర్చుని రోజూ 30 నిమిషాల పాటు నిర్దిష్ట పద్ధతిలో శ్వాస తీసుకుంటే చాలు.. అది కాస్తా వ్యాయామానికి సరితూగే ఫలితాలు ఇస్తుందని చెబుతున్నారు. ఫొటోలో చూపినట్లు ముక్కును రెండు వైపులా మూసేసి.. నోటి ద్వారా మాత్రమే ఈ కొత్త శ్వాస ప్రక్రియ నడుస్తుంది. ‘హై రెసిస్టెన్స్ ఇన్‌స్పిరేటరీ మజిల్ స్ట్రెంగ్త్ ట్రెయినింగ్’ క్లుప్తంగా ఐఎంఎస్టీ అని పిలిచే ఈ తరహా శ్వాస ప్రక్రియ 1980లలోనే పరిచయమైనా దానివల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పుడే తెలిశాయి. 50 నుంచి 79 ఏళ్ల వయసున్న 36 మందిపై తాము ప్రయోగం చేశామని, వారానికి ఆరు సార్లు చొప్పున ఆరు వారాల పాటు జరిగిన ఈ ప్రయోగాల్లో మంచి ఫలితాలు కనిపించాయని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డాక్టర్ డేనియల్ క్రెయిగ్ హెడ్ తెలిపారు. వీరిలో సగం మంది రోజూ అరగంటపాటు నోట్లో ఒక పరికరాన్ని ఉంచుకుని ఊపిరి పీల్చినప్పుడు వారి రక్తపోటు 9 పాయింట్ల వరకు తగ్గిందని వివరించారు. ఈ పద్ధతిని నిలిపేసిన తర్వాత కూడా చాలాకాలం పాటు ప్రయోజనాలు కొనసాగడం ఇంకో విశేషమని తెలిపారు. అంతేకాకుండా.. నాడుల్లోని ఎండోథీలియల్ కణాల పనితీరు 45 శాతం వరకు మెరుగుపడిందని పేర్కొన్నారు. రుతుస్రావం నిలిచిపోయిన వారికీ ఈ శ్వాస ప్రక్రియ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. జిమ్ సౌకర్యాలు లేనివారు ఈ పద్ధతిని ఉపయోగించుకుని ఏరోబిక్ వ్యాయామం ద్వారా కలిగే లాభాలను పొందొచ్చని చెప్పారు. -
విష ప్రయోగం నుంచి కోలుకుని...
బెర్లిన్: విష ప్రయోగానికి గురైయిన రష్యా విపక్ష నేత అవినీతి వ్యతిరేక సంస్థ వ్యవస్థాపకుడు అలెక్సీ నావల్నీ కోలుకుంటున్నారు. ఆయన ప్రస్తుతం జర్మనీలోని బెర్లిన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రి బెడ్‌పై ఉన్న తన ఫోటోని ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఆగస్ట్ 20న సైబీరియా నుంచి బెర్లిన్ వస్తుండగా నావల్నీ తీవ్ర అస్వస్థతకు గురి అయ్యారు. దీంతో ఆయనను మార్గంమధ్యలో జర్మనీలో విమానాన్ని అత్యవసరంగా దింపి ఆస్పత్రికి తరలించారు. వెంటిలేటర్ సాయం లేకుండా నావల్నీ శ్వాస తీసుకుంటున్నారు. కాగా నావల్నీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యతిరేక రాజకీయ శిబిరంలో ఉన్నారు. సైబీరియాలోని టోమ్స్క్ నగరం నుంచి మాస్కోకి విమానంలో వెళుతుండగా అనారోగ్యానికి గురవడంతో ఓమ్స్క్ నగరంలో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేసి ఆస్పత్రికి తరలించారు. గతంలో కూడా నావల్నీపై అనుమానిత విషప్రయోగం జరగ్గా ఆసుపత్రి పాలయ్యారు. -
ఒక్కసారి కూడా దగ్గు రాకపోతే?
మనిషి అన్నాక కష్టాలు రాకుండా ఉంటాయా? అని మనం చాలాసార్లు అనుకుంటాంగానీ మనిషన్న వాడు ఒక్కసారి కూడా దగ్గకుండా ఉంటాడా? అని అనుకోం. ఎందుకంటే అది అసాధ్యం కాబట్టి! ఊపిరితిత్తుల అంతరాళాల నుంచి వెలువడే పేలుడు లాంటి దగ్గును నిభాయించుకోవటం అంత సులువేమీ కాదు. ఒకవేళ ఇదే జరిగిందనుకోండి. నిజానికి దగ్గు అనేది ఊపిరితిత్తుల్లో మొదలు కాదు. మనం ఊపిరి తీసుకునే క్రమంలో గాలిని ఊపిరితిత్తుల్లోకి తీసుకునేటప్పుడే మొదలవుతుంది. ఛాతీ, కడుపు, డయాఫ్రంలలోని కండరాలు ఒక్కసారి కుంచించుకుపోతాయి. మామూలుగానైతే ఇది మన ముక్కులు, నోటి నుంచి గాలిని బయటకు తోస్తాయి కానీ కొండ నాలుక అడ్డుగా ఉంది కాబట్టి ఊపిరితిత్తుల్లో ఒత్తిడి పెరిగిపోతుంది. కొండ నాలుక తెరుచుకోగానే ఈ ఒత్తిడితో కూడిన గాలి మొత్తం నోటి ద్వారా వేగంగా బయటకు వస్తుంది. ఈ క్రమంలోనే ఖళ్లు ఖళ్లు మన్న శబ్దాలూ వెలువడతాయి. ఒకవేళ మనిషికి దగ్గు అనేది రాకపోతే కొండనాలుక మూతపడదు కాబట్టి ఊపిరితిత్తులు, అన్నవాహికలో గాలి చిక్కుకుపోదు. ఖళ్లు ఖళ్లు మన్న శబ్దాలూ ఉండవు. భలే ఉందే ఇది.. ఇలాగే జరిగితే బాగుంటుంది కదా అనుకుంటున్నారా? అక్కడే ఉంది చిక్కు. దగ్గు అనేది లేకపోతే మన గొంతు, శ్వాస వాహికలను చికాకుపెట్టే దుమ్ము, ధూళి నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరిపోతాయి. వాటితోపాటు వచ్చే బ్యాక్టీరియా కూడా అక్కడే మకాం వేస్తుంది. వేగంగా అనారోగ్యం బారిన పడిపోతాం. ఆ విషయం మీకు తెలియను కూడా తెలియదు. ఊపిరితిత్తుల సమస్యలు ఎక్కువ అవుతుంది. శ్వాస ఆగిపోతుంది. దీంతో జనాలు దుమ్ము, ధూళి ఊపిరితిత్తుల్లోకి చేరకుండా ఉండేందుకు బహిరంగ ప్రదేశాల్లో తిరగడం నిలిచిపోతారు. అంటే ప్రజలు ఇళ్లకే పరిమితం కావాల్సి వస్తుందన్నమాట. ఇది మళ్లీ మానసిక కుంగుబాటుకు, ఆందోళనకు దారితీస్తుంది. పనిచేయబుద్ధి కాదు. ఉత్పాదకత తగ్గుతుంది. ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతాయి. మీకు తెలుసా? ఒక వ్యక్తి రోజులో కనీసం 11సార్లు దగ్గుతారట. మన మనుగడకు దగ్గు ఎంత ముఖ్యమైనదంటే వైద్యులు ఇటీవలి కాలంలో ఊపిరితిత్తుల్లోని కఫాన్ని బయటకు తోసేసేందుకు రోగులతో బలవంతంగా దగ్గిస్తున్నారు. దీనికి అసిస్టివ్ కాఫ్ అని పేరు. అదృష్టం ఏమిటంటే కనురెప్పలు మూసినంత సహజంగా మనం దగ్గగలగడం. కావాల్సినప్పుడు ఆన్/ఆఫ్ చేయలేకపోవడం. కాబట్టి... దగ్గు వచ్చిందనుకోండి... ముఖానికి ఏదో ఒకటి అడ్డుపెట్టుకొని ఖళ్లు ఖళ్లు మనిపిస్తే సరి! అయితే వీలైనప్పుడల్లా చేతులు కడుక్కోవడం మరిచిపోకండి సుమా! -
ముక్కు చేసే ముఖ్యమైన పనులివి...!
ఊపిరి పీల్చే ప్రక్రియలో ఆక్సిజన్‌ను ఊపిరితిత్తులకు అందించడంతో పాటు మరికొన్ని ముఖ్యమైన పనులనూ చేస్తుంది ముక్కు. అవేమిటో, వాటి సంక్లిష్టతలెలా ఉంటాయో తెలుసుకుందాం. ముక్కు చేసే పనుల్లో అతి పెద్ద పని అదో ఎయిర్ కండిషనర్‌లా వ్యవహరించడం. ముక్కు ప్రతిరోజూ దాదాపు 500 చదరపు అడుగుల పరిమాణంలోని గాలిని శుభ్రపరచి ఊపిరితిత్తులకు పంపుతుంటుంది. చలికాలంలో వాతావరణంలో చాలా పొడిగాలి ఉంటుంది. ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటంతో ఆ సమయంలో గాలిలో తేమ ఒక్కోసారి 75 నుంచి 80 శాతం వరకు ఉంటుంది. కానీ ఊపిరితిత్తులకు ఎప్పుడూ ఒకేలాంటి గాలి లాంటిది కావాలి. అందుకే ఒక పెద్ద చెట్టు సైజ్‌లో ఉండే ఎయిర్ కండిషనర్ను కేవలం రెండు సెంటీమీటర్లకు కుదిస్తే ఎలా ఉంటుందో ముక్కులో గాలి తేమను ఒకేలా ఉంచే వ్యవస్థ కూడా అలాగే ఉంటుంది. ముక్కు రంధ్రాల పని ఇది... ఒకప్పుడు ఇంట్లో బల్బుల దగ్గరికి, దీపాల దగ్గరికి కీటకాలు రాకుండా చూసేందుకు నూనెలో ముంచి తీసిన పేపర్‌ను వేలాడగట్టేవారు. దానికి పురుగులు అంటుకుపోయేవి. అచ,్చం ముక్కులోని వెంట్రుకలు కూడా ఇదే పని చేస్తాయి. ఆ వెంట్రుకలకు బ్యాక్టీరియా క్రిములు, దుమ్ము ధూళి అలా అంటుకుంటాయి. అయితే అలా చిక్కుకుపోయే వాటిని ముక్కు అక్కడే పేరుకుపోయి ఉండనివ్వదు. అదే జరిగితే కొద్దిగంటల్లోనే అక్కడంతా హానికరమైన క్రిములు పేరుకుపోతాయి. అందుకే అలా పేరుకుపోయిన బ్యాక్టీరియాతో కూడిన మ్యూకస్ బ్లాంకెట్‌ను ప్రతి 20 నిమిషాలకొకసారి తొలగిపోయేలా చేస్తుంటుంది ముక్కు. అలా తొలగించడానికి సీలియా అనే అతి చిన్న (మైక్రోస్కోపిక్) చీపుర్లు పనిచేస్తుంటాయి. అవి కొరడాల్లా కదులుతూ మ్యూకస్‌ను గొంతులోకి నెట్టేస్తుంటాయి. అక్కడ అత్యంత ప్రభావపూర్వకమైన యాసిడ్ స్రవించి, ఆ బ్యాక్టీరియాను కాల్చేస్తుంది. ముక్కులోని ఆ సీలియా చీపుర్లు ప్రతి ఒక్క సెకండ్‌కూ పదిసార్లు కొరడా ఝళిపించినట్లుగా కదులుతూ మ్యూకస్‌ను గొంతులోకి నెట్టేస్తుంటాయి. జలుబు చేసినప్పడు ఈ మ్యూకస్ మరింత ఎక్కువగా స్రవిస్తుంది. అది గొంతులోకి చేరడానికి బదులు ముక్కు రంధ్రాల ద్వారా బయటకు ప్రవహిస్తుంది. దాన్నే ముక్కు కారడంగా మనం చెబుతుంటాం. ముక్కు వాసనలను గుర్తుపడుతుందిలా... ముక్కు విధుల్లో ముఖ్యమైనది వాసన చూడటం కూడా. అది దాదాపుగా 4,000 రకాల వాసనలను గుర్తించగలదు. నిజానికి కొంతమందిలో వాసన పసిగట్టే సామర్థ్యం మిగతావాళ్ల కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి సామర్థ్యం ఉన్నవారు దాదాపు 10,000 రకాల వాసనలు గుర్తుపట్టగలరు. ప్రతి ముక్కు రంధ్రంలోనూ పేపర్ కంటే పలచగా ఉండే పసుపు–బ్రౌన్ రంగుల్లో ప్యాచుల్లా ఉండే కణజాలం ఉంటుంది. ప్రతి ప్యాచ్‌లోనూ దాదాపు కోటి రిసెప్టార్ కణాలు ఉంటాయి. ప్రతి కణంలోనూ ఆరు నుంచి ఎనిమిది అతి సన్నటి కేశాల్లా ఉండే నిర్మాణాలు ఉంటాయి. ఇవన్నీ ముక్కు నుంచి మెదడుకు అనుసంధానితమై ఉంటాయి. ఏదైనా వాసన రాగానే... పదార్థాల నుంచి వచ్చిన మాలెక్యూల్స్ వాసన గుర్తించే ప్యాచ్‌లను తాకుతాయి. ఆ వెంటనే అక్కడి నుంచి అత్యంత తక్కువ మోతాదులో ఉండే విద్యుత్ తరంగాలు వెలువడి మెదడును చేరతాయి. ఆ విద్యుత్ తరంగాలను మెదడు గుర్తించి అది పూలవాసనా లేక వంటింట్లో మరుగుతున్న పులుసా, కాలుతున్న రొట్టెనా మరింకేదైనా వాసనా అని గుర్తిస్తుంది. కేవలం మంచి వాసనల విషయంలోనే కాదు... దుర్వాసనలూ ఇలాగే తెలుస్తాయి. -
ఇంత పసిదానికి ఈ గురక ఏమిటి?
మా పాపకు ఐదున్నర నెలలు. తాను పుట్టిన రెండో వారం నుంచి గురక వస్తోంది. ఇటీవల ఆ శబ్దం మరీ ఎక్కువయ్యింది. తరచూ వాంతులు కూడా చేసుకుంటోంది. డాక్టర్‌కు చూపిస్తే తగ్గిపోతుందన్నారు. పాప సమస్య ఏమిటి? మాకు ఆందోళనగా ఉంది. సలహా ఇవ్వండి. మీరు చెబుతున్న లక్షణాలను బట్టి చూస్తుంటే మీ పాపకు ‘లారింగో మలేసియా’ సమస్య ఉన్నట్లు అనిపిస్తోంది. అంటే... శ్వాస తీసుకునే నాళంలోని ఒక భాగం బలహీనంగా ఉండటం. కొద్దిమంది పిల్లల్లో శ్వాస తీసుకునేటప్పుడు శబ్దం రావడం... మరీ ముఖ్యంగా ఆ శబ్దం... చిన్నారులు మెలకువగా ఉన్నప్పుడు, ఇతరత్రా ఇన్ఫెక్షన్లు (దగ్గు, జలుబు వంటివి) ఉన్నప్పుడు, ఆహారం తీసుకుంటున్నప్పుడు ఎక్కువ కావచ్చు. ఇలా ఎక్కువగా శబ్దం రావడాన్ని వైద్యపరిభాషలో స్ట్రయిడర్ అంటారు. పిల్లల్లో 60 శాతం మందిలో స్ట్రయిడర్ రావడానికి కారణం లారింగో మలేసియానే. ఇటువంటి పిల్లల్లో శ్వాససంబంధమైన సమస్యలు పుట్టిన రెండో వారం నుంచే మొదలై... ఆర్నెల్ల వయసప్పటికి తీవ్రతరం కావచ్చు. చాలామందిలో ఇది క్రమేణా తగ్గుముఖం పట్టడం, పరిస్థితుల్లో మెరుగుదల కనిపించడం జరుగుతుంది. ఈ మెరుగుదల ఎప్పుడైనా మొదలుకావచ్చు. అయితే కొద్దిమంది పిల్లల్లో లారింగోమలేసియాతో పాటు దగ్గు, వాంతులు కనిపించే లారింగో ఫ్యారింజియల్ రిఫ్లక్స్ అనే కండిషన్‌తో సమస్య తన తీవ్రతను చూపించవచ్చు. ఇలాంటి పిల్లల్లో కొన్నిసార్లు నీలంగా మారడం (సైనోసిస్), దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యలను ఎదుర్కోవడం వంటి సమస్యలు కనిపించవచ్చు. కొన్నిసార్లు మరికొన్ని ఇతర రకాల సమస్యలైన... సబ్‌గ్లాటిక్ స్టెనోసిస్, లారింజియల్ వెబ్స్, ట్రాకియో బ్రాంకియో మలేసియా... మొదలైన కండిషన్లలోనూ మీరు చెప్పిన లక్షణాలే కనిపిస్తుంటాయి. పై అంశాలను బట్టి విశ్లేషిస్తే మీ పాపకు లారింగో మలేసియాతో పాటు గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ కండిషన్ ఉన్నట్లు అనిపిస్తోంది. దీన్ని నిర్ధారణ చేయడానికి ఫ్లెక్సిబుల్ లారింగోస్కోపీ, బ్రాంకోస్కోపీ, రేడియోగ్రాఫిక్ స్టడీస్ చేయించాల్సి ఉంటుంది. ఈ సమస్యకు చికిత్స అన్నది పిల్లల్లో కనిపించే లక్షణాల తీవ్రత, శ్వాసతీసుకునే సమయంలో ఇబ్బందిని ఏ మేరకు భరిస్తున్నారు, పిల్లల్లో ఉన్న ఇతరత్రా వైద్య సమస్యలు, ఇన్వెస్టిగేషన్ డేటా, అన్నిటి కంటే ముఖ్యంగా ఈ జబ్బు కారణంగా కుటుంబంపై పడుతున్న మానసిక ఒత్తిడి తాలూకు తీవ్రత వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ పాపకు ఉన్నది చాలా తీవ్రమైన లారింగోమలేసియా అని నిర్ధారణ అయితే శస్త్రచికిత్స ద్వారా దీన్ని సరిచేయవచ్చు. కాబట్టి... మీరు మీ పిల్లల వైద్యుడిని, పీడియాట్రిక్ ఈఎన్టీ నిపుణుడిని సంప్రదించి, ఫాలోఅప్‌లో ఉండండి. పిల్లి కరిచింది... సలహా ఇవ్వండి మా బాబుకి ఐదేళ్లు. వాడు ఆడుకుంటూ, ఆడుకుంటూ పిల్లి దగ్గరికి వెళ్లినప్పుడు అది కరిచింది. అది పెంపుడు పిల్లి కాదు. డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తే పూర్తి వ్యాక్సిన్ వేయించాలని చెప్పారు. మావాడి విషయంలో ఆందోళనగా ఉంది. దయచేసి మాకు సరైన సలహా ఇవ్వండి. జంతువుల వల్ల మనుషులకు వచ్చే జబ్బులను, జంతువులు కరవటం వల్ల వచ్చే జబ్బులను జూనోటిక్ వ్యాధులు అంటారు. ప్రమాదకరమైన జూనోటిక్ వ్యాధులలో రేబిస్ ఒకటి. అందరూ అనుకుంటున్నట్లు రేబిస్ కేవలం కుక్కల ద్వారానే కాక– పిల్లులు, నక్కలు, గబ్బిలాలు, కోతులు, అరుదుగా ఎలుకల వల్ల కూడా కలుగుతుంది. అన్ని జంతువులలో రేబిస్ ఉండకపోవచ్చు. అయితే స్ట్రే యానిమల్స్ కరిచినప్పుడు– దాని ద్వారా రేబిస్ సంక్రమిస్తుందో లేదో అని నిర్ధారణకు అయ్యేవరకు వాటికి రేబిస్ ఉన్నట్లుగానే పరిగణించి, జంతువు కాటుకు గురైన వారికి చికిత్స చేయాలి. ఒక వేళ కరిచిన జంతువు పదిరోజులలోపు చనిపోయినా లేదా అది రేబిస్ ఉన్న జంతువు అని నిర్ధారణ అయినా పూర్తి ట్రీట్మెంట్ ఎంతైనా అవసరం.జంతువుల వల్ల అయిన గాయాన్ని మూడు కేటగిరీలుగా విభజించడం జరుగుతుంది. గాయం 2, 3 కేటగిరీలకు చెందినదైతే వైద్యం తప్పనిసరిగా చేయించవలసి ఉంటుంది. వ్యాక్సిన్ కూడా తీసుకోవడం చాలా ముఖ్యం. అదే విధంగా కేటగిరీని బట్టి 3 నుంచి 5 సార్లు యాంటీరేబిస్ వ్యాక్సిన్ ఇవ్వటం కూడా జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో జంతువులు విపరీతంగా కరిచినప్పుడు వ్యాక్సిన్‌తో పాటు యాంటీ రేబిస్ ఇమ్యునో గ్లోబ్యులిన్ ఇంజెక్షన్ కూడా ఇవ్వాలి. కరిచిన జంతువుకు రేబిస్ లేకపోయినా ఇది తప్పనిసరి. మామూలుగా మన పరిసరాలలో తిరిగే జంతువులు గీరటం లేదా కరవటం జరిగినప్పుడు మొదటి పదిరోజుల్లో ఆ జంతువుకి ఎటువంటి హాని జరగకపోతే మొదటి మూడు డోసులతో వ్యాక్సిన్‌ను నిలిపివేయవచ్చు. ఇంత చిన్న బాబుకూ తలనొప్పా? పీడియాట్రిక్ కౌన్సెలింగ్స్ మా బాబుకు ఎనిమిదేళ్లు. ఇటీవల వాడు తరచూ తలనొప్పి అంటూ ఏడుస్తున్నాడు. కొన్నిసార్లు వాంతులు కూడా అవుతున్నాయి. కొన్నిసార్లు కాసేపు నిశ్శబ్దంగా పడుకోబెడితే తలనొప్పి తగ్గుతోంది. కానీ చాలాసార్లు మాత్ర వేస్తేగానీ తగ్గడం లేదు. కొన్ని సందర్భాల్లో కడుపునొప్పి, కళ్లు తిరుగుతున్నాయని కూడా చెబుతున్నాడు. మా బాబు సమస్య ఏమిటి? వాడికి తగ్గేదెలా? మీరు చెబుతున్న దాన్ని బట్టి మీ బాబుకు తరచూ తలనొప్పి ఒకింత తీవ్రంగానే ఉన్నట్లు అనిపిస్తోంది. చిన్న పిల్లలతో పాటు టీనేజర్లలో తలనొప్పి రావడం మామూలే. పిల్లల్లో పదేపదే తీవ్రమైన తలనొప్పులకు కారణాలు అనేకం. వాటిలో ముఖ్యమైన వాటిల్లో మైగ్రేన్ ఒకటి. ఇక దీనితో పాటు టెన్షన్ హెడేక్, అటనామిక్ డిస్ట్రబెన్సెస్ వల్ల కూడా తలనొప్పులు రావచ్చు. అలాగే కొన్నిసార్లు కొన్ని సెకండరీ కారణాల వల్ల అంటే... ఇతరత్రా అవయవాల్లో సమస్యల వల్ల... (ఉదాహరణకు సైనసైటిస్, కంటికి సంబంధించిన సమస్యలు లేదా మెదడుకు సంబంధించిన రుగ్మతలు ఉన్నప్పుడు) కూడా తలనొప్పి రావచ్చు. ఇక మీ బాబు విషయానికి వస్తే అది మైగ్రేన్ అని చెప్పవచ్చు. మైగ్రేన్ జబ్బు తరచూ ఒక మాదిరి నుంచి తీవ్రమైన తలనొప్పితో వస్తుంటుంది. ఇది ఒక చోట కేంద్రీకృతమైనట్లుగా ఉండవచ్చు. కొన్నిసార్లు వికారం, వాంతులు, కాంతిని చూడటాన్ని, శబ్దాలు వినడాన్ని ఇష్టపడకపోవడం, కొన్నిసందర్భాల్లో ఏదో అవయవం బలహీనంగా ఉన్నట్లు అనిపించడం, తూలిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఐదు నుంచి పదిహేనేళ్ల పిల్లల్లో 10 శాతం మందికి ఏదో ఒక రూపంలో మైగ్రేన్ కనిపిస్తుంది. తలనొప్పి వచ్చే పిల్లలందరికీ అన్ని పరీక్షలూ అవసరం లేకపోయినప్పటికీ తీవ్రత ఎక్కువగా ఉండటం లేదా దానితో పాటు నరాలకు సంబంధించిన లక్షణాలు (అసోసియేటెడ్ న్యూరలాజికల్ సింప్టమ్స్) ఉన్న కొద్దిమందిలో మాత్రం కొన్ని ఇమేజింగ్ పరీక్షలు అవసరమవుతాయి. ఇక చికిత్స విషయానికి వస్తే... తలనొప్పి కనిపించిన సందర్భం (అక్యూట్ ఫేజ్)లో ఎన్ఎస్ఏఐడీ గ్రూపు మందులతో తప్పకుండా ఉపశమనం లభిస్తుంది. ఇక దీర్ఘకాలికంగా ఈ సమస్య ఉన్న పిల్లలకు అది రాకుండా నివారించడానికి కొన్ని మందులు... ఉదాహరణకు ఎమిట్రిప్టిలిన్, ప్రొప్రొనలాల్ వంటివి అనేకం ఇప్పుడు వాడుతున్నారు. ఇవి కొన్ని నెలల పాటు వాడటం వల్ల లక్షణాలు మళ్లీ కనిపించకపోవడం లేదా చాలారోజుల పాటు కనిపించకుండా ఉండటం జరుగుతుంది. ఇలాంటి పిల్లలకు బిహేవియర్ థెరపీతో నొప్పి తీవ్రత తగ్గి, మంచి మెరుగుదల కనిపిస్తుంది. ఇక మైగ్రేన్‌ను ప్రేరేపించే ట్రిగ్గర్స్... అంటే ఏదైనా పూట ఆహారం తీసుకోకుండా ఉండటం, నీళ్లు తక్కువగా తాగడం, నిద్రలేమి, కెఫిన్ ఉన్న పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వంటి వాటికి దూరంగా ఉండటం చాలా ముఖ్యం. దీనితో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, క్రమబద్ధంగా ఒకేవేళకు ఆహారం తీసుకోవడం, కంటి నిండా నిద్రపోవడం వంటివి చేసేవారిలో నొప్పి తీవ్రత తక్కువ. పైన పేర్కొన్న సూచనలు పాటిస్తూ మీరు ఒకసారి మీ పిల్లల వైద్యనిపుణుడిని సంప్రదించండి. డా. రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
నా ఎడతెరిపి లేని దగ్గుకు కారణాలు?
కార్డియాలజీ కౌన్సెలింగ్స్ నా వయసు 47 ఏళ్లు. ఈమధ్య రెండు మూడు నెలల నుంచి విపరీతమైన దగ్గు విడవకుండా వస్తోంది. డాక్టర్‌కు చూపించుకుంటే దగ్గు మందులు, అలర్జీ మందులు ఇచ్చారు. కొద్దిరోజులు ఉపశమనం కనిపించినా మళ్లీ దగ్గు యధావిధిగా తిరగబెడుతోంది. విపరీమైన అలసట, పక్కటెముకల్లో నొప్పితో బాధపడుతున్నాను. ఇంట్లో పరిశుభ్రత పాటిస్తాం. వంటల్లో మసాలాలు కూడా ఎక్కువగా వాడతాం. ఇలా ఎడతెరిపి లేకుండా దగ్గు ఎందుకు వస్తోంది? దీనికి చికిత్స ఏమిటో వివరంగా చెప్పండి. – కె. వసుంధర, మందమర్రి మీకు వచ్చిన దగ్గును దీర్ఘకాలిక దగ్గు (క్రానిక్ కాఫ్) గా చెప్పవచ్చు. వయోజనుల్లో ఎనిమిది వారాల... ఆ పైన కూడా తగ్గకుండా దగ్గు వస్తోంటే దాన్ని క్రానిక్ కాఫ్గా పరిగణిస్తారు. విడవకుండా వచ్చే ఈ దగ్గు వ్యక్తిని నిద్రకు సైతం దూరం చేస్తుంది. తీవ్రమైన అలసటకు గురిచేస్తుంది. దీర్ఘకాలిక దగ్గు వల్ల కొన్నిసార్లు వాంతులు, మత్తుకమ్మినట్టు ఉండటం జరుగుతుంది. దగ్గీ దగ్గీ పక్కటెముకల్లో పగుళ్లూ ఏర్పడవచ్చు. ఈ రకమైన దగ్గుకు నిర్దిష్టంగా కారణం చెప్పడం సాధ్యం కానప్పటికీ కొన్ని పరిస్థితులు దీనికి దోహదం చేయవచ్చు. ఆస్తమా, పులితేన్పులు, ఇన్ఫెక్షన్ల వల్ల కూడా దగ్గు విడవకుండా వస్తుంది. దగ్గుకు కారణమైన పరిస్థితులను తొలగిస్తే దీర్ఘకాలిక దగ్గు కూడా దానంతట అదే అదృశ్యమైపోతుంది. అయితే ఎండోకారై్డటిస్ (గుండెకు సంబంధించిన ఒక ఇన్ఫెక్షన్) వల్ల వచ్చే దగ్గు నెలల తరబడి విడవకుండా ఉండి ఆరోగ్యపరమైన అత్యవసర పరిస్థితికి దారితీయవచ్చు. ఎండోకారై్డటిస్ అనేది గుండె లోపలి పొర (ఎండోకార్డియం)కు ఇన్ఫెక్షన్ సోకవడం వల్ల వచ్చే వ్యాధి. దీనిలో ప్రధానంగా కనిపించే మొదటి లక్షణం విడవకుండా వచ్చే దగ్గు. నోరు, ఇతర శరీర భాగాలలోని బ్యాక్టీరియా... రక్తంతో పాటు వెళ్లి గుండెపొరకు ఇన్ఫెక్షన్ కలగజేస్తాయి. గుండెలో అప్పటికే దెబ్బతిని ఉన్న భాగాలను ఈ బ్యాక్టీరియా ఎంచుకొని ప్రభావితం చేస్తాయి. ఎండోకారై్డటిస్ను గుర్తించి చికిత్స చేయకపోతే అది ప్రాణాంతకంగా పరిణమించవచ్చు. చాలా సందర్భాల్లో మందులతోనూ, తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు శస్త్రచికిత్స ద్వారా దీనికి చికిత్స చేస్తారు. ఆరోగ్యకరమైన గుండె గలవారికి ఈ వ్యాధిసోకడం చాలా అరుదు. గుండెకవాటాలు చెడిపోయిన, కృత్రిమ కవాటాలు అమర్చినవారిలో, గుండెకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటున్నవారిలో ఎండోకారై్డటిస్ ఎక్కువగా కనిపిస్తుంది. దీర్ఘకాలపు దగ్గు ఉండి విపరీతమైన అలసట, మూత్రంలో రక్తం పడటం, అకారణంగా బరువు తగ్గడం వంటి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే డాక్టర్‌కు చూపించుకోవాలి. విడువకుండా వేధించే దగ్గుకు దారితీసే సాధారణ కారణాల ఆధారంగా డాక్టర్లు చికిత్స ప్రారంభిస్తారు. ఆపైన దీర్ఘకాలపు దగ్గుకు అసలు కారణాలైన వ్యాధులను నిర్ధారణ చేసేందుకు పరీక్షలు చేయిస్తారు. అవసరమైతే కార్డియాలజిస్టుకు సిఫార్సు చేస్తారు.మీ విషయానికి వస్తే మీరు కూడా మరోసారి డాక్టర్‌కు చూపించుకోండి. మీ దగ్గుకు కారణం ఎండోకారై్డటిస్ అవునో, కాదో నిర్ధారణ చేసి, దాన్ని బట్టి మీకు అవసరమైన చికిత్స అందిస్తారు. డయలేటెడ్ కార్డియో మయోపతి అంటే ఏమిటి? నా వయసు 56 ఏళ్లు. గడచిన ఏడెనిమిది నెలల నుంచి విపరీతమైన అలసట కలుగుతోంది. ఒక్కోసారి శ్వాస అందని పరిస్థితి ఏర్పడుతోంది. పదిహేను రోజుల కిందట హఠాత్తుగా స్పృహ తప్పిపోయాను. డాక్టరుకు చూపిస్తే పరీక్షలు చేయించారు. డయలేటెడ్ కార్డియోమయోపతి అని చెప్పి చికిత్స ప్రారంభించారు. ఈ వ్యాధి ఏమిటి? ఎందుకు వస్తుంది? దీనికి చికిత్స ఏమిటి? దయచేసి వివరంగా చెప్పండి. – బి. ఈశ్వరరావు, దేవరకొండ కార్డియోమయోపతి అన్నది గుండె కండరాలకు సంబంధించిన వ్యాధి. మొదట్లో ఎలాంటి ప్రత్యేక లక్షణాలు వ్యక్తం కావు. కొంతకాలం తర్వాత తీవ్రమైన అలసట, శ్వాస అందకపోవడం, స్పృహతప్పడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కార్డియోమయోపతిని గుర్తించి చికిత్స చేయించడం ఆలçస్యమైతే అది చాలా ప్రమాదకరమైన పరిస్థితికి దారితీస్తుంది. కొంతమందిలో అకాల మరణానికి కారణం అవుతుంది. కార్డియోమయోపతిలో మూడు ప్రధాన రకాలు కనిపిస్తాయి. వీటిలో ప్రధానమైనది డయలేటెడ్ కార్డియోమయోపతియే. కార్డియోమయోపతి వ్యాధుల్లో 95 శాతం ఈ రకానికి చెందినవే. దీనిలో ఎడమ జఠరిక (వెంట్రికల్) వ్యాకోచిస్తుంది. గుండె బలహీనపడి వెంట్రికల్లోని రక్తాన్ని ముందుకు పంపించలేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో వెంట్రికల్ గోడలు చాలా పలుచబడిపోతాయి. బాగా సాగి సంచిలా తయారైన వెంట్రికిల్ తగినంత రక్తాన్ని పంప్ చేయలేదు. చాలా సందర్భాల్లో డయలేటెడ్ కార్డియోమయోపతి నెమ్మదిగా పెరుగుతూ పోతుంది. కానీ కొంతమందిలో వ్యాధి నిర్ధారణ చేయడానికి ముందే తీవ్రమైన లక్షణాలు వ్యక్తమవుతాయి. శ్వాసతీసుకోవడం కష్టంగా ఉండటం, పొట్ట–చీలమండల వాపు, విపరీతమైన అలసట, గుండెదడ ఈ డయలేటెడ్ కార్డియోమయోపతిలో కనిపించే ప్రథమ లక్షణాలు. ఇవన్నీ గుండె విఫలమవుతోందనడానికి ముఖ్య లక్షణాలు. పలు కారణాల వల్ల డయలేటెడ్ కార్డియోమయోపతి రావడానికి అవకాశం ఉంది. వైరస్ల కారణంగా ఇన్ఫెక్షన్, అదుపు తప్పిన అధిక రక్తపోటు (హైబీపీ), గుండెకవాటాలకు సంబంధించిన సమస్యలు, మితిమీరి మద్యపానం ఈ వ్యాధికి దారితీసే ప్రధాన కారణాలు. వీటితో పాటు గర్భవతులు కొందరిలో కూడా డయలేటెడ్ కార్డియోమయోపతి కనిపిస్తుంది. కొన్ని కుటుంబాల్లో జన్యువుల మార్పు లేదా మ్యుటేషన్ కారణంగా వంశపారంపర్యంగా కూడా వస్తుంది. తల్లిదండ్రుల్లో ఒకరికి డయలేటెడ్ కార్డియోమయోపతి ఉంటే పిల్లల్లో ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ వ్యాధి నిర్ధారణకు డాక్టర్లు సిఫార్సు చేసే పరీక్ష ఈసీజీ. గుండె విద్యుత్ స్పందనలు నమోదు చేసే ఈ పరీక్ష గుండె రక్తాన్ని పంప్ చేయగలుగుతున్న తీరును గుర్తిస్తుంది. దీంతోపాటు అవసరాన్ని బట్టి ఎమ్మారై, ఎక్సర్సైజ్ టెస్టులను కూడా చేయిస్తారు. డయలేటెడ్ కార్డియోమయోపతి చికిత్సలో ప్రధానంగా వ్యాధి లక్షణాలను అదుపుచేయడం, తీవ్ర సమస్యలకు దారితీయకుండా జాగ్రత్తతీసుకోవడం పైనే కేంద్రీకృతం చేస్తారు. అయితే డయలేటెడ్ కార్డియోమయోపతి కారణంగా గుండె కొట్టుకోవడంలో తీవ్రమైన హెచ్చుతగ్గులు (ఎరిథిమియాస్), ఛాతీలో నొప్పి, రక్తం గడ్డకట్టడం వంటి మరికొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున వాటి తీవ్రతను బట్టి చికిత్స చేస్తారు. అధిక రక్తపోటు, గుండె స్పందనల్లో విపరీతమైన హెచ్చుతగ్గులను మందులతో అదుపు చేస్తారు. గుండె కొట్టుకోవడంలో అసాధారణ మార్పులను అదుపు చేయడానికి అవసరమైతే పేస్‌మేకర్‌ను అమరుస్తారు. మరికొంతమందిలో గుండె కొట్టుకోవడంలోని అసాధారణ స్థితిని సరిచేయడానికి ఐసీడీ (ఇంప్లాంటబుల్ కార్డియాక్ డిఫిబ్రిలేటర్) పరికరాన్ని అమర్చాల్సి వస్తుంది. డాక్టర్ పంకజ్ జరీవాలా, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్ -
అరిథ్మియా అంటే ఏమిటి?
కార్డియాలజీ కౌన్సెలింగ్ నా వయసు 37. రెండు వారాల కింద అకస్మాత్తుగా స్పృహ కోల్పోయాను. అప్పట్నుంచి చాలా నీరసంగా ఉంటోంది. ఆయాసం, ఊపిరితీసుకోవడంలో ఇబ్బంది కూడా ఉన్నాయి. డాక్టర్‌ను కలిస్తే ఎరిథ్మియా కావచ్చంటున్నారు. అంటే ఏమిటి? దీంతో ఏమైనా ప్రమాదమా వివరించండి. – కె. ఆనంద్, వికారాబాద్ సాధారణంగా మన గుండె మామూలుగా నిమిషానికి 60 నుంచి 100 సార్లు కొట్టుకోవాలి. అలా కాకుండా 60 కన్నా తగ్గినా లేదా 100 కన్నా పెరిగినా ఆ కండిషన్‌ను అరిథ్మియా అంటారు. కానీ ఎవరైనా తీవ్ర భయాందోళనలకు గురైనప్పుడు, వ్యాయామం చేసినప్పుడు గుండె వేగం 100 నుంచి 160 మధ్యన ఉంటుంది. దీన్ని సైనస్ టాకికార్డియా అంటారు. ఇలా కాకుండానే గుండె వేగం దానంతట అదే ఇంకా పెరిగితే అది జబ్బువల్ల కావచ్చు. ఈ లక్షణంతో మరికొన్ని రకాల గుండెజబ్బులు ఉండవచ్చు. సమస్య ఏదైనా గుండె వేగం మరింత పెరిగినా లేదా తగ్గినా స్పృహ కోల్పోయే ప్రమాదం ఉంది. మీరు కూడా స్పృహ కోల్పోయినట్లు చెప్పారు కాబట్టి వెంటనే దగ్గర్లోని కార్డియాలజిస్ట్‌ని కలిసి ఈసీజీ, ఎకో, హోల్టర్ పరీక్షల్లాంటివి చేయించండి. మీరు స్పృహ కోల్పోడానికి గుండె జబ్బే కారణమా, మరి ఇంకేదైనా సమస్య వల్ల ఇలా జరిగిందా తెలుసుకొని దానికి తగిన విధంగా చికిత్స తీసుకోవడం అవసరం. ఇప్పుడు ఆధునిక వైద్య విజ్ఞానం వల్ల అన్ని రకాల జబ్బులకు మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీరు ఆందోళన చెందకండి. గుండె పోటును గుర్తించడం ఎలా? మా నాన్నగారి వయసు 45 ఏళ్లు. ఇటీవల ఆయనకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. కొద్దిసేపట్లోనే కన్నుమూశారు. ఇదివరకు ఎలాంటి గుండెజబ్బులు లక్షణాలు కనిపించలేదు. ఇలా మా కుటుంబంలో చాలామందికి జరిగింది. మనం గుండె జబ్బును ముందుగానే తెలుసుకోవడం ఎలాగో చెప్పండి. – వినయ్‌కుమార్, మచిలీపట్నం మీ నాన్నగారికి వచ్చిన గుండెపోటును సడన్ కార్డియాక్ డెత్ లేదా సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటారు. అప్పటివరకు చురుకుగా పనిచేసిన మనిషి... హఠాత్తుగా గుండెపట్టుకుని విలవిలలాడుతూ పడిపోవడం కుటుంబ సభ్యులో, స్నేహితులో తక్షణం ఆసుపత్రికి తరలించే లోపే మనకు దక్కకుండా పోవడం వంటి ఉదంతాలు సడెన్ కార్డియాక్ అరెస్ట్ జరిగినప్పుడు కనిపిస్తాయి. ఎవరిలో ఎక్కువగా కనిపిస్తుంది... ∙గతంలో ఒకసారి గుండెపోటు బారిన పడ్డవారు ∙గుండె కండరం బలహీనంగా ఉన్నవారు ∙కుటుంబంలో హఠాన్మరణం చరిత్ర ఉన్నవారు ∙కుటుంబంలో గుండె విద్యుత్ సమస్యలు ఉన్నవారు ∙గుండె లయ అస్తవ్యస్తంగా ఉన్నవారు పైన పేర్కొన్న వారితో పాటు ఇప్పటికే గుండెజబ్బు తీవ్రంగా ఉన్నవారిలో కూడా అకస్మాత్తుగా మరణం సంభవించవచ్చు. రక్షించే అవకాశం ఉంది... గుండెపోటు అన్నది క్షణాల్లో మనిషిని మృత్యుముఖానికి తీసుకెళ్లిపోయే సమస్య. అయితే ఎవరికైనా గుండెపోటు వస్తున్న ఘడియల్లో తక్షణం స్పందించి వారిని వేగంగా హాస్పిటల్‌కు తీసుకెళ్లగలిగితే వారిని రక్షించే అవకాశాలూ ఉంటాయి. అందుకే ప్రతి ఒక్కరూ హార్ట్ ఎటాక్ పై అవగాహన కలిగి ఉంటే మృత్యుముఖంలోకి వెళ్లిన మనిషిని కూడా తిరిగి బతికించే అవకాశాలుంటాయి. అందుకే దీనిపై ప్రతి ఒక్కరూ అవగాహనను పెంచుకోవాలి. గుండెపోటును గుర్తుపట్టడం ఎలా? ఎవరైనా హఠాత్తుగా ఛాతీలో అసౌకర్యంతో కుప్పకూలిపోతుంటే... వెంటనే వాళ్లు స్పృహలో ఉన్నారా, శ్వాస తీసుకుంటున్నారా లేదా అన్న అంశాలను చూడాలి. అవసరాన్ని బట్టి గుండె స్పందనలను పునరుద్ధరించే ప్రథమ చికిత్స (కార్డియో పల్మునరీ రిససియేషన్–సీపీఆర్) చేయాలి. సీపీఆర్ వల్ల కీలక ఘడియల్లో ప్రాణంపోసినట్లు అవుతుంది. చాలా దేశాల్లో సీపీఆర్‌పై శిక్షణ ఉంటుంది.గుండె స్పందనలు ఆగిన వ్యక్తికి సీపీఆర్ ఇచ్చి ఆంబులెన్స్ వచ్చే వరకు రక్షించగలిగితే దాదాపు కోల్పోయిన జీవితాన్ని నిలబెట్టినట్లవుతుంది. అందుకే సీపీఆర్‌పై శిక్షణ ఇవ్వడం, ఆ ప్రక్రియపై అవగాహన కలిగించడం అవసరం. డాక్టర్ హేమంత్ కౌకుంట్ల సీనియర్ కార్డియోథొరాసిక్ సర్జన్ సెంచరీ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్. -
శ్వాసను సరిచేసేందుకు కొత్త యంత్రం...
సైనసైటిస్ వంటి సమస్యలుంటే ఎంత ఇబ్బందో మనకు తెలియంది కాదు. సరిగా నిద్ర పట్టదు. ఊపిరితీసుకోవడం కష్టమైపోతుంది. ముక్కు లోపలి భాగాల్లో ఊపిరి లోనికి చేరనీయని స్థాయిలో కండరాలు పెరిగిపోతే కూడా ఇవే రకమైన ఇబ్బందులు ఎదురవుతూంటాయి. మందులేసుకోవడం... సమస్య మరీ ఎక్కువైతే, చిన్నపాటి ఆపరేషన్ చేయించుకోవడం... ఇప్పటివరకూ ఉన్న చికిత్స విధానాలు. కాకపోతే ఈ రెండు పద్ధతులతో లభించేది తాత్కాలిక ఉపశమనం మాత్రమే. ఈ నేపథ్యంలో ఓహాయో స్టేట్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఈ సమస్యలకు ఓ వినూత్నమైన, శాశ్వతమైన పరిష్కారాన్ని ఆవిష్కరించారు. రేడియో తరంగాల శక్తిని ఉపయోగించి శ్వాసకు ఇబ్బంది కలిగిస్తున్న ప్రాంతాలను సరిచేయడం కోసం వీరు వివావెర్ నాసల్ ఎయిర్‌వే రీమోడలింగ్ డివైజ్‌ను తయారుచేశారు. వాయు నాళానికి అడ్డుగా ఉన్న వృదులాస్థి కణజాలం ఆకారాన్ని కొద్దిగా మార్చడం ఈ పద్ధతిలోని ముఖ్యాంశమని, ఆపరేషన్ టేబుల్‌పై కాకుండా.. ఔట్ పేషంట్ విభాగంలోనే చికిత్స పూర్తి చేయగలగడం దీని ప్రత్యేకత అని ఈ పరికరం తయారీలో కీలకపాత్ర పోషించిన శాస్త్రవేత్త డాక్టర్ బ్రాడ్ ఒట్టో తెలిపారు. -
ఊపిరితో వ్యాయామం...ఉబ్బసానికి ఉపశమనం
ఉబ్బస వ్యాధితో సతమతమయ్యేవారికి ఊపిరితో చేసే వ్యాయామం ఎంతో మేలు చేస్తుందని ఓ అధ్యయనం ద్వారా తేల్చారు శాస్త్రవేత్తలు. లాన్సెట్ రెస్పిరేటరీ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం.. వ్యాధికి సంబంధించిన చికిత్స తీసుకుంటున్నా.. సమస్యలు ఎదుర్కొనే వారికి బ్రీతింగ్ ఎక్సర్సైజులు మేలు చేస్తాయి. కొన్ని వందల మంది కార్యకర్తలను మూడు గ్రూపులుగా విభజించి కొందరికి డీవీడీ ద్వారా ఇంకొందరికి ఫిజియోథెపరిస్టు ద్వారా బ్రీతింగ్ ఎక్సర్‌సైజుల్లో శిక్షణ ఇచ్చారు. మూడో గ్రూపుకు సాధారణ చికిత్స కొనసాగించారు. దాదాపు పన్నెండు నెలల తరువాత వీరందరి దైనందిన జీవితంలో ఉబ్బసం వల్ల కలిగిన ఇబ్బందులు ఎలా ఉన్నాయి? అని ఒక పద్ధతి ప్రకారం లెక్కకట్టారు. మందులు మాత్రమే తీసుకుంటున్న వారితో పోలిస్తే వ్యాయామం చేసే వారి ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడిందని, గాలిగొట్టాల్లో ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గిందని తెలిసింది. ఉబ్బసం అటాక్‌లు కూడా వ్యాయామం చేసే వారిలో తగ్గినట్లు తాము గుర్తించామని కాకపోతే ఇవి లెక్క కట్టే స్థాయిలో లేవని ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్త ప్రొఫెసర్ హైవెల్ విలియమ్స్ తెలిపారు. యునైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వ ఆరోగ్యసేవల సంస్థ చేపట్టిన ఈ స్టడీ వల్ల ఉబ్బస వ్యాధిగ్రస్థుల జీవితంలో ఒకంత మెరుగుదల కనిపించడం మాత్రమే కాకుండా, ప్రభుత్వాలు చికిత్సకు పెట్టాల్సిన ఖర్చులూ తగ్గుతాయని అంచనా. -
కండరాలకు శక్తి... ఒంటికి పటుత్వం
అవయవాల చాలనలలో కటి చాలనం తరువాత తొడ కీళ్లకు, మోకాళ్లకు చీలమండలకు, పాదాలకు సంబంధించి చేసే చాలనలను ఈ వారం చూద్దాం. ఉరు చాలన సమస్థితిలో నిలబడి ఎడమచేతిని తిన్నగా ముందుకు ఉంచి, శ్వాస వదులుతూ కుడికాలిని ముందుకు విసురుతూ ఎడమ అరచేతికి తాకించే ప్రయత్నం చేయాలి. దీనికి ముందు కుడికాలిని వెనుకకు ఉంచి పొజిషన్ తీసుకుని, కుడికాలిని స్వింగ్ చేస్తూ కొంచెం ఫోర్సుతో పైకి ముందు వైపు నుండి లేపే ప్రయత్నం చేయాలి. శ్వాస వదులుతూ కుడికాలు క్రిందకు, కుడిపాదం ఎడమపాదం కన్నా కనీసం ఒక అడుగు దూరంలో వెనుకకు ఈ విధంగా శ్వాసవదులుతూ కుడిపాదంతో ఎడమచేతిని 5 నుండి 10 సార్లు తాకే ప్రయత్నం చేయాలి. రెండవ వైపు కూడా 5 నుండి 10 సార్లు చేయాలి. ఒక వేళ బాలెన్స్ చేసుకోవడం కష్టంగా ఉన్నట్లయితే గోడ సహాయం కాని, కుర్చీ సహాయం కాని తీసుకోవచ్చు. ఉపయోగాలు: తుంటికీళ్లు, ఫెమరల్ నరం, కండరాలు ఓపెన్ అవుతాయి. గ్లూటియస్ మాక్సిమస్ కండరాలను, సయాటికాను, పించ్ నర్వ్‌ను ఫ్రీ చేస్తుంది. అంతగా కాకపోతే ఈ సమస్య ఉన్నవాళ్లు ఎక్కువ ఫోర్సు ఉపయోగించకుండా తేలికగా కాలుని రిలాక్స్ చేస్తూ చేయాలి. లంబార్ ప్రాంతం నుండి తుంటి భాగం వరకూ వచ్చే సొవాస్ కండరానికి మంచి వ్యాయామం జరుగుతుంది. కాళ్లలో శక్తి స్థిరత్వం, సమత్వం (ఎడమకుడి) చేకూరుతాయి. జానుచాలన వేరియంట్ఐ పాదాలు రెండింటి మధ్య సుఖపూర్వకమైన దూరం ఉంచి మోకాళ్ళను ముందుకు వంచి రెండు అరచేతులను మోచిప్పలమీద ఉంచి శ్వాస తీసుకుంటూ మోకాళ్ళను ముందుకు తరువాత ఎడమవైపుకు శ్వాస వదులుతూ మోకాళ్ళు లోపలకు తరువాత కుడివైపుకు రొటేట్ చేయాలి. దానికి అనుగుణంగా సీటు భాగం కూడా రొటేట్ అవడం గమనించాలి. వెనుకకు వెళ్ళినప్పుడు మోకాలు జాయింట్ లాక్ అవ్వడాన్ని ముందుకు వంచినప్పుడు లాక్ రిలీజ్ అవ్వడాన్ని గమనించగలరు. మోకాలి సమస్యలేనివాళ్లు రెండు పాదాలు, రెండు మోకాళ్ళు కలిపి ఉంచి రొటేట్ చేయవచ్చు. సమస్య కొద్దిగా ఉన్నవాళ్లు పాదాలు, మోకాళ్లు కొంచెం దూరంగా ఉంచి చేయవచ్చు. సమస్య తీవ్రంగా ఉన్నవాళ్ళు అంటే సినోవియల్ ద్రవం తక్కువగా ఉన్నా లేదా మోకాలు కీలుతో రాపిడి ఉన్నా ఇది చేయకుండా ఉండటమే మంచిది. వీరు తరువాత చేసే వేరియంట్ చేయవచ్చు. ఉపయోగాలు: దీని వలన మోకాళ్ళకు, క్వాడ్రిసిప్ కండరాలకు, టెండాన్కి వెనుక ఉన్న హ్యామ్‌స్ట్రింగ్ కండరసముదాయానికి మంచి వ్యాయామం జరుగుతుంది. జానుచాలన వేరియంట్ఐఐ ఒంటికాలు మీద నిలబడి రెండవ కాలును పైకి ఉంచి తొడ నుండి మోకాలువరకు భూమికి సమాంతరంగా ఉంచి, కాలు క్రిందకు ఫ్రీగా వదిలేసి ఎడమ అరచేతిని ఎడమమోకాలు మీద సపోర్ట్‌గా ఉంచి పాదాన్ని ముందుకు స్ట్రెచ్ చేసి ఉంచుతూ క్రిందకాలును గడియారదిశలో 5 సార్లు వ్యతిరేక దిశలో 5 సార్లు చేయాలి. ఇదేవిధంగా రెండవకాలుతో కూడా చేయాలి. ఉపయోగాలు: వేరియంట్– ఐ లో చెప్పిన విధంగా ఎటువంటి మోకాలు సమస్య ఉన్నవాళ్లయినా చేయవచ్చు. పైన చెప్పిన ఉపయోగాలే కాక టిబియా, కాఫ్ మజిల్స్‌కి చక్కటి వ్యాయామం జరుగుతుంది. నిలబడి బాలెన్స్ చేయలేకపోతే గోడ లేదా కుర్చీ సపోర్టు తీసుకోవచ్చు. శరీరంలో తలపై భాగం నుండి కాలి వేళ్ళ చివర వరకు అన్ని అంగాలకు సంబంధించిన చాలనలు (కదలికలు) చేయడాన్ని అంగచాలనలు అంటారు. వీటి సాధన వల్ల పై నుండి కిందకు పూర్తి ఎముకలకు, కండరాలకు, జాయింట్లు, లిగమెంట్లు, టెండాన్లు, టిష్యూలకు పూర్తి వ్యాయామం జరుగుతుంది. - ఎ.ఎల్.వి కుమార్ ట్రెడిషనల్ యోగా ఫౌండేషన్ – సమన్వయం ఎస్. సత్యబాబు - మోడల్: రీనా -
రుతుసమయంలో శ్వాస అందడం లేదెందుకు?
నా వయసు 38 ఏళ్లు. గృహిణిని. నాకు రుతుసమయంలో శ్వాస అందదు. ఆ సమయంలో దగ్గు, పిల్లికూతలు కూడా వస్తుంటాయి. ఇలా రావడానికి కారణాలు ఏమిటి? – ఆర్. రజిత, ఖమ్మం రుతుసమయం కూడా ఒక కీలకమైన దశ. ఆ సమయంలో మీ భౌతిక, మానసిక, ప్రవర్తనల్లో ఎన్నో మార్పులు కనిపించవచ్చు. రుతుక్రమం మహిళల ఆరోగ్యం విషయంలో కీలక భూమిక పోషిస్తుంటుంది. తద్వారా అటు శరీరక, ఇటు మానసిక సమస్యలకు అది దారితీయవచ్చు.కెటామెనియల్ ఆస్తమాను రుతుక్రమం ముందు వచ్చే ఆస్తమా (ప్రీమెనుస్ట్రువల్ ఆస్తమా)గా కూడా పరిగణించవచ్చు. ఈ సమయంలో మహిళల్లో ఆస్తమా లక్షణాలు తీవ్రమవుతాయి. రుతుక్రమానికి ముందుగా చాలామంది మహిళల్లో ఆస్తమా ఎక్కువ కావడం, ఆసుపత్రిలో చేరాల్సిరావడం వంటి సందర్భాలూ ఉన్నాయి. పీరియడ్స్‌కు ముందు శ్వాస అస్సలు అందకపోవడం వల్ల ఈ పరిణామాలు సంభవిస్తాయి. దీనికి నిర్దిష్టమైన కారణాలు తెలియకపోయినా సాధారణంగా ప్రోజెస్టెరాన్ లేదా ప్రోస్టాగ్లాండిన్స్ వంటి హార్మోన్లలోని మార్పులు ఇందుకు దారితీస్తాయని కొంతవరకు ఊహించవచ్చు. ఇక అండం రూపుదిద్దుకునే దశలో ప్రోజెస్టెరాజ్ పాళ్లు క్రమంగా పెరుగుతాయి. ఆ తర్వాత పీరియడ్స్‌కు ముందు ఇవే పాళ్లు గణనీయంగా పడిపోతాయి. మహిళల్లో కండరాలు రిలాక్స్ కావడానికి తోడ్పడే స్రావాలు సైతం ఊపిరితిత్తుల్లోని గాలి ప్రయాణించే పైప్‌లనూ ప్రభావితం చేస్తాయి. ప్రోజెస్టెరాన్ పెరగడం వల్ల కలిగే మార్పులు శ్వాస అందనివ్వకుండా చేసి, ఆస్తమాను ప్రేరేపిస్తాయి. అలాగే రుతుక్రమానికి ముందుగా వ్యాధినిరోధకత విషయంలో వచ్చే మార్పులు కూడా ఆస్తమాను ప్రేరేపించవచ్చు. అందుకే... రుతుక్రమం సమయంలో ఆస్తమా కనిపిస్తే దానికి నిర్దిష్టమైన కారణమేమిటన్నది నిశితంగా నిర్ధారణ చేయడం చాలా అవసరం. ఇక మీకు ఏ అంశం ఆస్తమాను పేరేపిస్తుందో నిశితంగా తెలుసుకొని, దానికి చికిత్స అందించాల్సి ఉంటుంది. ఇందుకోసం మీరు ఒకసారి మీకు దగ్గర్లోని పల్మునాలజిస్ట్‌ను కలవండి. పాప్‌కార్న్ లంగ్ అంటే ఏమిటి? నా వయసు 47 ఏళ్లు. చాలా చిన్న వయసు నుంచే స్మోకింగ్ మొదలుపెట్టి కొంతకాలం కిందటే ఆ అలవాటు మానేశాను. అప్పట్నుంచి ఎలక్ట్రానిక్ సిగరెట్ మొదలుపెట్టాను. అయితే అది కూడా వద్దనీ, దానివల్ల పాప్‌కార్న్ లంగ్ రావచ్చని డాక్టర్ అయిన నా ఫ్రెండ్ చెబుతున్నారు. ఈ ‘పాప్‌కార్న్’ లంగ్ అంటే ఏమిటి?– నాగేశ్వర్రావు, హైదరాబాద్ పాప్‌కార్న్ లంగ్ అనేది చాలా ప్రమాదకరమైన, రివర్స్ చేయలేని సంక్లిష్టమైన సమస్య. దీన్ని నిర్ధారణ, చికిత్స... రెండూ కష్టమే. దీన్నే వైద్యపరిభాషలో బ్రాంకోలైటిస్ ఆబ్లిటేరన్స్ అంటారు. నేషనల్ జ్యూయిష్ హెల్త్ హాస్పిటల్స్ ప్రకారం కృత్రిమ వెన్నను దీర్ఘకాలం పాటు వాడినా, పొగతాగే అలవాటు ఉన్నా ఇది రావచ్చు. కృత్రిమ వెన్నలో తొందరగా ఆవిరయ్యే ‘డై అసిటైల్’ అనే ఒక రసాయన పదార్థం ఉంటుంది. సాధారణంగా దీన్ని ఆల్కహాలిక్ పానీయాల్లో ఉపయోగిస్తుంటారు. అలాగే కొన్ని ఆహారపదార్థాల్లోనూ కలుపుతుంటారు. పాప్‌కార్న్‌లను వెన్నలో బదులు దీనిలో వేపుతుంటారు. దాని కారణంగా ఊపిరితిత్తులకు వచ్చే సమస్య కాబట్టి ఈ జబ్బును సాధారణ పరిభాషలో ‘పాప్‌కార్న్ లంగ్’ అంటుంటారు. పొడిదగ్గు, పిల్లికూతలు, ఊపిరి సరిగా తీసుకోలేకపోవడం వంటి లక్షణాలు ఇందులో కనిపిస్తాయి. వీటితో పాటు అలసట, జ్వరం, రాత్రివేళల్లో ఒళ్లు చెమటలు పట్టడం, ఆయాసం వంటివీ కనిపించే ఇతర లక్షణాలు. దీన్ని నిర్ధారణ చేయడం చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. ఎక్స్–రే, సీటీ స్కాన్ వంటి పరీక్షలతో పాప్‌కార్న్ లంగ్‌ను నిర్ధారణ చేయాలి. కానీ అవి మాత్రమే నిర్ధారణ పరీక్షలు కాదు. ఒకసారి ఇది వస్తే మళ్లీ మామూలుగా కావడం కష్టం. అది దాదాపు అసాధ్యం కూడా. అందుకే రాకముందే జాగ్రత్తలు తీసుకోవాలి. పొగతాగే అలవాట్లు, కృత్రిమ వెన్న నుంచి దూరంగా ఉండాలి. దీనికి స్టెరాయిడ్స్‌తో చికిత్స చేయాల్సి ఉంటుంది. వాళ్లలో ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మళ్లీ మామూలు స్థితికి తీసుకురావాలి. ఒకవేళ అలా చేయలేకపోతే ఊపిరితిత్తుల మార్పిడి చేయడం ఒకే ఒక మార్గం. కాబట్టి ముందు నుంచే దీన్ని నివారించుకోవడం చాలా మేలు. అందుకోసం ఏ రూపంలో పొగతాగే అలవాటున్నా దాన్ని వదులుకోవడమే మేలు. ఏమిటీ ‘ఫంగల్ బాల్’? కొన్నేళ్ల క్రితం నాకు టీబీ వచ్చింది. అయితే కొద్దిరోజులుగా నేను తీవ్రంగా దగ్గుతున్నాను. రక్తం కూడా పడుతోంది. డాక్టర్‌కు చూపించుకుంటే కొన్ని పరీక్షలు చేసి ఊపిరితిత్తుల్లో ‘ఫంగల్ బాల్’ ఉందని చెప్పారు. నాకు ఆందోళనగా ఉంది. ఫంగల్బాల్ అంటే ఏమిటి? – వినయ్‌కుమార్, రాజమండ్రి ఫంగల్ బాల్ సమస్య ఊపిరితిత్తులోనే గాక మెదడు, కిడ్నీ, ఇంకా ఇతర ఏదైనా అవయవంలో ఏర్పడవచ్చు. మీ విషయంలో ఊపిరితిత్తులలోని ఖాళీ ప్రదేశంలో (లంగ్ క్యావిటీలో) యాస్పర్జిల్లస్ అనే ఫంగస్ ఒక ఉండలా ఏర్పడటం వల్ల ఈ సమస్య వచ్చింది. సాధారణంగా యాస్పర్జిల్లస్ ఫ్యూమిగేటస్ అనే రకానికి చెందిన ఫంగస్ మానవుల్లో పెరుగుతుంది. మానవుల్లోని వ్యాధి నిరోధకత కేవలం కణజాలానికే పరిమితం. లంగ్‌లో ఉండే ఖాళీ ప్రదేశాలలోకి (క్యావిటీస్లోకి) చొచ్చుకుపోలేకపోవడం వల్ల ఆ ప్రదేశాల్లో పెరిగే ఫంగస్‌ను మన ఇమ్యూనిటీ దాన్ని నిరోధించలేదు. దాంతో అక్కడ ఆ ఫంగస్ ప్రత్యుత్పత్తి జరుపుతూ, విపరీతంగా పెరుగుతూ ఒక ఉండలాగా ఏర్పడుతుంది. ఫలితంగా అక్కడి పరిసరాల్లోని కణజాలం మృతిచెందుతుండటం, మ్యూకస్ విపరీతంగా స్రవిస్తూ ఉండటం, ఇరతత్రా అంశాలు తోడవుతాయి. దాంతో ఈ ఉండ మరింతగా పెరుగుతుంటుంది. సాధారణంగా యాస్పర్జిల్లస్ అనే ఈ ఫంగస్ మొదట్లో ఆకులు, నిల్వ ఉంచిన ధాన్యం, పక్షి రెట్టలు, కుళ్లుతున్న చెట్ల భాగాలలో పెరుగుతుంటుంది. మనం పీల్చినప్పుడు శ్వాస ద్వారా మన ఊపిరితిత్తుల్లోకి చేరుతుంటుంది. మిగతా ఆరోగ్యవంతులతో పోలిస్తే టీబీ, సిస్టిక్ ఫైబ్రోసిస్, ఊపిరితిత్తుల్లో పొక్కులా పెరగడం (యాబ్సెస్), ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ వంటి వ్యాధులు ఉన్నవారిలో ఈ ఫంగల్ బాల్ మరింత తేలిగ్గా పెరుగుతుంది. కొంతమంది రోగుల్లో ఈ ఫంగల్బాల్ ఉన్నప్పటికీ ఎలాంటి లక్షణాలు బయటకు కనిపించకపోవచ్చు. మరికొందరిలో మాత్రం ఛాతీనొప్పి, దగ్గు, దగ్గినప్పుడు రక్తం పడటం జరుగుతుంది. కొందరిలో తీవ్రమైన నిస్సత్తువ, జ్వరం, బరువు తగ్గడం కనిపించవచ్చు. ఊపిరితిత్తుల నుంచి చిన్న ముక్క తీసి బయాప్సీ పరీక్షకు పంపడం, యాస్పిర్జిల్లస్ నిర్ధారణకు చేసే రక్తపరీక్ష, బ్రాంకోస్కోపీ, ఛాతీ ఎక్స్–రే, సీటీ స్కాన్, కళ్లె పరీక్షలతో దీన్ని నిర్ధారణ చేయవచ్చు. ఎలాంటి లక్షణాలు లేకపోతే చికిత్స అవసరం లేదు. కానీ దగ్గు, రక్తం పడటం జరిగినప్పుడు రక్తస్రావం జరుగుతున్న ప్రదేశాన్ని గుర్తించడానికి అవసరమైన యాంజియోగ్రఫీ పరీక్ష చేసి, ఎంబోలైజేషన్ అనే ప్రక్రియ ద్వారా అక్కడ రక్తస్రావాన్ని నివారిస్తారు. రోగికి ప్రాణాపాయం సంభవించే ప్రమాదం ఉంటే మాత్రం ఇక శస్త్రచికిత్స జరిపి, రక్తస్రావాన్ని ఆపాల్సి ఉంటుంది. - డా. రమణ ప్రసాద్ కన్సల్టెంట్ పల్మునాలజిస్ట్ అండ్ స్లీప్ స్పెషలిస్ట్ , కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ -
నిద్రపోతే ప్రాణం పోతుంది!
మెదడుకు, శరీరానికి విశ్రాంతినిచ్చేది నిద్ర. ప్రతి ఒక్కరూ రోజూ తగినంత నిద్రపోతేనే ఇతర జీవక్రియలు సక్రమంగా సాగుతాయి. నిద్ర ఎవరికైనా ప్రశాంతతను అందిస్తుంది. జీవితంలో ఎన్ని సమస్యలున్నా, నిద్రలో అన్నీ మర్చిపోతాం. ఇది దాదాపు అందరికీ వర్తిస్తుంది. కానీ, లియామ్ డెర్బిషైర్ అనే టీనేజ్ యువకుడికి మాత్రం కాదు. ఎందుకంటే అతడికి నిద్రపోవడమంటేనే ప్రాణాలను పణంగా పెట్టినట్టు. అవును లియామ్ నిద్రపోతే, ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే నిద్రపోగానే, శ్వాస ఆగిపోయే అరుదైన వ్యాధితో అతడు బాధపడుతున్నాడు. కానీ, ఆ సమస్యతో ఏళ్లుగా పోరాటం సాగిస్తూ, తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అరుదైన సమస్య.. బ్రిటన్‌కు చెందిన లియామ్ డెర్బిషైర్ అనే యువకుడికి ఓ అరుదైన వ్యాధి ఉంది. వైద్య పరిభాషలో దీన్ని ‘సెంట్రల్ హైపోవెంటిలేషన్’ లేదా ‘ఆన్డైన్స్ కర్స్’ అంటారు. ఈ సమస్య ఉన్న వారు నిద్రపోతే, ఊపిరి ఆగిపోతుంది. అంటే వారు నిద్రలో శ్వాసతీసుకోలేరు. నిద్రపోగానే, శ్వాస తీసుకోవడం ఆగిపోతుంది. దీంతో తమ ప్రాణాల్ని కోల్పోవాల్సి ఉంటుంది. ఇది అత్యంత అరుదైన వ్యాధి. ఈ సమస్య ఉన్న వారు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 1,500 మంది వరకు మాత్రమే ఉన్నారంటే, ఇది ఎంత అరుదైన సమస్యో అర్థం చేసుకోవచ్చు. పుట్టుకతోనే.. లియామ్‌కు ‘సెంట్రల్ హైపోవెంటిలేషన్’ సమస్య పుట్టుకతోనే ఉంది. లియామ్ పుట్టిన వెంటనే దీన్ని గమనించిన వైద్యులు, ఆరు వారాలకు మించి బతకలేడని చెప్పారు. ఎందుకంటే దీనికి చికిత్స లేదు. అయితే లియాన్ సమస్య గురించి తెలిసిన తల్లిదండ్రులు, తమ పిల్లాడ్ని బతికించుకునేందుకు శాయశక్తులా ప్రయత్నించారు. లియామ్ నిద్రపోయాక, అతడికి శ్వాస అందేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం లియామ్ వయసు పద్దెనిమిదేళ్లు. ఆరు వారాలకు మించి బతకడం అసాధ్యం అని చెప్పిన వైద్యుల అంచనాలను తలకిందులు చేస్తూ, అతడు రోజూ మృత్యువుని ఓడిస్తూనే ఉన్నాడు. నిరంతర పర్యవేక్షణ.. నిద్రపోతే, శ్వాస తీసుకోవడం ఆగిపోయి ప్రాణాలు కోల్పోతాడు లియామ్. ఈ సమస్యను అధిగమించేందుకు అతడి తల్లిదండ్రులు ప్రత్యేక వైద్య సదుపాయాల్ని కల్పించారు. లియామ్ నిద్రలోకి జారుకున్న తర్వాత కృత్రిమ శ్వాసను అందిస్తారు. దీని ద్వారా గుండె, ఊపిరితిత్తులకు తగిన ఆక్సిజన్ అందేలా చేస్తారు. ఈ సేవల కోసం అతడి బెడ్రూమ్లో ప్రత్యేక పరికరాల్ని అమర్చారు. వీటి ద్వారా నిరంతరం అతడి గుండె పనితీరు, ఇతర అవయవాల్ని పరిశీలిస్తూనే ఉండాలి. ఈ పని చేసేందుకు ఎవరో ఒకరు సుశిక్షితులైన సిబ్బంది పక్కన ఉండాల్సిందే. బాల్యం నుంచి ఈ వైద్య సదుపాయాల ద్వారానే లియామ్ జీవన పోరాటాన్ని కొనసాగిస్తున్నాడు. లియామ్ ప్రాణాలతో ఉండాలంటే ఎప్పుడూ బెడ్రూమ్లో ఇలాంటి ఏర్పాట్లు తప్పనిసరి. ఎన్ని వైద్య సదుపాయాలున్నా, నిద్ర పోయే విషయంలో లియామ్ జాగ్రత్తగా ఉండాల్సిందే. తల్లిదండ్రులు, వైద్యులు నిరంతరం కంటికి రెప్పలా చూసుకుంటూ పర్యవేక్షిస్తుండడం వల్లే ఇదంతా సాధ్యమైంది. – సాక్షి, స్కూల్ ఎడిషన్ -
'స్మార్ట్ టి-షర్టు..ఏం చేస్తుందో తెలుసా?
టొరంటో: శాస్త్రవేత్తలు వినూత్నమైన టీ షర్ట్‌ను రూపొందించారు. ధరించిన వారి శ్వాసను మానిటర్ చేసే స్మార్ట్ టి-షర్టును పరిశోధకులు సృష్టించారు. ఎలాంటి వైర్లు లేదా సెన్సర్ల అవసరం లేకుండానే రియల్ టైంలో ధరించిన వారి శ్వాస రేటును ఇది పర్యవేక్షిస్తుందట. శ్వాసకోశ వ్యాధులను నిర్ధారించడానికి లేదా ఉబ్బసం, స్లీప్ అప్నియా లేదా దీర్ఘకాలిక అబ్స్ట్రక్టివ్ పల్మనరీ వ్యాధి బాధపడుతున్న వ్యక్తులను పర్యవేక్షించడానికి ఉపయోగపడేలా దీన్ని ఆవిష్కరించారు. కెనడాలోని లావాల్ యూనివర్శిటీ పరిశోధకులు ఈ 'స్మార్ట్ టీ షర్టును రూపొందించారు. దీని అంతర్గత ఉపరితలంపై పలుచటి వెండి పొరతో కప్పబడిన బోలుగా ఉండే ఆప్టికల్ ఫైబర్‌తో తయారు చేసిన యాంటెన్నాను షర్ట్ కాత్లో ఛాతీ స్థాయిలో అమర్చారు. ఇలా ప్రత్యేకంగా అమర్చిన ఈ యాంటెన్నా ధరించిన వ్యక్తి శ్వాస సంకేతాలను ప్రసారం చేస్తుంది. ఇలా పంపిన డేటా యూజర్ యొక్క స్మార్ట్‌ఫోన్ లేదా సమీప కంప్యూటర్ చేరుతుంది. శ్వాసకోశ రేటు కొలిచే ఇతర పద్ధతుల మాదిరిగా కాకుండా, ఎలాంటి తీగలు, ఎలక్ట్రోడ్లు, లేదా సెన్సార్లతో సంబంధం లేకుండా పనిచేస్తుందని పరిశోధకులు వెల్లడించారు. బాహ్య పరిస్థితులకు తట్టుకునేలా ఈ ఫైబర్‌ను పాలిమర్ తో కవర్ చేసినట్టు యూనివర్శిటీ ప్రొఫెసర్, పరిశోధకుల్లో ఒకరు యునెస్ మెస్సడేక్ చెప్పారు. దీన్ని ధరించిన వ్యక్తి కూర్చున్నా, పడుకున్నా, నిలబడినా సెన్సింగ్ అండ్ ట్రాన్సిమిటింగ్ అనే రెండు విధులును ఇది విజయవంతంగా నిర్వహిస్తుందని తెలిపారు. అలాగే ఈ స్మార్ట్ టీ షర్టు అందించే డేటా విశ్వసనీయమైనదిగా తేలిందని చెప్పారు. అంతేకాదు 20 ఉతుకుల తరువాత కూడా ఈ యాంటెన్నా నీరు, డిటర్జెంట్‌ను తట్టుకోగలిగి, మంచి పని పరిస్థితిలో ఉందని ప్రొఫెసర్ చెప్పారు. ఈ అధ్యయనం సెన్సర్స్ జర్నల్ లో ప్రచురించబడింది. -
హెల్త్‌టిప్స్
నిమ్మరసంలోని యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యాన్ని కాపాడతాయి. కాబట్టి ఫ్రూట్‌జ్యూస్‌లో కాని, ఆహారంలో కాని నిమ్మరసాన్ని కలుపుకుని తీసుకుంటుంటే ఆరోగ్యం మెరుగవుతుంది. తేనెటీగలు కాని మరేవైనా కీటకాలు కాని కుట్టినప్పుడు వెంటనే గాయాన్ని నీటితో తడిపి ఉప్పుతో కవర్ చేయాలి. ఇలా చేస్తే నొప్పి వెంటనే తగ్గిపోతుంది. ఇది డాక్టరును సంప్రదించే లోపు నొప్పి లేకుండా ఉండడానికి చేసే ప్రథమ చికిత్స మాత్రమే. పళ్లు, చిగుళ్లకు సంబంధించి ఏ రకమైన అసౌకర్యం ఉన్నా పుదీనా ఆకులను నమిలినట్లయితే సమస్య పరిష్కారమవుతుంది. ప్రతిరోజూ రాత్రి భోజనం తరువాత ఒకటి–రెండు పుదీనా ఆకులను తింటే నోట్లో క్రిములు చేరవు. నోటి దుర్వాసనతో బాధపడే వాళ్లు ఉదయం, సాయంత్రం రెండు– మూడు ఆకులను నములుతుంటే శ్వాస తాజాగా ఉంటుంది. -
తిండిని బట్టే నిద్ర!
ఫుడ్ అండ్ స్లీప్ మంచి నిద్రకూ, ఆహారానికీ సంబంధం ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో ప్రత్యక్ష సంబంధం ఉంటే చాలా సందర్భాల్లో పరోక్షంగా నిద్రపై దాని ప్రభావం ఉంటుంది. ఉదాహరణకు ఎక్కువగా టీ, కాఫీలు తాగని వారు సాయంత్రం వేళల్లో లేదా రాత్రి వేళలో వాటిని తాగితే నిద్రపట్టకపోవడం జరుగుతాయి. అలాగే... చాలా రకాల ఆహారాలు నేరుగా ప్రభావం చూపకపోయినా... పరోక్షంగా ఆరోగ్యాన్నీ, తద్వారా నిద్రనూ ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు ఆస్తమా ఉన్న వారిలో వారికి జంక్‌ఫుడ్‌లోని చిప్స్ వంటి సరిపడని ఆహారమో, సాఫ్ట్ డ్రింక్ వంటి పానీయమో, తీపి పదార్థమో తీసుకున్న తర్వాత మెల్లగా శ్వాస మీద ప్రభావితం చూపుతాయి. దాంతో రాత్రంతా నిద్ర లేకుండా గడపాల్సి వస్తుంది. ఆరోగ్యకరంగా మంచి నిద్రను ఇచ్చే ఆహారం... పాలు : దీన్ని సంపూర్ణ ఆహారంగా పరిగణిస్తారు. అన్ని పోషకాలతో పాటు ఇందులో ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ ఉంటుంది. దీని వల్ల మంచి నిద్ర వస్తుంది. ఆరోగ్యకరమైన నిద్ర కోసం మరీ వేడిగానూ, మరీ చల్లగానూ లేకుండా ఉండే గోరువెచ్చటి పాలను నిద్రకు ఉపక్రమించే ముందు తీసుకోవడం మేలు. ఇది స్వాభావికమైన స్లీపింగ్ పిల్. సింపుల్ కార్బోహైడ్రేట్స్: భోజనం తర్వాత కాస్త మగతగానూ, నిద్రపడుతున్నట్లుగానూ అనిపించడం చాలామందికి తెలిసిందే. కార్బోహైడ్రేట్ తీసుకున్న తర్వాత వాటి నుంచి శక్తిని తయారు చేసేందుకు నిద్ర వస్తుంటుంది. అందుకే భోజనం తర్వాత నిద్ర వస్తున్నట్లు అనిపిస్తుంది. అయితే సింపుల్ ఓట్ మీల్, వరి లాంటి మిగతా కార్బోహైడ్రేట్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన నిద్ర వస్తుంది. ఇందులోని మెలటోనిన్ అనే పదార్థం కండరాలను రిలాక్స్ చేయడంతో పాటు మెదడులో నిద్రను ప్రేరేపించే మెలటోనిన్ అనే రసాయనాన్ని ప్రేరేపించడమే దీనికి కారణం. దీంతో పాటు, విటమిన్ ‘సి’ పాళ్ళు ఎక్కువగా ఉండే బొప్పాయి, అనాస, నిమ్మజాతి పండ్లు సహజమైన రాత్రి నిద్రను కలగజేస్తాయి. అలాగే, సెలేనియవ్ు ఎక్కువగా ఉండే చేపలు, బాదాం లాంటి నట్స్ ఆరోగ్యకరమైన నిద్రను కలిగిస్తాయి. నిద్రను దూరం చేసే పదార్థాలు జంక్ ఫుడ్: మన ఆహారంలో త్వరగా లభ్యమై, మార్కెట్లో తేలికగా దొరికే జంక్‌ఫుడ్, బేకరీ ఫుడ్ తీసుకోవడం తప్పనిసరిగా చెడు అలవాటు. ఇందులో ఉండే రిఫైన్డ పిండిపదార్థాల వల్ల డయాబెటిస్ వంటి అనేక సమస్యలు రావచ్చు. దీని వల్ల కలిగే ఎలర్జీల కారణంగా నిద్ర దూరం కావచ్చు. కాబట్టి ఇది మంచి అలవాటు కానే కాదు. టీ : థయానిన్ అనే అమైనో ఆసిడ్ అనేది మెదడుకు ఉత్ప్రేరకంలా పనిచేస్తుంది. అన్ని రకాల టీలలోనూ ఇది ఉంటుంది. అందుకే నిద్రకు ఉపక్రమించే ముందు ఏ రకమైన టీ అయినా తాగకపోవడం మేలు. కాఫీ : ఇందులోని కెఫిన్ అనే పదార్థం మెదడును ఉత్తేజపరుస్తుంది. దాంతో, నిద్ర దూరమవుతుంది. కాబట్టి, నిద్ర పోవడానికి ముందు కాఫీ తాగకుండా ఉండడమే మేలు. సుజాతా స్టీఫెన్ న్యూట్రిషనిస్ట్ మ్యాక్స్‌క్యూర్ హాస్పిటల్స్ మాదాపూర్ హైదరాబాద్ -
అవగాహనతోనే... ఉప‘ యోగం’...
సాధనమున పనులు సమకూరు... అన్నారు పెద్దలు. చేసే పనుల పట్ల సంపూర్ణ అవగాహనతో ఉంటే దాని ఫలితాలు సంపూర్ణంగా సమకూరుతాయనేది మర్చిపోకూడదు. ఆసనాలు సాధన చేయడం ఎంత అవసరమో... అంతకు ముందుగానే యోగ అనే ఓ గొప్ప శాస్త్రం గురించి తగినంత అవగాహన పెంచుకోవడం కూడా అంతే అవసరం. ఆ అవగాహన కోసమే ఈ సూచనలు... ఆసనాలు వేసేటప్పుడు శక్తి ప్రవాహం స్థూలం నుంచి సూక్ష్మంవైపుగా పయనించాలి. అంటే మూలాధారం నుంచి సహస్రారం వైపునకు మన ప్రయాణం ఉండాలి. (శరీరంలో ఉన్న విభిన్న నాడీ కేంద్రాలను చక్రాలుగా ఋషులు పేర్కొన్నారు. ఆధునిక శాస్త్రం నెర్వ్ సెంటర్స్ లేదా నాడీ కేంద్రాలు అంటోంది).ఈ మూల సూత్రాన్ని అనుసరించి ఆసనాలు ఐదు రకాలుగా విభజించబడ్డాయి. అవి 1.నిలబడి చేసేవి 2.కూర్చుని చేసేవి 3.పొట్ట మీద పడుకుని చేసేవి, 4.వీపు మీద పడుకుని చేసేవి. 5) తలకిందులుగా చేసేవి. నిలబడిన స్థితిలో ఆసనాలు వేసేటప్పుడు స్పైన్ అలైన్మెంట్, కుడి ఎడమల మధ్య సమతౌల్యం, తొడ కండరాలు, పిక్కల కండరాలు బలోపేతం అవుతాయి. శరీరానికి నిలకడని, ధృఢత్వాన్ని అందిస్తుంది. మన శరీరపు బరువులో ప్రతి కిలోగ్రామునకు కనీసం 40మి.లీ నీటిని తాగాలి. అంటే ఉదాహరణకు శరీరపు బరువు 60 కిలోలు ఉన్నట్లయితే దాదాపు 2.5 లీటర్ల నీరు తాగడం అవసరం. ఆహారం తీసువడానికి ముందు, తరువాత కనీసం అరగంట వ్యవధి ఇచ్చి నీరు తాగాలి. అలా కాకపోతే ఆహారం తీసుకునే సమయంలో పొట్టలో ఉత్పత్తి అయ్యే హైడ్రోక్లోరిక్ ఆమ్లం, పెప్సిన్ వంటి గ్యాస్ట్రిక్ జ్యూసెస్ నీటితో కలిసి డైల్యూట్ అవడం వల్ల వాటిలో సాంద్రత తగ్గి జీర్ణశక్తి లోపిస్తుంది. ఆహారం తీసుకున్న అనంతరం ప్రతి సారీ కనీసం 300 మి.లీ నీరు తాగడం మంచిది. ఒకే వస్తువును వివిధ ప్రాంతాలలో ఎలాగైతే విభిన్న పేర్లతో పిలుస్తారో అదే విధంగా యోగాసనాలు, ముద్ర, బంధనాలను పిలిచే విధానంలో వ్యత్యాసాలు ఉండవచ్చు. ఎనిమిదేళ్ల నుంచి 80ఏళ్ల వరకూ వయసున్న ప్రతి ఒక్కరూ యోగాసనాలు సాధన చేయవచ్చు. ఆసనాలు వేసే ప్రదేశం చదునుగా. స్వఛ్చమైన గాలి వెలుతురు ప్రసరించేలా ఉండాలి. తొలుత పొట్ట, మూత్రాశయాన్ని ఖాళీగా ఉంచుకోవాలి. సాధన మధ్యలో కొంచెం నీరు తాగవచ్చు. ఆసనంలోకి వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు శరీర కదలికలకు అనుగుణంగా ఉఛ్వాసనిశ్వాసలు ఉండాలి. శరీరాన్ని సాగదీసేటప్పుడు శ్వాస తీసుకోవడం, సంకోచింప జేసేటప్పుడు (వదులుగా వదిలినపుడు) శ్వాస వదలడం చాలా ముఖ్యం. ఆసనంలో ఉన్నప్పుడు మాత్రం సాధారణ శ్వాస తీసుకోవాలి. ఎంతసేపు శ్వాస తీసుకోవాలి అనేది కొత్తగా ప్రారంభించే వారికి ముఖ్యం కాదు. కాబట్టి, శక్తి అనుసారం చేయవచ్చు. ఆసనంలో ఉండే సమయం వృధ్ధి చేసుకోవడానికి ఒకటి రెండు మూడు...పది అంటూ అంకెలు లెక్కపెట్టవచ్చు. ఆసనమైనా, ప్రాణయామమైనా... సాధకులు వారి వయసును బట్టి, దేహపు స్థితిగతులను బట్టి ఎంతవరకూ చేయగలరో అంతవరకే చేయాలి. యోగాలో అన్ని ఆసనాలనూ కుడి, ఎడమ రెండు వైపులకూ చేయాలి. శరీరాన్ని సమస్థితిలోకి తీసుకురావడానికి అది ఉపకరిస్తుంది. శారీరక ధృఢత్వానికి కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఋషులు, మునులు అందించిన శాస్త్రం హఠయోగం. దీనిని తొలుత 8వ శతాబ్ధంలో స్వాత్మారామ అనే నాధగురువు హఠయోగ ప్రదీపిక పేరిట గ్రంధ రూపంలో అందించారు. స్వాత్మారాముడు ప్రధమ శ్లోకంలోనే రాజయోగ ఉపయోగార్ధం ఈ హఠయోగాన్ని ఇస్తున్నట్టు చెబుతాడు. పతంజలి ఇచ్చిన యోగ దర్శనానికి అనుగుణంగా ధ్యానం చేయడానికి శరీరాన్ని సిద్ధం చేయడం హఠయోగ సాధన ముఖ్యోధ్ధేశ్యం. శాస్త్రం కాబట్టి యోగాను శాస్త్రీయ దృక్పధంతోనే ఆచరించాలి. యోగా అనే పదం యంగ్ అనే పదంలో నుంచి వచ్చినట్టయితే దాని అర్ధం సంయోగం. అంటే శరీరాన్ని, శ్వాసను మనసుతో అనుసంధానం చేసి సమన్వయం చేయడం. దీనికి మూలం ‘యోక్’ అయినట్లయితే దాని అర్ధం కాడి. రైతు పొలం దున్నేటప్పుడు కాడికి కుడి ఎడమ వైపున కట్టిన ఎడ్ల కదలికలో సమతుల్యం ఉండేటట్టుగా ఎలా చూస్తాడో అలాగే యోగాసన, ప్రాణాయామ సాధన చేసేటప్పుడు శరీరంలో ఎడమ, కుడి భాగాలను మెదడులో ఎడమ, కుడి గోళార్ధములను, ఇడ-పింగళ నాడులను సమంగా పనిచేసేటట్టుగా చూడాలి. యోగ సాధన అంతిమ లక్ష్యం ఆత్మ దర్శనం. బ్రహ్మజ్ఞానం పొందడం, కైవల్యం, నిర్వాణ/నిబ్బాన స్థితిని చేరడమే. ఒకే వస్తువును వివిధ ప్రాంతాలలో ఎలాగైతే విభిన్న పేర్లతో పిలుస్తారో అదే విధంగా యోగాసనాలు, ముద్ర, బంధనాలను పిలిచే విధానంలో వ్యత్యాసాలు ఉండవచ్చు. ఎనిమిదేళ్ల నుంచి 80ఏళ్ల వరకూ వయసున్న ప్రతి ఒక్కరూ యోగాసనాలు సాధన చేయవచ్చు. - సమన్వయం: సత్యబాబు ఎ.ఎల్.వి కుమార్ ట్రెడిషనల్ యోగా ఫౌండేషన్ -
గుండెకు పొట్టకు మేలు
బద్ధకోణం.. శలభం యోగా ఆసనంలో కూర్చుని కాళ్లు రెండూ ముందుకు స్ట్రెచ్ చేసి, విశ్రాంతి పొందాలి. ఆ తర్వాత కాళ్ళు రెండూ మడచి అరిపాదానికి ఎదురుగా ఇంకొక అరిపాదాన్ని కలిపి రెండు చేతులతో బొటన వేళ్ళను పట్టుకోవాలి. మోకాళ్ళు రెండూ పైకి, కిందకు సీతాకోకచిలుక లాగా కదిలిస్తూ ఉండాలి. తొడకీలు భాగాలు కూడా (గ్రెయిన్ ఏరియా) బాగా ఫ్రీ చేసుకొని యింకా అవసరం అయితే అర చేతులు రెండూ సీటుకు ఇరువైపులా భూమి మీద సపోర్ట్‌గా ఉంచి ప్రెస్ చేస్తూ సీటును పైకి లేపి మోకాళ్ళను పైకి, కిందకు కదిలించినట్లయితే తొడకీలు భాగాలు ఇంకా ఫ్రీ అయ్యే అవకాశం ఉంటుంది. రెండు చేతులతో కాలి వేళ్ళని కలిపి పట్టుకుని ఉన్నప్పుడు అరిపాదాలు రెండూ పైకి చూపించే ప్రయత్నం చేస్తే పైకి లేచిన రెండు మోకాళ్లు భూమికి ఇంకా కొంచెం దగ్గరగా తీసుకురావచ్చు. ఈ స్థితిలో తల.. వీపు నిటారుగా ఉంచి శ్వాసతీసుకుని, శ్వాస వదులుతూ పొట్టదగ్గర కండరాలను లోపలకు లాగుతూ కొంచెం కొంచెం ముందుకు వంగుతూ కలిపి ఉంచిన పాదాలకు నుదురును దగ్గరగా తీసుకువచ్చే ప్రయత్నం చేయాలి. ఇలా ముందుకు వంగేటప్పుడు పొట్ట నడుము భాగాలలోని కండరాలు పట్టుకునే ప్రమాదం ఉన్నది కనుక జాగ్రత్తగా చేయడం ముఖ్యం. ప్రిపరేటరీగా శ్వాసతీసుకుంటూ తల ఛాతీపైకి మళ్ళీ శ్వాస వదులుతూ తల ఛాతీకి కిందకు, మళ్ళీ శ్వాసతీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ ఈ సారి కొంచెం ఎక్కువగా ముందుకు ఇలా 4, 5 సార్లు చేసినట్లయితే తేలికగా చేయగల్గుతారు. ఉపయోగాలు: గుండె కండరాలను బలంగా చేయడానికి, గుండెకు రక్తప్రసరణ చక్కగా జరగడానికి ఉపయోగపడుతుంది. తొడ కీలు భాగాలు ఓపెన్ అవ్వడానికి, స్టిఫ్నెస్ పోవడానికి పొట్టలో భాగాలకు వ్యాయామం జరిగి జీర్ణశక్తి మెరుగవుతుంది. హై బీపీకి మెనోపాజ్ సమస్యకి, ఆస్తమా సమస్యకి, ఇన్ ఫెర్టిలిటీకి చాలా ఉత్తమమైన ఆసనం. డిప్రెషన్, యాంగ్జయిటీ, ఫాటిగ్యూలను దూరం చేస్తుంది. పొట్టమీద బోర్లా పడుకుని మకరాసనంలో కొంచెం రిలాక్స్ అయ్యి భుజంగాసన అర్థ శలభాసన, శలభాసన తరువాత ధనురాసన... సీక్వెన్స్‌లో భాగంగా ఈ ఆసనాన్ని సాధన చేస్తారు. బోర్లా పడుకుని నేలమీద గడ్డం సపోర్ట్‌గా ఉంచి పాదాలు రెండూ దగ్గరకు చేర్చి మోచేతులు రెండూ పొట్ట కిందకు తీసుకువెళ్ళి అరచేతులు భూమి మీదకు గట్టిగా ప్రెస్ చేస్తూ శ్వాస తీసుకుంటూ రెండు కాళ్ళను కలిపి మోకాళ్ళు వంచకుండా గాలిలోకి పైకి లేపే ప్రయత్నం చేయాలి. శ్వాసవదులుతూ నెమ్మదిగా కాళ్ళు రెండూ కిందకు దించాలి. మధ్యలో శ్వాస తీసుకుని వదిలే ప్రయత్నం చేయకుండా సాధారణ శ్వాస తీసుకుంటూ తేలికగా ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి వెనుకకు రావాలి. పూర్తి ఆసనస్థితిలో ఉన్నప్పుడు తొడలు మోకాళ్లు కూడా భూమి మీద ఆనకుండా పైకి లేపి ఉంచాలి. పూర్తి ఆసన స్థితిలోకి రావడం కష్టంగా ఉన్నట్లయితే ఒక కాలు ఒకసారి, ఆ తర్వాత రెండో కాలుని పైకి (మోకాళ్ళ దగ్గర మడచి) తీసుకువెడుతూ ఫ్రీ చేసుకోవాలి. తరువాత శలభాసన వేరు వేరుగా రెండు కాళ్ళతో సాధన చేసి కొంచెం రిలాక్స్ అయ్యి అప్పుడు పూర్తి స్థాయిలో చేసే ప్రయత్నం చేయాలి. ఉపయోగాలు: పిరుదులలో తొడలలో పొట్టకింద భాగాలలో ఉన్న కొవ్వు కరగడానికి, జీర్ణశక్తి పెంపొందించడానికి, పొట్ట దగ్గర కండరాలు, పెల్విక్ రీజియన్ బలపడటానికి, సయాటికా సమస్యకు, లోయర్ బ్యాక్ పెయిన్ తగ్గించడానికి లేదా లోయర్ బ్యాక్‌కి బలం చేకూరడానికి ఉపయోగపడే ఆసనం ఇది. జాగ్రత్తలు: గర్భిణులు, రుతుస్త్రావంలో ఉన్న స్త్రీలు చేయరాదు. పెప్టిక్ అల్సర్‌తో బాధపడేవాళ్లు, హెర్నియా సమస్య ఉన్నవాళ్లు పూర్తి స్థాయిలో ఈ ఆసనం చేయకపోవడం మంచిది. - సమన్వయం: సత్యబాబు ఎ.ఎల్.వి కుమార్ ట్రెడిషనల్ యోగా ఫౌండేషన్ -
ఉదరమే ఆధారం...
పొట్ట ఆధారంగా చేసే ఆసనాల సాధన ద్వారా అనూహ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. అలాంటి ఆసనాల గురించిన వివరణే.... 1. భుజంగాసన (కోబ్రా పోజ్) బోర్లా పడుకుని మకరాసనంలో చేతులు రెండు మడచి కుడిచేయిని ఎడమ చేతిమీద ఉంచాలి. చేతుల మీద గడ్డం ఆనించి తలకొంచెం లిఫ్ట్ చేసేటట్లుగా ఉంచాలి. పాదాల మధ్య రెండు లేదా మూడు అడుగుల దూరం, కాలి బొటన వేళ్ళు భూమికి దగ్గరగా ఉంచినట్లయితే పొత్తి కడుపు భాగం, తొడలు పూర్తిగా భూమికి ఆని విశ్రాంతి కలుగుతుంది. పొట్ట ఆధారంగా చేసే ఆసనాలకు మధ్య మధ్యలో ఇలా మకరాసనంలో విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. ఇప్పుడు పాదాలు రెండు కలిపి (వెన్నెముక లేదా సయాటికా సమస్య ఉన్నట్లయితే కాళ్ళు కొంచెం ఎడంగా ఉంచవచ్చు) అరచేతులు ఛాతీకిరువైపులా ఉంచి శ్వాసతీసుకుంటూ గడ్డాన్ని తలను పైకి లేపాలి. తరువాత చేతులు బలంగా నేలకు నొక్కుతూ మోచేతులు ఓపెన్ చేస్తూ ఛాతీని వీలైనంత పైకి లేపాలి. బొడ్డు నుంచి కిందకు నేలమీద పూర్తిగా ఆనేటట్లుగాను బొడ్డు నుంచి పై భాగాన్ని వీలైనంత పైకి లేపే ప్రయత్నం చేయాలి. (ఇది పూర్తి భుజంగాసన స్థితి). ఇలా కష్టం అన్పిస్తే మోచేతుల నుండి ముందు భాగం వరకూ పూర్తిగా రెండు చేతులను నేల మీద శరీరం ఇరువైపులా ముందుకు ఉంచి తలను ఛాతీని పైకి లిఫ్ట్ చేసే అర్థ భుజంగాసన ను ఎంచుకోవాలి. 1ఎ) భుజంగాసన: పూర్తి భుజంగాసన స్థితిలో ఉన్నప్పుడు తలను కుడివైపుకు తిప్పి కుడి భుజం మీదుగా వెనుక పాదాలను మళ్ళీ తలను ఎడమవైపుకు తిప్పి ఎడమ భుజం మీదుగా వెనుక పాదాలను చూసే ప్రయత్నం చేయాలి. శ్వాస వదులుతూ నెమ్మదిగా పొట్ట ఛాతీభాగాలను తరువాత గడ్డంను నేలమీదకు తీసుకు రావాలి. శ్వాస తీసుకుంటూ తల ఛాతీ పైకి లేపడం, శ్వాస వదులుతూ తిరిగి నేల మీదకు మకరాసనంలో విశ్రాంత స్థితికి రావాలి. ఉపయోగాలు: నడుము కింది భాగంలో నొప్పి (లోయర్ బ్యాక్యేక్)కి ఉత్తమమైన ఆసనం. ఉదరం, చిన్నప్రేవులు, ప్రాంక్రియాస్, లివర్, గాల్‌బ్లాడర్‌కు టోనింగ్‌తో అజీర్తి, మలబద్దకం వంటి సమస్యలను దూరం చేస్తుంది. కిడ్నీ, ఎడ్రినల్ గ్రంథులు సమర్థవంతంగా పనిచేయడానికి, కార్టిసోన్ హార్మోను ఉత్పత్తిని నియంత్రణకి వీలవుతుంది. కీళ్లనొప్పులకు, రెనిమాటిజమ్కు పరిష్కారం. స్త్రీలలో ఓవరీ, యుటరస్కు టోనింగ్ జరిగి రుతు చక్రసమస్యలకు. పొట్ట భాగంలో కొవ్వు తగ్గడానికి అవకాశం. జాగ్రత్తలు: గర్భిణీస్త్రీలు, పెప్టిక్ అల్సర్స్, హెర్నియా, ఇంటెస్టియల్ ట్యూబరోక్లోసిస్ ఉన్నవారు సాధన చేయరాదు. 2. సర్పాసన (స్నేక్ పోశ్చర్) మకరాసనంలో విశ్రాంతి స్థితిలో ఉండి, గడ్డం నేల మీద ఆనించి చేతులు రెండూ వెనుకకు తీసుకువెళ్ళి ఇంటర్‌లాక్ చేసి శ్వాస తీసుకుంటూ కాళ్ళు రెండూ నేలకు గట్టిగా నొక్కుతూ, ఇంటర్‌లాక్ చేసిన చేతుల్ని గట్టిగా పుష్ చేస్తూ పైకి తీసుకువెళ్లే ప్రయత్నం చేయాలి. చేతులు వేరే వాళ్లు గుంజుతూంటే ఎలాంటి అనుభూతి కల్గుతుందో అదేవిధంగా చేయడానికి ప్రయత్నించాలి. 3 లేదా 5 సాధారణ శ్వాసల తరువాత శ్వాస వదులుతూ మళ్ళీ క్రిందకు రావాలి. ఇలా 3/ 5 సార్లు రిపీట్ చేయవచ్చు. ఉపయోగాలు: వెన్నెముక బలపడటానికి, ఊపిరితిత్తులు, ఛాతీ, భుజాలు, పొట్ట భాగాలు స్ట్రెచ్ అవడానికి ఉపయోగపడుతుంది. భుజంగాసనం చేయడం వల్ల కలిగే లాభాలన్నీ సర్పాసనం చేయడం వల్ల కూడా కల్గుతాయి. - సమన్వయం: సత్యబాబు -
యోగ కళాసాధన
కోణము అంటేనే మనకు క్షేత్ర గణితము (Men-surat-ion) గుర్తుకు వస్తుంది. అనేక ఆసనాల్లో చేతులను, కాళ్లను ఏ యాంగిల్లో ఉంచాలి, ఎన్ని డిగ్రీల కోణంలో ఉంచాలి అనేది చెప్పబడుతుంది. ఎప్పుడైతే చేసే విధానంలో లైన్, ఎలైన్మెంట్ ఉండి, శరీరం-మనస్సు-ఆత్మ పూర్తి సామరస్యంతో పనిచేస్తాయో ఆ క్రియ ఒక కళగా పిలవబడుతుంది. ఒక కళకు ఉండాల్సిన అన్ని అర్హతలు యోగాకు ఉన్నందువల్ల యోగాను ఒక కళగా కూడా అభ్యసించవచ్చు. యోగా వల్ల అందం, ఆరోగ్యం రెండూ చేకూరతాయి కనుకనే ప్రపంచవ్యాప్తంగా యోగాకు విస్తృతమైన ఆదరణ లభిస్తోంది. 1. ఉత్థిత పార్శ్వ కోణాసన: రెండు కాళ్ల మధ్య 3 నుండి 5 అడుగుల దూరంతో కుడిపాదం ముందువైపునకు, ఎడమ పాదం పక్కవైపునకు, రెండు పాదాలు సమాంతర రేఖలో ఎడమకాలు వీలైనంత వరకూ స్ట్రెచ్ చేసి ఉంచాలి. తర్వాత, ఎడమ చేతిని పైకి తీసుకువెళ్లి తల ప్రక్కనే ముందుకు స్ట్రెచ్ చేస్తూ ఎడమకాలు, ఎడమ చేయి సమాంతర రేఖలో ఏటవాలుగా కుడిచేయి క్రిందకు, కుడి అరచేయి నేలమీద, కుడిపాదం ప్రక్కనే బయటివైపునకు (కుడి టిబియా నేలకు 90 డిగ్రీల కోణంలో నిలువుగా) ఉంచాలి. 3 లేదా 5 సాధారణ శ్వాసల తరువాత అదే క్రమంలో మళ్ళీ వెనుకకు సమస్థితికి రావాలి. కుడిచేయి క్రింద పెట్టలేకపోతే ఏదైనా బ్లాక్ (ఇటుక)ను ఆధారంగా ఉపయోగించవచ్చు లేదా కుడి మోచేయి కుడి మోకాలుమీద సపోర్టుగా పెట్టుకోవచ్చు. 2. పార్శ్వకోణాసన: పైన పేర్కొన్న ఆసనం నుంచి సమస్థితికి రాకుండా కుడికాలు వెనుకకు తీసుకొని కాళ్ళు రెండు కలపాలి. అలాగే శరీరాన్ని భూమికి ఏటవాలుగా 45 డిగ్రీల కోణంలో ఉంచి కుడికాలిని ముందుకు కుడిపాదం కుడిచేతికి ప్రక్కకు తీసుకువచ్చి క్రమంగా వెనుకకు సమస్థితిలోకి రావచ్చు. 3. ఉత్థిత హస్తపాదాంగుష్ట పార్శ్వకోణాసన: పై ఆసనం నుంచి వెనుకకు సమస్థితిలోకి రాకుండా కుడికాలి బ్రొటనవేలిని కుడిచేతితో పట్టుకొని కాలుని స్ట్రెచ్ చేస్తూ మోకాలు స్ట్రెయిట్‌గా చేస్తూ పైకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తూ, 3 లేదా 5 సాధారణ శ్వాసలు తీసుకుని వెనుకకు పార్శ్వ కోణాసనంలోకి, తరువాత ఉత్థిత పార్శ్వకోణాసనంలోకి వచ్చి సమస్థితిలోకి రావాలి. ఇది సీనియర్ సాధకులకు మాత్రమే సాధ్యపడుతుంది. కాలు చేతితో పట్టుకోలేకపోతే తాడు వంటి వస్తువు సాయం తీసుకోవచ్చు. యోగావగాహన: హఠయోగ 6 విధాలుగా చెప్పబడుతుంది. 1. సృష్టిక్రమ - చిన్న వయస్సు (10 నుండి 20 సం॥ఉన్నవారికి శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఎదుగుదలకు చేసే సాధన. 2. శిక్షణక్రమ - (20 నుండి 40 సం॥వయస్సు) ఆసనాలు, ప్రాణాయామం, ముద్రాబంధనాలు చేయడంలో పర్ఫెక్షన్ దిశగా చేసే సాధన. 3. రక్షణక్రమ - (40 సం॥పైన) పూర్తిగా రిలాక్సేషన్ టెక్నిక్‌ను అనుసరిస్తూ ఆరోగ్యం కాపాడుకోవడానికి చేసే సాధన. 4. ఆధ్యాత్మికక్రమ - ఆత్మ సాక్షాత్కారం స్వీయ వాస్తవికతను తెలుసుకునే దిశగా చేసే సాధన. 5. చికిత్సాక్రమ - శ రీరంలోని రుగ్మతలను తీసివేయడానికి చేసే సాధన. 6. శక్తిక్రమ - శరీరంలో అంతర్గతంగా ఉన్న శక్తిని అపారంగా పెంచుకునే దిశగా చేసే నిరంతర సాధన. యోగి, భోగి, రోగి: ఆధునిక ప్రపంచానికి తేలికగా అర్థమయ్యే విధంగా చెప్పాలంటే హఠయోగాన్ని మూడు విధాలుగా విభజింపవచ్చు. 1. యోగులు చేసే యోగా: అన్ని ఆసనాలు చాలా తేలికగా శ్రమలేకుండా, చెమటోడ్చకుండా తక్కువ సమయంలో పూర్తి చేసి, ఎక్కువ సమయాన్ని ధ్యానంలో గడిపే విధానం 2. భోగులు చేసే యోగా: రోజులో ఎక్కువ భాగం విలాసవంతంగా తిరగడానికి వారాంతపు వేడుకలు జరుపుకోవడానికి శారీరక పటుత్వం అవసరం గనుక దానికి కావలసిన యోగాను ప్రతీరోజు చెమటోడ్చి, కష్టపడి చేసే విధానం. ఈ తరహా భోగలాలస ఉన్నవారు ఐహికసుఖాల మీద నుంచి దృష్టిని అంతరంగ ప్రపంచంలోకి మళ్లించి యోగులుగా మారే ప్రయత్నం చేయకపోతే... కొంత కాలం తర్వాత తప్పనిసరిగా రోగులుగా మారవలసి వస్తుంది. 3. రోగులు చేసే యోగా : రోగాల నుంచి ఉపశమనం కొరకు చేసేటటువంటి చికిత్సాక్రమం విధానం. ఉపయోగాలు తొడలు, తుంటిభాగం, మోకాళ్లు, చీలమండ బలంగా అవుతాయి. గజ్జలు, వీపు, వెన్నెముక, నడుము, ఊపిరితిత్తుల మధ్యభాగాలు, భుజాలు సాగదీయబడతాయి. పొట్ట కండరాలు, పొట్ట దగ్గర అవయవాలకు చక్కగా మర్దన జరుగుతుంది. శ్వాసకోస వ్యవస్థ, రక్తప్రసరణ వ్యవస్థ, కండర, ఎముకల వ్యవస్థలకు చాలా మంచిది. ఎ.ఎల్.వి కుమార్ ట్రెడిషనల్ యోగా ఫౌండేషన్