రోబో అనేది ఒక స్వయం చాలక యంత్రం. మానవుని జోక్యం లేకుండా వేగవంతంగా, కచ్చితత్వంగా పనిచేయడానికి రోబోలను ఉపయోగిస్తారు. ప్రస్తుత ప్రపంచంలో వాటిని చాలా విరివిగా ఉపయోగిస్తున్నారు. అయితే మనం ప్రోగామింగ్ చేసిన మనిషి(రోబో) కాబట్టి మనం ఇచ్చే పనులను మాత్రమే చేయగలదు. అందుకు విభన్నంగా ఏవైనా ఇస్తే అది తొందరగా స్పందించలేదు. మనిషి మాదిరిగా ఉండి పనుల్లో మనకు ఉపకరిస్తుందే తప్ప మనిషిలా వ్యక్తీకరించ లేదు. మనిషిలా శ్వాసించడం, చెమటలు పట్టడం వంటివి ఉండవు.
కానీ యూఎస్ అరిజోనా స్టే యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మనిషికి ఉండే మాదిరిగా శరీర లక్షణాలు ఆ రోబోకి ఉండేలా రూపొందించారు. ఆ రోబో పేరు ఆండీ. అది ఒక దర్మల్ బొమ్మ. ఇది మనిషిలా వణకటం, వేడికి చెమటలు పట్టడం, శ్వాసించటం, నడవటం వంటివి అన్ని చేయగలదంటున్నారు శాస్త్రవేత్తలు. దీన్ని మానవ శరీరంపై వేడి ప్రభావాలను అధ్యయనం చేసేందుకు రూపొందించినట్లు అరిజోనా స్టేట్ యూనివర్సిటీ ప్రోఫెసర్ కొన్రాడ్ రికాజెవ్‌స్కీ చెప్పారు. ఇది వాస్తవ పరిస్థితులను అనుకరించగలదు. వాతావరణంలో విపరీతమైన వేడి ఉంటే మానవ శరీరం ఎలా ప్రభావితమవుతుంది అనే దానిపై పరిశోధించడం కోసం దీన్ని రూపొందించినట్లు తెలిపారు.
ఈ ఆండీ రోబో ఆరుబయట ఉపయోగించగల ప్రపంచంలోని ఏకైక థర్మల్ బొమ్మ అని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. వ్యాలీల్లో నివశించే ప్రజలు అధిక ఉష్ణోగ్రతల సమయంలో అకస్మాత్తుగా చనిపోవడం జరుగుతుంది. అలా ఎందుకు జరుగుతుందని అధ్యయనం చేయడానికి ఈ రోబో ఉపకరిస్తుందని ప్రోఫెసర్ జెన్నీ వానోస్ చెప్పారు. ఈ ఆండి రోబోని వేడి ప్రాంతాల్లో చోటు చేసుకునే మార్పలను పరీక్షించాలని భావిస్తున్నారు. విభిన్న వయసును బట్టి శరీర ఉష్ణోగ్రత లక్షణాలు అంచనా వేసి తగిన వైద్యం అందించడం సాధ్యమవుతుందని చెబుతున్నారు. ఆరోగ్యకరమైన వ్యక్తి నుంచి డయాబెటిస్ రోగి వరకు విభిన్న ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, వాటిని మనం ఈ రోబో సాయంతో లెక్కించడం సాధ్యపడుతుందంటున్నారు శాస్త్రవేత్తలు.
(చదవండి: యూఎస్‌కి 17 ఏళ్ల పాటు చుక్కలు చూపించిన గణిత మేధావి మృతి)
Comments
Please login to add a commentAdd a comment