
భారత సంతతికి చెందిన నాసా వోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams), తన తోటి వ్యోమగామి బుచ్ విల్మోర్ రోదసి నుంచి భూమిమీద సురక్షితంగా అడుగు పెట్టారు. తొమ్మిది నెలల తీవ్ర ఉత్కంఠ తరువాత వీరు భూమిపై అడుగు పెట్టిన క్షణాలను యావత్ ప్రపంచం సెలబ్రేట్ చేసుకుంది. అయితే తాజాగా ఒక అమెరికన్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త నీల్ డిగ్రాస్సే టైసన్ (Neil deGrasse Tyson) చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అసలు ఆయన అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారు? దీని వెనుక మర్మమేమిటి? తెలుసు కుందాం.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఎనిమిది రోజుల మిషన్‌మీద వెళ్లి తొమ్మినెలలపాటు చిక్కుకున్న సునీతా విలియమ్స్ పట్ల తనకేమీ సానుభూతి లేదంటూ టైసన్ వ్యాఖ్యానించారు. అయితే వారిని భూమి మీదికి తీసుకురావడంలో ఆలస్యం గురించి,వారి భద్రత కోసం తాను ఆందోళన చెందానని అన్నారు. నేషనల్ మీడియాతో మాట్లాడిన ఆయన జీరో గ్రావిటీనుంచి భూమి గురుత్వాకర్షణకనుగుణంగా సర్దుబాటు చేసుకునే సమయమని సునీత, బుచ్ విల్మోర్ త్వరగా కోలుకోవాల్సి ఉంటుందన్నారు. అలాగే ఇపుడు వాళ్లకి గ్లాసు ఇస్తే పట్టుకోలే రు (ఎందుకంటే కండరాలు బలహీనంగా ఉంటాయి) కాబట్టి, తొలుత తేలికపాటి, ప్లాస్టిక్ కప్పులు వాడాలని సూచించారు.
అయితే వారి భద్రత గురించి లేదా వారు ఇంటికి తిరిగి రావడం గురించి తాను ఎప్పుడూ ఆందోళన చెందలేదని వివరించారు.ఎందుకంటే ప్రొఫెషనల్ వ్యోమగాములు, వారు శారీరకంగా ఆరోగ్యంగా ఉండటం మాత్రమే కాదు, మానసికంగా దృఢంగా ఉంటారు అంటూ పరోక్షంగా వారిపై సానుకూల వ్యాఖ్యలు చేశారు. అందుకే వారు ఎంపికయ్యారు. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు, ఎనిమిది రోజులైనా, తొమ్మిది నెలలైనా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. అందువల్లనే తనకు వారి పట్ల వ్యక్తిగతంగా సానుభూతి లేదని ప్రకటించారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో వ్యాయామానికి చాలా మార్గాలుంటాయి కాబట్టి వారి కండరాలు, చలనంపై కూడా ఆందోళన అవసరం లేదన్నారు. జీరో గ్రావిటీలో పైకి, కిందికీ తేలుతూ ఉంటారు. ఇపుడు దిశానిర్దేశం చేసే సామర్థ్యం దెబ్బతింటుంది అదే తేడా అన్నారు టైసన్.
చదవండి: Sunita Williams Earth Return: అంతరిక్షంలో పీరియడ్స్ వస్తే? ఏలా మేనేజ్ చేస్తారు?
అంతరిక్షంలోకి వెళ్ళలేదు... కానీ వ్యోమగాములతో మాట్లాడాను, నా స్నేహితులు రోదసిలో చాలా సమయం గడిపారు. భూమికి తిరిగి వచ్చిన తరువాత సాధారణంగా ఒక వారంలోపు కోలుకుంటామని వారు చెప్పారన్నారు టైసన్. అంతేకాదు సునీత, విల్మోర్ మానసిక స్థితి ప్రభావిత మవుతుందనే వాదనను కూడా ఆయన తోసిపుచ్చారు. శారీరకంగా, మానసికంగా బలమైన వారిని మాత్రమే వ్యోమగాములుగా నాసా ఎంచుకుంటుందని గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment