కేప్ కనావెరల్: భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర మరోసారి ఆగింది. బోయింగ్‌కు చెందిన స్టార్‌లైనర్ క్యాప్సూల్‌లో రోదసీలోకి వ్యోమగాములు వెళ్లేందుకు ఉద్దేశించిన ప్రయోగం శనివారం చివరినిమిషంలో వాయిదాపడింది.
అమెరికాలోని కేప్ కనావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి నింగిలోకి దూసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్న అట్లాస్ 5 రాకెట్ కౌంట్‌డౌన్‌ను ఇంకా మూడు నిమిషాల 50 సెకన్లు ఉందనగా కంప్యూటర్ ఆపేసింది. ప్రయోగం ఆపేయడానికి కారణాలు ఇంకా వెల్లడికాలేదు.
మరో వ్యోమగామి బుచ్ విల్మోర్‌తో కలిసి సునీత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)కు వెళ్లాల్సి ఉంది. ఆదివారంలోగా మరోసారి ప్రయోగానికి ప్రయతి్నస్తామని యునైటెడ్ లాంచ్ అలయన్స్ ఇంజనీర్ డిలియన్ రైస్ చెప్పారు. ప్రయోగం ఆగిపోవడంతో క్యాప్సూల్‌లోని సునీత, విల్మోర్‌లను టెక్నీíÙయన్లు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment